30, అక్టోబర్ 2019, బుధవారం

కదిలే అలలపై--కదలని విమానాశ్రయం (ఆసక్తి)




                                    కదిలే అలలపై--కదలని విమానాశ్రయం


ఒసాకా బేలో కృతిమంగా రూపొందించిన ద్వీపంలో దీన్ని నిర్మించారు. 1987 లో నిర్మాణం ప్రారంభించి 1994 లో పూర్తి చేశారు. తొలుతు నాలుగు కిలోమీటర్ల పొడవు, రెండున్నర కిలోమీటర్ల వెడల్పుతో ద్వీపం నిర్మించారు. ముందుగా ఈ మేరకు కాంక్రీట్ తో సముద్రంలో గోడ కట్టారు. తరువాత అందులో సముద్ర మట్టం నుంచి 30 మీటర్ల ఎత్తు వరకు కొండ రాళ్ళు, మట్టి పోశారు. ఇందుకోసం ఏకంగా మూడు పర్వతాలను తవ్వేశారు. మొత్తం మ్మీద దాదాపు పదివేల మంది కార్మీకులు మూడేళ్ళ పాటు కష్టపడి ఈ ద్వీపాన్ని నిర్మించారు. అనంతరం దానిపై విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.




విమానాశ్రయం నుంచి భూభాగానికి చేరుకోవడం కోసం మూడు కిలోమీటర్ల పొడవున ఓ వంతెన కూడా నిర్మించారు. ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకగా నిలిచిన ఈ ఏర్ పోర్ట్ 2001 లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నుంచి 'సివిల్ ఇంజనీరింగ్ మాన్యూమెంట్ ఆఫ్ ది మిలీనియం' అవార్డు కూడా పొందింది.




ఎక్కువ స్థలం అవసరమవుతుంది కాబట్టి, విమానాశ్రయాన్ని ఎప్పుడూ నగర శివార్లలోనే కడతారు. కానీ ఇది సముద్రపు నీటిలో కట్టిన ఓ అద్భుతమైన ఏర్ పోర్ట్. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. భూకంపాలనూ, సునామీలనూ కూడా ఇది తట్టుకోగలదు.





కాన్సాయ్ విమానాశ్రయ నిర్మాణం 1987 లో మొదలుపెట్టారు. దాదాపు పదివేలమంది, 80 పడవలు వాడబడ్డాయి. మూడేళ్ళపాటూ కష్టపడితే పూర్తయ్యింది. మిగతా పనులన్నీ పూర్తిచేసేందుకు నాలుగేళ్ళు పట్టింది. నిజానికి ఏర్ పోర్ట్ ఇటామి ప్రాంతంలో ఉండేది. అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం విమానాల రాకపోకల్ని మరింత పెంచాలనుకుంది అక్కడి ప్రభుత్వం. మొదట కాన్స్ రీజియన్ లోని, కొబె దగ్గర కొత్త ఏర్ పోర్ట్ కట్టేందుకు ప్లాన్ వేశారు. ఏర్ పోర్టును నిర్మించేందుకు ఆల్రెడీ ఉన్న నిర్మాణాలను తొలగించడానికి వీల్లేదని, పైగా ఇళ్ళు, ఆఫీసుల మధ్య విమానాశ్రయం ఉంటే విమానాల మోత భరించడం కష్టమని గొడవ పెట్టారు. ఒకవేల కట్టినా కూడా, దాన్ని ఎప్పటికీ విస్తరించడం వీలు కాదని కండిషన్ పెట్టారు. దాంతో సముద్రంలో కడితే ఎలా ఉంటుంది అన్న ఆలొచన వచ్చింది అధికారులకి. వెంటనే మొదలుపెట్టాశారు. సముద్ర జలాల్లో ఏర్ పోర్టును నిర్మించారు. సముద్రపు ఒడ్డు నుంచి ఏర్ పోర్టుకి వెళ్ళడానికి మూడు కిలోమీటర్ల పోడవైన బ్రిడ్జిని కూడా నిర్మించారు. జలాల మీద నిర్మాణం అంత తేలిక కాదు. ఏర్ పోర్టు అంటే మరీ కష్టం. అయినా వారు సాధించారు. ఇప్పుడది ప్రపంచం మొత్తాన్నీ ఆకర్షిస్తోంది.




జనవరి 17, 1995 లో జపాన్ లో కోబేను భూకంపం తాకింది. ఈ భూకంప ఎపి సెంటర్ విమానాశ్రయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పడింది. ఈ భూకంపంలో 6,434 మంది చనిపోయారు. కానీ విమానాశ్రయానికి గానీ, ఆ టైములో అక్కడున్న పర్యాటకులకు గానీ, విమానాలకు గానీ, ఉద్యోగులకు గానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారణం ఆ విమానాశ్రయం భూకంప నిరోధక శక్తితో నిర్మించబడింది.. కనీసం విమానాశ్రయ అద్దాల కిటికీలకు కూడా చిన్న గీటు పడలేదు. అలాగే 1998లో 200 కిలోమీటర్ల వేగంతో ఎగిసిపడిన టైఫూన్ (పెను తుపాను) వలన కూడా విమానాశ్రయానికి ఏటువంటి హానీ జరగలేదు.



పెద్ద పెద్ద కొండ రాళ్ళను సముద్రంలో పడేయటం వలన ఆ ద్వీపం ఆ బరువుకు కనీసం 19 అడుగులైనా కిందకు వెడుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు ఆ విమానాశ్రయ ద్వీపం 27 అడుగులు కిందకు వెళ్ళింది. ఇది అనుకున్న దానికంటే ఎక్కువే. అయితే ముందే విమానాశ్రయ ద్వీపమును బాగా ఎత్తుకు కట్టినందువలన ఈ విమానాశ్రయం ఇంకా ఎటువంటి ప్రమాదానికీ గురి అవలేదు. ఇంజనీర్ల లెక్క ప్రకారం ఈ విమానాశ్రయ ద్వీపం ఇంతకంటే కిందకు వెళ్ళే చాన్సే లేదని తేల్చి చెప్పారు. ఈ విమానాశ్రయం కట్టటానికి మొత్తం ఇప్పటి వరకు (2008 వరకు మెయింటనన్స్ తో కలిపి) 20 బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారు. ఇందులో ఎక్కువ మొత్తం విమానాశ్రయ కుంగుకు ఖర్చు పెట్టారు. మొదట, అంటే 1994లో సంవత్సరానికి 20 ఇంచులు కిందకు కుంగిపోయిన ఈ విమానాశ్రయం 2008కి 7 ఇంచులకు తగ్గింది.



2014 లో వారానికి 960 విమానాల రాకపోకలు కలిగిన ఈ విమానాశ్రయాన్ని అమెరికన్ ఇంజనీరింగ్ సొసైటీ అయితే, 'సివిల్ ఇంజనీరింగ్ మాన్యూ మెంట్ ఆఫ్ ది మిలీనియం' అంటూ దీన్ని కొనియాడుతోంది.

Images Credit: to those who took the original photos.

***************************************సమాప్తం********************************

 

28, అక్టోబర్ 2019, సోమవారం

అగ్ని బంతుల వర్షం….(మిస్టరీ)




                                                 అగ్ని బంతుల వర్షం


గత నెల, అంటే సెప్టంబర్-25,2019 న చిలీ దేశంలోని కొన్ని ప్రాంతాలలో ‘ఫైర్‌బాల్స్’ (అగ్ని బంతులు) క్రాష్ అయ్యాయి. అవి ఉల్కలు కావు అని నిపుణులు అంటున్నారు....మరైతే అవి వేటికి సంబంధించినవి, ఎక్కడి నుండి వచ్చినై?

చిలీ అధికారులు గత నెల దేశంలోని కొన్ని ప్రాంతాలలో పడిన ఫైర్‌బాల్స్ పై దర్యాప్తు చేస్తున్నారు.


గత నెల చిలీలో ఆకాశం నుండి గొప్ప మంటలు వర్షం కురిసింది, అవి ఏమిటో మరియు అవి ఎక్కడ నుండి వచ్చాయో తెలుసుకోవడానికి అధికారులు ఇంకా ప్రయత్నిస్తున్నారు.

ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు: మర్మమైన ఆ అగ్ని బంతులు ఉల్కలు కాదు. వార్తా నివేదికలు ఈ విషయాన్ని దృవీకరించాయి.

మండుతున్న బంతులు చిలీ ద్వీపమైన చిలోస్‌లోని డాల్కాహ్యూ నగరంలో సెప్టెంబర్ 25 న పడినట్లు ఛ్ణేట్ చిలీ వార్తా పత్రిక తెలిపింది. దొర్లే ఆ అగ్ని బంతులు ఏడు ప్రదేశాలలో క్రాష్-ల్యాండ్ అయ్యాయి, స్వచ్ఛంద అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ అగ్ని బంతులు వలన ఏర్పడిన మంటలను ఆర్పివేశారు.

చిలోస్ ద్వీప నివాసి బెర్నార్డిటా ఓజెడా తన ఆస్తిపై ఒక ఫైర్‌బాల్ పడిందని, 'వాటి మంటలు కొన్ని పొదలను మండించాయిని' ఓజెడా స్థానిక వార్తా కేంద్రం ఛానల్ 2 కి చెప్పారు.

చిలీ యొక్క నేషనల్ జియాలజీ అండ్ మైనింగ్ సర్వీస్ నుండి భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వెంటనే ఏడు స్థలాలనూ పరిశీలించడానికి వెళ్ళారు. వారు తమ విశ్లేషణలను నిర్వహిస్తుండగా, ఈ కథ స్థానిక వార్తలు, సోషల్ మీడియా మరియు జాతీయ సంస్థల ద్వారా వ్యాపించింది.


చిలీ ఖగోళ శాస్త్రవేత్త మరియు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జోస్ మాజా, చిలీ న్యూస్ నెట్‌వర్క్ టివిఎన్‌తో మాట్లాడుతూ, మండుతున్న అగ్ని బంతులు ఉల్కలు లేదా అంతరిక్ష శిధిలాలు (రాకెట్లు లేదా ఉపగ్రహాల నుండి వేరు చేయబడినవి)అయ్యుంటాయి అని అన్నారు.. కానీ, సెప్టెంబర్ 26 న, హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ ట్విట్టర్‌లో చిమ్ చేశాడు, పడిపోతున్న వస్తువులు బహుశా ఉల్కలే అయుంటాయి. కచ్చితంగా అంతరిక్ష శిధిలాలు అయ్యుండవు అన్నారు.


“ఇంట్రా ప్లానటరీ స్థలం యొక్క శూన్యంలో కొన్ని బిలియన్ సంవత్సరాలు గడపడం వల్ల ఉల్కలు చల్లదనాన్ని పొందడానికి చాలా సమయం దొరుకుతుంది. కాబట్టి మన వాతావరణంతో ప్రారంభ సంబంధంలోకి వచ్చే ఖనిజ భాగాలు సగటున చాలా తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి” బ్రిటీష్ ఖగోళ శాస్త్రవేత్త అన్నారు.

సెప్టెంబర్ 28 న, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారి అధికారిక అంచనాను విడుదల చేశారు: అగ్ని బంతులు పడిన ఏడు సైట్లలో ఏ సైటూ ఉల్క యొక్క జాడలను కలిగి లేదు. పడిన మర్మమైన వస్తువులు ఉల్కలు కానందున, అవి తప్పక అంతరిక్ష వ్యర్థంగా ఉండాలని తర్కం చేసారు. సైట్ల నుండి సేకరించిన నేల నమూనాల గురించి మరింత వివరంగా విశ్లేషణలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ నెల చివరిలో వారి ఫలితాలను విడుదల చేస్తారు.

స్వర్గం నుండి సరిగ్గా ఏమి పడిపోయిందో సమయం మాత్రమే తెలియజేస్తుంది.

Images Credit: to those who took the original photos. ********************************************END**************************************************
  P.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి : https://twitter.com/NsaTelugu.

25, అక్టోబర్ 2019, శుక్రవారం

ఎడారి హోటల్…. (ఆసక్తి)



                                                    ఎడారి హోటల్

                                               (కాంక్రీట్ లేకుండా కట్టిన ఏకైక సృష్టి)


ఎడారి అంటే ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం అనేది అందరికీ తెలుసు. భూమిపై 1/3 వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఓయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. అక్కడ నీరు లభ్యమవ్వడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.


