7, ఏప్రిల్ 2024, ఆదివారం

దిద్దుబాటు!...(సరికొత్త కథ)

 

                                                                                         దిద్దుబాటు!                                                                                                                                                                                (సరికొత్త కథ)

భావి భారత పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకోవాల్సిన బాలలు పేవ్‌మెంట్లు, ప్లాట్‌ఫారాలు, బస్తీలు గల్లీలలో నిర్భాగ్య నికృష్ట జీవనం గడుపుతూ, నిరాదరణకు గురైన వీధి బాలలుగానో, నేర పూరిత బాలలుగానో మారడం ప్రభుత్వాలకు, సమాజానికి తీరని తలవంపులు తెచ్చే పరిణామం. దేశ భవిష్యత్తుకు ఇదో ప్రమాదకర పరిణామం. చట్టాలు, శిక్ష అనేవి నేరం జరిగాక రంగంలోకి వస్తాయి. అసలు నేరం జరగకుండా చేస్తే అది ఇంకా ఉత్తమం.

జువనైల్ నేరస్థులను, నిర్భాగ్య బాల నేరస్థులకు ఆప్యాయత (Affection), రక్షణ (Security), చికిత్స (aid), వికాసం (Development), పునరావాసం (Rehabilitation) చేకూర్చడం చాలా ముఖ్యం . బాల నేరస్థులను సాధ్యమైనంతవరకు పురులే వారు మారటానికి దిద్దుబాటు చేయాలి.

***************************************************************************************************

రోడ్డు అంచులలో ఉన్న అతిపెద్ద చింత చెట్లలో వేలాడుతున్న చింతకాయాల గుత్తులను చూస్తూనే, వాటి చిక్కటి నీడలో నడుస్తున్నారు భూపేంద్ర. ఏడింటికే ఎండ చుర్రున కొడుతున్నది.

యాబై ఏళ్ళ వయసులో, రెగులర్ మార్నింగ్ వాక్ కూ దాటి చిన్నగా పొట్ట.

వీధి కుక్కలను తరమ, చేతిలో ఒక సన్న, స్కేలు కంటే పెద్ద పుల్ల.

ఆయన్ని దాటుకుంటూ వెళుతున్న పాల వాళ్ళ సైకిళ్ళూ, అప్పుడప్పుడు వెళ్తున్న ఆటోలు తప్ప, సందడి లేని తెల్లవారు జాము నిశ్శబ్ధాన్ని చెడిపే విధంగా వెనుక నుండి చిన్న అరుపులు.

ఆయన్ని దాటి అతివేగంగా ముందు, సన్నగా, మాసిపోయిన నిక్కరు, చెదిరిపోయిన మురికి జుట్టు కలిగిన ఒక రూపం పరిగెత్తింది.

అర్ధం కాక వెనక్కి తిరిగారు. చిన్న గుంపు ఒకటి, వాడిని తరుముతూ పరిగెత్తుకు వస్తున్నది.

బెర్ముడా, టీ షర్టులతో ఇద్దరు మగవారు. కొంచం శ్రమ పడుతూ పరిగెత్తుకు వస్తూ, బిగ్గరగా "పట్టుకోండి, పట్టుకోండి వాడ్ని..." అన్నారు.

వాళ్ళకు వెనుక కొంచం దూరంలో చీర అడ్డుపడ, నడవనూ లేక, పరిగెత్తనూ లేక మధ్య వయసు మహిళ, మరియు ఆమె కన్న తక్కువ వయసులో ఉన్న మరో మహిళ వస్తున్నారు.

ఆయన, అర్జెంటుగా ముందు చూసి అడుగుపెట్టారు. దూరంగా పరిగెత్తుతున్న ఆ అబ్బాయి, తన చేతిలో ఉన్న సంచీని ఆయన కాలువైపుకు విసిరేసి, చటుక్కున దగ్గరున్న, చిన్న వీధుల్లోకి పరిగెత్తి మాయమయ్యాడు.

వేగంగా పరిగెత్తి వెళ్ళిన భూపేంద్ర, ఆ సంధు చివర్లలో చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఆ చివర రోడ్డు రెండు వైపులకూ పెద్దదిగా విడిపోయున్నది. కుడి, ఎడమ - ఎటువైపుకు పరిగెత్తుంటాడో?

తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర వివరం అడిగారు.

