నకిలీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నకిలీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2022, సోమవారం

నకిలీ పోలీస్‌ స్టేషన్‌.. (సమాచారం)

 

                                                                                  నకిలీ పోలీస్‌ స్టేషన్‌                                                                                                                                                                      (సమాచారం)

గుజరాత్‌లో మోసగాళ్ల బృందం ప్రారంభించిన నకిలీ ఐపిఎల్‌ను గుర్తు చేస్తూ, బీహార్‌లోని బంకాలో నిజమైన పోలీసు స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో కాన్ ఆర్టిస్టుల బృందం నకిలీ పోలీస్ స్టేషన్‌ను నడిపింది మరియు అది తెలుసుకోవడానికి అధికారులకు 8 నెలల సమయం పట్టింది.

ఈ వ్యక్తులు అద్దెకు తీసుకున్న అతిథి గృహం నుండి పోలీసు స్టేషన్‌ను నడిపారు మరియు సహాయం కోసం వెతుకుతున్న అనుమానాస్పద వ్యక్తుల నుండి డబ్బును ఎగుమతి చేశారు.

 నకిలీ వస్తువులు, కల్తీ ఆహారపదార్థాలు తయారు చేసే కేంద్రాలను పోలీసులు పట్టుకున్న సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, ఓ గ్యాంగ్‌ ఏకాంగా నకిలీ పోలీస్‌ స్టేషన్‌నే ఏర్పాటు చేసింది. పోలీసుల దుస్తుల్లో ఎనిమిది నెలలుగా వసూళ్లకు పాల్పడుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని బాంగా జిల్లాలో వెలుగు చూసింది. అయితే, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ నకిలీ పోలీస్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు భోలా యాదవ్‌ ఓ గెస్ట్‌ హౌస్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. ముందుగా రూ.వేలు వసూలు చేసి అనిత, జూలీ అనే ఇద్దరు మహిళల్ని పోలీసులుగా నియమించుకున్నాడు. మరో ముగ్గురిని తన గ్యాంగ్‌లో చేర్చుకుని డీఎస్పీ, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ లాంటి హోదాలు  కట్టబెట్టాడు. వారికి యూనిఫాంలతో పాటు నాటు తుపాకీలు ఇచ్చాడు. వారు చెకింగ్‌ల పేరుతో భయపెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూళు చేసేవారు.

బుధవారం సాయంత్రం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్‌ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశారు. అతడికి అనుమానం వచ్చి ఆరా తీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నకిలీ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

నాటు తుపాకులతో రోడ్లపైకి వచ్చిన నకిలీ పోలీసులు వాహనదారులను, జనాన్ని, వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజేవారు. ఇలా 8 నెలలపాటు ఈ ‘నకిలీ’ బాగోతం నడిచింది.

మోసానికి మరో రూపం ఇది. నిందితులు ఎంతగా తెగించారో చెప్పేందుకు ఇది అతిపెద్ద ఉదాహరణ.

****************************************************************************************************

16, మే 2022, సోమవారం

కృతిమ సూర్యుడా? లేక నకిలీ సూర్యుడా?...(ఆసక్తి)

 

                                                            కృతిమ సూర్యుడా? లేక నకిలీ సూర్యుడా?                                                                                                                                                           (ఆసక్తి)

చైనా అంటే మనకి గుర్తు వచ్చేదే నకిలీ వస్తువులు. ఎంత ఖరీదైన వస్తువును సైతం తమ తెలివితో అతి చవక ధరలో, అసలైన వాటికీ ఏ మాత్రం తీసిపోకుండా నకిలీది తయారు చేయడమే చైనా ప్రత్యేకత. అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి కృత్రిమ సూర్యుడిని సైతం తయారు చేసింది చైనా. సూర్యుడు కన్నెర్ర చేస్తేనే తట్టుకోలేని పరిస్థితి, అలాంటిది సృష్టికి ప్రతి సృష్టి మంచిదేనా అనే సందేహాలు ఉన్న తరుణంలో చైనా తయారు చేసి చూపించింది. గత సంవత్సరం ఈ కృత్రిమ సూర్యుడిని ప్రకటించగా, ఇపుడు దీనిని మొదటిసారిగా ప్రయోగించింది అని ఆ దేశ మీడియా సంస్థ తెల్పింది.

అనంత విశ్వంలోని సమస్త జీవరాశికి సూర్యుడే ఆధారం. సూర్యుడి నుంచి వచ్చే వెలుతురు, వేడిమితోనే మానవులు, జంతు, వృక్ష జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించలేం. సూర్యుడి శక్తిని భూమ్మీదే ఉత్పత్తి చేసేందుకు చైనా కొన్నాళ్ల కిందట బృహత్తర పరిశోధన చేపట్టింది. ఎక్స్ పెరిమెంటల్ అడ్వాన్స్ డ్ సూపర్ కండక్టింగ్ టోకామక్ (ఈఏఎస్టీ) పేరిట చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కృత్రిమ సూర్యుడ్ని సృష్టించింది. ఇందులోని టోకోమాక్ రియాక్టర్ సూర్యుడి తరహాలోనే పనిచేస్తోంది.

సూర్యుడిలో శక్తి ఉత్పత్తి ప్రక్రియను అనుకరించే ఈ రియాక్టర్‌.. తాజాగా 1056 సెకెన్ల పాటు అంటే 17 నిమిషాలకుపైగా ఏడు కోట్ల డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను విడుదల చేసింది. సూర్యుడి ఉష్ణోగ్రత 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్‌తో పోల్చితే ఇది దాదాపు అయిదు రెట్లు ఎక్కువని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా ఫిజిక్స్‌ శాస్త్రవేత్త గాంగ్ జియాన్జు తెలిపారు. నిరంతర అధిక ఉష్ణోగ్రత ప్లాస్మా ఆపరేషన్‌లలో ప్రపంచంలోనే ఇది అత్యంత సుదీర్ఘమైందని ఆయన వెల్లడించారు.

డ్యుటేరియం వినియోగంతో సూర్యుడిలో జరిగే న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ ప్రక్రియను అనుకరించి స్వచ్ఛమైన శక్తిని ఉత్పన్నం చేయడమే ఈస్ట్‌ ఉద్దేశం. ఈ ఫ్యూజన్‌ ఎనర్జీ పరికరం చైనా హీఫీలోని చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఉంది. భవిష్యత్తులో దీని సాయంతో శక్తిని ఉత్పాదన చేసి దేశీయ అవసరాలకు వినియోగించుకోవాలన్నది చైనా లక్ష్యం.

ఇంటర్నేషనల్‌ థర్మోన్యూక్లియర్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ రియాక్టర్‌ (ఐటీఈఆర్‌) కార్యక్రమంలో భాగమైన ఇది.. 2006లో తొలిసారి అందుబాటులోకి వచ్చింది. ఐటీఈఆర్‌ ప్రాజెక్ట్‌లో భారత్‌, దక్షిణ కొరియా, జపాన్‌, రష్యా, అమెరికా వంటి దేశాలూ భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.

చైనా ప్ర‌యోగంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీని వెనుక దురుద్దేశం కూడా ఉండొచ్చ‌నే అనుమానిస్తున్నారు. ఈ శ‌క్తిని అణ్వాయుధాల‌కు సైతం ఉప‌యోగించుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని భావిస్తున్నారు. అలా గ‌నుక చైనా చేస్తే.. భార‌త్‌, అమెరికా వంటి దేశాల‌కు ముప్పు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Images Credit: To those who took the original photos.

****************************************************************************************************