మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, నవంబర్ 2023, గురువారం

‘నా కూతురు దెయ్యాలతో మాట్లాడుతుంది, గగుర్పాటు కలిగించే అలంకరణలతో ఆడుకుంటుంది’...(ఆసక్తి)


                   ‘నా కూతురు దెయ్యాలతో మాట్లాడుతుంది, గగుర్పాటు కలిగించే అలంకరణలతో ఆడుకుంటుంది’                                                                                                            (ఆసక్తి) 

ఒక చిన్న అమ్మాయి అత్యంత గగుర్పాటు కలిగించే బొమ్మతో స్నేహం చేయడం మీరు ఎప్పుడైనా చూసారా. దాని కోసం ప్రజలు ఇక్కడ ఉన్నారు.

అది అందమైనది కాదా?!?!

ఒక చిన్న అమ్మాయి మరియు ఆమె బొమ్మ!

ఒక్క క్షణం ఆగండి...ఇక్కడ ఏం జరుగుతోంది?!?!

ఒక జంట తమ కుమార్తె యొక్క కొత్త బెస్ట్ ఫ్రెండ్ ఫోటోలను షేర్ చేసారు మరియు ఇది ఏదో భయానక చిత్రం నుండి బయటకు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఆమె తండ్రి ఇలా అన్నాడు, "ఈ బొమ్మ ముందు వరండాలో నుండి బయటకు వెళ్ళవలసి ఉంది. కానీ నా కూతురు ఆ బొమ్మను తన కొత్త బెస్ట్ ఫ్రెండ్ అని నిర్ణయించుకుంది. ఆ బొమ్మను ఆమె దృష్టిలో ఉండేటట్టు చూసుకుంది."

ఓ హో

            ఆ చిన్న అమ్మాయి ఆ బొమ్మను "స్పెషల్ బేబీ" అని పిలుస్తూ తన బెస్ట్ ఫ్రెండ్‌గా చేసుకున్న ఫోటో ఇది.

అయ్యో...

మేము ఎంత చెప్పినా మా కూతురు ఆ బొమ్మను విడిచిపెట్టతం లేదు. ఎప్పుడు ఎం జరుగుతుందో అని భయంగా ఉంది.

ఈ విషయాన్ని వదిలించుకోవడానికి ఈ అమ్మాయి తల్లిదండ్రులు భూతవైద్యుడిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని అక్కడి వారందరూ భావిస్తున్నారు.

ఈ గగుర్పాటుకు ప్రజలు ఎలా స్పందించారో ఇక్కడ ఉంది.

ఒక వ్యక్తి ఈ చిన్న అమ్మాయితో తమ పిల్లవాడు మంచి స్నేహితులుగా ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పాడు.

నా కూతురు దెయ్యాలతో మాట్లాడుతుంది, మీ కూతురు గగుర్పాటు కలిగించే అలంకరణలతో ఆడుకుంటుంది... మేము ఎదురుగా ఉన్న తీరాలలో లేకుఉండా, మీకు దగ్గరగా ఉంటే వారికి ఆట తేదీ అవసరమని నేను చెప్తాను ఎందుకంటే వారు మంచి స్నేహితులుగా ఉంటారని నేను భావిస్తున్నాను.

ఆ పిల్ల ఆ బొమ్మ లేకుండానే పెరుగుతుందని ఆశిద్దాం.

Credit Images: To those who took the original photos.

***************************************************************************************************

29, జనవరి 2023, ఆదివారం

మేస్టారి మాట…(కథ)

 

                                                                                    మేస్టారి మాట                                                                                                                                                                       (కథ)

‘చదువుకోకపోతే జీవితంలో ఎదగటం కష్టం

చదువుకున్న వారు కష్టపడి పనిచేస్తే ఇట్టే పైకెదిగిపోతారు. అలాంటివారిని అద్రుష్టం వెతుకుతూనే ఉంటుంది. అదే చదువుకు ఉన్న గొప్పతనం...అందుకే ఆడా, మొగా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాలి అని చెబుతారు. చదువు ప్రతి ఒక్కరినీ మేధావుల్ని చేస్తుంది.

పైన చెప్పిన మాటలు అక్షరాలా నిజం...ఈ విషయాన్ని సెంటర్ గా పెట్టుకునే ఈ కథ రాయబదింది. చదితే చాలా వరకు అర్ధమవుతుంది. 

హాలులో కూర్చుని  ఒక కాగితం ముక్కలో రాసుకున్న లెక్కల్ను చూసుకుంటున్నాడు శేషు.

ఇంటిముందు కార్లు ఆగిన శబ్ధం వినబడింది.

ఆ శబ్ధానికి లెక్కలు చూసుకుంటున్న శేషు లెక్కలు చూడటం ఆపి ఇంత ప్రొద్దున్నే ఎవరొచ్చారా అని గేటు వైపు చూశాడు.

గేటు తెరుచుకుని ఐదారుగురు వ్యక్తులు లోపలకు వస్తున్నారు. అందరూ టై కట్టుకుని, షూస్ వేసుకుని ఉన్నారు. మనసులో ఏదో అనిపించటంతో  చేతిలోని కాగితం ముక్కను ఉండాగా చుట్టి అవతలకు విసిరేశాడు శేషు.

ఇంట్లోకి ఆడుగుపెట్టిన ఆరుగురిలో ఒకరు "మిస్టర్. శేషావతారం...వుయ్ ఆర్ ఫ్రం ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్...మీ ఇళ్ళు సోధా చేయటానికి వచ్చాము. మీరు మాకు సహకరిస్తే ఎటువంటి ఫోర్స్ ఉపయోగించకుండా మా పని మేము చేసుకుపోతాము"

"అలాగే సార్...నా పూర్తి సహకారం మీకుంటుంది...ఆయినా ఇన్ కం టాక్స్ రైడ్ జరపవలసినంత గొప్ప బిజినస్ మాన్  కాదు నేను. మీరేదో తప్పుడు అడ్రస్సుకు వచ్చారు"

మాకు గొప్ప బిజినస్ మాన్-చిన్న బిజినస్ మాన్ అనే డివిజన్ ఉండదు. ఐదువేల రూపాయలు ఇల్లీగల్ అకౌంట్స్ రాసినవారూ, కోటి రూపాయలు ఇల్లీగల్ అకౌంట్స్ రాసినవారు ఇద్దరూ మా పరిధిలో ధోషులే. ప్రభుత్వాన్ని మొసగించిన దోషులే.... ఈ మాటలన్నీ తరువాత ఇప్పుడు మీరు మీ అకౌంట్ పుస్తకాలూ, సెల్ ఫోన్లు మాకు అప్పగించండి"

" అలాగేఅని ఆఫీసర్ కు చెప్పిగురువయ్యా... ఆఫీసు రూములో ఉన్న పుస్తకాలన్నీ ఇక్కడకు పట్టుకురా" పనివాడితో చెప్పాడు శేషు.

"ఆగవయ్యా"  పనివాడిని ఆపుతూ మీకు ఆఫీసు రూము కూడా ఉన్నదా? అయితే మేము అక్కడి నుండే మా పని ప్రారంభిస్తాము" అన్నాడు ఆ ఆఫీసర్.

"నేను ఇందాకే చెప్పాను కదండి. నాదేమీ పెద్ద వ్యాపార సంస్థ కాదని. ఆఫీసు రూము అని ప్రత్యాకంగా ఏదీ లేదండి. నా ఇంట్లోని లివింగ్ రూమునే ఆఫీసు రూముగా వాడుకుంటున్నా. క్లైంట్స్, కస్టమర్స్, సప్ప్లయర్స్ వచ్చినప్పుడు ఆ గదిలో కూర్చుని మాట్లాడుకుంటాము" చెప్పాడు శేషు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మేస్టారి మాట…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

15, మే 2022, ఆదివారం

మాటే మంత్రము…(మినీ కథ)

 

                                                                             మాటే మంత్రము                                                                                                                                                              (మినీ కథ)

ఒకప్పటి  మానవతానుబంధం కనుమరుగై, డబ్బే ప్రపంచమై పోయిన తర్వాత అన్ని సంబంధాలూ మాసిపోయాయి. వైద్యం ఖరీదైపోయింది. వ్యాధి నిర్ధారణకు బోలెడన్ని పరీక్షలు, వాటి కోసం కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు దిగాయి. చికిత్స పద్ధతులు కూడా గణనీయంగా మారాయి. రోజుకో కొత్త వ్యాధి పుట్టుకొస్తున్న ఆధునిక యుగంలో వాటికి చికిత్స చేయడానికి కార్పొరేట్ఆసుపత్రులే దిక్కవుతున్నాయి. కొన్నిసార్లు ఎటువంటి వైద్యమూ,  ఎంత అనుభవమైన పెద్ద డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తున్నారు....కానీ అదే చోట ఒక్క మాట మంత్రంలా పనిచేస్తుంది......అదేమిటో? 

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాటే మంత్రము...(మినీ కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

9, మే 2022, సోమవారం

మేస్టారి మాట…(కొత్త కథ)

 

                                                                                           మేస్టారి మాట                                                                                                                                                                                   (కథ)

చదువుకోకపోతే జీవితంలో ఎదగటం కష్టం'

చదువుకున్న వారు కష్టపడి పనిచేస్తే ఇట్టే పైకెదిగిపోతారు. అలాంటివారిని అద్రుష్టం వెతుకుతూనే ఉంటుంది. అదే చదువుకు ఉన్న గొప్పతనం...అందుకే ఆడా, మొగా అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదువుకోవాలి అని చెబుతారు. …. చదువు ప్రతి ఒక్కరినీ మేధావుల్ని చేస్తుంది.

పైన చెప్పిన మాటలు అక్షరాలా నిజం...ఈ విషయం ఈ కథ చదితే చాలా వరకు అర్ధమవుతుంది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మేస్టారి మాట...(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************