ఓయాసిస్ అంటే ఎడారిలో ఉపరితలం నీటి ఊటకు దగ్గరగా ఉన్న ఒక పల్లపు ప్రాంతం. ఎడారిలో కూడా అప్పుడప్పుడు వర్షం పడుతుంది. ఈ వర్షంలో కొంత నీరు ఇసుకలోంచి ఇంకి కింద, అనగా రాతి పొర కింద ఊటగా ఉంటుంది. ఎడారిలో ఇసుక రేణువులు గాలి దుమారాల ద్వారా చెల్ల చెదురవుతాయి. అలా కొండల్లాంటి ఇసుక మేటులు ఒక చోటు నుండి మరొక చోటికి కదులుతుంటాయి. ఒక ఘన మైలు (a cubic mile...1.6 ఘన కిలోమీటర్ cubic km) గాలి ద్వారా 4,600 టన్నుల ఇసుక ఒక చోట నుండి మరొక చోటికి కదులుతుంది. ఒక పెద్ద గాలి దుమారం 100 మిలియన్ టన్నుల ఇసుక లేదా మట్టిని స్థాన భ్రంశం చేస్తుంది. ఇలా ఇసుకమేటులు కదిలే ప్రక్రియలో కొన్ని ప్రాంతాలలో ఒరవడికి అక్కడి ఇసుక కొట్టుకుపోయి పల్లపు ప్రదేశం ఏర్పడుతుంది. ఆ పల్లపు భూతలం దాదాపు భూగర్భ జలం (water table) దగ్గరగా వస్తుంది.అలాంటి చోట పడిన విత్తనాలు మొలకెత్తి, వాటి వేళ్ళు కింద ఉన్న తడి ప్రదేశంలోకి విస్తరిస్తాయి. అక్కడ నీటి ఊటలు పైకి వచ్చి ఓయాసిస్ గా ఏర్పడతాయి. ఒకో చోట ఇలా ఏర్పడిన పల్లపు ప్రాంతాలు చాలా విశాలమైనవి. ఉదాహరణకు సహారా ఎడారి లోని "ఖర్గా ఒయాసిస్" సుమారు 100 మైళ్ళ పొడవు, 12 నుండి 50 మైళ్ళ వరకు వెడల్పు కలిగినది.


అటకామా ఎడారి భూమి మీద అత్యంత తేమ రహిత ప్రదేశం. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధికమైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వ ఉంచుకుంటాయి.

ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిద్యాన్ని గమనించవచ్చు. ఇక్కడ జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణొగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలలో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కోయెట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు, కొన్ని రకాల కప్పలు ఇందులో ముఖ్యమైనవి. అలాంటి ఎడారులలో ఒకటైన ఒక ఎడారిలోనే ఈ ఎడారి హోటల్(రిసార్టు) కట్టారు.


మంగోలియా దేశంలోని విస్తారమైన ఇసుక సముద్రం అని పిలువబడే ఎడారిని క్వియాంగ్షావన్ ఎడారి(Xiangshawan Desert) అని పిలుస్తారు. ఈ ఎడారిలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని చెబుతారు. ఈ ఇసుక ఎడారిలోని ఇసుక దిబ్బల మధ్య ప్రాంతంలో అద్భుతమైన ఒక హోటల్ నిర్మించారు. ఈ హోటలుకు "ఎడారి తామరపువ్వు హోటల్" (Desert Lotus Hotel) అని పేరు పెట్టారు. ఇది చైనా రాజధాణి బీజింగ్ నగరానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాంక్రీట్ లేకుండా (ఉపయోగించకుండా) కట్టబడ్డ ఏకైక సృష్టి. ఈ హోటల్ ప్రసిద్ది చెందటానికి కాంక్రీట్ ఉపయోగించని భవనం అనేది మొదటి కారణమైతే, ఎడారులలో తేలే ఓడల డిజైన్ కలిగి ఉన్నదనేది రెండవ కారణం. మంగోలియా ఒక భూపరివేష్టిత దేశం. ఇది తూర్పు ఆసియా మరియు మధ్య ఆసియాలో ఉన్నది. దీనికి ఎల్లలు ఉత్తరాన రష్యా, దక్షిణం, తూర్పు మరియు పడమరలలో చైనా దేశాలు ఉన్నాయి.


ఈ హోటల్ పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ కార్బన్ డయాక్సైడ్ వెలువరించే భావనతో నిర్మించారు.

ఎడారి ఇసుక దిబ్బలలో హోటల్ కట్టాలి కనుక కాంక్రీట్ మరియు నీరు ఉపయోగించ కుండా ఒక కొత్త నిర్మాణ వ్యవస్థను కనుగొన్నారు. ప్లాట్ ఆర్కిటెక్ట్స్ అనే సంస్థ ఈ తడి ఇసుకలొ నిలబడగలిగే కొత్త ఇంజనీరింగ్ పద్దతిని కనుగొన్నది. ఉక్క ప్యానల్స్ తో పునాదిని తయారు చేసి, ఆ పునాదిపై ఉక్కు ఊచలతో హోటల్ నిర్మాణం చేశారు. పునాది ఉక్కు ప్యానల్స్ పైన ఉక్కు స్ప్రింగులతో ఊచలు నిర్మించడం వలన హోటల్ తెలుతున్న భావన కలిగిస్తుంది(ఎడారి గాలికి కొంచంగా ఊగటం వలన).


30,700 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టబడిన ఈ హోటల్ ఎత్తు 40 మీటర్లు. నిర్మాణంలో హోటల్ పైకప్పులను పునరావృతమైన త్రిభుజాన తెల్లటి గుడారాలతో వరుసక్రమంలో అమర్చారు. అయితే, 45 డిగ్రీల భ్రమణంతో ఒకదానికొకటి కలుసుకునేటట్లు తామరపువ్వు ఆకారంలో నిర్మించారు. ఇటుకలు, రాతి పలకలు, కాంక్రీట్ లేకుండా నిర్మించబడ్డ ఈ నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులు సౌర, నీటి మరియు పవన విద్యుత్ శక్తిని మాత్రమే ఉపయోగించుకుంటాయి. దీనివలన పర్యావరణ కాలుష్యం తగ్గటమే కాకుండా, జీవావరణ రక్షణను బలపరిచేటట్లు చేస్తుంది.

ఈ హోటల్ వారు పర్యాటకుల కోసం మంగోలియా దేశ సంస్కృతిక నేపధ్యంతో ప్రదర్శనలు, ఒంటె సవారీలు, ఎడారి సర్ఫింగ్ లాంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఎడారి 'పాటలు పాడే' ఎడారిగా ప్రసిద్ది చెందింది. ఎడారిలో శాంతంగా ఉండే మట్టిని భగ్నపరిస్తే గర్జించు మరియు విజృంభిస్తున్న శబ్ధం వినబడుతుంది.( ఈ ప్రకృతి సంఘటన ఎందుకు/ఎలా జరుగుతోందో ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు).

ఈ ఎడారిలో కొన్ని రోజులు గడపటానికి, ఇసుక దిబ్బెలు పాడే పాటలను వినడానికి, తేలే హోటల్ ఇంజనీరింగ్ వండర్ని చూడటానికి ఎంతోమంది పర్యాటకులు వచ్చి వెడుతున్నారట.

Images Credit: to those who took the original photos.

21, అక్టోబర్ 2019, సోమవారం

గురుదక్షణ....(కథ)




                                                          గురుదక్షణ



నేను స్కూలు చదువుకునేటప్పుడు నాకు పాఠాలు చెప్పిన రామారావు మాస్టారు, తన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బుచాలక చాలా కష్టపడుతున్నారని తెలిసింది.

ఆయన దగ్గర చదువు నేర్చుకుని, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి, ఇప్పుడు రైల్వేలో క్లర్కుగా పనిచేస్తున్న నేను ఆయనకు సహాయ పడలేకపోతున్నానే అన్న బాధ నన్ను వేధిస్తున్నది . చేతిలో ఉన్నది యాభైవేల రూపాయలు. అవి సరిపోవు. ఏం చేయాలో తెలియక చేతులు నలుపుకుంటూ ఆలొచిస్తున్న నాకు 'బిల్డింగ్ కాంట్రాక్టర్’ గా పనులు చేస్తున్న, నాతోపాటు చదువుకున్న, నా చిన్ననాటి స్నేహితుడు గణేష్ ఇంట్లోకి రావడం కనబడింది.

అతనికి ఎదురు వెళ్ళి "రా...రా...గణేష్" అంటూ అతన్ని ఆహ్వానించి లోపలకు తీసుకువచ్చి కుర్చీ చూపించి "కూర్చో" అన్నాను.

గణేష్ కుర్చీలో కూర్చున్న తరువాత "ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి. నువ్వు బిల్డింగ్ కాంట్రాక్టర్ గా, సొంత పనులు చేస్తున్నావని విన్నాను. సంతోషంగా ఉందిరా. నీ పనులు ఎలా ఉన్నాయి. నువ్వు ఎలా ఉన్నావు" అని అడిగాను.

"బాగున్నానురా...ఒక ముఖ్య విషయం గురించి నీ దగ్గరకు వచ్చాను"

"చెప్పరా?"

"మన రామారావు మాస్టారు తన కూతురు పెళ్ళి చేయటానికి డబ్బుచాలక కష్టపడుతున్నారని విన్నాను. ఇందా, ఇందులో రెండు లక్షలు ఉన్నాయి. మాస్టారుకి ఈ డబ్బును నీ డబ్బుగా చెప్పి ఇవ్వరా" అంటూ నాకొక కవరు అందించాడు.

"ఈ డబ్బు నేనెందుకు ఇవ్వాలి?...నీ డబ్బు...నువ్వే ఇవ్వు"

"లేదురా...స్కూల్లో చదువుకునేటప్పుడు, నేను సరిగ్గా చదివే వాడిని కాదు. మాస్టారు నాకు ప్రోగ్రస్ రిపోర్టు ఇచ్చినప్పుడల్లా 'బాగా చదువుకోకపోతే జీవితంలో ఎదగటం కష్టం' అని చెప్పేవారు. ఎనిమిదో క్లాసుతో చదువు ఆపాశాను...కూలీగా ఒక ఇళ్ళ మేస్త్రీ దగ్గర పనికి జేరాను. కొన్నేళ్ళ తరువాత మేస్త్రీ అయ్యాను. ఐదేళ్ళ నుండి నేనే స్వయంగా కాంట్రాక్ట్ తీసుకుని బిల్డింగులు కట్టిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ డబ్బులు తీసుకు వెళ్ళి ఇస్తే ఆయన చెప్పిన మాట అబద్దం అవుతుంది"

"ఆయన చెప్పిన మాటలు అబద్దం అయినట్లే కదురా. చదువు లేకపోయినా జీవితంలో ఎదగొచ్చు. దానికి డైరెక్ట్ ఉదాహరణ నువ్వే. నువ్వు చదువుకోకపోయినా బిల్డింగ్ కాంట్రాక్టర్ అయ్యి, బాగా డబ్బు సంపాదిస్తున్నావు కదరా. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకు వెళ్ళి ఇస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు" అన్నాను.

"అలాగే బాధ కూడా పడతారు. ఎందుకంటే ‘బాగా సంపాదించుకుంటున్న వీడిని చూసి ఎన్నిసార్లు 'బాగా చదువుకోకపోతే జీవితంలో ఎదగలేవు’ అని తిట్టాను అంటూ బాధపడతారు. ఆయన బాధ పడకూడదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజం రా"

"ఏమిట్రా నువ్వు చెప్పేది?"

“ఈరోజు నేను బిల్డింగ్ కాంట్రాక్టర్ గా ఎదిగి, రెండు చేతులా సంపాదిస్తున్నాను. కానీ, ఈ ఎదుగుదల జీవితంలో నిజమైన ఎదుగుదల కాదురా. ఎప్పుడైనా ఈ ఎదుగుదల నుండి నేను మామూలు స్థితికి రావచ్చు"

"ఎందుకురా అలా మాట్లాడుతున్నావు?"

"అర్ధం కాలేదు కదూ? నీకు అర్ధమయ్యేటట్టు చెబుతా విను. మాస్టారు చెప్పిన మాట విని నేను శ్రద్దగా చదువుకోనుంటే నేను కూడా ఒక ఇంజనీర్ అయ్యుండేవాడిని. ఎవరిమీదా ఆధారపడకుండా పైగెదిగేవాడిని. ఇంజనీర్లు లాగా రేట్లు చెప్పి ఎక్కువ సంపాదించుకునేవాడిని. కానీ నేను ఇంజనీర్ల కంటే తక్కువ చార్జ్ చేస్తాను కాబట్టే కాంట్రాక్టు నాకు ఇచ్చేవారు. ఒక పక్క ఇంజనీర్ల కంటే సంపాదన తక్కువ, దానికితోడు వాళ్ల సహాయంకోసం, వాళ్లకోసం నా సంపాదనలొ కొంత ఇచ్చుకోవటం, చదువుకోనుంటే ఇవన్నీ నాకే మిగిలేవిగా?”

అర్ధం కానట్టు చూశాను.

