30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

హీరో...(సీరియల్)...PART-1

 

                                                                                         హీరో...(సీరియల్)                                                                                                                                                                              PART-1

కథా కాలక్షేపం టీమ్ రాసిన రచనలలో వంద శాతం పరిపూర్ణ సృష్టి ఇది అని చెప్పగలను. ఒకేసారి నవలను చదివే వాళ్ళూ -- కొంచం సుతిమెత్తని మనసు కలిగినవారుగా ఉంటే -- ఖచ్చితంగా నవల ముగింపులో కన్నీరు కారుస్తారు.

తేట తెల్ల నీరులాగా రచన ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం. ఇందులో అది ఉంటుంది. సినిమా రంగం గురించి నవలలో చెప్పబడుతున్నందున రంగానికి చెందిన జిగినా పనులు ఇందులో కొంచం చేర్చారు.

నాకు ఎప్పుడూ చురుకుదనం చాలా ముఖ్యం. దాంతో పాటూ ఆలొచింప చేయడం ఎక్కువ ఇష్టమైన విషయం. నవలలో స్వామీజీ పాత్ర ఒకటి, ఆలొచనను ఎక్కువ ప్రేరేపిస్తుంది.

ఇదొక కుటుంబ కావ్యం...ప్రేమ కథ...కొంచం సస్పెన్స్.

మూడు కలయికతో ఇది రాసి ముగించిన పరిస్థితిలో నిజమైన హీరోఅని పేరు పెట్టారు. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నవలలోకి తల దూర్చండి...మా హీరోమిమ్మల్ని కరిగించి ఏడిపించటానికి తయారుగా ఉన్నాడు.

****************************************************************************************************

                                                                                     PART-1

మనిషిని చూసినప్పుడు ఒక బిచ్చగాడి లాగానే అనిపిస్తోంది. కానీ, బిచ్చగాడి దగ్గర ఉండవలసిన చెడువాసనకు బదులుగా అతని శరీరం నుండి గంధము, పన్నీరూ కలిసినట్లుగా ఒక సువాసన వీస్తోంది.

అశ్విన్ ను విషయం ఆశ్చర్యపరిచింది. అతను చూస్తున్నప్పుడే పెద్దాయన ఒకరు కారులో వచ్చి దిగి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన కాళ్ళమీద పడ్డాడు.

ఆయనో నిర్లక్ష్యంగా మొహం తిప్పుకున్నారు.

నువ్వు బాగుపడవురా...కొంచం కూడా బాగుపడవు... అని కూడా తిట్టారు. అదివిని పెద్దాయన మొహంలో ఒకటే సంతోషం.

అలా ఆయన తిడితే అది ఆశీర్వాదమేనట!

మంచి ఉత్సాహమైన మనసుతో ఉన్నాడు అశ్విన్. రోజు అతనికి స్క్రీన్ పరీక్ష. సినిమా డైరెక్టర్ విశ్వనాద్ గారిలాగా ఒక డైరెక్టర్ అతన్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయబోతారు. ఆయన తీయబోయే సినిమాకు హీరో సెలెక్షన్ కోసం ఎంతోమందిని చూసారు. ఒకరు కూడా నచ్చలేదు. చివరగా సెలెక్ట్ అయ్యింది అశ్విన్ అనే ఈ అశ్విన్ కుమార్.

అశ్విన్ కు పెద్ద ప్లస్ పాయింట్ అతని శరీరమే. ఒక రోజుకు మూడుసార్లు స్నానం, తరువాత వారానికి రెండు రోజులు నూనె రాసుకుని తల స్నానం. ఇది చాలదని రోజూ జాగింగ్, జిం లో వ్యాయామం అంటూ రెగులర్ గా వెళుతూ శరీరాన్ని ట్రిమ్ముగా పెట్టుకున్నాడు.