ఆయాసపడుతూ వచ్చి నిలబడ్డ స్త్రీ లిద్దరూ, కింద పడున్న హ్యాండ్ బ్యాగును తెరిచి, సరిగ్గా ఉన్నదా లేదా అని చూసుకుంటున్నారు.

తన బంధువుతోటి గుడికి వచ్చిన ఆమె, పెద్ద వయసు ఆవిడ. పూల కొట్టు దగ్గర నిలబడి, పూలు కొంటున్నప్పుడు, ఆమె హ్యాండ్ బ్యాగును లాక్కుని పరిగెత్తటం మొదలుపెట్టాడు ఆ దొంగ.

వాళ్ళు అరవటంతో, వాకింగ్ చేస్తున్న ఇద్దరు బెర్మూడా వేసుకున్న వ్యక్తులు వాడిని పట్టుకోవటానికి పరిగెత్తుకు వచ్చారు.

అందరూ రావటం గమనించిన ఆ దొంగ కుర్రాడు, బ్యాగును విసిరేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు.

"అన్నీ సరిగ్గా ఉన్నాయా అమ్మా!...డబ్బులు తీసుకున్నాడా?" అన్నారు.

"ఉన్నాయండి...పరుసు, డబ్బూ అన్నీ అలాగే ఉన్నాయి"

"ఈ రోజు మీకు మంచి టైము, పర్సు దొరికింది. వాడు గనుక దొరికుంటే, కథే వేరుగా ఉండేది" అన్నారు భూపేంద్ర.

"చిన్న వయసు కుర్రాడే" అన్నారు ఒక బెర్మూడా.

"ఇలాంటి వాళ్ళను వదలకూడదు. పోలీసులకు పట్టిచ్చి బాగా కొట్టించి కాళ్ళూ, చేతులూ విరక్కొట్టాలి. అప్పుడే భయం ఉంటుంది" అన్నారు ఇంకో బర్మూడా.

వాళ్ళు చెప్పిన దాన్ని అంగీకరిస్తూ ఇంటివైపుకు నడిచారు భూపేంద్ర.

ముందువైపు ఉన్న చిన్న తోటలో వేపచెట్టు కింద ఉన్న చెత్తను ఊడ్చి, బక్కెట్టులోకి ఎత్తి, బయటున్న డస్ట్ బిన్ లో పోసేసి తిరిగి వస్తున్నాడు ఏడుకొండలు. అప్పుడప్పుడు వచ్చే తోటమాలి, అతను శుభ్ర పరిచిన ఇరవై అడుగుల నడిచే బాటను దాటి, మెట్లు ఎక్కి, చిన్నగా తెరిచున్న గ్రిల్ గేటు సంధులో చెయ్యి దూర్చి తెరిచారు.

షూ విప్పి, ర్యాకులో పెట్టారు. అప్పుడు కుడివైపు మేడకు వెళ్ళే మెట్ల వంపు కింద, లోపలివైపు, అట్టపెట్టెలు పలు కోణాలలో ఉన్నాయి. వాటి వెనుక ఒక చిన్న శబ్ధం.

'ఇలా ఇరుకుగా పెడితే పిల్లి, ఎలుకా అన్నీ వస్తాయి...!' అనుకుంటూ అక్కడికి వెళ్ళిన ఆయన కళ్ళల్లో పడ్డది చిన్న ఊపు.

గబుక్కున అట్టపెట్టెలను తోసాడు.

వంగుని, తల వంచుకుని మోకాళ్ళ మీద కూర్చోనున్న ఒక ఆకారం, మెల్లగా తలపైకెత్తింది.

"లేవరా...లే. ఎవర్రా నువ్వు?"

గట్టిగా ఆయన గదమాయించటంతో, మెల్లగా ఆ రూపం గోడకు ఆనుకుని, పొట్ట మడతలు పడి గుంటలాగా ఉండ, మెల్లగా తల ఎత్తి నిలబడ్డది.

మురికిపట్టిన నిక్కరు, సన్నటి శరీరం, చిందరవందరగా ఉన్న తలజుట్టు, బొమికల గూడులాగా ఉన్నాడు.

వాడు కొద్దిసేపటి క్రితం ఆయన్ని దాటి పరిగెత్తిన ఆ దొంగేనని ఆయనకు అర్ధమయ్యింది.

వయసు ఎంత ఉంటుందో లెక్క వేయలేని ఒక ఆకారం.

