పరిష్కారం (సరికొత్త కథ)
సమస్యలను
ఎదుర్కోవడం మన జీవితంలో ఒక భాగం. మన లైఫ్‌లో వచ్చే కష్టాలు, సమస్యలతో
ఎంత పోరాడి విజయం సాధించినా.. వెంటనే ఏదో ఒక సమస్య మనకు హాయ్ చెప్తుంది. మనకు
నచ్చినా నచ్చకపోయినా జీవితం ఇలానే ఉంటుంది. చాలా సందర్భాల్లో మన లైఫ్‌లో ఏమి
జరుగుతుందనే దానిపై మనకు నియంత్రణ ఉండదు. కానీ, పరిస్థితులను
ఎలా వ్యవరిస్తున్నాం, అదే సమయంలో మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నామా? లేదా? అనేది
ముఖ్యం.
*********************************
ప్రతి రోజూ కంటే ఈ
రోజు ఇంట్లో నుండి బయలుదేరటానికి ఆలస్యమయ్యింది.
'ఈ
పాటికి క్లీనిక్కులో ఉండుంటే, ఇద్దరు పేషెంట్లనైనా చూసి ముగించి ఉండచ్చు...'
అని మనసులోనే నొచ్చుకుంటూ, హాస్పిటల్లోకి దూరారు డాక్టర్. అభినంద్. ఆయన కోసం
కాచుకోనున్న పేషెంట్లు వరుస పొడుగుగా ఉంది.
తన గదిలోకి దూరి,
కుర్చీలో తల ఆనించుకుని, కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చున్నారు. మనసు
గందరగోళంగా ఉంది. అవతలి వారి గందరగోళాన్ని తీర్చే పనిలో ఉండే ఈయనే గందరగోళంలో ఉంటే,
ఈయన్నిఎవరు బయట పడేస్తారు?
గదిలోకి వచ్చిన మరు
నిమిషమే,
పిలుపు బెల్లు కొట్టి పేషెంట్లను చూడటం ప్రారంభించే గుణం
ఉన్న డాక్టర్. అభినంద్, ఇంకా పీలవలేదే అనే ఆత్రుతతో ఇంటర్ కాం లో పిలిచింది, రిషెప్షన్లో ఉన్న అమ్మాయి..
"సార్,
పేషెంట్లందరూ, చాలాసేపటి నుంచి కాచుకోనున్నారు. లోపలకు పంపనా?"
అన్నది.
"షిట్...నాకు
తెలియదా రేవతీ. పిలిచేంత వరకు ఆగు" అని చెప్పి గబుక్కున కట్ చేసి,
నుదుటిని మెల్లగా నొక్కుకుంటూ కూర్చున్నారు డాక్టర్.
అభినంద్.
కొడుకు వంశీ,
ప్రొద్దున చేసిన ఆర్బాటం మనసును పీకుతోంది.
వంశీ పైన
కన్నవాళ్ళకు ఎనలేని ప్రేమ. డాక్టర్. అభినంద్ కు, అహల్యాకు పెళ్ళి జరిగి, మూడు
సంవత్సరాలు కాచుకున్న తరువాత పుట్టాడు. దానివలనేనేమో ఆ ప్రేమ అనే చక్రం వాడి
భవిష్యత్తును ఒక చిన్న చదురంలోనే ఇరుక్కుపోయేటట్టు చేసింది.
ఇక ఆలస్యం చేయకూడదు
కనుక,
తన ముందున్న పేషెంట్లను పిలిచే బెల్లును నొక్కి,
వాళ్ళు రావటానికి అనుమతి ఇచ్చాడు. తన ముందున్న సిస్టం లోని
ఫైలు తెరవ, మొదటి
టోకన్ కైన పేషెంటు పేరు, అతని గురించిన డీటైల్ తెరమీద తెలిసింది. లోపలకు వచ్చిన వ్యక్తికి,
45 ఏళ్ల వయసు ఉంటుంది.
అతనితోపాటూ అతని భార్య కూడా వచ్చుంది.
కుర్చీలు చూపించి, వాళ్ళు మాట్లాడనీ అని కాచుకోనున్నారు. కానీ వచ్చిన ఇద్దరూ ఏమీ మాట్లాడ కుండా
మౌనంగా కూర్చున్నారు.
"చెప్పండి
మిస్టర్ ధరణీ...ఏ విషయం కోసం ఇప్పుడు మీరు నన్ను చూడటానికి వచ్చారు?"
ధరణీ భారవైపు తిరిగి
చూడ,
ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది.
"కొన్ని
రోజులుగా ఆయన మనసు ఒత్తిడితో ఉన్నారు. అందులో నుండి బయటకు రాలేక చాలా కష్టపడుతున్నారు
సార్"
"మీరు?"
"ఆయన
భార్య జానకి"
"ఎందువల్ల
ఒత్తిడి,
దేనికైనా ఒక ప్రారంభ చుక్క ఉంటుంది కదా?"
"ఈయనకి
ఆయన తమ్ముడంటే ప్రేమ ఎక్కువ. ఐదు సంవత్సరాలకు ముందు ఈయన తమ్ముడు చనిపోయారు. ఆ లాస్
ను ఈయన తట్టుకోలేకపోయారు. అప్పట్నుంచి తాగటం మొదలుపెట్టారు,
తన పరిస్థితిని మరిచిపోయి, ఎక్కువగా తాగటం మొదలుపెట్టారు.
ఒక ఫైనాన్స్
కంపెనీలో,
15 సంవత్సరాలుగా కలెక్షన్ డిపార్ట్
మెంటులో ఉన్నారు. తాగిన మత్తులో ఒక కస్టమర్ దగ్గర గొడవచేయటంతో,
ఈయన్ని పని నుండి తీసేసారు.
ఇద్దరు పిల్లలు
చదువుతున్నారు. కుటుంబాన్ని నడపాలి. అందువలన నేను ఆ కంపెనీలో,
రెండు సంవత్సరాలుగా పనికి వెళ్తున్నాను. ఇప్పుడు తాగటం
ఆపాశారు. కానీ, ఆయన
వలన ఎక్కడ ఉద్యోగం చేయటం కుదరటం లేదు.
పనిచేసే చోట,
నా తప్పు వలన తీసేయబడ్డాను. ఆ అవమానం నుండి నేను బయటకు
రాలేకపోతున్నాను అని చెప్పి బాధ పడుతున్నారు"
ధరణీ మొహం చూస్తే,
ప్రపంచంలోనే అయ్యో పాపం మనిషిని నేనే అనేలా కూర్చోనున్నాడు.
"కొత్తగా ఏఏ
చోట్లకు ఉద్యోగానికి వెళ్లారు?" అన్నారు డాక్టర్.
"ఒక బట్టల
దుకాణం,
మార్కెటింగ్ ఏజెన్సీ, ఆ తరువాత ఒక సూపర్ మార్కెట్" అన్నది జానకి.
చేతులోతో గడ్డం
బాగాన్ని గీక్కుంటూ డాక్టర్ వైపే చూస్తున్నాడు ధరణీ. ఎందుకో ఆ ధరణీ మొహంలో తన
కొడుకు వంశీ కనబడ్డాడు. లోపల పిల్లి కూన ఒకటి ముందు కాళ్ళతో గీకుతున్న ఫీలింగ్.
పుట్టడం ఆలస్యం
అయ్యింది కనుక, జాగ్రత్తగా
చూసుకోవాలే అనే హెచ్చరిక ఫీలింగ్ లో, కన్నవారు ఇద్దరూ, వాడి స్వతంత్రంలో తల దూర్చలేదు. ఏది కావాలన్నా తన మొండి
స్వరంతో దాన్ని సాధించుకోవటం నేర్చుకున్నాడు వంశీ.
మెడికల్ సీటు కొసం
కన్నవారిద్దరూ కష్టపడుతుండగా "ఇంటరెస్టు లేదు..." అంటూ ఒకే మాటలో ఇద్దరి
కలలనూ ముగింపుకు తెచ్చాడు.
బి.ఈ కోర్సులో జేరి,
నాలుగే నెలలో కోర్సు నచ్చలేదని ఇంట్లో కూర్చున్నాడు. కుటుంబ
శ్రమకు మధ్య ఇంకొక కోర్సుకు మార్చ దాన్ని చదవటానికి కూడా ఇష్టం లేదన్నాడు. పెద్ద
చాలెంజుకు, కన్నవారి
పోరాటానికీ మధ్య ఎలాగో బి.ఈ చదివాడు. తరువాతి సమస్య తానుగా వచ్చింది.
తన పలుకుబడినంతా
ఉపయోగించి వంశీకి ఒక చిన్న కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు తండ్రి డాక్టర్.అభినంద్.
మొదటి నెల జీతం తీసుకోవటానికి ముందు, ఉద్యోగం వద్దని రిజైన్ చేసి వచ్చాడు వంశీ.
కన్న వాళ్ళిద్దరూ
షాకయ్యారు.
"ఒకరి దగ్గర
చేతులు కట్టుకుని పనిచేయాల్సిన అవసరం నాకు లేదు. ఒంటరిగా బిజినస్ చెయ్యాలని ఉన్నాను..."
అన్నాడు.
కొడుకు యొక్క తెలివి,
గుణము తెలిసుండటం వలన, వాడి ఈ మాటలను కన్నవాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు.
"సరేరా,
అందుకని నువ్వు పనిచేసిన మొదటి కంపెనీలో మొదటి నెల జీతాన్ని
కూడానా తీసుకోకుండా వదిలేసి వస్తావు. అది నీ కష్టానికైన మొదటి జీతం కాదా?"
అడిగింది అహల్య.
"ఆఫ్టర్ ఆల్
ముప్పై వేల రూపాయలు...అదంతా పెద్ద డబ్బా నాన్నా...దానికోసం సాలరీ వౌచర్లో సంతకం
పెట్టి,
అరగంట సేపు కాచుకుని పళ్ళు ఇకలిస్తూ తీసుకు రావాలా? నాకు
నచ్చలా..." అని చెప్పి, లేచి వెళ్ళిపోయాడు.
ప్రొదున,
అభినంద్ టెన్షన్ పడటానికి ఇదే కారణం.
కొడుకు గురించి
భార్యా-భర్తల మధ్య మాటల యుద్దం జరిగింది.
పరస్పరం నేరం
మోపుకున్నా, మనవల్లేనని
ఇద్దరూనూ బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడటానికి రెడీగా లేరు.
మనసును
కట్టుబాటులోకి తీసుకు రావటానికి ఆలొచనలనలను ధరణీకి చెప్పారు,
అభినంద్.
మాత్రలు ఇచ్చి
"వచ్చే వారం వచ్చి చూడండి" అని చెప్పి పంపించారు.
పేషెంటలను చూసి
ముగించటానికి మధ్యాహ్నం అయ్యింది. అసిస్టంటును భోజనం తెమ్మని పంపించి,
మొబైల్ ఫోను తీసుకోవటానికి చూసినప్పుడు,
కిటికీ దగ్గర మాటల స్వరం వినిపించింది.
క్లీనిక్ బయట వైపు
ఒక పొడవైన సిమెంటు బెంచిపై కూర్చుని, ఎవరి దగ్గరో ఫోనులో మాట్లాడుతోంది జానకి.
బయట శబ్దం ఎక్కువగా
ఉండటం వలనో ఏమో స్పీకర్ ఆన్ చేసింది జానకి. అవతలివైపు గంభీరమైన శైలిలో ఒక మహిళ
స్వరం బాగా వినబడింది.
"ఇప్పుడు
ఎక్కడున్నారు?"
"హాస్పిటల్లోనే
పిన్నీ. పక్కన ఎవరో స్నేహితుడ్ని కలవటానికి వెళ్లారు. వచ్చిన వెంటనే
బయలుదేరటమే"
"డాక్టర్ ఏం
చెప్పారు?"
మాటలను క్లుప్తంగా
కుదించి,
విషయాన్ని వివరించింది జానకి.
"నేనొకటి
చెప్పినా జానకి...ఇదంతా ఇంగ్లీష్ వైద్యానికి కట్టుబడే రోగం కాదు. చేతి వైద్యంతో
కషాయం పెట్టి, ముక్కు
పట్టుకుని తొయ్యాల్సిందే"
"పిన్నీ,
ఐదు సంవత్సరాలుగా తమ్ముడ్ని పోగొట్టుకుని,
పోగొట్టుకున్నదుఃఖంలో నుండి బయటపడలేక ఈ మనిషి కష్టపడటం
కళ్ళతో చూస్తున్నాను. ఆయన బాధను అంత తేలికగా పోగొట్ట లేము" కళ్ళను
తుడుచుకుంది జానకి.
