31, మే 2020, ఆదివారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-12




                                               గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                                 (PART-12)



గాలిదేవుడి గుడి!

బామ్మ వచ్చిన కారు వచ్చి ఆగింది...ఆమె కిందకు దిగింది.

భరణి తోడుగా ఉన్నాడు.

గుడి దగ్గర పూజారి ఉన్నాడు.

"రండి బామ్మా గారూ...బాగున్నారా?" అంటూ కుశల ప్రశ్న వేశాడు పూజారి.

"బాగుండాలనే కదలలేని ఈ వయసులో కూడా గాలిదేవుడ్ని చూడటానికి బయలుదేరి వచ్చాను. ఆ రోజుల్లో పిల్లలు, కన్నవారికి పేరు తెచ్చిపెట్టేవారు. కానీ, ఇప్పుడు...కన్నవాల్ల పేరును పాడు చేసేలాగా ఉన్నారు..." పూజారి అడిగిన ప్రశ్నకు బాగున్నాను అనే ఒకే ఒక సమాధానం చెప్పకుండా బామ్మ గొణుగుడు...అతనికి గందరగోళంగా ఉంది.

బామ్మ చేతిలో డాక్యూమెంట్స్ చూడంగానే పూజారికి అర్ధమవటం మొదలయ్యింది.

"అదేమిటి బామ్మా...చేతిలో ఇంటి దస్తావేజులా?"

"అవును! ఆ గాలిదేవుడికి చేరాల్సినవి. మా ఆయన ఇవి ఇవ్వకుండా ఉత్త నోటి మాటతో...'మా ఇల్లు...గాలిదేవుడి ఆస్తి’ అని చెప్పడం తప్పైపోయింది. అందుకే నా కొడుకూ, మనవుడూ బుద్ది గడ్డి తిని, 'ఆ ఇల్లు అమ్మబోతాం' అంటూ బయలుదేరారు.

"అయ్యయ్యో...అదిపెద్ద తప్పు కదా?"

"ఆ తప్పుకే మనవుడ్ని పాము కరిచింది. కొడుకునూ, కోడల్నీ కారు యాక్సిడెంటులో తోసింది..."

"గాలిదేవుడా...నువ్వు కోపం తెచ్చుకున్నావా?"

"కోపం తెచ్చుకున్నాడా అని నిదానంగా అడుగుతున్నావేమిటి...తలకిందలు చేశాడు! చాలు పూజారీ...కర్పూరం చూపించండి. ఇదిగో ఇంటి దస్తావేజులు! ఇక్కడ ఈయన కాళ్ళ దగ్గర పెట్టేసాను. ఇక నా కుటుంబీకులకు ఏమీ జరగ కూడదు. వాళ్ళెవరి మీదా చిన్న గీత కూడా పడకూడదు. అలా పడితే అతను నిజమైన దేవుడు కాదు..."

"ఇప్పుడు మీ మనవుడు ఈ ఊరికి వచ్చి వెళ్ళింది దీని కోసమేనా?"

"అవును! అలా వచ్చినప్పుడే పాము కాటుకు గురి అయ్యాడు...అది విన్న వెంటనే నా ఊపిరే ఆగిపోయింది తెలుసా?"

"ఉండదా బామ్మా...ఒక్కడే మనవుడు?"

"సరి...సరి...కర్పూరం చూపించండి.'ఇంటి పత్రం' తీసి అతని ఆభరణాల పెట్టాలో పెట్టండి. 'ఇంటి పత్రం' లేకుండా వీళ్ళు ఎలా ఇల్లు అమ్మగలరో చూస్తాను" బామ్మ దగ్గర వైరాగ్యం కనబడింది.

దస్తావేజులను ఎక్కడుంచాలో అనేది బామ్మ చెప్పినప్పుడు పూజారి ఆశ్చర్యపడ్డాడు.

ముద్ద కర్పూరం తీసి వెలిగించాడు.

తరువాత చేతి నిండా విభూతి తీసి ఆమె అరిచేతిలో ఉంచి బామ్మ నుదురు మీద కూడా పూసాడు.

చేతులెత్తి నమస్కరించింది బామ్మ. పరవసంలో కళ్ళల్లో నీళ్ళు పొంగినై. "గాలిదేవుడా...నా ఇంటి ఇలవేలుపే! మా ఆయన చేసిన వాగ్దానాన్ని నేను నెరవేర్చాను. మా కుటుంబంలో నా కొడుకూ, మనవుడూ తప్పు చేసుంటే... వాళ్ళను క్షమించు. ఇంకోసారి చేయరు. దానికి నేను బాధ్యత. నా మనవరాలు పెళ్ళికి డబ్బులు లేవనే కారణం వలన వాళ్ళకు ఈ ఆలొచన వచ్చింది.

డబ్బులు లేకపోతే...డబ్బును నీ దగ్గర అడగాలి. అలా చేయకుండా నీకు ఇచ్చిన దానిని దొంగతనంగా తీసుకోవాలని చూస్తే ఎలా? వాళ్ళందరికీ...నిజంగా నువ్వు ఉన్నావా, లేవా అనే అనుమానమే. ఈ గ్రామంలో ఉన్నంత వరకు రాని అనుమానం...నగరానికి వెళ్ళంగానే వచ్చింది. అదే నగరం! అది తాను నమ్మదు! ఎవరినీ నమ్మించదు. నమ్మాలి...దేనినైనా ఖచ్చితంగా, గట్టిగా నమ్మాలి. నేను నమ్ముతున్నాను. నువ్వు ఉన్నావు...నువ్వే దండన ఇచ్చి హెచ్చరిక చేసావు! ఎక్కువగా కోపం తెచ్చుకోనుంటే...ప్రాణం తీసేవాడివి. కానీ, నా భర్త భక్తి కొసం, నా భక్తి కొసం చిన్నగా దండిచి వదిలేసావు.

నువ్వు గాలివి...అన్ని చోట్లా నిండి పోయుంటావు. ఇప్పుడు నేను మాట్లాడింది నీ చెవిలో పడుంటుంది. నిన్నే నమ్ముకున్న నన్ను మోసం చేయకు...! నా మనవరాలి పెళ్ళి బాగా జరగాలి. నగలు కొంటానికే డబ్బుల్లేక...నా కొడుకు కష్టపడుతున్నాడు.

అందుకోసమే ఆ ఇల్లు అమ్మితే ఏమవుతుంది అని వాడు అనుకున్నాడు. ఇంతే విషయం. అంతా నీ దగ్గర ఒలకబోసాను. నేను బయలుదేరతాను. ఇక నువ్వు చూసుకో..." బామ్మ ప్రార్ధన చేస్తున్నాననే పేరుతో తన ఆవేదనంతా ఒలకబోసి వెనుతిరిగింది.

ఎదురుగా కార్తిక్, వీరబద్రం నిలబడున్నారు. కార్తిక్ కళ్ళు తడిసున్నాయి.

"బామ్మా...నన్ను వెతుక్కుని ఇంత దూరం వచ్చావా?"

"రాకుండా...! ఏది ఏమైనా నీకు దృఢమైన మనసు బామ్మా"

"దృఢమైన మనసా? అరే పోరా! భయపడిపోయి పరిగెత్తుకు వచ్చా"

"భయపడాల్సిన దానికి...భయపడే కావాలి కదా బామ్మా?"

"ఈ భయం మీకు లేకుండా పోయిందే?"

"ఇప్పుడు వచ్చింది...! ఇక మెము నువ్వు ఇష్టపడినట్లే నడుచుకుంటాం"

"పడితేనే బుద్ది వస్తోంది...కదా?"

"అవును బామ్మా! సరే...నువ్వు బయలుదేరు. ఈ వయసులో ఇంత అనారొగంతో నువ్వు వచ్చిందే తప్పు... భరణి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి"

"అయ్యో...అదంతా అవసరం లేదు అంకుల్?"

"ఇద్దరూ కలిసి నిలబడండి ఒక ఫోటో తీసుకుంటాను" అన్నతను...బామ్మా- భరణి ఇద్దర్నీ ఒకటిగా నిలబెట్టి తన మొబైల్ కెమేరాతో ఫోటో తీసాడు కార్తిక్.

అప్పుడే వీరబద్రానికి తన మొబైల్ ఫోన్ గుర్తుకు వచ్చింది. దానికొసం జేబులో చెయ్యి పెట్టాడు...గుండె గుభేలు మన్నది. సెల్ ఫోన్ కనబడలేదు.

"ఏమిటి బద్రం?"

"నా మొబైల్ కనబడటం లేదు...!"

"ఎక్కడ్రా పారేసావు?"

"అది పోయినట్టు ఇప్పుడే కదురా తెలిసింది! ఎక్కడ పారేసేనూ అని అడిగితే ఏలా చెప్పను. నన్ను కొంచం ఆలొచించుకోని?" సమాధానం చెబుతూ తీవ్రంగా ఆలొచించాడు వీరబద్రం.

"అవునూ...అదేంటి మీ ఫ్రెండు పేరు వీరబద్రమా?......మనవాళ్ళు కాదా? అంటూ మధ్యలో పూజారి ప్రశ్నించాడు.

"అదా పూజారీ?.... అతని తండ్రి జ్యోతిష్య పండితుడు. ఆయన వీరబ్రహ్మేంద్రస్వామి భక్తులు. అందువలన వాళ్ళ ఇంటికి 'వీరబ్రహ్మేంద్ర ఇల్లు’ అని పేరొచ్చింది. అందుకని వీళ్ళ నాన్న వీడికి వీరబద్రం అని పేరు పెట్టాడు….”

అలా పేరుకు కారణం తెలిసొచ్చే క్షణం... వీరబద్రం కూడా 'ఎక్కడ సెల్’ పారేసుకున్నాము? అనేది గుర్తుకు వచ్చినట్టు ముఖంలో కాంతి.

"ఏమిట్రా...గుర్తుకు వచ్చిందా?"

"ఊ...ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. అది ఇప్పుడు గాలిదేవుడి ఇంట్లోనే ఉన్నది"

"ఏమిటీ...మా ఇంట్లోనా?"...కార్తిక్ అధిరిపడ్డాడు.

"మీ ఇల్లా...అదే దస్తావేజులుతో సహా ఇచ్చేశారే...ఎక్కడ్నుంచి వచ్చింది మీ ఇల్లు? అది ఇక గాలిదేవుడి ఇల్లు!"

"సరేరా...అక్కడే పారేసుకున్నట్టు ఖచ్చితంగా గుర్తుందా?"

"అవును...అక్కడే. పాము కరిచిన తరువాత, వంగి నిన్ను ఎత్తేను. పడుంటే అక్కడే పడుండాలి"

"ఏం...ఇంకెక్కడైనా...?"

"ఇంకెక్కడా నేను వంగి లేవలేదు...అది గుర్తుకు వచ్చే చెబుతున్నాను"

"సరే! అది అప్పుడే నీకు తెలియలేదా?"

"తెలియలేదురా...! మొబైల్ అవసరం వచ్చినప్పుడే కదా వెతుకుతాం? అందులోనూ నిన్ను పాము కరిచి నువ్వు స్ప్రుహ కోల్పోయావు. ఆ గందరగోళంలో ఉన్నాను. మధ్యలో ఫోన్ ఏదైనా వచ్చుంటే తెలిసుండేది. కానీ, చేతిలో మొబైల్ లేకపోవటంతో అది కూడా తెలియలేదు"

"సరే...ఇప్పుడు ఏం చేయబోతావు?"

"ఆ ఇంటికి వెళ్ళి, తీసుకుని మనం వెళ్ళిపోదాం!"

"ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళబోతామా?"

"ఏం వెడితే ఏమిటి? కారణంగానే కదా వెలుతున్నాం?"

వాళ్ళ మాటలను వింటూ ఉన్న బామ్మ......

"కార్తిక్! నువ్వు తోడువెళ్ళు...పారేసుకున్న ఫోనును వెతికి తీసుకుని మీ ఇద్దరూ రండి. వచ్చేటప్పుడు ఆ ఇంట్లోని చుక్క మట్టి కూడా నీకు అంటకూడదు. అది గాలిదేవుడి ఆస్తి" అన్నది.

"అవును బామ్మా...ఇక గాలిదేవుడే వచ్చి ఇల్లు 'క్లీన్’ చేసి, రంగులు వేసీ ఇంటిని ఇల్లుగా ఉంచుకోబోతాడు..." అన్నాడు వీరబద్రం.

బామ్మకు అతని వేళాకోళం అర్ధమయ్యింది.

"అది దేవుడి ఇష్టం. పరిశుభ్ర పరచటం నీకు, నాకూ ఒక విధమైతే...ఆయనకు వేరే విధం. హేళన చేయకుండా వెళ్ళి 'ఫోన్’ తీసుకుని వచ్చే పని చూడు. నేను ముందు బయలుదేరతాను" -- అంటూ తిరిగి మరోసారి గాలిదేవుడికి నమస్కరించి భరణితో కలిసి తాను వచ్చిన 'టాక్సీ' లో ఎక్కింది బామ్మ.

కార్తిక్, వీరబద్రం కారులో ఆ గాలిదేవుడి ఇంటివైపుకు మళ్ళీ వెళ్ళారు.

                                                                                                            (ఇంకా ఉంది) ****************************************************************************************************

29, మే 2020, శుక్రవారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-11




                                            గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                                (PART-11)

ఒక్కొక్క మనిషికీ ఒక్కొక్క అభిరుచి ఉన్నది. ఆ అభిరుచి...ఆ మనిషి యొక్క పదిహేనవ ఏట నుండి ఇరవైయ్యవ ఏట లోపల మొదలై అదే అతని గుణంగా మారిపోతుంది. ఆ తరువాత ఆ అభిరుచి పెద్దగా మారటం లేదు. అలా పదిహేనేళ్ళ వయసులో నుండి ఇరవై ఏళ్ళ వయసులో ఏర్పడే ఆశకు ఆ మనిషి యొక్క చదువు, అలవాట్లూ, ఆలొచించే విధం, అతని స్నేహితులు, అతని చుట్టుపక్కల వాళ్ళందరూ కారణంగా ఉంటున్నారు. వీళ్ళు ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి ఆశ మొదలవుతుంది. ఆ ఆశ యొక్క లోతుల్లోంచే ఒకడు తన భవిష్యత్తును గురించి కలలు కంటున్నాడు అనేది నిజం. దొరికే ఉద్యోగం చూడటం...ప్లాను వేసుకుని ఈ ఉద్యోగంలోనే చేరాలనేది తీర్మానించుకోవటం, లేక తన ఇష్టానికి బిజినస్ చేయటం అన్నీ ఈ ఆశలో నుండి వచ్చిందే! ఇక్కడ పరిశోధకులు ఒక పెద్ద నిజాన్ని కనుక్కున్నారు.

ఒకరు పెద్ద నటుడిగా ఎదిగి టాప్ లో ఉన్నాడు. ఆయన లోతు మనసులో గొప్ప అభిరుచి దాగి ఉండటం - అందులోనే ఈయనకైన భవిష్యత్తు ఉండటం వలన అదే ఆశగా మారటం మొదలయ్యింది.

అవును...మనం ఏమవదలుచుకున్నామో దానికోసమే మనలో ఆశ పుడుతుంది. ఇది పరిశోధకులు కనుక్కున్న నిజం. ఆశపడే దాన్ని ఎలా నెరవేర్చుకోవాలో అనేది ఎంత నిజమో...అంతే లోతుకు నెరవేర్చుకోవాలనేది ఆశగా ఉంచుకోవటం అనేది కూడా ఒక పెద్ద నిజం.

ఈ అభిప్రాయంలోనూ ప్రశ్నలు తలెత్తాయి. 'నేను ఆశపడేది జరగలేదు. నాకు కొంచం కూడా ఇష్టంలేని ఉద్యోగంలోనే ఇప్పుడు నేను ఉన్నాను. జీవితంలో పలు విషయాలు మన ఇష్టానికి తగినట్లు జరగటం లేదు. దాని ఇష్టానికి తగినట్లు మనం జీవించ వలసి వస్తోంది. ఇలా ఉన్నప్పుడు...ఆశపడిన దానిని నెరవేర్చుకోగలం అనేది ఎలా అంగీకరించగలం? అనేది అందులో ఒక ప్రశ్న.

అక్కడ బామ్మ లేదు!

పక్కింటావిడ చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ కార్తిక్, వీరబద్రం ఉన్న వైపుకు వచ్చింది.

"కార్తిక్...మీ బామ్మ ఇప్పుడే ఒక టాక్సీ పుచ్చుకుని గాలిపేటకు బయలుదేరి వెళ్ళింది"

"ఏమిటీ...బామ్మ గాలిపేటకు వెడుతోందా? అందులోనూ ఒంటరిగా?"

"అవును కార్తిక్...ఆవిడ ఒంటరిగా వెళ్లటం ఇష్టం లేక నేనే నా కొడుకు భరణిని తోడు పంపించాను. వయసైన ఆవిడ...వొంట్లో బాగుండని ఆవిడ వేరే! అందుకే ఆమెకు తోడు పంపించాను"

"ఏమిటక్కా నువ్వు...నాకు ఒక ఫోన్ చేసుండచ్చు కదా? ఈ బామ్మకు ఇప్పుడు అక్కడేం పని?" ఆందోళన చెందాడు కార్తిక్.

"నేను అడిగాను కార్తిక్...నేనిప్పుడే గాలిదేవుడి గుడికి వెళ్ళాలి. లేకపోతే ఈ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు" అని మాత్రం చెప్పింది.

"బామ్మ ఇలా చేస్తుందని నేను ఎదురు చూడలేదు...ఛ!" -- కార్తిక్ మనసు గిలగిలా కొట్టుకుంది.

"కార్తిక్...అమ్మా-నాన్నలు ఎలా ఉన్నారు?"

"ఆపదేమీ లేదు...తప్పించుకున్నారు!"

"అదేనయ్యా కావాలి! అవును ఆ గాలిదేవుడు ఏమిటి అంత దుష్ట దేవుడా?" పక్కింటావిడ కూడా గాలిదేవుడి దగ్గరకు వచ్చి ఆగింది. అది వినటానికి కార్తిక్ కి విసుగ్గానే ఉన్నది.

"అవును... అదే ఒకళ్ళకి ముగ్గురం దెబ్బ తిన్నామే...ఈ సమయంలో బామ్మ వేరే వెళ్ళి దెబ్బతినాలా?"

“ఆ...చెప్పటం మరిచిపోయాను కార్తిక్. మీ బామ్మ చేతిలో ఆ ఇంటి డాక్యూమెంట్ ఉన్నది. దాన్ని కూడా తీసుకుని వెళ్ళింది. 'దీన్ని హుండీలో వేసి...అతని కాళ్ళ మీద పడతాను. అప్పుడే వాళ్ళందర్నీ వదిలిపెడతాడు! అని చెప్పింది..."

----ఆ జవాబు, వీరబద్రాన్నే ఎక్కువగా బాధించింది.

"కార్తిక్...బయలుదేరు"

"ఎక్కడికి...?"

"గాలిపేటకే!"

"అనుకున్నాను"

“అనుకుంటుంటే సమయం వెళ్ళిపోతుంది. మీ బామ్మను వెళ్ళి చూద్దాం. ఇలా నేను చెప్పటానికి కారణం ఆమెకు ఏదైనా జరుగుతుందేమో నని కాదు. ఆమె పాపం...బాగా ముసలావిడ కాబట్టి చెబుతున్నా. ఆ తరువాత నాలో ఇప్పుడొక అనుమానం తలెత్తింది. దాన్ని కూడా నివర్తి చేసుకుంటాను"

"ఏమిటా అనుమానం?"

"అది...అక్కడికిరా చెబుతాను"--- వీరబద్రం, కార్తిక్ తో చెప్పి వేగంగా కారు దగ్గరకు వెళ్ళాడు.

కార్తిక్ కూడా ఇంటికి తాళం పెట్టి, తాళంచెవి పక్కింట్లో ఇచ్చి అతనితో దూకుడు వేగంతో కారులోకి ఎక్కాడు.

                                             *********************************

కారు బయలుదేరింది.

"సారీ బద్రం...నా వల్ల నీకు మళ్ళీ మళ్ళీ శ్రమ"

"ఈ ఫార్మాలిటీ మాటలు నువ్వు మానవే మానవా?"

"నీకు శ్రమగానే లేదారా?"

"లేదు...దీనిని నేను చాలా 'ఎంజాయ్' చేస్తున్నాను. రేపే బెంగుళూరు వెళ్ళిపోతే...నా ముందు కంప్యూటర్, మానీటర్ మాత్రమే ఉంటాయి. ఒక ఏసీ రూములో ఒంటరిగా కూర్చుని, అన్నీ మర్చిపోయి పనిమాత్రం చేయాలి.---నేను ఎగిరే పక్షిలాంటి వాడినని నీకు తెలుసు. కానీ డబ్బుల కోసం ఒక రూములో ఉండాల్సి వస్తోంది. ఏదో అపురూపంగా...ఊరికి వచ్చినందు వలన ఇంటెరెస్టుగా ఒక సమస్య చిక్కుకుంది. దీన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానురా...!"

"ఇక్కడ నాకు దఢ దఢ లాడుతొంది...కానీ, నీకు ఏంజాయబుల్ గా ఉందా?"

"ఇప్పుడు చెబుతున్నా కార్తిక్. జరుగుతున్న దానికీ, గాలిదేవుడికీ ఎటువంటి సంబంధమూ లేదు. ఆయన పాపం రా..."

"ఊహు...నిన్ను మార్చనే లేమురా...!"

"మారాల్సింది నువ్వేరా! దేవుడు... మీ తాతయ్యను ఇల్లు అడిగాడా? ఇల్లు ఇస్తేనే నీ మనవుడ్ని, అంటే నిన్ను కాపాడతానని మీ తాతయ్యను బెదిరించాడా?"

"లేదు..."

"ఏదైనా పెద్ద కానుకగా ఇస్తానని వేడుకోమని పుజారి చెప్పాడం వలన మీ తాతయ్య ఇల్లు ఇస్తానని వేడుకున్నాడు. మీ తాతయ్య చనిపోయిన తరువాత మీరు ఆ ఇల్లు ఖాలీ చేసేసి నగరానికి వచ్చాశారు....ఆ తరువాత అయినా మీ గాలిదేవుడు వచ్చి ఆ ఇంట్లో నివసించాడా?"

"లే...లేదు"

"ఇప్పుడు ఆ ఇంటిని అమ్మాలని నిర్ణయించుకున్నారు...ఆయన నిజంగా ఉండుంటే ఏం చేసుండాలి?"

"................"కార్తిక్ మౌనంగా ఉన్నాడు.

"ఏమిటిది?...ఇచ్చింది తిరిగి తీసుకుంటున్నారు. అని మీ గాలిదేవుడు నేరుగా వచ్చి అడగొచ్చు కదా?"

"బద్రం దయచేసి టాపిక్ మార్చరా....నాకు తల నొప్పిగా ఉంది"----కార్తిక్ నీరసమైన స్వరం విని నవ్వుకున్నాడు వీరబద్రం.

"అంతేలేరా...సమాధానం చెప్పలేకపోతే, ఇలాగే మాటమారుస్తారు"--అంటూ కారు గీరు మార్చాడు వీరబద్రం.

----కారు వేగం పుంజుకుంది.

                                                                                                                (ఇంకా ఉంది) ****************************************************************************************************

27, మే 2020, బుధవారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-10




                                           గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                              (PART-10)


"కార్తిక్ ను పాము కరిచినట్టు సర్పంచ్ 'ఫోన్’ చేసిన వెంటనే మాకు ప్రాణమే పోయినట్లు అయ్యింది వీరబద్రం. వెంటనే 'టాక్సీ' కి ఫోన్ చేసి, అదొచ్చిన వెంటనే బయలుదేరాం"

“మా అవసరాన్ని అర్ధం చేసుకున్న డ్రైవర్ వేగంగానూ, అదే సమయం జాగ్రత్తగానూ వచ్చాడు. కానీ, ఆ చింత చెట్టు దగ్గరకు వచ్చిన వెంటనే ఎక్కడ్నుంచో వచ్చిన ఒక రాయి...కారు ముందు బ్యానెట్ పైన పడింది. అంతే డ్రైవర్ కి కాన్సెంట్రేషన్ పోయింది. కారు...పక్కనున్న చింత చెట్టుకు గుద్దుకుంది. అంతవరుకే నాకు తెలుసు, తరువాత స్ఫుహ కోల్పోయాను"

రామశర్మ గారు ఆపకుండా మాట్లాడేసి, గుండె దఢ తగ్గకుండా చూశారు.

అది విన్న వీరబద్రం తీవ్రమైన ఆలొచనలో పడ్డాడు.

"సందేహమే లేదురా...మన కారు మీద పడిన కోడి రక్తం, రాయి ఆకారంలో కనబడింది. ఇక్కడ నాన్నా-అమ్మ వచ్చిన కారు ముందు నిజమైన రాయి ఎగురుతూ వచ్చి పడింది. ఇది గాలిదేవుడి పనేరా..." చెప్పాడు కార్తిక్ ఆందోళనతో.

"అందులో సందేహమేముంది? 'నా ఆస్తిని అమ్మటానికి మీరు ఎవర్రా?'అని ఆ గాలిదేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. డబ్బులు లేవని అతని వరకు అతని ఆస్తిలో హక్కు తీసుకోవటం పెద్ద తప్పు"--కార్తీక్ను సమర్ధించాడు రామశర్మ.

కానీ, వీరబద్రానికి అంతా గందరగోళంగానే ఉన్నది.

"ఏం వీరబద్రం ఏమిటి ఆలొచిస్తున్నావు...నువ్వు ఇంకా నమ్మలేకపోతున్నావు కదూ ?"

వీరబద్రం సమాధానం చెప్పటానికి ఆలొచిస్తున్నప్పుడు, కార్తిక్ అడ్డుపడి సమాధానం చెప్పాడు.

"అవును నాన్నా...మొదటి నుండీ బద్రం ఇదంతా అబద్దం...మూర్ఖత్వం అని అనుకుంటున్నాడు, మట్లాడుతున్నాడు"

"ఇంకా నమ్మకం రాలేదా?"

"అవును సార్! అనుకోకుండా రెండు సంఘటనలు జరిగినై. వెంటనే ఆ సంఘటనలను గాలిదేవుడికి సంబంధ పరచటం సరికాదు..."

"ఏది అనుకోకుండా జరిగింది...యాక్సిడెంటా?"

"అవును...యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరగటమే కదా?"

"అప్పుడు కారు మీద పడ్డ రాయి?"

"అక్కడే నాకు కొంచం అనుమానంగా ఉంది..."

"ఇందులో అనుమానం ఏమీ లేదు! నువ్వు నగరం కుర్రాడివి. గ్రామంలోని నమ్మకాలు నీకు వేడుకుగానూ...ముర్ఖత్వంగానూ తెలుస్తుంది. కానీ మేము అక్కడే పుట్టి పెరిగాము"

"అయితే...ఏ నమ్మకంతో ఆ ఇల్లును అమ్మాలనే నిర్ణయానికి వచ్చారు?"

"గాలిదేవుడు పెద్ద మనసుతో వదిలిపెడతాడనే నమ్మకంతో..."

"ఇప్పుడు మీ నిర్ణయం?"

"ఇక గాలిపేట ఇల్లు గురించి ఆలొచించ దలుచుకోలేదు. గాయాలు తగ్గిన వెంటనే కుటుంబమంతా కలిసి వెళ్ళి గాలిదేవుడి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగటమొకటే మా కున్న ఒకే దారి..."

రామశర్మ గారి నిర్ణయం వీరబద్రం మొహంలో హేళన నవ్వు తెప్పించింది.

"నువ్వు నవ్వితే నవ్వుకో...నా నిర్ణయంలో మార్పు లేదు..."

"ఎలా సార్ ఏమీ ఆలొచించకుండా ఈ నిర్ణయానికి వచ్చారు?"

"ఇది ఆలొచించి తీసుకున్న నిర్ణయమే. ఆలొచించకుండా తీసుకున్న నిర్ణయం అని నీకు అనిపిస్తున్నదే, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది"

"ఖచ్చితంగా సార్! దేవుడు ఉన్నాడో...లేడో...ఉంటే మంచిగా ఉంటాడనేదే నా ఆలొచన సార్. అలాంటి దేవుడు మీ వరకు పెద్ద మనసు చూపలేదు అంటున్నారు చూడండి...అది తలచుకున్నందుకే నాకు నవ్వు వచ్చింది"

----వీరబద్రం చెప్పిన విధం రామశర్మ గారికి నచ్చలేదు.

అంతవరకు మాట్లాడకుండా ఉన్న కార్తిక్ భార్య నోరు తెరిచింది.

"మామయ్యా... వీరబద్రం అన్నయ్య చెప్పేదే నాకు సరి అనిపిస్తోంది!"

అది విన్న కార్తిక్ షాక్ అయ్యాడు.

"అఖిలా...ఏం మాట్లాడుతున్నావు నువ్వు?"

"దేవుడికి...క్షమించటం, అనుగ్రహించటం, ఆశీర్వదించటం, సహాయపడటం, తోడుగా ఉండటం మాత్రమే తెలుసు. ఏ దేవుడూ ఇలా కనబడకుండా దాక్కుని భక్తులను బెదిరించడు"

"నువ్వు చెప్పింది రాముడికి, కృష్ణుడుకి సరిగ్గా ఉంటుంది. గాలిదేవుడికి సరిపోదు. ఆ దేవుడు కోపం దేవుడు..."

"దేవుడు ఒక్కడే...పేర్లు మాత్రం వేరు వేరు! ఉగ్ర దైవం, శాంత దైవం అనేదంతా మన వర్ణణ"

అఖిల మాటలు... వీరబద్రాన్ని కొంచం భ్రమలో పడేసింది.

"అఖిలా...నువ్విలా మనసు విప్పి మాట్లాడి నేను విన్నదే లేదు. ఇప్పుడే వింటున్నా. బాగా మాట్లాడుతున్నావు. నీలాగే ఆలొచించాలి"

"చాలు... బద్రం! ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయ్"…..కార్తిక్ చెప్పాడు.

"నేను వదిలేస్తాను...పెళ్ళి ఖర్చులకు ఏం చెయ్యబోతారు?”

"ఏదైనా చేసే కదా కావాలి! మెడలోని తాలి వరకైనా సరే అమ్మేసి పెళ్ళి చేసేస్తాం"

"కార్తిక్...క్లియర్ గానూ, ధైర్యంగానూ ఆలొచించాలి. కానీ, మీరందరూ గందరగొళంతోనూ, భయంతోనూ ఆలొచిస్తున్నారు"

"ఇలా చూడు వీరబద్రం...నీ అభిమానానికి చాలా సంతోషం. ఒక స్నేహితుడిగా ఇలాగే ఉండాలి. నువ్వు చెప్పినట్టు ఇది అనుకోకుండా జరిగినవే అయ్యుండచ్చు. కానీ, మా మనసులో భయం వచ్చేసింది. అందువలన దీన్ని ఇలాగే వదిలేద్దాం. అదే కరెక్ట్..." ---- రామశర్మ గారు...ఒక పులుస్టాప్ పెట్టి ఆ సంభాషణను ముగించారు.

వీరబద్రం వలన కూడా అంతకంటే మాట్లాడటం కుదరలేదు. హాస్పిటల్ వార్డు వదలి బయటకు వచ్చాడు.

కార్తిక్ అతని వెనుకే వచ్చాడు. పక్క వార్డులో ఉన్న విమలాదేవిని చూశారు. వీళ్ళిద్దర్నీ చూసిన వెంటనే ఆమె కూడా వెక్కి వెక్కి ఏడ్చింది.

ఏడుస్తూనే, "కార్తిక్...ఇంటికి వెళ్ళి బామ్మను చూసి...మేము బాగానే ఉన్నామని, త్వరగానే కోలుకుంటామని, ఏ ఆపదా లేదని చెప్పు. లేకపోతే బెదిరిపోయి, ఏ సమాచరమూ రాలేదని భయపడి, ఆ భయంతోనే చచ్చిపోతుంది..." అని గుర్తు చేసింది.

"సరేనమ్మా....నువ్వు ధైర్యంగా ఉండు"

"మేము ధైర్యంగా ఉండటం అటుంచు. పాము కాటేసిన నీకు ఏమీ కాలేదు కదా?"

"నేను బాగానే ఉన్నానమ్మా..."

అమ్మకు ధైర్యం చెప్పి కార్తిక్, వీరబద్రం బయటకు వచ్చారు.

కారు దగ్గరకు వచ్చారు.

"కార్తిక్...నిన్ను ఇంట్లో డ్రాప్ చేసి నేను వెళ్తాను"--చెప్పాడు వీరబద్రం.

"సరేరా...! అవును, నీకు ఇంకా ఎన్ని రోజులు లీవు ఉంది?"

"నేను ఈ రోజు ఆఫీసుకు వెళ్ళాలి కార్తిక్. నా లీవు నిన్నటితో ముగిసింది. ఈ రోజు ఒక రోజుకు లీవు 'ఎక్స్ టెండ్' చేశాను"

"థ్యాంక్స్ రా...! నువ్వు ఉన్నందువలనే ఇక్కడ కొన్ని విషయాలు త్వరగా చేయగలిగాను"

"ఈ ఫార్మాలిటీ మాటలన్నీ నా దగ్గర వద్దు. నీకూ,నాకూ చిన్నప్పటి నుంచి స్నేహం. గుర్తుంచుకో..."

"గుర్తుంచుకోవటానికి ఎక్కడరా నేను అది మరిచిపోయాను?"

"మరైతే ఎందుకురా థ్యాంక్స్-గీంక్స్ అంతా?" అంటూ కారు తీసాడు వీరబద్రం.

కార్తిక్ కారులో కూర్చున్నాడు....కారు వేగంగా బయలుదేరింది.

కార్తిక్ ఇంటి బయట కారు ఆగింది. దిగి లోపలకు వెళ్ళి చూసినప్పుడు కార్తీక్ కు, వీరబద్రానికి ఒక షాక్ కాచుకోనుంది.

                                                                                                             (ఇంకా ఉంది) *************************************************************************************************

25, మే 2020, సోమవారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-9




                                            గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                                (PART-9)


జీవితంలో గొప్పగా విజయం సాధించిన కొందరి దగ్గర ఒక సర్వే జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ విజయానికి కారణం వాళ్ళు చిన్న వయసు నుండే కలలు కన్న వాళ్ళుగా ఉండటమే ఆశ్చర్యం.

అందులో పలు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినై. విజయం సాధించినవారి విజయం వెనుక వాళ్ళ తల్లి-తండ్రుల కలలూ దాగి ఉన్నాయి.

ముఖ్యంగా సినిమా రంగంలో పెద్దగా విజయం సాధించిన వారి మనసుల్లో వాళ్ళు చాలా కాలంగా సినిమాలో విజయం సాధించాలనే పడ్డ తపన...కోరిక ఎక్కువగా ఉన్నది.

అదేలాగా క్రికెట్టులో విజయం సాధించటానికి ఒక వీరుడు, "నేను ఎప్పుడూ ఎదో ఒకటి తీసుకుని దానితో ఒకదాన్ని కొడుతూ ఉండే వాడిని. అదేలాగా రోడ్డు మీద పడున్న రాళ్ళను ఏరుకుని ఎక్కడైనా గురిచూసి వేసేవాడిని" అన్నారు.

తరువాత రోజులలో అతను ఎలా కొట్టినది...గురి చూసి వేసినదే క్రికెట్టు ఆటలో అతన్ని పెద్ద వీరుడుగా చేసింది.

మనసులో పాతుకుపోయిన ఇలాంటి ఇష్టాలు ఎలా విజయంగా మరినై? దాన్నీ నిపుణులు కనుగొన్నారు. అది ఒక ఆశ్చర్యకరమైన జవాబే!

వెక్కి వెక్కి ఏడుస్తున్న కార్తిక్ ను గమనించిన వీరబద్రం "కార్తిక్... ఎవరురా ఫోనులో...ఎందుకురా ఏడుస్తున్నావు?"

“బద్రం! దెబ్బకు పైన దెబ్బరా. నన్ను పాము కరిచిన విషయం తెలిసి అమ్మా-నాన్నలు బెదిరిపోయి ఒక కారులో నన్ను చూడటానికి వస్తున్నారు. వచ్చే దారిలో వారు కారు ప్రమాదానికి గురై వాళ్ళిద్దరూ రోడ్డు మీద పడున్నారట..."

"నిజంగానా! అవును...ఎక్కడ?"

"నువ్వు వేగంగా వెళ్ళు...మనం వచ్చిన దారిలోనే"--కార్తిక్ కన్నీళ్ళు తుడుచుకుంటూ చెప్పడంతో......

"అంతలోపు ఇంత దూరం వచేశారా?"--అని అడుగుతూ, కారు వేగం పెంచాడు వీరబద్రం. కారు వేగానికి మట్టిరోడ్డు కదా దుమ్ము పైకి లేచింది.

రోడ్డుకు చివర్లో నడుస్తున్న బాతుల గుంపు నీటి గుంట ఉన్న వైపు వెడుతున్నాయి. అవన్నీ కారు వేగం చూసి బెదిరిపోయి ఎగరటంతో కలవరం మొదలైంది.

బాతులను తోలుకెలుతున్న కాపరి అలాగే పక్కనున్న మొక్కల పొదల్లో పడుతూ గట్టిగా అరిచాడు.

వీరబద్రానికి మొదటి సారిగా...'ఒకవేల నిజంగానే గాలిదేవుడు ఉన్నాడో?' అనే ఆలొచన మొదలైయ్యింది.

                                                        ****************

రోడ్డు చివర!

అక్కడున్న చింత చెట్టుకు ఒక కారు ఢీ కొని, కారు బ్యానెట్ తెరవబడి ఉండగా...కారుకు ఇరుపక్కలున్న డోర్స్ పక్షి రెక్కలలాగా విరుచుకోనున్నాయి.

"అదిగో ఆక్సిడెంట్ కారు...!"

వీరబద్రం ఎదురుగా చూస్తూ కొంచం గట్టిగా చెప్పగా... కార్తిక్ గమనించాడు.

వేగంగా వచ్చిన వీరబద్రం కారు...యాక్సిడెంట్ అయిన కారును అనుకుని నిలబడ్డది. అదే సమయం...సైరన్ మోతతో ఒక ఆంబులాన్స్ వచ్చి నిలబడ్డది. చుట్టూ ఉన్న ప్రజలందరూ అక్కడ గుమికూడారు.

కార్తిక్ ఆందోళనతో తనొచ్చిన కారులోంచి దిగి పరిగెత్తాడు.

రామశర్మ గారు, విమలాదేవి ఒకరి మీద ఒకరు పడున్నారు. ఇద్దరిలో విమలాదేవికి తలమీద దెబ్బ తగిలి రక్తం కారుతోంది. రామశర్మ గారికి కాలు మీద గాయం.

వణుకుతూ వాళ్ళను ముట్టుకోవటానికి వెళ్ళిన కార్తిక్ ను ఆంబులాన్స్ లో వచ్చిన హాస్పిటల్ స్టాఫ్ పక్కకు తోసి, వాళ్ళిద్దర్నీ స్టెక్చర్లో ఎక్కించారు. వాళ్ళతో వచ్చిన డాక్టర్ ఆంబులాన్స్ లోనే చేయాల్సిన ఫస్ట్ ఏయిడ్ చెయటం మొదలుపెట్టాడు.

