అల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఫిబ్రవరి 2023, ఆదివారం

పదిహేడవ అల…(సీరియల్)...(PART-12)


                                                                             పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                  (PART-12) 

విడాకులకు రెడీఅంటున్నారు అల్లుడు.

శ్రీనివాసమూర్తి యొక్క మనసులో చిన్నగా అంటుకోనున్న నమ్మకం పట్టు తెగిపోయింది.

"అల్లుడు గారూ...కొన్ని రోజులు అయితే అభయా మనసు మారుతుంది. ఇంతలో మీరు తొందరపడకండి" అన్నారు బొంగురు కంఠంతో.  

"ముళ్ళు మీద నిలబడినట్లు ఉంది మావయ్యా. ఈ సమస్యను ముగిస్తేనే నాకు ప్రశాంతత. మీరు ఫోనును..."

యంత్రంలాగా వెనక్కి తిరిగి కూతురు ఉన్న గదికి వెళ్ళి సెల్ ఫొనును ఆమె ముందు జాపారు.

" అల్లుడు గారే..." అన్న వెంటనే మొహం చిట్లించుకున్న అభయాతో విడాకులు  ఇవ్వటానికి అల్లుడు రెడీగానే ఉన్నారట" అన్న వెంటనే సమాధానపడి ఫోను తీసుకుంది.

"చెప్పండి"

"అభయా...కోర్టు, వకీలు నోటీసు ఇవన్నీ ఎందుకు?"

"మీతో జీవించటం నాకు ఇష్టం లేదు అనేది ఇంతకంటే నాగరీకంగా చెప్పటం నాకు తెలియదు"

"మంచిది అభయా! దానికి నువ్వు ఇంత కష్టపడి ఉండక్కర్లేదు. నా దగ్గర చెప్పుంటే నేనే సుముఖంగా విడాకులు ఇచ్చేవాడిని"

"ఇప్పటికీ ఏమీ మించిపోయింది లేదు. కోర్టులో మీరే విడాకులకు సమ్మతం చెప్పేయండి"

"సరే అభయా, అయితే  నువ్వు మీ అమ్మా--నాన్నలతో వైజాగ్ వచ్చేయి. నా తల్లి-తండ్రులూ ఇక్కడికి వచ్చేస్తారు"

"ఎందుకు?" -- అన్నది గబుక్కున.

"కోర్టు వ్యవహారం అని వచ్చేస్తే, అన్నీ చట్టపరంగా కరెక్టుగా ఉండాలి. పెళ్ళీలో నువ్వు తీసుకు వచ్చిన పట్టు చీరలూ, నగలు, సారె సామానులూ అన్నిటినీ వెనక్కి తీసుకో. ఆ తరువాత ఇక్కడే ఒక వకీలును ఏర్పాటు చేసుకుని విడాకుల పత్రంలో నేను సంతకం పెట్టి ఇచ్చేస్తాను"

అభయా కొంచం కూడా సంకోచించకుండా ఒక్క మాటలో తన భవిష్యత్తును నిర్ణయించుకుంది.

"సరే"

దుఃఖం ఏర్పడిన ఇంట్లో కూడినట్లు భార్గవ్ వైజాగ్ ఇంట్లో అతని తల్లి-తండ్రులు, అభయా, అభయా యొక్క తల్లి-తండ్రులు మౌనంగా గుమికూడి ఉన్నారు. వాళ్ళందరి మొహంలోనూ సోకం.

భార్గవ్ సారెగా తీసుకువచ్చిన ఒక్కొక్క వస్తువునూ తీసి ఇస్తున్నాడు. ఆమె ఒక్కొక్కటీ తీసుకుని పెట్టెలో సర్ధుకుంటోంది. వాళ్ళిద్దరి మొహాలు ఎటువంటి భావాలూ చూపకుండా బిగించుకుని ఉన్నాయి.

విడాకులకు సంబంధించిన ఏ కార్యంలోనూ కన్నవారు తల దూర్చక గదిలో ముడుచుకుని కూర్చోటం వలన, చేయవలసిన పనులను వీళ్ళే చేసుకుంటున్నారు.

తన కాలేజీ సర్టిఫికేట్లను కూడా జ్ఞాపకంగా తిరిగి తీసుకుని జాగ్రత్తగా పెట్టుకుంది అభయా.

భార్గవ్ ఫోనులో వకీలుతో మాట్లాడిన తరువాత ఆమెను పిలిచాడు.

