లక్ష్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
లక్ష్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, సెప్టెంబర్ 2023, బుధవారం

లక్ష్యమే విజయం...(కథ)

 

                                                                                         లక్ష్యమే విజయం                                                                                                                                                                                (కథ)

ధ్యేయాన్ని లక్ష్యం అని కూడా అంటారు. ధ్యేయాన్ని ఆంగ్లంలో గోల్ అంటారు. కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి ఒక జంతువు లేదా వ్యక్తి లేదా వ్యవస్థ ఊహ ద్వారా ప్రణాళికను తయారు చేసుకొని అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఒక క్రమపద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యంలోని చివరి స్థానానికి చేరడాన్ని ధ్యేయం అంటారు.

ప్రతి వ్యక్తీ తాను చేయ బోయే పనికి ఒక లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించుకునే ముందుకు సాగుతాడు. ఈ లక్ష్యాన్ని నిర్ణయించు కోవడమన్నది ఊహాజనితం కావచ్చు, ప్రణాళికా బద్ధంగా వ్రాత పూర్వకంగా ఏర్పాటు చేసుకున్నది కావచ్చు. మరేదైనా కావచ్చు. కాని తప్పనిసరిగా ఒక లక్ష్యం అంటు ఒక టుంటుంది. లక్ష్యము లేనిది గమ్యము లేని ప్రయాణము వంటిది. నిరుపయోగము. ప్రతి పనికి ఒక లక్ష్యము వుంటుంది. అది చిన్న పని గాని, పెద్ద పని గాని, మహా కార్యము గాని, దానికి ఒక లక్ష్యముంటుంది. 

ఇంత ముఖ్యమైన విషయాన్ని ఇలా చివరి సమయంలో వచ్చి చెబుతున్నావే విశాల్...ఇది న్యాయమేనా బాబూ?”

కలవరమైన చూపులతో న్యాయం అడుగుతున్న స్నేహితుడు అర్జున్ తల్లి శారదాని తలెత్తి చూసే ధైర్యం లేక తలవంచుకునే ఉన్నాడు విశాల్.

చెప్పు బాబూ...మిమ్మల్నందరినీ నమ్మే కదా అర్జున్ ని కాలేజీకి పంపించాను. మంచి స్నేహితులుగా ఉన్నారు. అన్నదమ్ములు లాగా కలిసిపోయారు. తండ్రి లేని కొరత  తెలియనివ్వకుండా మంచి విధంగా చూసుకుంటున్నారు అనే నమ్మకంతో ఉన్నాను! చివరికి ఇలా చేశావే బాబూ...

శారదా యొక్క సత్యమైన మాటలు మనసుపై దాడి చెయ్య, మాట్లాడటానికి ఏదీలేక వేదనపడుతూ నిలబడ్డాడు విశాల్.

తోడబుట్టిన ఇద్దరు చెల్లెలను గట్టెక్కించాలి అనేది విశాల్ తలరాతే. ఖచ్చితంగా  వాళ్ళిద్దరికీ మంచి భవిష్యత్తును ఏర్పరచి ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నా బాబూ. సాధించాల్సిన వయసులో పోయి ఇలా ప్రేమా, దోమా అంటూ తన మనసును ఊగిసలాడిస్తే జీవితంలో ఎలా ఎదుగుతాడు? అతన్నే నమ్ముకున్న మా జీవితాలు ఏం కాను?”

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

లక్ష్యమే విజయం...(కథ)@ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

26, ఆగస్టు 2021, గురువారం

పవిత్ర…(పూర్తి నవల)

 

                                                                                             పవిత్ర                                                                                                                                                                                    (పూర్తి నవల)

సతీసావిత్రి జీవించిన కాలం నుండి...భర్త ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో జీవించి తిరిగి వచ్చినా, అతని పాదాలు తాకి కళ్ళకద్దుకుని అతనే తన భర్త అని చెప్పే మహిళనే పతివ్రత అంటున్నారు. కన్యాత్వం అనేది మగవాడికీ, ఆడదానికీ సమం కాదా?

పెళ్లైన జీవితం అందరికీ విజయవంతంగా ఉండటం లేదు. ఈ నవలలోని హీరోయిన్ పవిత్రకు కూడా అదే జరిగింది. కానీ అందులో ఆమె తప్పేమీ లేదు. పెళ్ళి చూపులకు వచ్చి, పవిత్రను పలుమార్లు చూసి, ప్రశ్నలతో పాటూ కట్నకానుకలు అడిగి పెళ్ళిచేసుకున్న తరువాత, ఆమె బాగుండలేదని, ఈ రోజు మహిళలాగా లేదని విడిచిపెట్టాడు పవిత్ర భర్త రామ్మోహన్. 