ఐదు నిమిషాలు కూడా అవలేదు! ఆంబులాన్స్ బయలుదేరింది.

"అమ్మా...నాన్నా..." అంటూ కేకలు వేశాడు కార్తిక్.

"మీరు వాళ్ళ అబ్బాయా?"

"అవును డాక్టర్"

"అలాగే ఫాలో చేస్తూ రండి. ప్రాణాపాయం ఏమీ లేదు. కానీ, ఎముకులు విరగటానికీ...చర్మం గీసుకుపోవటానికీ ఎక్కువ చాన్స్ ఉంది"-- అన్నారు.

డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు...యాక్సిడెంట్ జరిగిన చోటును తన మొబైల్ కెమేరాలోనూ, డిజిటల్ కెమేరాలోనూ ఒకతను పలు కోణాలలోంచి ఫోటోలు తీసాడు. ఇంతలొ పోలీసులు కూడా వచ్చారు.

"అయ్యా...'ఢాం' అని పెద్ద శబ్ధం వినబడగానే వచ్చి చూసానయ్యా. ఒకాయన, ఒకమ్మగారూ బోర్లా పడున్నారు. కారు డ్రైవ్ చేసుకు వచ్చిన డ్రైవర్...మేము చూసేటప్పుడు పరిగెత్తి వెళ్ళిపోయాడండి”

"దొంగ వెధవ...మందు తాగి కారు నడిపుంటాడు. అందుకనే చిక్కితే చితకబాదుతారని పరిగెత్తి తప్పించుకున్నాడు..." అని ఒక పోలీస్ అతను చెప్పగా, ఇంకొక పోలీసు కారును ఒక చుట్టు చుట్టి వచ్చాడు. 'డాష్ బోర్డు’ నుండి చూడ గలిగింది చూశాడు. ముఖ్యంగా 'ఆర్.సి పేపర్లూ', 'ఇన్స్యూరన్స్ జెరాక్స్’ ఒక కవరులో ఉన్నాయి. అది చాలు వాళ్ళకు...డ్రైవర్ను పట్టుకుని లోపల వెయ్యటానికి.

ఆంబులాన్స్ బయలుదేరింది. వీరబద్రం, కార్తిక్ దాన్ని వెంబడించారు.

వీరబద్రం ఈ సారి కార్తిక్ దగ్గర ఏమీ అడగలేదు, మాట్లాడలేదు.

కానీ, అతని మనసులో 'గాలిదేవుడు ఇలా ఒక కోపమైన దేవుడా?' అనే ప్రశ్న మాత్రం పెద్దగా తలెత్తింది.

                                                         *********************

ఖచ్చితంగా ఇరవై గంటల విరామం తరువాత రామశర్మ గారు, విమలాదేవి గారూ కళ్ళు తెరిచారు.

రామశర్మ గారికి తొడ ఎముక విరిగింది. 'ప్లేట్' పెట్టాలి. విమలాదేవి గారికి తల మీద ఆరు కుట్లు వేశారు.

కళ్ళు తెరిచిన రామశర్మ గారి కళ్ళ ముందు, ఏడుస్తున్న కార్తిక్, అతనికి దగ్గరగా అతని భార్య అఖిలా, చెల్లెలు పల్లవి. వాళ్ళ ముఖాలు వాడిపోయున్నాయి.

"కార్తిక్..."

"నాన్నా..."

"నీకేమీ అవలేదే...?"

"నన్ను చూస్తున్నారు కదా నాన్నా...నేను బాగానే ఉన్నాను"

"పాము కరిచినట్టు 'ఫోన్’ వచ్చిందే?"

"అవును! కానీ, నాటు వైద్యుడు కాపాడాడు. ‘జి.హెచ్’ కు వెల్లి ఇంజెక్షన్ చేయించుకున్నాను. 'ఐ యాం ఆల్ రైట్'! కానీ మీకు ఇలా జరగటమే నన్ను ఎక్కువ కలవరపరిచింది"

"నన్ను వదులు! మీ అమ్మ ఎలా ఉంది?"

"బాగుంది...మాట్లాడుతోంది"

"భగవంతుడా! కాపాడేవయ్యా...కాపాడేశేవు"

"అవును నాన్నా...ఆ గాలిదేవుడు మనల్ని చిన్నగా దెబ్బ వేసి వదిలేశాడు. నేను ఇక మీదట ఆ ఇంటి పక్కకే వెళ్ళను నాన్నా. బామ్మ చెప్పింది కరెక్టే! ఆ దేవుడు చాలా పవర్ ఫుల్"

"అవును కార్తిక్...దాన్ని యాక్సిడెంట్ అయిన చోటే గ్రహించాము"

రామశర్మ గారు అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వీరబద్రం వచ్చాడు.

అతని చేతిలో ఆపిల్, ఆరెంజ్ పండ్లు.

"వీరబద్రం...వచ్చేశేవా? నిన్నే మొదటగా చూడాలని ఆశపడ్డాను. రా...రా..."

"మీకు ఇప్పుడెలా ఉంది అంకుల్?"

"కాలు ఎముక విరిగిందట! కట్టు వేసి 'పైన్ కిల్లర్’ ఇంజేక్షన్ ఇచ్చినందు వలన మీ అందరితో మాట్లాడ గలుగుతున్నాను"

"యాక్సిడెంట్ ఎలా జరిగింది అంకుల్...డ్రైవర్ తాగుబోతా?"

"లేదబ్బాయ్...మంచి డ్రైవర్. నాకు బాగా అలవాటున్న వాడు"

"మరెలా...?"

"చెబుతాను...!”

                                                                                                      (ఇంకా ఉంది) ************************************************************************************************

23, మే 2020, శనివారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-8




                                             గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                                 (PART-8)


"వైద్యులుగారూ...మీరు ఏమీ చెప్పనే లేదే?"

"తమ్ముడూ...నేను ఏం చెప్పాలని మీరు ఎదురు చూస్తున్నారు"

"లేదూ...మీకు ఈ గాలిదేవుడి మీద భక్తి లేదా? బైకు మీద వచ్చిన ఆయన చెప్పింది కరెక్టేనా?"

"నమ్మితే అదొక దేవుడు. అంతెందుకు... ‘నమ్మకం’ అని ఒకటుందే! నా వరకు అదే ఒక దేవుడు"

"ఇది బాగుందే...! దీన్ని నేను అంగీకరిస్తాను. నమ్మకంతో ఉండాలి. నమ్మకాన్ని వదిలిపెట్టకూడదు. నమ్మకమే మనిషి యొక్క బలం. దాన్ని దేవుడి దగ్గర చెప్పక్కరలేదు. చెప్పినా తప్పులేదు"

"అదే సమయం మాట శుభ్రత కూడా ముఖ్యం"

"ఒప్పుకుంటాను...! మనిషికి మాట చాలా ముఖ్యం. అప్పుడొకమాట, ఇప్పుడొకమాట మాట్లాడకూడదు"

"అలాంటప్పుడు ఎందుకు తమ్ముడూ గాలిదేవుడి ఇంట్లోకి మాత్రం వెళ్ళారు?"

-----వైద్యుడు సడన్ గా అలాంటి ప్రశ్న వేస్తాడని వీరబద్రం ఎదురు చూడలేదు.

"వైద్యులు గారూ! మీరు నా నమ్మకం గురించి మాట్లాడేసి, అలాగే ఆ ఇంటి విషయానికి వచ్చారే?"

"నేను రాలేదు. మీ అభిప్రాయమే నన్ను రప్పించింది!"

"నా అభిప్రాయమా?"

"అవును! మాట మరకూడదు, అప్పుడొకమాట, ఇప్పుడొకమాట మాట్లాడకూడదు అని చెప్పేరే?"

"అవును...అదే నా నీతి కూడా!"

"మరి ఆ నీతి...ఇదిగో ఇక్కడ నిలబడ్డ పంతుల కొడుక్కి లేదా?"

"ఓ...మీరు అలా చెబుతున్నారా?"

"నేరుగానే మాట్లాడతాను...! గాలిదేవుడికి ఆ ఇల్లు ఇస్తానని మొక్కుకుని...ఇంటిని అప్పగించి వెళ్ళిన పరిస్థితుల్లో, ఇప్పుడొచ్చి ఆ ఇంటిని తీసుకోవడం కరెక్టేనా?"

"వైద్యులు గారూ...మిమ్మల్ని ఏమిటో అనుకున్నాను. మీ కంటే ఆ 'మోటార్ సైకిల్’ అతనే బెటర్ గా ఉన్నాడే. అతను తన భయాన్ని మాత్రమే చూపాడు. కానీ, మీరు భయపెట్టకుండా...లోతుగా కొడుతున్నారు…..సరే...మీ ప్రశ్నకే వస్తాను!... కార్తిక్ యొక్క తాతయ్య ఉద్రేకంలో దేవుడి దగ్గర మొక్కుకోనుంటారు. కానీ, అదొక మాయ...ఆంగ్లంలో ఇంట్యూషన్ అని చెబుతారు. లేని ఒక గాలిదేవుడ్ని ఉన్నట్టుగానే నమ్మి ఉద్రేకపడుతూ మాట్లాడిన మాటలు...నిజంగా మాట్లాడిన మాటలు అవవు. లేదు...అది నేను ఒప్పుకోనూ అని మీరు చెబితే, నేను ఇప్పుడు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పండి. అంత భక్తితో ఇచ్చిన ఇంటిని గాలిదేవుడే వచ్చి ఎందుకు తీసుకోలేదు?"

"ఏమిటీ...తీసుకోలేదా? ఇవేం మాటలు తమ్ముడూ?"

“ఆయనుంటే...ఆయన తీసుకునే ఉంటాడు. ఆ ఇంటిని శుభ్రంగా ఉంచుకోనుంటాడు! ఇలాగా పాములూ, తేళ్ళూ అక్కడ తిరుగుతూ ఉంటాయా?”

“దేవుడు తిరిగే చోటు అలాగే ఉంటుంది తమ్ముడూ. పాము ఆయనకు పూల దండలాగా. తేలు ఆయనకు చీమలాగా?"

"అదే నిజమైతే అవి మన్యుష్యులను ఏమీ చేయవు. కాటు వేయవు. ఏ దేవుడైనా ఎప్పుడూ మంచివాళ్ళను దండించడు. అవినీతి పరులనూ, పాపాత్ములను దండిస్తాడు.మీరు నా ప్రశ్నకు కరెక్టు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అందుకే ఏవో కబుర్లు చెప్పటం మొదలు పెట్టారు. పరవలేదు. నా స్నేహితుడ్ని కాపాడారు. మీకు చాలా థ్యాంక్స్. మీ ఫీజు ఎంత?"

"ఎవరై ఉన్నా, ఏ వ్యాధి అయినా ఇప్పుడు యాభై ఒక్క రూపాయలు తీసుకుంటున్నాను. ఇంతకు ముందు పద్దెనిమిది రూపాయలు తీసుకునేవాడిని. ఇప్పుడు ధరలన్నీ పెరిగినై కదా...జరుగుబాటు కావాలి కదా?"

"పరవాలేదు! ఏదో ఫీజు విషయంలోనైనా ఈ కాలం మనిషిలాగా ఉన్నారే...చాలా సంతోషం" --- అన్నాడు.

వాళ్ళ మాటలు వింటున్న కార్తిక్ లేచి కూర్చోనున్నాడు.

"తమ్ముడూ...నందిగామ వెళ్ళేటప్పుడు పెద్దాసుపత్రి వస్తుంది. ఎందుకైనా మంచిది. అక్కడికి వెళ్ళి పాము కాటు మందు వేసుకోండి. రేపే లేచి పరిగెత్తొచ్చు..." అంటున్న వైద్యుడ్ని చూసి నవ్వుతూ కార్తిక్ ను లేపి చేతులు పుచ్చుకుని నిదానంగా తీసుకెళ్ళి కారులో ఎక్కించాడు వీరబద్రం.

కార్తిక్ ముఖంలో నీరసం. సీటులో వెనుకకి వాలి పెద్ద నిట్టూర్పు విడిచాడు.

"ఏమీ లేదు కార్తిక్...వైద్యుడు చెప్పినట్టు జి.హెచ్ కు వెళ్ళి ఒక ఇంజెక్షన్ వేసుకుందాం...ఏం...?"

"ఊ..."

"సరే...బయలుదేరుదామా?"

"వెల్దాం..."

"తిరిగి రేపో, ఎల్లుండో వచ్చి ఇంటిని పూర్తిగా శుభ్ర పరిచేద్దాం. అప్పుడుంది ఈ పాముకు పాఠం"

---మాట్లాడుతూ కారులోకి ఎక్కాడు!

ఊరి జనం అక్కడక్కడ నిలబడి వీళ్ళను ఆశ్చర్యంగా చూస్తున్నారు.

"మంచికాలం...ఎవరూ వచ్చి గాలిదేవుడి పురాణం పెద్దగా మాట్లాడలేదు. వైద్యుడు మాత్రం కొంచం తెలివిగా మొదలుపెట్టాడు, కానీ మూర్ఖత్వంగా ముగించాడు" అంటూ కారును స్టార్ట్ చేసి పోనిచ్చాడు.