"వీళ్ళెవరూ వకీలు ఆఫీసుకు రారు. మనిద్దరమే వెళదాం"

కారులో బయలుదేరారు. దారిలో, " అభయా, నీ దగ్గర ఒంటరిగా ఒక విషయం మాట్లాడవలసి ఉంది..." అన్న వెంటనే, ఒకసారి అతన్ని చూసి తరువాత ఓకే అన్నట్లు తల ఊపింది.

కారు బీచ్ వైపు రోడ్లోకి తిరిగింది.

సముద్రం తన గర్జనను, కంటిన్యూగా అలలుగా తీరానికి పంపగా, ఊరడించి వాటిని వెనక్కి పంపుతూ ఉన్నది తీరం.

అందులో దారి పొడుగునా మనుషుల గుంపు. మట్టంతా పాదల ముద్రలు. కొంచం ముందు వేడుక చూడటానికి వచ్చిన వాళ్ళూ, గాలికోసం వచ్చిన వాళ్ళూ, ప్రేమించుకోవటానికి వచ్చిన వాళ్ళూ, విడిపోయి మళ్ళీ కలుసుకోవటానికి వచ్చిన వారు అంటూ విధవిధమైన అడుగుల ముద్రలతో చేరిపోయున్నాయ వీళ్ళద్దరి అడుగుల ముద్రలు.

భార్గవ్ తో కలిసి నడుస్తున్న అభయా గబుక్కున ఆగి అతన్ని చూసింది 'ఏమిటి విషయం?' అని అడిగే చూపు.

అతను చూసిన చూపులో అస్పష్టత ఉన్నది.

"అభయా, మనం విడిపోతున్న విషయంలో నేను నిజాయితీగా నడుచుకున్నాను. కానీ నువ్వు నిజాయితీగా నడుచుకోలేదు"

ఆమె మొహం ఎర్ర బడ్డది. "ఏం చెబుతున్నారు?"

"నువ్వు గర్భంగా ఉన్న విషయాన్ని నా దగ్గర నుండి దాచావు!"

ఆమె దగ్గరున్న కోపం...గాలిపోయిన బలూన్ లాగా దిగిపోయింది.

"అది...మీ మీదున్న కోపం వలన..."

"అది మనిద్దరి బిడ్డ. మనం విడిపోవటానికి ముందు ఎలా డబ్బూ, నగలూ అన్నిటి గురించి మాట్లాడి డిషేషన్ తీసుకున్నామో, అదేలాగా...పుట్టబోయే బిడ్డ గురించి కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చుండాలి"

ఆమె మౌనంగా  నిలబడ్డది.

మన వారసుడు...తండ్రిలేని బిడ్డగా పెరగబోతోంది. నువ్వు నన్ను శిక్షిస్తున్నట్టు అనుకుని మన బిడ్డని శిక్షించబోతావు"

అభయా బిగువైన మొహంతో చెప్పింది. "అది విధి"

"విధిని నమ్ముతున్నావు. కానీ అక్షరా మరణించుటం కూడా విధి అని ఎందుకు నమ్మనంటున్నావు? -- భార్గవ్ స్వరంలో ఆరాటం ధ్వనించింది.

ఆమె స్వరం ఆవేశంగా వినబడింది "మీరే కదా మీ జాతకాన్ని మార్చి రాసారు"

లేదు... దానికి కూడా నువ్వు చెప్పిన విధియే కారణం. దొంగ జాతకాన్ని రాద్దామని మమ్మల్ని నిర్ణయింపచేసింది ఆ విధే. అదే నేను వద్దని ఖచ్చితంగా చెప్పినా నాకు తెలియకుండా అక్షరా టూ వీలర్ను నడిపించుకుని తీసుకు వెళ్ళింది"

"అబద్దం. అక్కయ్య చనిపోవడానికి కారణం మీరేనని మీ మనశ్శాక్షికి తెలుసు. అందువలనే దొంగ జాతకం రాసిన విషయాన్ని నా దగ్గర దాచారు

భార్గవ్ స్వరం పెద్దదయ్యింది "మూర్ఖురాలులాగా మాట్లాడకు! నా మనసులో కపటం ఉండుంటే జాతకాలను చింపి పారేసుండే వాడిని. నీ చూపులకు, అక్షరా చూపులకు కనబడేటట్టు బీరువాలో ఉంచేవాడిని కాను" -- 

అతను దూరంగా జరుగ, అభయా అక్కడే నిలబడింది. అమె మనసులో అలజడి అలలు మొదలైనై.