మామూలు జలుబుకు కూడా వెంటనే ఒక స్పేషలిస్ట్ దగ్గరకు వెళ్ళిపోతాడు. శరీర ఆరొగ్యం అంటే అంత పిచ్చి. కాలేజీ చదువుకునే రోజుల్లోనే అతను ఆరొగ్యంపై పెట్టుకున్న ప్రేమ కాలేజీ లోనే అతన్ని చాలా ఫేమస్ చేసింది. మామూలు ఎండను కూడా ఎప్పుడూ శరీరానికి తగలనివ్వడు. కొంతమంది మహిళా టీచర్లలాగా ఎప్పుడూ గొడుగు వేసుకునే బయటకు వెళతాడు. వర్షానికి కూడా ఇదే తంతు. చిన్న వాన చినుకులతో తడిసినా జ్వరం వస్తుందేమోనన్న భయం. అన్నిటికీ మించి అతని ప్రకాశవంతమైన ముఖ అందం. 

మొత్తానికి అతని శరీరమే అతనికి ప్రపంచం.

దానికి బహుమతిగానే హీరోఛాన్స్ వచ్చింది. అతని శరీర అందాలు చూసిన మాత్రానికే నువ్వే హీరోఅని చెప్పాసారు డైరెక్టర్. చెప్పిన వెంటనే, ఐదు లక్షలు జీతం మాట్లాడి, యాభైవేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 

అశ్విన్ కి ఏం చేయాలో తెలియలేదు. మొదటి పనిగా కనదుర్గ గుడికి వెళ్ళి దన్నం పెట్టుకుని వచ్చాడు. తరువాత మంగళగిరి పానకాల స్వామి, తరువాత లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి గుడి అంటూ సన్నిది, సన్నిదిగా ఎక్కి దిగుతున్నాడు. అతను హీరోఅయిన విషయం తెలుసుకుని పరిగెత్తుకు  వచ్చింది సితారా అనే సీతా రామలక్ష్మి. అందరూ ఆమెను సితారా అనే పిలుస్తారు. సితారా మొదటి పనిగా అన్ని దేవుళ్ల ప్రసాద విభూతిని అతని నుదిటి మీద పెట్టి ముగించింది. దగ్గర దగ్గర దాంట్లోనే అశ్విన్ సగం స్వామీజీ అయిపోయాడు. 

అలాగే అతనికి దిష్టితీసిన సితారా నా అశ్విన్ ఇక ఒక హీరో’...” అన్నది నవ్వుతూ.

ఇక కాదు...నేను ఎప్పుడూ హీరోనే... అన్నాడు అశ్విన్.

అవును. పెద్ద హీరోఈయన...ఏది నాతోకలిసి ఒక కిలోమీటర్ ఎండలో నడిచి రండి చూద్దాం

ఎందుకూ...అవసరమే లేకుండా శరీరాన్ని నల్ల బరచుకోవాలి సితారా?”

ఒక కిలోమిటర్ నడిచినంత మాత్రానా నల్లబడి పోరు సార్...

నన్ను వదిలేయమ్మా తల్లీ...నేను చూసి చూసి నా శరీరాన్ని ఇలా ఉంచుకోవటం వలనే డైరెక్టర్ నన్ను హీరోగా చూసారు. ఇది నువ్వు జ్ఞాపకముంచుకో... అన్న అతను హారన్ మోత విని వాకిటివైపు చూసాడు.

సినిమా కంపనీ కారు వచ్చింది.

కారు వచ్చేసింది. నేను బయలుదేరతాను -- అంటూ నడిచినతను...తిన్నగా తల్లి వరలక్ష్మి, తండ్రి రఘుపతి కాళ్ళమీద పడి ఆశీర్వాదించమని అడిగాడు. వాళ్ళూ ఆశీర్వదించి పంపారు. స్టయిల్ గా వెళ్ళి కారులో కూర్చోగానే...కారు బయలుదేరింది. సితారా టాటాచూపించి సాగనంపి లోపలకు వచ్చింది.

అత్తయ్యా...మావయ్యా... అంటూనే వరలక్ష్మి, రఘుపతి దగ్గరకు చేరుకుంది.

సితారా...ఒక మంచి కాఫీ వేసి తీసుకొచ్చి ఇవ్వవా... అని చెప్పి రోజు న్యూస్ పేపర్ను చేతిలోకి తీసుకున్నాడు రఘుపతి.  

వరలక్ష్మి భర్తను కోపంగా చూసింది.