పేరుకు తగినట్టే పవిత్ర పవిత్రమైనది, పరిశుద్దమైనది 'పవిత్ర’.ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ పరిశుద్దమైనదే. ఏ పనిలోనైనా సరే నిజాయితీగా ఉండాలనుకుంటుంది.

తనకు ఏర్పడిన ఓటమిని విజయవంతంగా చేసుకునేందుకు తనని తాను పక్వ పరుచుకుంది పవిత్ర. మెరుగు దిద్దబడ్డ వజ్రంలాగా  మారిపోయింది. ఆమెకు పక్క బలంగా నిలబడ్డాడు ఆమె తమ్ముడు మనోహర్. కొన్నేళ్ళలలో ఆమె 21 వ శతాబ్ధపు మహిళలా మారిపోయింది.

అనుకోకుండా ఒక ఆసుపత్రిలో  పవిత్ర మాజీ భర్త రామ్మోహన్,  పవిత్రను చూస్తాడు. ఆమె 21 వ శతాబ్ధపు మహిళలా మారిపోయుంది. అతని రెండవ భార్య అతని చేతికి ఒక బిడ్డను ఇచ్చి, మరొకడితో వెళ్ళిపోయింది. 

చేతి బిడ్డతో అవస్తపడుతున్న రామ్మోహన్ పవిత్ర మనసు గురించి తెలిసుండటంతో, ఆమెనే మళ్ళీ తన జీవితంలోకి తీసుకురావాలని ప్లాన్ వేస్తాడు. ఆమె మళ్ళీ తనజీవితంలోకి వస్తే, జాలి, దయా గుణం కలిగిన పవిత్ర తన బిడ్డను, తనని బాగా చూసుకుంటుందని అతనికి బాగా తెలుసు. తిరిగి ఆమెతో కలిసి కాపురం చేద్దామని ఆమె వెనుక పడతాడు. అత్తగారిని తన మాటలతో ఒప్పిస్తాడు. అల్లుడితో తిరిగి కలిసిపొమ్మని తల్లి పవిత్ర మీద ఒత్తిడి తెస్తుంది. 

తల్లి ఒత్తిడికి తలవొగ్గిందా పవిత్ర? 'కొట్టినా, తిట్టినా భర్తే' అనే పాత వాదనను నిజం చేస్తూ తిరిగి రామ్మోహన్ తో కలిసిపోయిందా? లేక తన జీవితాన్ని విజయవంతం చేసుకొవాలనుకున్నట్టుగా తాను పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకుందా?.....వీటన్నిటికీ సమాధానాలు ఈ నవల చదివితే దొరుకుతుంది.  

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

పవిత్ర...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకోండి: 

https://drive.google.com/file/d/1RwPvlavoEV7NTRnXmJi-_5LKNLtNKqvB/view?usp=sharing

***********************************************************************************************

3, ఆగస్టు 2021, మంగళవారం

జయం నిశ్చయం...(కథ)


                                                                              జయం నిశ్చయం                                                                                                                                                                                  (కథ) 

మనందరం విజయం సాధించాలంటే మనకు కావలసిన జీవిత లక్ష్యం ఒకటి నిర్ణయించుకుని, దానికొసం ప్లాను వేసుకోవటం. ప్లాను వేసుకున్నాక విజయం సాధించటానికి తీవ్రంగా కష్టపడటం...తెలివి తేటలతో శ్రమించటమే!

ఈ రోజు ఎవరు ఏం చేస్తున్నారో అదే రేపు వారి భవిష్యత్తు. ఈ రోజు ఎవరైతే తీవ్రమైన కష్టంతో పనిచేస్తున్నారో...అదే వారికి లాభంగా తిరిగి వస్తుంది. కష్టపడి చదువుకునే మానవుడికి, అదే పరీక్ష అనే భవిష్యత్తును తీసుకు వస్తుంది.

అలాగంటే, ఈ రోజు మనం చేసింది, చేస్తున్నదే రేపు మన జీవితాన్ని తీర్మానిస్తుంది.

మరి ఈ కథలో ఎవరు ఏం చేశారు? ఏం సాధించారు?.....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి. 

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకు పై క్లిక్ చేయండి:

జయం నిశ్చయం...(కథ)@ కథా కాలక్షేపం-1  

***********************************************************************************************