ప్రేమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రేమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, అక్టోబర్ 2025, గురువారం

కన్నీరు బలహీనంకాదు-మన నొప్పి యొక్క నిజాన్ని లోకానికి ఎత్తి చూపే భాష

 

కన్నీరు బలహీనంకాదు-మన నొప్పి యొక్క నిజాన్ని లోకానికి ఎత్తి చూపే భాష 

https://www.youtube.com/shorts/pKhiJ1ht0Nc   

*******************************************************************************************************************************************

 


4, మార్చి 2024, సోమవారం

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల)

 

                                                                                 ప్రేమ సుడిగుండం                                                                                                                                                                       (పూర్తి నవల)

'ప్రేమ' అనే రెండక్షరాల మాట చాలా ప్రమాదకరమైనది. అది సుడిగుండం లాంటిది. ప్రేమలో పడ్డవారు ఎవరైనా సరే ప్రేమ సృష్టించే సుడిగుండంలో చిక్కుకోక తప్పదు. ప్రేమ అనే సుడిగుండం లో చిక్కుకుని తప్పించుకున్న వారు చాలా తక్కువ మంది. ఈ నవలలో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు హీరో తల్లికి ఎంతో ప్రీతిమంతులు, బంధువులు, కావలసిన వాళ్ళూ అయినా వాళ్ళు కూడా ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు. ఎందుకు, ఎలా ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు, ఆ ప్రేమ సుడిగుండం  నుండి ఎలా బయట పడ్డారు? వారి ప్రేమ సుడిగుండంలో వారిద్దరూ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ సుడిగుండం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2  

*************************************************************************************************

14, ఫిబ్రవరి 2024, బుధవారం

ప్రేమకు సహాయం...(పూర్తి నవల)

 

                                                                            ప్రేమకు సహాయం                                                                                                                                                                          (పూర్తి నవల)

"యుక్త వయస్సులో, ఉడుకు రక్తం పొగరుతోనూ - మోహంతోనూ, మాక్సిమం పదిహేనేళ్ళ వయసు నుండి ముప్పై ఏళ్ల వయసు లోపల వచ్చి వెళ్ళే ప్రత్యేక కామమే ప్రేమ!

ఒక మగవాడికి ఏర్పడి, అదే లాగా ఒక ఆడదానికీ ఏర్పడేటప్పుడే ఇద్దరూ ఆకర్షితులై దగ్గరవుతారు. అలా ఆకర్షితులైన వారికి తల్లి-తండ్రులు, ఊరు, ప్రపంచం, తోబుట్టువులు, బంధువులూ అందరూ దూళి లాగా మారిపోతారు.

ప్రేమ అనేది ఎంతపెద్ద ప్రమాదమైన విషయమో అప్పుడే నాకు అర్ధమయ్యింది.

జీవితంలోకి దిగి జీవించటం ప్రారంభించినప్పుడే రంగు అంతా వెలిసిపోవటం మొదలవుతుంది!  అందంగా మేకప్ చేసుకుని, పరస్పరం ఏమార్చుకున్నది పగిలి ముక్కలై,

అందవికారాన్ని కలుసుకున్నప్పుడే యధార్ధం అర్ధమవుతొంది. ఇప్పడు భారానికి చేయూత నివ్వడానికి చుట్టూ ఎవరూ లేరు. చుట్టు పక్కల ఉన్నవాళ్ళు కూడా ప్రేమికులను ద్రొహులుగానే చూసే ఒక పరిస్థితి.

ప్రేమనేది పెళ్ళి తరువాత భార్య దగ్గరే జరగాలి.

పెళ్ళికి ముందు ఒకరికి ఏర్పడితే...అది పాపం తోనే చేరుతుంది! పాపాత్ములకు మాత్రమే ప్రేమ వస్తుంది. వాళ్ళు…వాళ్ళు కష్టపడుతూ, తమ కుటుంబాన్ని కష్టపెట్టి, తమ పిల్లలనూ కష్టపెడతారు.