కారు వేగం పుంజుకుంది!

కార్తిక్ మౌనంగా ఉండిపోయాడు.

"ఏమిట్రా కార్తిక్...బాగా నీరసంగా ఉన్నదా?"

"అవును బద్రం! నేను చచ్చిపోతానేమో అనుకున్నాను. ఇప్పుడు ప్రాణాలతో ఉండటం చూస్తే కలలాగా ఉంది"

"వైద్యుడు కొంచం విషయం తెలిసినతను. అందుకే నిన్ను కాపాడగలిగాడు. నేను కూడా కొంచం భయపడ్డాను. కానీ, జీవితంలో ఇలాంటి ఆపదలు ఏర్పడుతూనే ఉంటాయి. దాన్ని తెలివితేటలతో దాటి వెళ్ళిపోవాలి. అలాంటి ఒక ఆపదనే నువ్వు ఇప్పుడు దాటాసావు..."

“నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు బద్రం. కానీ, ఒక విషయం..."

"ఏమిట్రా...?"

"ఇక ఈ ఇంటి విషయంలో నేను రిస్కు తీసుకో దలచుకోలేదు"

కార్తిక్ అలా చెప్పటంతో 'కీచ్' మన్న శబ్ధంతో కారు ఆగింది. ఎందుకంటే సడన్ బ్రేకు వేశాడు వీరబద్రం.

"ఏమిట్రా ఇది...కార్తిక్ తన భయాందోళనలను ఇంకా వ్యక్తం చేయలేదే అనుకున్నా...నోరు తెరిచావా!"

"లేదు బద్రం...నాకు ఇలా జరిగిందని నాన్నా-అమ్మకు ఈపాటికి ఈ విషయం తెలిసుంటుంది. వాళ్ళింక నన్ను...ఈ ఊరి గురించే తలుచుకోకూడదని చెబుతారు చూడు..."

"అదెలారా నేనూ-నువ్వూ చెప్పకుండా మీ అమ్మా-నాన్నలకు ఈ విషయం ఎలా తెలుస్తుంది?"

“ఆ వీధి మొత్తం చూస్తుండగానే కదా నువ్వు నన్ను వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళావు? ఆ వీధిలోనే సర్పంచ్ ఉన్నాడు. అతను ఫోను చేసి చెప్పేసుంటాడు"

కార్తిక్ ఊహించినది కరక్టే అన్నట్టు కార్తిక్ ఫోనుకు పిలుపు వచ్చింది.

"నాన్నే అనుకుంటా...! వైద్యుడి ఇంటి దగ్గర టవర్ సరిగ్గా లేదు. అందుకే అక్కడ సిగ్నల్ వర్క్ చేయలేదు. ఇలా వచ్చామో లేదో వర్క్ చేస్తోంది!" అంటూ జేబులో నుండి సెల్ ఫోన్ తీశాడు కార్తిక్.

అతని తండ్రే……

ఆయన పేరు కనబడింది!

కానీ, మాట్లాడింది వేరే ఎవరో?

"హలో...ఎవరు మాట్లాడుతున్నారు?"

"ఎవరా?...నేను కార్తిక్ ను. మీరెవరు?"

"నేను ఎవరనేది చెబితే మీకు తెలియదు తమ్ముడూ. ఇక్కడ ఒక కారు యాక్సిడెంట్ అయ్యింది. అందులో ఉన్న ఇద్దరూ ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయి పడున్నారు. ఈ సెల్ ఫోన్ పక్కన పడుంది. ఎత్తి చూసి, అందులోని చివరి నెంబర్ ను చూసి ఆ నెంబర్ కు ఫోన్ చేశాను. మీరు వీళ్ళకు బంధువా?"

"నేను వాళ్ళ అబ్బాయిని! అవును యాక్సిడెంటా...ఎక్కడ జరిగింది?"

"ఇక్కడే నందిగామ కూడలి రోడ్డులో, గాలిపేట మట్టి రోడ్డులో..."

"మై గాడ్! ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారా?"

"మీరు ఎక్కడున్నా వేగంగా...ధైర్యంగా రండి. ప్రాణానికి ఎటువంటి ముప్పూ లేదు"

“సరే నండి...మేము పక్కనే ఉన్నాము. ఒక పది నిమిషాలలో వచ్చేస్తాము"---అని చెప్పి సెల్ ఫోన్ కట్ చేసిన కార్తిక్. వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టాడు!

                                                                                                   (ఇంకా ఉంది) *************************************************************************************************

21, మే 2020, గురువారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-7




                                         గాలితో ఒక యుద్దం (సీరియల్)   
                                                             (PART-7)

ఆ పరిశోధనకు తరువాత మనిషి యొక్క ఆలొచనా తరంగాలు అయిస్కాంత ఆలొచనలలాగా ఒక విధమైన ఆలొచనలుగా మారటానికి ఆల్ఫా, బీటా, గామా, డీటా అని పేర్లు కనుగొన్నారు. అందులో ఆల్ఫా అనేది లోతు మనసులో మనం ఆలొచించేవి. బయట ప్రపంచంలో నుండి వినబడుతున్న ఏ శబ్ధాన్నీ చెవితో వింటున్నా, ఆలొచనలోకి తీసుకోకుండా, మామూలు ఆలొచనల పరుగుకు మధ్య లోతు మనసుకు వెళ్ళి అక్కడ మనం...మనకు బాగా ఇష్టమైన వారి యొక్క బాగోగులు గురించో...లేక; వాళ్ళల్లో కొన్ని మార్పులు ఇష్టపడో...మనం ధ్యానంలో శ్రద్ద పెట్టినప్పుడు, సంబంధించిన వారి లోతైన మనసులో మన ఆలొచనల తాకిడి తగిలి వాళ్ళల్లో మనం ఇష్టపడే మార్పులు ఏర్పడుతాయి.

ఉదాహరణకు ఒక తల్లి తన కూతురు పెద్ద గాన కోకిలగా అవ్వాలని ఆశపడ్డది. కారణం, ఆమె కూతురి గొంతు అంత తియ్యగా ఉంటుంది. కానీ, ఆ అమ్మాయికి సంగీతం నేర్చుకుని గాన కోకిల అవ్వాలనే కోరిక కొంచం కూడా లేదు. ఎంత చెప్పినా కూతురు వినే మూడ్ లో లేదు.

ఈ పరిస్థితుల్లో తన లోతైన మనసులో కూతుర్ను తలచుకుంటూ తీవ్రంగా తన ఆశను బయటపెడుతూ ధ్యానం చేసింది. కొన్ని రోజులలోనే ఆమె కూతురిలో మార్పు. 'అమ్మా...నాకు ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆశ ఏర్పడుతోంది. నేను వెడుతున్నాను' అని చెప్పి సంగీతం నేర్చుకోవటానికి వెళ్ళింది. ఇదే లోతైన మనసు యొక్క శక్తి. ఇది అర్ధం చేసుకుని, ఆ లోతైన మనసును ఉపయోగించుకునే దాంట్లోనే చాతుర్యం ఉన్నది.

వెనుక గుమ్మం నుండి వీరబద్రం, కార్తిక్ ఇద్దరూ లోపలకు వెళ్ళేరు. మొదట వంట గదే వాళ్ళ కళ్ళకు కనబడింది. ఆ రోజుల్లో కట్టెల పొయ్యి. పొయ్యి పక్కనే ఉన్న గోడలో మసి అంటుకోనుంది.

పొయ్యికి పక్కనే రుబ్బురోలు, ఆ రుబ్బురోలు గుంటలో పై నుండి కారిన వర్షం నీరు...ఆ నీటిలో ఒక కప్ప కూడా కనబడింది.

ఇటు పక్క రాట్నం బావి.

రాట్నం కనబడలేదు.

బావి గోడల చుట్టూ పిచ్చి మొక్కలు చుట్టుకోనున్నాయి.

వీరబద్రం బావి దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు. బావిలో నీళ్ళున్నాయి—అందులో అతని ముఖం కనబడింది.

"బద్రం ఈ బావిలో నీళ్ళు ఎండి పోవు. నీళ్ళు కూడా తియ్యగా, అద్భుతంగా ఉంటాయి" అన్నాడు కార్తిక్.

"పోరా...ఇది ఎంత వసతిగల ఇల్లో. ఈ ఇంటిని ఎలారా ఎటువంటి బాధ్యత లేకుండా విడిచిపెట్టారు?"---- వీరబద్రం విసుకున్నాడు.

దాన్ని ఆమొదిస్తున్నట్టు బావి పక్కనున్న బట్టలు ఉతికే బండపైన ఒక తొండ. తన కళ్లతో వీళ్ళను ఒక చూపు చూసింది.

అక్కడ్నుంచి వంట గది. తరువాత, స్టోర్ రూము, హాలు, వాకిలి, వరాండా, చూటూ ఉన్న ఆరు గదులనూ చూశాడు. ఒక గదిలో పై నుండి కారిన వర్షం నీరు నిలబడింది. అలా చూసుకుంటూ వచ్చినప్పుడు వరాండా చివర ఒక చోట నాప రాళ్ళు పరచబడి ఉన్నాయి. వాటిని సులభంగా తీసేటట్టు ఉంచబడి ఉన్నాయి. ఆ నాపరాళ్ళను ఆశ్చర్యంగా చూశాడు వీరబద్రం.

"నువ్వెందుకురా నీ ఇంటినే కొత్తగా చూస్తున్నట్టు చూస్తున్నావు?"

"ఇక్కడ ఈ నాపరాళ్ళు ఉన్నట్టు నాకు జ్ఞాపకంలేదు...అందుకే!"

"అలా అయితే...?"

"ఇక్కడ సిమెంట్ తో పూసిన గచ్చే ఉండేది"

"అప్పుడు ఈ నాప రాళ్ళు?"

"అదే నాకూ అర్ధం కావటంలేదు..."

"అర్ధం కాదు...ఇలా ఇంటిని వదిలేస్తే ఏదైనా మారుతుంది....ఎలాగైనా మారుతుంది"

"నూవ్వేంట్రా చెబుతున్నావు?"

"ఇక్కడికి ఎవరో వచ్చి వెడుతున్నారనుకుంటా"

"ఎలా అంత ఖచ్చితంగా చెబుతున్నావు?"

"లేకపోతే ఈ చోటు మాత్రం ఎందుకు శుభ్రంగా ఉంటుంది?"

"ఓ నువ్వు అలా చెబుతున్నావా?"

"పోతే పోనీ...ఎవరూ లేని ఇంట్లో ఇలాగే ఉంటుంది! పరవాలేదు...తలుపులు, కిటికీలు, ఇవన్నీ దొంగతనం చేయలేదు. అలాగే ఉంచారు...అందుకు సంతోషించు..."

“దొంగతనమా...పోరా! గాలిదేవుడి ఆస్తి అది. దొంగతనం చేయటానికి ఎవరికి ధైర్యం వస్తుంది"

“మళ్ళీ గాలిదేవుడి ఆస్తి అని చెబుతూ నీ భయాన్ని చూపకు! ఇది మీ తాతయ్య ఆస్తి. చట్ట ప్రకారం మనవుడివైన నీకు ఇప్పుడది సొంతం. దీన్ని 'రైట్ రాయల్’ గా అమ్మే హక్కు నీకు ఉంది. నువ్వు అమ్మబోతావు; సులేమాన్ గారు కొనబోతారు. అంతే విషయం. ఏ కారణం చేతా నువ్వు గాలిదేవుడ్ని గుర్తు చేసుకోకూడదు...సరేనా?”

"సరే!....ఇంతపెద్ద ఇంటిని మనిద్దరి వల్ల శుభ్రం చేయటం కుదరదు. బయటకు వెళ్ళి ఎవరినైనా పిలుచుకు వద్దామా?"

"ఖచ్చితంగా...! ఇప్పుడు మనం చేయవలసింది అదే"

వీరబద్రం, కార్తిక్ వాకిలి గుమ్మం దగ్గరున్న దుమ్మూ, ధూళిని శుభ్రం చేసుకుంటూ వస్తున్నప్పుడు ఏక్కడ్నుంచో ఒక నాగుపాము ఒకటి వచ్చి పూలమాలలా కార్తిక్ మెడలో పడింది.

అతను ఒక్క క్షణం విలవిల లాడిపోయాడు.

అది ఆరడుగుల పొడవు ఉంటుంది.

శివుడి మెడలో ఉన్నట్టు అతని మెడలో ఆ పాము ఉండగా... కార్తిక్ బిక్క చచ్చిపోయాడు. ‘బద్రం’ అని అరవాలనుకున్నాడు. అరవలేకపోయాడు. కళ్ళు బైర్లు కమ్మాయి కిందకు ఒరిగిపోయాడు.

ఒరిగిపోతున్న కార్తిక్ మీద ఆ పాము కూడా పడింది. ఓర్పు నసించి ఆ పాము కార్తిక్ ను ఒక కాటు వేసింది.

అది కాటు వేసిన చోటు...మోకాలు క్రింది భాగం.

వీరబద్రం ఆశ్చర్యపోయాడు.

