మిస్టరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మిస్టరి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఆగస్టు 2021, ఆదివారం

శాశ్వత మెరుపులు....(ఆసక్తి & మిస్టరీ)R

 

                                                                                   శాశ్వత మెరుపులు                                                                                                                                                                     (ఆసక్తి & మిస్టరీ)

శాశ్వత మెరుపులు: వెనిజులా దేశంలోలోని కాటటుంబో నది ప్రాంతంలో జరుగుతున్న  ప్రత్యేకమైన దృగ్విషయం ఇది. ఇలా వేలాది సంవత్సరాలుగా దాదాపు రోజు విడిచి రోజు రాత్రిపూట మెరుపుల తుఫాన, రోజుకు కనీసం 10 గంటలు సేపు ఉంటుందట. కొన్ని సమయాలలో సంవత్సరం అంతా కూడా ఉంటుంది.

వెనిజులా దేశంలో వున్న ఒక ప్రాంతం ఒక వింతైన, ఉగ్రమైన తుఫానుకు నిలయం. రాత్రి ఆకాశంలో కాంతి వంపుల యొక్క మరొక అద్భుతమైన పేలుడు, దిగువ కాటటుంబో నదిని నాటకీయంగా ప్రకాశింపచేస్తుంది.

ఇది వాయువ్య వెనిజులా యొక్క ఒక మూలలో ఉన్నది. దీనిని 'రెలాంపాగో డెల్ కాటటంబో' (నిత్య తుఫాను) అని పిలుస్తారు. ప్రత్యేకమైన ఈ వాతావరణ దృగ్విషయం సంవత్సరానికి 1.2 మిల్లియన్ల మెరుపు దాడులను ఉత్పత్తి చేస్తుంది. ఈ మెరుపులు దాదాపు 250 మైళ్ళ దూరం నుండి కనిపపిస్తాయి.

నిత్య తుఫాను మేఘాలు ప్రతిసారి ఒకే చోట, మారకైబో సరస్సు పైన ఐదు మైళ్ళ ఎత్తులో  సంవత్సరానికి కనీసం 160 రాత్రులు గుమికూడి రోజుకు 10 గంటలసేపు మేరుపుల కళను ప్రదర్సిస్తుంది.

నిరంతర తుఫానులను వివరించడానికి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అత్యధిక వేగమైన గాలులు సరస్సు మీదగా వీస్తూ మేఘాలను తోసుకువెళ్ళి ఆండియన్ పర్వతాలను ఢీ కొనడం వలన అక్కడ మేఘాలు గుముకూడుతాయి. మరికొందరు, అక్కడున్న చిత్తడి బురద నేల వలన మీథేన్ వాయువు విడుదల అవుతుంది. వాయువే మేఘాలు గుమికూడటానికి కారణం అంటున్నారు.

ఎలా చూసినా ఇది వెనిజులా ప్రజలకు గర్వించదగిన చిహ్నంగా మారింది. లోప్ డి వేగా రాసిన 'లా డ్రాగోంటియా' అనే పురాణ కవితలో మెరుపుల ప్రదర్సన గురించి ప్రస్తావించబడింది. ఇంకొకటి,  1595 లో మారకైబో నగరంపై ఫ్రాన్సిస్ డ్రేక్ ప్రయత్నించిన దాడి మెరుపుల వలన ఆగిపోయింది. అలా మెరుపులు వెనుజూలా దేశానికి సహాయపడ్డాయి.

మెరుపుల తుఫాను స్థానిక మత్స్యకారులకు సహజ లైట్ హౌస్ గా పనిచేస్తుంది, వారు ఎటువంటి సమస్య లేకుండా రాత్రి సమయంలో నావిగేట్ చేయగలరు.

కొన్ని సందర్భాల్లో దృగ్విషయం కొన్ని వారాలకు ఆగిపోయింది. ఇటీవల 2010 లో అలా జరిగింది. ఇది తీవ్ర కరువు ఫలితంగా ఉంటుందని స్థానికులు ఆందోళన చెందారు, జలవిద్యుత్పై ఎక్కువగా ఆధారపడే దేశంలో అది విద్యుత్ కొరతకు దారితీసింది

కానీ ఐదు వారాల నిశ్శబ్దం తరువాత కాకోఫోనీ (మెరుపుల తుఫాను) తిరిగి ప్రారంభమైంది.

1906 లో కొలంబియా మరియు ఈక్వెడార్ తీరంలో భారీ భూకంపం సంభవించిన తరువాత సునామీ సంభవించింది. అప్పుడు కూడా దృగ్విషయం కొన్ని వారాలకు ఆగిపోయింది.

కొంతమంది శాస్త్రవేత్తలు నిత్య తుఫాను కారణం భూగ్రహం పైన ట్రోపోస్పిరిక్ (Tropospheric) ఓజోన్ యొక్క అతిపెద్ద జనరేటర్ గా భావిస్తారు.

తుఫాను నిమిషానికి సగటున 28 మెరుపులను ఉత్పత్తి చేస్తుంది. అలా వదలకుండా కనీసం 10 గంటల వరకు ఉత్పత్తి చేస్తుంది. కొన్నిసార్లు గంటకు 3,600 మెరుపులను విడుదల చేస్తుంది. కొన్ని సమయాలలో అత్యంత ఉగ్రంగా రోజుకు 40,000 మెరుపులను ఉత్పత్తి చేస్తుంది

Images Credit: To those who took the original photos.

***********************************************************************************************

13, జులై 2021, మంగళవారం

అలలు ఏర్పరచిన రహదారి: రోజుకు రెండుసార్లు, కేవలం ఒక గంట మాత్రమే తెరుచుకుంటుంది...(మిస్టరీ)R

 

                అలలు ఏర్పరచిన రహదారి: రోజుకు రెండుసార్లు, కేవలం ఒక గంట మాత్రమే తెరుచుకుంటుంది                                                                                                            (మిస్టరీ)

ఫ్రాన్స్ దేశంలో నాయర్మౌటియర్ అనే ద్వీపానికీ, వాండీ అనే నగరానికీ మధ్యవున్న రెండు సముద్ర తీరాలనూ కలుపుతూ సముద్రపు అలలు ఏర్పరచిన రహదారే 'పాసేజ్ డు గాయ్స్ అనే రహదారి.

పూర్వం ఇటు నుండి అటు వెళ్ళటానికి పడవ మాత్రమే అధారం. కానీ 18 శతాబ్ధంలో ఒక రోజు సముద్రం విడిపోయి రెండు ఊర్లకూ ఒక రహదారి ఏర్పరచింది. అలా ఎందుకు ఏర్పడిందో తెలియని ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా, క్రమేపీ రహదారిని వాడుకునే వారు. కానీ రెండుగా విడిపోయిన నీరు, ఒక గంట తరువాత రహదారిని మూసేస్తూ కలిసిపోయేది. అలా రోజుకు రెండుసార్లు మాత్రమే ఒక గంటో లేక రెండు గంటలో దారి వదిలేది. విషయం తెలియక అప్పట్లో చాలామంది ప్రజలు రహదారి గుండా వెళుతుంటే, ఆకస్మికంగా సముద్రపు అలలు ఒకటైపోయి, దారిని మూసేసేవి. అదే సమయాన రహదారిలో వెళుతున్న ప్రజలు అలలలో కొట్టుకుపోయేవారు.

నాగరికత పెరుగుతున్నకొద్దీ రహదారి ఏర్పడటం, మూసుకుపోవడంతో పాటూ అది ఎంత సమయంలో జరుగుతోంది అనేది కూడా లెక్కలు కట్టి, ప్రమాదం లేని సమయాలలో మాత్రమే రహదారి వాడేవారు. ఒక్కోసారి వారి లెక్కలు తప్పి మనుష్యులు కొట్టుకెళ్ళటం జరిగేది

ఇలా సముద్రంలో రహదారి ఏర్పడుతోందని 1701 లో మొదటిసారిగా చిత్రపటాలలో చూపించారు. 1840 లో శాస్త్రవేత్తల లెక్కలతో ప్రభుత్వం అక్కడ తారుతో రహదారి ఏర్పరిచింది. కానీ రహదారి మూసుకుపోవటాన్నీ, రోజుకు రెండుసార్లు మాత్రమే రహదారి తెరుచుకోవటాన్ని మాత్రం వారు ఆపలేకపోయారు. అందువలన 1971లో రహదారికి కొన్ని మైళ్ళ దూరంలో వంతెన నిర్మించారు. కానీ ప్రజలు అలలు ఏర్పరచిన రహదారినే ఉపయోగిస్తూ వచ్చారు.

ప్రపంచంలోని మరికొన్ని ప్రదేశాలలో ఇలాంటి రహదారులున్నా, రహదారి మాత్రం ప్రాముఖ్యత తెచ్చుకుంది. కారణం, దీని పొడవు--రెండు ఊర్లకూ మధ్య 4.5 కిలోమీటర్ల దూరం ఉండడమే! అంత దూరానికి రహదారి ఏర్పడుతుంది. అలాగే రహదారి మూసుకుపోయినప్పుడు అక్కడ నీరు 1.3 మీటర్ల ఎత్తు నుండి 4 మీటర్ల దాకా ఉంటుంది.

ప్రకృతి అలల మూలంగా ఏర్పరచిన రహదారిని దాటటమే మన మనసులను కదిలిస్తుందని  ప్రజలు రహదారినే వాడుతున్నారు. అందువలన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని రహదారికి ఇరువైపులా అలల కోసం హెచ్చరికగా ఉండమని ప్రకటన పలకలు ఉంచింది. అయినా అప్పుడప్పుడు బాధాకరమైన సంఘటనలూ జరుగుతూనే ఉన్నాయి.

ప్రభుత్వం అలలు వచ్చేటప్పుడు తప్పించుకోవటానికి ఎత్తైన రక్షణ టవర్లు నిర్మించారు. టవర్లలో ఎక్కి తప్పించుకున్న వారిని ప్రభుత్వం రక్షక దళాలను పంపి రక్షిస్తుంది. రహదారిని చూడటానికీ, అందులో నుండి నడవటానికి పలుదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు.

Images Credit: To those who took the original photos.

***********************************************************************************************