భూతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భూతాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, నవంబర్ 2023, శనివారం

పగటిపూట భూతాలు…(పూర్తి నవల)

 

                                                                                       పగటిపూట భూతాలు                                                                                                                                                                       (పూర్తి నవల)

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల అధ్యయనమును రాజకీయ శాస్త్రం, రాజకీయ అధ్యయనాలు, లేదా ప్రభుత్వ పరిపాలన అంటారు. 

రోజువారీ జీవితంలో రాజకీయాలు అనే పదం దేశాల పరిపాలన విధానాన్ని, ప్రభుత్వ నియమాలు, చట్టాల తయారీ మార్గాలను సూచించేందుకు ఉపయోగిస్తారు. 

అయితే ఇప్పుడు రాజకీయాలకు అర్ధం మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇతర గ్రూపులలో, చాలా పెద్ద సంస్థలలో, పాఠశాలలో, మతసంస్థలలో....అంతెందుకు ప్రతి దాంట్లోనూ రాజకీయమనే పదప్రయోగం కనిపిస్తుంది.

కానీ ఈ మధ్య రాజకీయం అంటే ఇలా చెబుతున్నారు:

రా అంటే రాక్షసంగా 

జ అంటే జనానికి 

కీ అంటే కీడు చేసే 

యం అంటే యంత్రాగం - 

రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాగం……………..నిజమా...?

రాజకీయ నేతల క్రింద పనిచేసే వారిని అడిగితే అమ్మో..."వాళ్ళు పగటి పూట భూతాలు" అంటున్నారు.

మరి ఈ నవలలో ఏముందో, రాజకీయాలకు పైన చెప్పిన సంక్షిప్తీకరణను ఎలా రుజువు చేసిందో ఒకసారి చదివి చూడండి.

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

పగటి పూట భూతాలు…(పూర్తి నవల)  @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

https://drive.google.com/file/d/17dWEqlC619UlKVDVkVWtKU03flDyeovh/view?usp=sharing

***********************************************************************************************

9, జనవరి 2023, సోమవారం

పగటి పూట భూతాలు…( పూర్తి నవల)


                                                                                 పగటి పూట భూతాలు                                                                                                                                                                        (పూర్తి నవల) 

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల అధ్యయనమును రాజకీయ శాస్త్రం, రాజకీయ అధ్యయనాలు, లేదా ప్రభుత్వ పరిపాలన అంటారు. రోజువారీ జీవితంలో రాజకీయాలు అనే పదం దేశాల పరిపాలన విధానాన్ని, ప్రభుత్వ నియమాలు, చట్టాల తయారీ మార్గాలను సూచించేందుకు ఉపయోగిస్తారు.

అయితే ఇప్పుడు రాజకీయాలకు అర్ధం మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇతర గ్రూపులలో, చాలా పెద్ద సంస్థలలో, పాఠశాలలో, మతసంస్థలలో....అంతెందుకు ప్రతి దాంట్లోనూ రాజకీయమనే పదప్రయోగం కనిపిస్తుంది.

 కానీ మధ్య రాజకీయం అంటే ఇలా చెబుతున్నారు:

రా అంటే రాక్షసంగా

అంటే జనానికి

కీ అంటే కీడు చేసే

యం అంటే యంత్రాగం -

రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాగం…………..నిజమా...?

తెలుసుకోవటానికి ఈ నవల చదవండి.

గంధము, కుంకుమా కలిసిన రంగులో ఈశాన్య దిక్కు తెల్లవారుతోంది.

శుక్రవార సూర్యోదయ గాలి ఊపిరితిత్తులను తీపి పరుస్తుండగా, బాల్కనీలో నిలబడి గాలిని శ్వాసిస్తున్న నరేందర్ కు పక్కన ఉంచుకున్న సెల్ ఫోన్ పిలుపును  ఇచ్చింది.

నరేందర్ సెల్ ఫోన్ తీసుకుని దాన్ని ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుని ఎస్... అన్నాడు.

మిస్టర్ నరేందర్...?”

స్పీకింగ్...

మిస్టర్ నరేందర్...! ముఖ్యమంత్రి ఇంటినుండి ఆమె పర్సనల్ సెక్రెటరీ పాండురంగం మాట్లాడుతున్నాను...

చెప్పండి సార్...

మీరు వెంటనే బయలుదేరి ముఖ్యమంత్రి గారి ఇంటికి రావాలి...

