వ్యవహారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యవహారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఫిబ్రవరి 2024, గురువారం

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల)

 

                                                                                   ప్రేమ వ్యవహారం!                                                                                                                                                                         (పూర్తి నవల)

పెద్ద నగరాలలో  పీ.జీ అని చెప్పబడే డబ్బులిచ్చి స్టే చేసే హాస్టల్స్ ఎక్కువ. ముఖ్యంగా మహిళలకు!

అక్కడ అన్ని వసతులూ ఉంటాయి. టెలివిషన్లు, ఇంటర్ నెట్, బ్రహ్మాండమైన భోజనం అంటూ దగ్గర దగ్గర స్టార్ హోటల్ విడిదిలాగానే. బాగా సంపాదిస్తారు కాబట్టి కొందరు నిర్లక్ష్యంగా నడుచుకుంటారు. ఇంకొందరు అక్కడ కూడా తమ స్వయం మర్యాదను వదిలిపెట్టకుండా ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పోటీ, ఈర్ష్య, సన్నిహిత స్నేహం అని అన్నీ ఉంటాయి. మన జీవితంలో ఒక క్రాస్ కట్ రూపంలాగా ఉంటుంది.

అలాంటి నవీన వసతులతో కూడిన ఒక హాస్టల్లో మాధవి అనే ఒకమ్మాయి కొత్తగా చేరుతుంది. చేరిన రోజు సాయంత్రమే మాధవి హాస్టల్ కు  కొంత దూరంలో  విశ్వం అనే యువకుడితో చాలా సన్నిహితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఆమె రూమ్ మేట్ రేఖా. ఎందుకంటే అతను ఒక మోసగాడు. ఇదివరకే  రేఖా స్నేహితురాలు మథులతను ప్రేమించి మొసం చేసుంటాడు. ఈ విషయం మాధవికి చెప్పి ఆమెను అలెర్ట్ చేద్దామనుకుని మాధవికి విశ్వం గురించి చెప్పాలనుకుంటుంది. కానీ, మాధవి చెప్ప నివ్వదు. కానీ రేఖా ఎలాగైనా విశ్వం గురించి చెప్పి తన రూమ్ మేట్ ను అతని మాయలోనుండి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ రేఖ ప్రయత్నాలు వృధా అవుతాయి. 

రేఖా చేసిన ప్రయత్నాలు ఏమిటి? అవెందుకు విజయం కాలేదు? మాధవి, విశ్వం ప్రేమ వ్యవహారం ఎటు పయనించింది? చివరికి ఏం జరిగింది?...మాధవి, విశ్వం దగ్గర నుండి తప్పించుకుందా, లేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఊహించలేని కథా అంశంతో మిమ్మల్ని అలరించే ఈ నవల చదవండి.

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకోండి: 

https://drive.google.com/file/d/1lRlt8y_iJmkCce5IJOqmS57cAIsqc3zT/view?usp=sharing

***********************************************************************************************

11, జనవరి 2023, బుధవారం

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల)

 

                                                                                ప్రేమ వ్యవహారం!                                                                                                                                                             (పూర్తి నవల)

పెద్ద నగరాలలో  పీ.జీ అని చెప్పబడే డబ్బులిచ్చి స్టే చేసే హాస్టల్స్ ఎక్కువ. ముఖ్యంగా మహిళలకు!

అక్కడ అన్ని వసతులూ ఉంటాయి. టెలివిషన్లు, ఇంటర్ నెట్, బ్రహ్మాండమైన భోజనం అంటూ దగ్గర దగ్గర స్టార్ హోటల్ విడిదిలాగానే. బాగా సంపాదిస్తారు కాబట్టి కొందరు నిర్లక్ష్యంగా నడుచుకుంటారు. ఇంకొందరు అక్కడ కూడా తమ స్వయం మర్యాదను వదిలిపెట్టకుండా ఉంటారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. పోటీ, ఈర్ష్య, సన్నిహిత స్నేహం అని అన్నీ ఉంటాయి. మన జీవితంలో ఒక క్రాస్ కట్ రూపంలాగా ఉంటుంది.

అలాంటి నవీన వసతులతో కూడిన ఒక హాస్టల్లో మాధవి అనే ఒకమ్మాయి కొత్తగా చేరుతుంది. చేరిన రోజు సాయంత్రమే మాధవి హాస్టల్ కు  కొంత దూరంలో  విశ్వం అనే యువకుడితో చాలా సన్నిహితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఆమె రూమ్ మేట్ రేఖా. ఎందుకంటే అతను ఒక మోసగాడు. ఇదివరకే  రేఖా స్నేహితురాలు మథులతను ప్రేమించి మొసం చేసుంటాడు. ఈ విషయం మాధవికి చెప్పి ఆమెను అలెర్ట్ చేద్దామనుకుని మాధవికి విశ్వం గురించి చెప్పాలనుకుంటుంది. కానీ, మాధవి చెప్ప నివ్వదు. కానీ రేఖా ఎలాగైనా విశ్వం గురించి చెప్పి తన రూమ్ మేట్ ను అతని మాయలోనుండి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ రేఖ ప్రయత్నాలు వృధా అవుతాయి.

రేఖా చేసిన ప్రయత్నాలు ఏమిటి? అవెందుకు విజయం కాలేదు? మాధవి, విశ్వం ప్రేమ వ్యవహారం ఎటు పయనించింది? చివరికి ఏం జరిగింది?...మాధవి, విశ్వం దగ్గర నుండి తప్పించుకుందా, లేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఊహించలేని కథా అంశంతో మిమ్మల్ని అలరించే ఈ నవల చదవండి.

ఎంతైంది?” -- ఆటోలో నుండి దిగిన గిరిధర్ అడిగాడు.

మీటరు నూట ఎనభై రూపాయలు చూపిస్తోంది సార్. దానికిపైన ఇంకో ఇరవై ఇచ్చి పుణ్యం కట్టుకోండి సార్!

నూట ఎనభయ్యే ఎక్కువ. దానికిపైన ఇంకో ఇరవై అడుగుతున్నావా?” అంటూ కరెక్టుగా లెక్కపెట్టి చిల్లరగా ఇచ్చాడు.

అన్నయ్యా, ఇక్కడ కూడా గొడవేనా?”

విసుక్కుంది అతని చెల్లెలు మాధవి.

ఎవరి దగ్గరా మోసపోకూడదమ్మా...

సరి, సరి...త్వరగా డబ్బులిచ్చేసి రా!

అయిందమ్మా--అంటూ తిరిగాడు.

సూట్ కేసు తీసుకుంటూ ఎన్నో మేడకు వెళ్ళాలి?” అని అడిగాడు.

మొదట రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత డబ్బులు కట్టాలి! అంటూ ఇంకో సంచీ తీసుకుంది మాధవి.

ఇద్దరూ లోపలకు వెళ్ళారు.

ఆఫీసు గదిలో ఒక మధ్య వయస్కురాలు కూర్చోనుంది. పేపర్ చదువుతోంది. వీళ్ళను చూసిన వెంటనే పేపర్ను పక్కన పెట్టి, లేచి నిలబడి ఎవరు మీరు...మీకు ఏం కావాలి?” అని సాగదీసింది.

నమస్తే నండి...నా పేరు మాధవి!

గబుక్కున ఆమె మొహం విప్పారింది. అరెరే...రామ్మా అన్నది.

సూట్ కేసు, సంచీ పక్కగా పెట్టు అని చెప్పినావిడ గిరిధర్ ను చూసి ఈయన ఎవరు...మీ అన్నయ్యా?” అని అడిగింది.

అవునండి...మా అన్నాయ్యే!

సరే కూర్చోమ్మా...మీరూ కూర్చోండి సార్

ఇద్దరూ కుర్చీలలో కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తిరగేస్తూ ఆ అమ్మాయి నీ రూము 203” అన్నది.

చాలా థ్యాంక్స్ అండీ...దాని తాళం చెవులు...?”

అదంతా అవసరం లేదమ్మా! అన్ని గదులూ ఎప్పుడూ తెరిచే ఉంటాయి

గిరిధర్ ఆశ్చర్యపోతూ ఏమిటండీ అలా చెబుతున్నారు?” అన్నాడు.

....................”

తాళమూ - తాళం చెవి ఏదీ లేదా?”

అవన్నీ ఉన్నాయండి. కానీ, వాటి అవసరం ఉండదని చెబుతున్నా అని నవ్విన ఆవిడ ఇక్కడ బద్రత చాలా పక్కాగా ఉంటుంది. గదిలో ఉన్న అమ్మాయలు ఆఫీసులకు వెళ్ళేటప్పుడు గదికి తాళం వేసే అవసరం ఉండదు”---అన్నది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

11, మార్చి 2022, శుక్రవారం

ప్రేమ వ్యవహారం!...(సీరియల్)...PART-10

 

                                                                           ప్రేమ వ్యవహారం!...(సీరియల్)                                                                                                                                                                 PART-10

ఏమిటండీ అలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నారా? నిజంగానే చెబుతున్నా అంటూ నవ్వింది మథులత. కొన్ని సంవత్సరాల ముందు నేనూ, విశ్వం లోతుగా ప్రేమించుకున్నాం

మాధవి ఆమెనే గందరగోళంతో చూస్తూ ఉండిపోగా అలాగా అని ఒక మాట ఆడిగారనుకోండి నేను నా మాటలను కంటిన్యూ చేస్తాను  అన్నది.

