4, జనవరి 2021, సోమవారం

విశ్వంలో మనం ఒంటరిగా లేము!...(ఆసక్తి)

 

                                                                విశ్వంలో మనం ఒంటరిగా లేము                                                                                                                                                                 (ఆసక్తి)

                             తెలివైన గ్రహాంతర నాగరికత ఉండటానికి అవకాశం ఉన్నది...కొత్త అధ్యయనం

మనుషులు మరియు హాలీవుడ్, విశ్వంలో మనం మాత్రమే తెలివైన జీవులం కాదు, మనకంటే తెలివైన జీవిలు ఉన్నాయని సంవత్సరాలుగా ఊహించారుఇప్పుడు ఒక కొత్త పరిశోధన పాలపుంత గెలాక్సీలో మాత్రమే కనీసం 36 తెలివైన నాగరికతలు కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి

నాటింగ్ హామ్ విశ్వవిద్యాలయంలో ఒక శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేస్తున్నారు. వారు కొత్తవిశ్వ పరిణామంఆధారిత గణనంతో ముందుకు వెళ్ళటం వలన  ఇది తెలుసుకోగలిగారని వారు భావిస్తున్నారు. మన సౌర వ్యవస్థ, పాలపుంత, 100 నుండి 400 బిలియన్ల నక్షత్రాలను కలిగి ఉంటుందని మరియు ప్రతి నక్షత్రానికి ఒక ఎక్సోప్లానెట్ ఉంటుందని అంచనా వేశారు.

పరిశోధన 'ది ఆస్ట్రోఫిజికల్ జర్నల్' లో ప్రచురించబడింది. మన స్వంత గ్రహం మీద ఉన్నట్లుగానే ఇతర గ్రహాలపై కూడా తెలివైన జీవితం ఉండొచ్చని ఊహిస్తున్నారు.

ఫోర్బ్స్ పత్రిక యొక్క ఒక కథనం ప్రకారం, ఒక ముఖ్యమైన ఊహ ఏమిటంటే, భూమిపై ఉన్నట్లుగా, ఇతర గ్రహాలపై కూడా తెలివైన జీవితం ఏర్పడటానికి ఐదు బిలియన్ సంవత్సరాలు పడుతుంది. మరొకటి ఏమిటంటే, సాంకేతిక నాగరికత కనీసం 100 కాంతి  సంవత్సరాల వరకే ఉంటుంది-భూమి మీద ఉన్నట్లే. అన్నింటికంటే, భూమిపై సాంకేతిక నాగరికత ఏర్పడటానికి 4.5 బిలియన్ సంవత్సరాల పరిణామం పట్టింది మరియు కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంది

ఈ గణనం నక్షత్రాల నిర్మాణ చరిత్రలను, లోహంతో కూడిన నక్షత్రాలు ఎంత సాధారణమైనవో (సూర్యుడి వంటివి), మరియు నక్షత్రాలు వాటి నివాస మండలాల్లో భూమి లాంటి గ్రహాలను హోస్ట్ చేసే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి.

వాస్తవానికి 36 వ సంఖ్య నాగరికతలలో అతి తక్కువ మొత్తమని పరిశోధన తేల్చిచెప్పింది.  కమ్యూనికేట్ చేయగల నాగరికతలు 100 కాంతి  సంవత్సరాలు మాత్రమే మనుగడ సాగించగలవని తెలిపింది.

కానీ, పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 36 నాగరికతలలో ఒకదానికి సగటు దూరం సుమారు 17,000 కాంతి సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ప్రస్తుత మానవులు వారితో ఎప్పుడూ సంభాషించలేరు.

విశాల విశ్వంలో మనిషిని పోలిన...మనిషిలా ఆలోచించగలిగిన జీవులు వేరే ఎక్కడైనా ఉన్నారా అన్న ఆసక్తి ఈనాటిది కాదు. అంతక్రితం మాటేమోగానీ, క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దిలో గ్రీకు తత్వవేత్తలు భూమిని పోలిన గ్రహాలున్నాయని ఊహించినట్టు దాఖలాలున్నాయి. అనంతరకాలంలో గ్రహాంతరజీవుల గురించిన ఆలోచనలు మొగ్గతొడిగాయి. సహజంగానే తర్వాత్తర్వాత వారు కాల్పనిక సాహిత్యంలోనూచొరబడ్డారు’. ఎన్నో కావ్యాలకూ, నవలలకూ ఇతివృత్తమయ్యారు. వారిని గురించిన దాహార్తిని వెండితెర కూడా యధోచితంగా తీర్చింది. గ్రహాంతరజీవులను ప్రధానం చేసుకుని అనేక చలనచిత్రాలు వచ్చాయి. అప్పుడప్పుడు గ్రహాంతరజీవుల్ని తాము చూశామని చెప్పినవారూ లేకపోలేదు. కొందరైతే గ్రహాంతరజీవులు ఉపయోగించే ఎగిరే పళ్లాలు చూశామని చెప్పిన సందర్భాలున్నాయి. విశ్వంలో మనం ఒంటరిగా లేమన్న నమ్మకమే వీటన్నిటికీ ఆధారం. అయితే భూమిని పోలిన గ్రహాలున్నాయన్నంతవరకూ మాత్రమే పరిశోధనా అధ్యయనం రావటానికి ముందు వరకు శాస్త్ర వేత్తలు ధ్రువీకరించారు.

నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా...మన సౌర కుటుంబాన్ని పోలి ఉండే సప్త గ్రహ వ్యవస్థ మనకు 39 కాంతి సంవత్సరాల దూరంలో... అంటే 234 లక్షల కోట్ల మైళ్లకు పైగా దూరంలో ఉన్నదని చేసిన ప్రకటన సంభ్రమాశ్చర్యాలు గొలుపుతోంది. మన సూర్యుడి కంటే బాగా చిన్నగా, తక్కువ తీవ్రతతో ఉన్న ఒక కుబ్జ తార ట్రాపిస్ట్‌–1 చుట్టూ ఏడు గ్రహాలూ తిరుగాడుతున్నాయని నాసా తెలిపింది. చిత్రమేమంటే ఏడూ పరిమాణంలో భూమిని పోలే ఉన్నాయి. అంతేకాదు...వాటిలో మూడు గ్రహాలు జలరాశితో కూడా నిండి ఉండొచ్చునని నాసా శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. జలరాశికి ఆస్కారమున్నది గనుక ఏదో రకమైన జీవరాశి కూడా ఉండకపోదంటున్నారు.

అన్నీ నిజంలాగానే అనిపిస్తోంది!

ఇవి కూడా చదవండి:

ప్రమాదకరమైన వ్యాధికారక ప్రయోగాలను పాకిస్తాన్ తో కలిసి నిర్వహిస్తున్న చైనా(న్యూస్)

స్కైలైన్ భవనం మధ్య నుండి వెడుతున్న రహదారి(ఆసక్తి)

************************************************************************************************


2, జనవరి 2021, శనివారం

వైరాగ్యం.. .(కథ)

 

                                                                                 వైరాగ్యం                                                                                                                                                                                                                                    (కథ)

మోనికా కు ఇంకో గంటలొ పెళ్ళి. మోనికా తండ్రి సుబ్బారావ్ మెల్లగా కల్యాణ మండపం వైపు నడుస్తున్నాడు. అతను తన కూతురుని చివరగా చూసింది ఊయలలో పాపగా ఉన్నప్పుడు!

అతనికి పెళ్ళి పిలుపు లేదు. ఎలా పిలుస్తుంది భార్య పూర్ణిమ? పాతవన్నీ అమె ఎలా మరిచిపోగలదు?

తాగుడు మత్తులో కారణమే లేకుండా భార్యను కొట్టడం, తన్నడం అతనికి టైములో జ్ఞాపకం వచ్చి గుండెను నొక్కుతున్నట్లయ్యింది.

కల్యాణ మండపంలోకి వెల్దామా, వద్దా?---అనే ఆలొచనతోనే నడుస్తున్నాడు.

పాత జ్ఞాపకాలలొ ముఖ్యమైన సంఘటన గుర్తుకు వచ్చింది సుబ్బారావుకు.

"ఇదిగో చూడండి...ఊరంతా మీ గురించి తప్పుగా మాట్లాడుతోంది.  దాన్ని వదిలేయండి. సరళా సహవాసమే వద్దు. మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. మనకు ఒక ఆడపిల్ల ఉంది...అది పెరిగి పెద్దదై మీ గురించి తెలుసుకుంటే ఏమనుకుంటుంది?"

పూర్ణిమ ఏడుస్తూ బ్రతిమిలాడింది.

"పోవే! ఇది నా కూతురేనా అన్న సందేహం వస్తోంది!"

సుబ్బారావ్ అనుమానిస్తునట్లు మాట్లాడాడు.

పూర్ణిమ తన చెవులను మూసుకుంది.

"ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే...మీ నోరు పడిపోతుంది..."

"మాట్లాడతానే...నా యోగ్యత గురించి నువ్వు మాట్లడుతుంటే, నీ గురించి నేను మాట్లాడ కూడదా? నేను నీకు తెలిసే ద్రోహం చేస్తున్నాను...నువ్వు తెలియకుండా చేస్తున్నావో, ఏమో?"

కావలనే గొడవపెట్టుకుని అనవసరమైన మాటలు అంటూ అపవాదులు వేస్తుంటే తట్టుకోలేకపోయింది పూర్ణిమ.

"ఇక మీతో కాపురం చెయ్యలేను. నేను నా కూతుర్ని తీసుకుని మా అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. మీరు సరళను ఇంటికి తీసుకు వచ్చి ఆమెతోనే కాపురం చేసుకోండి!

"నువ్వు చెప్పినా, చెప్పకపోయినా ఇక నాకు ఆమెతోనే జీవితం. నువ్వు చచ్చిపోయావనుకుంటాను!"

అంతే, పూర్ణిమ కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. 

సుబ్బారావ్ కల్యాణ మండపంలోకి అడుగుపెట్టాడు.

అతన్ని చూసిన ఒక వయసైన ఆడది పరిగెత్తుకెళ్ళి, మోనికాకు అలంకారం చేయడం చూస్తున్న పూర్ణిమ చెవిలో గుసగుసలాగా చెప్పింది.

"నీ భర్త వచ్చాడు!"

అది కొంచం కూడా ఎదురు చూడలేదు పూర్ణిమ! ఒక వేల గొడవపెట్టుకోవడానికి వస్తున్నాడా? కలవరపాటుతో బయటకు వచ్చింది.

కల్యాణ మండపం లో ఒక విధమైన ఆందోళన వాతావరణం చోటుచేసుకుంది.

"ఎవరు మిమ్మల్ని ఆహ్వానించారు? ఎందుకు వచ్చారు? గొడవ చేయడానికా?"....భర్తను అడ్డుకుని ఆపుతూ అడిగింది.

"పూర్ణిమా! ఎందుకు ఇలా మాటలతో చంపుతున్నావు, ఇప్పుడు నేను పాత సుబ్బారావును కాను. ఒకే ఒకసారి పెళ్ళికూతురు దుస్తులలో ఉన్న మన కూతురు ముఖాన్ని చూసేసి వెళ్ళిపోతాను"

ఈలోపు పెళ్ళికొడుకు తండ్రి అక్కడకి వచ్చాడు.

"బావగారూ! క్షమించాలి. మీ గురించి పూర్ణిమ అంతా చెప్పింది. అవన్నీ విన్న తరువాత కూడా నేను మోనికా కోడలుగా రావడానికి అంగీకరించాను. దయచేసి బయటకు వెళ్ళిపొండి. మీరు లేకుండానే ఈ పెళ్ళి జరుగుతందని ఆవిడ ముందే చెప్పింది. వెనుకా ముందు తెలియని నేనే పూర్ణిమ అమాయకత్వమైన మంచి గుణాన్ని అర్ధంచేసుకున్నాను. కానీ, తాలి కట్టిన భర్తగా మీరు అమెను అర్ధంచేసుకోలేకపోవటమే నిజంగా మూర్ఖత్వం. దయచేసి వెళ్ళిపొండి!"

సుబ్బారావ్ అవమానంతో తల దించుకున్నాడు. కళ్ళ నుండి నీరు ధారగా కారుతోంది. నేను చేసిన పాపాలకు ఇన్ని సంవత్సరాల తరువాత ఒక్క నిమిషంలో పూర్ణిమ దండన ఇచ్చేసింది!

"నేను మోనికాను చూడాలి...కొంచం పిలవండి"

మోనికా వచ్చింది. అచ్చంగా పూర్ణిమ పోలికలతో వొలిచి పెట్టినట్లు ఉన్నది.

"నాన్నా! ఇన్ని సంవత్సరాలుగా నన్ను చూడటానికి ఎందుకు రాలేదు! ఇప్పుడు మాత్రం ఎలా వచ్చావు?"

సుబ్బారావు కు దుఖం పొంగుకు వచ్చింది.

"మోనికా! లోపలకి పో...చూశారు కదా. ఇక చాలు. కపట ప్రేమను వొలకబోసింది చాలు!" అన్నది పూర్ణిమ.

ఇంతలో పెళ్ళికొడుకు పరిగెత్తుకొచ్చాడు.

"అత్తయా! ఆయన తన తప్పు తెలుసుకుని తిరిగొచ్చారు. ఆయన ఏడుపులోనే తెలియటం లేదా?"

"అల్లుడు గారూ! తప్పు తెలుసుకుని తిరిగి వస్తే ఆమొదించాలా? ఒకవేల నేను అలా వెళ్ళిపోయి తిరిగొస్తే నన్ను ఆమొదిస్తారా? ఈ సమాజంలో మగవారికొక చట్టం, ఆడవాళ్లకొక చట్టం ఉన్నదా? చిన్నపాపగా ఉన్నప్పుడే మోనికాను, నన్నూ వదిలేసి ఈయన వెళ్ళిపోయిన తరువాత ఎంతో వైరాగ్యంతో ఉండి మోనికాను పెంచాను, ఎంతో కష్టపడ్డాను.

నా మంచి నడవడిక ద్వారా ఈరోజు తలెత్తుకుని నిలవగలిగాను. ఆ రోజు లేని ఈయన ప్రేమ, ఈరోజు నాకు అవసరం లేదు. దయచేసి వెళ్ళిపొమ్మని చెప్పండి అల్లుడుగారు"

ఆవేశంగా మాట్లాడింది పూర్ణిమ.

సుబ్బారావ్ మౌనంగా వెను తిరిగాడు.

మూహూర్త మేళం వాయిద్యాలు మోత వినేటంతవరకు కాచుకుని మూహూర్త మేళతాలాలు విన్న తరువాత బయలుదేరాడు సుబ్బారావ్...

*******************************************సమాప్తం*******************************************

ఇవి కూడా చదవండి:

లామా యాంటీ బాడీలు కరోనా-19 చికిత్సకు సహాయపడతాయా(ఆసక్తి)

చైనా పాకిస్తానుకు బయోలాజికల్ వెపనైజేషన్ ఇస్తోందా?(ఆసక్తి/న్యూస్)

*****************************************************************************************************