చాలు వరలక్ష్మీ...అలా కోపంగా చూడకు! తరువాత కంటిపాప బయటకు పడిపోయి ఆపరేషన్చేసేంతవరకూ వెళ్ళిపోతుంది. సితారా ఎప్పుడూ సూపర్ గా కాఫీ కలుపుతుంది. నీలాగా కాఫీలో నీళ్ళుపోయదు అంటూ భార్యను ఎగతాలి చేసాడు.

వరలక్ష్మీ దానికోసం కోపగించుకోలేదు.

ఆమెకు తెలుసు -- ఆయన సరదాగా మాట్లాడుతున్నారన్నది. సితారా కూడా ఒక విధమైన గర్వంతో అత్తయ్య, మావయ్యలకు కాఫీ కలిపి తీసుకు వచ్చింది.

ఏం సితారా... రోజు కాలేజీ లేదా?”

స్టడీ హాలిడేస్ అత్తయ్యా!

అంటే...ఎక్కువ చదువుకునే పని ఉంటుందని చెప్పు...

అవును అత్తయ్యా...బావకు కంగ్రాట్స్ చెప్పి వస్తానని నాన్న దగ్గర చెప్పి పరిగెత్తుకుని వచ్చాను

కంగ్రాట్స్ చెప్పటం అటుంచు. రేపు నీ మెడలో తాళి కట్టబోయే అతను ఏదో పెద్ద సినిమా చాన్స్అని వెళ్ళిపోయాడు. అలాగే సినిమా వైపునే వెళ్ళి, ఎవరైనా నటి వెనుక వెళ్ళిపోతే ఏం చేస్తావు

వరలక్ష్మీ సితారా మనసు యొక్క లోతు చూసేటట్టు అలాంటి ఒక ప్రశ్నను అడగటమే ఆలస్యం, సితారా మొహం...ఎండకు వాడిపోయిన అరిటాకులాగా అయిపోయింది.

న్యూస్ పేపర్ చదువుతూనే రఘుపతి భార్య మాటలు గమనించాడు.

వరలక్ష్మీ...దాన్ని ఎందుకలా ఏడిపిస్తావు? నీ కొడుకు మొదట స్క్రీన్ టెస్ట్పాసయ్యి -- సినిమాలో నటించి, ముగించి, సినిమా రిలీజ్ అవనీ. తరువాత వాడ్ని ప్రజలు నటుడిగా ఒకేఅంటారా అనేది ఒక ఘట్టం ఉన్నది. ఇంతలోపే వాడు హీరోఅయిపోయినట్టు కలలు కనకు...

ఏమిటి మీరు...ఇంత సాధారణంగా చెప్పేసారు! వాడి జాతకం ప్రకారం వాడికి ఇప్పుడు శుక్రదశ ప్రారంభం. అందులోనూ మరో ఇరవై సంవత్సరాలకి మంచి దశ మొదలుపెట్టగానే, సినిమా చాన్స్ రావటమూ కరెక్టుగా ఉంది చూడండి. సినిమా కూడా శుక్రదశకు చెందిందే కదా! నా కొడుకు ఖచ్చితంగా గెలుస్తాడు. మీరు కావాలంటే చూడండి... అని తన అభిప్రాయంతో ఉచ్చస్థితికి వెళ్ళింది వరలక్ష్మి.

చూద్దాం,చూద్దాం...నీ కొడుకు సూపర్ స్టారుగా వస్తాడా లేక నోట్లో వేలేసుకున్న స్టార్ గా వస్తాడా రఘుపతి కొడుకు మీద ఎందుకో నమ్మకం లేనట్లే మాట్లాడాడు.

ఏంటి మావయ్యా...ఆయన విజయం సాధిస్తారని మీకు అనిపించటం లేదా...?” అని సితారా అత్తయ్యకు మద్దత్తు ఇస్తూ ముందుకు వచ్చింది.