'ఇతను నిర్ధొషా? ఇతనితో కలిసి జీవించనా?' -- మనసులో పొంగిన ప్రశ్నలతో, ఎగుసుకుంటూ వస్తున్న అలలను చూసింది. 'ఈ సముద్రం నా ప్రశ్నకు జవాబు చెబుతుందా?'

భార్గవ్ తిరిగి వచ్చి పిలిచాడు.

"అభయా, ఏం చేస్తున్నావు ఇక్కడ నిలబడి. రా...వకీలు దగ్గరకు..."

అతను ఎటువంటి భావాలను బయట పడనీయకుండా పెదాలను మాత్రం కదిపాడు.

"నాలుగు..." -- అక్షరా చెప్పిన అదే అలల జ్యోతిషం.

భార్గవ్ కు అర్ధమయ్యింది. "అభయా...నువ్వు..."

తిరగకుండానే చెప్పింది. అవును. నా దావాలో ఈ సముద్రం అలలు తీర్పు రాస్తుంది.  పదిహేడు అలలలోపు ఒక అల అయినా నన్ను ముట్టుకుంటే...మనం కలిసి జీవిద్దాం...."

అతను ఆందోళన చెందాడు. 'అలలు తాకే దూరం కంటే, చాలా దూరం వెనుక నిలబడింది ఆమె. ఇంతదూరానికి ఒక అల అయినా వస్తుందా'

అభయా, కంటిన్యూ గా  నోరు తెరిచి లెక్కపెడుతోంది. "తొమ్మిది...పది..."

"..................."

"పదకుండు...

పన్నెండవ అల తిరిగి వెళ్ళిన తరువాత భార్గవ్ మనసు ఆందోళన చెందటం మొదలుపెట్టింది. అలలు వాళ్ళిద్దరి జీవితాన్ని ఒడ్డుకు చేరుస్తుందా?

పదమూడు...పద్నాలుగు...

ఊహూ...అన్ని అలలూ నాలుగైదు అడుగుల దూరంలోనే తిరిగి వెళ్ళిపోయినై. ఇప్పుడు అభయా స్వరం తగ్గింది. మొహం విలవిలపోయింది. ఒళ్ళు వణుకు పుట్టించే మంత్రం. ఉచ్చరించింది. "పదిహేను...పదహారు..."

చివరగా వచ్చిన అల.

"పదిహేడు..." -- అభయా కళ్ళు మూసుకు ఉచ్చరించినప్పుడు ఆమె పాదాలను నిదానంగా తాకి ఆశీర్వదించింది ఆ అల.

ఆ అల వేగంతో కిందకు వాలిపోతున్న ఆమెను భార్గవ్ వేగంగా పట్టుకున్నాడు. ఆమె కళ్ళల్లో ఆనంద కన్నీరు. అతన్ని కావలించుకుంది.

చిన్న గ్యాప్ తరువాత రెండు హృదయాలూ ఒకటిగా చేరడాన్ని చూసి సముద్రపు అలలు ఆనందపడ్డాయి. సాయంత్రపు ఎండ జోలపాట పాడింది. జనం చేసే గోల శబ్ధం, విష్ చేసే శబ్ధంగా మారింది.

'మర్మ 'నవలను పూర్తిగా చదవటానికి ముందే, ముగింపు తెలుసుకోవటానికి చివరిపేజీని తిప్పి చూస్తున్నట్టు, ముందుగానే జీవిత మలుపులు మనం తెలుసుకోవచ్చా ఏమిటి? లేదు...! మలుపులతో ప్రయాణం కొనసాగించవలసిందే!!

అక్కడ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని తీరాన్ని ఉద్దేశించి నడుస్తున్నారు భార్గవ్, అభయానూ. ఆమె కడుపులో ఆనంద అల.

************************************************సమాప్తం******************************************

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

పదిహేడవ అల…(సీరియల్)...(PART-11)


                                                                                 పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                 (PART-11) 

నది మధ్యలో నుండి గట్టువైపుకు ఈతకొడుతున్న మనిషి...హఠాత్తుగా సుడిగుండంలో చిక్కుకుని మునిగిపోతున్నప్పుడు ఎంత వేదన అనుభవిస్తాడో అదే వేదనను అనుభవించింది ప్రియా.

ఆమె ముఖం వేసంకాల ఎండలో ఎండిపోయిన మల్లె పువ్వు లాగా వాడిపోయున్నది. ఒంట్లోని నీరసంతో పాటూ, మనసు కష్టమూ కలిసి నరక వేదన పడుతొంది.

ఆమె మనసులో సడన్ తుఫాన.

అక్కర్లేని విజిటర్ వస్తే తిరిగి పంపించేయాలి?

తన శక్తినంతా కూడబెట్టుకుని లేచింది.

కన్న తల్లి ఆందోళన పడింది. అలాగే పడుకో...ఎందుకు లేస్తున్నావు?”

హాస్పిటల్ కు వెళ్తానమ్మా. గర్భాన్ని తీయించుకుంటాను

చెప్పి ముగించేలోపు ఫడేల్ మని చెంపమీద దెబ్బ పడింది! అలాగే మంచం మీద పడిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్ళు పారుతోంది.

అన్నపూర్ణ ఆవేశంగా మాట్లాడింది. ఒక బిడ్డలేదేనని ఎంతో మంది తపస్సు చేస్తున్నారు? నువ్వేమిట్రా అంటే...ప్రాణం పోసుకున్న పిండాన్ని  తీయించుకుంటానంటున్నావే... పాపిస్టిదానా

అభయా ఏడుస్తున్న శబ్ధం విని వచ్చిన శ్రీనివాసమూర్తి  వివరం తెలుసుకున్న తరువాత పార్టీ మారారు. కూతురు పార్టీ నుండి భార్య పార్టీకి!

నీ లోపల ఒక ప్రాణం సృష్టించబడి ఉన్నది. నువ్వు నీ భర్తతో కలిసి జీవించటమే మంచిది

అది నావల్ల కాదు నాన్నా. అక్కయ్య చావుకు కారణంగా ఉన్న ఆయనకి ఆయనకు నేను వేస్తున్న శిక్షే ఇది...

ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే...కన్ ఫ్యూజన్, దుఃఖంతో షాకై నిలబడ్డారు శ్రీనివాసమూర్తి, అన్నపూర్ణనూ!

దిక్కు తెలియని అడవిలో చిక్కుకుని, బయటకు వెళ్లటానికి దారి తెలియక కొట్టుకుంటున్నప్పుడు, నమ్మకం ఇచ్చేలాగా ఒకే ఒక సన్నని బాట కంటికి కనబడితే...అలాగే ఉన్నది భార్గవ్ కు ఆ వార్త విన్నప్పుడు!

అభయా వాళ్ళ అమ్మ హఠాత్తుగా ఫోను చేసింది. ఒకటి రెండు మాటల్లో కుశల ప్రశ్నలు అడిగి తరువాత చెప్పింది.

అల్లుడుగారూ...ఒక సంతోషమైన విషయం. అభయా గర్భంగా ఉంది. ఇప్పుడు మూడోనెల

జీవితంలో కొన్ని క్షణాలు అద్భుతమైనవి. అందులో ఒకటి, ఒక మగాడికి... నీ రక్త బంధం -- వారిసు, అభివ్రుద్ది చెందుతోంది అని ప్రకటన చేసే సమయమే. కుటుంబమంతా కుతూహలంగా సెలెబ్రేట్ చేసుకోవలసిన వార్తను అత్తగారి ద్వారా దొంగతనంగ తెలుసుకోవలసి వచ్చింది.

భార్గవ్ కళ్ళల్లో కన్నీరు చేరినై. గొంతుక ఎండిపోయింది.

అల్లుడు గారూ... అవతల పక్క అన్నపూర్ణ స్వరం బొంగురుపోయుంది.

ఇప్పుడు కూడా ఆమె మీ మీద కోపంతోనే ఉంది. నేను దానికి తెలియకుండా ఫోను చేస్తున్నాను. తెలిస్తే నన్ను తిడుతుంది

సరే...అత్తయ్యా...

అన్నపూర్ణ ఫోన్ కట్ చేసింది.

భార్యను నొప్పితో విడిపోయినతని రాత్రులు ఘోరమైనవై,  గడిచిన రోజుల  జ్ఞాపకాలు, జరుగుతున్న కాలం వేదనలు అన్నీ కలిసి అతన్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. రాత్రిపూట నిద్ర పట్టక అవస్త పడి, తెల్లవారు జామున నిద్రపొయాడు.

పొద్దున కళ్ళు తెరిచినప్పుడు సోఫాలో ఉన్న కాగితం గాలికి టపటప అంటోంది. న్యాయస్థానం ద్వారా ముందు రోజు అభయా పంపించిన విడాకుల నోటీస్ అది.

భార్గవ్ కి తెల్లవారు జామున వచ్చిన కల...జ్ఞాపకానికి వచ్చింది. అతని మనసు బండరాయి మోపినట్లు బరువెక్కటం మొదలయ్యింది.

ఆ కలలో...

మంచు కురుస్తున్న లండన్ విమానాశ్రయం. శరీరం సన్నబడి తలనెరిసి వయసైన రూపంలో వస్తున్న భార్గవ్. పలు సంవత్సరాలకు ముందే అభయాను విడిపోయి లండన్ కంపనీ ఒక దాంట్లో ఉద్యోగానికి చేరింది మెరుపులాగా జ్ఞాపకాలలో...ఇండియా వెళ్ళే విమానంలో ఎక్కి సీటు వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు కాలు తడబడి కిందపడిపోతున్న అతన్ని పట్టుకున్న యుక్త వయసు అమ్మాయి లేత చేతులు.

తిరిగితే... అక్షరా! అవును, ఆమే.

నువ్వు...నువ్వు... అంటూ అతను తడబడుతున్నప్పుడు ఆమె వెనుక వయసైన రూపంలో వచ్చి నిలబడింది అభయా. ఆమె కళ్ళల్లో కన్నీరు.

ఇది మన కూతూరేనండి. అక్క పేరే పెట్టాను

అక్షరానే మరుజన్మ ఎత్తినట్లు చిన్న అక్షరా.

అక్షరా... -- బొంగురు కంఠంతో అతను పిలిచినప్పుడు, కల చెదిరి మెళుకువ వచ్చేసింది.

ఎన్నో సినిమాలలో చూసిన ముగింపు! మొగుడూ, పెళ్ళాం విడిపోయి జీవించి ఇరవై ఏళ్ళ జీవితాన్ని పారేసుకున్న తరువాత...తమ కూతురు ద్వారా ఒకటి చేరే ముగింపు.

అది తన జీవితంలోనూ జరుగుతుందా?

భార్గవ్ మనసు ఆందోళన చెందటం మొదలుపెట్టింది. గుడిసెలో తగలబడి మండుతున్న మంటలను చూసి భయపడి వెళ్ళి ఆర్పటానికి హడావిడి పడుతున్న మనిషిలాగా...వెంటనే ఈ సమస్యను తీర్చేయలని అతని మనసు తొందరపడుతోంది.

ఒక నిర్ణయంతో మంచం మీద నుండి లేచాడు.

కుటుంబంలో ఒకరికి రోగం వచ్చినా కూడా మిగిలిన వాళ్ళు ఆ రోగం యొక్క వేదనను అనుభవిస్తారు. అనురాగం అలాంటిది. శ్రీనివాసమూర్తి అలాగే కలత చెంది ఉన్నారు. ఆయన సెల్ ఫోన్ మోగటంతో...మెల్లగా తీసి చూసి ఆయన ఆందోళన చెందారు.

అవతల సైడు భార్గవ్.

అల్లుడూ…

బాగున్నారా?’ అనేటట్టు అనవసరమైన మాటలు లేకుండా తిన్నగా విషయానికి వచ్చాడు.

మావయ్యా, అభయా దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోను ఆమె దగ్గర ఇవ్వండి

ఆయన కన్ ఫ్యూజన్ తో అడిగారు. ఏం విషయం అల్లుడూ?”

నేను విడాకులు ఇవ్వటానికి రెడీగా ఉన్నాను...అందుకే

ఆయనకు గుండె గుభేలుమంది.

                                                                                                Continued...PART-12

***************************************************************************************************

15, ఫిబ్రవరి 2023, బుధవారం

పదిహేడవ అల…(సీరియల్)...(PART-10)


                                                                                పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                (PART-10) 

అన్నపూర్ణ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది, తరువాత తమాయించుకుని, “...రండి... అన్నది.

ప్రకాశ రావ్, ప్రభావతి లోపలకు అడుగుపెడుతుంటే అభయా వేగంగా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. ఇంటికి వచ్చిన వియ్యంకులను చూసిన  వెంటనే మొహం వికసించి, ఉత్సాహంగా స్వాగతించే స్వాగతం లేదు. ఇష్టం లేనట్లే స్వాగతిస్తునట్టు శ్రీనివాసమూర్తి ఇంకెక్కేడో చూసుకుంటూ రండి...రండి... అన్నారు. 

