అంతరిక్షంలోనూ కాలుష్యం (సమాచారం)
కాలుష్యం: కాలుష్యం అంటే అర్ధం తెలియని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఎక్కడ చూసినా కాలుష్యమే. ఏ మాట ఎత్తినా అందులో కాలుష్యం ఉంటుంది. ఉదాహరణకు: పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, మట్టి కాలుష్యం…ఇలా ఎన్నో కాలుష్యాలు. కానీ ఒక్కరు కూడా అంతరిక్షం కూడా కాలుష్యానికి గురై
ఉంటుందని ఊహించుడరు....నిజమే. కానీ అంతరిక్షం కూడా పూర్తిగా చెత్తతో కాలుష్యం
అయిపోయింది. అదికూడా మానవుల వలనే.
ప్రకృతి మానవులకు పరిశుభ్రమైన జీవనార్ధాలను ఇచ్చింది. కానీ, మనిషి వాటినన్నింటినీ రకరకాల చెత్తతో కాలుష్యం చేసేరు.
మనుషులు ఉన్నంత కాలం చెత్త ఉంటుంది. మనుషులు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు చెత్తను వదిలేస్తారు - 1950 ల చివరి నుండి, ఇందులో అంతరిక్షం కూడా ఉంది. అంటే అంతరిక్షాన్ని కూడా మనిషి వదిలిపెట్టలేదు. చెత్తని వదిలిపెట్టటం మానవ స్వభావమా? ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది. చెత్త కుప్పలాగా పెరిగి, దాన్ని తొలగించే ఖర్చు అధికం అయ్యేంతవరకూ దాన్ని పట్టించుకోకుండా ఉండటం కూడా మానవ స్వభావం లాగే కనిపిస్తోంది!
అంతరిక్ష వ్యర్థాల యొక్క పర్యవసానంను ‘కెస్లర్ సిండ్రోమ్’ అంటారు.(1978 లో నాసా శాస్త్రవేత్త డోనాల్డ్ జె.కెస్లర్ అంతరిక్ష వ్యర్థాల వలన ఏర్పడే ఘటన ఎలా ఉంటుందో వివరించాడు. అందువలన దానికి కెస్లర్ సిండ్రోమ్ అని పేరు పెట్టారు). భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో ఉన్న అంతరిక్ష చెత్త లో ఉన్న ఒక్క వస్తువుగాని, ఇంకొక వస్తువతో ఢీ కొంటే అంతరిక్షమే ప్రమాదకరమైన ప్రదేశంగా మారుతుంది. ఉపగ్రహాలకు, రాకెట్లకు మరియు మానవ అంతరిక్ష ప్రయాణికులకు అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అంతరిక్షంలోనూ కాలుష్యం...(సమాచారం) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి