31, ఆగస్టు 2019, శనివారం

తొలివలపు(సీరియల్)....PART-2

                                                    తొలివలపు….(సీరియల్)
                                                                 (PART-2)

హైదరాబాద్ కోటి బస్ స్టేషన్. ఆ బస్ స్టేషన్లో నిలబడి అప్పుడప్పుడు మనికట్టు ఎత్తి ఎత్తి చూస్తూ విసుగును బయటపెడుతోంది ఆ అందమైన అమ్మాయి.

దూరాన పొగ కక్కుకుంటూ దూసుకు వస్తున్న బస్సులు, పది నెలల బిడ్డను కడుపులో మోస్తున్నట్టు...'ఎప్పుడురా ప్రశవం?' అనే వేదనతో నిలబడటానికి కూడా సమయం లేనట్లు ఒక్క క్షణం ఆగి వెళ్ళిపోతున్నాయి.

విసుగుతో నిలబడున్న ప్రయాణీకులను మరింత విసుగుకు గురిచేయకుండా, గంటకొక బస్సు ఉన్న ఆ రూటులో వెళ్ళే ఆ బస్సు ఆ రోజు ఎందుకనో పావుగంట ఆలశ్యంగా వచ్చింది. చేయెత్తి ఆపమని అడిగిన ప్రయాణీకులను నిరుశ్చాహ పరచటం ఇష్టం లేక, అక్కడ ఆగి వాళ్లను ఎక్కించుకుని వేగంగా బయలుదేరింది.

ఆరోజు ఆ రూటులో బస్సులు తక్కువగా ఉండటంతో, బస్సులో ప్రయాణీకులు ఎక్కువగా ఉన్నారు. ఒకరినొకరు రాసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ముందూకూ,వెనకకూ తోసుకుంటున్నారు. ఆ బాధను ఏలాగో ఒర్చుకున్న ఆ అమ్మాయి తన స్టాపింగ్ రావటంతో వేగంగా బస్సు దిగి, మరింత వేగంగా నడవసాగింది. పూర్తిగా పది నిమిషాలను పోగొట్టుకుని ఆ అమ్మాయి ఆ 'నర్సింగ్ హోమ్' ఎంట్రన్స్ చేరుకుంది. ఆదుర్దా పడుతూ తన మనికట్టును ఎత్తి టైము చూసుకుని మరింత ఆదుర్దా పడింది.

'ఈ రోజు ఆ ఆడ హిట్లర్ దగ్గర బాగా 'తిట్లు తినాల్సిందే. భగవంతుడా...నువ్వే నన్ను కాపాడాలి. అర్జంటు మెసేజ్ ను దేవుడుకి పంపించేసి లోపలకు పరిగెత్తింది.

ఎదురుపడ్డ సహ ఉద్యోగి నర్స్ పద్మ దగ్గర విచారించింది.

"పద్మా...మన హిట్లర్ నా గురించి అడిగిందా?"

"అడగకుండానా ఉంటుంది! అవును...ఎందుకు ఆలశ్యం అయ్యింది జానకీ?"

"బస్సు దొరకలేదు"

"ఇలాంటి సాకులన్నీ అ హిట్లర్ మహాతల్లి దగ్గర పనికిరావని నీకు తెలుసుగా...?"

"ఇప్పుడు నేనేం చేయను"

"హు...మాట్లాడకుండా ఒకపని చెయ్యి. ఇలాగే తిరిగి ఇంటికి వెళ్ళిపో. నువ్వు 'లీవు’ అని చెప్పేస్తాను"

"నీకు ఆటగా ఉందా? మన ఇష్టానికి ‘లీవు’ పెట్టలేమని తెలిసే మాట్లాడుతున్నావా?"

"సరే తల్లీ, లోపలకు వెళ్ళు. ఆ దెయ్యం నీకోసమే కాచుకుని కూర్చోనుంటుంది. వెళ్ళి చివాట్లు తిను"--అంటూ వెక్కిరించిన పద్మా నర్స్ ను ఒకసారి కోపంగా చూసి మెల్లగా నడవటం మొదలుపెట్టింది జానకి.

"బెస్ట్ ఆఫ్ లక్ జానకీ. హిట్లర్ను చూశేసి తిన్నగా 'స్టాఫ్స్’ రూము కు వచ్చాయి. అక్కడ నీకోసం నేను 'కర్చీఫ్' తో వైట్ చేస్తూ ఉంటాను"

జానకి పడుతున్న అవస్తను వేలాకోలం చేసే విధంగా పద్మా నర్స్ తన వంతుకు జానకిని భయపెట్టి వెళ్ళింది. చీఫ్ డాక్టర్ గాయత్రి రూము వైపుకు వణుకుతూ నడవటం మొదలుపెట్టింది జానకి.

ఆక్కడున్న నర్సులు మరియూ స్టాఫ్ ‘ఆడ హిట్లర్/ దెయ్యం’ అని పిలువబడే ఆమె సాక్షాత్ ఆ గాయత్రి నర్సింగ్ హోమ్ చీఫ్ డాక్టర్ గాయత్రినే. నర్స్ ట్రైనింగ్ ముగిసిన వెంటనే జానకికి మొదటి ఉద్యోగం గాయత్రి నర్సింగ్ హోమ్ లో దొరికింది. నర్స్ ట్రైనింగ్ కోర్సులో ఎంతబాగా మార్కులు తెచ్చుకున్నా మొట్టమొదటి ఉద్యోగం, కొత్త చోటు, కొత్త బాస్ అనగానే ఏదో తెలియని భయం...ఇది మొదటిసారి ఉద్యోగానికి వెళ్లే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కదా.

అలాగే డ్యూటీలో చేరిన మొదటి రోజు రాత్రి, ప్రశవించిన ఒక ఆమెకోసం ఉంచబడ్డ ఒక సూదిమందు బాటిల్ ను ఆదుర్దాలో జార విడిచింది జానకి. అప్పుడు అక్కడున్న అందరి ముందూ గాయత్రి దగ్గర బాగా చివాట్లు తిన్నది జానకి.

ఆ రోజు నుండి గాయత్రికి కొంచం దూరంగా ఉండటానికే ఇష్టపడింది జానకి. వైద్యానికి కావలసిన ఉపకరణాలను దగ్గరుండి గాయత్రికి అందివ్వాల్సి వచ్చినప్పుడల్లా 'ఆపరేషన్’ ఎప్పుడవుతుందో నని బయట నిలబడి టెన్షన్ పడుతున్న పేషంట్ బంధువులకంటే... జానకి ఎక్కువగా టెన్షన్ పడుతుంది.

ఇదిగో...ఈ రోజు కొంచం ఎక్కువసేపు తన నర్స్ అలంకరణ కోసం టైము స్పెండ్ చేయటం, జానకి రెగులర్ బస్సు మిస్ అవటానికి ఒక కారణం. గాయత్రిని ఒకసారి అద్దాల తలుపులులలో నుండి చూసిన జానకి, 'ఏం చివాట్లు పెడుతుందో?' అనే భయంతో తలుపు తట్టింది.

ఏదో రాసుకుంటున్న గాయత్రి, తలపైకెత్తి చూసి తల ఊపి జానకిని లోపలకు రమ్మంది. కుర్చీలో బాగా వెనకకు వాలి కూర్చున్న గాయత్రి, తన ముందు వచ్చి నిలబడ్డ జానకిని క్రింద నుండి పైకి ఒకసారి క్షుణ్ణముగా చూసింది. గాయత్రి చూపులకే ఎదురుగా నిలబడున్న జానకికి వణుకు మొదలైంది!

"సా...సారీ డాక్టర్. అదొచ్చి..."

"ఎటువంటి వ్యాఖ్యానమూ అవసరంలేదు. ఇక్కడ నీకేం పనో నీ మనసులో జ్ఞాపకము ఉంచుకునే ఇంట్లో నుంచి బయలుదేరతావు కదా? ఆలశ్యంగా వస్తే నాకు నచ్చదని తెలిసి ఇలా నా ఎదురుకుండా వచ్చి నిలబడటానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి?"

"లేదు డాక్టర్...అదొచ్చి..."

"ఇది నా చోటు. ఇక్కడ అంతా నేను చెప్పినట్టే జరగాలి. నా కట్టుబాటులో ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. నెల అయ్యేటప్పటికి చెయ్యి చాచి జీతం తీసుకోవటం తెలుసు కదా? ఉద్యోగానికి సిన్సియర్ గా ఉండాలని అనిపించొద్దా? ఓ.కే.! అవసరంలేకుండా నీతో మాట్లాడి నా టైమును వేస్టు చేసుకోవటం నాకు ఇష్టంలేదు. నువ్వు వెళ్ళొచ్చు. నీకు రావలసిన 'సెటిల్ మెంట్' నీ ఇంటికే వెతుక్కుంటూ వస్తుంది"

గాయత్రి చెప్పింది విని ఒక్క నిమిషం ఏమీ అర్ధంకాక నిలబడింది జానకి.

'ఏం చెబుతోంది ఈవిడ? నన్ను ఉద్యొగం వదిలి వెళ్ళిపొమ్మని చెబుతోందా...అరె భగవంతుడా!'--అదిరిపడ్డ జానకి ఆ తరువాత కొంచం కూడా ఆలొచించ లేదు. గాయత్రి కాళ్ళమీద పడ్డట్టు ప్రాధేయ పడటం మొదలు పెట్టింది.

"నన్ను క్షమించండి డాక్టర్. లేటుగా రావటం నా తప్పే. దానికొసం మీరు ఎటువంటి శిక్ష వేసినా అనుభవిస్తాను. దయచేసి ఉద్యోగం నుండి మాత్రం వెళ్ళిపొమ్మని చెప్పకండి..."--- ఏడవటం మొదలుపెట్టింది.

"సరే...నేను ఈరోజు నీకు వేయబోయే శిక్ష, ఇకమీదట లేటుగా వచ్చే ఒక్కొక్కరికీ పాఠంగా ఉండాలి. నేను చెప్పేంత వరకు నువ్వెళ్ళి బయట... అంటే ఎండలో నిలబడాలి. నీకు ఇష్టం లేకపోతే, ఉద్యోగం మానేసి వెళ్ళిపోవచ్చు"-- చెప్పేసి తన పని చూసుకోవటం మొదలు పెట్టింది గాయత్రి.

మండుటెండలో నిలబడుంది జానకి. 'ఈమెకు ఏమైంది?'--అని వినోదంగా చూస్తూ చాలామంది ఆమెను దాటుకుని వెళ్ళారు. దాని గురించి ఆమె కలత చెందలేదు. సూర్య కిరణాలు ఒకటిగా కలిసి ఎందుకో ఆమె నడి నెత్తిన మాత్రమే కేంద్రీకృతమైనట్లు శరీరమూ, మనసూ వేడితో ఉడికిపోతున్నాయి. పూర్తి కోపమూ గాయత్రి పైన ఉండిపోయింది. కళ్ళు అగ్ని కణాలుగా దహిస్తుంటే, డాక్టర్ మాటలు జానకి మనసును సూదులతో చిల్లులు చేసింది.

'పోవే... నువ్వూ, నీ ఉద్యోగమూ' అని రాజీనామా లేఖను డాక్టర్ ముఖం మీద విసిరి పారేసి వెళ్ళిపోవచ్చు! కానీ, ఒకటో తారీఖు వచ్చిందంటే పైసా కూడా కట్ చేయకుండా ఇరవైవేలు ఎవరు ఇస్తారు? ఉద్యోగం దొరకటమే కష్టంగా ఉన్న ఈరోజుల్లో, ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని నిలబడితే ఆ తరువాత...?

అర్ధీక సమస్యలు భూతంలాగా ఆమె కళ్ళ ముందుకు వచ్చి నిలబడటంతో, మనసులో రేగిన ఆలొచనను మరు క్షణమే మర్చిపోయింది.

'ఇప్పుడొస్తున్న జీతం కంటే ఎక్కువ జీతంతో వేరే ఉద్యోగం దొరికేంత వరకు పొగరుతో విర్రవీగుతున్న ఈ దెయ్యంతోనే కాలం గడపాలి’ --తనలో తానే నొచ్చుకుంది. అదే సమయం,

"హలో!" అని వెనుకవైపు ఎవరిదో గొంతు వినబడి తిరిగి చూసేలోపు "ఎండలో నిలబడాలని ఏదైనా మొక్కా?"--అడిగేసి మెరుపులా మాయమయ్యాడు అతను.

ఒకసారే చూసింది అతన్ని. కానీ, ఆ నిమిషం ప్రేమ అనే మంచుగడ్డ ఒకటి ఆమెలో కరిగి ప్రవహించింది.

ఇంకా ఉంది.....Continued in:PART-3

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

29, ఆగస్టు 2019, గురువారం

తొలివలపు(సీరియల్)....PART-1

                                                 తొలివలపు….(సీరియల్)
                                                              (PART-1)

సూర్యుడనే ప్రేమికుడు తన వెలుతురనే చేతులతో భూమి అనే ప్రేమికురాలుని ముట్టుకున్న సమయం.... మేలుకున్నది మానవ జాతి. బద్దకాన్ని వదలి, తమ లక్ష్య సాధన కోసం యంత్రంగా పనిచేయడం ప్రారంభించింది.

సరే రండి...మనమూ వాళ్ళతో ప్రయాణం చేద్దాం!

మనం ఇప్పుడు నిలబడున్నది హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఒక ముఖ్యమైన వీధిలో!

మీ 'కెమేరా' కళ్ళను రెడీగా ఉంచుకుని నన్ను అనుసరించి రండి.

చూశారా...! పెద్ద పెద్ద గాజు పెట్టెలను ఒకదాని మీద ఒకటి పేర్చిపెట్టినట్టున్న భవనాలు, ఆకాశాన్ని తాకేటట్లున్న వాటి గంభీరమైన ఎత్తు. ఉన్న వెలుతురు చాలదని రాత్రి నక్షత్రాలను చేబదులు తీసుకుని వెదజల్లిన కాంతివంతమైన షాపులు. ప్రొద్దుటి పూట కూడా తమ 'పవర్ను’ చూపిస్తున్నారట. హూ...

హైదరాబాద్ లో ప్రతి రోజూ పండుగ వాతావరణమే. నగరంలో ఎటు చూసినా ఉచితంగా కనబడే జిగేలు మనిపించే వేలకొలది అందాలు. రాత్రి అయితే ఇంద్రలోకంలో ఉండేటట్లే అనిపిస్తుంది.

అరెరే! అలా నోరు వెళ్ళబెట్టుకుని ఆగిపోయారేం? ఆగకుండా నాతో రండి. జనం'పల్లెటూరి గబ్బిలాయి’ గాళ్ళు అనే పేరు పెట్టి మిమ్మలని పక్కకు తోసేలోపు నడవటం మొదలుపెట్టండి.

ఇదిగో...మనం వెతుక్కుంటూ వచ్చిన ప్రదేశం వచ్చేసింది.

ఆకాశాన్ని అంటుకునే ఎత్తులో ఉన్న భవనాలకు మధ్య, ఎదుగుతున్న పిల్లలాగా నిలబడున్న చిన్న భవనం. భవన ముఖ ద్వారంలో 'నన్ను గమనించిన తరువాతే లోపలకు వెళ్ళాలి’ అని చిన్న గర్వంతో గంభీరంగా ఉంచబడ్డ ఆ భవనం యొక్క నేమ్ బోర్డ్.

‘గాయత్రి నర్సింగ్ హోమ్’

చెమటతో కుంకుమ బోట్టు చెరిగిపోవచ్చు. కుంభవృష్టి వర్షం కురిసినా మేము చెరిగిపోమని నేమ్ బోర్డ్ లోని ఒక్కొక్క అక్షరమూ రక్తం లాంటి ఎర్ర రంగులో వాగ్దానం చేస్తున్నట్లున్నాయి. వాచ్ మ్యాన్ ఎప్పుడూ చేసే సెల్యూట్ ను అంగీకరించి ఒకటి రెండు నిమిషాలు లోపలకు నడిస్తే ఆ భవనాన్ని చేరుకోగలం. కాంపౌండ్ గేటుకూ, భవనానికి ఉన్న మధ్య దూరంలో నిలబడున్నది ఒక మహిళ శిల. ఆ శిల జోడించిన చేతులలో నుండి వెలువడుతున్న నీరు ప్రవహించటానికి ఒక కారు వెళ్ళ గలిగేంత దారి వదలబడ్డది. మిగిలిన ప్రదేశమంతా పచ్చటి తివాచి పరిచినట్టు గడ్డి పెరిగున్నది.

'రంగులలో ఎన్ని రంగులున్నాయో తెలియనివారైతే! మమ్మల్ని చూడటానికి రండి!' అని పువ్వులు తమ భాషలో ఆహ్వానం అందిస్తున్నాయి...చల్లటి గాలి ఆ పువ్వుల ఆహ్వాన్నాన్ని ఆమొదించినట్లు క్రిందకు వచ్చి ఆ పువ్వులను పలకరించి వెడుతోంది. మొత్తానికి ఆ భవనం ప్రకృతి మరియు కృత్రిమమైన వాతావరణంతో చుట్టుముట్టి ఉన్నది. 'ఇది నర్సింగ్ హోమా? లేక నర్సరీ గార్డనా?'...మనలాగ బయట నుండి వచ్చేవాళ్ళు ఒక్క నిమిషం నిలబడి ఈ రెండురకాల వాతావరణాన్ని ఆస్వాదిస్తే వాళ్లకు ఇలాంటి ప్రశ్నే తలెత్తుతుంది.

'సరే...ఒక్క నిమిషం. హు...హూ...'

ఏమిటి చూస్తున్నారు? ఎడతెరిపిలేకుండా మాట్లాడుతున్నాను కదా, గొంతుకలో కిచ,కిచ.

సరే...లోపలకు వెళ్దామా...?

ఇది 'రిసెప్షన్'. ఇక్కడ వయసు ఊయల ఊగుతోంది. అక్కడున్న ఆ అమ్మాయలందరికీ సుమారు ఇరవై ఏళ్ళు ఉంటాయా? పమిటచెంగు జారిపోతున్నా కూడా గ్రహించకుండా దేనికోసమో వెతుకుతున్నారు. ఎంత నిజాయతీ?

అరే భగవంతుడా! దయచేసి మీ చూపులను కొంచంగా మార్చుకుని నా వెంబడి రండి.

ఇదిగో...ఇలాగే నడిచి వెడితే, 'జాగ్రత్తగా రండి...ఎదురుగా తెల్ల దుస్తులు వేసుకుని వస్తున్న ఆమె ఈ నర్సింగ్ హొమ్ నర్స్. మనసులో సినిమా హీరో అనుకుంటూ చిన్నగా రాసుకు,పూసుకుని వెల్దామనుకుంటున్నారేమో. తిరిగి వెళ్ళేటప్పుడు మీ వీపు విమానం మోత మోగుతుంది...జాగ్రత్త.

ఇంకో విషయం చెబుతాను...వినండి. ఇక్కడ చీఫ్ డాక్టర్ గాయత్రి మొదలు పనిమనిషి ఎల్లమ్మ వరకు అంతా ఆడవాళ్ళ రాజ్యమే. ఒక్క వాచ్ మ్యాన్ తప్ప. మగవాళ్ళకు ఎక్కువగా అనుమతి లేని అన్య ప్రదేశం ఇది. ఇవన్నీ చీఫ్ డాక్టర్ గాయత్రీ యొక్క ఏర్పాట్లే. గర్భిణీ స్త్రీల యొక్క భర్తలైతే తప్ప మిగిలిన మగవాళ్ళకు అనుమతిలేదు. చీఫ్ డాక్టర్ గాయత్రీ గురించి ఇప్పుడు మీకు కొంచం అర్ధమై వుంటుంది అనుకుంటున్నాను.

ఇలాగే రెండు వైపులా నెంబర్లు వేసున్న రూములను దాటుకుంటూ వెళ్ళి కుడివైపుకు తిరిగి మరో ఇరవై అడుగులు నడిస్తే...అదిగో, డాక్టర్ గాయత్రి బాపిరాజు, గైనకాలజిస్ట్(స్త్రీ మరియూ శిశు సంరక్షణ నిపుణులు). 'బాధ్యత, కర్తవ్యము... ఇవి రెండూ, రెండు కళ్ళు లాంటివి’ అనేది మనకు జ్ఞాపకం చేసే విధంగా గాయత్రి యొక్క ప్రొద్దుటి పూట ఆమెలో ఉండే చురుకుదనం ఆమె పెట్టుకున్న కళ్ళద్దాలలో నుండి కూడా కనబడుతుంది.

అంతస్తు, పెద్ద గుర్తింపు వచ్చిందనే గర్వం కొంచం కూడా అమెలో కనబడదు. వైద్యసేవలకు తనని పూర్తిగా అర్పించుకున్న మరొక మదర్ తెరేసా అని ఆమెను చెప్పొచ్చు. జరిగి ముగిసిన కాలంలో ఆమె పడ్డ కష్టాలను, ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఆమె అనుభవిస్తున్న సంతోషాలతో పూడ్చి పెట్టింది డాక్టర్ గాయత్రి.

సరే...సరే...చాలు. మన కథలోని హీరోయిన్ ని మీకు పరిచేయం చేశేశాను. ఇక మీరుగా ఆమె కథను తెలుసుకోండి. నేను సెలవు తీసుకుంటాను.

ఇంకా ఉంది.......Continued in:PART-2

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

26, ఆగస్టు 2019, సోమవారం

మరణం తరువాత జీవితం.... (ఆసక్తి)

                                             మరణం తరువాత జీవితం

ఇంగ్లాండ్ దేశంలోని సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జరిపిన అతిపెద్ద శాస్త్రీయ అధ్యయనంలో మరణం తరువాత జీవితం గురించిన మొదటి సూచన దొరికిందని చెబుతున్నారు. వైద్య మరణం తరువాత మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాల వరకు ప్రస్తుత జీవిత అవగాహనతో ఉంటాడు అనడానికి మొదటి సాక్ష్యం దొరికిందని వారు తెలియజేశారు. గతంలో ఇది అసాధ్యం అని భావించారు.


మరణం అనేది అనివార్య పరిణామం. కానీ శాస్త్రవేత్తలు మరణం తరువాత జీవితం ఉన్నదని చెప్పటానికి కావల్సిన సూచన దొరికిందని చెబుతున్నారు. అందువలన మరణం గురించిన బాధ అవసరం లేదని, ఎందుకంటే మరణం తరువాత ఇంకో జీవితానికి వెడతారనేది అర్ధం చేసుకోవలని తెలుపుతున్నారు.

ఒక వ్యక్తిలో మరణించిన తరువాత శరీరం వెలుపల ఏర్పడే అనుభవాల గురించి ఎప్పుడూ జరగనటువంటి అతిపెద్ద వైద్య అధ్యయనంలో మరణించిన వ్యక్తి కొద్ది నిమిషాల వరకు ప్రస్తుత జీవిత అవగాహనతో, ప్రస్తుత లోకంలో ఉంటాడు అనే విషయాన్ని కనుగొన్నారు. ఈ మధ్య వరకు ఇది విస్తృత వివాదస్పద విషయంగా ఉండటంతో దీనిని (మరణం తరువాత జీవితం) విశ్వాసము లేని విషయంగానే పరిగణించారు.


   కానీ సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొద్ది సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ తో బాధపడుతున్న 2000 మంది రోగులను అమెరికా, ఇంగ్లాండ్ మరియూ ఆస్ట్రియా దేశాల 15 ఆసుపత్రులలో అధ్యయనం చేశారు. ఇందులో 40 శాతం మంది వైద్య పరంగా చనిపోయి డాక్టర్ల చేత గుండే ఒత్తిడి వైద్యముతో(కార్డియో పల్మనరీ రిసిపిటేషన్) బ్రతికి బట్ట కట్టారు. అందులో ఒక రోగి తాను తన శరీరం నుండి పూర్తిగా వెళ్ళిపోయి ఆసుపత్రి రూము చివరలో నిలబడి తన గుండెను డాక్టర్లు కార్డియో పల్మనరీ రిసిపిటేషన్ చేస్తున్న దానిని చూసినట్లు గుర్తు చేసుకున్నాడు.

                                                       డాక్టర్ స్యామ్ పార్నియా

57 సంవత్సరాల సామాజిక కార్యకర్త అయిన ఇతను డాక్టర్లు/నర్సులు తనపై చేసిన చర్యలను వివరంగా వివరించాడు. వారు వాడిన యంత్రాల యొక్క ద్వనిని కూడా వివరించాడు.

"హృదయము కొట్టుకోవడం మానేసిన తరువాత మెదడు పనిచేయదని మాకు తెలుసు" సౌత్ ఆంప్టన్ మాజీ పరిశోధన శాస్త్రవేత్త, న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగానూ, ఈ అతిపెద్ద శాస్త్రీయ అధ్యయన జట్టు యొక్క నాయకుడైన డాక్టర్ స్యాం పార్నియా అన్నారు.(డాక్టర్ స్యాం పార్నియా చనిపోయిన వారిని కార్డియో పల్మనరీ రిసిపిటేషన్ తో కొద్దిసేపట్లో బ్రతిగించగలరు అనే పేరు తెచ్చుకున్న డాక్టర్). ఈయన, పునరుజ్జీవన పరికరాల ఉపయోగ పరిశోధనలో అత్యంత పురోగతి సాధించిన శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఈయన సాధించిన పరికరాల ఉపయోగ పరిశోధన మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో హార్ట్ అటాక్ రోగులు మరణం నుంచి తప్పించుకున్నారు.


"కానీ ఈ ప్రత్యేక ఉదాహరణలో, గుండె ఆగిపోయిన మూడు నిమిషాల వరకు స్పృహతో కూడిన అవగాహన కొనసాగిందని తెలుస్తోంది. ఎందుకంటే మామూలుగా గుండె ఆగిపోయిన 20-30 క్షణాలలో మెదడు పనిచేయడం మానేస్తుంది"

"ఈ రోగి రూములో తన మీద జరిగిన ప్రయత్నాలన్నింటినీ పూర్తిగా వివరించాడు. అందులోనూ ముఖ్యంగా ఒక యంత్రంలో నుండి 3 నిమిషాలకు ఒకసారి మాత్రమే వచ్చే 'బీప్' శబ్ధాన్ని అతను వివరించాడు"


"అతను చెప్పేది చాలా నమ్మదగినదిగానే ఉన్నది. అతను చెప్పినవన్నీ అతని మీద ఉపయోగించబడ్డాయి"

ఇతని వివరణను పక్కన పెడితే 40 శాతంలో మిగిలిన వారు మరణ సమయంలో ఏదో ఒక అవగాహన అనుభవించినట్లు తెలిపారు. చాలా అనుభవాలను స్పష్టంగా తెలియజేయకపోయినా వారి వివరణలో నేపధ్యాలు ఉద్భవించాయి. అసాధారణ ప్రశాంతతను కొందరు చెప్పగా, మరికొందరు సమయం అయిపోవడం లేక పెరగడం జరిగిందని తెలిపారు. కొందరు ప్రకాసవంతమైన కాంతిని చూశామని, కొందరు బంగారు మెరుపును చూశామని, మరికొందరు సూర్యుని వెలుతురు చూశామని తెలిపారు. కొంతమంది భయం వేసిందని, నీటిలో మునిగిపోతున్న అనుభవం కలిగిందని, నీటిలో నుండి ఎవరో పైకి లాగుతున్న అనుభూతి కలిగిందని తెలిపారు.


13 శాతం మంది తమ శరీరం నుండి విడిపోతున్నట్లు, కొంతమంది పైకి వెడుతున్నట్లు అనిపించిందని తెలిపారు.

"మిగిలిన వారు కూడా ఏదో ఒక అవగాహన కలిగి ఉంటారు. కాకపోతే వైద్యం కోసం డాక్టర్లు ఇచ్చిన మత్తు మందు మరియు ఇతర మందుల వలన కొన్ని అనుభూతులను వారు మరిచిపోయి ఉంటారు" అని డాక్టర్ పర్నియా నమ్ముతున్నారు.

లక్షలాది మంది మరణంకు సంబంధించిన స్పష్టమైన అనుభవాలు అనుభవించి ఉంటారని అంచనాలు సూచిస్తున్నా శాస్త్రీయ అధారం సందిగ్ధంలో ఉంటోంది. ఈ అనుభవాలను న్యాయపరచటానికి మరికొన్ని పరిశోధనలు అవసరం. నాటింగ్ హాం ట్రెంట్ విశ్వవిద్యాలయ మనస్తత్వ వేత్త డాక్టర్ డేవిడ్ విల్డే ప్రస్తుతం శరీరం వెలుపల జరిగినట్లు చెప్పినటువంటి పరిమాణాలను అనుసంధానం చేస్తూ మరణం తరువాత జీవితం గురించిన అనుభవాలలో ఒక దానితో మరొకదానిని పోల్చే నమూనా తయారుచేస్తున్నారు. ఈ వివాదాస్పదమైన విషయం గురించి మరికొన్ని పరిశోధనలు జరపటానికి ఇది ప్రొత్సహిస్తుందని ఆయన చెబుతున్నారు.

*************************************END****************************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

24, ఆగస్టు 2019, శనివారం

మనుషులకూ మూడో కన్ను? (మిస్టరీ)

                                         మనుషులకూ మూడో కన్ను?

పరమశివుడి మూడో కన్ను ఆగ్రహాన్ని చూపిస్తుంది. పరమేశ్వరుడి త్రినేత్రం లోకాన్నే భస్మరాశిగా మార్చేస్తుంది. త్రినేత్రం నిజమేనా? అంతుచిక్కని దేవరహస్యమా? మనుషులకూ మూడో కన్ను ఉండే అవకాశం ఉందా?

మన శరీరంలోనూ మూడో కన్ను దాగి ఉంది. మన నడకను, నడతను, జీవిత మార్గాన్ని నిర్దేశించి అడుగడుగునా ఆదేశాలిస్తూ ముందుకు నడిచేలా చేస్తుంది. మనకి జ్ఞానాన్నిస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండును కంట్రోల్ లో ఉంచుతుంది. అదే పీనియల్ గ్లాండ్.


మన మెదడులో సరిగ్గా మధ్య భాగంలో ధాన్యపు గింజ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుంది. అన్ని రకాల కనెక్టివ్ కణాలన్నీ ఈ గ్రంథిని చుట్టుముట్టి ఉంటాయి. దీని ఉపరితల భాగం పియల్ కాప్స్యూల్చే చుట్టి ఉంటుంది. ఇది సరిగ్గా మిడ్ బ్రైయిన్ లో ఉంటుంది. చాలా నరాల ఫైబర్లు ఇందులోకి చొరబడి ఉంటాయి. దీనివల్ల మన శరీరంలోని అన్ని రకాల చర్యలను పీనియల్ గ్రంథి నియంత్రిస్తుంది.


మీరు ఒకసారి రెండు కళ్ళూ మూసుకుని ధ్యాన ముద్రలో ఉండండి. మీ దృష్టిని రెండు కళ్ళ మధ్య ఉన్న భృకుటిపై ఉంచండి. మనసులో మీరు కోరుకున్న రూపం మీ భృకిటిపై సాక్షాత్కరిస్తుంది. మీరు మనసును, మెదడును పూర్తిగా కంట్రోల్ లో ఉంచేందుకు ఇదే ఉపయోగపడుతుంది. మనలోని ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని ఇదే నిర్ణయిస్తుంది. ఆగ్రహం వచ్చినప్పుడు మన భృకుటి ముడిపడటం మీరెప్పుడైనా గమనించారా? ఖచ్చితంగా రెండు కళ్ళ మధ్య నున్న భాగం ముడిపడుతుంది. మనలోని మూడో కంటికి ఇదే తార్కాణం.

మెలటోనియన్ ఉత్పత్తిని పీనియల్ గ్రంథి చేస్తుంది. ఇదే మన మేధస్సును, మన పనితీరుక్రమాన్ని నిర్ణయించే హార్మోన్. దేవదారు చెట్టు శంకువు ఆకారంలో ఉంటుంది. దీని కాంతిని రెటీనాలోని సెన్సిటివ్ కణాలు కనిపెడతాయ్. ఈ కాంతిని శరీరంలోని అన్ని భాగాలకు వివిధ రూపాలలో, మార్గాలలో ప్రసరింపజేస్తుంది. పైకి కనిపించే రెండు కళ్ళు బయటకు కనిపించే దృశ్యాలనే ప్రతిబింబిస్తాయి. పీనియల్ గ్లాండ్ అనేది అంతర్గత కాంతిని శక్తివంతం చేస్తుంది. అందుకనే దీన్ని మూడో కన్ను అన్నారు.


17 వ శతాబ్ధంలోనే ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత మరియు తత్వవేత్త శాస్త్రవేత్త రెనే డిస్కార్టస్ మనిషిలో ఆత్మ (జీవం) కూర్చునే చోటు పీనియల్ గ్లాండ్ లోనేనని తెలిపారు. పీనియల్ గ్లాండ్ ఎలాంటి విధులను నిర్వహిస్తుందన్న విషయాన్ని మన పూర్వీకులు ముందే నిరూపించారు. మనలోనే జ్ఞానచక్షువే త్రినేత్రంగా తేల్చారు. ఇందుకు మూలస్థానం మన రెండు కళ్ల మధ్యభాగం. అందుకే దాన్ని కూల్ గా ఉంచేందుకే మనం అక్కడ బొట్టు ఉంచుతాం. మనిషి మెదడులో పీనియల్ గ్లాండుది ఆత్మ స్థానం అని పాశ్చాత్య ఫిలాసఫర్లు సైతం ఒప్పుకున్నారు. ముందుగానే చెప్పుకున్నట్లు భౌతిక రూపంలో ఇది మాస్టర్ గ్రంథిగా ఉపయోగపడుతుంది. స్పిరుచ్యువల్ లెవెల్స్ లో మూడో కన్నుగా తెరుచుకుంటుంది. వైద్య శాస్త్రం ప్రకారం పీనియల్ గ్లాండ్ చీకటి నుంచి కాంతిని ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి మనకు కావలసిన మెలటోనిన్, సెరోటోనిన్, డిఎంటి5లను పీనియల్ గ్లాండ్ ఉత్పత్తి చేస్తుంది. మనకి ప్రాణాధారం ఇవే.


నీటిలో కలుపుతున్న ఫ్లోరైడ్ మానవులలోని పీనియల్ గ్లాండ్ ను పనిచేయకుండా అడ్డుకుంటోందని, దాని వలన మానవ పరిణామాన్ని తదుపరి దశకు చేరుకోనివ్వకుండా చేసేరని/ చేస్తూనే ఉన్నారని కొన్ని మర్మ వాదాలు తలెత్తాయి.

పళ్ళు పుచ్చిపోకుండా ఉండటానికి తాగునీటిలోను, టూత్ పేస్టుల లోనూ ఫ్లోరైడ్ కలుపుతున్నామని చెబుతున్నారు. కానీ నిజానికి ఫ్లోరైడ్ ను నీటిలో కలపటానికి ఉద్దేశమే వేరని, మనిషి అధ్యాత్మిక శక్తులు పొందకూడదని ఎవరో ఈ కుట్ర పన్నేరని చెబుతున్నారు. సమూహ మెదడు నియంత్రణ కోసమే ఇదే చేపట్టేరని, ఇదే గనుక జరిగి ఉండకపోతే ప్రతి మనిషీ అధ్యాత్మిక బాటలో వెళ్ళి ప్రతి ఒక్కరూ మంచికి పాటుపడేవారని, అప్పుడు లోకం సుభిక్షంగా ఉండేదని వాదాలు వినబడుతున్నాయి.


రష్యాకు చెందిన శాస్త్రవేత్త ఇ.పెర్కిన్స్, 1954 అక్టోబర్-2 న ఐజి ఫోర్బన్ కెమికల్ ఇండస్ట్రీస్ కు ఒక లేక రాస్తూ అందులో ఈ విషయం ప్రస్తావిస్తూ ఒక మనిషి ఒక సంవత్సరం పాటు కృతిమ ఫ్లోరైడ్ ను కనుక తీసుకుంటే ఆ మనిషి శరీరకంగానూ, మానసికంగానూ వేరే మనిషిగా మారిపోతాడని తెలిపారు. ఎప్పుడైతే ఫ్లోరైడ్ మనిషి మేధస్సును తగ్గిస్తుందని చైనా ప్రభుత్వం తెలుసుకున్నదో అప్పుడే వారి దేశంలో ఫ్లోరైడ్ ను నీటిలో కలపటం మానుకున్నారు.

మనిషి తన నిజమైన శక్తిని తెలుసుకోకూడదు, ఎప్పుడూ చీకట్లోనే ఉండాలి అని నిర్ణయించింది ఎవరు?

ఫ్లోరైడ్ వలన మనిషి మేధాశక్తిని కోల్పోతాడని తెలుసుకున్నదెవరు?

ఆ కుట్రదారులెవరు?...ప్రభుత్వాలా?

కొత్త ప్రపంచ శాసనమా?

మత సంబధిత సంస్థలా అనేది ఇంకా తేలని ప్రశ్నగానే మిగిలి పోయింది.

*************************************సమాప్తం************************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

22, ఆగస్టు 2019, గురువారం

జెంటిల్ మ్యాన్(కథ)

                                             జెంటిల్ మ్యాన్(కథ)

నందిని ఆ రోజు చాలా అదుర్దాగా ఉంది.

కారణం.

ఆ రోజు ఆమె పనిచేస్తున్న ఆఫీసు బాధ్యతను స్వీకరించడానికి కొత్త ఎం.డి రాబోతున్నారు.

ఆమె ఆదుర్దాకు అదొక్కటే కారణం కాదు. ఆ కొత్తగా వస్తున్న ఏం.డి పేరు సత్య ప్రకాష్ అని ఉండటం కూడా ఒక కారణం.

"వచ్చేది...అతనై ఉంటాడా?" అని అనుకున్న వెంటనే ఆమెలో వణుకు పుట్టింది.

నందినికి పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. భర్తకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ వ్యాపార సంస్థలో "మేనేజర్" ఉద్యోగం. మామగారూ, అత్తగారూ అనే ఉమ్మడి కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్న జీతాలతో ఆ ఇల్లు హాయిగానే గడుస్తోంది.

సరిగ్గా సమయం ఉదయం 10.30. తలుపు వేగంగా తెరుచుకుంది. లోపలకు వచ్చాడు కొత్త ఎం. డి. అతను అదే సత్య ప్రకాష్! నందిని గుండే వేగంగా కొట్టుకుంటోంది. ఆఫీసులో అందరినీ పరిచయం చేస్తున్నాడు మెనేజర్.

“సార్...ఈవిడ పేరు నందిని! మీకు ఈవిడే పర్సనల్ సెక్రటరీ. పది సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తోంది. షార్ట్ హాండ్, కంప్యూటర్ ఆపరేటింగ్ అన్నీ బాగా తెలిసున్న మేధావి అని చెప్పొచ్చు"

ఆ సమయంలో నందిని జ్ఞాపకాలు పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్ళినై.

                                        ************************************

ఆ కాలేజీ కధానాయకుడు సత్య ప్రకాష్. ఆటలలొ చాంపియన్. ఫుట్ బాల్ టీమ్ క్యాప్టన్. చదువులో గోల్డ్ మెడలిస్ట్. స్టూడెంట్ యూనియన్ ప్రెశిడెంట్. ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిలలో చాలా మంది అతని ఫ్యాన్స్! అందరూ అతన్ని జెంటిల్ మ్యాన్ అని పిలుస్తారు.

"ఇతనిలాంటి ఒకతనే భర్తగా దొరకాలి" అనుకుని ఎంతోమంది ఆడపిల్లలు నిట్టూర్పు విడిచిన కాలం అది.

అలాంటి సత్య ప్రకాష్ తనతో పాటు చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమె పేరు శ్యామల. అందం, తెలివి, ఆస్తి పాస్తులు...ఇలా అన్నిట్లోనూ సత్య ప్రకాష్ కు సరితూగుతుంది శ్యామల. కాలేజీ స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రొఫసర్స్, మిగిలిన ఆఫీస్ స్టాఫ్ అందరూ సత్య ప్రకాష్ - శ్యామల ప్రేమను చూసి ఆనందించారు. ఆ సంవత్సరం జరిగిన బెస్ట్ జోడి పోటీలో వాళ్ళకు టైటిల్ అవార్డ్ లభించింది.

కానీ పోను పోనూ వాళ్ళకు ప్రేమ కలిసి రాలేదు.

సత్య ప్రకాష్ శ్యామలను వదిలేశాడని కాలేజీ మొత్తం కోడై కూసింది. సత్య ప్రకాష్ జెంటిల్ మ్యాన్ కాదు, అవకాశవాది అని కొందరు అతన్ని ఆడిపోసుకున్నారు.

ఎంతో అన్యోన్యంగా ఉండే సత్య ప్రకాష్-శ్యామల మధ్య ఏం జరిగుంటుంది?….ఎందుకు విడిపోయుంటారు?…అనేది మాత్రం చాలా మందికి అర్ధం కాలేదు.

                                 ********************************************

పాత జ్ఞాపకాలు నుండి బయటపడ్డ నందినికి సత్య ప్రకాష్ - శ్యామల మధ్య ప్రేమ ఎందుకు వికటించింది, దానికి ఎవరు కారణం అనేది తెలుసుకోవాలనే తపన ఎక్కువయ్యింది.

చాలా రోజులుగా సమాధానం దొరకని ఆ ప్రశ్నకు...ఒకరోజు సత్య ప్రకాష్ ఆఫీసులో ఒంటరిగా కూర్చున్నప్పుడు కారణం ఏమిటని అడిగింది నందిని.

"సార్...ఆఫీసులో అడుగుతున్నానని తప్పుగా అర్ధం చేసుకోకండి...మీరు ఎక్కడ ఒంటరిగా ఉంటారో నాకు తెలియటంలేదు. అందుకని ఆఫీసులో ఒంటరిగా ఉంటున్నప్పుడు అడగాలని అనుకున్నాను...అడగొచ్చా?"

"నేనేమీ తప్పుగా అనుకోను...అడుగు నందిని"

"కాలేజీలో మీరూ, శ్యామల విడిపోవడానికి ఏమిటి కారణం?"

నందిని వైపే కొద్ది క్షణాలు సూటిగా చూసిన సత్య ప్రకాష్, పెద్దగా గాలి పీల్చుకుంటూ “నేను కాలేజీ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు మా నాన్న వ్యాపారం బాగా దెబ్బ తిన్నది. ఈ విషయం తెలుసుకున్న శ్యామల కొంచం కొంచంగా నాకు దూరంగా జరిగింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి పెళ్ళి పత్రిక ఇచ్చింది. ఆమె అత్త కొడుకే పెళ్ళి కొడుకు. నాకు షాక్ అనిపించింది. నేను ఆమె దగ్గర ఏదీ అడగలేదు!”

"మీరెందుకు శ్యామలను ఏమీ అడక్కుండా మౌనంగా ఉండిపోయారు? మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసంచేసిన ఆమెను బాగా నాలుగు మాటలు అడగాల్సింది!"

"లేదు నందిని! నేను ఆమెను మనసారా ప్రేమించాను. ఆమెకు నాతో ఇబ్బందేమిటో నాకు తెలియదు. నా కంటే తన అత్త కొడుకే బెటర్ అనుకున్నదేమో...అతన్ని ఎన్నుకుంది. ఆమె ఎక్కడున్నా బాగుండాలి" అంటున్న సత్య ప్రకాష్ ను చూస్తుంటే నందిని కళ్ళలో నీళ్ళు తిరిగినై.

"ప్రకాష్...నీకా ఈ పరిస్థితి”____ఆమెలో బాధ పెరిగింది.

“ప్రకాష్… శ్యామల పోతే పోనీ. నీ మంచితనం గురించి ఆమె తెలుసుకోలేకపోయింది...దాని తరువాత?"

"శ్యామల నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత నాకు ఎవరినీ పెళ్ళిచేసుకోవాలని అనిపించలేదు. అలాగే ఉండిపోయాను" అంటూ నవ్వుతూ చెప్పాడు.

సత్య ప్రకాష్ నవ్వుతూ సమాధనమిచ్చినా అతని కళ్ళలొ బాధ, మనసులో నొప్పి నందిని గ్రహించగలిగింది.

"అవకాశవాది సత్య ప్రకాష్ కాదు, శ్యామలానే"...... అనుకున్న నందినికి అతనిపై ఒక గౌరవం ఏర్పడింది.

                                   ***********************************************

"ప్రకాష్...విష్ యూ హ్యాపీ బర్త్ డే"...అంటూ లంచ్ టైములో వచ్చి నిలబడ్డ నందినిని తల ఎత్తి చూశాడు సత్య ప్రకాష్.

ఆమె చేతిలో అందమైన రెడీమేడ్ షర్ట్ ఉంది.

"ధ్యాంక్స్" అంటూ నవ్వుతూ ఆ షర్టును తీసుకుని తిరిగి ఆమె చేతికే ఇచ్చాశాడు.

“నందిని...నువ్వే ఉంచుకో! సమయం వచ్చినప్పుడు తీసుకుంటాను”

ఆ రోజు రాత్రి 10.30 కు సత్య ప్రకాష్ కు ఫోన్ వచ్చింది.

"ప్రకాష్...మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది. నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్న షర్ట్ అది...మీరెందుకు నా గిఫ్టును తీసుకోకుండా నా దగ్గరే ఉంచుకోమని చెప్పారు? ఏం నేను మీకు గిఫ్టు ఇవ్వ కూడదా?" అన్నది.

“ఒక మగాడికి ఆడది షర్ట్ గిఫ్టుగా ఇస్తోందంటే ఆమె అతనికి తల్లిగానో, చెల్లిగానో, భార్యగానో, కూతురుగానో లేక ప్రేమికురాలుగానో అయ్యుండాలి...నువ్వు ఆ షర్టును నీ భర్తకు ఇస్తేనే కరెక్టుగా ఉంటుంది" అన్నాడు.

ఆమె వైపు నుండి మౌనం మాత్రమే వచ్చింది.

నిద్ర పోవటానికి ముందు "గుడ్ నైట్! స్వీట్ డ్రీమ్స్" అని నందిని సత్య ప్రకాష్ కు మెసేజ్ పంపించింది.

ఆ తరువాత ప్రతిరోజూ 11 గంటల తరువాత అతనికి మెసేజ్ చేయటం ఆమెకు అలవాటయ్యింది.

                           ***************************************************

ఒకరోజు

నందినిని తన క్యాబిన్ కు రమ్మన్నాడు సత్య ప్రకాష్.

"నందినీ...సమయం చూసుకుని మా ఇంటికి ఒక రోజు రా! నీతో కొంచం మాట్లాడాలి"

ఆదివారం సాయంత్రం సత్య ప్రకాష్ కి ఇంటి కాలింగ్ బెల్ మోత వినబడటంతో గాబరా పుట్టింది. గుండె ధడ మొదలయ్యింది.

తలుపు తెరిచాడు.

"లోపలకు రా నందిని" అని ప్రేమగా లోపలకు ఆహ్వానించాడు. నందినిని కూర్చోమని చెప్పి వేడి వేడి కాఫీ కలుపుకు వచ్చాడు.

"నేనే కలిపిన కాఫీ ఇది! ఎలా ఉందో చెప్పు..."నవ్వుతూ అన్నాడు.

సత్య ప్రకాష్ విషం ఇచ్చినా తాగే మనోభావంలో ఉన్న నందినికి కాఫీ తాగుతున్నట్లు అనిపించలేదు.

తల వంచుకునే కూర్చున్న నందినిని జాలిగా చూశాడు.

"నందినీ! నువ్వు పంపిన ఎస్.ఎం.ఎస్ లన్నింటినీ చూశాను. నువ్వు చాలా పెద్ద కన్ ఫ్యూజన్లో ఉన్నావని అనుకుంటాను"

"ప్రకాష్! నేను చేసేది తప్పు అని నాకు తెలుస్తోంది. కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను" నందిని పెదవులు వణుకుతుంటే...ఆమె కళ్ళ నుండి ధారగా నీళ్ళు కారినై. కానీ ఆమె గట్టిగా ఏడవలేదు.

వణుకుతున్న చేతులతో హ్యాండ్ బ్యాగ్ తెరిచి, అందులో నుండి మడతపెట్టిన కాగితాన్ని తీసి అతనికి ఇచ్చింది.

"దీన్ని రాసి, ఒక నెలరోజులుగా నా దగ్గరే ఉంచుకున్నాను. నీకు ఇవ్వటానికి ధైర్యం రాలేదు" చిన్నగా చెప్పింది.

"ఏం ప్రకాష్! నేను చెడ్డ మనిషినా?" అంటూ పెద్దగా ఏడ్చింది.

“ఫస్టు ఆ ఏడుపు ఆపు. నీ మనసులో ఉన్నదేమిటో నాకు తెలుసు. నీకు మంచి భర్త దొరికాడు. ప్రేమించే పిల్లలు, సలహాలిచ్చే అత్తమామలు ఉన్నారు. నువ్వు చాలా అద్రుష్టవంతురాలివి. ఎవరికి దొరుకుతుంది చెప్పు ఇలాంటి జీవితం? నీ మనసులో ఒక సంచలనం ఏర్పడిపోయింది. ఇది చాలా మందికి ఏర్పడేదే. అందువల్ల నువ్వు చెడ్డ మనిషివని అర్ధం కాదు. నువ్వు ఇప్పుడున్నది అందమైన ఒక గాజు గూటిలో. అందులో చిన్న పగులు ఏర్పడితే జీవితమే పాడైపోతుంది నందిని”

"ఈ లెటర్ లో ఏం రాసుంటావో నేను ఊహించుకోగలను. ఎంత మూర్ఖమైన పని చేశావో తెలుసా. ఈ లెటర్ ఇంకెవరి చేతికైనా దొరికుంటే ఏమై ఉండేది?" అంటూ ఆ లెటర్ను చదవకుండానే ముక్కలు ముక్కలుగా చంచి పారాసాడు.

"ఇకమీదట నాకు ఎస్.ఎం.ఎస్. లు పంపొద్దు. నీ భర్తకు తెలిస్తే నీ జీవితమే చీకటిమయం అయిపోతుంది...కాలేజీలో చదువుకునేటప్పుడు నన్ను చూసి స్నేహపూర్వకంగా ఒక నవ్వు నవ్వుతావే...ఏదీ అలా ఒకసారి నవ్వు"

సన్నగా నవ్వింది నందిని.

"ఇప్పుడు నీ మనసు తేలిక పడుంటుందే. నీ మనసులోని కన్ ఫ్యూజన్ పోయుంటుందే" అంటూ అభిమానంగా అడుగుతున్న సత్య ప్రకాష్ ను చూసి ఉత్సాహంగా అవునన్నట్లు తలు ఊపింది.

“సరే నందిని! నువ్వు వచ్చి చాలాసేపయ్యింది. చీకటి కూడా పడింది. నువ్వు ఒక్క దానివే వెళ్ళకు...నా కార్లో దింపుతాను"

నందినని కార్లో తీసుకు వెళ్ళిన సత్య ప్రకాష్ కారును నందిని ఉంటున్న ఇంటి సంధు మొదట్లొనే ఆపాడు.

"ఇక్కడ దిగి వెళ్ళిపో"

“నందిని...ఇంకొక్క విషయం. ఇక్కడ మన బ్రాంచి సేల్స్ టార్గెట్టును కంప్లీట్ చేసాను. కలకత్తా బ్రాంచ్ వీక్ గా ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఆ బ్రాంచిని డెవలప్ చేయాలి. ఇంకో వారం రోజుల్లో బయలుదేరుతాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయవచ్చు. నేను నీకు ఎప్పటికీ ఒక పాత స్నేహితుడినే!ఓ.కే...బాయ్" అని చెప్పి బయలుదేరాడు.

కళ్ళ నుండి కారు మాయమయ్యేవరకు కారుతున్న కన్నీటిని తుడుచుకోవాలని కూడా అనిపించని నందినికి " సత్య ప్రకాష్...నిజంగానే నువొక జెంటిల్ మ్యాన్" అని అరవాలనిపించింది.

ఓపన్ గా అరవలేక...మనసులోనే అరిచింది.

                               ********************** సమాప్తం **********************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

20, ఆగస్టు 2019, మంగళవారం

మరో ప్రపంచం నుండి వచ్చిన మనిషి…(మిస్టరీ)


                          మరో ప్రపంచం నుండి వచ్చిన మనిషి…(మిస్టరీ)


ఇప్పుడిప్పుడే భూమిలాంటి మరో గ్రహం ఉన్నది అని చెబుతున్నారు.

కానీ 1954 లో జపాన్ లోని టోక్యో విమానాశ్రయంలో జరిగిన ఒక వింత సంఘటనను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే, ఇప్పుడు చెబుతున్న భూమిలాంటి మరో గ్రహం ఎప్పటి నుండో ఉండి వుండవచ్చు, అందులో మనలాంటి మానవజాతి మనుగడ కలిగి ఉండవచ్చునేమోనని చాలామంది శాస్రవేత్తలకు, మేధావులకు, ప్రజలకు అనిపిస్తోంది.


1954 సంవత్సరం జూలై నెలలో టోక్యో విమానాశ్రయంలో ఒక మనిషి దిగాడు. అతను చూడటానికి యూరప్ ఖండానికి చెందిన మనిషిలా కనిపించాడు. మన సంప్రదాయ రీతిలోనే ఉన్నాడు. కానీ విమానాశ్రయ అధికారులకు అతని మీద అనుమానం వచ్చింది.

అతని పాస్ పోర్టును తనిఖీ చేశారు. అతను ‘టౌరడ్’ అనే దేశానికి చెందినవాడని అందులో రాసుంది. అతని పాస్ పోర్ట్ వాస్తవమైన అధార స్థానం నుంచి ఇవ్వబడినట్లే ఉన్నది. కానీ అతను చెప్పిన దేశం మన ప్రపంచంలోనే లేదు.


అతన్ని విచారణకు తీసుకు వెళ్ళి అతని దేశం ఎక్కడుందో చెప్పమన్నరు. మ్యాపులో చూపించమన్నారు. అతను వెంటనే మ్యాపులోని 'ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోర్రా' అనే దేశంపై తన వేలు ఉంచి చూపించాడు(అండోర్రా: అధికారిక నామం ప్రిన్సిపాలిటీ ఆఫ్ అండోర్రా. పశ్చిమ యూరప్ లోని ఒక చిన్న భూపరివేష్టిత దేశం. ఈ దేశం, పైరెనీస్ పర్వతాలకు తూర్పున, స్పెయిన్ మరియూ ఫ్రాన్స్ దేశాలు సరిహద్దులుగా కలిగి ఉన్నది). అయితే అతనికి వెంటనే కోపం వచ్చింది. కోపంతో పాటు గందరగోళంలో పడ్డాడు. నా దేశం పేరు ‘టౌరడ్’. అండోర్రా పేరు నేనెప్పుడూ వినలేదు. అయినా నా మాతృదేశం ఎందుకు ఈ మ్యాపులో లేదు అని అడిగాడు.

అతను చెప్పినదాని ప్రకారం అతని దేశం 1000 సంవత్సరాల నుండి ఉన్నది. అతని దగ్గరున్న డబ్బు చూపించమన్నారు. పలు యూరోపియన్ దేశాల కరెన్సీ అతని దగ్గర ఉన్నది.

అతని పాస్ పోర్ట్ మీద అతను ఇంతకు ముందు చాలాసార్లు వచ్చి వెళ్ళినట్లు పలుదేశాల ముద్రలు ఉన్నాయి. టోక్యోకి వచ్చిన ముద్రలు కూడా ఉన్నాయి. తికమక పడిన అధికారులు అతన్ని ఖైదు చేసి టోక్యో నగరంలోని ఒక హోటల్లో ఉంచి, అతనికి కాపలాగా ఇద్దరు పోలీసులను ఉంచారు. అతని పూర్తి వివరాలు తెలుసుకునేంతవరకు అతన్ని అక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నారు.

అతను ఒక కంపెనీలో పనిచేస్తున్నట్టు ఆధారాలు చూపించాడు. పోలీసులు ఆ కంపెనీకి ఫోన్ చేసి విచారించారు. అటువంటి పేరుతో ఎవరూ పనిచేయడం లేదని ఆ కంపెనీ వారు తెలియజేశారు. మరి ఆ కంపెనీ ఆధారాలు అతని దగ్గర ఎలా ఉన్నాయి? అందులో అతని పేరు ఎలా వచ్చింది?

అతను ఒక హోటల్ పేరు చెప్పి అందులో తను రూము బుక్ చేసుకున్నట్టు చెప్పాడు. ఆ హోటల్ వారిని అడిగితే, ఆ పేరు మీద బుకింగ్ జరగలేదని తెలిపారు. టోక్యోకి ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు ఒక కంపెనీ పేరు చెప్పి వారితో వ్యాపారం చేయడానికి వచ్చానని చెప్పాడు. మీరు ఊహించింది కరెక్టే. ఆ కంపెనీ వారు కూడా అలాంటి మనిషి మాకు తెలియదని తల అడ్డంగా ఊపారు.


ఇక లాభం లేదని అతన్ని కోర్టుకు అప్పగించాలని అతని రూముకు వెళ్ళి తాళం తీశారు. అతను అక్కడ లేడు. మాయమయ్యాడు. పోలీసులు కాపలా ఉన్నారు. తాళాలు తీయబడలేదు. కిటికీ కుండా పారిపోయుంటాడా? అవకాశమే లేదట. కారణం, అతని రూము పలు అంతస్తులున్న హోటల్లోని రూము మరియూ ఆ రూములో బాల్కనీయే లేదు.

అంతే అతన్ని మళ్ళీ ఎవరూ చూడలేదు. ఈ విషయం ఇంకా మిస్టరీగానే ఉన్నది.

ఇది ఒక కథనా....?

ఈ విషయం The Directory of Possibilities, Colin Wilson & John Grant(Corgi Paperback,1982,ISBN:0-552-119946) అనే పుస్తకంలో రాయబడింది. ప్రభుత్వ పత్రాలు గానీ, ఆనాటి వార్తా పత్రికలలో గానీ, ఇతర ఆధారాలు లేవు. అండొర్రా అనే దేశం ఒకప్పుడు ఉండేది. పశ్చిమ దేశాల కూటమి ఆ దేశాన్ని ఆక్రమించింది. అండొర్రాలో ఎప్పుడూ రాజకీయ మార్పులు మరియు అంతర్ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏ దేశమైనా ఇతన్ని గూఢచారిగా పంపించి ఉండవచ్చు. అందుకే జపాన్ ప్రభుత్వం అతని గురించిన వివరాలనూ మరియూ అలాంటి విషయం జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేకుండా చూసుకున్నదని కొంత మంది...కాదు అతను కచ్చితంగా అక్షరేఖకు అవతల పక్క ఉన్న ప్రపంచం నుండి వచ్చి ఉంటాడని మరికొందరు చెబుతున్నారు.



ఏది నిజమే తెలియదు కనుక ఈ విషయం అతిపెద్ద మిస్టరీగా ఉంటోంది/ఉండిపోయింది.

***********************************సమాప్తం**************************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

18, ఆగస్టు 2019, ఆదివారం

మొదటి పర్యావరణ అనూకూల స్కైస్క్రేపర్..(ఆసక్తి)

                                మొదటి పర్యావరణ అనూకూల స్కైస్క్రేపర్

పర్యావరణ విధ్వంసం దాదాపు అందరికీ తెలిసిన విషయం.పర్యావరణ పరిరక్షణ ప్రపంచ సమస్యగా తయారై కూర్చుంది. పర్యావరణ సమస్యలు పర్యావరణాన్ని పరాయి ఆవరణంగా భావించడం వల్లనే బహుముఖ సమస్యగా మారింది. నింగి, నేల, నీరు అన్నిటిపైనా కాలుష్యం తన ప్రతాపం చూపుతోంది. కాలుష్యాన్ని దేశ అభివృద్ధికి చెల్లిస్తున్న మూల్యంగా కొందరు అభివర్ణిస్తున్నారు.


పారిశ్రామికీకరణ ద్వారా ఎంతో విలువైన ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లడమే కాకుండా, వ్యర్ధ పదార్ధాలు విడుదల వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. గాలి, నీరు, నేల పర్యావరణానికి, వృక్షాలు, జంతువులు తదితర జీవరాశులు జీవ్యావరణానికి సంబంధించినవి. ఇవి పరస్పర ఆశ్రితాలు. జీవ్యావరణం మనుగడ పరిశుభ్రమైన పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. అయినా, మనిషి పర్యావరణానికి చేస్తున్న హాని అపారం.


ఇది తెలుసుకున్న మానవ జాతి, జాతి సంరక్షణకు ముఖ్యత్వం ఇస్తోంది. దీని కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎన్నో ప్రణాళికలు సిద్దం చేశాయి. పర్యావరణ విధ్వంసానికి కారణమైన వాటినే పర్యావరణ సంరక్షణకు అనుకూలంగా ఉండేటట్లు చేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రణాళికలో తయారుచేయబడే అన్ని ఉత్పత్తులూ పర్యావరణ అనుకూల ఉత్పత్తులుగా ఉండాలని, తొలుతు భవన నిర్మాణాలు పర్యావరణ సంరక్షణకు అనుకూలంగా ఉండేటట్లు నిర్మించాలని అన్ని దేశాలు నిర్ణయించుకున్నాయి. అందులో భాగమే గ్రీన్ ఎనర్జీ.(గాలి నుండి మరియు సూర్యరశ్మి నుండి ఉత్పత్తి చేసే కరెంటు...అంటే భవనాలు, ముఖ్యంగా స్కైస్క్రేపర్స్ తమ భవనానికి కావల్సిన కరెంటును భవనమే ఉత్పత్తి చేసుకోవాలి. భవనం కట్టడానికి కాంక్రీట్ వాడుతారు గనుక, ఆ కాంక్రీట్ నుండి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి భవనానికి కావలసిన చల్లదనం భవన నిర్మాణంలోనే అమర్చుకోవాలి).


చాలా భవనాలు పర్యావరణ అనుకూలం...గ్రీన్ ఎనర్జీ ఫ్రెండ్లీగానే కట్టేమని/కడుతున్నామని భవన నిర్మాణవేత్తలు ప్రకటనలు చేస్తున్నా, చైనా దేశం లోని, గువాన్ జువా నగరంలోని 71 అంతస్తులు కలిగిన ముత్యాల నది టవర్(Pearl River Tower), ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత పర్యావరణ అనుకూల భవనంగా ప్రపంచ భవన నిర్మాణ వేత్తల(Architects) ప్రకటించారు. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన భవన నిర్మాణ వేత్తలు స్కిడ్ మోర్, ఓవింగ్స్ అండ్ మెరిల్ అనే సంస్థ ఈ టవర్ను డిజైన్ చేస్తూ, ఈ టవర్ను పూర్తి పర్యావరణ అనుకూల భవనంగా నిర్మించడానికి డిజైన్ చేశారు. అంటే ఈ భవనం నుండి పర్యావరణ కాలుష్యానికి దారితీసే వ్యర్ధ పదార్ధాలు రాకూడదని, పూర్తి గ్రీన్ ఎనర్జీ ఫ్రెండ్లీగా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఈ భవన నిర్మాణవేత్తల అసలు ఐడియా ఏమిటంటే ఈ భవనం మూలంగా తయారయ్యే గ్రీన్ ఎనర్జీ, భవనానికి పోనూ మిగిలిపోయే గ్రీన్ ఎనర్జీని అక్కడి కరెంటు ఉత్పత్తిదారులకు అందివ్వాలని అనుకున్నారు. కానీ వారి కలలు పూర్తికాకుండానే ఉండిపోయింది. దీనికి కారణం అక్కడి ప్రభుత్వం. ప్రైవేటుగా తయారుచేయబడ్డ కరెంటును ప్రభుత్వానికి అమ్మకూడదు. అందువలన కరెంటు ఉత్పత్తికి భవనంలో అమర్చవలసిన టర్బైన్ల సంఖ్యను భవన నిర్మాణవేత్తలు తగ్గించారు. భవనం వరకు వారు వేసిన సంఖ్య తప్పు అవడంతో పూర్తిచేయబడ్డ ఈ భవనం బయటి కరెంటును వాడుకోవలసి వస్తోంది.కానీ అది మిగిలిన ఇలాంటి నిర్మాణ భవనాల కంటే 60 శాతం తక్కువగానే వాడుతోంది.


ఈ ముత్యాల నది టవర్ మామూలు కరెంటును వాడకుండా ఉండాలని, భవనానికి కావలసిన కరెంటును భవనమే ఉత్పత్తిచేసుకోవాలని, 309 మీటర్ల(1016 ఆడుగులు)ఎత్తుకు, మలచిన పెద్ద ముఖాలను అమర్చారు.(ఈ ముఖాలను మీరు ఫోటోలో చూడవచ్చు). బయట నుండి భవనంలోకి వచ్చే గాలి అందులో( ఆ ముఖాలలో) నుండి 4 ద్వారముల ద్వారా భవనములో అమర్చబడ్డ యాంత్రీక అంతస్తులకు వెళ్ళి అక్కడి నుండి భవన నిర్మాణం ద్వారా భవనములో అమర్చబడ్డ టర్బైన్లకు చేరి అక్కడ కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ భవన మొత్తానికీ కరెంటు అందిస్తుంది. అంతేకాక ద్వారముల గుండా వచ్చే గాలి భవన నిర్మాణంలో అమర్చిన రెండు వెలుపలి పొరలలో తిరుగుతూ భవనాన్ని చల్లగా ఉంచుతుంది. అంతే కాకుండా భవన మొత్తం వెలుపలి భాగంలో అతిపెద్ద సౌర ఫలకాలను అమర్చారు. దీనిని నుండి సూర్యరశ్మి మూలంగా కూడా కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ సౌర ఫలకాలు ఫోటో వోల్వోటిక్ బ్యాటరీలు కలిగి ఉండటం వలన సూర్యరశ్మి వేడిని బద్రపరుచుకుని, రాత్రి పూట మరియూ సూర్యరశ్మి లేనప్పుడూ కరెంటు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.


2006లో భవన నిర్మాణం మొదలై 2011లో పూర్తి అయ్యింది. చైనా దేశం తీసుకున్న వాగ్ధానం (2020 లోపు కాలుష్యానికి ముఖ్య కారణమైన కార్బండ యాక్సైడ్ ను 45 శాతం వరకు తగ్గిస్తామని) అమలులో పెడుతున్నారని నిరూపించుకోవడానికి ఈ భవన నిర్మాణం ఒక ముఖ్య సంకేతం.

************************************END***********************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

16, ఆగస్టు 2019, శుక్రవారం

ఆకాశం నుండి విచిత్రమైన శబ్ధాలు...(మిస్టరీ)


                                      ఆకాశం నుండి విచిత్రమైన శబ్ధాలు



దేవతలు వాయుస్తున్న గాలి వాద్యం?

ఈ సంవత్సరం, అంటే 2019 జనవరిలో అనేక దేశాలలోని ప్రజలు ఆకాశం నుండి విచిత్రమైన, చెవులు చిల్లులు పడే గాలి వాద్యం (Trumpet) శబ్ధాలు విన్నామని చెప్పటంతో తిరిగి ఈ విచిత్రమైన శబ్ధాల గురించిన చర్చ మొదలయ్యింది.

అనేక దేశాలలోని ప్రజలు ఆకాశం నుండి విచిత్రమైన, చెవులు చిల్లులు పడే గాలి వాద్యం (Trumpet) శబ్ధాలు విన్నామని/వింటున్నామని ప్రభుత్వాలకు చెబుతున్నారు. వాద్య బృందంలొ వందమందికి పైగా ట్రంపెట్ ను ఒకేసారి వాయిస్తే ఎంత శబ్ధం వస్తుందో అంత శబ్ధం వినబడుతోందని ప్రజలు తెలియజేశారు. ఆ వాద్య శబ్ధం ఎక్కడి నుండి వస్తోందో తెలుసుకుని తమకు వివరించాలని, తమ భయం పోగొట్టాలని, తాము భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోతున్నారు.


"ఒక దశాబ్ధ కాలానికి పైగా వినబడుతున్న ఈ శబ్ధాన్ని గురించి ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవటం లేదు" అని డైలీ మైల్ పత్రిక ప్రపంచ ప్రభుత్వాలను ప్రశ్నిస్తోంది. ఈ విచిత్ర సంఘటన మొదటిసారిగా 2008లో బెలారస్ దేశంలో వినబడినట్లు, దానిని రికార్డు చేసి ‘యూ ట్యూబ్’ లో ఉంచాడు ఒక వ్యక్తి. కానీ దానిని మోసపూరితమైనదిగా వివరిస్తూ ప్రభుత్వాలు కొట్టిపారేశాయి.

అదే సంవత్సరం అమెరికా దేశంలోని ఒక వ్యక్తి అదే వాద్య శబ్ధాన్ని తానూ విన్నట్లు పత్రికలకు తెలుపుతూ బెలారస్ లో వినిపించిందని చెబుతున్నది మోసపూరితం కాదు అని తెలిపాడు.ఆ తరువాత జర్మనీ, కెనడా, రష్యా దేశాలలోని ప్రజలు కూడా అదే శబ్ధం విన్నట్లు తెలిపారు. 2011లో రష్యా, 2012లో అమెరికా, కెనడా, 2013లో ఇంగ్లాండ్ దేశాలలొ ఈ వాద్య శబ్ధం విన్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు.

జర్మనీలో శబ్ధం ఏర్పడినప్పుడు రికార్దు అయిన తరంగాల గ్రాఫ్.

జూన్-2013లో కెనడాలో ఈ వాద్య శబ్ధాన్ని విన్న Kimberly Wookey అనే ఒక మహిళ, శబ్ధం వినబడగానే రికార్డింగ్ చేయడం మొదలుపెట్టి, ఆ వాద్య శబ్ధం వినబడుతున్నప్పుడల్లా రికార్డు చేస్తూ, అదే సంవత్సరం మే నెల 7 వ తారీఖున విన్న ఒక విచిత్ర శబ్ధాన్ని కూడా రికార్డు చేసి ‘యూ ట్యూబు’లో ఉంచుతూ ప్రభుత్వానికి కూడా ఒక కాపీ అందించింది.

Kimberly Wookey మరియు Aaron Traylor అనే ఇరువురు పంపిన రికార్డింగ్స్ విని శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ఆదేశాలతో తమ పరిశొధనలు మొదలు పెట్టారు. వారి పరిశోధనలు ఎటువంటి వివరణ ఇవ్వలేకపోయాయి.


2012లో టెక్సాస్ నగరంలో చాలామంది ప్రజలు ఈ శబ్ధం విన్నారు. ఆకాశం వైపు చూశారు. భయంతో బిగుసుకుపోయారు.

ఓక్లహామా విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాస్త్రవేత్త David Deming ఈ శబ్ధం గురించి తన పరిశోధనలలో, తన పుస్తకాలలో ఎప్పటి నుంచో రాస్తూనే ఉన్నారు. 'ఒక మర్మమైన, కనుగొన సాధ్యం కాని ఒక వాద్య శబ్ధాన్ని ప్రపంచ జనాభాలో 2 నుండి 10 శాతం మంది వింటున్నారు. ఈ శబ్ధాలు బహుశ టెలిఫోన్ ట్రాన్స్ మిషెన్ వలన గానీ లేక అమెరికా నౌకాదళం తమ జలాంతర్గామి ట్రాన్స్ మిషన్ కోసం ఏర్పరుస్తున్న శబ్ధం అయ్యుండొచ్చు" అని ఆయన రాశారు.

కెనడా దేశంలో శబ్ధం ఏర్పడినప్పుడు రికార్దు అయిన తరంగాల గ్రాఫ్.

అమెరికా ప్రభుత్వం “ఆ శబ్ధం మా నౌకాదళానికి సంబంధించిది కాదు. అయినా అదే శబ్ధం ప్రపంచంలోని పలుచోట్ల వినబడుతున్నది. కానీ ఆ శబ్ధాలు రేడియో సిగ్నల్స్ కు సంబంధించినవి కూడా కాదు" అని తెలుపుతూ నాసా శాస్త్రవేత్తలను ఈ శబ్ధం గురించి పరిశోధించమన్నది.

"భూమికి సహజ రేడియో ప్రసరణలు చేసే ప్రక్రియ ఉన్నది. చెవులకు బదులు, మనుష్యుల చెవుల దగ్గర ఆంటెనాలుంటే భూ గ్రహం చేసే విశేషమైన సమన్వయ శబ్ధాలను వినవచ్చు. వీటినే మేము సర్ధుబాట్లు, ఈలలు, గొళాకార శబ్ధ వలయాలు అంటాము" అని శాస్త్రవేత్తలు వివరణ అందించారు. భూమి ఎప్పుడూ శబ్ధతరంగాలను ప్రసరిస్తూనే ఉంటుంది. మనమే వాటిని గ్రహించలేము. ఉదాహరణకు పిడుగులు తీసుకోండి. అవి ఎంత శబ్ధాన్ని ప్రసరిస్తాయో మీకందరికీ తెలుసు కదా. అలాగే భూమి కూడా శబ్ధ తరంగాలను ప్రసరిస్తూనే ఉంటుంది.

భూకంపాలు, అంటే భూమి క్రింద ఉండే టెక్టానిక్ ప్లేట్లు జరుగుతున్నప్పుడు ఇల్లాంటి శబ్ధమే వస్తుంది. అప్పుడు భూకంపాలు ఏర్పడతాయని అర్ధం కాదు. భూమి తాను కూర్చునే సీటును(ప్లేటును) సర్దుకుంటున్నది అని అర్ధం. అగ్నిపర్వతాలలో జరుగుతున్న ప్రక్రియ, తుఫానలు తీరం దాటు తున్నప్పుడు గాలి శబ్ధం...ఇవన్నీ భూమిలోని సహజ రేడియో ప్రసరణలు" అని Southern Methodist University in Dallas కు చెందిన భూకంప శాస్త్రవేత్త Brian W Stump తెలిపారు.


"ఇవేవీ నమ్మేటట్లు లేవు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాటి గురించి ప్రజలకు ముందే చెప్ప వచ్చుగా. ఎవరూ భయపడకుండా ఉండేవారు కదా. శబ్ధాలను రికార్డు చేసి, వీడియోలు తీసి ప్రభుత్వాలకు తెలిపిన తరువాత, తమ పరిశోధనలను మొదలు పెట్టారు. అందులోనూ 2013 నుండే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని పరిశోధనలు జరిపారు. అప్పుడే ఫలితాలు దొరికిపోయాయా? ఈ వాద్య శబ్ధం 2008 నుండి ప్రపంచంలోని పలుచోట్ల వినబడింది. ఎందుకు అప్పుడే దీని గురించిన పరిశోధనలు మొదలుపెట్ట లేదు? ప్రభుత్వాలు ఇస్తున్న సమాధానాలు అమోదయోగ్యమైనవిగా లేవు" అంటూ పలు చోట్ల ప్రజలు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు సరిగా వివరించలేని ఈ వాద్య శబ్ధం గురించిన అనుమానం ప్రజలలో ఒక మిస్టరీగానే ఉంటోంది. ఈ శబ్ధాలను వినాలంటే యూట్యూబ్ లో Strange Sounds in Sky అని సెర్చ్ చేస్తే ఈ మిస్టరీకి కావలసిన బోలెడు వీడియోలు మీరు చూడవచ్చు.

  ************************************ సమాప్తం*********************************
N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

14, ఆగస్టు 2019, బుధవారం

మాటే మంత్రము(కథ)

                                                 మాటే మంత్రము(కథ)

సరొజ చెంప చెల్లు మన్నది...!

మంచి నీళ్ళు తీసుకురావటానికని బిందె తీసుకుని సరొజ బయలుదేరుతున్నప్పుడు ఆమె చెంప మీద కొట్టాడు చలపతి.

ఎదురు చూడని ఆ చెంప దెబ్బ వలన సరొజ బుగ్గలు, చెవులు కందిపోయినై. కళ్ళల్లో నుండి బొటబొటా కన్నీరు దొర్లింది.

"నీకు నేను ఎన్ని సార్లు చెప్పాను! మంచి నీళ్ళు తీసుకురావటానికి నువ్వు వెళ్ళద్దు అని. నేను వెల్తాను అంటే వినవేమిటి?”

చెంపను రుద్దు కుంటూ చిరాకు పడింది సరొజ.

"నువ్వు కాలుజారి క్రింద పడితే....కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అయితే...?"

అతను సరొజ దగ్గరున్న బిందెను లాక్కుని నడిచాడు.

అప్పుడు సరొజ ఎనిమిది నెలల గర్భిణి.

'ఈయనకు నేనంటే ముఖ్యం కాదు. ఏప్పుడు చూడు బిడ్డ...బిడ్డ... బిడ్డ...! గర్భం దాల్చిన దగ్గర నుండి ఒకటే దబాయింపు ఆదేశాలు. ఇది చెయ్యకు, అది చెయ్యకు, అలా నడవకు, ఇలా నడవకు, ఇలా పడుకోకు, అలా పడుకోకు ! అని ఆదేశాలు. అన్నిటికీ కారణం కడుపులో ఉన్న ఈ బిడ్డే'

తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద తనకే ఎరుగని విరక్తి కలిగింది సరొజకు.

చలపతికి పిల్లలంటే ప్రాణం. చుట్టు పక్కలున్న పిల్లలను ఇంటికి రప్పించుకుని వాళ్లతో ఆటలూ, పాటలూ, కబుర్లతోపాటూ లాలింపులు. చాక్లెట్లు, బిస్కెట్లు అని తినడానికి చాలా ఇస్తాడు.

"పిల్లల మీద ఎంత ప్రాణంగానైనా ఉండనీ! అందుకని ఎప్పుడు చూడు బిడ్డా...బిడ్డా అని నామ స్మరణం చేస్తూ ఉండాలా. నాకు మాత్రం కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమలేదా? ‘పనులు చేస్తూ ఉంటే సుఖ ప్రశవం అవుతుందని’ డాక్టరమ్మ చెప్పిందే. అది కూడా ఆయనకు గుర్తు లేదా?"

గర్భం దాల్చటానికి ముందు వరకు తన మీద చాలా ప్రేమగా ఉండేవారు ఆయన. ప్రతి పనికి సరొజ, సరొజ అంటూ నా చుట్టూ తిరిగేవారు.. కానీ ఇప్పుడు బిడ్డ స్మరణం తప్ప ఇంకో ధ్యాసే లేదు. అన్ని విషయాలలలొనూ మారిపోయారు! సరొజకు ఈర్ష్యగా కూడా ఉంది.

“బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడే ఇలా అంటే....బిడ్డ పుట్టిన తరువాత మనల్ని వద్దని దూరంగా ఉంచుతారేమో?"

సరొజకు భయం పట్టుకుంది.

ఆసుపత్రి!

సరొజ, ప్రశవ నొప్పులతో గిలగిలా కొట్టుకుంటోంది. ఆమె వేస్తున్న కేకలు, అరుపులు బయట నిలబడ్డ చలపతిని టెన్షన్ పెట్టింది...!

“దేవుడా! బిడ్డకు ఏ ఆపద లేకుండా ప్రశవం జరగాలి".....మనసులోనే దేవుడ్ని ప్రార్ధించుకున్నాడు.

అప్పుడు డాక్టర్ బయటకు వచ్చి చలపతిని పిలిచేడు.

“మిస్టర్ చలపతి! ఒక్క నిమిషం ఇలా వస్తారా"

"ఏమిటి డాక్టర్?"

"ప్రశవం చిక్కుముడిలాగా అయిపోయింది. మీ భార్య ప్రశవ నొప్పులతో గిలగిలా కొట్టుకుంటోంది. పెద్ద ఆపరేషన్ చేసే బిడ్డను తీయాలి. అయితే ఒకటి! మీ భార్య లేక బిడ్డ…. ఇద్దరిలో ఎవరో ఒకరినే కాపాడగలం అనే పరిస్థితిలో మేమున్నాము"

చలపతి షాక్ కు గురి అయ్యాడు.

"డాక్టర్!"

“మీ భార్య ఈ పరిస్థితికి బాధ పడుతున్నాం. ఎవర్ని మేము కాపాడాలో మీరు త్వరగా ఒక నిర్ణయానికి వచ్చి ఇందులో ఒక సంతకం పెట్టండి”

చలపతి అదిరిపడ్డాడు.

ఒక్క నిమిషం కూడా ఆలశ్యం చేయకుండా “బిడ్డ పోయినా పరవలేదు డాక్టర్. నా భార్యను కాపాడండి. నాకు తానే ముఖ్యం" అన్నాడు.

అంత వేదనలోనూ భర్త చెప్పిన ఆ మాటలు విని సరొజ సంతోష పడింది.

ఆ సంతోషంలో గబుక్కున ప్రశవం జరిగి, ఆశ్చర్యంగా బిడ్డ బయటకు వచ్చింది......తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగా బయట పడ్డారు.

డాక్టర్లతో సహా అందరూ ఆశ్చర్యపోయారు.

అవును అదే నిజం... చలపతి “నా భార్యను కాపాడండి, ఆమే నాకు ముఖ్యం” అనే మాటే మంత్రంలాగా పనిచేసింది.

***********************************సమాప్తం**************************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

11, ఆగస్టు 2019, ఆదివారం

అంతరిక్షంలో గొడుగు!...(ఆసక్తి)

                                                  అంతరిక్షంలో గొడుగు!

ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఎండలు దంచికొట్టాయి...కొన్ని దేశాలలో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండల రికార్డు కూడా సలసల కాగిపోతోంది. గడిచిన 13 శతాబ్ధాలలోనే హైయ్యెస్టు టెంపరేచర్ రికార్డు చేసింది ఈ సంవత్సరంలోనే . 2001 నుంచి 2018 వరకు ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. వాతావర్ణంలో సంభవిస్తున్న మార్పుల మీద సైంటిస్టుల బృందం జరిపిన సర్వేలో భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి మానవుడే ముఖ్యమైన కారణమని ఈ సర్వేలో తేలింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా మంచు వేగంగా కరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2035 నాటికి హిమాలయాలలోని మంచు కరిగే శాతం 2 నుంచి 19కి పెరిగే అవకాశమున్నదట. సముద్ర మట్టాలు పెరిగి చాలా దేశాలలోని తీరప్రాంతాలు జలసమాధి అవుతాయంటున్నారు. అభివృద్ది పేరుతో మానవుడు చేస్తున్న ప్రకృతి విధ్వంశం. ఫ్యాక్టరీల కాలుష్యం, తగ్గిపోతున్న పచ్చదనం గ్లోబల్ వార్మింగుకు ప్రధాన కారణాలుగా సైంటిస్టులు చెబుతున్నారు. ప్రకృతి విధ్వంశాన్ని ఆపకపోతే ప్రపంచానికి 'ఎండ్' కార్డు తప్పదంటున్నారు సైంటిస్టులు.


"గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని ఆపలేము సరికదా, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియ కూడా అతి నెమ్మదిగానే కొనసాగుతోంది. ఎందుకంటే కంటే నిర్ధిష్టమైన సమయ వ్యవధి నిర్ణయించలేము. కారణం పర్యావరణ సమతుల్యాన్ని తిరిగి నెలకొల్పటానికి ప్రపంచదేశాలన్నీ కలిసి కట్టుగా కంకణం కట్టుకుని 'గ్లోబల్ వార్మింగ్' ప్రభావాన్ని తగ్గించే పరిష్కారాలను చేపట్టాలి. అలా అన్ని దేశాలను ఒకే తీగ మీద నడపడం చాలా కష్టం. కాబట్టి 'గ్లోబల్ వార్మింగ్' తగ్గించడానికి వేరే పద్దతి వెతుక్కోవాలి. లేకపోతే భూమికి గణనీయ స్థాయిలో ముప్పు పెరగవచ్చు"---ఇది వాతావరణ శాత్రవేత్తల హెచ్చరిక.


వాతావరణానికి మానవులు చేస్తున్న హానిని ఆపలేమని తెలుసుకున్న వాతావరణ శాస్త్రవేత్తలు ఆధునిక సాంకేతికతలు ఉపయోగించి ఎన్నో పరిష్కారాలపై అధ్యయనాలు చేశారు.కొన్ని రసాయనాలను అంతరిక్షంలో జల్లటం, అత్యంత శక్తివంతమైన బాంబను ( హీరొషీమా-నాగసాకీలపై వేసిన బాంబు కంటే 2 లక్షల రెట్లు అధిక శక్తి కలిగిన) సముద్రంలో పేల్చి భూమిని సూర్యునికి కొంత దూరంగా జరపటం లాంటి ఆలొచనలను శాస్త్రవేత్తలు ప్రభుత్వాల ముందు ఉంచారు. కానీ, ఇవి రెండూ చేయలేమని తేల్చి చెప్పటంతో వేరే పరిష్కారాలపై పరిశోధనలను కొనసాగించారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఎన్నో జియో ఇంజనీరింగ్ పరిష్కారాలపై దీర్ఘాలొచనలు చేస్తున్నారు.


తాజాగా 'అంతరిక్షంలో గొడుగు’ పేరుతో శాస్త్రవేత్తలు ఒక కొత్త టెక్నాలజీని బయటపెట్టారు. ఈ టెక్నాలజీ 'గ్లోబల్ వార్మింగ్' ప్రభావాన్ని తగ్గించడంలో చాలావరకు విజయవంతం అవుతుందని శాస్త్రవేత్తలు బల్ల గుద్ది చెబుతున్నారు. ఈ ఐడియా బాగానే ఉన్నదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ శాస్త్రవేత్తలు దీనికి ఓకే చెప్పారు. "అంతరిక్షంలో గొడుగు" అంటే?...అంతరిక్షంలో గొడుగును ఉంచితే అది సూర్యరస్మిని భూగొలం మీద డైరక్టుగా పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు ప్రపంచ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. భూమి చల్లబడుతుంది. తద్వారా వాతావర్ణ సమతుల్యం ఏర్పడుతుంది.


ఈ గొడుగు ఐడియాని 1989 లోనే జేమ్స్ అనే ఒక ఇంజనీర్ ప్రవేశపెట్టాడు. గొడుగు ఆకారంలో 2000 కిలోమీటర్లు విశ్తృత గాజు కవచం నిర్మించాలి. అంత బ్రహ్మాండమైన, భారీ గొడుగును చంద్రమండలం పైన మాత్రమే నిర్మించవచ్చు. అక్కడికి వెళ్ళి నిర్మించాలి. అది కుదరదు. భూమి మీద నిర్మాణం చేసి చంద్ర గ్రహానికి తీసుకు వెళ్ళాలి. ఇది కూడా సాధ్యపడే పని కాదు. అంత భారీ గొడుగును చంద్రమండలానికి తీసుకు వెళ్లటం చాలా కష్టం...అందులోనూ 1972 తరువాత చంద్రమండలానికి ర్యాకెట్లను పంపటం ఆపేశారు.



ఎప్పుడైతే భారీ అద్దాల గొడుగును నిర్మించలేమని నిర్ణయించుకున్నారో కొత్త సూచనగా చంద్రుని మేఘాల ధూళి, మరియూ 55,000 వైర్ మెష్ అద్దాలతో చంద్రుని చుట్టూ గుండ్రని ఆకారంలో చిన్న చిన్న గొడుగులను నిర్మించవచ్చు అనే ఐడియా ఇచ్చారు. వీటిని కూడా చంద్ర మండాలానికి వెళ్ళే ప్రతిపాదన లేనే లేదని అగ్ర రాజ్యాలు తేల్చి చెప్పినై….ఆ తరువాతే భూమిని 'ఇప్పుడున్న చోటు నుండి జరిపితే!' అన్న ఐడియా వచ్చింది. కానీ దానికి 5 వేల మిల్లియన్ మిల్లియన్ల ఉంటే గానీ భూమిని జరుపలేమని, దానికి అయ్యే ఖర్చును తట్టుకోలేమని తెలియజేయడంతో ఈ సూచనను రద్దు చేసుకున్నారు.



చివరిగా శాస్త్రవేత్తలు ఒక ఆలొచన ముందు పెట్టారు. అదే అంతరిక్షంలో గొడుగు. ఒక గ్రాము బరువు మాత్రమే ఉండి ఎగరగలిగే 16 ట్రిల్లియన్ల అంతరిక్ష రోబోట్లను, చిన్న చిన్న రంధ్రాల మూలం పారదర్శక ఫిల్మ్ పొరతో ఒకటి చేసి, వాటిని ఒకటిగా(చిన్నగొడుగుగా మడిచి) అంతరిక్షంలోకి పంపి, అక్కడ గొడుగును విడదీసి, భూమి నుండి కంప్యూటర్స్ ఎలెక్ట్రానిక్స్ పరికరంతో ఆ గొడుగును మనకు కావలసినట్లు జరుపుకోవచ్చు.

ఈ ఆలొచనను అగ్రరాజ్య అంతరిక్ష పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు అంగీకరించారు. పరిశోధనలు మొదలైనై. అంతరిక్ష గొడుగు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో ఈ అంతరిక్ష గొడుగు ఆలొచన నిజ రూపం దాల్చి విజయవంతం చేయగలిగితే మానవ సముదాయానికి ఎంతో మేలు జరుగుతుంది. మానవులు గ్లోబల్ వార్మింగ్ వలన పడుతున్న కష్టాల భారి నుండి తప్పించుకోవచ్చు.

అంతరిక్ష గొడుగు ఆలొచన నిజ రూపం దాల్చి విజయవంతం కావాలని కోరుకుందాం.
*************************************END****************************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

10, ఆగస్టు 2019, శనివారం

చీటింగ్ పోలీస్...(పూర్తి నవల)

                                                చీటింగ్ పోలీస్...(పూర్తి నవల)

పూర్తి నవలను ఒకే సారి చదవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF లో చదవండి:

 https://drive.google.com/file/d/1W7qIt8D0hVTAt-CLkhOD1PdARIl0mWM_/view?usp=sharing

ఒకేసారి పూర్తిగా చదవలేకపోతే ఇదే బ్లాగులో అధ్యాయాలుగా విభజింప బడ్డాయి . చదివి మీ అభిప్రాయాలను తెలుపండి.

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

8, ఆగస్టు 2019, గురువారం

'రింగింగ్' రాళ్ళు!.......(ఆసక్తి)

                                                  

                                                         'రింగింగ్' రాళ్ళు                                                

సంగీతం విశ్వమంతా వ్యాపించి వున్నది. ప్రకృతిలో సంగీతం మిళితమై జీవన గమనంలో భాగమైపోయింది. మానవ వ్యవస్థను శబ్ధంతో ప్రభావితం చేయడం ప్రకృతి లక్షణం. సంగీతం, శబ్ధం ఆధారంగా ఉంటుంది. సంగీతం, భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. శభ్దం దైవంతో సమానం. ఎందుకంటే, ఉనికికి ఆధారం ప్రకంపనలో ఉంది. అదే శబ్ధం. దీనిని ప్రతి మానవుడు అనుభవించగలడు.

సంగీతం వల్ల వ్యాధులు త్వరగా నయమవుతాయని, పశువులు పాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాయని, పంటలు ఎక్కువగా పండుతాయని ఆధునికి పరిశోధకుల భావన. సంగీత రసాన్ని శిశువులు, పశువులతో పాటూ పాములు కూడా విని ఆనందిస్తాయని మనందరికీ తెలుసు.

ప్రకృతి అందించిన అలాంటి సంగీతం(శబ్ధం) గురించే ఇక్కడ తెలుసుకోబోతున్నాము.

సంగీతం కేవలం వినోదానికే కాకుండా వికాసానికి కూడా ఒక అవకాశంగా ఎలా మలుచుకోవచ్చో బహుశ ఇలాంటి మిస్టరీ చోట్ల నుండే తెలుసుకున్నారేమో.

ఒక రాతి మీద కొడితే మనకు వినబడే శబ్ధం మందమైన 'దబ్' లేక ‘పగులు’ గానో ఉంటుంది గానీ కచ్చితంగా చెవికి ఇంపుగా ఉండే 'రింగింగ్' శబ్ధం మాత్రం రాదు. కానీ చెవులకు ఇంపుగా ఉండే శబ్ధం అందించే రాళ్ళు ఉన్నాయంటే మీకు ఏమనిపిస్తోంది?..... ఆశ్చర్యంగా ఉంది కదూ!


128 ఎకరాల బండరాళ్ళ స్థలం మధ్యలో 7-8 ఎకరాలలో సంగీత శబ్ధాన్నిచ్చే రాళ్ళు దాగి ఉన్నాయి.

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని Rocking Rocks County Park లో దాగివున్న ఈ బండరాళ్ళను మరో రాతితోగానీ, సుత్తితోగానీ కొడితే గణగణమని లోహ ధ్వని వినబడుతుంది. శతాబ్ధాలుగా అక్కడ నివసించే స్థానికులకు ఈ రాళ్ళ గురించి తెలుసు. 1700 సంవత్సరంలో అక్కడ స్థిరపడేందుకు వచ్చిన తెల్ల జాతి మనుష్యులకు అక్కడి స్థానికులు ఈ రాళ్ళ గురించి చెప్పారు.


ఆ రాళ్ళలో నుండి వినిపించే ధ్వనిని వింటే ఆశ్చర్యపోతూ 'నిజంగా ఇవి రాళ్ళేనా?' అని ఎవరికైనా అనిపిస్తుంది. అవి నిజానికి బోలు/లోహ ధ్వనిని వినిపిస్తాయి. ఈ వింత, సైన్స్ శాస్త్రవేత్తలను, భూగర్భ శాస్త్రవేత్తలను తికమకపరచింది. ఆ రింగింగ్ రాళ్ళపై ఎన్నో పరిశోధనలు చేసారు. కానీ ఆ రాళ్ళ నుండి వస్తున్న ఇంపైన ధ్వనికి కచ్చితమైన కారణం తెలుసుకోలేకపోయారు.

1965లో పెన్సిల్వేనియాకు చెందిన భూగర్భ శాస్త్రవేత్త Richard Faas అక్కడున్న కొన్ని రాళ్ళను తన ప్రయోగశాలకు తీసుకువెళ్ళి పరిశోధనలు జరిపారు. ఒక్కొక్క రాయిని కొడుతున్నప్పుడు, ప్రతి ఒక్కొక్క రాయి తక్కువ ఫ్రీక్వెన్సీ (frequency) ధ్వనిని వినిపిస్తోంది. ఇది మానవ చెవులకు వినబడదు. నిజానికి ఆ రాళ్ళలో నుండి వినిపించే ఆ తక్కువ ఫ్రీక్వెన్సీ ధ్వని, ఆ రాళ్ళు తమకు తాము తెలుపుకుంటునే అభిప్రాయాలు. అన్ని రాళ్ళూ కలిపి తెలియపరుచుకునే అభిప్రాయాలే మనకి వినబడుతున్న ధ్వని అని ఆయన తన పరిశోధనలో తెలుసుకోగలిగాడట.


భూగర్భ శాస్త్రవేత్త Richard Faas రాళ్ళు వినిపిస్తున్న ధ్వనిని, స్వభావాన్ని గుర్తించ గలిగారు గానీ ఆ రాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటో వివరించలేకపోయారు. మామూలుగా అన్ని రాళ్ళలాగానే, అక్కడున్న రాళ్ళు కూడా అగ్నిపర్వత పధార్ధమైన డయాబస్ తో తయారై ఉన్నాయి. అంటే, ఐరన్ మరియు మరికొన్ని కఠినమైన ఖనిజాలా మిశ్రమం. కానీ ఈ రాళ్ళలోని ఖనిజాల మిశ్రమ కూర్పే ఈ రాళ్ళను మామూలు రాళ్ళ కంటే వేరుగా చూపుతోందట. రాళ్ళలో నుండి వినిపించే ధ్వని వలన మాత్రమే ఈ రాళ్ళు ప్రత్యేకత సంపాదించుకోలేదు. దానికి మరొక కారణం ఉన్నది. ఈ రాళ్ళ పొలం, కొండ క్రింద ఏర్పడలేదు. కొండపైన ఏర్పడింది. కాబట్టి ఈ రాళ్ళ పొలం, కొండ చెరియలు విరిగినందు వలన ఏర్పడలేదు. మరైతే ఆ రాళ్ళు ఎలా వచ్చాయి?


ఈ రాళ్ళ పొలంలో చాలా విచిత్రమైన విషయం ఇంకొకటుంది. ఇక్కడ వృక్షాలో, మొక్కలో పెరిగిన సూచనలు ఏమీ లేవు. అంతెందుకు, ఇక్కడ క్రిమి కీటకాలు కూడా లేవు. 10 అడుగుల లోతుకు ఉండే ఈ చోటు చుట్టూ అడవి ప్రాంతం కన్నా ఈ ప్రాంతం ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇక్కడ నివాసం ఉండటానికి వసతి లేదు. ఆహారం దొరకటానికి దారే లేదు. దిక్సూచికలు ఈ ప్రాంతంలో పనిచేయవని కొందరు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో రేడియేషన్ లేదు, అసాధారణ ఐస్కాంత శక్తి,, వింత విద్యుదయిస్కాంత శక్తి సూచనలు లేవు. కాబట్టి అతీంద్రియమైన శక్తులు ఉన్నాయనే వాదనకు తావు లేదు.



ఈ సంగీత రాళ్ళ విషయంలో మరొక మిస్టరీ ఏమిటంటే, అక్కడున్న సంగీత రాళ్ళలో ఒకదాన్ని తీసుకుని, దాన్ని మరొచోటికి తీసుకు వెళ్ళి దాని మీద కొడితే సంగీతం వినబడదు. ఈ రాళ్ళను ప్రశంసించడానికి మనకు వాటి వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకోవలసిన అవసరమేముంది. ఈ రింగింగ్ రాక్ పార్క్ ప్రపంచవ్యాప్తంగా వేలకొలది పర్యాటకులను ఆకర్షిస్తోంది. వాళ్ళందరికీ రాళ్ళను కొట్టే అవకాశం దొరకటం లేదు, కానీ, కొంతమంది ఈ రాళ్ళను సంగీతసాధన పరికరాల్లాగా ఉపయోగించుకుంటూ ఆడుకుంటున్నారు.

****************************************END**********************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)

6, ఆగస్టు 2019, మంగళవారం

చీటింగ్ పోలీస్(నవల)…END--PART-14

                               

                           చీటింగ్ పోలీస్(నవల)....చివరి భాగం

సుధా తన బుర్రను ఎంత గోకున్నా అది ఒకే సమాధానం చెప్పింది.

ఖచ్చితంగా ఏదో ద్రోహం చేశారు. లేకపోతే ఈయనకి ఇంత డబ్బు దొరికే చాన్సే లేదు.

ప్రతాప్ స్నానం ముగించుకుని తల తుడుచుకుంటూ వచ్చాడు.

"ఈరోజు టిఫెన్ చాలా రుచిగా ఉన్నట్లుందే. వాసన్ ముక్కును వదలటంలేదు"

"వెళ్ళి డ్రస్సు మార్చుకు రండి...తిందాం" కోపంగా చెప్పింది.

"ఇలా వస్తే టిఫిన్ పెట్టవా ఏమిటి?"--నవ్వుతూ అడిగాడు.

లోపలకు వెళ్ళి కొత్త డ్రస్సు వేసుకుని మెరిసిపోతూ వచ్చి డైనింగ్ టెబుల్ కు వచ్చి కూర్చున్నాడు.

ఇడ్లీలు ప్లేట్లో పెట్టింది. రుచి అనుభవిస్తూ తినడం మొదలుపెట్టాడు.

రెండో ఇడ్లీ ముక్కను నోటి దగ్గరకు తీసుకు వెడుతున్నప్పుడు అడ్డుపడింది "రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఫోన్ చేశాడు. జమీందార్ భవనాన్ని కొంటున్నట్లు తెలుస్తోంది"

పొలమారింది. పక్కనున్న గ్లాసులోని మంచి నీళ్ళను ఒకే గుక్కలో తాగాడు.

సుధా వదలలేదు.

"డెబ్బై కోట్లకు బేరం కుదిరింది. మీకు అంత డబ్బు ఎక్కడిది?"

ఆమె చూపంతా అతని మీదే ఉన్నది.

"నీదగ్గర అబద్దం చెప్పదలుచుకోలేదు. కానీ దయచేసి ఈ ఒక్క విషయాన్ని మాత్రం చూసి చూడనట్లు ఉండిపో"

"లేదు...నాకు తెలిసే కావాలి. మీరు ఇంతకు ముందులాగా ఏదో పెద్ద తప్పు చేస్తున్నారని అనుకుంటా. మీ బ్యాంక్ అకౌంట్ చూశాను. దాంట్లో తొంబై ఎనిమిది కోట్లు నాలుగు రోజులలో డెపాజిట్ చేయబడింది."

"ఇది ఎవరినీ మోసం చేసి సంపాదించింది కాదు. మోసం చేసి సంపాదించినదైతే బ్యాంకు ఖాతాలో జమ అవుతుందా?”

"అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. నా ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి. మీకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?"

"చెప్తాను. నా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయబడ్డ కోట్ల కొలది రూపాయలు మనదేశం నాకు బహుమతిగా రెండుకోట్లు ఇచ్చినట్లే ఆ ముఠా నాయకుడిని ప్రాణాలతో పట్టిచ్చినా, చంపేసినా వివిధ దేశాలు బహుమతలు ప్రకటించి ఉంచాయి. ఆ ముఠా నాయకుడిని చంపిన నన్ను మన ప్రభుత్వ సీక్రెట్ సర్వీస్ సంస్థ మూలం తెలుసుకుని, వాళ్ళు ప్రకటించిన బహుమతి డబ్బును నాకు పంపించారు. ఈ డబ్బు మొత్తానికీ నాకు పన్ను మినహాయింపు ఇచ్చింది మన ప్రభుత్వం. ఎందుకంటే ఈ డబ్బు మొత్తాన్నీ నేను నా జమీందారి భవనం కొనుక్కుని, దాన్నీ అనాధ శరణాలయంగా ఏర్పాటు చేసి సుమారు వెయ్యి మంది పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయబోతాను. అందులో సహాయపడటానికి ప్రమోద్, ఆ ముఠా నాయకుడి వలలో చిక్కుకుని బయటపడ్డ మరో ముగ్గురు నాతో ఉంటారు…..” అంటూ మాటను సాగదీస్తూండగా.

డి.జి.పి.,కమీషనర్, వీళ్ళ తరువాత ముఠా నాయకుడి వలలో చిక్కుకుని బయటపడ్డ ముగ్గురు, బాంబు పేలుడ్లో చనిపోయాడని చెప్పిన ప్రమోద్ వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చున్నారు.

జరుగుతున్నది కలా లేక నిజమా అనేది తెలియక తికమక పడుతున్నది సుధా.

"మీరు 'డబుల్ గేం' ఆడేరు ప్రతాప్….. ప్రమోద్ ని, ఈ ముగ్గురు నేరస్తులనూ చట్టం కళ్ళకు చనిపోయినట్లు చూపించి...ప్రాణాలతో వదిలేసి, ఇప్పుడు మీ కోసం వాళ్ళను వాడుకుంటున్నారు.

మీకు ఇచ్చిన బహుమతి డబ్బును వాళ్ల కుటుంబాలకు మీరు ఇచ్చేసినప్పుడు మిమ్మల్ని గొప్ప వ్యక్తి అనుకున్నాను. కానీ మీరిప్పుడు చేసింది దేశ ద్రోహం. వీళ్ళతో పాటూ మిమ్మల్ని కూడా ఖైదు చెయ్యబోతాను" " చెప్పాడు డి.జి.పి.

“నా వరకు నేను న్యాయంగానే ఉన్నాను డి.జి.పి సార్. ఆ తీవ్రవాద సంస్థ వలన ఇప్పటివరకు మనదేశానికి ఏర్పడిన నష్టం ఐదువందల నలబై కోట్లు. ఆ సంస్థను కనుక్కోవటానికి మీరు ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్వాడ్ ఖర్చు ముప్పై కోట్లు. ఆ సంస్థ ఇంకా ఉండుంటే మనదేశానికి పలుకోట్లు నష్టం వచ్చుండేది.

కానీ వీళ్ళ వలన మనకి, దేశానికీ ఎంత లాభమో చూడండి. ఒక్క పైసా ఆదాయం ఎదురు చూడ కుండా. వాళ్ళ ప్రాణాలను లెక్క చేయక ఆ సంస్థ ముఠాను పట్టుకొవటానికి వీళ్ళందరూ సహాయపడ్డారు. అందువలన వీళ్ళను నేరస్తులుగా పరిగణించకుండా వదిలేసింది మన ప్రభుత్వం... ఇదిగోండి దానికి సంబంధించిన లెటర్" అంటూ ఒక భారత ప్రభుత్వ లేకను డి.జి.పి.కి చూపించాడు ప్రతాప్.

"ఈ విషయాన్నీ మీరు అప్పుడే చెప్పుంటే మాకు ఎంతో శ్రమ తప్పేది ప్రతాప్"

"చెప్పకూడదని కాదు సార్...కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వలన చెప్పలేదు"

"నేను ఒక స్టేట్ డి.జి.పి ని. నా రాష్ట్రంలోనే ఆ తివ్రవాద సంస్థను ఎలిమినేట్ చేశారు. నా దగ్గరే సెక్యూరిటీ రీజనా?"

"సార్...మీ టీం అక్కడికి రాక ముందే భారత ప్రభుత్వ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అక్కడికి వచ్చారు. వీళ్ళ ముగ్గురునీ రౌండ్ అప్ చేసి వాళ్ళతో పాటూ తీసుకు వెళ్ళారు. రెండు రోజుల తరువాత నన్ను కాంటాక్ట్ చేసి విషయాలన్నీ తీసుకున్నారు...మేము ఏ విషయమూ ఎవరితోనూ చెప్పకూడదని ఆదేశించారు"

ఇంతలో డి.జి.పి ఫోన్ మోగింది. ఫోన్ లో అవతల ఇండియన్ సీక్రెట్ సర్వీస్ చీఫ్.

"ఎస్ మిస్టర్ ప్రతాప్ ఈ రొజే మనిద్దరం డిల్లీ వెడుతున్నాం. ఇదేలాగ మరొ సంస్థ గురించిన సమాచారం వచ్చింది. దాన్ని వేర్లతో సహా పీకిపారేయటానికి మిమ్మల్ని స్పేషల్ ఏజెంటుగా నియమించింది భారత ప్రభుత్వం....దాని గురించి మాట్లాడాలట?"

"ఓ...ఎస్" ప్రతాప్ బలంగా తల ఊపాడు.

అందరూ ప్రతాప్ కు కంగ్రాట్స్ చెప్పారు...సుధా కూడా.

“ఇక మనం ఆ బంగళాలో ఉండాలా?”

"మనం జీవించటానికని కొన్న బంగళా కాదది. మా అమ్మగారికి నేనిచ్చిన ప్రామిస్ కోసం కొన్నాను...పేద పిల్లలకు అర్పణం చేయాల్సిన బంగళా అంటూ నా దగ్గర ప్రామిస్ చేయించుకున్నది. ఆమె ఆశపడినట్లు ఇప్పుడు ఆ బంగళాను అనాధ శరణాలయంగా మార్చాను...ఆ డబ్బంతా దానికే. అందులో నుంచి ఒక్కపైసా కూడా నేను తీసుకోలేదు"

"నిజంగానా?"

"నీమీద ప్రామిస్"

మాట్లాడుతున్నప్పుడే కళ్ళు తిరిగి పడిపోయింది సుధా. ప్రతాప్ నీళ్ళు తీసుకు వచ్చి ఆమె మొహం మీద జల్లాడు.

డాక్టర్ కు ఫోన్ చేశాడు.

పది నిమిషాలలో డాక్టర్ వచ్చాడు......"మీరు తండ్రి కాబోతున్నారు"

స్పృహలోకి వచ్చిన సుధా మొహం సిగ్గుతో నిండుకుంది.

"మేము వెళ్ళి...మళ్ళీ వచ్చే వారం వస్తాం" అని చెప్పి డి.జి.పి.,కమీషనర్, ప్రమోద్ మరియూ ఆ నలుగురు యువకులూ తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు.

*****************************సమాప్తం ******************************

N.S: కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu(బుక్ మార్క్ చేసుకోండి)