ముఖ్యమంత్రి ఇంటికా...?”

ఎస్...

విషయం ఏమిటో తెలుసుకో వచ్చా సార్...?”

ఫోనులో చెప్పే విషయం కాదు. నేరుగా రండి. ముఖ్యమంత్రి మీకొసం వెయిట్చేస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న విషయం ఇంకెవరికీ తెలియనివ్వద్దు. హై ర్యాంకింగ్ పోలీస్ అధికారులకు కూడా విషయం తెలియకూడదు. చాలా రహస్యమైనది. ముఖ్యమంత్రిని మీరు చూడటానికి వచ్చే విషయాన్ని మీ భార్యకు కూడా తెలియనివ్వకండి...బయలుదేరి వస్తారా?”

ఇప్పుడే వస్తా...

ఇంకో ముఖ్యమైన విషయం మిస్టర్ నరేందర్. ప్రగతిభవన్ లో ఉన్న ముఖ్యమంత్రి ఇంటికి రావద్దు...

మరి...?”

బేగంపేట లో ఒక బంగళా ఉంది. మీకు తెలిసుంటుందనుకుంటా...

తెలుసు...?”

అక్కడికి రండి...సి.ఎం, నేనూ కాచుకోనుంటాము

సెల్ ఫోన్ కట్ అయ్యింది.

నరేందర్ బాల్కనీ వదిలి కిందకు వచ్చాడు. నరేందర్ భార్య రూపా స్నానం ముగించుకుని, వంటింట్లో టీతయారుచేయటంలో బిజీగా ఉండగా, పాల కుక్కర్ విజిల్ వేసింది.

రూపా...

ఏమిటండీ...

నాకు టీవద్దు...నేను బయలుదేరుతున్నాను...

ఎక్కడికి...?”

ఉద్యోగ రహస్యం...చెప్పటానికి అనుమతి లేదు. ఇప్పుడే సెల్ ఫోనులో పిలుపు వచ్చింది

వెంటనే బయలుదేరాలా...?”

వెంటనే...వెంటనే...

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

పగటి పూట భూతాలు…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

27, జూన్ 2022, సోమవారం

పగటి పూట భూతాలు...(సీరియల్)....PART-12

 

                                                                     పగటి పూట భూతాలు...(సీరియల్)                                                                                                                                                               PART-12

నరేందర్ రూ, గౌతమూ ముఖ్యమంత్రి విజయలక్ష్మి గారి ఇంటికి పోయి చేరినప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు.

రిసెప్షన్ హాలులో సెక్రటరీ పాండురంగం స్వాగతించాడు.

రండి మిస్టర్ నరేందర్! అడవి నుండి ఎప్పుడు తిరిగొచ్చారు?”

రోజు ప్రొద్దున్నే...

మ్యాడమ్ మీ సెల్ ఫోన్ కి చాలా సార్లు ప్రయత్నం చేసారు. మీరు దొరకనే లేదు. ఏమైంది మీ సెల్ ఫోన్ కి...?”

ఏమో తెలియదు సార్. హఠాత్తుగా ట్రబుల్ ఇచ్చింది. రిపేర్ కు ఇచ్చాను! మ్యాడమ్ ఉన్నారా?”

లేరు! రోజు ముఖ్యమైన ఒక విదేశీయ రాయబారి అసంబ్లీలో ఆలొచన. మూడు గంటలు తరువాత తిరిగి వస్తారు...మ్యాడమ్ గారి కూతురు గురించి, అల్లుడు గురించి ఏదైనా వివరాలు దొరికినయా నరేందర్...?”

కొన్ని ముఖ్యమైన వివరాలు దొరికినై. వాటి గురించి మాట్లాడటానికే వచ్చాము...

మ్యాడమ్ గారి భర్త లోపలే ఉన్నారు. మీరు ఆయనతో మాట్లాడుతూ ఉండొచ్చు. లోపు మ్యాడమ్ గారు వస్తారు...ప్లీజ్...రండి...

పాండురంగం వాళ్ళను లోపలకు తీసుకు వెళ్ళాడు. ఒక .సి. గదిలో విశ్రాంతి కోసం పడుకోనున్నారు విజయలక్ష్మి భర్త నాగరాజు -- నరేందర్ ను, గౌతం ను చూసిన వెంటనే లేచి కూర్చున్నారు. మొహాన మూడు రోజులుగా గీయని తెల్ల గడ్డం.

పాండురంగం బయటకు వెళ్ళిపోవటంతో, నాగరాజు తన ఎదురుగా ఉన్న సోఫాలో నరేందర్ ను, గౌతం ను కూర్చోమన్నారు.

ప్లీజ్! కూర్చోండి

కూర్చున్నారు.

నాగరాజు అడిగారు.

"ఏదైనా ప్రయోజన పడే వివరం దొరికిందా. మిస్టర్ నరేందర్?"

నరేందర్ సమాధానం చెప్పకుండా గౌతం ను చూడగా... గౌతం లేచి వెళ్ళి గది తలుపు మూసొచ్చాడు.

నాగరాజు మొహం మారింది.

ఎందుకు గది తలుపులు మూసారు?”

నరేందర్ నవ్వాడు.

పనికొచ్చే విషయాలు మీ దగ్గర చెప్పాలి కదా...అందుకనే! మ్యాడమ్ లేరని తెలుసుకునే ఇప్పుడు వచ్చాను...

ఏం చెబుతున్నారు...?”

మిస్టర్. నాగరాజు...! మేము ఇప్పుడు అన్ని నిజాలతోనూ మీ ఎదురుకుండా కూర్చోనున్నాము

నిజాలా...? ఏం నిజాలు?”

డేవిడ్ కి మీరే బాస్ లాగుందే!

డేవిడా? ఎవరది...?”

గౌతం...! ఈయన దారికి రారు. కళావతి యొక్క సపరేట్ గదిలో మనకి దొరికిన సి.డి. ని సారుకు వేసి వినిపించండి...

గౌతం తనతో పాటూ తీసుకు వచ్చిన సి.డి. ని తీసాడు.

నరేందర్ చెప్పాడు. 

సి.డి. రెండు నెలలకు మునుపు రికార్డు చేయబడిన ఒక టెలిఫోన్ సంభాషణ. కళావతికి ఫోన్ చేసి మీరు టెలిఫోన్ లో మాట్లాడుతుంటే, అది ఆమె రికార్డు చేసింది. టెలిఫోన్ సంభాషణనే మనం ఇప్పుడు వినబోతాం

గౌతం సి.డి. ని ప్లేయర్లో పెట్టి బటన్ నొక్కాడు...సి.డి తిరగటం మొదలు పెట్టి స్వరాలు బయటపడ్డాయి.

మాట్లాడేది ఎవరు -- కళావతేనా?”

అవును

నేను ఎవరో తెలుస్తోందా?”

తెలియకేం...? రాష్ట్రానికి బొమ్మలాగా ఉండే ముఖ్యమంత్రి భర్త. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి నీడ

నా శక్తి ఏమిటో తెలిసి కూడా నువ్వు ఆటలాడటం కొంచం కూడా సరిలేదు...ఒక ప్రభుత్వం నడుస్తోందంటే కొంచం అవినీతి అలా, ఇలా ఉండటం జరుగుతుంది. దాన్ని గొప్పగా నీ పత్రికలో రాస్తున్నావే...ప్రాణాలతో ఉండాలని అనుకుంటున్నావా లేక మట్టి కిందకు వెల్దామనుకుంటున్నావా...?”

బెదిరింపులన్నీ నా దగ్గర వద్దు. నువ్వు ఎలాంటి అయోగ్యుడివో నాకు తెలుసు. ఇంకో ఆరు నెలలలో జరగబోయే జనరల్ ఎన్నికలలో నీ భార్యే గెలవాలని, ముఖ్యమంత్రి అవ్వాలని నువ్వు వేసిన ప్లాను నా చెవికి వచ్చింది

......................”

ఏమిటి సైలంట్ అయిపోయావు...? మీ ఈజీ ప్లాన్ ఏమిటో చెప్పనా...? మీ కూతుర్నీ, అల్లుడ్నీ మనుషులను ఏర్పాటు చేసి కిడ్నాప్ చేయించటం. తీర్చలేని కోరికలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమె ప్రాణానికి ఆపద అని వేషాలు వేయటం. దీని వలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మీ భార్య మీద జాలి పడతారు. జాలితో అందరూ ఆమెకే ఓటు వేస్తారు

...ఏయ్...ఇదంతా నీకు ఎవరు చెప్పారు?”

ఎవరు చెబితే ఏమిటి...? ఇది నిజమా, కాదా?”

ఇదిగో చూడు కళావతీ...నన్ను కొంచం అడ్జెస్ట్ చేసుకుని నడుచుకో. నీకు కావలసిన డబ్బు నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది...

ఇప్పుడు మాట్లాడేవే, ఇదే మాటంటే...మన ఇద్దరి మధ్యా ఒక ఒప్పందం వేసుకుందామా...?   ప్రభుత్వ పాలనలో తప్పు జరిగినా, నా పత్రిక పట్టించుకోదు. పట్టించుకోవటం అనే పనికి ఒక ధర మాట్లాడు కుందాం. డబ్బు కరెక్టుగా రావాలి. డబ్బు కోసం నేను రాను. నా మనిషి డేవిడ్ వస్తాడు. భ్రీఫ్ కేసులో ఉంచి చడీచప్పుడు లేకుండా ఇచ్చేయాలి. ఏమిటీ...డీల్ ఒప్పందం ఒకేనేగా

.కే

ఇప్పుడు ఓకే చెప్పేసి రేపు...నువ్వు మాట మార్చినా, నా పత్రికలో నీ కథ ప్రచురణ అవుతుంది...

అలాగంతా చేయద్దు కళావతీ. నీ మనిషి డేవిడ్ దగ్గర వారం వారం డబ్బు ఇచ్చేస్తాను. చాలా?”

చాలు...

తరువాత...

ఏమిటి...?”

నా కూతుర్నీ, అల్లుడ్నీ కిడ్నాప్ చేసిన నాటకం ఒక రోజు మొదలవుతుంది. నీ పత్రికలో దానికి చాలా ముఖ్యత్వం ఇచ్చి ప్రచురించాలి. వార్తను చదువుతున్న మహిళలు కన్నీరు కార్చి ఏడవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవాలంటే చాలా సెంటి మెంట్లు అవసరపడుతోంది...

మీరు ఒక మంచి రోజు చూసి, నాటకం మొదలు పెట్టండి...నేను నా సహాయంగా నా పత్రికలో ప్రచురించి ప్రజల మనసును కరిగించేస్తాను. దీనికి వేరుగా ఒక మొత్తం ఇవ్వాలి...

ఇస్తే పోతుంది...

డేవిడ్ ని వచ్చేవారం పంపిస్తాను

పంపు...పంపు...

సీ.డి తిరగటం ఆగింది.

.సీ. గదిలో నాగరాజు కు ముఖమంతా చెమట పట్టింది.

నరేందర్ లేచి వెళ్ళి నవ్వుతూ ఆయన భుజం మీద చెయ్యి వేశాడు.

కొన్ని పత్రిక యజమానులు ఇలాగే సార్. ఏదో ఒక రకంగా పట్టుబడేటట్టు చేస్తారు. కళావతి ఇలా ఒక సి.డి. ని  తన చేతిలో ఉంచుకుంటుందని మీరు కొంచం కూడా ఎదురు చూసుండరు...

నాగరాజు చెమటను కూడా తుడుచుకోకుండా, అలాగే కూర్చుండిపోగా, నరేందర్ మళ్ళీ మాట్లాడాడు.

సార్...మీకొక విషయం తెలుసా? డేవిడ్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. నన్ను చంపటానికని అడవికి వచ్చిన అతను, నా చేతులతోనే ప్రాణాలు వదిలేడు. సహాయం అతను తీసుకు వచ్చిన తుపాకీయే.

అతను చనిపోయి కింద పడేటప్పుడు అతను ఉంచుకున్న మొబైల్ ఫోనులో మీరు డేవిడ్ - డేవిడ్ అంటూ పిలిచారు. తరువాత ఆఫ్ చేసారు. గొంతు ఎక్కడో విన్నామే అని ఆలొచించి, ఆలొచించి చూస్తే ఏమీ గుర్తుకు రాలేదు. చివరగా కళావతి సి.డి లో మీ గొంతు విన్న తరువాత, అరె! మ్యాడమ్ గారి భర్త గొంతు కదా అనిపించింది...

నాగరాజు వొళ్ళంతా వణుకుతుంటే లేచి నరేందర్ చేతులు పుచ్చుకున్నాడు.

మిస్టర్ నరేందర్! మీరు వయసులో చిన్న వారు. అయినా కానీ మీ కాళ్ళ మీద పడి మన్నించమని వేడుకుంటాను. వ్యవహారం ఏదీ బయటకు తెలియకూడదు. తెలిస్తే నా పరువు, మర్యాద అంతా పోతుంది

మిమ్మల్ని కాపాడాలంటే నేను ఇప్పుడు అడిగే ప్రశ్నలకు నిజమైన సమాధానం చెప్పాలి

...అడగండి...

మీ అమ్మాయి, అల్లుడూ ఇప్పుడు ఎక్కడున్నారు...?”

కర్నాటక రాష్ట్రం బందిపూర్ అడవిలో నాకు కావలసిన ఒక మనిషి యొక్క బంగళాలో...

కిడ్నాప్ నాటకం గురించి మీ కూతురికీ, అల్లుడికీ తెలుసా?”

తెలియదు...

మీ భార్యకు....?”

తెలియనే తెలియదు. ఆమె ఒక అమయకురాలు!

సరే! కళావతిని చంపేసి వాటర్ ట్యాంకులో పెట్టి ఖననం చేసింది ఎవరు...?”

డేవిడ్, జనగణమన కేశవ్, సెక్యూరిటీ గంగన్న, మేస్త్రీ వీరప్ప....

గంగన్న తనకు ఏమీ తెలియదని చెప్పాడే?”

అబద్దం... టైములో వాడు సెలవు పెట్టున్నా, పధకానికి సహాయం చేసాడు. కళావతి మరణం కారణం చేత బయటిలోకానికి తెలియనే కూడదని చాలా జాగ్రత్తగా ఉన్నాము. కానీ, నా భార్య విజయలక్ష్మి, కూతుర్నీ, అల్లుడ్నీ అదే రెడ్ రోస్ గెస్ట్ హౌస్ కు పంపించింది. ఎన్నికలకు ముందు కిడ్నాప్ నాటకాన్ని ప్రారంభించాలని అనుకుని నేను కూడా నా మనుషులతో కార్యంలోకి దిగాను

మీ భార్యకు ఇది నాటకమని తెలియకుండా ఉన్నందువలనే ఆమె ఆందోళన చెంది నన్ను సహాయానికి పిలిచింది. నేనూ, గౌతం ఇద్దరం సహాయానికి వచ్చి విచారణ కోసం రెడ్ రోస్ గెస్ట్ హౌస్ కు వెళ్ళటంతో మీరు భయపడ్డారు. మా ప్రయత్నాలను గమనించటానికి డేవిడ్ అక్కడికి వచ్చాడు. మీరు భయపడినట్లే కళావతి మరణాన్ని మా పోలీసు చూపులు వాసన పట్టి బయటకు తేవటంతో, మీరు తీవ్రంగా భయపడ్డారు. డేవిడ్ కు మొబైల్ ద్వారా అప్పుడు మీరు సమాచారం అందించారు. దాని ఫలితం? డేవిడ్ హడావిడిగా గంగన్నని మంటలకు బలి ఇచ్చేసి, అడవిలోపల ఉంచే నన్ను చంపాలని అనుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పేదంతా కరక్టే కదా సార్...?" 

సరే అనేటట్టు తల ఊపిన నాగరాజు, నరేందర్ కు నమస్కరించాడు.

మిస్టర్ నరేందర్! ఇవేవీ బయట ఎవరికీ తెలియకూడదు. మీకు కావలసిన డబ్బు లక్షలలో... కాదు... కాదు...కోట్లలో ఇస్తాను... సి.డి. ని నా దగ్గర ఇచ్చేయండి

సారీ సార్... సి.డి. ని ఇంతకు ముందే ఇంకొకరికి అమ్మేందుకు మాట్లాడాము...

ఎవరికి...?”

న్యాయదేవతకి...!

నాగరాజు భయపడి వణుకుతున్నప్పుడే నరేందర్ తన చొక్కా జేబులో ఉంచుకున్న అరెస్టు వారెంటును తీసి అతని మొహానికి నేరుగా జాపాడు. 

మీ భార్య వచ్చేలొపు జీపు దగ్గరకు వెళ్ళిపోదాం సార్...

నాగరాజు-నరేందర్, గౌతంలతో కలిసి నడవసాగాడు. అప్పుడు గౌతం అన్నాడు:

నరేందర్! రాత్రి పూట భూతాల కంటే, పగటి పూట భూతలే చాలా ప్రమాదకరమైనవి

నరేందర్ చిన్నగా నవ్వాడు.

                                                                                         సమాప్తం

*************************************************సమాప్తం*******************************************