“పెళ్ళి తరువాత వస్తే అది తేనె. పెళ్ళికి ముందు వస్తే అది సందేహం  లేదు...విషం”

ప్రేమించ కుండా ఉండటమే తెలివిగలతనం"

అంటూ తన కూతురి స్కూల్ టీచర్ కు హితబోద చేసిన ఈ నవల హీరో, చివరకు ఆ టీచర్ ప్రేమ విజయం చెందటానికి సహాయం చేస్తాడు.........అతను చేసిన పనికి టీచర్ ఆశ్చర్యపోతుంది. ఎవరూ ఊహించని పని హీరో చేసి టీచర్ను ఆమె ప్రేమికుడితో కలుపుతాడు.

హీరో చేసిన ఆ పనేమిటి? ఎలా టీచర్ కు సహాయపడ్డాడు? ప్రేమను వ్యతిరేకించిన హీరో ఎందుకు ఆమె ప్రేమకు సహాయం చేశాడు?...ఈ నవల చదివి తెలుసుకోండి:

ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమకు సహాయం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

 ఈ నవలను డౌన్ లోడ్ చేసుకుని మీకు సమయం దొరికినప్పుడల్లా చదవుకోవాలనుకుంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి పూర్తి నవలను డౌన్ లోడ్ చేసుకోండి: 

https://drive.google.com/file/d/1hiLizvxBe9aPVxOprXm1d0TshTqyNweT/view?usp=sharing

***************************************************************************************************

1, ఫిబ్రవరి 2024, గురువారం

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల)

 

                                                                                   ప్రేమ వ్యవహారం!                                                                                                                                                                         (పూర్తి నవల)

పెద్ద నగరాలలో  పీ.జీ అని చెప్పబడే డబ్బులిచ్చి స్టే చేసే హాస్టల్స్ ఎక్కువ. ముఖ్యంగా మహిళలకు!

అక్కడ అన్ని వసతులూ ఉంటాయి. టెలివిషన్లు, ఇంటర్ నెట్, బ్రహ్మాండమైన భోజనం అంటూ దగ్గర దగ్గర స్టార్ హోటల్ విడిదిలాగానే. బాగా సంపాదిస్తారు కాబట్టి కొందరు నిర్లక్ష్యంగా నడుచుకుంటారు. ఇంకొందరు అక్కడ కూడా తమ స్వయం మర్యాదను వదిలిపెట్టకుండా ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పోటీ, ఈర్ష్య, సన్నిహిత స్నేహం అని అన్నీ ఉంటాయి. మన జీవితంలో ఒక క్రాస్ కట్ రూపంలాగా ఉంటుంది.

అలాంటి నవీన వసతులతో కూడిన ఒక హాస్టల్లో మాధవి అనే ఒకమ్మాయి కొత్తగా చేరుతుంది. చేరిన రోజు సాయంత్రమే మాధవి హాస్టల్ కు  కొంత దూరంలో  విశ్వం అనే యువకుడితో చాలా సన్నిహితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఆమె రూమ్ మేట్ రేఖా. ఎందుకంటే అతను ఒక మోసగాడు. ఇదివరకే  రేఖా స్నేహితురాలు మథులతను ప్రేమించి మొసం చేసుంటాడు. ఈ విషయం మాధవికి చెప్పి ఆమెను అలెర్ట్ చేద్దామనుకుని మాధవికి విశ్వం గురించి చెప్పాలనుకుంటుంది. కానీ, మాధవి చెప్ప నివ్వదు. కానీ రేఖా ఎలాగైనా విశ్వం గురించి చెప్పి తన రూమ్ మేట్ ను అతని మాయలోనుండి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ రేఖ ప్రయత్నాలు వృధా అవుతాయి. 

రేఖా చేసిన ప్రయత్నాలు ఏమిటి? అవెందుకు విజయం కాలేదు? మాధవి, విశ్వం ప్రేమ వ్యవహారం ఎటు పయనించింది? చివరికి ఏం జరిగింది?...మాధవి, విశ్వం దగ్గర నుండి తప్పించుకుందా, లేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఊహించలేని కథా అంశంతో మిమ్మల్ని అలరించే ఈ నవల చదవండి.