“ఇంకా అర్ధం కాలేదా. ఇంకా బాగా అర్ధమయ్యేటట్టు చెబుతా విను. ప్రతి బిల్డింగ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక, ఆ బిల్డింగ్ ప్లానుకు చదువుకున్న ఒక ఆర్కిటెక్ట్ ను కలుస్తున్నాను. కొన్ని పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు చదువుకున్న సివిల్ ఇంజనీరును కలిసి బిల్డింగ్ కరెక్టుగా కడుతున్నానా లేదా అని చూసి వెళ్ళమంటాను. కాంట్రాక్టుకు తీసుకున్న డబ్బుల్లో నలభై శాతం వాళ్ళకి ఇస్తున్నాను...ఈ మధ్య చిన్న చిన్న కాంట్రాక్టులు ఇచ్చే వాళ్ళు కూడా నేరుగా సివిల్ ఇంజనీర్లను వెతుక్కుంటూ వెడుతున్నారు. ఒకప్పుడు నేను స్వయంగా సంవత్సరానికి కనీసం మూడు కాంట్రాక్టులైనా తెచ్చుకో గలిగాను. ఇప్పుడు కాంట్రాక్టులు తగ్గి, సివిల్ ఇంజనీర్లు ఇచ్చే పనులు ఒప్పుకుంటున్నాను"

"ఒకప్పుడు అనుభవం ఉన్న మేస్త్రీ అనే చూపుతో ఆర్కిటెక్టులు, సివిల్ ఇంజనీర్లూ పిలిచి పనులు ఇచ్చేవారు. ఇప్పుడు అవికూడా తగ్గుతున్నాయి. మనం వెళ్ళి అడిగినా ఏదో ఒక నెపం చెప్పి కొత్త వాళ్ళను పెట్టుకుంటున్నారు"

“ఇప్పుడు నా సంపాదన తక్కువగానే ఉన్నది. ఏదో ఇంతకుముందు సంపాదించుకున్న డబ్బు దాచుకున్నాను కాబట్టి జీవితంలో గౌరవంగా బ్రతుకుతున్నాను. కానీ ఆ దాచుకున్న డబ్బు ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు. అవి కరిగిపోయిన రోజు నేను మామూలు మేస్త్రీనే. అందుకే ఇందాకా ఆ మాట చెప్పాను"

"ఇందులో నా కృషి యొక్క తప్పేమీ లేదు... తప్పంతా నేను చదువుకోకపోవటమే. ఎంతో కష్టపడి ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ సంపాదించినా చదువుకున్న ఒక ఆర్కిటెక్ట్ దగ్గరకు తప్పక వెళ్ళాలి. కొన్నిసార్లు సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి. అంటే చదువులేనిదే జీవితంలో ఎదగలేము అనేదే కదా నిజం. కాబట్టి మాస్టారు చెప్పింది నిజం"

“ఆ రోజు నేను శ్రద్దతో చదువుకోనుంటే నేనూ ఒక సివిల్ ఇంజనీర్ అయ్యుండేవాడిని...పెద్ద సివిల్ ఇంజనీర్ గా ఎదిగే వాడిని...పేరున్న సివిల్ ఇంజనీర్ గా బ్రతికే వాడిని...సివిల్ ఇంజనీర్ గా చనిపోయేవాడిని"

“ఎందుకురా అంత బాధ పడతావు...చదువులు లేని ఎంతో మంది వ్యక్తులుపెద్ద పెద్ద వ్యాపరస్తులుగా ఉంటూ, చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు కదా? నువ్వు ఇంకా కొంచం కష్టపడితే ఆ అంతస్తుకు ఎదిగిపోతావు. ఆ తరువాత నీ జీవితం గౌరవంగానే ఉంటుందిరా" అన్నాను.

"స్నేహితుడిని కదా అని నువ్వు నాకు పాజిటివ్ మాటలు చెబుతున్నావు...కానీ అది నిజం కాదు. చదువులేకపోయినా అదృష్టంతో పైకొచ్చినవారి సంఖ్యా శాతం ఒకట్లలో ఉంది. దీనికి కష్టపడటం మాత్రమే చాలదు. అదృష్టం వరిస్తేనే అలాంటి వారు అవుతారు. అదే చదువుకున్న వారు కష్టపడి పనిచేస్తే ఇట్టే పైకెదిగిపోతారు. అలాంటి వారిని అదృష్టం ఎప్పుడూ ఒక చూపు చూస్తూనే ఉంటుంది. వాళ్ళని పైకి తీసుకు వెడుతుంది. అదేరా చదువుకు ఉన్న గొప్పతనం ...అందుకేరా ఆడా మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాలి...చదువు ప్రతి ఒక్కరినీ మేధావుల్ని చేస్తుంది" అన్నాడు గణేష్.

“చదువుకోవటానికి నిర్వచనం ఎంత బాగా చెప్పావురా...ఇంతగా జీవితం గురించి ఆలొచించే నువ్వు చదువు లేకపోయినా మేధావివేరా. చాలా తెలివిగలవాడివిరా...నీ భవిష్యత్తు గురించి ఇంతగా ఆలొచిస్తున్న నువ్వు, నువ్వు దాచుకున్న డబ్బులో రెండు లక్షలు గురువుకు దానంగా ఇస్తున్నదానికంటే, ఆయన మాటను అబద్ధం చేయకూడదని తపన పడుతున్నావే...అదే నువ్వు మాస్టారుకు ఇచ్చే నిజమైన గురుదక్షణ. ఆయన కూతురు పెళ్ళికి నువ్వు చేసే డబ్బు సహాయం గురుదక్షణ కాదురా...ఆయన మాటను నిలబెట్టాలనుకొవటమే నిజమైన గురుదక్షణ రా. నీ గొప్ప మనసుకీ, తెలివితేటలకూ నువ్వు జీవితంలో ఎదుగుతావురా...ఇది ఖచ్చితంగా జరుగుతుందిరా" అంటూ గణేష్ ఇచ్చిన డబ్బును తీసుకున్నాను.

అప్పుడు గణేష్ ముఖంలో కనబడ్డ ఆనందం, తృప్తి నా కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి.

19, అక్టోబర్ 2019, శనివారం

ప్రకృతితో పరాచికాలా?....(ఆసక్తి)


                                               

                                                   ప్రకృతితో పరాచికాలా?

గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి వాతావరణ జోక్యం పద్దతితో(Geoengineering)భూమి యొక్క వాతావరణాన్ని కృతిమంగా మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భూమి చుట్టూ అతి నీల లోహిత కిరణాల నుండి రక్షణ కవచంగా పనిచేస్తున్న ఓజోన్ పొర, గ్రీన్ హౌస్ వాయువుల వల్ల తరిగిపోతోంది. దీనినే 'గ్లోబల్ వార్మింగ్' లేదా 'భూమి వేడెక్కడం' అని అంటారు.

నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, మిధేన్ లాంటి కొన్ని రకాల వాయువులను 'గ్రీన్ హౌస్’ వాయువులు అని పిలుస్తారు. ఇవి ప్రకృతి సహజంగా విడుదల అయినప్పుడు భూమిపైన 'ఇన్ ఫ్రా రెడ్' కిరణాలు ఉత్పన్నం చేసే రేడియో ధార్మికతను తగ్గించి ఉష్ణొగ్రతను నియంత్రించేందుకు సాయం చేస్తాయి.


అయితే శిలాజ ఇంధనాల వినియోగం...అంటే... పెట్రో ఉత్పత్తుల వినియోగం ద్వారా అవసరాన్ని మించి అధికమొత్తంలో విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులు భూగోళంపై ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచేస్తున్నాయి. దీంతో భూమి విపరీతంగా వేడెక్కిపోతోంది.

ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మానవాళి అనేక దుష్పరిణామాలను ఎదుర్కోంటోంది. హిమాలయాల్లో హిమానీనదాలు రికార్డు స్థాయిలో కుచించుకుపోతున్నాయి. పరిస్తితులు ఇలాగే ఉంటే 2035 నాటికల్లా తూర్పు మధ్య హిమాలయాల్లో హిమానీ నదాలే కనిపించవట. ఆహార, నీటి సంక్షోభాలను ఎదుర్కోవడమే కాకుండా. వేసవి వడగాల్పుల వల్ల వేలాదిమంది అసువులుబాయాల్సి వస్తుంది. సముద్ర మట్టాలు పెరిగిపోవడం, అడవులు మునిగిపోవడం, కరువు పరిస్థితులు లాంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.


గ్లోబల్ వార్మింగ్ వల్ల భూగ్రహంపై అనేక మార్పులు జరుగుతున్నాయి. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలతో వాయు, జల, భూతల కాలుష్యం పెచ్చరిల్లి భూగ్రహంపైన అనేక విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఎన్నడూ ఎరుగని రీతిలో వరదలు పట్టణాలనూ, ఊళ్ళనూ ముంచెత్తుతున్నాయి. కొన్ని చోట్ల వర్షాలు విపరీత స్థాయిలో కురుస్తూండడం వల్ల ఊళ్ళకి ఊళ్ళే జలాశయాలుగా మారుతుండగా మరి కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి వర్షాలు కురవక కరువు పరిస్థితులు ప్రజలను అల్లాడిస్తున్నాయి. గత వంద సంవత్సరాలుగా 'గ్లోబల్ వార్మింగ్' పెరుగుతూనే ఉంది. వనరులనూ,శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించినప్పుడే 'గ్లోబల్ వార్మింగ్' ప్రభావాన్ని తగ్గించగలం. వనరుల, శిలాజ ఇంధనాల వాడకాన్ని ఒక్కసారిగా తగ్గించగలమా? తగ్గించలేము. ప్రణాళిక వేసుకుని కొద్ది సంవత్సరాలలో కొంతైనా తగ్గించకుందామని ప్రపంచదేశాలన్నీ మాట్లాడుకున్నాయి గానీ ఏ ఏ దేశాలు ఎంత తగ్గించాలి అన్న ఆంశంలో రాజీ పడలేకపోయారు. ఎవరికి వారే మీరు ఎక్కువగా తగ్గించాలి అని అవతలి దేశాన్ని ఎత్తి చూపాయి. ఎన్నిసార్లు కలుసుకున్నా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి/పోతున్నాయి.


ప్రణాళికలతో దేశాలు రాజీపడలేవు, పడినా వెంటనే ప్రయోజనం ఉండదు. భూమి వేడెక్కడాన్ని వెంటనే తగ్గించటానికి గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపును తగ్గించే ప్రయత్నాలు అన్ని దేశాలూ అమలుచేసినా వేడిని వెంటనే తగ్గించలేము కాబట్టి, ఈలోపు భూమికి పెద్ద ముప్పు రావచ్చు అని గ్రహించిన కొందరు శాస్త్రవేత్తలు జియో ఇంజనీరింగ్ (కృతిమ రసాయణాలతో) మూలం గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించవచ్చు అనే ఒక ప్రాతిపదికను ముందు పెట్టారు. సత్వరమార్గం అంటే ఎవరికైనా ఆశే కదా! 'సరే' అన్నారు పెద్దలు. వంతు పలికారు మిగిలినవారు.

జియో ఇంజనీరింగ్ పద్దతితో భూమి వేడిని తగ్గించటం మంచిది కాదు. దాని వలన లాభం కంటే, నష్టమే ఎక్కువ జరుగుతుందని మరికొందరు శాస్త్రవేత్తలు గొంతు చించుకు చెప్పారు. ఎవరూ వినిపించుకోలేదు. కృతిమ రసాయన ప్రయోగంతో భూమి వేడిని తగ్గించటానికి మొదటి ప్రయోగం చేయటానికి సన్నాహాలు పూర్తి అయినట్లు తెలుపుతున్నారు. ప్రయోగాలు మొదలుపెట్టబోతామని చెబుతున్నారు. జియో ఇంజనీరింగులో మొదటిది ఉప్పు తుంపరలను (aerosols of sea salt) సముద్ర మేఘాలలోకి ఇంజెక్ట్ చేయటం. దీని వలన సముద్ర మేఘాలలో నీటి బిందువు ఉనికిని ఎక్కువ చేసి దాని మూలంగా సూర్యరశ్మిని ప్రతిఫలింపజేయటం. ఇలా చేయటం వలన సముద్ర మేఘాలు కాంతివంతమౌతాయి. దీని వలన సూర్యరశ్మి భూమి మీద ఎక్కువగా పడకుండా వెనక్కి(అంతరిక్షంలోకి) పంపబడుతుంది. అప్పుడు సూర్యుని వేడి ఎక్కువగా భూమిమీద పడదు కనుక భూమి చల్లగా ఉంటుంది.