"రారా బయటకు...నువ్వే కదా ఆ అమ్మగారి దగ్గర పూలకొట్లో పర్సు కొట్టేశావు?"

సమాధానం చెప్పకుండా తలవంచుకుని నిలబడ్డాడు.

"బయటకు రారా అంటున్నానా?...పోలీసులకు ఫోను చేస్తే మక్కెలిరక్కొడతారు"

అట్టపెట్టెలను దాటి, సన్నటి కాలును అర్జెంటుగా ఎత్తిపెట్టాడు.

కళ్ళల్లో నుండి నీళ్ళు కారుతున్నాయి.

"పోలీసుల దగ్గరకు మాత్రం చెప్పకండి" బొంగురుపోయిన కంఠంతో బ్రతిమిలాడాడు.

"ఏం...మీరు దొంగతనం చేస్తారు. పోలీసులకు మాత్రం దొరకకూడదు. దొంగ వెధవా. ఇక్కడికి ఎలారా వచ్చావు?"

వాడు గేటును చూపించాడు.

పనిచేయటం కోసం కొద్దిగా గేటును తెరిచి ఉంచాడు తోటమాలి ఏడుకొండలు.

చిన్న శబ్ధాలను వినేంత శక్తి ఏడుకొండలు చెవులకు లేవు. దొంగ వెధవ వచ్చిందో, గ్రిల్ తెరుచుకుని లోపలకు దూరిందో అతను గమనించి ఉండడు.

వాడి పొట్టను చూశారు.

వాడిని ఒక కంటితో చూస్తూనే, లోపల హాలులోకి వెళ్లే దారిలో నిలబడి లోపలకు వినబడేటట్టు అరిచాడు.

"రావ్..."

హాలును దాటి ఉన్న వంట గదిలో నుండి పంచె కట్టుకున్న ఒకాయన తొంగి చూసి "ఏంటన్నా?" అని అరిచారు.

పలు సంవత్సరాలుగా వంట చేస్తున్న హక్కుతో అడిగాడు.

"ఒక పెద్ద గ్లాసులో కాఫీ తీసుకురండి"

"ఇదిగో ఒక్క నిమిషం!"

" అనసూయ లేచిందా?"

"అమ్మగారు ఇంకా లేవలేదండీ"

భార్య వేసుకుంటున్న ప్రషర్ మాత్రలు, షుగర్ మాత్రలు ఆమెను ఎనిమిదింటికి గానీ లేవనివ్వవు అని ఆయనకు తెలుసున్నా అడిగాడు.

భయం, భయంగా నిలబడున్న వాడివైపు తిరిగి "నీ పేరు  ఏమిట్రా?"

ఎంగిలి మింగి "తూనీగ..." అన్నాడు.

"తూనీగా...అదేం పేరురా?"

కాఫీ గ్లాసుతో వచ్చిన రావ్, "ఈ అబ్బాయు ఎవరన్నా?"

"తరువాత చెబుతాను, గ్లాసు ఇటు పెట్టండి"

గ్లాసు అక్కడ పెట్టి వెనక్కి తిరిగి మేడ మెట్లు ఎక్కబోతున్న ఆయనతో "టిఫిన్ చేసేసారా?" అన్నారు.

"ఒక సెట్ ఇడ్లీలు రెడీ చేసాను అన్నా"

"వాటిని ఒక ప్లేటులో పెట్టుకుని తీసుకురండి"

ఆయన వెళ్ళిన తరువాత "ఈ కాఫీ తీసుకుని తాగు" అని చెప్ప, భయంతో చూసాడే తప్ప తీసుకోలేదు.

"తాగరా..." ఆయన పెద్దగా గదమాయించటంతో, అర్జెంటుగా కాఫీను చేతుల్లోకి తీసుకోవటమే తెలిసింది. కొద్ది క్షణాలలో ఎండిపోయున్న అతని కడుపులో ఆశ్రయిం అయ్యింది.

"తూనీగా...అదేమిట్రా పేరు"

"పెద్ద అమ్మమ్మ, ఊర్లో మిగిలిన వాళ్ళూ అలాగే పిలిచే" స్వరం బావిలో నుండి వస్తోందే తప్ప, ఉత్సాహంగా లేదు.

"పిలిచే...కేరళానా నువ్వు?"