వాళ్ళు అక్కడకొచ్చిన పరిస్థితి అలాంటిది. చూస్తేనే నోరూరించే మంచి భోజనాన్ని, జ్వరం వచ్చి, ఒళ్ళు కాలుతుంటే చూసినప్పుడు కడుపులో తిప్పుతూ వాంతి వస్తుంది. ట్రబుల్, ఒంట్లో పరిస్థితే తప్ప, భోజనం తప్పు కాదు. ఇప్పుడు అభయా కన్నవాళ్ళు...జ్వరం వచ్చిన వారి పరిస్థితిలోనే ఉన్నారు.

కూర్చోండి

కూర్చున్నారు.

ఏమిటి బావగారూ...బాగున్నారా? అభయా బాగుందా?”

మొహం తిప్పుకునే సమాధానం వచ్చింది. ...

తాగటానికి మంచి నీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చిన అన్నపూర్ణ, “కాఫీ తీసుకువస్తాను...అంటూ జారుకుందామనుకుంది.

కాఫీ తరువాత ఇద్దురుగాని వదినా. మీరు ఉండండి. ఒక ముఖ్యమైన విషయం  మాట్లాడాల్సి ఉంది అంటూ ఆపింది ప్రభావతి.

వైజాగ్ వెళ్ళినప్పుడు భార్గవ్ చెప్పాడు. కోపగించుకుని అభయా ఇక్కడికి వచ్చేసిందట?” అని ప్రకాశ రావ్ మొదలుపెట్టారు.

మీ అబ్బాయి...జాతకాన్ని మార్చి మోసం చేసింది న్యాయమా? మీరే చెప్పండి?” -- ఎదుటి వారి దగ్గర నుండి మాటలు మొదలైనై.

బావగారూ...నిజం చెప్పాలంటే -- కులం కాని కులంలో పెళ్ళి చేస్తున్నామని మేము జాతక విషయాన్ని గురించి ఆలొచించనే లేదు. ఇప్పుడు సమస్య మొదలైన తరువాతే జరిగిన విషయమే మాకు తెలుసు

నకిలీ జాతకాన్ని నమ్మి పెళ్ళి చేయటంతో భార్గవ్ యొక్క రాశి, నక్షత్రము అక్షరా ని ప్రమాదంలో చంపేసింది -- చెబుతున్నప్పుడే శ్రీనివాసమూర్తి స్వరం బొంగురుపోయింది. పక్కనే ఉన్న అన్నపూర్ణ కూడా కళ్ళు తుడుచుకుంది.

ఒక విషయం బావగారూ. అక్షరానే జాతకాన్ని మార్చి రాయాలని పట్టుపట్టి చెప్పిందట. అందువలనే ఇద్దరూ కలిసి వెళ్ళి జ్యోతిష్కుడుతో నకిలీ జాతకం రాయిపించారు. అభయా నకిలీ జాతకం రాసిచ్చిన జ్యోతిష్కుడుని కలిసుంటే,  ఎవరు నకిలీ జాతకం రాసిమన్నారో జ్యోతిష్కుడే మీకు వివరంగా చెప్పుంటారు. ఇందులో భార్గవ్ తప్పు లేదు బావగారూ. అతను చేసిన తప్పంతా ప్రేమించిన . అక్షరా పట్టుదలకు లొంగిపోవటమే 

మీరు సులభంగా చెప్పేసారు. మోసంలో చనిపోయింది మా అమ్మాయే కదా?”

భార్గవ్ జీవితం కూడా బాధింపుకు గురి అయ్యింది. అక్షరా చనిపోయిన దుఃఖంలో నడుస్తున్న శవంలాగా జీవించాడు. ఇప్పుడు అభయాని పెళ్ళి చేసి ఇచ్చిన  తరువాతే మంచిగా ఉంటున్నాడు. వాడ్ని మళ్ళీ నొప్పించేటట్టు ఈమె వేరుగా  వస్తే ఎలాగండీ?”  

ఆమె విషయాన్ని తట్టుకలేకపోతోంది

ఆమె దగ్గర మేము మాట్లాడి చూస్తాము. అభయాను పిలవండి

అభయా ఉన్న గది దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టింది తల్లి.

