మృత్యుదూత (క్రైమ్ సీరియల్) (PART-6)
డాక్టర్. గోపీనాద్, ఆసుపత్రి చివరిలొ
ఉన్న ల్యాబులోకి వెళ్ళినప్పుడు మైక్రోస్కోప్ లో తీవ్రంగా దేనినో పరీక్షగా చూస్తూ
కనిపించాడు ల్యాబ్ టెక్నీషియన్ రామమూర్తి.
చప్పుడు వినిపించి తలెత్తి చూసాడు.
“డాక్టర్”
“ఎక్కడ
ఆ టవల్?”
పాలితిన్ బ్యాగులోపల బద్రపరిచి
పెట్టున్న ఆ రక్తపు మరకల టవల్ ను తీసి గోపీనాద్ దగ్గర ఇవ్వగా, ఆయన తీసుకుని చూసి
అడిగాడు.
“ఇది
మానవ రక్తమే కదా?”
“అవును
డాక్టర్”
“అనుమానం
ఏమీ లేదుగా?”
“అందులో
ఒక్క శాతం కూడా అనుమానం లేదు సార్”
“టవల్
మీదున్నది మానవ రక్తమైతే, గ్రూప్
ఏమిటనేది తెలియాలే?”
“ఎంత
ప్రయత్నం చేసినా కనుక్కోలేకపోతున్నా. రక్తం గ్రూప్ ఫాక్టర్ అందులో లేదు డాక్టర్.”
“మళ్ళీ
ఇంకోసారి ప్రయత్నం చేసి చూద్దాం. టవల్ పైన ఉన్న రక్తాన్ని అమ్మోనియాలో డైల్యూట్
చెయ్యి”
రామమూర్తి వెంటనే ఆ పనిలోకి దిగాడు.
టవల్ మీదున్న రక్తాన్ని అమ్మొనియా
ద్రవంలో కడిగి, గాజు
పలకపై వేసి -- మైక్రోస్కోప్ క్రింద పెట్టగా -- డాక్టర్ కుర్చీలో కూర్చుని
మైక్రోస్కోప్ యొక్క లెన్స్ మీద కళ్ళు పెట్టారు.
రెండు నిమిషాల తీవ్ర పరీక్ష తరువాత --
చెమట పట్టిన నుదిటితో తల ఎత్తేడు.
“ఆశ్చర్యంగా
ఉందే...గ్రూప్ లేకుండా నెత్తురా?”
“సంతింగ్...అబ్
నార్మల్ డాక్టర్”
“అవును
రామమూర్తీ. ఒక కార్యం చెయ్యి”
“చెప్పండి
డాక్టర్”
“ఈ
రక్తాన్ని ‘మాక్సో
డిజిటల్ ల్యాబ’ కు
వెంటనే పంపించి సాయింత్రానికి రిపోర్టు తీసుకో”
“ఏస్...డాక్టర్”
“ప్రస్తుతానికి
దీని గురించిన మాటలు బయటకు వెళ్ళకూడదు”
రామమూర్తి తల ఊపగా, డాక్టర్ గోపీనాద్
చెమట పట్టిన ముఖాన్ని చెతి రుమాలతో ఒత్తుకుంటూ,
‘ల్యాబ్’ నుండి
బయటకు వచ్చి -- తన గదివైపుకు నడిచారు. ఆయన మెదడును
గందరగోళ పరిస్థితి వల వేసి బిగించింది.
‘టవల్
మీదున్న నెత్తురు ఎవరిది? ఎవరిదై
ఉన్నాగానీ గ్రూపు ఏమిటో తెలుసుకోలేకపోయామే!’
‘ఒకవేల
‘మాక్సో డిజిటల్లో
కనిబెట్టేస్తారో’ -- కన్
ఫ్యూజ్డ్ ఆలొచనతో డాక్టర్ గోపీనాద్,
వరాండాలో
గబగబా నడిచి తన గదికి వెళ్లారు.
సారధి కూర్చోనున్న కుర్చీ ఖాలీగా ఉంది.
అది డాక్టర్ గోపీనాద్ ను మరింత ఆశ్చర్య పరచింది.
“సారధి
ఇంతలొ ఎక్కడికి వెళ్ళారు?”
టేబుల్ మీద గాజు గ్లాసులోని కాఫీ అలాగే ఉంది.
‘చెప్పకుండా
వెళ్ళిపోయే మనిషి కాదే?’
డాక్టర్ గోపీనాద్ తన ఎడం చేతి చూపుడు
వేలును నుదిటి మీద పెట్టి రాసుకుంటూ అటూ,
ఇటూ, చుట్టూ చూశాడు.
ఆయన చూపులు రెస్ట్ రూము వైపు చిన్నగా తెరిచున్న
తలుపు సందు వైపు పడింది.
రెస్ట్ రూము దగ్గరకు వెళ్ళి గది తలుపు
తోశాడు.
షాకయ్యాడు.
సారధి రెస్ట్ రూములో బోర్ల పడి ఉన్నాడు.
అతని చుట్టూ నెత్తురు!
**********************************
దశరథమూర్తి గారి చేతిలో వెల్వెట్
గుడ్డతో మెరుస్తున్న ఆ చిన్న పెట్టెను ఆయన చేతిలోంచి లాక్కుంది శ్రీలత -- పెట్టెలో
తెల్ల రంగు కలిగిన పుల్లలు ఆ పెట్టంతా నిండుకోనున్నాయి.
“మృత్యుదూత?” అన్నది దశరథమూర్తి గారిని చూస్తూ.
అవునన్నట్టు తల ఊపాడు.
పెట్టెలోని కాగితం తీసి చదివింది.
మూలిక పేరు: మృత్యుదూత.
బరువు: 41 గ్రాములు.
వయసు: 2000 సంవత్సరాలు.
పుట్టిల్లు: ఆఫ్రికా.
చరిత్ర: ఈ అద్భుత మూలిక, ఫ్రెంచ్ ద 14 వ లూయిస్ దగ్గర 9 సంవత్సరాలు ఉన్నది.
తరువాత మార్లిన్ మైకో అనే కోటీశ్వరుడి దగ్గరకు వెళ్ళింది.
ఔషధ గుణాలు: ఈ మూలికను అన్ని రోజులూ
బయటకు తీయకూడదు. పౌర్ణమి రోజుకు తరువాతి రెండవ రోజున మాత్రమే బయటకు తీయాలి. ఈ
మూలికలో నుండి వచ్చే కిరణాలు మెదడును బాగా పదును చేస్తాయి. మేధా శక్తిని పెంచుతాయి, వాళ్ళు ఏ రంగానికి
చెందిన వారైనా
ఆ రంగంలో అశేషంగా సాధనలు చేస్తారు. అంతే
కాదు, ఎవరైతే ఆ రోజున 2 మిల్లిగ్రాముల ‘మృత్యుదూత’ మూలిక పౌడర్ను
తింటారో వాళ్ళు ఆరోగ్యంగా, యుక్త
వయసు తో కనీసం 125 సంవత్సరాలు
బ్రతుకుతారు.
హెచ్చరిక: 12 సంవత్సరాల లోపు
పిల్లలకు ఈ మూలిక వాడరాదు. ఈ మూలిక పైన ఒక చుక్క నూనె కూడా పడకూడదు. పడితే, ఆ మూలిక శక్తి
తగ్గిపోయి, చివరకు
మామూలు పనికిరాని మూలిక అవుతుంది.
శ్రీలత తన వెనుక నిలబడ్డ యువకుడి వైపు
తిరిగింది.
“మనం
పడ్డ కష్టానికి ఇప్పటికి ఫలితం దక్కింది. ఇక్కడున్న అన్ని మూలికలనూ తీసుకోండి”
ఆ నలుగురు యువకులూ వేగంగా తమ పని
మొదలుపెట్టారు.
దశరథమూర్తి గారు తల మీద పిడుగు పడినట్టు
కూర్చుండిపోయారు. శ్రీలత అతని భుజాల మీద తుపాకితో గుచ్చింది.
“ఈ
మూలికల గురించి ఇక నువ్వు మర్చిపోవాలి. మీ దగ్గర ఉన్న మూలికలన్నిటినీ తీసుకు
వెడుతున్నాము. ఇక మీరు మూలికల
పై
పరిశోధనను వదిలిపెట్టి...పూర్తిగా రెస్ట్ తీసుకోండి. రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్
చేయండి"
దశరథమూర్తి గారు కళ్ళల్లో నీటితో శ్రీలతను
చూసి “నేను ఎంతో కష్టపడి
సేకరించి పెట్టుకున్న మూలికలన్నిటినీ ఇలా తీసుకు వెళ్ళటం, తీసుకు వెళ్ళి నువ్వు
పేరు సంపాదించు కోవలనుకోవడం న్యాయమా?”
అని
నీరసంగా అడిగారు.