సితారా...అందరూ మొదట పాజిటివ్ గా తింక్చేసి, చివరకు నెగటివ్కు వస్తారు. నేను అలా కాదు. నాకు ఏదైనా మొదట నెగటివే

అందులోనూ సినిమా రంగం గురించి నేను విన్నది నీకు చెబుతాను విను...అది ఐదుతలల నాగుపాము లాంటింది. దానిపైన క్రిష్ణుడిగా ఉండగలిగితేనే దాన్ని ఆడించగలం. లేకపోతే పడేస్తుంది. నీ వరకు నువ్వు గెలిచిన వాళ్ళను మాత్రమే చూస్తున్నావు...గెలవని కొన్ని వందల మందిని నేను చూసాను. గుంపులో సరదాగా ప్రజలలో ఒకడిగా ఉండాలనుకుంటే దానికొక దారుంది. అందులోకి వెళ్ళి పొరపాటున నిలబడితే...నువ్వు చచ్చేంత వరకు గుంపులోనే నిలబడి నాశనం అయిపోవలసిందే. నిన్ను పొగడి పైకి తీసుకు రారు. అదేలాగా నీ మొదటి సినిమా అవుట్అయిందనుకో...జీవితమూ అవుట్’. నిన్ను ఒక్కరూ పట్టించుకోరు, తిరిగి చూడరు. దగ్గర దగ్గర ఇది ఒక జూదం ఆట. ఒకరు గెలవటానికి 999 మంది ఓడిపోయే కథ...

రఘుపతి ఒక వివరణ ఇచ్చి ముగించాడు. సితారాకి కూడా ఆయన మాటల్లో చాలా నిజం ఉన్నట్టుగానే అనిపించింది. కానీ, వరలక్ష్మీ మాటలను చెవిన వేసుకోలేదు. నా కొడుకు ఖచ్చితంగా పెద్ద హీరోనేఅంటూ కాఫీని జుర్రున లాగింది.

అది చల్లారిపోయింది.

సరే అత్తయ్యా...నేను బయలుదేరతాను అన్న సితారా -- కాఫీ గ్లాసులు తీసుకు వెళ్ళి వంటగది వాష్ బేసిన్లో వేసేసి -- చుడిదార్ దుప్పటా అంచుతో చేతులు తుడుచుకుంటూ బయలుదేరింది.

సితారా...మీ నాన్నను తరువాత రమ్మని చెప్పు. తాంబూలాలకు మంచి రోజు చూసి, ముహూర్తం పెట్టుకు రమ్మని చెప్పాను. త్వరత్వరగా దాన్ని ముగించే దారి చూద్దాం... అని ముందే మాట్లాడుకున్న విషయాన్ని మళ్ళీ గుర్తుచేసేడు.

అశ్విన్, సితారాకి సొంత అత్త కొడుకు. చిన్న వయసులోనే అతనికి ఆమె -- ఆమెకు అతను అని నిర్ణయించబడింది. రోజు వరకూ దాంట్లో ఎటువంటి రిపేరూ రాలేదు.

పోయిన నెలలోనే ఇద్దరికీ త్వరలోనే పెళ్ళి చేయాలని ఇరువైపుల నిర్ణయించుకున్నారు. తాంబూలాలకి ముహూర్తం  చూడమని చెప్పింది వరలక్ష్మీ.

రోజు నుంచే సితారా కలలు కనడం ప్రారంభించింది.

మనిద్దరికీ పెళ్ళి అంటేనే దాంట్లో ఒక త్రిల్ లేదు. పుట్టిన దగ్గర నుండి నువ్వు నాకు తెలుసు. నన్ను నీకు తెలుసు...చాలా బోర్... అని అశ్విన్ కూడా కమెంట్చేసాడు.

బయట టూవీలర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అది జ్ఞాపకానికి వచ్చింది. సితారా ఆ మాటలను మామూలుగా తీసుకుంది.

కొంచం కూడా ఎదురుచూడని అంశం హీరో చాన్స్’!

సితారా వీధిలో వెళ్ళేటప్పుడు సినిమా వాల్ పోస్టర్లను చూసుకుంటూ వెళ్ళింది. అందరూ కొన్ని సంవత్సరాలుగా కలల పరిశ్రమలో ఉన్న వాళ్ళు. వీళ్ళను పక్కకు తోసేసి అశ్విన్ వలన ముందుకు రావటం కుదురుతుందా?’ 

కొంచం కష్టమే అనిపించింది. రఘుపతి మావయ్య చెప్పినట్టు మొదటి సినిమా విజయవంతమైతేనే హీరో’, లేకపోతే జీరోకదా?.

****************************************************************************************************