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకోండి: 

https://drive.google.com/file/d/1lRlt8y_iJmkCce5IJOqmS57cAIsqc3zT/view?usp=sharing

***********************************************************************************************

16, జనవరి 2024, మంగళవారం

ప్రేమ గుంట…(కథ)

 

                                                                                          ప్రేమ గుంట                                                                                                                                                                                       (కథ)

"ప్రేమ అనేది ఒక పెద్ద గుంట. ఇందులో పడి, లేచి రావటం చాలా కష్టమైన పని. ఈ ప్రేమ గుంటలో పడిన వారు దెబ్బలు తినకుండా జీవితం గడపలేరు. ఈ దెబ్బల వలన చాలా మంది ప్రేమికులు పెళ్ళికి ముందు గానీ, కొందరు పెళ్ళి తరువాత గానీ విడిపోతున్నారు.

కొంతమంది అదృష్ట జాతకులు ప్రేమలో పడిన కొద్ది రోజులలొనే  ప్రేమ అనేది ఒక పెద్ద గుంట అని అర్ధం చేసుకుని, ముందే ప్రేమ వ్యవాహారం నుండి తెలివిగా తప్పుకుంటారు.

ప్రేమ అనేది ఒక పెద్ద గుంట, దానిలో పడి కొట్టుమిట్టాడకండి అని ప్రకృతి ప్రతి ప్రేమ జంటకు, ఏదో ఒక రూపంలో తెలియపరుస్తుంది. దాన్ని అర్ధం చేసుకుని ప్రేమ నుండి తప్పించుకుని వచ్చే వారు అదృష్ట జాతకులే" ప్రవచనాలు వింటున్న మానస ఏదో నిర్ణయించుకున్న తరువాత, తన కళ్ళు తెరిపించటానికే ఈ ప్రవచన వేదికకు వచ్చినట్లు, ఇది భగవంతుడు తనకిచ్చిన ఒక సంధర్భం అని అర్ధంచేసుకుని, తన ప్రేమను వద్దనుకుంది.

మానస అలా అనుకోవాటానికి కారణం ఏమిటి? తన ప్రేమ వ్యవహారంలో ఏం జరిగిందని అలా ఒక నిర్ణయానికి వచ్చింది.?...తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ గుంట…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

18, అక్టోబర్ 2023, బుధవారం

ప్రేమ కలలు...(పూర్తి నవల)

 

                                                                                    ప్రేమ కలలు                                                                                                                                                                 (పూర్తి నవల) 

సుధీర్ అనే ఒక అనాధ, జీవితంలో విజయం సాధించటమే కాకుండా సమాజంలో విడిచిపెట్టబడ్డ మహిళలకు ఆదరణగా ఉంటాడు. అతను స్థాపించిన మహిళా హోమ్ లో జీవిస్తున్న మహిళలలో తన తల్లిని చూసుకునే అభిమానం కలిగినవాడు.

అంజలి అనే ఒక యువతి, తన తల్లిని మహిళా హోమ్ లో చేరుద్దామని వస్తుంది. తనకు ఉద్యోగం దొరికేంత వరకు తాను హోమ్ లో అమ్మతో ఉండటానికి అనుమతి అడుగుతుంది. మొదట అనుమతించని సుధీర్ తరువాత అంగీకరిస్తాడు.

కొన్ని రోజులలో సుధీర్-అంజలి ఒకరినొకరు ఇష్టపడతారు. కలలు కంటారు. ధైర్యం చేసి సుధీర్ ఒక రోజు తన ప్రేమను అంజలి దగ్గర చెబుతాడు. తన తల్లి 'మన ప్రేమను అంగీకరిస్తేనే తాను పెళ్ళికి ఒప్పుకుంటాను ' అని చెబుతుంది. కానీ అంజలి తల్లికి 'ప్రేమ '  అంటేనే  ఇష్టం లేదు. వాళ్ళిదరీ ప్రేమను అంగీకరించదు.

అంజలి అందరిలాగానే ఆశాప్రీతికి కట్టుబడినదే. కానీ ఆమె తల్లి యొక్క కథ మిక్కిలి అసాధారణమైనది. ప్రేమను విపరీతంగా ఎదురిస్తుంది. ప్రేమంటే ఆమెకు ఎందుకంత విరక్తి? ఆ విరక్తి మారిందా? అంజలి యొక్క నిజమైన ప్రేమ కల నెరవేరిందా? లేదు తన తల్లి కోసం అంజలి ప్రేమను త్యాగం చేసిందా? 

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ కలలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

4, అక్టోబర్ 2023, బుధవారం

ప్రేమ కలలు...(పూర్తి నవల)

 

                                                                                          ప్రేమ కలలు                                                                                                                                                                              (పూర్తి నవల)

సుధీర్ అనే ఒక అనాధ, జీవితంలో విజయం సాధించటమే కాకుండా సమాజంలో విడిచిపెట్టబడ్డ మహిళలకు ఆదరణగా ఉంటాడు. అతను స్థాపించిన మహిళా హోమ్ లో జీవిస్తున్న మహిళలలో తన తల్లిని చూసుకునే అభిమానం కలిగినవాడు.

అంజలి అనే ఒక యువతి, తన తల్లిని సుధీర్ నడుపుతున్నమహిళా హోమ్ లో చేరుద్దామని వస్తుంది. తనకు ఉద్యోగం దొరికేంత వరకు తానూ తన తల్లితో పాటూ హోమ్ లో ఉండటానికి అనుమతి అడుగుతుంది. మొదట అనుమతించని సుధీర్ తరువాత అంగీకరిస్తాడు.

కొన్ని రోజులలో సుధీర్-అంజలి ఒకరినొకరు ఇష్టపడతారు. కలలు కంటారు. ధైర్యం చేసి సుధీర్ ఒక రోజు తన ప్రేమను అంజలి దగ్గర చెబుతాడు. తన తల్లి 'మన ప్రేమను అంగీకరిస్తేనే తాను పెళ్ళికి ఒప్పుకుంటాను ' అని చెబుతుంది. 

 కానీ అంజలి తల్లికి  'ప్రేమ '  అంటేనే  గిట్టదు. అందువలన వాళ్ళిద్దరి ప్రేమను అంగీకరించదు.

అంజలి అందరిలాగానే ఆశాప్రీతికి కట్టుబడినదే. కానీ ఆమె తల్లి యొక్క ప్రేమ కథ మిక్కిలి అసాధారణమైనది. అందువలన ప్రేమను విపరీతంగా ఎదురిస్తుంది.

ప్రేమంటే అంజలి తల్లికి ఎందుకంత విరక్తి? ఆమె యొక్క అసాధారణమైన  ప్రేమ కథ ఏమిటి? అదెందుకు ప్రేమ మీద విరక్తిగా మారింది?  ప్రేమ మీద ఆమెకేర్పడిన ఆ విరక్తి పోయిందా? అంజలి యొక్క నిజమైన ప్రేమ కల నెరవేరిందా? లేదు తన తల్లి కోసం అంజలి ప్రేమను త్యాగం చేసిందా?.....ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ నవల చదవండి.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్,  ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.....వ్యత్యాసమైన ప్రేమ కథ మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది.    

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

ప్రేమ కలలు...(పూర్తి నవల)  @ కథా కాలక్షేపం-2.

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

https://drive.google.com/file/d/16GrllIYjGT9Wcw3i16CKAAPe2YEr0Y8S/view?usp=sharing

***************************************************************************************************

12, ఆగస్టు 2023, శనివారం

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల)


                                                                                ప్రేమ ఎంత కఠినమో!                                                                                                                                                         (పూర్తి నవల) 

ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” - అనేది ఒక మంచి మంత్రం.

ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎవరు వాడుకోవలొ తెలుసుకోవటమే కష్టం, కఠినం...కానీ తెలుసుకోగలిగితే మ్యూచువల్ బెనిఫిట్ అందుతుంది. అందుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ నవలలో ఈ మంత్రాన్ని ఒక సారి విని మోసపోయిన హీరోయిన్ లత, జీవితంలో ఇక ఈ మంత్రాన్నే వినకూడదని నిర్ణయించుకుంది. కానీ, తన జీవిత ప్రయాణంలో ఈ మంత్రం తనకే ఎంతో అవసరం ఉన్నదని గ్రహించింది. చివరికి ఆ మంత్రాన్ని చెప్పించుకోవటానికీ, చెప్పటానికీ ఏంత కష్టపడిందో, ఎంత కఠినమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందో ఈ నవల చదివి తెలుసుకోండి.

తపస్సు చేస్తున్న ఆ అమ్మవారి పాదాలను తన అలల పూవులతో సముద్ర తల్లి అభిషేకం చేస్తుంటే, ఆకాశ దేవత పౌర్ణమి వెన్నెలను చేతులలోకి తీసుకుని దీపారాజన చూపిస్తుంటే, చుట్టూ ఉన్న పూల చెట్లు తమ సుగంధ వాసనలను వెదజల్లుతుంటే, ఆ సాయంత్ర సమయం అమ్మవారి చిరునవ్వులో ఆ సముద్రతీరమే పుణ్యభూమిలాగా దర్శనమిచ్చింది.

గాంధీ పార్కు ఎదుట కొత్తగా డెవలప్ చేయబడ్డ కాలనీలోకి ప్రవేశించింది లత. నాలుగు సంవత్సరాల క్రితం అక్కడక్కడ చిన్న చిన్న పెంకుటిళ్ళు, గుడిసెలు మాత్రమే ఉన్న ఆ ప్రాంతం పలురెట్లు మారిపోయింది.

'ఈ ఇల్లే' అనే ఒక లెక్కతో 'గేటు’ను తెరిచింది లత. సిట్ ఔట్లొ కూర్చోనున్న కుమారి గేటు శబ్ధం విని తొంగి చూసింది. ఎవరో లోపలకు వస్తున్నది కనబడటంతో దీర్ఘంగా చూసింది. చిరు చీకట్లో వస్తున్నదెవరో గబుక్కున గుర్తుకు రాలేదు. కొద్ది క్షణాల తరువాత లోపలకు వస్తున్న మనిషి ఆకారం, తెలిసిన మనిషిలాగా అనిపించడంతో సందేహంతో......

"మీరు...?" అన్నది.

"ఏమిటి కుమారి! నన్ను మర్చిపోయావా?”

"నువ్వా లతా? నమ్మలేకపోతున్నాను" అన్నది ఉత్సాహంతో.

"నేనే నే" అని నవ్వింది లత.

అంతసేపు కట్ అయిన కరెంటు రావడంతో - కాంతివంతమైన వెలుతురులో కుమారి తన స్నేహితురాలుని బాగా చూడ గలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం చూసిన లతేనా ఈమె? ఈమె జీవితంతో విధి ఇలాగా ఆడుకోవాలి?     

రెండు జడలు, తుంటరి తనం, పరువాల వయసు, వర్ణించలేనంత అందం...ఆమె ఊరిలో ఆమెకు ఫ్యాన్స్ అషోషియేషనే ఉండేది. కానీ, ఇప్పుడు ఆకులు రాలిన, ఎండిపోయిన చెట్టులాగా ఉన్నది. నల్లబడి, బుగ్గలు లోపలకు పోయి, డ్రస్సు సెన్స్ లో పట్టులేక...చూసిన వెంటనే కుమారికి ఆమె పరిస్థితి అర్ధమయ్యింది--కాలం ఈమె గాయాలను గుణపరచ లేకపోయింది. మరచిపోనివ్వనూ లేదు అని!

ఈజీగా మర్చిపోయి, మనసును చల్లార్చుకోగలిగే నష్టమా ఆమెకు జరిగింది?

ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

28, జులై 2023, శుక్రవారం

ప్రేమ సుడిగుండం...(నవల)

 

                                                                                     ప్రేమ సుడిగుండం                                                                                                                                                                           (నవల)

'ప్రేమ' అనే రెండక్షరాల మాట చాలా ప్రమాదకరమైనది. అది సుడిగుండం లాంటిది. ప్రేమలో పడ్డవారు ఎవరైనా సరే ప్రేమ సృష్టించే సుడిగుండంలో చిక్కుకోక తప్పదు. ప్రేమ అనే సుడిగుండం లో చిక్కుకుని తప్పించుకున్న వారు చాలా తక్కువ మంది. ఈ నవలలో ప్రేమించుకున్న హీరో, హీరోయిన్లు హీరో తల్లికి ఎంతో ప్రీతిమంతులు, బంధువులు, కావలసిన వాళ్ళూ అయినా వాళ్ళు కూడా ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు. ఎందుకు ప్రేమ సుడిగుండంలో చిక్కుకున్నారు, ఆ ప్రేమ సుడిగుండం  నుండి ఎలా బయట పడ్డారు? వారి ప్రేమ సుడిగుండంలో వారిద్దరూ ఎదుర్కొన్న సమస్య ఏమిటో మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.  


కళ్ళు తెరిచిన వెంటనే కిరణ్ జ్ఞాపకాలే వచ్చినై ప్రతిమకు.

 ప్రతిమ కిటికీలో నుండి కనబడుతున్న మామిడి చెట్టును చూసింది. పదేళ్ళ కిరణ్ జారిపోతున్న నిక్కర్ను పైకి లాక్కుంటూ ఆ మామిడి చెట్టును ఎక్కుతున్నట్టు ప్రతిమ అంతరంగ కళ్ళకు కనబడింది...చిరునవ్వుతో లేచింది ప్రతిమ.

 

ఆ రోజు కిరణ్ జన్మ నక్షత్రం. క్రింద వంటింట్లో ప్రతిమ మేనత్త రామలక్ష్మి పాయసం రెడీ చేస్తోంది. అమెరికాలో మొదటి సంవత్సరం చదువు ముగించుకుని కిరణ్ ఇండియాకి తిరిగి వస్తున్నాడు. ఇంకో మూడు గంటలలో అతను వచ్చే విమానం హైదరాబాద్ నేలను తాకుతుంది. ఆ తరువాత మరో గంటలో అతని కారు ఆ ఇంటి పోర్టికోలోకి వచ్చి ఆగుతుంది.

 

వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? అమ్మతో అరగంట సేపు మాట్లాడి, హడావిడి పడుతూ మేడమీదకు వచ్చి ప్రతిమతో గొడవపడతాడు. ఆమెను ఏడిపించకపోతే అతనికి రోజులు గడవవు.

 

అమెరికా వెళ్ళే ముందు కూడా ఆమెను ఏడిపించాడు.

 

"వారానికి రెండు సార్లు ఫోన్ చెసి మాట్లాడు కిరణ్"

 

"ఎందుకమ్మా...ఫోనులో కూడా నీ సుత్తి వినాలనా? నీ దగ్గర నుండి తప్పించుకోవటానికే కదా సముద్రాలు దాటి దూరంగా వెడుతున్నాను. ‘నో...ఫోన్’, ‘నో...ఈమైల్’!"

 

"ఉత్తుత్తి మాటలు చెప్పకు. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు"

 

“ఇక్కడున్నప్పుడు వేరే నాధి లేక నీతో మాట్లాడి ఉండొచ్చు. కానీ, ఇకమీదట అలా జరగుతుందా? అయ్యగారు ఎక్కడికి వెడుతున్నారో తెలుసుగా? అమెరికా! నీకంటే స్మార్టుగా ఉండే అమ్మాయులు నా చుట్టూ తిరుగుతారు. వాళ్ళతో మాట్లాడటానికే సమయం చాలదట. అవన్నీ వదులుకుని పనిగట్టుకుని పాత మనిషితో ఫోన్ చేసి మాట్లాడాలా?"


ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:


ప్రేమ సుడిగుండం...(నవల) @ కథా కాలక్షేపం-2 


***************************************************************************************************