30, ఏప్రిల్ 2021, శుక్రవారం

మానవత్వం...(సీరియల్/నవల)...PART-8

 

                                                                                మానవత్వం                                                                                                                                                            (సీరియల్/నవల)

                                                                                    PART-8

   గర్భ సంచీలో మోసి కనలేకపోయినా చివరి వరకు నా హృదయ గూటిలో మోస్తాను నేను కనని  బంధాన్ని.

పాత జ్ఞాపకాల నుండి బయట పడిన యామిని, తన వొళ్ళో ఉన్న ఫోటోను ఆశగా తడిమి చూసుకుంది. కాన్వొకేషను శభలో కోటుతోనూ, తలమీద టోపీతోనూ, మెడలో వేయబడ్డ గోల్డ్ మెడల్ తోనూ గంభీరంగా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుంటూ నవ్వుతున్నది జయ.

ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనే ముఖం. నమ్మకం, మనోధైర్యం గల...మెరుపులాంటి కళ్ళు, ప్రపంచాన్ని పాలించే మహిళలాంటి ఒక ధోరణి. నిలబడున్న దోరణిలో ఒక గంభీరం. కళ్ళార్పకుండా చూసి ఆనందపడింది యామిని. ఆమె మనసు పూర్తిగా ఆనందంతో నిండిపోయింది.

కూతుర్ను చూసి గర్వపడింది. తరువాత ఏం చదువుదాం? అని ఆలొచిస్తున్న సమయంలో పలు కళాశాలల నుండి ఆఫర్లు రావడంతో, వాటన్నిటినీ పక్కన పెట్టి, ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజీలో చేరింది.

" "ఏరా....పై చదువు ఏం చదువుదామను కుంటున్నావు....లా చదువుతావా? సైకాలజీ చదువుతావా? సోషియాలజీ జదువుతావా లేక ఎం.బి. చదువుతావా? “

లేదమ్మా...నేను టీచర్ కావాలి. అందులోనూ స్పెషల్ చిల్డ్రన్స్ కి" అన్నప్పుడు కన్ ఫ్యూజ్ అయ్యింది యామిని.

"నువ్వేం చెబుతున్నావో నాకు అర్ధం కావటం లేదు"

మాట్లాడుతున్నప్పుడే గొంతు అడ్డు పడింది లోపు ఎవరిదో పిలుపు.

"యామిని అక్కా?"

"హాయ్ రమా...రా.రా. రండి సార్...లోపలకు రండి. ఎలా ఉన్నారు?"

"బాగున్నాం. మీరెలా ఉన్నారు...నేను పని ముగించుకుని వస్తాను"--చెప్పి ఆయన వెనుతిరిగాడు.

మెల్లగా రండి. మేము చాలా మాట్లాడుకోవాలి. చూసి ఎన్ని సంవత్సరాలయ్యిందో...కదక్కా?"

"అవును! అందుకని వచ్చినాయన్ని కూర్చోమని కూడా చెప్పకుండా పంపించేయనా? లోపలకు రండి సార్. కాఫీ తాగి వెళ్ళచ్చు"

"లేదండీ...ఆఫీసు పని మీద వచ్చాను. మిమ్మల్ని చూడాలని తను మొండికేసింది. అందుకే తీసుకు వచ్చాను. నేను వెళ్ళి వచ్చేస్తాను"--అని చెప్పి సెలవుతీసుకుని కార్లోకి ఎక్కాడు.

రమా చేతులు పుచ్చుకుని లోపలకు వచ్చింది యామిని.

"ఏయ్ రమా...నీకు ముగ్గురు పిల్లలా?” అంటూ పిల్లలనురండిరా"--అంటూ పిల్లలందరినీ కలుపుకుని కౌగలించుకుంది.

 

అవునక్కా...ఇద్దరమ్మాయలూ, ఒక అబ్బాయి"

"వెరీ గుడ్! నువ్వు కూర్చో. తినడానికి ఏదైనా తీసుకు వస్తాను"--అంటూ లోపలకు వెళ్ళి బిస్కెట్లు, పండ్లు తీసుకువచ్చి ఇచ్చింది. వాటిని తీసుకుని తింటూ ఆటల్లోకి వెళ్ళారు. రమ వాకిటి తలుపులు మూసింది.

రాహుల్, ప్రీతీ...గోల, గోడవ చేయకుండా కూర్చుని ఆడుకోవాలి.ఏదీ విరకొట్టకూడదు"

"సరేనమ్మా..."

"ఆక్కా! మీరు రండి...అలా కూర్చుని మాట్లాడుకుందాం"

ఉండు...నీకు కాఫీ తీసుకు వస్తాను"

"అదంతా తరువాత చూసుకుందాం. ముందు కూర్చొ అక్కా. జయ ఎలా ఉంది? బాగా ఎత్తు పెరిగుంటుందే? చూడటానికి ఎలా...మీలాగా అందంగా ఉంటుందా?"

"ఇదిగో...ఇది చూడు!"--అని అంతకు ముందు వరకు చేతిలో ఉంచుకున్న ఫోటోను రమకు అందించింది యామిని.

ఫోటో చూసి ఆశ్చర్యపోయింది రమ.

"అక్కా మన జయానేనా ఇది? అయ్యో...ఎంతగా ఎదిగిపోయిందో? ఎంత అందమో? చదువు అయిపోయిందా? అరె...గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారే?"

యూనివర్సిటీ లోనే ఫస్ట్ ర్యాంక్"

"వావ్...! వినటానికే సంతోషంగా ఉందక్కా. అవును...ఏది అది ?"

"ట్రైనింగ్ కోసం తిరుపతికి వెళ్ళింది. ఈరోజు వస్తుంది"

"ఏం ట్రైనింగ్? ..ఎస్ చదువుతోందా?"

"ఊహూ...అవన్నీ వద్దట. టీచర్ కావాలని మొండికేస్తోంది"

"...అది కూడా మంచిదే కదక్కా? అయితే జయ టీచరయ్యింది?"

"అవును రమా...నీకు ఎప్పుడు పిల్లలు పుట్టారు? నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నావ్?"

మేము వరంగల్లో ఉంటున్నామక్కా. బహుశ వచ్చే నెల ఇక్కడికే మార్చేస్తారని అనుకుంటున్నా. విషయం మాట్లాడటానికే ఈరోజు వెళ్ళారు

చాలా సంతోషమే. అప్పుడైతే ఇక నిన్ను అప్పుడప్పుడు చూడచ్చు" అంటూ ఆడుకుంటున్న పిల్లలవైపు చూసింది యామిని….ఆశ్చర్యపోయింది.

ఇద్దరాడపిల్లలూ ఒకేలాగా ఉన్నారు...అబ్బాయేమో వాళ్ళ వయసు లోనే ఉన్నాడు.

"రమా..."

"అక్కా..."

"నీ కూతుర్లు ట్విన్సా?"

"అవునక్కా"

ఒకే లాగ ఉన్నారే! వయసు ఎంత?"

"తొమ్మిదవుతోంది"

"అబ్బాయికి?”

"వచ్చే నెల వస్తే తొమ్మిది పూర్తి అయ్యి పది మొదలవుతుంది"

యామిని కన్ ఫ్యూజ్ అయ్యింది. అది ఆమె మొహంలో కనబడింది.

అది చూసిన రమ "ఏమక్కా...కన్ ఫ్యూజ్ అయ్యావా?"

"లేదు...ఒక సంవత్సరం కూడా గ్యాప్ ఇవ్వకండా కన్నావా?"— యామిని ఆశ్చర్యపోతూ అడిగింది.

రమ మౌనంగా పిల్లలవైపు చూసింది. వాళ్ళు ఆటల్లో ముమ్మరంగా ఐక్యమైపోయున్నారు...గొంతు సరిచేసుకుంది.

"లేదక్కా...వీళ్ళ ముగ్గురూ నేను కన్న పిల్లలు కారు..."

"ఏమిటీ?" యామిని షాక్ అయ్యిందని ఆమె ముఖం చూపుతోంది.

"అవునక్కా...వీళ్ళు దేముడిచ్చిన పిల్లలు"

"అర్ధం కాలేదు..."

"మీకే తెలుసు కదా. మేము సంవత్సరాల తరబడి పిల్లలకోసం తపస్సు చేసింది...డాక్టర్ చేసిన పరిశోధనలలో నా గర్భ సంచీ పూర్తిగా పెరగలేదని చెప్పారు. నేను పిల్లలల్ను కనలేనని చెప్పశారు.

ఏడ్చాను...అరిచాను...చచ్చిపోవాలని ప్రయత్నం చేశాను. కానీ, నా భర్త దేముడక్కా. ఆయనే నన్ను సమాధాన పరిచారు. ఒక బిడ్డను దత్తతు తీసుకుని పెంచుకుందామని చెప్పారు"

"మంచి నిర్ణయం రమా. నీ భర్త నిజంగానే దేముడే"

"అవునక్కా! కానీ, అందులోనూ చాలా చిక్కులే. ఆయన తల్లి-తండ్రులు చదువుకోని వారు. గ్రామంలో ఉన్నారు. వాళ్ళు దీనికి ఖచ్చితంగా వొప్పుకోరు. దాంతోపాటూ...దత్తతు తీసుకున్న పిల్లలను ఎవరూ అనాధ అని ఒక్క మాట కూడా అనకూడదని నిర్ణయం తీసుకున్నాం"

"దానికొసం ఏం చేశారు?"

