మిస్టరీ. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మిస్టరీ. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2023, శనివారం

మాయమైపోయిన విమానం ....(మిస్టరీ)

 

                                                                         మాయమైపోయిన విమానం                                                                                                                                                                                          (మిస్టరీ)

మాయమైపోయిన విమానం మలేషియా ఏయిర్ లైన్స్ MH-370.

ఐదు సంవత్సరాల వెతుకులాట ముగింపుకు వచ్చింది... మాయమైపోయిన విమానం ఇక దొరకదని నిర్ణయానికి వచ్చారు మలేషియా అధికారులు.

మలేషియా ఏయిర్ లైన్స్ కు చెందిన MH-370 విమానం 8 మార్చ్2014 అదృశ్యమైనదని అందరికీ తెలుసు. ఇది మలేషియా రాజధాణీ కౌలాలంపూర్ నుండి చైనా రాజధాణి బీజింగుకు వెళ్ళాలి. కానీ మార్గ మధ్యలో అదృశ్యమైంది.

అదృశ్యమైన విమానం ప్రమాదానికి గురైందని, ప్రమాదంలో విమానంలో ప్రయాణం చెస్తున్న మొత్తం 239 (సిబ్బందితో కలిపి) మంది  ప్రయాణీకులు మరణించారని మలేషియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ ప్రమాదం ఎక్కడ జరిగిందో, శకలాలు ఏమైనాయో మాత్రం తెలుపలేదు.

అదృశ్యమైపోవడానికి అదేమైనా చిన్న వస్తువా?

సముద్రంలో పడిపోయిందా? దారి మళ్ళించారా? సముద్రంలో పడిపోయుంటే ఒక చిన్న ముక్క కూడా దొరకలేదా? అంతమంది ప్రయాణీకులలో ఒకరి దేహం కూడా దొరకలేదా? దారి మళ్ళించి ఉంటే అంతపెద్ద విమానం జాడ తెలియకుండా ఉంటుందా?...ప్రజలకు నచ్చజెప్పే సమాధనం చెప్పలేకపోవటం ఒక అరుదైన విషయం. అందుకే ఇది ఆధునిక మిస్టరీ.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మాయమైపోయిన విమానం ....(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

22, మార్చి 2023, బుధవారం

ఆత్మలతో మాట్లాడించే బోర్డు...(మిస్టరీ)

 

                                                                                ఆత్మలతో మాట్లాడించే బోర్డు                                                                                                                                                                    (మిస్టరీ)

లిపి ఫలకం, ఆత్మ బోర్డ్ మరియు మాట్లాడే పలక అని కూడా చెబుతారు. పలకను(OUIJA BOARD) ఒక ఆట వస్తువుగా అమ్మకాలు చేస్తున్నారు. పలక, ఆడుకునే వారు తనని అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుందట. పలక మార్కెట్టులో అమ్మకానికి ఉన్నా పలకను కొనుక్కునే వారి సంఖ్య తక్కువగా ఉన్నది. దీనికి కారణం, పలకను కొనుక్కుని ఆడుకున్న వారు తమ అనుభవాలను చెప్పటం వలన. అంటే పలకతో ఆడినవారు ఆనందం కంటే బాధలే ఎక్కువ పొందారు. అందులో చాలామంది అత్యంత భయంకరమైన అనుభూతిని ఎదుర్కొన్నారు.

గూగుల్ సంస్థ 2014 లో డిసెంబర్ నెల అందించిన సమాచార జాబితాలో సంవత్సరం పలకల అమ్మకం ఎక్కువ అయిందని, పలకను తమ పిల్లలకు, స్నేహితులకు, కుటుంబీకులకు క్రిస్మస్ కానుకగా ఇవ్వటానికి కొంటున్నారని తెలిపారు. పలకల అమ్మకం సంవత్సరం ఎక్కువ అవటానికి కారణం సంవత్సరం హాలోవిన్ పండుగకు విడుదలైన ఓయూజా (Ouija) సినిమానే అని తెలిపారు. పలకను ఆటవస్తువుగా చూడొద్దని, పలకతో ఆడుకోవద్దని భూతవైద్యులు మరియు అతీత భావన (పారానార్మల్) పరిశోధకులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఆత్మలతో మాట్లాడించే బోర్డు...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

12, జులై 2022, మంగళవారం

‘బ్లాక్ నైట్’ ఉపగ్రహం గురించి కొనసాగుతున్న మర్మం…(మిస్టరీ)

 

                                                                      ‘బ్లాక్ నైట్ ఉపగ్రహం గురించి కొనసాగుతున్న మర్మం                                                                                                                                                   (మిస్టరీ)

బ్లాక్ నైట్ ఉపగ్రహ మిస్టరీ సిద్ధాంతం ఏమిటంటేభూమి యొక్క ధ్రువ కక్ష్యలో అన్యగ్రహానికి చెందిన ఒక అంతరిక్ష నౌక ఉందని, ఈ ఉపగ్రహాం రహస్య సమాజాలకు చెందిందని, అది గత 12,000 సంవత్సరాలుగా మానవులను పర్యవేక్షిస్తోందని చెబుతారు.

దీని గురించి మరింత తెలుసుకొనుటకు ఈ ఆర్టికల్ ను చదవండి.

ఈ ఆర్టికల్ ను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

‘బ్లాక్ నైట్’ ఉపగ్రహం గురించి కొనసాగుతున్న మర్మం…(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************