“న్యాయం
కాదు? కానీ ఇవన్నీ నాకోసం
తీసుకు వెళ్లటం లేదు. నాకూ, మూలికలకూ
ఏటువంటి సంబంధమూ లేదు. నా పని కిరాయికి దోపిడి చేయటమే. ఒక గొప్ప వ్యక్తి ఈ
మూలికలను మీ దగ్గర నుండి దోపిడి చేసి తీసుకు రమ్మన్నారు. కిరాయికి
ఒప్పుకున్నాను...అవును, ఈ
మూలికలకు విదేశీ మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉన్నదటగా. కోట్లలో వ్యాపారం
అవుతుందటగా?”
“నీకు
డబ్బే కదా కావాలి...నేను ఇస్తాను”
“నువ్వెంత
డబ్బు ఇవ్వ గలవు...చెప్పు”
“ప...పది
లక్షలు”
శ్రీలత గలగలా నవ్వింది.
“అదొక
డబ్బా? ‘మృత్యుదూత’ మూలికకు మాత్రం మేము
ఐదు కోట్ల రూపాయలకు బేరం మాట్లాడి ఉంచాము.
మిగిలిన మూలికలకు ఎంత ఖరీదు వేస్తామో లెక్క కట్టుకో. అప్పుడు మా ‘రేంజ్’ ఏమిటో నువ్వే
ఆలొచించు”
దశరథమూర్తి గారు ఆవేశపడ్డాడు.
“రాక్షసీ!
ఈ మూలికల ఔషధ గుణాలను మన దేశ ప్రజలకు
అందించి వారి ఆరోగ్యానికి మంచి చేయాలని నేను చూస్తుంటే, నువ్వు ఆ మూలికల
నాశనానికి నీ తెలివిని ఉపయోగిస్తున్నావే...నిన్ను”
ఆమె మీద కోపంతో ఆమెను పట్టుకోవాలని
ప్రయత్నం చేసిన దశరథమూర్తి గారి తలపై బలంగా
ఒక దెబ్బ వేసాడు రామూ.
“అబ్బా...”
దశరథమూర్తి గారి తల లోపల ప్రళయం వచ్చిన ఫీలింగ్. కళ్ళల్లో
మినుగుడు పురుగులు పుట్టగా -- అలాగే పడిపోయాడు.
పల్లవి ఆయన దగ్గరకు వెళ్ళింది.
శ్రీలత, యువకులలో ఒకడ్ని చూసి కేకేసింది.
“గణేష్”
“మ్యాడం”
“ఆ
మత్తు మందు ‘స్ప్రే’ నీ దగ్గరే కదా ఉంది?”
“అవును
మ్యాడం”
“తీసుకొచ్చి
ఇద్దరి ముఖాల మీదా కొట్టు ఒక ఆరుగంటలు కదలకుండా పడుంటారు”
మత్తుమందు ‘స్ప్రే’ తో వాళ్ల దగ్గరకు
వెళ్లాడు గణేష్.
**************************************
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ ను స్వాగతించాడు
డాక్టర్. గోపీనాద్.
“రండి...ఇన్‌స్పెక్టర్”
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ టోపీని
తీసి, చెంకల్లో పెట్టుకుని
అడిగాడు.
“చనిపోయింది
ఎవరని చెప్పారు ఫోనులో?”
“పేరు
సారధి. నటి రంజని ‘కాల్
షీట్స్’ వ్యవహారాలన్నీ చూసుకునే
మేనేజర్”
“బాడీ
ఎక్కడుంది?”
రెస్ట్ రూం గదికి తీసుకు వెళ్ళారు
డాక్టర్.
ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ గదికి బయటే
నిలబడి లోపలకు తొంగి చూసాడు. సారధి,
రక్తపు
మడుగులో బోర్ల పడి ఉన్నాడు. అతని చుట్టూ రక్తం ఉంది. ఆ రక్తం గడ్డకట్టుంది.
“మరణం
ఎలా జరిగుంటుంది?”
“చెక్
చేసి చూశాను...శరీరంలో ఎక్కడా గాయం లేదు”
“మరెలా
ఇంత రక్తం?”
“రక్తం
కక్కుకుని ఉండొచ్చు”
“అంటే
మీ లెక్క ప్రకారం ఇది హత్య కాదు. సహజ మరణం”
“ఎస్?”
“మరైతే
డెత్ సర్టిఫై చేయండి”
“నో
ఇన్‌స్పెక్టర్...నా మనసుకు తోచింది చెప్పాను. ‘పోస్ట్
మార్టం’ రిపోర్టు ఏం
చెబుతుందో తెలియదు”
“ఒక
పక్క సహజ మరణం అంటున్నారు, మరో
పక్క ఇతని మరణంలో డౌట్ ఉన్నట్టు మాట్లాడుతున్నారు....ఏమిటి మీ డౌట్?”
“రక్తం
చూసారా? ఎంత రక్తమో, ఐ మీన్ రక్తం
కక్కుకున్నా ఇంత రక్తం ఎవరూ కక్కుకోరు. ఇది నాకే కొత్తగా ఉంది. అందుకే మీకు ఫోన్
చేశాను”
“సరే...
సారధి మిమ్మల్ని ఎందుకు చూడటానికి వచ్చాడు?”
డాక్టర్. గోపీనాద్ ఐదు నిమిషాలు వెచ్చించి
వివరాలు చెప్పి ముగించినప్పుడు, ఇన్‌స్పెక్టర్
రాజేష్ కుమార్ యొక్క పోలీసు కళ్ళల్లొ కూడా ఆశ్చర్యం.
“సారధి
కి నెత్తుటి చెమట ఏర్పడిందా? అది
క్లియర్ చేసుకోవటానికి మీ దగ్గరకు వచ్చాడా. మీరు ల్యాబ్ నుండి తిరిగి వచ్చేలోపు సారధి
ఇలా ఉన్నాడా?”
“ఎస్
ఇన్‌స్పెక్టర్. అలాగే చెప్పేరు. ఆయన ముఖం తుడుచుకున్న టవల్ని చూపించారు.
ఇదిగో...ఇదే ఆ టవల్”
డాక్టర్. గోపీనాద్, టేబుల్ మీదున్న ఆ
పాలితిన్ కవర్ను చూపించారు. ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, టవల్ను తీసి చూసేసి
అర నిమిషం ఆలొచన తరువాత, డాక్టర్ను
అడిగాడు.
“ఈ
రక్తం ఏ గ్రూపుకు చెందిందో తెలుసుకోలేక పోయారా?”
“తెలియలేదే”
“ఏ
గ్రూపుకూ చెందని రక్తం ఒకటుంటుందా?”
“ఉండదు”
“మరి
ఇదెలా సాధ్యం?”
“అర్ధం
కాలేదు ఇన్‌స్పెక్టర్. ఈ రక్తం ‘సాంపిల్’ ను ఇప్పుడు ‘మాక్సొ డిజిటల్ ల్యాబ్’ కు పంపించాను. ఆ
రిజల్ట్స్ వచ్చిన తరువాతే నిజం పూర్తిగా తెలుస్తుంది”
“నటి
రంజనికి మీరు ఫ్యామిలీ డాక్టరా?”
“అవును”
“ఎన్ని
సంవత్సరాలుగా?”
“గత
ఐదు సంవత్సరాలుగా”
“రంజని
ఇప్పుడు ఎక్కడ?”
“ఊటిలో
షూటింగులో ఉన్నది”
“సారధికి
జరిగిన దాని గురించి ఆమెకు తెలియపరిచారా?”
“సెల్
ఫోన్ లో చెప్పాను. ప్రొద్దున్నే కోయంబత్తూర్ వచ్చి విమానం ఎక్కి, మధ్యాహ్నం
పన్నెండింటికల్లా హైదరాబాద్ వచ్చి చేరిపోతాను అని చెప్పారు”
“డాక్టర్!
ఇది, న్యాచురల్ మరణంగా
ఉండదని నా మనసుకు అనిపిస్తోంది”
“ఆ
సందేహం నాకూ ఒక శాతం ఉంది కాబట్టే మీకు ఫోన్ చేసేను”
“ఎవరికైనా
రక్తం చెమటగా రావటం సాధ్యమేనా డాక్టర్?”
“సాధ్యం
కాదు. దట్ ఈజ్ అబ్ నార్మల్"
“అయితే
సారధి చెప్పింది అబద్దమా?”
“సారధి
గురించి నాకు బాగా తెలుసు ఇన్‌స్పెక్టర్. ఆయన అబద్దం చెప్పే మనిషి కాదు”
“ఫ్యాను
సరిగ్గా పనిచేయటం లేదని, ఉక్కగా
ఉన్నదని రంజని గారి ఏ.సీ రూములోకి వెళ్ళి పడుకున్నాడు. ఆ గదిలోపల ఈయనకు ఏమైనా
జరిగుంటుందా?”
“జరిగుండచ్చు”
“రంజని
గారి గదిని చూడాలే డాక్టర్?”
“రండి...వెడదాం”
ఫోరన్ సిక్ టీమ్
కు సారధి బాడీని అప్పగించి...ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ గోపీనాద్
ఇద్దరూ రంజని ఇంటికి బయలుదేరారు.
Continued...PART-7
************************************************************************************************