అంతరిక్షం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అంతరిక్షం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, డిసెంబర్ 2023, సోమవారం

అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్?... (ఆసక్తి)


                                                                         అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్?                                                                                                                                                            (ఆసక్తి) 

                                                         అంతరిక్షంలో కూడా బెర్ముడా ట్రయాంగిల్ ఉన్నదా?

భూమిపై ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ గురించి మనమందరం విన్నాము, కాని అంతరిక్షంలో ఉన్నదాని గురించి మీరు విన్నారా?

భూమిపై ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచీ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి.

సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అంతరిక్షంలో బెర్ముడా ట్రయాంగిల్?... (ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

20, అక్టోబర్ 2023, శుక్రవారం

అంతరిక్షంలోనూ కాలుష్యం...(సమాచారం)


                                                                           అంతరిక్షంలోనూ కాలుష్యం                                                                                                                                                                (సమాచారం) 

కాలుష్యం: కాలుష్యం అంటే అర్ధం తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఎక్కడ చూసినా కాలుష్యమే. మాట ఎత్తినా అందులో కాలుష్యం ఉంటుంది. ఉదాహరణకు: పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, మట్టి కాలుష్యంఇలా ఎన్నో కాలుష్యాలు. కానీ ఒక్కరు కూడా అంతరిక్షం కూడా కాలుష్యానికి గురై ఉంటుందని ఊహించుడరు....నిజమే. కానీ అంతరిక్షం కూడా పూర్తిగా చెత్తతో కాలుష్యం అయిపోయింది. అదికూడా మానవుల వలనే.

ప్రకృతి మానవులకు పరిశుభ్రమైన జీవనార్ధాలను ఇచ్చింది. కానీ, మనిషి వాటినన్నింటినీ రకరకాల చెత్తతో కాలుష్యం చేసేరు. 

మనుషులు ఉన్నంత కాలం చెత్త ఉంటుంది. మనుషులు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు చెత్తను వదిలేస్తారు -  1950 చివరి నుండి, ఇందులో అంతరిక్షం కూడా ఉంది. అంటే అంతరిక్షాన్ని కూడా మనిషి వదిలిపెట్టలేదు. చెత్తని వదిలిపెట్టటం మానవ స్వభావమా? ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది. చెత్త కుప్పలాగా పెరిగి, దాన్ని తొలగించే ఖర్చు అధికం అయ్యేంతవరకూ దాన్ని పట్టించుకోకుండా ఉండటం కూడా మానవ స్వభావం లాగే కనిపిస్తోంది!  

అంతరిక్ష వ్యర్థాల యొక్క పర్యవసానంను కెస్లర్ సిండ్రోమ్ అంటారు.(1978 లో నాసా శాస్త్రవేత్త డోనాల్డ్ జె.కెస్లర్ అంతరిక్ష వ్యర్థాల వలన ఏర్పడే ఘటన ఎలా ఉంటుందో వివరించాడు. అందువలన దానికి కెస్లర్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు). భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉన్న అంతరిక్ష చెత్త లో ఉన్న ఒక్క వస్తువుగాని, ఇంకొక వస్తువతో ఢీ కొంటే అంతరిక్షమే ప్రమాదకరమైన ప్రదేశంగా మారుతుంది. ఉపగ్రహాలకు, రాకెట్లకు మరియు మానవ అంతరిక్ష ప్రయాణికులకు అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అంతరిక్షంలోనూ కాలుష్యం...(సమాచారం) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

10, అక్టోబర్ 2023, మంగళవారం

అంతరిక్షంలో దేవుని హస్తం?...(మిస్టరీ)

 

                                                                        అంతరిక్షంలో దేవుని హస్తం?                                                                                                                                                                                         (మిస్టరీ)

మనం ఇదివరకే దేవుని కంటి చిత్రాలను చూశాము...ఇప్పుడు మనకు దేవుని హస్తం యొక్క మొదటి చిత్రం చూస్తున్నాము.

 దేవుని హస్తం: అంతరిక్షంలోని లోతైన ప్రదేశంలో సూపర్నోవా యొక్క       అద్భుతమైన ఎక్స్-రే చిత్రాన్ని నాసా  శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

మతం మరియు ఖగోళ శాస్త్రం తరచూ ఒకదానికొకటి ఒకే విషయాన్ని అంగీకరించక పోవచ్చు, కాని కొత్త నాసా ఎక్స్-రే చిత్రం "దేవుని హస్తం" ను పోలి ఉండే ఒక ఖగోళ వస్తువును కనుగొన్నది.

విశ్వంలో ఒక నక్షత్రం పేలినప్పుడు, పేలుడులో నుండి అపారమైన మేఘంలాంటి పదార్థం బయటకు వచ్చినప్పుడు విశ్వంలో "హ్యాండ్ ఆఫ్ గాడ్" ఫోటో ఉత్పత్తి చేయబడింది. ఇది నాసా యొక్క న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే, లేదా న్యూస్టార్ అనే అధిక శక్తి గల ఎక్స్-కిరణాలలో మెరుస్తూ, ఫోటోలో నీలం రంగులో కనబడింది. గతంలో నాసా యొక్క చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ తక్కువ-శక్తి ఎక్స్ రే -కిరణాలను ఉపయోగించి చిత్రించినప్పుడు ఆకుపచ్చ మరియు ఎరుపు భాగాలుగా కనబడింది

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అంతరిక్షంలో దేవుని హస్తం?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************