అబద్దం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అబద్దం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, అక్టోబర్ 2023, సోమవారం

అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు…(పూర్తి నవల)


                                                                        అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు                                                                                                                                                         (పూర్తి నవల) 

'అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు ' అనే ఈ నవల ఒక ఆధ్యాత్మిక క్రైమ్ థ్రిల్లర్. మామూలుగా స్వామీజీలలో రెండు రకాలు ఉన్నారు. నిజంగానే ఆధ్యాత్మికం గురించి తెలిసిన స్వామీజీలు ఒక రకం. ఆధ్యాత్మికం అనే పేరుతో సగం తెలుసుకుని, సగం తెలియక ఏదో ఒకటి చెప్పుకుంటూ సాధారణ ప్రజలను మోసం చేసే దొంగ స్వామీజీలు ఇంకొక రకం.

ఈ నవలలోనూ ఒక స్వామీజీ వస్తున్నారు. ఒక కోణం నుండి చూస్తే ఆయన నిజమైన స్వామీజీ. ఇంకొక కోణం నుండి చూస్తే దొంగ స్వామీజీ.

నిజంగా ఆయన ఏ రకానికి చెందిన స్వామీజీ అనేది కనిపెట్టటానికి...నవలను పూర్తిగా చదవండి. ఆధ్యాత్మికంలో క్రైమ్ కలిస్తే అది ఎలాంటి విషమ పరిస్థితులను ప్రేరేపిస్తుంది అనేది ఈ నవలను చదవటం ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ పరిచయ శీర్షికలో నేను చెప్పిందంతా,

నిజం...నిజం తప్ప ఇంకేమీ లేదు...!

ఈ నవలను ఒకేసారి ఆన్ లైనులో చదవాలనుకుంటే ఈ క్రింది లింకుపై నొక్కండి: 

అబద్దం...అబద్దం తప్ప ఇంకేమీ లేదు…(పూర్తి నవల) @ కథాకాలక్షేపం-2

ఈ నవలను ఒకేసారి చదవలేకపోతే  ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి PDF గా డౌన్లోడ్ చేసుకుని ఖాలీ ఉన్నప్పుడు చదువుకోండి:

https://drive.google.com/file/d/1yr-uTwKH6APFSrcM5qHKY7jyCu72ByCR/view?usp=drive_link

***************************************************************************************************

27, జూన్ 2023, మంగళవారం

అబద్దమే నిజం!...(కథ)

 

                                                                                    అబద్దమే నిజం!                                                                                                                                                                                 (కథ)

ప్రేమించడానికి అబద్దం చెప్పు, కానీ ప్రేమించానని అబద్దం చెప్పకు. పోయేది నమ్మకం కాదు ఒక జీవితం...ఇది ఎంత నిజమో అంగవైకల్యంతో పుట్టిన బిడ్డను కాపాడుకోవటానికీ, బిడ్డ కడుపుకు ఇంత ముద్ద పెట్టటానికి లలితమ్మ నిజాన్ని దాచింది కానీ అబద్దం చెప్పలేదు. భగవంతుడికి తెలియదా? అన్ని రోజులు లలితమ్మను శిక్షించని భగవంతుడు, హఠాత్తుగా లలితమ్మను శిక్చిస్తాడా?

మానవులు మూఢ నమ్మకాలను ఇంకా పాటిస్తున్నారని తెలియజేయటానికి కథను రాయించాడు. లలితమ్మ చెప్పిన అబద్దం వలన తన పుణ్యాలన్నీ పాపాలు అయినాయని లలితమ్మను పనిలోంచి తీసేసి ఆమెకు దొరికిన సెక్యూరిటీని పోగొట్టింది కల్యాణీ. అందువలనే భగవంతుడు పుణ్యకార్యాలను కల్యాణీ కొడుకు ద్వారా చేయించాడు.

ఇదంతా ఎలా జరిగిందో కథను చదివి తెలుసుకోండి.

**************************************************************************************************

గోరింటాకు చెట్టు వాకిలిలో పూతపూసి ఆడుతున్నది. దాని మెడిషనల్ వాసన నాకు చాలా చాలా నచ్చుతుంది. నేను ఎవరనేది చెప్పనేలేదే. నా పేరు రత్నం. నా తల్లి కల్యాణికి ఒకడే కొడుకును. హైదరాబాద్ సిటీలోని ఒక కాలేజీలో చివరి  సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాను. చదువు ముగిసిన తరువాత, నన్ను అమెరికా పంపించి ఎం.ఎస్. చదివించాలని నా తల్లి-తండ్రులకు ఆశ.

ఈసారి గ్రామంలోని మా ఇంటికి నేను సెలవులకు వచ్చిన సమయం, మా ఇంట్లో పని చేసే లలితమ్మ ఎప్పుడూలాగా వాకిలిలో ఉన్న చెట్టు నుండి గోరింటాకు ఆకులను కోసుకు వచ్చి, శుభ్రం చేసి, రుబ్బుతోంది.

నా తల్లి ఒక గోరింటాకు పిచ్చిది. వారానికి ఒకరోజు గోరింటాకు రుబ్బి చేతుల్లో, కాళ్ళలో పూసుకోవాలి. శరీర ఉష్ణం తగ్గుతుందట. గోరింటాకు ఆకులను రుబ్బి, దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించి తీసి దాన్ని ఊరబెట్టి, తలకు రాసుకుని స్నానం చేస్తే చాలా మంచిదట.

ఆరొగ్యానికి మంచిది రత్నం. తలలొ ఒత్తుగా జుట్టు పెరుగుతుంది. తరువాత తలజుట్టు నెరవనే నెరవదు. యుక్త వయసు నెరవటం కూడా ఉండదు. నువ్వూ పెట్టుకో అంటుంది అమ్మ.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అబద్దమే నిజం!...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************