జియో ఇంజనీరింగ్ లో రెండవది, సల్ఫర్ తో కూడిన పదార్ధాలను భూమికి 20 కిలోమీటర్ల పైన విరజిమ్మడం. ఇవి భూమి నుండి పైకి వెళ్ళే గ్రీన్ హౌస్ వాయువులను ఓజోన్ లేయర్ దగ్గరకు పోకుండా అడ్డుకుంటుంది. అప్పుడు ఓజోన్ లేయర్ తనని తాను బాగుచేసుకుంటుంది. జియో ఇంజనీరింగ్ లో మూడవది, చిల్లులులేని మేఘాలలో చిల్లులను ఏర్పరిచే బిస్మత్ ఐయోడిన్ చిమ్మితే మేఘాలలో చిల్లులు ఏర్పడి భూమి నుండి వెళ్ళే గ్రీన్ హౌస్ వాయువులను క్రిందకు పంపకుండా చిల్లుల మూలంగా దుర్భలము చేస్తుంది


భూమిని కాపాడాల్సిన మనమే, దానికి ఇది పద్దతి కాదు అని జియో ఇంజనీరింగ్ వ్యతిరేక ప్రచారకులు చెబుతున్నారు. దీని వలన వాతావరణం ఇప్పుడున్న దానికంటే మనం బాగుచేసుకోలేనంతగా మారిపోతుంది. అప్పుడు ఎటువంటి ప్రయత్నాలూ చేయలేము. గ్లోబల్ వార్మింగుకు గ్రీన్ హౌస్ వాయువులే కారణమని తెలుసుకున్నట్లే, వాటిని తగ్గించుకుంటూ వాతావరణ మార్పిడిని మనకు అనుకూలంగా ఏర్పడేటట్లు ప్రయత్నాలు చేయాలి గానీ ఇలా ప్రకృతినే మార్చాలనుకోవడం సరికాదు. దీనివలన మనం లాభం పొందలేము. దీనివలన ఏర్పడే సైడ్ ఎఫెక్టులను మనం తట్టుకోలేము అని వాపోతున్నారు.

Images Credit: to those who took the original photos. *************************************END******************************************************

15, అక్టోబర్ 2019, మంగళవారం

మాయాలోక నది!...( ఆసక్తి)



                                                     మాయాలోక నది


'మాయ’ అంటే సత్యాన్ని తెలుసుకొలేకపోవడం, అసత్యాన్ని అర్ధం చేసుకోలేకపోవడం అనే భావనే చాలామందిలో ఉంటుంది. మనకు తెలియకుండా మన కళ్ళెదుట జరుగుతున్నదే మాయ అంటారు పెద్దలు.

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, మర్మాలు దాగి ఉన్నాయి. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ అవన్నీ మాయలో కాదో అర్ధం చేసుకోవడం మామూలు మనుషులకు మాత్రమే కాకుండా శాస్త్రవేత్తలకు కూడా కష్టంగానే ఉన్నది.


అలాంటి ఒక విషయాన్నే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నము.

ఫిలిప్పీన్స్ దేశంలోని వర్షారణ్యంలో ఒక వింత ప్రదేశం ఉన్నది. అదొక అందమైన నది. నది అంటేనే మంచి నీరు కలిగినదని మనందరికీ తెలుసు. కానీ ఈ నదిలో ఉన్నది ఉప్పు నీరు. ఈ నదిని అక్కడ Hinatuan Enchanted River అంటారు. ఈ అందమైన నది గురించి స్థానిక పురాణాలు ఎన్నో విషయాలు చెబుతున్నాయి. ఈ నదిలో నాగకన్యలు స్నానమాడతారని, యక్షిణులు జలకాలాడతారని చెబుతారు.


సముద్రానికి 648 మీటర్ల దూరంలో ఉండే ఈ నదిలోని నీరు నీలి రంగులో, మలినం లేకుండా స్పష్టంగా ఉంటుంది. ఫాంటసీ సినిమాలలో చూపించే నదిలాగా కనబడుతుంది. ఆ నదీ ప్రదేశం ఆధ్యాత్మిక ప్రదేశంలా ఉంటుంది.

అక్కడి పురాణాలలోనూ, జానపద చరిత్రలోనూ ఈ నది గురించిన ప్రస్థావన ఎక్కువగా రాసుందు. అందువల్ల ఈ నదిని చూడటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. ఈ నదికి Enchanted River(గందర్వులు సంచరించే నది) అనే పేరు స్థిరమైపోయింది.


ఇందులోని నీరు చాలా నిశ్చితమైనదిగా ఉంటుంది. ఈత కొట్టే వారికి నీటిలో కాకుండా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుందట. 80 అడుగుల లోతుకు వెళ్ళినా, ఈతగాళ్ళు పైనున్నవారికి బాగా కనబడతారట. నది క్రింద కనిపించే నేల అద్దంతో తయారుచేసిన పలకలాగా ఉంటుందట. నది మడుగు క్రింద ఆనేక ద్వారాలు ఉన్నాయి. నది నీటి చుట్టూ ఉన్న వృక్షజాలం ఆ నది నీటిలో కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నది తీరంపై నది చుట్టూ ఉండే చెట్లు, పువ్వులూ అద్దంలో కనబడుతున్నట్టు కనిపిస్తాయి. నీటిలో అటూ-ఇటూ వెళుతున్న చేపలు స్పష్టంగా కనిపిస్తాయి.


నది మడుగు కింద కనిపించే ద్వారాలలో నుంచే నది నీరు వస్తున్నదేమోనని పరిశోధన చేయడానికి 1999లో Alex Santos అనే డైవర్ వెళ్ళాడు. అతను ద్వారాల వరకు వెళ్ళి తిరిగి వచ్చాడు. ద్వారాలు, గుహలలోకి వెళుతున్నాయని, గుహలు చీకటిగా ఉన్నాయని, అందువలన తాను వాటిలోకి వెళ్ళలేకపోయానని తెలిపాడు. ఆ గుహలలోకి వెళ్ళి చూడాలని 2010లో ముగ్గురిని పంపించారు. 8 మీటర్లు ఎత్తు కలిగిన గుహలోకి వెళుతున్నప్పుడు ఒకరు గుండెపోటుతో మరణించారు. వేర్వేరు ద్వారాలలోకి వెళ్ళిన మిగిలిన ఇద్దరూ 200 అడుగుల దాకా ప్రయాణం చేసి గుహలు మరింత చీకటిగా ఉండడంతో తిరిగి వచ్చాసారు.

గజ ఈతగాళ్ళను అత్యధిక వెలుతురు ఇవ్వగలిగే హెడ్ లైట్లతో పంపేరు. కానీ ఎవరూ పూర్తిగా గుహలను దాటలేకపోయారు.

స్థానికుల కథనం ప్రకారం ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఈ నది ఇప్పటివరకు మలినం చెందలేదు. ఆత్మలు, జలకన్యలు, దివ్యభామలు, ఆధ్యాత్మిక జీవులు, కొన్ని సంప్రదాయాలు ఈ నదికి గార్డియన్ గా ఉంటూ మలినం కాకుండా కాపాడుతున్నాయని చెబుతున్నారు. జలకన్యలు, దివ్యభామలు ఈ నది నీటిలో రాత్రిపూట జలకాలాడటం చూశామని అంటారు.

పురాణాల ప్రకారం నది చుట్టూ ఉండే చెట్లు 'enkantos' అనే దేవ కన్యలకు నిలయం. 'enkantos' అంటే అక్కడి భాషలో ప్రకృతి యొక్క ఆత్మ అని అర్ధం. ఇప్పుడు అక్కడ నివసిస్తున్న వారు, కొంతమంది పర్యాటకులు ఆ జలకన్యలను చూశామని చెబుతున్నారు.

రాత్రిపూట జలకన్యలు స్నానమాడతారని, అప్పుడు నదిలో ఈతకు వెళ్ళేవారిని నది నీటిలో ముంచేస్తాయని చెప్పటంతో రాత్రిపూట పర్యాటకులతో సహా స్థానికులను కూడా ఆ నదిలో ఈత కొట్టటానికి అనుమతించరు. పగటి పూట ఈత కొట్టిన వారిలో చాలామందికి వీపు మీద చురకలు, దురదలు, శరీరంలో అక్కడక్కడా గీతలు గీసుకుపోయి ఉండటం కనిపిస్తాయట. ఒక్కొక్కసారి ఈత కొడుతున్న వారిని ఆకశ్మికంగా లోపలకు లాక్కుని వెళ్ళడం జరుగుతున్నదిట.

ఈ నదిలో కనిపించే చేప జాతులు మరే చోటా లేవట. చేపల వలలో అవి చిక్కుకోవట.


ఈ నది గురించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నది ఒడ్డున ఒక చెట్టుకు ఒక గంట ఉంటుంది. ఆ గంటను మోగించినప్పుడు ఆ నదిలో ఈత కొడుతున్న వారందరూ నీటిలో నుంచి తీరానికి వచ్చేయాలి.'Hymn of Hinatuan' అనే పాటను పెద్దగా వినిపిస్తారు. ఎక్కడి నుండో వేలకొలది చేపలు అక్కడికి చేరుకుంటాయి. నది కాపలాదారులు వాటికి ఆహారం వేస్తారు. ఒక గంట తరువాత మళ్ళీ గంట మోగిస్తారు. చేపలన్నీ వెళ్ళిపోతాయి. పర్యాటకులు ఈతకు వెళ్ళొచ్చు.

తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కాపాడుతూ, నది మర్మాన్ని కనుక్కోవడానికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

Images Credit: to those who took the original photos.

*********************************************************************************************

P.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu.

13, అక్టోబర్ 2019, ఆదివారం

మాయమైపోయిన విమానం ....(మిస్టరీ)


                                                మాయమైపోయిన విమానం



మాయమైపోయిన విమానం మలేషియా ఏయిర్ లైన్స్ MH-370.

ఐదు సంవత్సరాల వెతుకులాట ముగింపుకు వచ్చింది... మాయమైపోయిన విమానం ఇక దొరకదని నిర్ణయానికి వచ్చారు మలేషియా అధికారులు.


మలేషియా ఏయిర్ లైన్స్ కు చెందిన MH-370 విమానం 8 మార్చ్2014 న అదృశ్యమైనదని అందరికీ తెలుసు. ఇది మలేషియా రాజధాణీ కౌలాలంపూర్ నుండి చైనా రాజధాణి బీజింగుకు వెళ్ళాలి. కానీ మార్గ మధ్యలో అదృశ్యమైంది.

అదృశ్యమైన ఈ విమానం ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో ఆ విమానంలో ప్రయాణం చెస్తున్న మొత్తం 239 (సిబ్బందితో కలిపి) మంది ప్రయాణీకులు మరణించారని మలేషియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ప్రమాదం ఎక్కడ జరిగిందో, శకలాలు ఏమైనాయో మాత్రం తెలుపలేదు.


అదృశ్యమైపోవడానికి అదేమైనా చిన్న వస్తువా?

సముద్రంలో పడిపోయిందా? దారి మళ్ళించారా? సముద్రంలో పడిపోయుంటే ఒక చిన్న ముక్క కూడా దొరకలేదా? అంతమంది ప్రయాణీకులలో ఒకరి దేహం కూడా దొరకలేదా? దారి మళ్ళించి ఉంటే అంతపెద్ద విమానం జాడ తెలియకుండా ఉంటుందా?...ప్రజలకు నచ్చజెప్పే సమాధనం చెప్పలేకపోవటం ఒక అరుదైన విషయం. అందుకే ఇది ఆధునిక మిస్టరీ.


విమానం మిస్సైన దగ్గర నుంచి 26 దేశాలు అవిశ్రాంతంగా దాదాపుగా 20 శాతం భూగోళాన్ని జల్లెడ పట్టాయి. హిందూ మహసముద్రం, బంగాళాకాతం, అండమాన్ సముద్రాలను గాలించినా విమానం జాడ కనిపెట్టలేకపొయాయి.

అద్భుతమైన టెక్నాలజీ, అపారమైన అనుభవం గల అగ్రదేశాల సహకారం, నాసా ప్రతిభ ఏమీ చేయలేకపొయింది. విమానం జాడే తెలియకుండా పోయింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియకపోవడంతో సముద్రంలో పడిపోయిందని కొన్ని, హైజాక్ అయిందని మరికొన్ని కధనాలు వచ్చాయి.

భూమిపైన ఏ మూలన ఏం జరుగుతోందో తెలుసుకోగల సత్తా అమెరికా మొదలుకుని ఎన్నో దేశాలకు ఉంది. అంతరిక్షంలో నివాసాలు సైతం ఏర్పాటు చేసుకునే టెక్నాలజీని అభివ్రుద్ది చేస్తోంది. ఆ ప్రతిభంతా ఎందుకూ కొరగాకుండా పోయిందా? హై టెక్నాలజీ ఉన్న నాసా సైతం చేతులెత్తేసింది! హఠాత్తుగా మాయమైన మలేషియా విమానం మన సాంకేతిక పరిజ్ఞ్నానికి ఒక సవాలుగా మారింది. ఆకాశం సదా అంతర్జాతీయ నిఘాలో ఉన్నప్పుడు ఒక విమానం అదృశ్యమవడం, దాని జాడ ఎవరికీ తెలియకపోవటం...ఎవరూ నమ్మలేకపోతున్నారు.


మలేషియా విమానం MH-370 గాలిలో పేలిపోయిందనడానికి గానీ, సముద్రంలో కూలిపోయిందనడానికి గానీ సాక్ష్యాలు లేవని ఐ.రా.స. కు చెందిన సంస్థ CTBTO ప్రకటించింది. సమగ్ర (అణు) పరీక్షల నిషేద ఒప్పంద సంస్థ (Comprehensive Test Ban Treaty Organisation) ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పిన పరిశీలనా కేంద్రాలేవీ విమానం కులిపోయిన జాడలను రికార్డు చేయలేదని ఐ.రా.స. సెక్రటరీ జెనరల్ బాన్-కి-మాన్ ప్రతినిధి డుజరిక్ ప్రకటించారు.

అదే సంవత్సరం జూలై-17న ఊక్రయిన్లోని తిరుగుబాటుదారులు మలేషియన్ ఏయర్ లైన్స్ కు చెందిన MH-17 విమానాన్ని కుల్చివేశారు. ఆ విమానంలో 280 మంది ప్రయాణీకులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. అందరూ మరణించారు. కూల్చివేయబడ్డ ఈ విమానమే అదృశ్యమైపోయిన MH-370 విమానం అని కొందరంటున్నారు. కారణం, "కూలిపోయిన MH-17 విమానంలోని చనిపోయిన వారందరి దేహాలమీద పాస్ పోర్టుల అతికించబడి ఉన్నాయి" అని ఊక్రయిన్ తిరుగుబాటుదారుల కమాండర్ ఈగోర్ ఫిర్మిన్ తెలిపారు.

ఎవరైనా 239 ప్రయాణీకులున్న విమానాన్ని దొంగిలించి, ఆ విమానాన్ని 6 నెలలవరకు దాచిపెట్టగలరా? అందులోని శవాలను తీసి మరో విమానంలో, అందులోనూ వేరే దేశం నుండి బయలుదేరే విమానంలో పెట్టగలరా? ఇదంతా సాధ్యమయ్యే పనేనా?...అని కొట్టిపడేస్తున్నారు.

"MH-370 విమానం పాకిస్తాని తాలిబన్ నియంత్రిత ప్రదేశాలలో ఉండవచ్చు. ఈ ఖాలీ విమానాన్ని వెపెన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ తో నింపి అమెరికాపై దాడి చేయవచ్చు"…ఒక రిటైర్ద్ అమెరికా మిలటరీ జెనెరల్ ఫాక్స్ న్యూస్ ఛనెల్ ఇంటర్ వ్యూలో తెలిపారు.

"వియత్నాం దగ్గరలో చైనా మిలటరీ MH-370ని సబ్ మరైన్ క్షిపణులతో కూల్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆ విమానంలో ప్రయాణం చేస్తున్న కొందరిని చైనా హత్య చేయాలనుకున్నది" అని బ్రిటీష్ బారిస్టర్ Michael Shrimpton అన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే విమాన శకలాలు అక్కడ దొరికి ఉండాలి. మొట్టమొదట అక్కడే ఈ విమానం కోసం వెతికారు. ఏమీ దొరకలేదు.


అదృశ్యమైన MH-370 విమానంలో ఆమెరికా టెక్నాలజీ కంపెనీ 'ఫ్రీ స్కేల్ సెమి కండక్టర్’ కు చెందిన 20 ఉద్యోగస్తులు ప్రయాణం చేస్తున్నారు. ఈ కంపెనీ అత్యంత శక్తివంతమైన మైక్రో చిప్స్ ను తయారుచేస్తోంది. వాటిని రక్షణ పరిశ్రమ, అంతరిక్ష పరిశోధన పరిశ్రమలకు అందిస్తున్నారు. ఈ ఉద్యోగస్తుల దగ్గర ఈ పరిశ్రమలకు చెందిన రహస్య సమాచారం ఉంది. ఈ ఉద్యోగస్తులు చైనా గూఢాచారుల చేతిలో చిక్కుకుంటారేమోనని అమెరికానే విమానాన్ని దారి మళ్ళించి ఉంటుందని కొందరు ఊహిస్తుంటే, కాదు ఆ ఉద్యొగస్తులను చైనా మిలటరీ కిడ్నాప్ చేయడానికి విమానాన్ని హైజాక్ చేసి తీసుకువెళ్ళుంటారని మరికొందరు ఊహిస్తున్నారు.

ఎవరికీ తెలియకుండా, ఎవరి రాడార్లలోనూ కనిపించకుండా ఒక విమానాన్ని దారిమళ్ళించి తీసుకు వెళ్ళగలరా? అసలు ఇది సాధ్యమా అంటే "సాధ్యమే. ఈ మధ్య జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో హ్యూగో టీసో అనే టెక్నాలజీ నిపుణుడు ఒక మొబైల్ ఫోనుతో విమానాలను ఎలా దారి మళ్ళించవచ్చో చేసి చూపించాడు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని, ఇంకొక విమానం నీడలో ఈ విమానాన్ని దారి మళ్ళించే అవకాశం ఉన్నది" అని ఇండి పెండంట్ పేపర్లో ఒక వ్యక్తి రాశారు.

మలేషియన్ ఏయర్ లైన్స్ విమానం MH-370 అదృశ్యమవటానికి కారణం ఏదైనా, అందులో ప్రయాణం చేసిన వారి గతి ఏమిటనేదే ప్రతి ఒక్కరి ఆవేదన. విమానం ఏమైందో బయట ప్రపంచానికి తెలిసేవరకు ఇదొక మిస్టరీగా మిగిలిపోతుంది.

విమానయానం చరిత్రలోనే బహుశా శాశ్వతంగా మిగిలిపోయే మిస్టరీ ఇదేనేమో!

Images Credit: to those who took the original photos.

****************************************************************************************

11, అక్టోబర్ 2019, శుక్రవారం

తొలివలపు (సీరియల్)...LAST PART-23



                                                తొలివలపు….(సీరియల్)
                                                             (PART-23)


విశాలంగా ఉన్నది రమేష్ గది. విజయవాడలో ఆ చిన్న గదిలో చూసినట్లే, ఈ గది కూడా గాయత్రి యొక్క చిన్న, పెద్ద ఫోటోలతో నిండిపోయుంది.

హృదయం భారమైంది గాయత్రికి. కళ్లు గట్టిగా మూసుకుంది.

"నువ్వు ఇంకా నిద్రపోలేదా గాయత్రీ?"

వెనుక నుండి మాటలు వినబడటంతో హడావిడి పడుతూ వెనక్కి తిరిగింది. గది ఎంట్రన్స్ లో రమేష్ నిలబడున్నాడు.

"సారీ...బయట కొంచం పనుంటే వెళ్లాను. సరే,నువ్వు పడుకో. నేను పక్క గదికి వెడతాను. ప్రొద్దున్నే కలుసుకుందాం 'గుడ్ నైట్' " అని చెప్పి కదిలాడు.

"ఒక్క నిమిషం, నేను మీ దగ్గర కొంచం మాట్లాడాలి" అంటూ అతని దగ్గరకు వచ్చింది గాయత్రీ.

"హు...చెప్పు. ఏం మాట్లాడాలి?" అన్నాడు.

"అదొచ్చి...నేను...హైదరాబాద్ కే పోదామనుకుంటున్నాను"

"మంచి నిర్ణయం. ఎప్పుడు వెల్తావో చెప్పు. నేనే తీసుకువెళ్ళి దింపుతాను. ఒంటరిగా వెళ్ళద్దు"

అతను అలా చెబుతాడని కొంచం కూడా ఎదురుచూడలేదు గాయత్రి. అయినా తన ఆశ్చర్యాన్ని కనిపించనివ్వకుండా మాట్లాడటం కంటిన్యూ చేసింది.

"మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చి ట్రబుల్ చేయకూడదు. అలా అని నాకు ప్రామిస్ చేసివ్వాలి"

"ఉ"

"తరువాత...దయచేసి ఇంకొక మంచి అమ్మాయిని చూసి మీరు పెళ్ళి చేసుకోవాలి"

"మీ ఆడ్వైజ్ కు థాంక్స్. కానీ, ఇంకో పెళ్ళి నాకు ఇష్టం లేదు. అంతేకాదు...ఇరవై సంవత్సరాలుగా మనం కలిసా కాపురం చేశాము? మిగితా జీవితాన్నీ నీ జ్ఞాపకముతో జీవించి వెళ్ళిపోతాను. నాకు అది చాలు"

"ప్లీజ్ రమేష్, నన్ను అర్ధం చేసుకోండి. ఏ విధంగానూ నేను నీకు మంచి భార్య అవను. మీ నీడను కూడా ముట్టుకునే అర్హత నాకు లేదు. నేను పవిత్రమైన దానిని కాదని తెలిసి కూడా..."

"చాలు గాయత్రి. ఇంకేమీ చెప్పకు. ఆరోజు నువ్వు పెదవులతో నీ సమ్మతం తెలిపినప్పుడే నాకు తెలుసు...నీ నిర్ణయం ఇలాగే ఉంటుందని.

స్నేహమో...ప్రేమో...బలవంతం చేసినందువలన రాదని నాకు తెలుసు. ఏది ఎలాగో...పెద్దవాళ్ళు ఆశపడినట్లే నువ్వు ఈ ఇంట్లోకి కొడలుగా కాలు మోపేవు. నాకు అది చాలు. ఇక కలిసి జీవించడం...జీవించకపోవడం మన ఇష్టం. నీ మనసులో ఏమనిపిస్తే అదేలాగా చెయ్యి" అన్నాడు ఎటో చూస్తూ.

"ఇది కోపంలో చెబుతున్న మాటలా?"

"ఛ...ఛ...నీ మీద కోపగించుకోవటానికి నేను ఎవర్ని?"

"ఎందుకు అలా మాట్లాడుతున్నారు?"

"మరి ఇంకెలా మాట్లాడమంటావు గాయత్రీ? నీ మొండితనంతో నువ్వు గెలిచావు. కానీ ఇరవై సంవత్సరాలుగా వైట్ చేసినా ఒక అమ్మాయి మనసును గెలువలేని చవటగా నేను ఓడిపోయి నిలబడున్నానే! ఒకే ఒక రోజు ఎవడో ఒకడు నీ శరీరాన్ని గాయపరిచాడనే ఒకే ఒక కారణం కొసం...ఇరవై సంవత్సరాలుగా నిన్నే తలుచుకుంటూ నువ్వే నా లొకం అనుకుంటూ జీవిస్తున్న నా మనసును గాయపరచి వెళ్ళిపోవటం ఏ విధంగా న్యాయం? కేవలం...శరీర సుఖమే ముఖ్యం అనుకోనుంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నీకోసం కాచుకోనుంటాను చెప్పు? నా మనసు నిండుగా నీ శ్వాసను మాత్రమే మోస్తూ ఉన్నవాడిని నేను. అలాంటి వాడి దగ్గర ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకోమని చెప్పటానికి నీకు మనసెలా వచ్చిందో చెప్పు?"

మనసును కదిలించిన అతని మాటలకు కంపించిపోయింది గాయత్రి.

"సరే...చివరిసారిగా అడుగుతున్నాను. నీ మనసులో నేను లేనని నా కళ్ళు చూసి చెప్పగలవా?"

ఆమె దగ్గరకు వెళ్ళి-నందిని కళ్ళలోకి చూసి అడిగాడు. అతని చూపులను చూసి తట్టుకోలేక తల వంచుకుంది ఆమె. ఎందుకనో, కన్నీటి వరద పొంగి పొర్లింది. అతని ముందు ఆ కన్నీటి వరద కనిపించకుండా ఉండాటానికి తడబడుతోంది.

"తెలుసు...నా గాయత్రి యొక్క మనసు అబద్దం చెప్పదు. నాకు ఇంకా నమ్మకం ఉంది" అంటూనే ఆమెకు మరింత చేరువ అయ్యాడు.

అతని శ్వాస...ఆమె నడి నెత్తిను ముట్టుకుంది.

ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది.

అతను కదలకుండా అలాగే నిలబడ్డాడు.

ఆమె ఏరలో చిక్కుకున్న పురుగులాగా వొంకర్లు పోయింది.

ఆ తరువాత కన్నీరు కారుతూంటే తలెత్తి అతని మొహంలోకి చూసింది.

వెంటనే తన రెండు చేతులతో ఆమె మొహాన్ని పుచ్చుకున్నాడు.

"నాకోసం ఇరవై సంవత్సరాలుగా..."

"పిచ్చిదానా...మొదట ఏడుపు ఆపు" అంటూ ఆమె కన్నీటిని తుడిచి" నువ్వు నా భార్యవి. నీకొసం నా చివరి శ్వాస ఉన్నంతువరకు కూడా కాచుకోనుంటాను. ఎందుకంటే ఐ.లవ్.యూ గాయత్రి" అంటూ మన్మధ మంత్రం ఊదాడు.

ఆ మాటతో గాయత్రి ఏడుపు ఎక్కువ అయ్యింది. గబుక్కున రమేష్ కాళ్ళ మీద పడింది.

"గాయత్రీ" అంటూ గాయత్రి రెండు భుజాలను పట్టుకుని పైకిలేపాడు.

అతని కౌగిలిలో ఒదిగిపోయింది గాయత్రి.

ఆరోజు శ్రీరాముని పాదాలు తగిలి శాప విమోచనం పొందింది ఆ అహల్య.

ఈ రోజు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న రమేష్ చేతులు తగిలి పవిత్రత పొందింది ఈ గాయత్రి.

***************************************   సమాప్తం ***************************************

P.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu.

ఈ సీరియల్ గురించి మీ ఒపీనియన్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.

9, అక్టోబర్ 2019, బుధవారం

తొలివలపు (సీరియల్)...PART-22



                                                  తొలివలపు….(సీరియల్)
                                                               (PART-22)


గాయత్రి కారును రమేష్ నడుపుతున్నాడు.

కళ్ళు మూసుకుని అతని పక్కన కూర్చోనున్న గాయత్రి, కారు ఆగిన ఊపుతో కళ్ళు తెరిచింది.

"దిగు గాయత్రీ" అన్నాడు.

కారు డోర్ తెరుచుకుని దిగిన గాయత్రి కదలకుండా అలాగే నిలబడింది. ఆమె కళ్ల ముందు అతిపెద్ద ఇళ్లు. కాదు కాదు...కొన్ని ఎకరాలను మింగిన అతిపెద్ద ప్యాలస్ అనే చెప్పాలి. ఆ ప్యాలస్ ముందున్న స్థలం పార్కు లాగా అమర్చబడింది. ఇరువైపులా ఏడెనిమిది కార్లు చిన్నవి, పెద్దవి పలు రంగులలో వరుసగా నిలబడున్నాయి.

వెనుకే వచ్చి నిలబడ్డ కారులోంచి దిగి, ప్యాలస్ లాంటి ఆ బంగళాను చూసి నోరు వెళ్లబెట్టి చూస్తూ నిలబడిపోయారు రాజేశ్వరి, బాలజీ, జానకీ, విశాలాక్షి అనే ఆ నలుగురు.

"రా గాయత్రీ, ఇదే మన ఇళ్లు" అంటూ గాయత్రి పక్కన వచ్చి నిలబడ్డాడు రమేష్.

'నా ఆస్తంతా రాసిస్తాను, నా చెల్లెల్ను పెళ్ళి చెసుకోండి'...అప్పుడు చెప్పింది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది గాయత్రికి. పలుకోట్లకు అధిపతి అయిన రమేష్, హైదరాబాదులో ఒంటరిగా ఒక చిన్న ఇంట్లో అద్దెకు...ఎందుకు? ఇదంతా దేనికోసం? భగవంతుడా!

దీనికంతా నేను అర్హత లేని దానినని ఎందుకు అతను అర్ధం చేసుకోవటానికి నిరాకరిస్తున్నాడు?'

అని గాయత్రి ఆలొచిస్తున్న సమయంలో.

"చిన్న యజమాని వచ్చేశారు, చిన్నమ్మ కూడా వచ్చేసింది"

ఎక్కడ్నుంచో వినబడ్డ కంఠధ్వని తరువాత పూర్తిగా తెరుచుకున్న తలుపుల వెనుక నుంచి ఒక పెద్ద గుంపు బయటకు వచ్చింది. రమేష్ ను కన్న తల్లి-తండ్రులు, తోడబుట్టిన వాళ్ళూ, వాళ్ళ పిల్లలూ అంటూ వచ్చి నిలబడ్డ వాళ్ళందరి మొహాలలోనూ సంతోషం ప్రవహించటం కనబడింది.

ఎందుకనో గాయత్రి మొహంలో మాత్రం ఆవగింజంత సంతోషం కూడా కనబడలేదు.

హారతి తీశారు. పూవులు జల్లి స్వాగతం పలికారు. కుడి కాలు మోపి లోపలకు రమ్మని, గాయత్రిని లోపలకు తీసుకువెళ్లారు. ఆమె చేత పూజ గదిలో దీపం వెలిగించారు. తాగమని పాలు ఇచ్చారు. ఆమె చుట్టుతా చేరి తమ అభిమానాన్ని పంచారు. తప్పని పరిస్తితిలో రాని నవ్వును తెచ్చుకుని వాళ్ళతో మాట్లాడింది గాయత్రి.

రమేష్ తల్లి గాయత్రి దగ్గరకు వచ్చి కూర్చుంది.

"ఎప్పుడో మా ఇంటికి రావలసిన మహాలక్ష్మివి. మేమే కొంత నిర్లక్ష్యంగా ఉండిపోయాము. ప్చ్...ఏం చేయ్యం? అంతా ఆ భగవంతుడు ఆడుతున్న ఆట. ఎలాగో నువ్వు మాకు తిరిగి దొరికావు...అది చాలు" అంటూ గాయత్రి బుగ్గలను ముద్దుపెట్టుకుంది.

"అచ్చు అసలు మీ అమ్మలాగానే ఉన్నావమ్మా" అన్నది.

'అమ్మ' అనే మాట చెవిన పడగానే గాయత్రి కళ్ళల్లో నీరు పొంగింది.

"మీ అమ్మ మొదటిసారి మా ఇంటికి వచ్చేటప్పుడు భయం భయంగా వచ్చింది. వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళింది. కానీ..."

"అమ్మా...ప్లీజ్" -- అడ్డుపడ్డాడు రమేష్.

"సారీ...పాత విషయాలను గుర్తు చేశానో?" అన్నది రమేష్ తల్లి.

పరవాలేదు అనేలాగా తల ఊపింది గాయత్రి.

అలా పరిచయ మాటలు ముగిసినై.

"నాతో రా గాయత్రి" అంటూ గాయత్రి ని తీసుకుని మధ్యలో ఉన్న హాలులో ఉంచబడ్డ పెద్ద ఫోటో దగ్గరకు తీసుకువెళ్లాడు రమేష్.

"ఈమే నా బామ్మ. మన పెళ్ళి జరగాలని ఆశపడినామె"

ఫోటోను చూపించి నమస్కారం చేసుకున్న రమేష్ తో కలిసి గాయత్రి కూడా ఆ ఫోటోకు నమస్కరించింది. హాలుకు అవతలవైపుకు తీసుకు వెళ్ళి అక్కడ గుడ్డతో మూసున్న తెరను 'రిమోట్ కంట్రోల్’ ఒకటి ఆమె చేతికి ఇచ్చి తెరవమన్నాడు. తెర తొలగి కళ్ళల్లో పడ్డ దృశ్యం గాయత్రిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

శకుంతలాదేవి, బాపిరాజు గారూ ఫోటోలో నవ్వుతూ ఉన్నారు.

తల్లి-తండ్రుల మొహాలు కనబడగానే భోరున ఏడ్చింది గాయత్రి. తన కళ్ళకు దేవతల్లా కనబడ్డ వాళ్ళకు చేతులెత్తి నమస్కరించింది జానకి. తరువాత తన సహోదరి దగ్గరకు వెళ్ళి ఆమె చేతులు పుచ్చుకుని కళ్లకద్దుకుంది. చెల్లెల్ను తనతో కలుపుకుని చేర్చుకుంది అక్కయ్య. కన్నవాళ్ళను తలచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న అక్కాచెల్లెల్లను మామూలు స్థితికి తేవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అక్కడున్న అందరూ.

రాత్రి డిన్నర్ ముగించుకుని తమకు కేటాయించిన గదులవైపుకు వెళ్లారు...గాయత్రి చెంతకు వచ్చింది రాజేశ్వరి.

"మీ అమ్మ నీకొసం సరైన జీవితం వెతికి పట్టుకుంది గాయత్రీ. రమేష్ కుటుంబం మొత్తం నీ మీద ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. రమేష్ లాంటి ఒకతను నీకు భర్తగా దొరకటానికి నువ్వు ఎంతో పుణ్యం చేసుకోనుండాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అమ్మ స్థానంలో నిలబడి నీ పెళ్ళి జరిపించే నేను ఊరికి వెలతాను"

"మ్యాడం, అదొచ్చి..."

"ఆపు గాయత్రీ, నాకు నిన్ను బాగా తెలుసు. నీ మనసూ తెలుసు. నీ సంకోచానికి కారణం కూడా తెలుసు. నీకు జరిగింది ఒక యాక్సిడెంట్ రా! ఇంకా నువ్వు దాని గురించే ఆలొచిస్తూ కూర్చుంటే ఎలా? రమేష్ ఒక సరాసరి మొగాడు కాదని అతన్ని చూసిన వెంటనే గ్రహించాను. నీ గురించిన వివరాలన్నీ చెప్పి, 'గాయత్రి నీకు దొరకదు, తిరిగి వెళ్ళిపో' అని చెప్పినందుకు అతను ఏం చెప్పాడో తెలుసా? నిశ్శ్చయతార్ధం అనే పేరుతో ఏరోజైతే మా ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడిందో...ఆ నిమిషం నుంచే నేను, గాయత్రి భార్యా-భర్తలుగా ఈ లోకానికి పరిచయమైపోయాము. అలా చూస్తే జరిగిన ఆ యాక్సిడెంట్లో నా భార్యను కాపాడలేని దౌర్భాగ్యుడ్ని నేను అని చెప్పుకుంటూ ఏడ్చాడు. నువ్వు అదృష్టవంతురాలివి గాయత్రి. ఈ కాలంలో ఇలాంటి ఒక భర్త ఏ అమ్మాయికి దొరుకుతాడు? దయచేసి నేను చెప్పేది విను. పాత విషయాలన్నీ ఎత్తి చెత్తలో పడేయ్. రమేష్ తో కొత్త జీవితం మొదలుపెట్టు.

ఇది మీ అమ్మగారు నీకోసం ఏర్పాటు చేసి ఇచ్చింది. అది ఎందుకు నువ్వు అర్ధం చేసుకోవు? రమేష్ ను ఒప్పుకో. పోగొట్టుకున్న సంతోషం, ప్రశాంతత అన్నీ అతని ద్వారానే తిరిగి దొరుకుతాయ్. నీ మీదే తన ప్రాణం పెట్టుకున్నాడు. అంతే కాదు...నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించటానికి మీ అమ్మ-నాన్నల గుర్తుగా, వాళ్ళ పేరు మీద ఈ ఊర్లో ఆసుపత్రి కట్టించాడు. నీ చేతులతో దాన్ని తెరిపించాలని కాచుకోనున్నాడు.

ఇంకొక విషయం చెబుతున్నాను....విను. జానకికి వరుడ్ని చూశాము. ఆ వరుడు ఇంకెవరో కాదు. మన బాలజీనే. ఒకే వేదిక మీద రెండు పెళ్ళిల్లు పెట్టుకుందామని మేమంతా కలిసి నిర్ణయించుకున్నాము. ఇదంతా రమేష్ ఏర్పాటే. నీకున్న బాధ్యతల్లో తనకూ భాగం ఉన్నదని అతను మనకు చెప్పకుండా చెబుతున్నాడు. దీని తరువాత కూడ అతన్ని అర్ధం చేసుకోలేదనుకో...ఆ తరువాత నీ ఇష్టం" అని చెప్పటం ముగించింది రాజేశ్వరి.

"మ్యాడం చెప్పేది కరక్టే" అంటూ అక్కడికి వచ్చింది జానకి. ఆమెతో పాటూ బాలాజీ కూడా వచ్చాడు.

"మీకు చెప్పేటంత అర్హత మాకు లేదు. కాని ఒకటి మాత్రం నిశ్చయం. మీరు రమేష్ బావను చేసుకోనని చెప్పినా అది ఆయన్ను పెద్దగా బాధ పెట్టదు. ఎందుకంటే, మనసారా ఆయన మీతో కాపురం చేస్తున్నారు. సమస్య ఆయన గురించి కాదు. నేను సంతోషంగా జీవించాలని మీరు ఆశపడుతున్నట్టు మీ జీవితమూ సంతోషంగా ఉండాలని మేము ఎదురుచూడకూడదా? 'మన అమ్మాయి ఈ ఇంట్లోనే జీవిస్తుందనే కలతో చచ్చిపోయిందే మీ అమ్మ...ఆమె నమ్మకంలో మట్టి పోయదలుచుకున్నారా? చెప్పండక్కా. ఏందుకని ఏమీ మాట్లాడనంటున్నారు? జవాబు చెప్పండి"

"వదిలేయ్ జానకీ, గాయత్రి మనకు మంచి శుభవార్తే చెబుతుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. రండి మనం వెలదాం" అని ఇద్దర్నీ పిలుచుకుని అక్కడ్నుంచి కదిలింది రాజేశ్వరి.

ఆలొచనతో సొఫాలోకి ఒరిగింది గాయత్రి.

ఇంకా ఉంది.....Continued in: Last PART-23

P.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu (బుక్ మార్క్ చేసుకోండి)

7, అక్టోబర్ 2019, సోమవారం

తొలివలపు (సీరియల్)...PART-21



                                            తొలివలపు….(సీరియల్)
                                                         (PART-21)

"సారీ గాయత్రీ. అది నా దురదృష్టం అనే చెప్పాలి. ఒక కేసు విషయంగా రాజమండ్రి వెళ్ళినప్పుడు...మీ నాన్న యొక్క కేసు ఫైలు అనుకోకుండా నా కళ్ళల్లో పడ్డది. విచారణ చేసినప్పుడు...తెల్లారితే ఆయనకు ఉరి శిక్ష అమలు. నేరుగా వెళ్ళి ఆయన్ని కలిసి వివరాలు చెప్పాను. నా చేతులు పుచ్చుకుని ఏడ్చారు. దయా బిక్ష పెట్టమని అర్జీ పెడదామని చెప్పాను. వద్దని చెప్పేశారు.

కానీ ఎందుకో తెలియదు. మిమ్మల్ని గురించి అన్ని వివరాలూ చెప్పిన ఆయన జానకి గురించి ఒక మాట కూడా చెప్పలేదు. మీ గురించే ఎక్కువ బాధపడ్డారు. 'ఈ ఉరి శిక్ష...నా భార్యకు నేను చేసిన ద్రోహానికి పరిహారం. దీన్ని సంతోషంగా అంగీకరిస్తున్నాను. నా బాధ అంతా నా కూతురు గాయత్రి గురించే. అది ఎక్కడుంది... ఏం చేస్తోంది అనేది తెలుసుకోలేని పాపిని అయ్యాను’ అని చెప్పి ఏడ్చారు.

నా నా భార్య శకుంతల తీసుకున్న నిర్ణయం సరిగ్గానే ఉంటుంది. గాయత్రి మీకొసమే పుట్టింది. మీ ఇంటి కోడలు...కచ్చితంగా మీకొసమే కాచుకోనుంటుంది. ఆమెను వెతికి పట్టుకునే బాధ్యతను మీ దగ్గర అప్పజెప్పి వెడుతున్నాను. దేవుడు మనిద్దరినీ కలుసుకునేటట్టు చేసినట్లే, మీ ఇద్దర్నీ కూడా కచ్చితంగా ఏదో ఒకరోజు కలుసుకునేటట్టు చేస్తాడని చెప్పారు.

ఒక కొడుకుగా ఉండి మీ నాన్నకు చేయాల్సిన చివరి కార్యాలన్నీ ముగించిన తరువాత, అస్తికలు తీసుకు వెళ్ళి గొదావరి నదిలో కలిపి...పరిపూర్ణ మనసుతో మిమ్మల్ని వెతకటం మొదలు పెట్టాను"

చివరిగా అతను చెప్పింది విని సోఫాలో జారి పడిన గాయత్రి "నాన్నా" అంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఆమె బాగా ఏడ్చి ముగించని అని మౌనంగా నిలబడున్న రమేష్, కొంతసేపు అయిన తరువాత ఆమె పక్కన కూర్చుని ఆమె తల నిమురుతూ ఆమెను ఓదార్చాడు. ఆ సమయంలో అతని ఓదార్పును అంగీకరించిన దానికి మల్లే తనని తాను మరిచిపోయి అతని భుజం మీద వాలిపోయి మళ్ళీ ఏడవటం మొదలుపెట్టింది గాయత్రి.

"రమేష్, నేను చేసిన తప్పుకు మా నాన్న"

"ఏడవుకు గాయత్రీ. నీ భవిష్యత్తు గురించి ఆలొచించే, తప్పును తన మీద వేసుకుని ఉండుంటారు. కన్న కూతూర్ను కాపాడే బాధ్యత ఆయనకు ఉండటం న్యాయమే కదా? వదిలేయ్. నీకు నేను ఉన్నాను. ఇకమీదట అన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను గాయత్రి "

అతని మాటలు చెవులలో నుండి వెళ్ళి లోపల ఉన్న భావాలను ముట్టుకున్న సమయం ఆమె మామూలు స్థితికి వచ్చింది. వెంటనే రమేష్ కు దూరంగా జరిగి లేచి నిలబడింది.

"ప్లీజ్ రమేష్...నా మనసును మార్చటానికి ప్రయత్నించకండి. కొంచం కొంచంగా నన్ను బలహీనం చేయకండి. దయచేసి ఇలాగే వదిలేయండి. ఇక్కడ్నుంచి వెళ్ళిపొండి" - చేతులతో మొహాన్ని దాచుకుని ఏడుస్తున్న గాయత్రికి దగ్గరగా వచ్చాడు రమేష్.

"నీ తడబాటుకు కారణం ఏమిటో నాకు బాగా తెలుసు గాయత్రీ. అదే సమయం, ఇక నీ ఇష్టం లేకుండా నీ నీడను కూడా తాకను. గుడ్ బై" అని చెప్పి అతను బయలుదేరబోతుంటే.

"నేను లోపలకు రావచ్చా?" అనే మాట వినబడటంతో ముగ్గురూ ఒక్కసారిగా తిరిగి చూశారు. జానకి నిలబడుంది. ఆమె పక్కనే నిలబడుంది పద్మా నర్స్.

'భగవంతుడా...ఈమె ఎలా ఇక్కడకు వచ్చింది?' అనే ఆందోళనతో గాయత్రి జానకికి ఎదురుగా వెళ్ళింది. కానీ జానకి తిన్నగా వెళ్ళి రమేష్ కాళ్ళ మీద పడింది.

"నన్ను క్షమించండి...మీరు ఎవరని తెలియక"

"హాయ్ జానకీ...ఇదేమిటి? లే మొదట"

"ఊహూ. మొదట నన్ను క్షమించాను అని చెప్పండి"

"సరే...సరే...క్షమించాను. చాలా?"

"ధ్యాంక్స్ బావా"-- అన్నది జానకి. లేచి నిలబడి.

"ఏమిటి...బావ అంటున్నావు?"

"అవును...అక్క భర్తను అలాగే పిలుస్తారు కదా...?"

ఆమె మాటలతో నివ్వరపోయి నిలబడ్డారు రమేష్, బాలాజీ ఇద్దరూ. గాయత్రియో ఆశ్చర్య శిఖరం అంచులకే వెళ్ళిపోయింది.

"మీరు నాకొక సహాయం చేయాలి" బాలాజీ దగ్గరగా వెళ్ళి అడిగింది జానకి.

"చెప్పండి జానకీ" అన్నాడు బాలాజి.

"ఇంకో అరగంటలో రాజేశ్వరి మ్యాడమ్, మా అమ్మా ఇద్దరూ ఇక్కడ ఉండాలి"

"అర్ధమైయ్యింది" అని చెప్పి బయలుదేరి వెళ్లాడు బాలాజి.

ఆ తరువాతే, గాయత్రిని చూస్తూ ఆమె దగ్గరకు వెళ్ళి నిలబడింది జానకి.

"జానకీ...నేను..." అంటూ గాయత్రి ఏదో చెప్పబోతుంటే, గబుక్కున చేయి పైకెత్తి మాట్లాడవద్దని గాయత్రికి సైగ చేసింది.

"నేను ఎవరు అనే విషయం నాకు తెలిసిపోయింది. జరిగిపోయిన దానిని గురించి మళ్ళీ మాట్లాడి, ఏడ్చి, పెడబొబ్బులు పెట్టి 'సీను క్రియేట్' చేద్దామని నేను ఇక్కడకు రాలేదు. తిన్నగా విషయానికే వస్తా. మీ చెల్లెలు మీతో ఉండాలని మీకు ఆశగా ఉందా...లేదా?"

"ఏంటమ్మా ఈ ప్రశ్న? నువ్వెవరో తెలిసిన ఆ నిమిషం నుండి అలాంటి ఒక భాగ్యం నాకు దొరకదా అని ఎంత ఆశపడుతున్నానో తెలుసా?"

"అయితే సరి. మీకు నేను కావాలని ఆశపడితే...రమెష్ ను మీరు పెళ్ళిచేసుకోవటానికి అంగీకరించాలి"

"ఇష్టం వచ్చినట్లు వాగకు జానకి" కోపంగా అరిచింది గాయత్రి.

"క్షమించాలి మ్యాడమ్. మీరు సరే నని చెబితే....మిగతా విషయాలు మాట్లాడదాం. లేదంటే...నన్ను వదిలేయండి. మీ కంటికి కనబడనంత దూరం వెళ్ళిపోతాను. ఇది తప్ప నాకు ఇంకో దారి తెలియటం లేదు"--చెప్పి వెనక్కి తిరిగింది.

"ఆగు జానకీ. నన్ను వదిలి వెళ్ళిపోకు. మళ్ళీ నిన్ను పోగొట్టుకుని బ్రతికే శక్తి నాకు లేదు"

తన ముందుకు వచ్చి నిలబడి, తన చేతులు పుచ్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న గాయత్రిని చూసి జానకి కళ్ళు కన్నీటితో నిండింది. ఆ కన్నీరు కనబడకుండా తల పక్కకు తిప్పుకుని, "అప్పుడు సరేనని చెప్పండి"

"నువ్వైనా అర్ధం చేసుకో జానకీ. ఈ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఎవరూ బలవంతం చేయకండి. ప్లీజ్...అది మాత్రం నావల్ల కాదు"

"గాయత్రి చెప్పటం కూడా కరక్టే జానకీ. ఆమెను బలవంత పెట్టే మేము ఒకటవ్వాలంటే, అలా మేమిద్దరం ఒకటవ్వటం నాకు ఇష్టం లేదు. ఆలాంటి పెళ్ళి నాకు అవసరం లేదు. గాయత్రి ఇష్టానికే ఆమెను వదిలేద్దాం" అన్నాడు మధ్యలో అడ్డుపలికిన రమేష్.

"అంటే నిర్ణయంతీసుకునే అధికారం వాళ్ళవాళ్ళ చేతుల్లోనే కదా ఉంది...? అయితే ఇక ఇక్కడ నాకు ఏం పనుంది? గుడ్ బై మ్యాడమ్..." -- అని చెప్పి గుమ్మం వైపు అడుగులు వేసింది జానకీ.

"ఆగు జానకీ. నేను చెప్పేది కొంచం విను. నన్ను వదిలి వెళ్ళిపోకు. రమేష్, జానకిని వెళ్ళొద్దని చెప్పండి. నాకు జానకి కావలి. నా జీవితాంతం జానకి నాతోనే ఉండాలి. మీరైనా చెప్పండి రమేష్. కావాలంటే ఆమె ఇష్టపడినట్టే మిమ్మల్ని పెళ్ళి చేసుకోవటానికి వొప్పుకుంటున్నాను. దయచేసి ఆమెను నన్ను వదిలి వెళ్ళొద్దని మాత్రం చెప్పండి. ప్లీజ్..."--అంటూ ఏడుస్తూ నేల మీద కూర్చుండిపోయింది గాయత్రి.

విజయం సాధించిన సంతోషం జానకి మొహంలో కనబడింది. వెంటనే పరిగెత్తుకు వచ్చి గాయత్రి ముందు కూర్చుంది.

"మీ మనసును గాయపరిచినందుకు దయచేసి నన్ను క్షమించండి. పెళ్ళికి మీరు వొప్పుకోవాలనే అలా బిహేవ్ చేశాను. నాకు వేరే దారి తోచలేదు. మీ ముందు నిలబడే తాహతో, అర్హతో నాకు కొంచం కూడా లేదు" అంటూ గాయత్రిని చూసి చేతులెత్తి నమస్కరించింది.

"ఏం మాట్లాడుతున్నావు జానకీ...? నువ్వు నా ప్రాణం. ఇంకోసారి ఇలా మాట్లాడకు. నిజం చెప్పాలంటే నేనే నీ దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకంటే మీ అమ్మను నీ నుండి..."

"వద్దు...ఆ మోసగత్తెను నా అమ్మ అని చెప్పకండి. నేను శకుంతలాదేవి అమ్మగారి కడుపున పుట్టకపోయినా...ఆవిడే నా తల్లి. మీరే నా తోడ బుట్టిన అక్కయ్య. నేను మిమ్మల్ని 'అక్కా' అని పిలవచ్చు కదా? నాకు ఆ హక్కు ఇస్తారు కదా?"

జాలితో తన మొహం వైపి చూసి అడిగిన జానకిని ప్రేమగా చూసింది గాయత్రి.

"ఏమిట్రా అలా అడుగుతున్నావు? నీ నోటితో నన్ను 'అక్కా' అని ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను. రావే తల్లీ" అంటూ కన్నీటితో రెండు చేతులూ జాపింది

"అక్కా..." అంటూ పిలుస్తూ బిడ్డ తల్లిని కౌగలించుకున్నట్లు జానకి గాయత్రిని తన కౌగిలిలో బంధించింది.

అక్కా-చెల్లెల్ల ప్రేమ వర్షంలో మునిగిపోయిన ఇద్దర్నీ చూస్తూ నిలబడిపోయాడు రమేష్.

ఇంకా ఉంది.....Continued in: PART-22

P.S: ఈ బ్లాగు అప్ డేట్స్ మరియు కొత్త పోస్టుల కోసం నా ట్విట్టర్ పేజీ చూడండి: https://twitter.com/NsaTelugu (బుక్ మార్క్ చేసుకోండి).

5, అక్టోబర్ 2019, శనివారం

తొలివలపు (సీరియల్)...PART-20



                                                తొలివలపు….(సీరియల్)
                                                             (PART-20)

చేదైన తన పాత జీవితం గురించి గాయత్రి చెప్పి ముగించినప్పుడు అది వింటున్న హృదయాలన్నీ శోక మయం అయినై.

తన ఆవేదనలో నుండి బయటపడలేక తల వంచుకుని కూర్చోనున్న ఆమె దగ్గరకు చేరుకుని ఓదార్పుగా ఆమె భుజం మీద చెయ్యివేశాడు రమేష్.

ఆ స్పర్శ గ్రహించి గబుక్కున తలపైకెత్తింది. చటుక్కున ఆ చేతిని తోసి పారేసింది. కోపంతో లేచి అతని మొహంలోకి చూసి అతని మొహానికి ఎదురుగా వేలు జాపి హెచ్చరిస్తున్నట్టు చెప్పింది.

"మిస్టర్ రమేష్. మీరు జాలి పడాలని ఎదురుచూసి నేను ఇవన్నీ చెప్పలేదు. ఒకవేల నా గురించిన నిజాలు మీకు తెలిస్తే, నా దారికి మీరు అడ్డు రారనే నమ్మకంతోనూ, ఇకనైనా జానకి మీ మీద పెట్టుకున్న ప్రేమను మీరు అర్ధం చేసుకుని ఆమె ప్రేమను అంగీకరిస్తారనే నమ్మకంతో నా గురించి అంతా చెప్పాను"

బయట నిలబడి గాయత్రి చెప్పిందంతా విన్న జానకి ఏడుస్తూ, తూలి పడబోతూ గోడకు అతుక్కుపోయింది.

లోపల గాయత్రి మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది.

"మీకు ఒకటి తెలుసా రమేష్? జానకి ఎవరనేది వాళ్ళింటికి నేను వెళ్ళినప్పుడే నాకూ తెలిసింది. అమే నా చెల్లెలు అని తెలిసినప్పుడు అలాగే ఆమెను కౌగలించుకోవాలని అనిపించింది. ఈ ప్రపంచానికే వినబడేటట్టు...నేను అనాధను కాను అని గట్టిగా అరవాలనిపించింది. దాన్ని మా ఇంటికి పిలుచుకు వచ్చి నాతో పాటూ ఉంచుకుందామని అనుకున్నాను.

కానీ...ఏం చెప్పి నేను నన్ను జానకి దగ్గర పరిచయం చేసుకోను? చెప్పండి? ఇదిగో ఇదే చేతులతో ఆమె తల్లిని చంపాను. ఆమె తల్లి యొక్క పేగు బంధం అనుబంధాన్ని తెంపి ఆమెను అనాధను చేసిన పాపిని నేను. ఇవన్నీ జానకికి తెలిస్తే ఆమె నన్ను ఎలా క్షమిస్తుంది? వద్దు రమేష్. నేను ఎవరనే నిజం ఎప్పటికీ ఆమెకు తెలియకూడదు. ఎందుకంటే ఆమెను మరొసారి పోగొట్టుకొటానికి నేను రెడిగా లేను. నాకు ఆమె కావాలి. ఈ ప్రపంచంలో నాకు సొంతం అని చెప్పుకోవటానికి ఆమె ఒకత్తైనా కావాలి.

జానకిని పెళ్ళి చేసుకోమని నేను మిమ్మల్ని ఒత్తిడి చేయటానికి కారణం ఉంది. మీ గురించి నాకు ఏమీ తెలియదు. కానీ, మీరు మంచివారని మాత్రం నాకు కచ్చితంగా తెలుసు. నా చెల్లెల్ను సంతోషంగా చూసుకుంటారని అర్ధమవుతోంది. ఇది మాత్రమే కాదు...అది ఎవరినో పెళ్ళిచేసుకుని...ఎక్కడికో వెళ్ళటం కంటే...ఆమె ప్రేమిస్తున్న మిమ్మల్నే పెళ్ళిచేసుకుంటే, దూరం నుండైనా ఆమెను రోజూ చూస్తూ రోజులు గడుపుతూ ఉండిపోతాను.

నా ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను. జానకి మెడలొ మీరు తాళి కడితే చాలు. ఆమె మీ మీద, నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. ప్లీజ్...నన్ను అర్ధం చేసుకోండి. నా చెల్లెల్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పండి"

చెల్లెలు కోసం తన దగ్గర బ్రతిమిలాడిన గాయత్రి దగ్గర నుండి దూరంగా జరిగి గాయత్రిని చూసి విరక్తిగా నవ్వాడు రమేష్.

"గాయత్రీ, నువ్వు ఎంత పెద్ద మేధావివో అంత పెద్ద తెలివితక్కువ దానివి కూడా!"- అన్న రమేష్ ని ఆశ్చర్యంతో చూసింది గాయత్రీ.

"లేకపోతే ఏమిటి...? ఇంతకు ముందే పెళ్ళైన ఒకడికి మీ చెల్లెల్ను ఇచ్చి పెళ్ళిచేస్తానని ఇలా మొండికేస్తున్నారే! దీన్ని తెలివితక్కువ తనం అని చెప్పకుండా ఇంకేమని చెప్పాలి? నువ్వు నన్ను చూడటానికి నా గదికి వచ్చినప్పుడే నా భార్యను నీకు పరిచయం చేసానే...మరిచిపోయావా గాయత్రీ?"

"నేను ఇంత దూరం చెబుతున్నా నువ్వు నా మాట వినటం లేదు కదూ...అయితే సరే. నేను ప్రాణాలతో ఉంటేకదా సమస్య! ఇప్పుడే దీనికి ఒక ముగింపు పెడతాను" అంటూ జరిగింది గాయత్రి.

గాయత్రి అన్న చివరి మాటకు ఆందోళన చెందిన జానకి లోపలకు వెళ్ళడానికి ప్రయత్నించేటప్పుడు రమేష్ నోటి నుండి వచ్చిన మాటలు విని అలాగే నిలబడిపోయింది. అక్కడే ఉన్న బాలాజీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు.

"ఒక్క నిమిషం గాయత్రీ. జీవితంలో మనం ఒకటిగా చేరలేకపోతే ఏం...చావు మనల్ని చేర్చనీ! రా... ఇద్దరం కలిసే చచ్చిపోదాం" అన్నాడు ఆమె దగ్గరకు జరిగి.

గబుక్కున అతని చొక్కా కాలర్ పుచ్చుకుంది గాయత్రి.

"ఎవరురా నువ్వు? నిజం చెప్పు. ఎందుకు నన్ను వెంబడిస్తూ వచ్చి ఇలా గొడవ పెడుతున్నావు? నీకూ, నాకూ సంబంధమే లేనప్పుడు చావు గురించి మాట్లాడుతున్నావు... నీ మూర్ఖత్వానికి హద్దే లేకుండా పోయింది "

"నీకూ, నాకూ సంబంధం ఉంది గాయత్రీ" అన్నాడు, ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ.

తన పట్టుదలని సడలించుకుని వేనక్కు జరిగి అతన్ని అర్ధంకానట్లు చూసింది గాయత్రి.

"దేవుడు మన ఇద్దరికీ భార్యా-భర్త అనే ముడివేసి ఇరవై సంవత్సరాలు ముగిసిపోయింది. మన ఇంటి పెద్దలు కలుసుకుని, మాట్లాడుకుని, నిర్ణయించుకుని మన ఇద్దరికీ ఇలాంటి బంధుత్వాన్ని ఏర్పరచి వెళ్ళింది నువ్వు మరిచిపోయుండవని అనుకుంటాను"

'కొవ్వు ఏక్కిన కుక్కా! ఇద్దరూ కలిసి పారిపోదామని పధకం వేస్తున్నారా? నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అలా జరగనివ్వనే. నీకొసం నేను నిశ్చయం చేసిన పెళ్ళికొడుకుకే నువ్వు తల వంచాలి. కాదు- కూడదూ అంటూ ఇంకేదైనా జరిగితే...?'తల్లి శకుంతలాదేవి మాటలు గుర్తుకువచ్చి,'అలాగైతే ఇతను?'...కళ్ళు గట్టిగా మూసుకుంది గాయత్రి.

ఆమె ఆలొచనలను చెదరగొట్టే విధంగా తన మాటలను పొడిగించాడు రమేష్.

"మొదట్లో మన పెళ్ళి నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను కాలేజీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నా భవిష్యత్తు గురించో, నా సొంత ఇష్టాల గురించో ఆలొచించని నా కుటుంబం అంటే నాకు కోపం వచ్చింది. 'కొన్ని రోజులలో చావబోయే బామ్మకొసం నా కలలను గొయ్యి తవ్వి పూడ్చిపెట్టకండి’ అని ఎంతో చెప్పి చూశాను. ఊహూ...చివరకు బామ్మ మొండితనమే గెలిచింది. మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నిశ్చయతార్దం ముగించుకుని వెళ్ళిన మీ అమ్మ మీద కోపం వచ్చింది.

ఆ తరువాత, మన ఇద్దరికీ జరగబోయే పెళ్ళిని ఎలా ఆపాలా అని నేను ఆలొచిస్తున్నప్పుడు, మీ అమ్మగారు చనిపోయారనే వార్త 'బ్రోకర్’ ద్వారా మాకు తెలిసింది. నిశ్చయతార్దం ముగిసిన వెంటనే ఇలాంటి శోకం చోటుచేసుకుందే, అనే బాధతో...అదే వారంలో మా బామ్మ కూడా చనిపోయింది.

జరిగిన సంఘటనలకు ఒక వైపు బాధపడుతున్నా, ఇంకో వైపు పెద్ద ఇబ్బంది నుండి తప్పించుకున్నాను అని సంతోష పడ్డాను. పెళ్ళి గురించిన విషయాలు మాట్లాడటానికి మీ ఇంటి నుండి ఎవరూ రాకపోవటంతో నేను ప్రశాంతంగా ఉన్నాను.

చదువు ముగించాను. నేను ఆశ పడినట్లే పోలీసు అధికారి అయ్యాను. మా ఇంట్లో నాకు మళ్ళీ పెళ్ళి ఏర్పాట్లు మొదలు పెట్టారు. కానీ, నాకు దాంట్లో పెద్దగా ఇష్టం లేదు. కారణం ఇదే" అంటూ తన పర్స్ లోని ఒక ఫోటోను తీసి గాయత్రి ముందు జాపాడు.

ఆ ఫోటో తీసుకుని చూసి ఆశ్చర్యపోయింది. రెండు జడలతో, లంగా వోణి తో, నవ్వుతూ ఉన్నది చిన్న వయసు గాయత్రి. మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు రమేష్.

"ఎందుకో తెలియలేదు గాయత్రీ...మా ఇంట్లో నా పెళ్ళి మాటలు ఎత్తినప్పుడు నాకు నిన్నే చూడాలని అనిపించింది. మీ గురించి తెలుసుకుందామని మీ ఊరు వెళ్ళాను. మీ నాన్నను పోలీసులు ఖైదు చేసి తీసుకు వెళ్ళేరని చెప్పేరే గానీ నీ గురించి ఎవరి దగ్గరా సరైన వివరం దొరకలేదు. ఏదో పోగొట్టుకుని తిరిగి వచ్చినట్లు అనిపించింది. నాకు ఒక విషయం మాత్రం అర్ధం కాలేదు. పెళ్ళి వద్దని చెప్పిన నేను, నీ ఫోటోను మాత్రం ఎందుకు బద్రపరుచుకున్నాను? ఎంతో మంది ఆడపిల్లలు నన్ను చేసుకోవాలని ముందుకు వస్తున్నా వాళ్ళల్లో ఎవరూ ఎందుకు నాకు నచ్చ లేదు. నా భార్య అనే చోట్లో మిమ్మల్ని తప్ప ఎవర్నీ ఊహించుకోలేక పోయాను...ఎందుకో? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు? నీకు పెళ్ళి అయ్యిందా? బ్రతికే వున్నావా?...అలా మీ గురించి ఏమీ తెలియకపోయినా ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో మిమ్మల్ని వెతకటం నేను మొదలు పెట్టేను?

ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం తెలియదు గాయత్రి. కానీ, ఒకటి మాత్రం కచ్చితంగా తెలుసు. నాకు నువ్వే, నీకు నేనే అని ఆ దేవుడు వేసిన మూడు ముళ్లనూ ఎవరూ విడదీయలేరు. మనం ఒకటిగా చేరటమనేదే విధి. లేకపోతే, నాకు పెళ్ళి చేసి చూడాలని ఎందుకు నా బామ్మకు అనిపించింది? మా ఇళ్లు వెతుక్కుని మీ అమ్మ ఎందుకు వచ్చింది? చెప్పండి.

ప్లీజ్...గాయత్రీ! నన్ను అర్ధం చేసుకోండి. మనం ఒకర్ని ఒకరు చూసుకున్న తరువాత కూడా ఒకటవలేదంటే మీ అమ్మగారి కొరిక మాత్రమే కాదు...మీ నాన్నకు నేను చేసిచ్చిన ప్రామిస్ కు కూడా అర్ధం లేకుండా పోతుంది"

"ఏ..ఏం...చెప్పారు? మా నాన్నను చూశారా? ఎక్కడ చూశారు... ఎప్పుడు చూశారు? చెప్పండి రమేష్" ఆదుర్దాగానూ, సంతోషంగానూ అడిగింది గాయత్రి.

ఇంకా ఉంది.....Continued in: PART-21