"పోవే
పిచ్చిదానా. ఎందుకని, నీ ఇంట్లో, మా
ఇంట్లో ఎవరూ చచ్చిపోలేదా? చావూ,
పుట్టుకలు లేని ఇంట్లో నుండి ఒక పిడికెడు బియ్యం పట్టుకురా,
నీకు మరణం లేని జీవితాన్ని ఇస్తానని దేవుడు చెప్పి,
ఇవి రెండూ జీవితంలో మనిషికి సర్వ సాధారణం. అని
అర్దమయ్యేటట్టు చేసిన పురాణ కథలను మనం చదివింది లేదా?
నాన్న ఉన్నప్పుడు
నీకు 10
ఏళ్ళు. నా పెద్దకొడుకు చనిపోయి ఒక సంవత్సరం అయ్యింది.
నువ్వూ,
నేనూ, అంతెందుకు మనల్ని చేరిన వాళ్ళు ఎవరైనా ఆ దుఃఖాన్ని
సెలెబ్రేట్ చేసుకుని తిరుగుతున్నామా? లేదే.
ఎందుకంటే,
మనకు బాధ్యతలు ఉండేవి.
దుఃఖాలను కారణం చూపి బాధ్యతలను వదిలిపెట్టి స్వార్ధ పరులుగానా ఉన్నాము. నీ
భర్త చలనం కోల్పోయి నిలబడటానికి ఆ దుఃఖం మాత్రమే కారణం అనుకుంటున్నావా?
నువ్వు కూడా కారణమే"
పిన్ని చెప్పింది
విన్న తరువాత, జానకి
కంటే,
షాకయ్యింది డాక్టర్. అభినందే. చెవులకు మరింత పని ఇచ్చాడు.
"ఏమిటి పిన్నీ
చెబుతున్నారు...నేనా?"
"నువ్వే.
నీ భర్త ప్రారంభంలో పని చేసే చోట అంత శరీరక శ్రమ లేదు. ఆ ఉద్యోగాన్ని ఉంచుకోలేక
ఏదో తప్పు జరిగిపోయింది. ఆ తరువాత ఆయన ప్రతి ఉద్యోగం నుండి వచ్చేసినప్పుడు,
బద్దకమూ, నువ్వూనే కారణం.
"డబ్బులడిగి నస
పెట్టకుండా, నువ్వే
ఉద్యోగానికి వెళ్ళి, కుటుంబ బాధ్యతను తీసుకున్న తరువాత, పూర్తిగా, ఆయన దుఃఖానికి పూర్తిగా దత్త పుత్రుడయ్యాడు. ఏదో అన్ని
కష్టాలూ ఆయనకు మాత్రమే అన్నట్టు, చచ్చిపోయి, వాడిపోయిన దుఃఖాన్ని తీసుకుని భుజాలమీద వేసుకుని తన
భాద్యతలను మరిచి చుడుతున్నారు"
"ఆయనకు ఇప్పుడు
కావలసింది కౌన్సిలింగ్ కాదు. నీ భాద్యత ఇది అని ఎత్తి చూపి దవడ మీద కొట్టినట్టు
బుద్దిమతి చెప్పాలి. శరీరం కష్టపడటం మొదలుపెడితే, ఆటోమాటిక్కుగా మనసు కట్టుబాటులోకి వస్తుంది. ఇలాటి వారిని
సరిచేయాలంటే వాళ్ళకు సపోర్టు చేయకుండా వదిలేయటమే" అన్నది పిన్ని.
పొట్టలో కొట్టినట్టు
అనిపించింది డాక్టర్. అభినంద్ కు.
అనుభవ జ్ఞానం ఇచ్చే
ఉపదేశాలు,
వెయ్యికీ, రెండు వేలకీ తాను చెప్పే ఆలోచనలకంటే,
ఎంత గొప్పవో అనేది ఆ నిమిషం అర్ధమయ్యింది.
అన్నిటికంటే వంశీని పట్టించుకోకుండా
వదిలిపెట్టటం వాడ్ని బాధ్యత తెలిసేలా చేస్తుంది అనే పరిష్కారం దొరికింది.
మనస్పూర్తిగా ఆ
వార్తను,
భార్య దగ్గర చెప్పటానికి మొబైల్ ఫోను ఎత్తేరు డాక్టర్. అభినంద్.
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి