ఎవరా తొమ్మిదిమంది?
ఎవరా తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు...?
వీరు భారతదేశంలో నియమించబడిన రహస్య సంఘంలోని వ్యక్తులు అని మాత్రం తెలుసుకున్నారు. శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన ఈ రహస్య సంఘంలోని వారు మంచికి ప్రతినిధులు మరియు ఉన్నత వ్యక్తులే కాకుండా వీరు ప్రపంచవ్యాప్తంగా పంపబడ్డారని పశ్చిమ దేశాలు భావిస్తూ, వారెవరో తెలుసుకోవటానికి ఏన్నో పరిశోధనలు జరిపారు. ఎన్ని పరిశోధనలు జరిపినా వారెవరెవరో తెలుసుకోలేకపోవటం వలన ఆ విషయం ఇప్పటికీ ఒక అతి పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది.
ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు గురించి మొదట ‘టాల్బట్ ముండి’ అనే ఒక రచయత 'తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు’ అనే పేరుతో రాసిన తన నవలలో (పేర్లు లేకుండా) పేర్కొన్నాడు. ఈ నవలలోని ఆ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు…సాంకేతిక సమాచారాన్ని అభివృద్ది చేస్తూ, అవి దుష్టుల చేతిలొకి వెళ్ళకుండా, అభివృద్ది చేసే సాంకేతిక సమాచారాన్ని పరిరక్షించే పనికి క్రీస్తు పూర్వం 273లో మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడు తొమ్మిదిమంది వ్యక్తులను రహస్యంగా ఎన్నుకుని, అంతే రహస్యంతో రహస్య సంఘం స్థాపించాడని ఆ నవల రచయత రాసాడు.
ఆశోక చక్రవర్తి
పురాణం ప్రకారం మౌర్యసామ్రాజ్యాధిపతి అశోకుడు తన తాత, ముత్తాతల లాగే మౌర్య సామ్రాజ్య పొడిగింపునకు కలింగ సామ్రాజ్యంపై(అంటే అప్పటి కలకతా నుండి మద్రాసు వరకు) దండయాత్ర చేశాడు. కలింగ సామ్రాజ్య వీరుల ప్రతిఘటన ఎక్కువగా ఉండటంతో అశోక చక్రవర్తి ఆ యుద్దంలో లక్షమంది వీరులను కోల్పోయాడు. ఆ ఊచకోతను చూసి తట్టుకోలేక అశోక చక్రవర్తి అహింసా మార్గాన్ని ఎన్నుకొన్నాడు. ఆ ఊచకోత తరువాత అశొక చక్రవర్తి బౌద్దమతం పుచ్చుకున్నాడు.
ఆ తరువాతే యుద్దాలు జయించటానికి, సామ్రాజ్యాలను విస్తరింపచేసుకోవడానికి మనిషి తన తెలివిని, జ్ఞానాన్ని అరిష్టాలకు ఉపయోగిస్తున్నాడని, అందువలన తన పరిపాలనా కాలానికి గత చరిత్రలోనూ మరియు తన కాలంలోనూ అభివృద్ధి చేసిన/చెందిన సహజ శాస్త్రాన్ని గోప్యంగా ఉంచాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అంతే కాకుండా రాబోవు కాలంలో, అంటే రాబోవు 2000 సంవత్సరాలలో అన్ని రంగాలలో జరుపబోయే పరిశోధనలు, పరిశోధనల వివరాలూ అధ్యాత్మిక పారవశ్యంలోనూ, అతీంద్రియ విషయాలను నమ్ముతారో వారిచే గోప్యతగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అలాంటివారిని తొమ్మిది మందిని ఎన్నుకున్నాడు.
Pope Sylvester II
వారికోసం ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రహస్య సంఘమే భూమి మీద ఉన్న అత్యంత రహస్యమైన సంఘంగా చెప్పబడుతూ, ఆ సంఘంలోని వారినే తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులుగా గుర్తించారు. ఎవరైనా ఊహించుకోవచ్చు. 2000 సంవత్సరాల పరిశోధనలు, అధ్యయనాలు మరియు పత్రాలు ఆ తొమ్మిది మందికి మాత్రమే తెలిసున్నదంటే వారు ఎంత అసామాన్యమైన, ప్రాముఖ్యమైన మరియు జ్ఞానం కలిగిన వ్యక్తులో. వీరి లక్ష్యం ఏమై ఉంటుంది? మానవజాతి నాశనానికి అభివృద్ది చేయబడ్డ పద్దతులు అర్హత లేని వారి చేతుల్లోకి వెళ్ళకుండా చూడడం, మానవజాతి శాంతియుతంగా జీవించేందుకు కావలసిన జ్ఞానాన్ని అందివ్వడం. ఈ సంఘంలోని సభ్యుల సహ ఎంపిక ప్రాచీన పరిశోధనలనూ, అధ్యయనాలనూ మరియు పత్రాలను సంరక్షించేందుకు మాత్రమే.
జగదీష్ చంద్రబోస్
ఈ తొమ్మిదిమందికీ ఒక ప్రత్యేకతమైన బాధ్యత పుస్తక రూపంలో ఇవ్వబడింది. ఈ తొమ్మిదిమంది చేయవలసినదల్లా ఆ పుస్తకాలలో రాయబడ్డ ప్రమాదకర విషయాలు రక్షించబడుతూ మరియు వారు మానవజాతికి సహాయపడే పరిశోధనలను చేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ తొమ్మిది పుస్తకాలూ 9 రంగాలకు చెందినవి.
విక్రం సారాభాయ్
ఆ పుస్తకాలు:
గ్లోబెల్స్ ప్రచారం: మనసులతో చేయు యుద్దాల గురించిన సమాచారం.
మనస్తత్వ శాస్త్రం: మరణ స్పర్శ్ తో కూడిన సమాచారం.
అతిసూక్ష్మ జీవశాస్త్ర సమాచారం.
రసవాదం.
సమాచారం: అంతరిక్ష శాస్త్రం, అనంతాకాశం మరియు కాలప్రయాణాలతో, అంతరిక్ష గ్రహవాసులతో కూడిన సమాచారం.
భూమ్యాకర్షణ మరియు అభూమ్యాకర్షణ సమాచారం.
యంత్రాలు, విమానాలతో కూడిన సమాచారం.
కాంతి, కాంతి వేగం మార్చే సాంకేతికంతో కలిసి కూడిన సమాచారం.
సమాజ శాస్త్రం, రాజ్యాల ఉత్తాన పతనాల సూత్రాలతో కూడిన సమాచారం.
1960లో లూయస్ పవెల్స్ మరియు జాకస్ బర్గర్ లు ఈ తొమ్మిది అపరిచిత వ్యక్తుల గురించి తమ మార్నింగ్ మెజీషియన్స్ అనే పుస్తకంలో వ్రాశారు. పవెల్స్ మరియు బర్గర్ లు ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల విషయం మొదట 1860లో భారతదేశంలో మరియు తహిటిలో పనిచేసిన ఫ్రెంచ్ జడ్జి అయిన లూయస్ జాకొల్లియట్ చెప్పినట్టుగా వెళ్ళడించారు. వీరి రచనల్లో పవల్ మరియు బర్గర్ లు ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు అప్పుడప్పుడు బాహ్య ప్రపంచంలోని మేధావులకు దర్శనం ఇస్తారని చెప్పారు. అలానే పోప్ రెండవ సిల్విస్టర్ కు కనిపించి అతీంద్రియ శక్తులు మరియు మాట్లాడే రోబోట్ ను బహుమతిగా ఇచ్చారని చెపుతారు.
భారత శాస్త్రవేత్తలు జగదీష్ చంద్రబోస్ మరియు విక్రం సారాభాయ్ ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల వంశానికి చెందిన వారేనని చెబుతారు. కానీ దీనికి తగిన సాక్ష్యం పెద్దగా లేదు. కానీ మొదటి తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల గురించి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయట.
Images Credit: To those who took the original photos.
***********************************************************************************************