నాటు వైద్యుడు...చెవులలోనూ, ముక్కులలోనూ ఏదో మూలిక రసం పోసి, తొడపైన బిగువుగా కట్టు వేశాడు. కట్టబడ్డ చోట కత్తితో గీరి, రక్తాన్ని పీలిచి ఉమ్మేశాడు.

ఉమ్మేశిన రక్తంలో నీలి రంగు మచ్చలు ఉన్నాయి.

దగ్గరుండి గమనిస్తున్న వీరబద్రానికి వైద్యుడు ఏం చెప్పబోతాడో నన్న ఆందోళన కలిగింది. ఎంత ప్రోగ్రస్సివ్ గా ఆలొచించినా, మాట్లాడినా కూడా...కొన్ని సమస్యలను కళ్లెదురుగూ చూస్తున్నప్పుడు మనో బలం తగ్గటమే కదా జరుగుతుంది?

అందులోనూ ఇది ప్రాణంతో పోరాటం! వైద్యుడు చేసిన వైద్యం కొంతమేరకు రిజల్ట్స్ ఇచ్చింది. కార్తిక్ తల ఆడించటం, మూలగటం బయటపడింది. అది వీరబద్రానికి కొంచం బలాన్ని ఇచ్చింది.

వైద్యుడు కూడా అతన్ని చూసి మాట్లాడటం మొదలుపెట్టాడు.

"మంచికాలం...నేను ఊర్లోనే ఉన్నాను. ఇతని అదృష్టం పాము కాటుకి విరుగుడు మూలిక నా కళ్ళకు వెంటనే కనబడింది. లేకపోతే...ఈ లోపు అంతరిక్షాన్ని చూడటానికి వెళ్ళేవాడు" అన్నప్పుడు కూడలి రోడ్డులో వీరబద్రంతో పాటూ కొబ్బరి బోండాం నీళ్ళు తాగిన 'మోటార్ సైకిల్’ మనిషి విషయం తెలుసుకుని అక్కడికి వచ్చాడు.

వచ్చినతను వీరబద్రంతో, "గాలిదేవుడి విషయంలో మీరు ఎగతాలిగా మాట్లాడేటప్పుడే అనుకున్నా..." అన్నాడు.

"మిస్టర్ మోటార్ బైక్...మీరు దీనిని గాలిదేవుడితో ముడివేయకండి. పాడుబడిపోయిన ఇళ్ళల్లో పాములూ, తేళ్ళూ, పురుగులూ ఉండటం సహజం. మేమే కొంచం నిర్లక్ష్యంగా ఉండిపోయాము. అందుకే కాటేసింది"

“ఇప్పుడు కూడా మీసాలకు మట్టి తగలకుండా మాట్లాడుతున్నారే"

"మీకు అలా అనిపిస్తే, అలాగే ఉంచుకోండి"

"వద్దు తమ్ముడూ...గాలిదేవుడు హెచ్చరిక చేశాడు. మీరితే...ప్రాణాలు విడువక తప్పదు!"

"ఎవరి ప్రాణం?"

"సరే...ఇక పూర్తిగా దెబ్బతింటేనే మీకు బుద్ది వస్తుంది"

-----అతను తప్పుకున్నాడు. కానీ, వీరబద్రం దగ్గర వైద్యుడు ఏమీ అడగలేదు. ఆ ఊరి మనిషిగా ఉంటూ, వైద్యుడు ఏమీ మాట్లాడ కుండా ఉండటం వీరబద్రాన్ని ఆశ్చర్యపరిచింది.

అందుకే వీరబద్రమే వైద్యుడ్ని అడిగాడు.

                                                                                                        (ఇంకా ఉంది) ****************************************************************************************************

19, మే 2020, మంగళవారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-6




                                             గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                               (PART-6)


కొన్ని విషయాలు నమ్మటానికి కష్టంగానే ఉంటాయి. అందులో ఒకటి...మనం ఒకరి గురించి తీవ్రంగా ఆలొచించి ముగించిన కొద్ది క్షణాలలోనో లేక కొన్ని నిమిషాలలోనో వారు మన ఎదురుకుండా రావటం! అందరికీ ఈ అనుభవం ఏర్పడే అవకాశం ఉన్నది. కొంతమందికి ఎప్పుడో ఒకసారి జరిగే ఈ విషయం, కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతుంది.

ఇది అనుకోకుండా జరిగింది అనాలా...లేక దీని వెనుక మనం పరిశోధించాల్సింది ఏమైనా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. దీన్ని మనస్తత్వ రీతిగా పరిశోధించారు. దానికి ముందు ఒక్కొక్కరి మనసు నిర్మాణం గురించి...మనసంటే ఏమిటీ అనేదాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే, దాన్ని తెలుసుకోకుండా... దాన్ని అర్ధం చేసుకోలేము. మనందరికీ మనసు అనేది మూడు విధాలుగా అమర్చబడి ఉంటుంది. పై మనసు, మధ్య మనసు, లోతైన మనసు అనేవే అవి. 'పై మనసు’ అనే దాంట్లో ఉండేవి మనం ఎప్పటికప్పుడు చేసే కార్యాలు. ఇందులో 'మధ్య’ మనసు అనేది కొన్ని ముఖ్య కార్యాలను జ్ఞాపకముంచుకుని...దానికోసం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఉదాహరణ...ఈ తారీఖున కరెంటు బిల్లు కట్టాలి. ఈ రోజు స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాలి లాంటి విషయాలు. లోతైన మనసులో...జీవితంలో ఏర్పడ్డ మరిచిపోలేని చేదు అనుభవాలతో మొదలై; నెరవేరని ఆశల వరకు పలు విషయాలు దాగుంటాయి.

ఈ మూడు మనోస్థితులలో...కొన్ని సమయాలలో లోతైన మనసు మేల్కొని, పై మనసుతో కలుసుకుని పనిచేస్తుంది. అప్పుడే మనం ఇలా ఆలొచించటం...నడుచుకోవటం ఒకటిగా ఉంటుంది.

ఇది పెట్టుకునే మనొతత్వ నిపుణులు ఆలొచనా శక్తి వలన మనం ఎవరినైనా కాంటాక్ట్ చేసి...వారి లోతైన మనసుతో మాట్లాడి, వాళ్ళకు తాకిడి ఏర్పర్చగలం అనుకుంటున్నారు. దీన్ని పరిశోధనలతో కూడా కనిపెట్టారు. దీనికొసం పదిమందిని ఎన్నుకున్నారు. వాళ్ళ అతి క్లోజ్ స్నేహితులు -- ఇరవై సంవత్సరాలుగా స్నేహంగా కలిసి మెలిసి ఉంటున్నారు.

వీళ్ళను వేరు చేసి విడి విడిగా ఉంచి...తరువాత వాళ్ళ దగ్గర, 'మీరు మొదట ఎవర్ని కలవాలనుకుంటున్నారో...వాళ్ళ పేరును ఒక కాగితం మీద రాసివ్వండి అని చెప్పేసి...వాళ్ళని తీవ్రంగా ఆలొచించమని చెప్పారు. అంటే, మనసులో పేరు రాసిన వారు...ఆ పేరు కలిగిన వారిని అత్యంత ఇష్టంతో పిలవాలి...ఇలా వాళ్ళు చెప్పింది ఐదు మందితో...మిగిలిన ఐదుగురు వీళ్ళను కలవాలి.

అంటే ఏ,బి,సి,డి,ఇ అనే ఐదుగురు ఎఫ్,జి,హెచ్,ఐ,జె అనే ఐదుగురుని. ఏ అనే అతను 'జి' ని, బి అనే అతను 'జే' ను. సి అనే అతను 'హెచ్' ను, డి అనే అతను 'ఎఫ్' ను, ఇ అనే అతను 'ఐ' ను తీవ్రంగా అనుకోనున్నారు. ఆశ్చర్యకరంగా జవాబుగా వాళ్ళూ వాళ్ళని తీవ్రంగా ఆలొచించిన వారై వాళ్ళను కలిసారు.

ఈ పరిశోధన వంద శాతం విజయవంత మయ్యింది!

అది గాలిపేట అగ్రహారం!

ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు.

గుమ్మడి తీగలూ, మల్లె తీగలూ దట్టంగా పెరిగిన పెంకుటిళ్ళు...పెరట్లో పసువులు, వాకిట్లో బచ్చలి చెట్లు! అందులో కట్టబడున్న పశువులు, దూడలూ అంటూ ఒక కాలంలో బ్రహ్మాండంగా ఉన్న ఆ ప్రదేశం.

ఈ రోజు, ఆ రోజుల ఆనవాలే లేనట్టు కొన్ని ఇళ్ళు జనంతో ఉన్నట్టు ఉన్నది...కొన్ని ఇళ్ళు పూర్తిగా మారిపోయి, అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు కనబడుతున్నాయి. ఒక ఇల్లు 'మందుల' కంపెనీగా మారింది. ఇంకో ఇల్లు 'ఐస్ ఫ్యాక్టరీ'గా మారింది...! ఇంకో ఇల్లు 'మినరల్ వాటర్ గొడౌన్'.

గాలిపేట చుట్టూ ఒక పక్క నందిగామ, ఇంకో పక్క జగ్గయ్య పేట, మరో పక్క మదిర, మైలవరం అనే ఊర్లు. ఇక్కడుండి వ్యాపారం చేయడం ఒక విధం. దూరంగా ఉండి వ్యాపారం చేయటం...వాహనాలతో సరకులు తీసుకు వెళ్లటం మరో విధం.

ఆ వీధిలోకి వీరబద్రం కారు వెళ్ళినప్పుడు... కార్తీక్ కు వొళ్ళు జలదరించింది.

“బద్రం! ఇది నేను ఆడుకున్న వీధిరా...వీధి మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. పక్కగా ఒక చింత చెట్టు ఉండేది. దాని మీద రాళ్ళు వేసి, కాయలు కొట్టుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఆ చెట్లూ లేవు, ఆడుకునే పిల్లలూ లేరు...చూశావా?”--అన్నాడు కార్తీక్.

“ఇప్పుడు, చీదర పుట్టించే మార్పుతో మనదేశం ఉంది కార్తీక్. టీ.వీ చూడటం, సెల్ ఫోన్ వాడుకోవటం ఈ రోజు మనుషుల ముఖ్యమైన పని! ముఖ్యంగా...స్కూలుకు వెళ్ళే పిల్లలు వీధులలోకి వచ్చే ఆడుకోవటమే లేదు.

ఇంట్లోకి దూరిన వెంటనే 'సోఫా' లో పడిపోతారు. ఇంతకు ముందు టీ.వీ ఆన్ చేయటానికైనా లేచే వాళ్ళూ. ఇప్పుడు రిమోట్ ఉన్నదే! ఆ రిమోట్ పిల్లల చేతిలో అవస్తపడుతోంది.

మన టైములో ఎన్ని ఆటలు. దొంగ-పోలీస్! అంటూ...ఈ కాలం పిల్లలకు అందులో ఒకటైనా తెలుసా? సెల్ ఫోన్ని చేతికి ఇస్తే...అందులో వీడియో గేమ్ ఆడటం తెలుసు.

నువ్వు కావాలంటే చూడు...ఇంకో ముప్పై సంవత్సరాల తరువాత, కళ్ళజోడు లేకుండా ఒకరూ ఉండరు. అదే సమయం అరవై సంవత్సరాలలో చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఈ అగ్రహారం నాలో ఇలాంటి ఆలొచననే తెప్పిస్తోంది" అన్నాడు వీరబద్రం.

“వాస్తవమేరా...కడుపు మండిపోతోంది”

“ఈ వీధిలో మీ ఇల్లు ఎక్కడుంది?”

“చివర్లో ఉంది. ఇంకా వెళ్ళు...”

కారు వేగం పెరిగింది. చివరిదాకా వెళ్ళి పెద్ద సిమెంటు బెంచి, పెద్ద చెక్క దూలాలు ఉన్న ఇంటి ముందు ఆగింది.

ఇంటికి ఉన్న ముందు గోడ. పాచి పట్టి పచ్చ రంగులో ఉన్నది. ఆ గోడ మీద చెట్ల తీగలు పాకుతున్నాయి...గోడ తెలియనంత దట్టంగా అల్లుకోనున్నాయి. మైన్ గేటు తుప్పు పట్టి ఉంది. ఒక తన్ను తంతే ముక్కలు అయిపోయేటట్టు ఉన్నది.

వాకిట్లోనే నిలబడి ఒకసారి చూశాడు కార్తీక్. 'ఎలా ఉండే ఇల్లు...ఇలా అయిపోయింది’ ....మనసులోనే అనుకున్నాడు.

వీరబద్రం కూడా గమనించాడు. ఈ లోపు చుట్టు పక్కలున్న వాళ్ళంతా వచ్చి చేరారు.

“అరెరే...పంతులుగారబ్బాయా?”

“అవును గోవింద రావ్ గారు. బాగున్నారా?”

“ఏదో ఉన్నా తమ్ముడూ! ఏమిటి...ఇంటిని చూసుకోవటానికి వచ్చారా?”