ఐదు ఇడ్లీలనూ ఒక పళ్లెంలో పెట్టుకుని, పైన సాంబారు పోసి తీసుకు వచ్చారు రావ్. అతని చూపులు బాణంలా ఆ ప్లేటు మీద పడ్డది. నాలికపై ఊరిన నీళ్ళు, నోటి చివరలో నుండి కారింది.

"తిను..." ఆయన చెప్పక ముందే, రావ్ మెట్ల మీద పెట్టిన ప్లేటును తీసాడు.

రెండు నిమిషాల్లో ప్లేటు ఖాలీ. మంచి నీళ్ళు తీసుకుని వచ్చిన రావ్, ఆశ్చర్యంతో చూడ, ఆయన్ని లోపలకు వెళ్ళమన్నారు భూపేంద్ర.

ఇప్పుడు అతని కళ్ళల్లో కొంచం ప్రాణం వచ్చింది.

"ఏరా...దొంగ వెధవా, ఈ ఇంట్లోనూ దొంగలించటానికే కదా వచ్చి దాకున్నావు? ఇప్పుడే పోలీసులను పిలుస్తాను. తప్పించుకు పారిపోదామని చూడకు"

చేతులెత్తి దన్నం పెట్టి, ఆయన కాళ్ళ మీద పడ్డాడు.

"వద్దయ్యా...ఇక మీదట దొంగతనం చేయను"

"ఎక్కడ్నుండి వస్తున్నావు...ఎన్ని ఇళ్ళల్లో దొంగలించావు. ఏదైనా అబద్దం చెప్పావో...చంపేస్తాను"

రెండు చేతులను, గుండెల దగ్గరగా చేర్చుకుని "అయ్యా..." అన్నాడు.

ఒక్కొక్క ప్రశ్నకూ పెద్దగా గదమాయించిన తరువాతే, ఒక వాక్యం సమాధానంగా చెప్పాడు.

"ఏ ఊరురా నీకు?"

"తూర్పున చిన్న ఊరండి..." సరిగ్గా చెప్పటం రాక ఏదో చెప్పాడు.

పాలకొల్లు దగ్గర ఒక కుగ్రామం అని తెలిసింది.

"చదువుకోలేదు, వయసు తెలియదు"

మొహమూ, శరీరమూ పదిహేనేళ్ళ లాగా కనబడుతోంది. తల్లీ-తండ్రీ తెలియదు.

"పెద్దింట్లో పనిమనిషి పనిచేస్తున్న బామ్మ, ఆ పెద్దిళ్ళు మేకలను మేయటానికి కొండ వైపుకు తీసుకు వెళ్ళి, చీకటి పడిన తరువాత తీసుకు వచ్చి వదులుతాను. చద్ది అన్నం పెడతారు, పాత పంచె, నిక్కరు కూడా ఇస్తారు"

"పోయిన సంవత్సరం పెద్ద వర్షం కురిసినప్పుడు, బామ్మ చచ్చిపోయింది. పది రూపాయలు నా చేతికి ఇచ్చి, పట్నానికి వెళ్ళి బ్రతుకు తెరువు చూసుకో అని చెప్పి చనిపోయింది"

అతని తడబడ్డ మాటలతో ఒక విధంగా వాడు చెప్పింది అర్ధం చేసుకున్నారు.

పలు రైళ్ళు మారి వచ్చినతనికి, గడ్డం పెట్టుకున్న ఒకతను, అన్నం పెట్టి, ప్రయాణీకులు నిద్రపోయే సమయం వాళ్ళ బ్యాగులు ఎత్తుకు రమ్మని చెప్పి ఐదో, పదో ఇచ్చేవాడు.

అప్పుడు ఆ డబ్బు అతనికి ఆకలి తీర్చే అమృతం.

పలు నెలల తరువాత, గంజా కేసులో గడ్డం వాడితో వీడూ పోలీసులకు దొరికిపొయాడు. బాగా దెబ్బలు తిన్న తరువాత దాంట్లో వాడికి సంబంధం లేనట్లు తెలుసుకుని విడుదల చేయబడ్డాడు.

ఆ తరువాత, వీధి చివర తిను బండార బండీ షాపులో తెల్లవార్లూ పని. జీతం లేదు. భోజనం పెడతారు.

ఎవరో ఒకరు షాపు టిఫిన్ లో ఏదో ఒక పురుగు ఉందని చెప్పి పెద్ద గోల చేశాడు. అతన్ని సమాధాన పరచ, వీడి మీద నేరం మోపి, తరిమేసాడు షాపతను.

పని అడిగిన చోట తరమబడింది, మూడు రోజులు కడుపు మాడింది. గడ్డపు వాడు నేర్పించిన బ్యాగుల దొంగతనం చేసే ఆలొచన వచ్చింది.

గుడి వాకిట్లో, జాగ్రత్త లేకుండా ఉన్న అమ్మగారి బ్యాగు చూసిన వెంటనే, లాక్కుని పరుగు పెట్టాడు. అందరూ తరమటం చూసి బ్యాగును విసిరిపారేసి పరిగెత్తుకు వస్తున్నప్పుడు తెరిచున్న ఈ ఇల్లు కనబడింది.

"నిన్ను ఇలాగే వదిలితే నువ్వు దొంగాడివే అవుతావు..." అన్న ఆయన, పోలీసు స్టేషన్ కు ఫోను చేశారు.

"వద్దండీ..." అని వాడు బ్రతిమిలాడింది పట్టించుకోలేదు.

రావ్ ను పిలిచి, " ఏడుకొండలు దగ్గర చెప్పి, తోటలో ఉన్న నీళ్ళ పంపులో ఈ అబ్బాయికి స్నానం చేసే ఏర్పాట్లు చేయండి. 'డెటాల్ 'సోపు వేసి రుద్ది, కొంచం నూనె తలకు రాయమనండి. లాకెళ్లండి" అన్నారు భూపేంద్ర.

"అయ్యా వద్దండీ. నేను వెళ్ళిపోతానండీ" అన్నాడు.

మొదట స్నానం చెయ్యి. మర్యాదగా ఆయనతో వెళ్ళు. తప్పించుకు పోదామని ప్రయత్నించకు.

ఏడుకొండలు ను సహాయానికి పిలిచి, లాకెళ్లబడ్డాడు.

తన గదిలో మూలగా ఉన్న బీరువా తెరిచారు. అమెరికాలో పనిచేస్తున్న ఆయన యొక్క కొడుకు యొక్క డ్రాయర్, ప్యాంటు, చొక్కా తీసుకు వచ్చారు. రావ్ దగ్గర ఇచ్చి అతనికి తొడిగించారు.

కొంచం లూజుగా ఉన్న దుస్తులు, సరిపోలేదు. కానీ కొంచం చూడగలిగేటట్టు వచ్చి నిలబడ్డాడు.

"అయ్యా నేను దొంగతనం చెయ్యనయ్యా"

"ఏదైనా పోలీసు స్టేషన్ కు వెళ్ళిన తరువాత చెప్పు"

వాకిలిలో పోలీసు జీపు వచ్చి నిలబడింది. ఇద్దరు కానిస్టేబుల్స్ దిగారు.

"వద్దండీ..." అని మొండి కేసిన వాడిని, జరజర మంటూ లాకెల్లారు. వెళ్ళి జీపు ఎక్కించారు.

తిరిగి ఆయన వచ్చినప్పుడు, మేడ మీద నుండి చిన్న ఆవలింతతో దిగి వచ్చింది అనసూయ.

"ఇక్కడ ఏమిటి గోల?"

"అన్నీ తరువాత చెబుతాను. ఇప్పుడు స్నానం చేయటానికి టైమయ్యింది" అంటూ స్నానాల గదిలోకి వెళ్ళారు.

ప్రొద్దున టిఫిన్ ముగించుకుని, డ్రస్సు వేసుకున్న ఆయనతో, కాఫీతో వచ్చిన అనసూయ "ఇప్పుడైనా చెప్పండి"

ప్రొద్దున జరిగినదంతా చెప్పారు.

"నన్ను లేప కూడదా...నేనూ ఒక దెబ్బ వేసేదానిని కదా...?" అన్న ఆమె "ఇప్పుడు ఏం చెయ్యబోతారు" అని అడిగింది.

స్నేహితుడు కేశవ దగ్గర మాట్లాడాను. అతని కంపెనీలో వాడ్ని 'అటెండర్ ' గా చేర్చుకుంటానని చెప్పాడు. ఇంకాసేపట్లో ఆయన పోలీసు స్టేషన్ కు వెళ్ళి అతన్ని పిలుచుకు వెళతాడు.

నవ్వుతూనే "సో, జీపు పంపించి, మీ స్టేషనుకే వాడిని పంపించారు కదా ఇన్స్ పెక్టర్ సార్" అన్నది అనసూయ.

******************************************************సమాప్తం************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి