30, సెప్టెంబర్ 2020, బుధవారం

ఏడు అసాధారణమైన శక్తిగల రాళ్ళ నిర్మాణం...(మిస్టరీ)


                                                      ఏడు అసాధారణమైన శక్తిగల రాళ్ళ నిర్మాణం                                                                                                                                                        (మిస్టరీ)

అధిరోహకుడు ...సైబీరియా యొక్క రహస్యమైన 'సెవెన్ జెయింట్స్'  రాక్  నిర్మాణాన్ని చేరుకున్నాడు. 

రష్యా యొక్క కోమి రిపబ్లిక్ యొక్క మారుమూల ప్రాంతంలో ఉనా ఉత్తర ఉరల్ పర్వతాలలోదాగి ఉంది మర్మమైన మన్పుపునర్ రాక్ నిర్మాణాలు. ఉత్తర సైబీరియన్ ప్రకృతి దృశ్యానికి 200 అడుగుల ఎత్తులో ఉన్నాయి.   ఏకశిలలు 30 నుండి 42 మీటర్ల ఎత్తు ఉంటాయి. మంచు మరియు శీతల గాలుల యొక్క వాతావరణ ప్రభావాలు ఈ ఏడు భారీ రాతి స్తంభాలలో ఎటువంటి మార్పూ తేలేకపోయినై. ఆంత ఎత్తులో, అంత మంచులో, అంత శీతల వాతావరణంలో ఆ రాళ్ళ నిర్మాణం ఎలా ఏర్పడింది అనేది ఎవరికీ తెలియదు. రష్యాలోని ఏడు అద్భుతాలలో ఇవి ఒకటిగా పరిగణించబడతాయి.

"సెవెన్ జెయింట్స్" లేదా "సెవెన్ స్ట్రాంగ్ మెన్" అని పిలువబడే స్తంభాలు కూడా పురాణానికి సంబంధించినవి. రష్యన్ జియోగ్రాఫికల్ సొసైటీ ప్రకారం, రాతి స్తంభాలు ఒకప్పుడు పర్వతాల గుండా సైబీరియాకు నడుస్తూ, మాన్సీ ప్రజలను వెంబడిస్తూ సమోయెడ్స్ దిగ్గజాల పరివారంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: భవిష్యత్ లో అనారోగ్యానికి స్టెమ్ సెల్స్ తో చెక్(ఆసక్తి)

స్థానిక పురాణాల ప్రకారం అవి ఏడు సమోయిడ్ దిగ్గజాల అవశేషాలు. వారు 'వొగల్ స్కీ' ప్రజలను నిర్మూలించడానికి పర్వత శ్రేణుల మీదుగా యురల్స్ గుండా బలవంతంగా నడిచారు. ఏడుగురిలో అతి పెద్ద వాడు షమన్. అతను, తన సహచరులు తమ వేట వైపు కనికరం లేకుండా కదలడానికి డ్రమ్ కొట్టాడు. అప్పుడు, అతను పవిత్ర 'వొగల్ స్కీ' పర్వతాలవైపు చూశాడు. అతను తన డ్రమ్ ను విడిచిపెట్టాడు. వెంటనే మొత్తం ఏడు దిగ్గజాలు అక్కడే స్తంభించిపోయాయి రాయిగా మారిపోయారు.

అప్పటి నుండి, ఏడు నిర్మాణాలు ప్రాంతంలో నిలబడి ఉన్నాయి, ఒకటి మాత్రం ఆరు రాళ్ళనూ చూస్తున్నట్టు నిలబడున్నది.

నిస్సందేహంగా, అవి చాలా దూరంలో, ఆర్కిటిక్ సర్కిల్కు దిగువన మనుష్యులు వెళ్ళలేని ఒక రిమోట్ ప్రాంతంలో ఉండటం వలన, శిలలు దాదాపు-ఆధ్యాత్మిక శిల నిర్మాణాల రూపాలలో ఉండటం వలన  ఇతిహాసాలకు ఆజ్యం పోసింది. సెవెన్ జెయింట్స్ఎదుట నిలబడటానికి,సందర్శకులు హెలికాప్టర్ ద్వారా గానీ లేక  జనావాసాలు వెళ్ళలేని భూభాగాల ద్వారా మైళ్ళు (సమీప రహదారి 62 మైళ్ల దూరంలో ఉంది) ప్రయాణించాలి. హైకింగ్ విలువైనది కావచ్చు. అలా వెళ్ళి శిలలను సందర్శించినప్పుడు భయంలేని తృప్తికరమైన అనుభూతి కలుగుతోందని అన్వేషకులు చెబుతారు.

2013 లో, జర్మన్ అధిరోహకుడు మరియు అన్వేషకుడు స్టీఫన్ గ్లోవాక్జ్ సెవెన్ జెయింట్స్ ను చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి అయినప్పుడు చివరికి అతను పురాణాన్ని జయించి ఒక పురాణాన్ని తీసుకువచ్చారు . రెడ్ బుల్ 7 జెయింట్స్ ప్రాజెక్టులో భాగంగా, గ్లోక్జ్ హైకింగ్ మూలంగా ఏడు రోజులులో రాళ్ళు ఏర్పడిన ప్రదేశానికి చేరుకున్నాడు  మరియు సెవెన్ జెయింట్స్ లో అతిపెద్ద "ఎల్డర్ బ్రదర్" ను చేరుకోవడానికి మరో రెండు రోజులు పట్టింది.  

"ఇది చాలా ప్రత్యేకమైన ప్రదేశం, దీనిని రష్యా అద్భుతాలలో ఒకటిగా పిలవటం కరక్టే" అని గ్లోవాక్జ్ అన్నారు. "నేను ఇంతకు ముందు జెయింట్స్ వంటి దేనినీ చూడలేదు.శీతాకాలంలో కఠినమైన వాతావరణ స్వభావంతో అందంగా ఉన్నప్పుడు మర్మమైన శిలలను చేరుకోవడం గురించి ఆలోచించడం నేను ఆపుకోలేకపోతున్నాను." 

 ప్రదేశాన్ని చేరుకోవటం ఇప్పటికీ కష్టమే.

Image Credits: To those who took the original photos. 

ఇది కూడా చదవండి: శపించబడ్డ గ్రామం(మిస్టరీ)

************************************************************************************************






28, సెప్టెంబర్ 2020, సోమవారం

UFO లు ధ్రువీకరించబడ్డాయి!...(ఆసక్తి)


                                                                               UFO లు ద్రువీకరించబడ్డాయి!                                                                                                                                                                    (ఆసక్తి)

 UFO లు ధృవీకరించబడ్డాయి! ‘గుర్తించబడని వైమానిక దృగ్విషయంచూపించే మూడు పాత యుఎస్ మిలిటరీ వీడియోలు నిజమైనవే...ఆమెరికా నేవీ తెలిపింది.

డిసెంబర్ 2017 మరియు మార్చి 2018 లో, లీకైన మూడు UFO ఫుటేజ్ లు ఆన్లైన్లో ప్రదర్శించబడ్డాయి. యుఎస్ నేవీ, మొదటిసారిగా, వీడియోల యొక్క విశ్వసనీయతను ధ్రువీకరించింది. మరియు ఫుటేజ్ను ఎప్పుడూ బహిరంగపరచరాదని పట్టుబట్టింది. యుఎస్ నేవీ పైలట్లు హైపర్సోనిక్ వేగంతో కదిలి వెడుతున్న కొన్ని గుర్తుతెలియని ఎగిరే వస్తువులను చేస్ చేస్తూ వెనుకంజలో ఉన్నట్లు చూపించారు. భూమికి కొన్నివేల అడుగుల ఎత్తులో ఎగురుతూ కనిపించని ఎగిరే వస్తువులకు ఇంజన్లు లేదా ప్రొపెల్లెర్ ఉన్న సంకేతాలు లేవు. మర్మమైన ఎగిరే వస్తువులు ఏమిటో పైలట్లకు తెలియదు. వివిధ మీడియా సంస్థలు పంచుకుని ఆన్లైన్లో వీడియోలను లీక్ చేసినైలీకైన మూడు వీడియోలలోని ఎగిరే వస్తువులు "గుర్తించబడని వైమానిక దృగ్విషయం" అని యుఎస్ మిలటరీ నేవీ అధికారులు ధ్రువీకరించారు.

ఫుటేజ్ 2017 మరియు 2018 లో సంచలనం సృష్టించింది. న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్ మరియు ఇతర చాలా వార్తా పత్రికలు తమ వార్తాపత్రికలలో మొదటి పేజీలో హెడ్ లైన్స్ లో ప్రచురించారు. వీడియోలను 'ది స్టార్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్' అనే ఒక ప్రైవేట్ పరిశోధన మరియూ మీడియో సంస్థ పరిశోధనకు తీసుకుని వీడియోలను విడుదల చేసినట్లు ప్రచురించినై. ఒక వీడియోలో, ఇద్దరు నేవీ పైలట్లు 2015 లో తూర్పు తీరంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువును ట్రాక్ చేశారు. మరొకదానిలో, "టిక్ టాక్"(ఎందుకంటే మిఠాయి ఆకారంలో ఉన్నందున) అని పిలువబడే ఒక వస్తువు,  2004 లో కాలిఫోర్నియా తీరంలో, కేవలం సెకన్ల వ్యవధిలో 60,000 అడుగుల నుండి 50 అడుగుల వరకు జారిపోతున్నట్లు గుర్తించబడింది. మళ్ళీ, 2014లో జరిగిన ఒక  సంఘటనలో, యుఎస్ నేవీ సూపర్ హార్నెట్ పైలట్ వర్జీనియా బీచ్ సమీపంలో అధికారిక మిషన్ సమయంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువును దాదాపుగా ఢీ కొట్టాడు.

ఇది కూడా చదవండి: ఆత్మలతో మాట్లాడించే బోర్దు(మిస్టరీ)

అధికారిక ప్రకటనలో, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ ప్రతినిధి జోసెఫ్ గ్రాడిషర్ దృశ్యాలను "గుర్తించబడని వైమానిక దృగ్విషయం" గా నేవీ అధికారులు ధ్రువీకరిస్తున్నట్టు ప్రకటించారు. దీని అర్థం వీడియోలు నిజమైనవే. మరియు 2004, 2015 లో పరిమితం చేయబడిన సైనిక శిక్షణ గగనతలాలలో రాకూడని ప్రదేశాలలో కనుగొనబడిన వస్తువులు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆ ఎగిరే వస్తువులు ఇప్పటికీ వారికి తెలిసిన ఏ రకమైన విమానంగా గుర్తించబడలేదు.

ధృవీకరణతో అన్యులు, అన్యగ్రహాలు, ఎగిరే పళ్ళాలు ఉన్నాయనడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.

UFO మరియు ఎలియెన్స్ లు రియల్?

నాసా మాజీ ఆస్ట్రొనాట్ బజ్ ఆల్డ్రిన్ ఏలియన్ ఎన్కౌంటర్లపై లై డిటెక్టర్ పరీక్షలు పాస్ అయ్యారు అని ఒక నివేదిక తెలుపుతోంది.

గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా? పాత ప్రశ్నకు ఎప్పుడూ నమ్మదగిన సమాధానం దొరకలేదు. వివిధ యుఎఫ్ వీక్షణలు భూలోకేతర శక్తి  గురించి మనకు ఆశ్చర్యం కలిగించినప్పటికీ, ప్రభుత్వమూ ఇతర అధికారిక సంస్థలూ దీనికి అంగీకరించలేదు. వ్యోమగాములచే గ్రహాంతర ఎన్కౌంటర్ల గురించి చాలా వాదనలు ఉన్నప్పటికీ, ఇంతవరకు బలమైన ఆధారాలు రాలేదు.

                                                                                    బజ్ ఆల్డ్రిన్

ఏది ఏమయినప్పటికీ, UK టాబ్లాయిడ్ డైలీ స్టార్ లో ఇటీవల వచ్చిన ఒక నివేదిక, బజ్ ఆల్డ్రిన్తో సహా నలుగురు నాసా వ్యోమగాములు తమ అపోలో 11 మిషన్ల సమయంలో గ్రహాంతర ఎన్కౌంటర్లు జరిగాయని పేర్కొన్నట్లు శాస్త్రీయంగా నిరూపించబడింది. సోషల్ మీడియాలో విస్తృతంగా భాగస్వామ్యం చేయబడుతున్న నివేదికలో, బజ్ ఆల్డ్రిన్ మరియు ఇతరులు "గ్రహాంతర" వాదనలలో అబద్ధం గుర్తించే పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారని పేర్కొంది.

"అంతరిక్షంలో ఎల్-ఆకారంలో గమనించదగినంత దగ్గరగా ఏదో ఉంది" అని ఇంతకుముందు ఆల్డ్రిన్ తెలిపినట్లు పత్రిక తెలిపింది.

ఇది కూడా చదవండి: మంత్రాల బావి(మిస్టరీ)

"వారు గ్రహాంతర ఎన్కౌంటర్లను చూసిన వాదనలపై నిజం గుర్తించే పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారు" అని నివేదిక పేర్కొంది. "వింత అంతరిక్ష వీక్షణలు" గురించి వ్యోమగాముల చెప్పింది "సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం" ఉపయోగించి పరిశీలించామని మరియు నిపుణులు వారి వాదనలను "పూర్తిగా ఒప్పుకున్నారు" అని వివరించింది.

ఒహియోలోని అల్బానీలోని ది ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ బయోఅకౌస్టిక్ బయాలజీ నివేదిక ప్రకారం:

పరీక్షల సమయంలో "వ్యోమగాముల వాయిస్ నమూనాలను సంక్లిష్ట కంప్యూటర్ తో  విశ్లేషించారుప్రస్తుత లై డిటెక్టర్ పరీక్షల కంటే సాంకేతికంగా ఎక్కువగా నమ్మదగినదిగా దీనిని పేర్కొన్నారుఇది సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల గొంతులను అర్థం చేసుకోవడానికి స్కాన్ చేస్తుంది. కొత్త వ్యవస్థ ప్రస్తుతం ఎఫ్బిఐ మరియు పోలీసులు ఉపయోగిస్తున్న దాన్ని భర్తీ చేయగలదు

ధృవీకరణతో అన్యులు, అన్యగ్రహాలు, ఎగిరే పళ్ళాలు ఉన్నాయనడానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చాలామంది నమ్ముతున్నారు.

 Image credits: To those who took the original photos

************************************************************************************************