ఇది...

మీకు ఇది అనవసరం. అనవసరమైన పని అనదలుచుకున్నారు. కరెక్టేనా?”

అవును. మీ పని చూసుకుని వెళ్ళండి. ఇది మా పర్సనల్ విషయం. సగం సగం మాటలు విని మీ ఇష్టమొచ్చినట్టు వాగకండి!

ఇలా చెప్పే కదా రేఖాని తరిమేరు? ఒక చేంజ్ కోసం...నా దగ్గరైనా ఓపిగా మాట్లాడొచ్చు కదా? ఎందుకంత అర్జెంటు?”

రేఖాని మీకు...

బాగా తెలుసు. ఆమె నా ప్రాణ స్నేహితురాలు

నేను రేఖాని అవమానపరిచిన విషయం మీకెలా తెలుసు?”

ఆమే నా దగ్గర చెప్పింది అంటూ కంటి అద్దాలు తీసి చేతిలో పెట్టుకున్నది మథులత. మీ ప్రేమ విషయం పూర్తిగా నాకు తెలుసు. మిమ్మల్నీ, విశ్వం ను వేరు చేయాలనే రేఖా నా దగ్గరకు వచ్చింది

“……………….”

దానికి కారణం మీరనుకుంటున్నది కాదు. రేఖా అనుకునేదినూ కాదు. కానీ, నిజంగానే మీ మీద ఆమెకున్న అక్కర కోసం అలా నడుచుకుంది. అది మీరెప్పుడూ అర్ధం  చేసుకోలేదు. ఆమెను గౌరవించలేదు  

“………………...”

మిమ్మల్ని విశ్వం దగ్గర నుండి వేరు చేయటానికి రేఖా నా దగ్గరకు ఎందుకు వచ్చుంటుంది అని ఆలొచిస్తే...మీకు అంతా అర్ధమవుతుంది. విశ్వం నా మాజీ ప్రేమికుడు. అది రేఖాకు  తెలుసు

“………………...”

కానీ రేఖా అనుకున్నట్టు విశ్వం నిజంగా చెడ్డవాడు కాదు.  నన్ను మోసం చేసి నీ దగ్గరకు  రాలేదు. నేనే అతన్నీ, మిగిలిన వాళ్ళందరినీ మోసం చూసేను. నేను ఆ వయసులో పొగరెక్కి తిరిగాను. మంచి మగాడిని నీచమైన అపవాదుతో తరిమి కొట్టాను. ఆ తరువాత అతని దగ్గరకు వెళ్ళటానికి మనసు రాలేదు. ఒక వేల నేను తిరిగి వెళ్ళున్నా విశ్వం నన్ను చేర్చుకునే వాడు. ఎందుకంటే అతను అంత మంచివాడు, అంతకంటే అమాయకుడు. కానీ, నా పొగరు నన్ను అనుమతించలేదు. ఈ విషయాన్ని మనసులోనూ దాచుకోలేకపోయాను...స్నేహితుల దగ్గర చెప్పటానికి మనసు ఒప్పుకోలేదు...విషం తాగి నాటకం ఆడాను...నేను విషం తాగటానికి ఏమిటి కారణం అని ఎందరు అడిగినా పర్సనల్ సమస్యలు అని చెప్పాను. కానీ, నా ప్రాణ స్నేహితురాలు రేఖా గుచ్చి గుచ్చి అడగటంతో... విశ్వం నన్ను వాడుకుని వదిలేశాడు అని అబద్దం చెప్పను.  పిచ్చిది, నేను చెప్పింది నిజం అనుకుంది 

“…………………”

అందువల్ల, విశ్వం ఒక మోసగాడు అనే ఆలొచనే రేఖా మనసులో స్థిరపడింది. అందుకనే మిమ్మల్ని అతనితో చూసిన వెంటనే షాక్ అయ్యింది 

దాని గురించి ఆమె మీతో మాట్లాడటానికి ప్రయత్నించింది. మీరు వినే లోకంలో లేరు. నన్ను వెతికి పట్టుకుని మీతో మాట్లాడి మిమ్మల్ని ఆ మోసగాడి దగ్గర నుండి కాపాడమని అడిగింది...లేదు లేదు ప్రాధేయపడింది

ఈ విషయంలో విశ్వం ఏ తప్పూ చేయలేదు. అయినా కానీ ఎందుకో అతని మీద నాకు కోపం తగ్గలేదు. ఇదిగో ఈ క్షణం కూడా చికాకు వేస్తోంది. అది ఎందుకని నాకే తెలియటం లేదు

అందువలన ప్రారంభంలో విశ్వం గురించి తప్పుగా చెప్పి మీ ప్రేమను చెడపాలనే అనిపించింది. ఆ తరువాత నిదానంగా ఆలొచించి ఆ ఆలొచనను మార్చుకున్నాను. రేఖా దగ్గర ఇంకేదో సమాధనం చెప్పాను 

ఆ తరువాత నేను ఆమెను చూడలేదు. మీ ప్రేమ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ రోజు రైలు పెట్టెలోకి ఎక్కుతున్నప్పుడు కిటికీకి దగ్గరగా నిలబడున్న విశ్వం ను చూశాను. అప్పుడు నాకు ప్రేమ, గీమా జ్ఞాపకం రాలేదు. ఫడేలు మని చెంపమీద ఒకటిద్దామని అనిపించింది

మీ దగ్గర అతను ప్రాధేయ పడుతూ ఉండటం చూడంగానే...'ఏమిటి విషయం?' అనే ఒక ఆత్రుత. అందుకే చివరగా కూర్చుని, మీరు మాట్లాడుతున్నది విన్నాను. క్షమించండి"

మీరు చెప్పేదంతా నిజమా?”

వంద శాతం నిజంఅన్న మథులత అనుమానంగా ఉంటే మా ఆఫీసుకు ఒక రోజు రండి. మేము ఇద్దరం జోడిగా కలిసి తీయుంచుకున్న ఫోటోలను ఆల్బంగా పెట్టుకున్నాను

అయితే మీరెందుకు, ఐ మీన్ మీరూ -- విశ్వం విడిపోయరు?”

అది తెలిస్తే నేనెందుకండీ ఇలా ఉంటాను?”---విరక్తిగా నవ్వుతూ "అదేంటో ఒకసారి నా మనసు అతను వద్దని చెప్పింది...వదిలేసేను. ఆ తరువాత చాలాసార్లు నా మనసు నన్ను తిట్టింది. దానిని ఆలొచించి వేదన పడ్డాను. కొన్ని సార్లు గర్వ పడ్డాను

మాధవి ఆశ్చర్యంతో చూసింది.

మాధవి చూపులను అర్ధం చేసుకున్న దానిలాగా నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించకండి మాధవి. అది చాలా కష్టం. ఎందుకంటే నన్ను నేనే అర్ధం చేసుకోలేకపోతున్నాను అన్న మథులత  తరువాత ఇంకొక ప్రశ్న అడగాలే...నేను ఇప్పుడు ఎందుకు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నానో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది... కదా?”

"అవును!"

"విశ్వం పైన నాకు విరక్తి ఉన్నది నిజమే. అందువలన వాడు బాగుండ కూడదూ అని అనుకోను. ఒకవేల అనుకున్నా, దాన్ని మనసులోనే పెట్టుకుంటాను, బహిరంగంగా ఒక విల్లీ లాగా బయటకు చూపించుకోను" 

“………………..”

ఇంకో వైపు, ఇందులో నా స్నేహితురాలు రేఖా యొక్క ప్రశాంతత ఉంది. ఆమెను మీరు అనుమానిస్తున్నది ఆమె ఖచ్చితంగా తట్టుకోలేదు. ఆమె చాలా మంచిది. ఆమెకున్న ఒకే ఒక బలహీనత అవతల వారి సమస్యల్లో గబుక్కున తలదూర్చి ముక్కు పగులకొట్టుకుంటుంది

“………………”

అందువలన, ఇప్పుడు మీరు విశ్వం ను ఫోనులో పిలుస్తారో లేదో... రేఖాని పిలిచి మాట్లాడండి రేఖా నువ్వేమీ తప్పు చేయలేదని తెలుసుకున్నాను అని చెప్పండీ, అది చాలు. సంతోషంగా ఇంకెవరికైనా సహాయం చేయటానికి రెడీ అవుతుంది

మాధవి తీవ్రంగా ఆలొచించింది. ఈమెను నమ్మనా, వద్దా?’

మథులత కొంచం సేపు అక్కడ కూర్చుంది. తరువాత ఏమీ మాట్లాడకుండా తన పెట్టెకు వెళ్ళిపోయింది.

కొద్ది నిమిషాల తరువాత, సెల్ ఫోన్ తీసి నెంబర్లు నొక్కింది మాధవి.

"రేఖా...ఒక చిన్న సహాయం కావాలే!"

"ఏ...ఏమిటది మాధవి?"

ఏదో వేగంలో విశ్వం ను నేను వద్దన్నాను...అతన్ని కొంచం పంపిస్తావా?” 

ఖచ్చితంగా...కానీ...

థాంక్యూ! నీ మీద నాకు ఏ కోపమూ లేదు రేఖా " అని చెప్పి ఫోను పెట్టేసింది మాధవి. ఆ క్షణం నుంచి విశ్వం ఫోను కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది మాధవి!

***********************************************సమాప్తం*******************************************