"వాళ్ళమ్మకు ఫోన్ చేసి నేను గర్భంగా ఉన్నానని చెప్పారు. నాకు అమ్మ లేదు. నాన్నా, అన్నయ్యా ఉన్నారు. అన్నయ్య అమెరికాలో ఉన్నాడు. అందువలన బిడ్డను కనటానికి అమెరికాకు వెళ్ళినట్లు చెప్పారు. మా ఇంటికి ఫోన్ చేసి అత్తగారింట్లో ఉన్నానని చెప్పారు. అబద్దం చెప్పటం తప్పే. కానీ, మా పిల్లలే నన్న గుర్తింపుతో పెరగాలని అలా చెప్పాల్సి వచ్చింది"

"మంచి విషయం కోసం అబద్దం చెబితే తప్పు లేదు. కానీ, శ్రీమంతం అదీ ఇదీ అని ఎవరూ మాట్లాడలేదా?"

అలాంటి మాట వచ్చినప్పుడే మేము రాహుల్ ను దత్తత్తు తీసుకున్నాము. నెలలు నిండకుండానే బిడ్డని కన్నానని చెప్పేశాము"

"మరి ఆడపిల్లలు...?"

"అది చాలా కష్టమైంది అక్కా! ఈయనకి నెల్లూరులో ఉద్యోగం దొరికినప్పుడు ట్రైన్ లో వెళ్ళాము. అప్పుడు రాహుల్ ఆరు నెలల పిల్లాడు. రైల్వే స్టేషన్లో దిగుతున్నప్పుడు టాయ్ లెట్ లో నుండి పసిపిల్ల ఏడుపు వినబడింది. ప్రయాణీకులందరూ దిగిపోయారు. నేనూ, ఆయన టాయ్ లెట్ తలుపు తెరిచి చూసినప్పుడు అక్కడ ఇద్దరు పిల్లలూ ఒక పాత గుడ్డలో చుట్టబడి వాష్ బేసిన్ క్రింద ఉంచారు

"అయ్యో"--తల్లిడిల్లిపోయింది యామిని.

క్రింద పడుంటే పిల్లలు రైలు పట్టాల మీద పడుంటారు. మంచికాలం...జాగ్రత్తగా పడేసి వెళ్లారు. ఎలాగో మా కళ్ళల్లో పడింది. మాకు పిల్లలను అనాధాలుగా వదిలిరావటానికి మనస్కరించలేదు. అదే...మేమే తీసుకున్నాం. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలు" -అంటూ గర్వంగా చెప్పింది రమ.

యామిని కళ్ళు చెమర్చినై.

రమను తన భుజాలపై వంచుకుంది.

ఎంత పెద్ద గొప్ప కార్యం చేశావు రమా! నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉంది

"మీరు చేసినంత గొప్ప కార్యం నేనేమీ చెయలేదే! నాకు పిల్లలు పుట్టే భాగ్యమే లేదని తెలిసిన తరువాతే నేను నిర్ణయానికి వచ్చాను. దానికి నా భర్త కూడా ఆమొదం తెలిపారు. కానీ మీరు...? జయ అనాధ అవకూడదని...మీ కుటుంబాన్నీ, మీ భవిష్యత్తును, అన్నింటినీ వదులుకుని ఒంటరిగా నిలబడ్డారే?”

ఎంతోమంది మిమ్మల్ని తప్పుగా మాట్లాడారు. వాళ్ళను లెక్క చేయకుండా, దేనికీ భయపడకుండా ధైర్యంగా ఒంటరిగా నిలబడి దాన్ని పెంచి పెద్ద చేశారే! మీరు చేసిన త్యాగం కంటే నేను గొప్పగా ఏమీ చెయ్యలేదు. నిజం చెప్పాలంటే ఒక పిల్లను దత్తత్తు తీసుకోవలనే ఆలొచన మీవల్లే కలిగింది"

"రమా, ఇలా ఒక్కొక్కరూ ఒక్కొక్క బిడ్డను దత్తతు తీసుకుంటే మన సమాజం అనాధ పిల్లలు లేకుండానే అయిపోతుంది. తలచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో చూడు..."-- యామిని సంతోషంగా చెబుతుంటే, ఉత్సాహంగా లోపలకు వచ్చింది జయ.

"అమ్మా...నాకు ఉద్యోగం దొరికింది!"

                                                                                                                               Continued...PART-9

************************************************************************************************