“అవును”

“ఈ ఇంటిని ఎప్పుడు గాలిదేవుడికి మీ తాతయ్య ఇచ్చాసారో...అప్పుడే ఈ ఇల్లు 'గాలి దేవుడి ఇల్లు’ అయిపోయింది. లోపల కూడా చెట్లు, చేమలతో దట్టమైన అడవిలాగా అయిపోయింది. అప్పుడప్పుడు గాలి వీస్తున్నట్టు ఆ ఇంట్లోని చెట్లూ, చేమలూ అటూ ఇటూ ఊగుతాయి."

ఆ గోవింద రావ్ గాలిదేవుడ్ని గుర్తు చేయటంతో వీరబద్రం మనసు గీరుకుంది.

“అయ్యా...ఇది పంతులుగారి ఇల్లే. గాలిదేవుడి ఇల్లు కాదు. ఈ ఇంటిని శుభ్రపరచి, ఇదివరకులాగా ఇందులో ఉందామనే వచ్చాము. ఇది బాగా తెలుసుకోండి...” అన్నాడు వీరబద్రం.

“అలాగా...! అవును...మీరెవరు?”

“కార్తీక్ స్నేహితుడ్ని”

“పట్నం వాసివా?”

"అవును...దానికేదైనా చెప్పబోతారా?"

"ఏం చెప్పమంటారు...మీకు దేవుడూ, దయ్యం అంటే నమ్మకం ఉండదు...!"

"అవును...కరెక్టే! అదంతా పనీ పాటూ లేకుండా అరుగుల మీద కూర్చుని అరుగును అరిగించే వాళ్ళకు...మాకు లేదు. మీరు బయలుదేరండి" వీరబద్రం గట్టిగా చెప్పాడు.

దాన్ని కార్తీక్ కూడా అడ్డుకోలేదు...ఇంటిలోపలకు వెళ్ళటానికి ప్రయత్నించాడు.

ఇనుప గేటు తోసాడు. అది కీచ్ మన్నది.

"తమ్ముడూ..."--ఆ గోవింద రావ్ వాళ్ళను ఆపుతున్నట్టు పిలిచాడు.

"ఏమిటీ...?"

"ఈ తమ్ముడు మాట్లాడిందంతా నిజమా?"

"అవును...! తప్పుగా ఉండుంటే నేను మధ్యలోనే ఆపేవాడిని"

"అలాగైతే ఇన్నిరోజులు 'గాలి దేవుడి ఇల్లు’ అని ఉంచేసిందంతా?"

“మేము ఉంచలేదు. ‘గాలిదేవుడి ఇల్లు’ అని మేము పేరు పెట్టలేదు. అది ఈ ఊర్లోని మీలాంటి కొంతమంది చేసిన పని. క్లుప్తంగా చెప్తాను...ఇది మా సొంత ఇల్లు. నలభై గజాల స్థలంలో వెనుకవైపు మామిడి చెట్టు, చింత చెట్టు ఉన్న మా ఆస్తి. దీన్ని మేము అమ్మబోతాం.

ఎందుకంటే...మాకు డబ్బులు కావాలి. డబ్బులొస్తేనే నా చెల్లెలు పల్లవికి పెళ్ళిచేయగలం. మా కష్టం ఆ గాలిదేవుడికి తెలుసు. అందువల్ల ఆయన మాకు సహాయమే చేస్తారు. ఖచ్చితంగా కష్టాలు పెట్టరు. మీరెల్లి మీ పనులు చూసుకోండి"

కార్తీక్ కూడా బాగా మాట్లాడాడు.

ఆ గోవింద రావ్ మొహం వాడిపోయింది.

తడబాటుతో అక్కడే నిలబడ్డాడు.

"వెళ్ళన్నా...వెళ్ళి నీ పని చూసుకో".

"లేదు తమ్ముడూ...రాత్రి పూట ఇంట్లోంచి గుర్రం నడుస్తున్న శబ్ధం వినబడుతుంది. దేవుడు ఇక్కడ తిరుగుతున్నాడు. ఇది నేనుగా చెప్పటంలేదు. ఊర్లో అందరినీ అడిగి చూడండి. అందరూ చెబుతారు. పూజారి తప్ప ఇంకెవరైనా ఈ ఇంట్లోకి వెడితే జ్వరం వచ్చి మంచాన పడుతున్నారు. ఇవన్నీ తెలుసుకోకుండా మీరోచ్చి...'ఇది మా ఇల్లు, అమ్మబోతాం' అని చెబుతున్నారు. సరే...ఇక గాలిదేవుడూ, మీరూ తేల్చుకోవలసిన విషయం ఇది” అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు.

ఆయన గట్టిగా చెప్పిన ఆ విషయంతో, కార్తీక్ కొంచం భయపడ్డాడు. దానికి తగినట్లు ఆ ఇంట్లో నుండి గుర్రం నడుస్తున్న శబ్ధం వినబడింది. ఒక్క క్షణం... కార్తిక్ శరీరమంతటా ఉన్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అదేలాగా డప్పుల శబ్ధం కూడా వినబడింది.

"బద్రం..."

"ఏమిటీ...భయపడ్డావా? లోపల నుండి ఎవరో గుర్రంలో వెనుక గుమ్మం నుంచి వెళ్ళారు. రా...ఎవరనేది చూద్దాం"

వీరబద్రం వేగంగా నడిచాడు. ఇంటి గోడకూ, కాంపుండ్ వాల్ గోడకూ మధ్య చాలా చోటు ఉంది. కానీ అదంతా దట్టంగా ఏవో పిచ్చి మొక్కల పొదలతో నిండిపోయుంది. వాటి మధ్య దూరి ధైర్యంగా పరిగెత్తాడు. ఒకే చోట పాము పుట్ట. భుజాల ఎత్తుకు పెరిగి ఎన్నో అడ్డంకులతో అతన్ని బెదిరించింది.

ఇంటి వెనక నుండి ఎవరూ వెళ్ళిన ఆనవాలు లేవు. గుర్రం అనేది ఒకటుంటే, అది కట్ట బడ్డ చోటు...దాని తిండి, వస్తువులూ, ఆనవాలుగా ఉండేవి.

అలా ఏదీ కనిపించలేదు!

కార్తిక్, వీరబద్రం వెనుకే వెళ్ళాడు.

"కార్తిక్...ఇక్కడ మనుష్యులు వచ్చి వెళ్ళిన సంకేతాలే లేవు"

"మరి శబ్ధం వినబడిందే?"

"పక్కింట్లో టీవీ ఉన్నదా చూడు"

"టీవీలో వచ్చిన దృశ్యం అయ్యుంటుందని అనుకుంటున్నావా?"

"వేరే ఎలా అనుకోగలం...? నువ్వే చూడు!"

"పక్కిళ్ళు కూడా తాళం వేసున్నది. అక్కడ ఎవరూ లేరు"

"అయితే...సమ్ తింగ్ రాంగ్...!"

"ఏం చెబుతున్నావు...ఒకవేల గోవింద రావ్ చెప్పింది నిజమేనేమో...?"

"నాతో ఉంటూ అలా మాట్లాడకు!'గాలిదేవుడి దగ్గరే చెప్పేశాను. ఆయన మాకు సహాయం చేస్తారు...కష్ట పెట్టరు’ అంటూ ఇందాక చెప్పి ఇప్పుడెందుకు భయపడతావు?"

"అది కాదు...అదొచ్చి..."

"చాలు ఆపు...! ఇప్పుడు మనం ఈ ఇల్లంతా శుభ్రం చేస్తున్నాము. మేస్త్రీనీ, కూలీలనూ తీసుకు వచ్చి అడ్డంకులు తొలగించి క్లీన్ చేద్దాం"

"బద్రం..."

"ఏమిటి బిడియం?"

"నాకోసం నువ్వు రిస్కు తీసుకోకు"

"ఆపు నీ భాగోతం...నీ భయాన్ని నాలో ఏదో విధంగా దూరుద్దామని చూస్తున్నావా? అవును...ఈ ఇంటి తాళం చెవులు ఎక్కడ? లోపలకు వెళ్ళి చూద్దామా?"

"తాళమూ--చెవులూ లేదు. తెరిచే ఉంది"

"అయితే రా...లోపలకు వెళ్ళి చూద్దాం"

వెళ్ళారు.

"అబ్బో...ఎంత పెద్ద ఇల్లో? ఇలాటి ఒక ఇల్లు మన విజయవాడలో ఉంటే మనమేరా అక్కడ కోటీశ్వరులం. ఈ రోజుల్లో అపార్ట్ మెంట్ పేరుతో ఒకే మెట్ట్లు...ఒకే గుమ్మం ను నాలుగు కుటుంబాలు ఉపయోగిస్తూ జీవిస్తున్నాం. ఎప్పుడు చూడూ...తలుపులు వేసుకునే ఉంటున్నాము. ఆ జీవితాన్ని ఎక్కువగా మెచ్చుకుని, ఇష్టపడుతున్నాం---ఇక్కడ చూడు..."

ఆశ్చర్యపోతూనే వెనుక గుమ్మం నుండి ఇంట్లోకి వెళ్ళారు.

                                                                                                     (ఇంకా ఉంది) ************************************************************************************************

17, మే 2020, ఆదివారం

గాలితో ఒక యుద్దం (సీరియల్)..PART-5



  
                                          గాలితో ఒక యుద్దం (సీరియల్)
                                                              (PART-5)


“నేను నిజంగానే చంద్రుడు మీదకు వెళ్ళాలని ఆశపడుతున్నాను...ఆ ఆశ నేరవేరుతుందా?" అని అడిగినతన్ని కౌన్సలింగ్ చేసే ఆయన నవ్వుతూ సమాధానంగా తిరుగు ప్రశ్న ఒకటి ఆయన్ని అడిగాడు.

"మీకు ఆ ఆశ నిజంగా వచ్చినట్లు తెలియటంలేదే?"

“లేదు! నిజంగానే...మనసారా ఆశపడుతున్నాను" అన్నాడు.

"ఆశ పడే దాని గురించి మీకు కొంచమైనా తెలిసుండాలి. మీకు చంద్రుని గురించి ఏం తెలుసు?"

"ఇదేం ప్రశ్నండీ...చంద్రుడు ఒక అందమైన గ్రహం. అది ఆకాశంలో ఉన్నది. ఇంతకంటే ఏం తెలియాలి?"

"తప్పు...అందమైన గ్రహం అనేది ఒక మాయ. అది కాంతిని వెలువరిస్తోందనేదీ ఒక మాయ. నిజానికి చంద్రుడిపైన మనుష్యులు నివసించటానికి కావలసిన ఆక్సిజన్, నీళ్ళూ మరియూ నిప్పు అని ఏదీ లేదు. చంద్రుడ్ని చూసి మైమరచిపోయి ఒక 'పిక్నిక్' వెళ్ళేటట్టు పరిశోధకులు అక్కడికి వెళ్ళిరాలేదు. వాళ్ళ ఉద్దేశ్యం అన్వేసించటం...అందుకోసం వెళ్ళి వస్తున్నారు. ఇదే చంద్రుని యొక్క నిజ స్వరూపం. ఇది తెలియక, మీరు అక్కడికి వెళ్ళి రావటానికి ఆశపడటంలో ఏమర్ధం ఉంది?"

"......"--ఆశపడిన అతను మౌనంగా ఉన్నాడు.

"నిజానికి ఆశ పెట్టటం అనేది అర్ధం చేసుకున్న దాని మీదే ఉండాలి. ఒక మగాడిగా ఉంటూ...'నేను గర్భం దాల్చి బిడ్డను కనాలి’ అని ఆశపడుతున్నాను అని ఎలా ఆశపడకూడదో...అలా అర్ధంలేని విపరీత ఆశలు పడకూడదు. అవి మూర్ఖత్వమైనవి...ఏరోజూ నెరవేరవు. అది పెట్టుకుని నా నమ్మకం మోసం అయిపోయిందే అని అనుకోకూడదు.

ఒక మనిషి తన శక్తికి తగినట్లు నెరవేర్చుకోగల ఒక దాని మీదే ఆశపెట్టుకోవచ్చు. ఆశ పెడితే మాత్రం చాలదు. ఆ ఆశకోసం కష్టపడాలి. అలా కష్టపడే పనిలో కూడా అర్ధం ఉండాలి. అలా ఉండే పక్షంలో ఆ ఆశ ఏదైనా సరే ఏదో ఒక రోజు నెరవేరి తీరుతుంది. అలాగే ఈ రోజు వరకూ జరుగుతూ వస్తోంది" అన్నారు ఆయన.

గాలిపేట అనే పేరు రాసున్న పలక స్వాగతంతో వీరబద్రం కారు,ఆ ఊరికివెళ్ళే మట్టి రోడ్డు మీద ప్రవేశించింది. కార్తీక్ ఒదిగి పోయి కూర్చున్నాడు.

“రేయ్...సంతోషంగా ఉండరా. ఇప్పుడు మనం వచ్చింది మీ ఊరికి. ఎవరైనా సరే పుట్టిన ఊరును చూసేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక సంతోషం కనబడుతుంది తెలుసా?”

“అలా చెప్పకు బద్రం. కొందరి చిన్న వయసు పర్వం మంచిగా లేకపోతే...దానిని ఆలొచించి చూడటానికే అతను ఇష్టపడడు”

“కార్తీక్...అన్నిటినీ ఆలొచించే విధంలోనే ఉంటుంది. అందుకే ఎక్కువగా పుస్తకాలు చదవాలి...”

