సముద్రం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సముద్రం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జనవరి 2024, శుక్రవారం

సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం...(ఆసక్తి)

 

                                                        సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం                                                                                                                                                       (ఆసక్తి)

వుడికి అంకితం చేసిన అనేక పుణ్యక్షేత్రాలలోస్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకంఎందుకంటే కొండలలో  శివుడికి అంకితం చేయబడిన చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాల  మాదిరిగా కాకుండాస్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం సముద్రంలో ఉందిమీరు కరెక్టుగానే చదివారు ఆలయం సముద్ర తీరంలో కాదుఇది సముద్రంలోనే ఉంది.

గుజరాత్ రాజధాని గాంధీనగర్ నుండి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంబుసర్ లోని కవి కాంబోయ్ గ్రామంలో  స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం ఉన్నదిమంచి రోజున ఆలయానికి వెళ్లటానికి(కారులో వెడితే)మీకు నాలుగు గంటలకు మించి పట్టకూడదుఅయితే మీరు ఆలయం యొక్క ప్రత్యేకతకు సాక్ష్యంగా ఉండాలంటే మీరు  గ్రామంలో లేదా గ్రామానికి సమీపంలో ఒక రాత్రి ఉండడం మంచిది.

అరేబియా సముద్రతీరంలో ఉన్న  ఆలయం గురించి స్కందపురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులుశివుని కుమారుడైన కార్తికేయుడుతారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందేతారకాసురుడు లోకకంటకుడే కావచ్చుకానీ అతను మహాశివభక్తుడుఅలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడుతను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడుకార్తికేయుని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తి ‘శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని’ సూచించాడుఅప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడువాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

11, జనవరి 2024, గురువారం

అందుకే దాన్ని ఎర్ర సముద్రం అని పిలిచేది!...(ఆసక్తి)

 

                                                         అందుకే దాన్ని ఎర్ర సముద్రం అని పిలిచేది!                                                                                                                                                           (ఆసక్తి)

ప్రతి శరదృతువులోనూ ఎర్రగా మారే అద్భుతమైన చైనీస్ బీచ్ను చూడటానికి పర్యాటకులు తరలి వస్తారు.

పంజిన్ రెడ్ బీచ్ ప్రపంచంలోనే అతిపెద్ద చిత్తడి నేల. ఇది ఈశాన్య చైనాలోని లియానింగ్లో ఒక నది ముఖద్వారానికి దూరంగా ఉంది. తీరప్రాంతంలోని ఉప్పటి పరిస్థితులు నది పాచికి సరైనవి. శరదృతువులో పరిపక్వం చెందుతున్నప్పుడు ఎరుపు రంగులోకి (కాషాయరంగు) మారే మొక్క ఫలితంగా, 51 చదరపు మైళ్ల ప్రాంతం క్రిమ్సన్ రంగులోకి మారుతుంది. అద్భుతమైన ప్రకృతి దృశ్యంగా కనబడుతుంది. అందువలన ప్రాంతం చాలా మంది పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన ప్రాంతంగా మారింది.

ఈశాన్య చైనాలోని లియానింగ్లో ఒక నది ముఖద్వారానికి దూరంగా ఉన్న బీచ్, శరదృతువు రాకతో పచ్చని ఆకుపచ్చ నుండి క్రిమ్సన్ రెడ్గా రూపాంతరం చెందింది.

పర్యాటకులు ఎర్ర బీచ్ మీద నడవడానికి వీలుగా ఎర్ర చిత్తడి నేల మీద రేవు కట్ట (చిన్నవారధి) నిర్మించబడింది. శరదృతువు కాలంలో సందర్శకులకు ప్రాంతం ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

 అందుకే దాన్ని ఎర్ర సముద్రం అని పిలిచేది!...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

13, డిసెంబర్ 2023, బుధవారం

వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు ఎలా మారుతాయి?...(ఆసక్తి)

 

                                                వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు ఎలా మారుతాయి?                                                                                                                        (ఆసక్తి)

                                            వాస్తవానికి కొన్ని ప్రదేశాలలో, సముద్ర మట్టాలు  పడిపోతున్నాయి.

సముద్ర మట్టం పెరగడం కొత్త విషయం కాదు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ప్రకారం, 20 శతాబ్దంలో ఎక్కువ భాగం, ప్రపంచ సగటు సముద్ర మట్టం పైకి దూసుకుపోయింది - సంవత్సరానికి 0.05 అంగుళాలు (1.4 మిల్లీమీటర్లు) పెరుగిందట. గ్లోబల్ అంటే సముద్ర మట్టం భూమిని కప్పే అన్ని సముద్రాల సగటు. కానీ గత రెండు దశాబ్దాలలో, పెరిగిన రేటు రెట్టింపు కంటే ఎక్కువ. 2005 నుండి 2015 వరకు, సముద్ర మట్టాలు సంవత్సరానికి 0.1 అంగుళాలు (3.6 మిమీ) పెరిగాయి.

                                        అయితే పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా స్థిరంగా ఉందా?

లేదు, అస్సలు లేదు. "సముద్ర మట్టం పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఒకేరీతిగా లేదు" అని ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఆర్ఓ) లోని సీనియర్ ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్ కాథీ మక్ఇన్నెస్ అన్నారు. CSIRO యొక్క క్లైమేట్ సైన్స్ సెంటర్ యొక్క క్లైమేట్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రొజెక్షన్స్ గ్రూపుకు ఆమె నాయకత్వం వహిస్తుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు ఎలా మారుతాయి?...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************