మినీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మినీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2023, శుక్రవారం

"మినీ టైటాన్" జలాంతర్గామి ఏమైంది?...(న్యూస్)

 

                                                                       "మినీ టైటాన్" జలాంతర్గామి ఏమైంది?                                                                                                                                                         (న్యూస్)

అట్లాంటిక్మహా సముద్రంలో 111 ఏళ్ల కిందట మునిగిన టైటానిక్నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన మినీ జలాంతర్గామి ఆచూకీ గల్లంతైంది. ఇందులో గల్లంతైన సబ్-మెరైన్లో పాకిస్థాన్బిలియనీర్షెహజాదా దావూద్‌ (48), ఆయన కుమారుడు సులేమాన్‌ (19), యూఏఈలో నివాసం ఉండే బ్రిటిష్వ్యాపారవేత్త హమీష్హార్డింగ్, ఓషన్గేట్వ్యవస్థాపకుడు స్టాక్టన్రష్, ఫ్రెంచ్మాజీ నేవీ అధికారి పాల్హెన్రీ ఉన్నారు. జలాంతర్గామిని వెతకడానికి అమెరికా, కెనడా రక్షణ బృందాలు రంగంలోకి దిగాయి.

ఓషన్గేట్అనే సంస్థ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రల టైటానిక్శకలాల సందర్శన కూడా ఒక భాగమే. దీనికోసం 22 అడుగుల పొడవైన మినీ జలాంతర్గామిని ఉపయోగించారు. దాని పేరు టైటాన్‌. ఇది కార్బన్ఫైబర్తోని తయారైంది. న్యూఫౌండ్లాండ్నుంచి తాజా యాత్ర మొదలైంది. 400 నాటికల్మైళ్ల దూరంలోని టైటానిక్శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. ఆదివారం 6 గంటల సమయంలో న్యూ ఫౌండ్ల్యాండ్లోని సెయింట్జాన్స్కు దక్షిణ దిశవైపు 700 కిలోమీటర్ల దూరంలో టైటాన్సముద్రంలోకి వెళ్ళింది. గంటా 45 నిమిషాల్లోనే జలాంతర్గామితో సంబంధాలు తెగిపోయాయి. దీంతో టైటాన్ఆచూకీ కనుగొనేందుకు అమెరికా, కెనడా కోస్ట్గార్డ్బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 22 అడుగుల పొడవున్న సబ్ మెరైన్ ఆచూకీ కోసం రెండు దేశాలకు చెందిన కోస్ట్ గార్డు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 వేల అడుగుల లోతులో మినీ జలాంతర్గామి ప్రయాణించిందని అంటున్నారు.

గురువారం ఉదయానికి టైటాన్లోని ఆక్సిజన్నిల్వలు అడుగంటిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, కెనడా కోస్ట్గార్డ్ దళాలు టైమ్ తో పోటీ పడుతూ రెస్క్యూ నిర్వహిస్తున్నాయి. ఆపరేషన్లో అమెరికా కోస్ట్గార్డులు, కెనడా సైనిక విమానాలు, ఫ్రాన్స్ నౌకలు, టెలీగైడెడ్ రోబోలు పాల్గొన్నాయి.

గాలింపు చర్యలు చేపడుతున్న కెనడాకు చెందిన పీ-8 నిఘా విమానం.. సోనార్ ద్వారా నీటి అడుగు నుంచి వస్తున్న శబ్దాలను గుర్తించింది. ప్రతి 30 నిమిషాలకు ఓసారి వినిపిస్తున్నాయని, ఇవి జలాంతర్గామి నుంచే వస్తున్నాయని చెబుతున్నారు. సమాచారాన్ని అమెరికా నేవీకి అందజేయడంతో డేటా ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని నౌకలను, నీటి అడుగున గాలింపు చర్యలు చేపట్టే సామాగ్రిని రంగంలో దించుతున్నారు. బ్లో నాలుగు రోజులకు రిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది. టైటాన్ బ్మెర్సిబుల్ సుమారు 10,432 కిలోల రువు ఉంటుంది. 6.7 మీటర్ల పొడుగు ఉంటుంది. 96 గంట పాటు దాంట్లో అయిదుగురు ఉండచ్చు. బ్లో 8 రోజుల ర్యకు రెండున్న క్ష డాలర్లు, అంటే సుమారు ₹ 2,05,22,625 సూల్ చేస్తుంటారు.

1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. యాత్రలో భాగంగా దాదాపు 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు.

NB: 'మినీ టైటాన్​​'​ సబ్​మెరైన్​ కథ విషాదాంతం.. ఐదుగురు పర్యటకులు మరణించినట్లు ప్రకటన

టైటానిక్ నౌక శకలాలను చూడడానికి వెళ్లిన పర్యాటక సబ్​మెరైన్​ కథ విషాదాంతమైంది. సముద్రగర్భంలో ఒత్తిడి పెరగడం వల్ల ఆ జలంతర్గామి పేలిపోయిందని అమెరికా కోస్ట్​గార్డ్​ ప్రకటించింది.

Images Credit: To those who took the original photos.

***************************************************************************************************

1, మార్చి 2023, బుధవారం

అభిమాన దారి/కాలం మార్పు/ఆటంబాంబు…(3 మినీ కథలు)

 

                                                                    అభిమాన దారి/కాలం మార్పు/ఆటంబాంబు                                                                                                                                                   (3 మినీ కథలు)

అభిమాన దారి...(మినీ కథ)

"వసుంధరా! కాఫీనా ఇది. వేడి పెట్టిన కుడితి నీళ్ళు లాగా ఉందే? నువ్వు కాఫీ పెడితే అమృతం లాగా ఉంటుంది. నీకు ఇలాంటి ఒక కోడలా? కాఫీ కూడా సరిగ్గా పెట్టటం తెలియని కోడలు వచ్చి చేరిందే నీకు?” భారతీ చటుక్కున చెప్పింది. 

కాలం మార్పు...(మినీ కథ)

“మీరు నన్ను ‘మోటివేట్’ చెయ్యటానికి ఏమిటేమిటో చెబుతారు. కానీ, మీరు  చెప్పేది నాకు బోరు కొడుతోంది నాన్నా. కానీ, నా ఫ్రెండు అజీమ్ వాట్స్ ఆప్ లో ఫార్వోర్డ్ చేసిన వాయిస్ మెసేజీలో, ఒక ప్రొఫసర్ మాట్లాడిన స్పీచ్ ఉంది. జస్ట్ పది నిమిషాలే మాట్లాడారు. వినేటప్పుడే నా శరీరంలో ఒక వేగం. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఒక పట్టుదల ఏర్పడింది నాన్నా. ఇక నా ఆలొచనా, చేష్టా పూర్తిగా నా లక్ష్యాన్ని నెరవేర్చేదిగా ఉంటుంది నాన్నా...” అన్నాడు కొడుకు.

ఆటంబాంబు...(మినీ కథ) 

“అత్తయ్యా! ఒక రెండు నిమిషాలు కదలకుండా పడుకోండి. ఎంతసేపు నేను పోరాడను?” కోడలు గిరిజా ఘాటుగా జవాబు చెప్పింది.

“చాలే రాక్షసీ! నేనే చూసుకుంటాను. నాకు సహాయ పడతానని చెప్పి నువ్వుగా వచ్చి, నన్ను బాధపెడుతున్నావే. నన్ను బాధపడనివ్వకే. నీకు పుణ్యం వస్తుంది” అన్నది అత్త. 

ఈ 3 మినీ కథలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అభిమాన దారి/కాలం మార్పు/ఆటంబాంబు…(3 మినీ కథలు)

***************************************************************************************************

24, సెప్టెంబర్ 2022, శనివారం

ఐడియా/మీకొసమే/మార్పు...(3 మినీ కథలు)

 

                                                                                    ఐడియా/మీకొసమే/మార్పు                                                                                                                                                                 (3 మినీ కథలు)

1) ఐడియా…(మినీ కథ)

“సుమిత్రా! ఎందుకే శోకంగా ఉన్నావు” అన్నది ఎదిరింటి జయంతి.

“అంతా మా అతగారి ట్రబుల్సే” అంటూ కళ్ళు నలుపుకుంది.

“ఏమిటే అయ్యింది...నీకు పెళ్ళి జరిగి ఇంకా ఆరునెలలు కూడా అవలేదే" అన్నది.

2) మీకొసమే…(మినీ కథ)

“రామ్మా! రోజా, అల్లుడుగారు రాలేదా! నువొక్కదానివే వచ్చావు...? ఎర్రగా ఉన్న కళ్ళను చూస్తే రాత్రంతా నిద్రపోయినట్లు లేదు...మొహంలో నవ్వులేదు. ఏదో ప్రాబ్లం...సరే, లోపలికి రా!”

తన చెల్లెని ప్రేమగా లోపలకు పిలిచాడు రాఘవ్.

3) మార్పు...( మినీ కథ)

మాధవ్ కు పెళ్ళి అంటే ఇష్టం లేదు.

తల్లి లక్ష్మి ఒత్తిడి వలన గాయిత్రీని పెళ్ళి చేసుకున్నాడు.

తాళి కట్టటంతో సరి!

పెళ్ళి అయ్యి ఆరు నెలలైనా ‘మంచి కబురు’ లేకపోవటం మాధవ్ తల్లి లక్ష్మిని బాధకు గురిచేసింది.

ఈ కథలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఐడియా/మీకొసమే/మార్పు...(3 మినీ కథలు) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************