“మా అమ్మా, నాన్న కూడా పుస్తక పురుగులే. వాళ్ళకూ గాలిదేవుడంటే భయమే...తెలుసుకో...!”

“రేయ్...ఎప్పుడో ఒకసారి పుస్తకాలు చదివితే పుస్తకం పురుగులు అయిపోరు. బోలెడు పుస్తకాలు చదవాలి. అన్ని రకాలు పుస్తకాలూ చదవాలి. చదివితే మాత్రం చాలదు. దాన్ని ఆశపడాలి. అన్నిటికంటే ఎక్కువగా...మనమే మనల్ని అర్ధం చేసుకోవటం ముఖ్యం. తనని తాను తెలుసుకోలేని ఒకడు ఏది తెలిసిపెట్టుకున్నా ప్రయోజనం లేదు”

--- బద్రం మాట్లాడిన దానిని బట్టి అతని కున్న క్లారిటీ, ధైర్యం అన్నిటికీ ఒకే ఒక కారణం అతను పుస్తకాలు ఎక్కువగా చదువుతాడనేది తెలుస్తోంది.

ఆప్పుడు ఆ ఊరి చెరువు, చెరువు గట్టు దగ్గరున్న రావి చెట్టు -- ఆ చెట్టు క్రింద ఉన్న గాలిదేవుడి గుడి కనబడింది. అక్కడ కొంతమంది నిలబడి దన్నం పెట్టుకుంటున్నారు.

“కార్తీక్...ఇదేనా నువ్వు చెప్పిన గుడి?”

“అవును...కారాపు. ఊరిలోకి వెళ్ళే ఎవరైనా సరే గాలిదేవుడ్ని దర్శించుకో కుండా వెళ్లరు”

“ఆపుతాను! కానీ దన్నం పెట్టుకోవటానికి కాదు. చూడటానికి...”

వీరబద్రం కారు ఆపాడు. ఇద్దరూ దిగి గుడి దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరినీ...గాలిదేవుడ్ని నమస్కరించుకోవటానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూశారు. వాళ్ళల్లో ఒకరి దగ్గర కోడి ఉంది.

పూజారి కూడా ఉన్నాడు. అతను కార్తీక్ ను గుర్తు పట్టాడు.

“అరెరే....పంతులగారి అబ్బాయి గారా… రండి… రండి?" అంటూ స్వాగతించాడు.

“బాగున్నారా పూజారిగారూ...”

“గాలిదేవుడి పుణ్యామా అంటూ... ఏదో జరుగుబాటు అవుతోంది”

“సంతోషం! కర్పూరం వెలిగించండి”

“అవును...ఏమిటిలా వచ్చారు? మీ అమ్మా-నాన్నలు కూడా రాబోతారని విన్నాను. ఇంతకు ముందులాగా మన ఊర్లోనే ఉండి పోదామని నిర్ణయించుకున్నారా?”

“అవును...మీరు కర్పూరం వెలిగించండి. నేను బయలుదేరుతాను. నాకు చాలా పనుంది”

“కాసేపాగండి బాబూ...వీళ్ళోచ్చి చాలా సేపయ్యింది. మొదట వీళ్ళకు పూజ జరిపించి మీ దగ్గరకు వస్తాను. వీళ్ళతో పాటూ మీరు నిలబడలేరు...వీళ్ళు కోడిని బలి ఇచ్చి ప్రార్ధించుకుని వెళ్లటానికి వచ్చారు. అది మొదట ముగిస్తాను. మీరు పంతుల తాలుకా. నేను కోడిని నరకటం చూస్తే మీకు ఏదోలాగా ఉంటుంది. అలా వెళ్ళి నిలబడండి”

“నిలబడే టైము లేదు పూజారీ. విబూధి ఇవ్వండి...చాలు”

---- కార్తీక్ హడావిడి పడ్డాడు. అతనే వంగుని కర్పూర పళ్లెంలో ఉన్న గరగర మంటున్న విబూధి తీసుకుని నుదిటికి రాసుకున్నాడు. దేవుడి రాయి దగ్గరున్న నిమ్మ పండ్లను చూసిన కార్తీక్ కు ఏదోలా అనిపించింది. నేరం చేస్తున్నామో అన్న భావన!

కానీ వీరబద్రానికి చాలా ఆనందంగా ఉన్నది. జరుగుతున్నది చూశాడు. “గాలిదేవుడికి కోడి అంటే చాలా ఇష్టమా?” అంటూ కొంచం హేలనగా మాట్లాడాడు.

“తమ్ముడెవరో?” కార్తీక్ ను అడిగాడు పూజారి.

“కార్తీక్ స్నేహితుడ్ని!” కార్తీక్ కు బదులు వీరబద్రమే జవాబిచ్చాడు.

“ఎవరుగా ఉన్నా సరే ఇక్కడ భయ భక్తులతో ఉండాలి"

“లేకపోతే...?”

“మీరు సేఫ్ గా ఊరు వెళ్ళి చేరలేరు”

“ఇలా బెదిరించి చూడటమే మీ గాలిదేవిడి 'స్టైలా'?”

“పంతులు తమ్ముడూ...ఎవరితను. ఎందుకలా ప్రశ్నకు ప్రశ్నవేసి మాట్లాడుతున్నాడు?”

“క్షమించండి పుజారి గారూ. ఇతను కొంచం సరదా టైపు. తప్పుగా తీసుకోకండి. రేయ్ బద్రం...బయలుదేరరా. నీతో కలిసి నేను ఈ ఊరు బయలుదేరి రావటమే తప్పురా”

“అంతా విధి ఆడుతున్న ఆట...”-- నవ్వుతూ చెప్పాడు బద్రం.

"విధే గానీ! రా...మొదట" -- అంటూ బద్రాన్ని లాక్కుంటూ కారున్న వైపుకు నడిచాడు. డోర్ తెరిచి బద్రాన్ని డ్రైవింగ్ సీటులోకి తోశాడు కార్తీక్.

ఇంతలో కోడి తల తెగింది. తలను ఒక పక్కకూ, మిగిలిన భాగాన్ని మరో పక్కకు పూజారి విసిరేసినప్పుడు, తల భాగం కారు బ్యానెట్ మీద పడి నెత్తురు చిందింది.

ఒక్కసారి ఒళ్ళు జలదరించింది కార్తీక్ కి.

“భయపడ్డావా కార్తీక్...పాపం రా ఆ కోడి. మనుష్యులున్న ఈ నేలమీద అది పుట్టే ఉండకూడదు. చివర్న చూశావా దాని స్థితి” అంటూ హేళనగా చెబుతూ కారు స్టార్ట్ చేశాడు వీరబద్రం.

అప్పుడు చూశాడు కార్తీక్. బేన్యట్ మీద పడిన కోడి తల నుండి చిందిన నెత్తురు కారు అద్దాలపై పడింది. ఆ నెత్తుటి మరకల్లో గాలిదేవుడి విగ్రహ రూప ఆకారం గమనించాడు. కార్తీక్ గుండె గుభేల్ మంది!

********

కార్తీక్ ఇంటి దగ్గర...బామ్మ సరోజమ్మ ఒకటే నస పెడుతోంది.

“కార్తీక్... కార్తీక్...” ఓర్పు నసించినట్టుగా అరిచింది!

రామశర్మ గారు లేచి వెళ్ళారు.

“ఎందుకమ్మా...ఇలా, ' కార్తీక్... కార్తీక్ ' అంటూ ప్రాణం తీస్తున్నావు?”

“నేను ప్రాణం తీస్తున్నానా? దుర్మార్గుడా...ప్రాణం కాపాడటానికి తహతహ లాడుతున్నాను! ఇప్పుడు కార్తీక్ ఎక్కడ?”

“బయటకు వెళ్ళాడు...ఏమిటి విషయం?”

“ఎక్కడికి వెళ్ళాడు?”

“అది నాకు తెలియదు”

“అబద్దం చెబుతున్నావు...వాడు మన గ్రామానికి వెళ్ళాడు. గాలిదేవుడి సన్నిధిలోనే ఇప్పుడు ఉన్నాడు”

“సరే...దానికేమిటిప్పుడు?”

“ఏమిటా...? అక్కడ మన మట్టిలో వాడు కాలు పెట్టిన వెంటనే ఇక్కడ నా గుండెలో ఎవరో తొక్కినట్టుంది. ఇక ఆ గ్రామానికి ఇంకెవరూ వెళ్ళకండిరా. ఆ ఆస్తి మనకు వద్దు...”

“ఇదిగో చూడు...నీ దగ్గర అడిగేటప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పు. నువ్వుగా భయపడి ఇష్టం వచ్చినట్టు వాగకు!”

“నేనేమీ వాగటం లేదు...వాస్తవమే చెబుతున్నా. గాలిదేవుడికి వాగ్దానమే పెద్దదిరా!”

“అది సరే... నేనెక్కడ గాలిదేవుడి దగ్గర వాగ్దానం చేశాను? లేకపోతే... కార్తీక్ చేశాడా? లేదే నాన్నగారు చేశారు. ఆయన ఉన్నంత వరకు ఆయన మాటను ఆయన కాపాడారు. దాంతో ముగిసిపోయింది”

“అలా మాట్లాడకురా… ఆ ఇల్లు మనకు సొంతం కాదు. ఇప్పుడది గాలిదేవుడి ఆస్తి. ఆ ఆస్తిని అమ్మటానికి ఎటువంటి ప్రయత్నం చేయకండిరా”

“సరే...ఒక మాట చెప్పు. నేను నువ్వు చెప్పేది ఒప్పుకుంటాను. ఇక్కడ పల్లవి పెళ్ళి ఎలా జరపాలి. డబ్బులు కావాలి. ఎవరిస్తారు?”

“గాలిదేవుడ్ని నమ్మి అడగరా...ఇస్తాడు. ఆయన్ని నమ్మకుండా, ఆయన ఆస్తిని అమ్మటం అనే తప్పును చేయకండిరా?”

“ఇది ద్వాపర యుగం కాదమ్మా...కలియుగం. దేవుడు ఏ కాలంలో ఎప్పుడు నేరుగా వచ్చాడు...ఆయన దగ్గరకు వెళ్ళి అడగటానికి?”

“నాస్తీకుడిలా మాట్లాడొద్దురా రామశర్మా...నమ్మకం చాలా ముఖ్యం. గాలిదేవుడు నిదర్శనమైన వాడు. అతని వలనే నీ పిల్లాడు నీకు తిరిగి దొరికేడు”

“సరేనమ్మా...నువ్వు సనుగుడు ఆపి నిద్రపోయే దారి చూడు. మాకు పెళ్ళి పనులు చాలా ఉన్నాయి”

“రామశర్మా...మనిషికి ఏ రోజూ నాలుక మడత పడ కూడదురా? నమ్మకమూ ముఖ్యం. మీ నాన్న దగ్గర ఉన్న నమ్మకం నీ దగ్గర లేకుండా పోయిందేరా...?”

“ఇంత మాట్లాడుతున్నావే...ఆ గాలిదేవుడి దగ్గర నువ్వు డబ్బులు అడిగి తీసుకుని ఇవ్వు. ఆలా గనుక ఆయన ఇచ్చేస్తే...నిజంగా చెబుతున్నా నేను ఆ ఇంటిని అమ్మకుండా, ఆ ఇంటి దస్తావేజులను తీసుకు వెళ్ళి ఆ గాలిదేవుడి హుండీలో వేసేస్తాను”

రామశర్మ విరక్తిగా మాట్లాడాడు. కానీ అందులో కొంచం స్వార్థం...తెలివితేటలు అన్నీ కలిసున్నాయి.

“ఖచ్చితంగా అడుగుతారా”

“ఏమడుగుతావో ఏమో...ఆ గాలిదేవుడ్ని మేము కూడా వెళ్ళి దర్శించుకుంటున్నామే? మనల్ని అడిగేంత వరకా ఆయన ఉంచుకోవాలి? మనిషనే వాడికి కొంచమైనా భయం ఉండాలని ఆ రోజుల్లో పెద్దవాళ్ళు కనుగొన్న ఒక విషయమే దేవుడు...అదే గాలిదేవుడు. ఆ రాయికి ఆలొచించగలిగే శక్తి లేదనేది తెలుసుకోలేని వాడు కావాలంటే భయపడతాడు. చదువుకున్న మనం కూడా భయపడితే...అది మూర్ఖత్వం. ఇలా మాట్లాడుతున్నాను కదా అని నేను గాలిదేవుడ్ని ద్వేసిస్తున్నానని అనుకోకు! ఒక కర్పూరం వెలిగించి, దేవుడికి చూపించి, చెంపలు వేసుకోవటానికి నేనెప్పుడూ రెడియే. అంతేగానీ నా ఆకలికి నేనే కదా తినాలి? నాకు కావలసిన వాటి కోసం నేనే కదా పనిచేయాలి. ఆకాశం నుండి ఏదీ ఒడిలోకి వచ్చి పడుతుందనేది లేదు. అది తెలుసుకో..." అని చెప్పి రామశర్మ గారు ఆ గది విడిచి వెళ్ళిపోయారు.

సరోజమ్మ కళ్ళల్లో ఊటలాగా కన్నీళ్ళు బయటకు వచ్చినై.

                                                                                                         (ఇంకా ఉంది) ****************************************************************************************************