మీ అత్తయ్య, మావయ్యా వచ్చారమ్మా. బయటకురా

లోపల నుండి సమాధానమూ లేదు. అనుమానంతో తలుపు సంధుల్లోంచి లోపలకు చూసేసి మూలలో కూర్చోనుంది అన్నది.

ప్రభావతి కూడా లేచి వెళ్ళి తలుపు తట్టింది. అభయా...నీ దగ్గర మాట్లాడాలమ్మా

గోడకు ఆనుకుని కూర్చోనున్న ఆమె, మోకాళ్ళ మధ్యలో ముఖం దాచుకుని  ఏడ్చింది. లేచి రాలేదు.

మంటలు, ఆర్పే ప్రయత్నాలకు లొంగి పోకుండా మండుతున్నప్పుడు అగ్నిమాపకదళం వచ్చి నీళ్ళు పోసినా మాత్రం ఆరిపోతుందా? కాల్చి వేయాల్సిన వాటిని కాల్చి బూడిద చేసిన తరువాతే కదా ఆరిపోతున్నాయి? మనుషుల కోపతాపాలు కూడా మంటలలాగానే...బంధుత్వాలు నేలకొరిగిపోయేంత వరకు తగ్గనే తగ్గదు.

బావగారూ, మీరైనా కూతురికి బుద్ది చెప్పండి అన్నాడు ప్రకాష రావ్.

నా కూతురు న్యాయంగానే నడుచుకుంటోంది. మీ అబ్బాయే అనవసర విత్తనాలను చల్లాడు. విత్తనాలనే ఏరిపారేయాలి

ప్రకాష రావ్, ప్రభావతి నూ ఓటమితో ఇంటి నుండి బయటకు వస్తున్నప్పుడు వాళ్ల మనసును ఒక ప్రశ్న వేధించుకు తింటోంది.

ఇక భార్గవ్ జీవితం ఏమవుతుంది?’

మధ్యరాత్రి, చాలాసేపటివరకు నిద్ర రాక పొర్లాడుతున్నది అభయా. కళ్ళల్లో కన్నీరు.

అక్కా నీ మరణానికి కారణం విధి మాత్రమే కాదు...తెలిసే నిన్ను బలి ఇచ్చిన భార్గవ్ స్వార్ధం కూడా ఒక కారణమే!

చిటికడి విషం, బిందెడు పాలను నాశనం చేసినట్లే అభయా యొక్క జ్ఞాపకాలలో భార్గవ్ మీద ఏర్పడిన విరక్తి ఆమె మనసంతటినీ తీవ్రంగా ఆక్రమించింది.

తమ్ముడూ. నీ భార్య ఎక్కడ...? ఊరికి వెళ్ళిందా?”

భార్గవ్ తన ఇంటి తలుపులు తెరుస్తున్నప్పుడు అడిగింది పక్కింటి ఆవిడ.

అవునండీ -- తలవంచుకుని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు.

ఇల్లు మొత్తం ఒకటే దుమ్ము. దుస్తులు అక్కడా ఇక్కడా పడున్నాయి. వంటగది గట్టు మీద బొద్దింకలు. పక్కన ఎలుకలు పరిగెత్తి ఆడుకుంటున్నాయి.

భార్య మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇల్లు భక్తులు రాక -- పొదలు, పిచ్చి చెట్లు, పాడైపోయిన పాడుబడ్డ గుడి లాగా అయిపోతుంది.

చూపులు లేని ఒకడు శస్త్ర చికిత్స ద్వారా కంటి మార్పిడి జరిగి వెలుతురును చూసి ఆనందించేటప్పుడు. మళ్ళీ అతను చూపు పోగొట్టుకుని, గుడ్డివాడై చీకట్లో అవస్త పడటం జరిగితే...

అలా ఒక కష్టాన్ని అనుభవిస్తున్నాడు భార్గవ్.

అక్షరా చనిపోయినప్పుడు అతనికున్నది దుఃఖం మాత్రమే. ఇప్పుడు అభయా విడిపోయి వెళ్ళినప్పుడు, అక్షరా మరణానికి అతనే కారణం అంటూ నేర భావమూ కలిసి ఏర్పడింది. హోటల్ భొజనం, మాట్లాడుకోవటానికి కూడా తోడులేకపోవటం. ఒంటరిగా ఉండటం. జీవితంతోటి దుఃఖం, అవమానం వేరే!

ఇది చాలదన్నట్లు చుట్టుపక్కల ఉన్నవారు మీ భార్య ఎక్కడ?” అని అడిగి...గాయం ఏర్పడిన చోట ముల్లుతో గుచ్చుతున్నట్లు ఉంది.

తన తల్లీ, తండ్రీ ఆమెను ఓదార్చి, సమాధానపరిచి పిలుచుకు వస్తారని నమ్మాడు. కొంతసేపటి క్రితం తండ్రి దగ్గర నుండి వచ్చిన సెల్ ఫోన్ పిలుపు, నమ్మకాన్ని ముక్కలు చేసింది.

భార్గవా, నీ మామగారు మాట్లాడకుండా మొహం చాటేశారు. అభయా ఒక గదిలోపలకి దూరి, తలుపులు మూసుకుని బయటకు రానని చెప్పేసింది

అందరికీ ఇలాంటి ఇబ్బందికరమైన తరుణాలు వస్తూ ఉంటాయి. అన్నీ ఉండి, ఏమీ లేనట్లు ఒంటరి జీవితం గడపటంలో ఉన్న క్రూరత్వాన్ని అతను అనుభవిస్తూ ఉన్నాడు.

మనసులో ఒక ఆవేశం మొదలయ్యింది.

అభయా తిరిగొచ్చి తనతో కాపురం చేయకపోయినా పరవాలేదు, తాను కావాలనే అక్షరాని చనిపోయేటట్టు చేసినట్టు అనుకుంటోంది... ఆలొచననైనా మార్చే కావాలి.

సెల్ ఫోన్ తీసుకుని నెంబర్లు నొక్కాడు.

కొంత విరామం తరువాత అవతలి పక్కనుండి...హలో అన్నది.

స్వరాన్ని గుర్తు పట్టగలిగాడు. అభయా తల్లి అన్నపూర్ణ.

అత్తయ్యా -- నేను భార్గవ్ మాట్లాడుతున్నాను

అవతలి వైపున్న అన్నపూర్ణ స్వరం వణికింది.  

అల్లుడుగారూ...మీరా?”

అత్తయ్యా, అభయాతో మాట్లాడాలి. నా తరఫు న్యాయాన్ని చివరిసారిగా ఒకసారి ఆమెతో చెప్పేయాలి. ఆమెను మాట్లాడమనండి

ఆమె ఇంట్లో లేదండీ

అలా చెప్పమన్నదా? నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాటను తానే నాతో చెప్పమనండి

నిజంగానే అభయా ఇంట్లోలేదు అల్లుడూ. వాళ్ళ నాన్నతో కలిసి బయటకు వెళ్ళింది

ఎక్కడికి?”

కొంచం తడబడిన తరువాత ఏడుపుతో సమాధానం వచ్చింది.

వకీలు దగ్గరకు వెళ్ళింది. మీ దగ్గర నుండి విడాకులు పొందటానికి దావా వేస్తుందట

షాక్ లో అతని చేతులు వణుక, సెల్ ఫోన్ జారి కింద పడి విరిగిపోయింది.

ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అభయా మొహం చెమట పట్టుంది. అది గమనించకుండా శ్రీనివాసమూర్తి, “వకీలును ఏర్పాటు చేసి దావా వేసేశాము అని చెబుతున్నారు.

అన్నపూర్ణ మాత్రం కూతుర్ని గమనించింది. ఏమిటి అభయా...అదొలా ఉన్నావు?” అని ప్రేమతో విచారించింది.

తల తిప్పుతున్నట్టు ఉందమ్మా?” అన్న ఆమె వేగంగా ఇంటి వెనుకకు వెళ్ళింది. ఆమెను పట్టుకోవటానికి పరిగెత్తింది అన్నపూర్ణ.

ఉవ్వ... వాంతి చేసుకుంటున్న శబ్ధం.

చూసమ్మాయ్... అంటూ తల్లి జాలి చూపింది.

తల్లీ-కూతుర్లు గుసగుసమని మాట్లాడుకుంటున్న శబ్ధం. అభయాని ఆమె గదిలోకి తీసుకు వెళ్ళి పడుకోబెట్టి అన్నపూర్ణ బయటకు వచ్చి భర్తతో చెప్పింది.

అభయా గర్భంతో ఉంది

శ్రీనివాసమూర్తి షాక్ తో శిలలా నిలబడ్డారు.

                                                                                            Continued...PART-11

***************************************************************************************************