పదిహేడవ అల…(సీరియల్) (PART-11)
నది మధ్యలో
నుండి గట్టువైపుకు
ఈతకొడుతున్న మనిషి...హఠాత్తుగా
సుడిగుండంలో చిక్కుకుని
మునిగిపోతున్నప్పుడు ఎంత వేదన
అనుభవిస్తాడో అదే
వేదనను అనుభవించింది
ప్రియా.
ఆమె ముఖం
వేసంకాల ఎండలో
ఎండిపోయిన మల్లె
పువ్వు లాగా
వాడిపోయున్నది.
ఒంట్లోని నీరసంతో
పాటూ, మనసు
కష్టమూ కలిసి
నరక వేదన
పడుతొంది.
ఆమె మనసులో
సడన్ తుఫాన.
అక్కర్లేని విజిటర్
వస్తే తిరిగి
పంపించేయాలి?
తన శక్తినంతా
కూడబెట్టుకుని
లేచింది.
కన్న తల్లి
ఆందోళన పడింది.
“అలాగే
పడుకో...ఎందుకు
లేస్తున్నావు?”
“హాస్పిటల్
కు వెళ్తానమ్మా.
ఈ గర్భాన్ని
తీయించుకుంటాను”
చెప్పి ముగించేలోపు
ఫడేల్ మని
చెంపమీద దెబ్బ
పడింది! అలాగే
మంచం మీద
పడిపోయింది. ఆమె
కళ్ళ నుండి
కన్నీళ్ళు పారుతోంది.
అన్నపూర్ణ ఆవేశంగా
మాట్లాడింది. “ఒక
బిడ్డలేదేనని ఎంతో
మంది తపస్సు
చేస్తున్నారు? నువ్వేమిట్రా
అంటే...ప్రాణం
పోసుకున్న పిండాన్ని
తీయించుకుంటానంటున్నావే... పాపిస్టిదానా”
అభయా ఏడుస్తున్న
శబ్ధం విని
వచ్చిన శ్రీనివాసమూర్తి
వివరం
తెలుసుకున్న తరువాత
పార్టీ మారారు.
కూతురు పార్టీ
నుండి భార్య
పార్టీకి!
“నీ
లోపల ఒక
ప్రాణం సృష్టించబడి
ఉన్నది. నువ్వు
నీ భర్తతో
కలిసి జీవించటమే
మంచిది”
“అది
నావల్ల కాదు
నాన్నా. అక్కయ్య
చావుకు కారణంగా
ఉన్న ఆయనకి…
ఆయనకు నేను
వేస్తున్న శిక్షే
ఇది...”
ఆమె వెక్కి
వెక్కి ఏడుస్తుంటే...కన్
ఫ్యూజన్, దుఃఖంతో
షాకై నిలబడ్డారు
శ్రీనివాసమూర్తి, అన్నపూర్ణనూ!
దిక్కు తెలియని అడవిలో చిక్కుకుని,
బయటకు వెళ్లటానికి దారి తెలియక కొట్టుకుంటున్నప్పుడు, నమ్మకం ఇచ్చేలాగా ఒకే ఒక సన్నని బాట కంటికి కనబడితే...అలాగే ఉన్నది భార్గవ్
కు ఆ వార్త విన్నప్పుడు!
అభయా వాళ్ళ అమ్మ హఠాత్తుగా ఫోను చేసింది.
ఒకటి రెండు మాటల్లో కుశల ప్రశ్నలు అడిగి తరువాత చెప్పింది.
“అల్లుడుగారూ...ఒక
సంతోషమైన విషయం. అభయా గర్భంగా ఉంది. ఇప్పుడు మూడోనెల”
జీవితంలో కొన్ని క్షణాలు అద్భుతమైనవి.
అందులో ఒకటి, ఒక మగాడికి... ‘ నీ రక్త బంధం -- వారిసు, అభివ్రుద్ది చెందుతోంది ’
అని ప్రకటన చేసే సమయమే. కుటుంబమంతా కుతూహలంగా సెలెబ్రేట్
చేసుకోవలసిన వార్తను అత్తగారి ద్వారా దొంగతనంగ తెలుసుకోవలసి వచ్చింది.
భార్గవ్ కళ్ళల్లో కన్నీరు చేరినై. గొంతుక
ఎండిపోయింది.
“అల్లుడు గారూ...” అవతల పక్క అన్నపూర్ణ స్వరం బొంగురుపోయుంది.
“ఇప్పుడు కూడా ఆమె మీ మీద
కోపంతోనే ఉంది. నేను దానికి తెలియకుండా ఫోను చేస్తున్నాను. తెలిస్తే నన్ను
తిడుతుంది”
“సరే...అత్తయ్యా...”
అన్నపూర్ణ ఫోన్ కట్ చేసింది.
భార్యను నొప్పితో విడిపోయినతని రాత్రులు
ఘోరమైనవై, గడిచిన రోజుల జ్ఞాపకాలు, జరుగుతున్న
కాలం వేదనలు అన్నీ కలిసి అతన్ని నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. రాత్రిపూట నిద్ర
పట్టక అవస్త పడి, తెల్లవారు జామున నిద్రపొయాడు.
పొద్దున కళ్ళు తెరిచినప్పుడు సోఫాలో ఉన్న
కాగితం గాలికి టపటప అంటోంది. న్యాయస్థానం ద్వారా ముందు రోజు అభయా పంపించిన విడాకుల
నోటీస్ అది.
భార్గవ్ కి తెల్లవారు జామున వచ్చిన
కల...జ్ఞాపకానికి వచ్చింది. అతని మనసు బండరాయి మోపినట్లు బరువెక్కటం మొదలయ్యింది.
ఆ కలలో...
మంచు కురుస్తున్న లండన్ విమానాశ్రయం.
శరీరం సన్నబడి తలనెరిసి వయసైన రూపంలో వస్తున్న భార్గవ్. పలు సంవత్సరాలకు ముందే అభయాను
విడిపోయి లండన్ కంపనీ ఒక దాంట్లో ఉద్యోగానికి చేరింది మెరుపులాగా
జ్ఞాపకాలలో...ఇండియా వెళ్ళే విమానంలో ఎక్కి సీటు వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు కాలు
తడబడి కిందపడిపోతున్న అతన్ని పట్టుకున్న యుక్త వయసు అమ్మాయి లేత చేతులు.
తిరిగితే... అక్షరా!
అవును, ఆమే.
“నువ్వు...నువ్వు...” అంటూ అతను తడబడుతున్నప్పుడు ఆమె వెనుక వయసైన రూపంలో వచ్చి నిలబడింది అభయా.
ఆమె కళ్ళల్లో కన్నీరు.
“ఇది మన కూతూరేనండి. అక్క
పేరే పెట్టాను”
అక్షరానే మరుజన్మ ఎత్తినట్లు చిన్న అక్షరా.
“అక్షరా...” -- బొంగురు కంఠంతో అతను పిలిచినప్పుడు, కల చెదిరి
మెళుకువ వచ్చేసింది.
ఎన్నో సినిమాలలో చూసిన ముగింపు! మొగుడూ,
పెళ్ళాం విడిపోయి జీవించి ఇరవై ఏళ్ళ జీవితాన్ని పారేసుకున్న
తరువాత...తమ కూతురు ద్వారా ఒకటి చేరే ముగింపు.
అది తన జీవితంలోనూ జరుగుతుందా?
భార్గవ్ మనసు ఆందోళన చెందటం
మొదలుపెట్టింది. గుడిసెలో తగలబడి మండుతున్న మంటలను చూసి భయపడి వెళ్ళి ఆర్పటానికి
హడావిడి పడుతున్న మనిషిలాగా...వెంటనే ఈ సమస్యను తీర్చేయలని అతని మనసు
తొందరపడుతోంది.
ఒక నిర్ణయంతో మంచం మీద నుండి లేచాడు.
కుటుంబంలో ఒకరికి రోగం వచ్చినా కూడా
మిగిలిన వాళ్ళు ఆ రోగం యొక్క వేదనను అనుభవిస్తారు. అనురాగం అలాంటిది. శ్రీనివాసమూర్తి
అలాగే కలత చెంది ఉన్నారు. ఆయన సెల్ ఫోన్ మోగటంతో...మెల్లగా తీసి చూసి ఆయన ఆందోళన
చెందారు.
అవతల సైడు భార్గవ్.
“అల్లుడూ…”
‘బాగున్నారా?’ అనేటట్టు అనవసరమైన మాటలు లేకుండా తిన్నగా విషయానికి వచ్చాడు.
“మావయ్యా, అభయా దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఫోను ఆమె దగ్గర ఇవ్వండి”
ఆయన కన్ ఫ్యూజన్ తో అడిగారు. “ఏం విషయం అల్లుడూ?”
“నేను విడాకులు ఇవ్వటానికి
రెడీగా ఉన్నాను...అందుకే”
ఆయనకు గుండె గుభేలుమంది.
Continued...PART-12
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి