15, ఫిబ్రవరి 2023, బుధవారం

పదిహేడవ అల…(సీరియల్)...(PART-10)


                                                                                పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                (PART-10) 

అన్నపూర్ణ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది, తరువాత తమాయించుకుని, “...రండి... అన్నది.

ప్రకాశ రావ్, ప్రభావతి లోపలకు అడుగుపెడుతుంటే అభయా వేగంగా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. ఇంటికి వచ్చిన వియ్యంకులను చూసిన  వెంటనే మొహం వికసించి, ఉత్సాహంగా స్వాగతించే స్వాగతం లేదు. ఇష్టం లేనట్లే స్వాగతిస్తునట్టు శ్రీనివాసమూర్తి ఇంకెక్కేడో చూసుకుంటూ రండి...రండి... అన్నారు. 

వాళ్ళు అక్కడకొచ్చిన పరిస్థితి అలాంటిది. చూస్తేనే నోరూరించే మంచి భోజనాన్ని, జ్వరం వచ్చి, ఒళ్ళు కాలుతుంటే చూసినప్పుడు కడుపులో తిప్పుతూ వాంతి వస్తుంది. ట్రబుల్, ఒంట్లో పరిస్థితే తప్ప, భోజనం తప్పు కాదు. ఇప్పుడు అభయా కన్నవాళ్ళు...జ్వరం వచ్చిన వారి పరిస్థితిలోనే ఉన్నారు.

కూర్చోండి

కూర్చున్నారు.

ఏమిటి బావగారూ...బాగున్నారా? అభయా బాగుందా?”

మొహం తిప్పుకునే సమాధానం వచ్చింది. ...

తాగటానికి మంచి నీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చిన అన్నపూర్ణ, “కాఫీ తీసుకువస్తాను...అంటూ జారుకుందామనుకుంది.

కాఫీ తరువాత ఇద్దురుగాని వదినా. మీరు ఉండండి. ఒక ముఖ్యమైన విషయం  మాట్లాడాల్సి ఉంది అంటూ ఆపింది ప్రభావతి.

వైజాగ్ వెళ్ళినప్పుడు భార్గవ్ చెప్పాడు. కోపగించుకుని అభయా ఇక్కడికి వచ్చేసిందట?” అని ప్రకాశ రావ్ మొదలుపెట్టారు.

మీ అబ్బాయి...జాతకాన్ని మార్చి మోసం చేసింది న్యాయమా? మీరే చెప్పండి?” -- ఎదుటి వారి దగ్గర నుండి మాటలు మొదలైనై.

బావగారూ...నిజం చెప్పాలంటే -- కులం కాని కులంలో పెళ్ళి చేస్తున్నామని మేము జాతక విషయాన్ని గురించి ఆలొచించనే లేదు. ఇప్పుడు సమస్య మొదలైన తరువాతే జరిగిన విషయమే మాకు తెలుసు

నకిలీ జాతకాన్ని నమ్మి పెళ్ళి చేయటంతో భార్గవ్ యొక్క రాశి, నక్షత్రము అక్షరా ని ప్రమాదంలో చంపేసింది -- చెబుతున్నప్పుడే శ్రీనివాసమూర్తి స్వరం బొంగురుపోయింది. పక్కనే ఉన్న అన్నపూర్ణ కూడా కళ్ళు తుడుచుకుంది.

ఒక విషయం బావగారూ. అక్షరానే జాతకాన్ని మార్చి రాయాలని పట్టుపట్టి చెప్పిందట. అందువలనే ఇద్దరూ కలిసి వెళ్ళి జ్యోతిష్కుడుతో నకిలీ జాతకం రాయిపించారు. అభయా నకిలీ జాతకం రాసిచ్చిన జ్యోతిష్కుడుని కలిసుంటే,  ఎవరు నకిలీ జాతకం రాసిమన్నారో జ్యోతిష్కుడే మీకు వివరంగా చెప్పుంటారు. ఇందులో భార్గవ్ తప్పు లేదు బావగారూ. అతను చేసిన తప్పంతా ప్రేమించిన . అక్షరా పట్టుదలకు లొంగిపోవటమే 

మీరు సులభంగా చెప్పేసారు. మోసంలో చనిపోయింది మా అమ్మాయే కదా?”

భార్గవ్ జీవితం కూడా బాధింపుకు గురి అయ్యింది. అక్షరా చనిపోయిన దుఃఖంలో నడుస్తున్న శవంలాగా జీవించాడు. ఇప్పుడు అభయాని పెళ్ళి చేసి ఇచ్చిన  తరువాతే మంచిగా ఉంటున్నాడు. వాడ్ని మళ్ళీ నొప్పించేటట్టు ఈమె వేరుగా  వస్తే ఎలాగండీ?”  

ఆమె విషయాన్ని తట్టుకలేకపోతోంది

ఆమె దగ్గర మేము మాట్లాడి చూస్తాము. అభయాను పిలవండి

అభయా ఉన్న గది దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టింది తల్లి.

మీ అత్తయ్య, మావయ్యా వచ్చారమ్మా. బయటకురా

లోపల నుండి సమాధానమూ లేదు. అనుమానంతో తలుపు సంధుల్లోంచి లోపలకు చూసేసి మూలలో కూర్చోనుంది అన్నది.

ప్రభావతి కూడా లేచి వెళ్ళి తలుపు తట్టింది. అభయా...నీ దగ్గర మాట్లాడాలమ్మా

గోడకు ఆనుకుని కూర్చోనున్న ఆమె, మోకాళ్ళ మధ్యలో ముఖం దాచుకుని  ఏడ్చింది. లేచి రాలేదు.

మంటలు, ఆర్పే ప్రయత్నాలకు లొంగి పోకుండా మండుతున్నప్పుడు అగ్నిమాపకదళం వచ్చి నీళ్ళు పోసినా మాత్రం ఆరిపోతుందా? కాల్చి వేయాల్సిన వాటిని కాల్చి బూడిద చేసిన తరువాతే కదా ఆరిపోతున్నాయి? మనుషుల కోపతాపాలు కూడా మంటలలాగానే...బంధుత్వాలు నేలకొరిగిపోయేంత వరకు తగ్గనే తగ్గదు.

బావగారూ, మీరైనా కూతురికి బుద్ది చెప్పండి అన్నాడు ప్రకాష రావ్.

నా కూతురు న్యాయంగానే నడుచుకుంటోంది. మీ అబ్బాయే అనవసర విత్తనాలను చల్లాడు. విత్తనాలనే ఏరిపారేయాలి

ప్రకాష రావ్, ప్రభావతి నూ ఓటమితో ఇంటి నుండి బయటకు వస్తున్నప్పుడు వాళ్ల మనసును ఒక ప్రశ్న వేధించుకు తింటోంది.

ఇక భార్గవ్ జీవితం ఏమవుతుంది?’

మధ్యరాత్రి, చాలాసేపటివరకు నిద్ర రాక పొర్లాడుతున్నది అభయా. కళ్ళల్లో కన్నీరు.

అక్కా నీ మరణానికి కారణం విధి మాత్రమే కాదు...తెలిసే నిన్ను బలి ఇచ్చిన భార్గవ్ స్వార్ధం కూడా ఒక కారణమే!

చిటికడి విషం, బిందెడు పాలను నాశనం చేసినట్లే అభయా యొక్క జ్ఞాపకాలలో భార్గవ్ మీద ఏర్పడిన విరక్తి ఆమె మనసంతటినీ తీవ్రంగా ఆక్రమించింది.

తమ్ముడూ. నీ భార్య ఎక్కడ...? ఊరికి వెళ్ళిందా?”

భార్గవ్ తన ఇంటి తలుపులు తెరుస్తున్నప్పుడు అడిగింది పక్కింటి ఆవిడ.

అవునండీ -- తలవంచుకుని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు.

ఇల్లు మొత్తం ఒకటే దుమ్ము. దుస్తులు అక్కడా ఇక్కడా పడున్నాయి. వంటగది గట్టు మీద బొద్దింకలు. పక్కన ఎలుకలు పరిగెత్తి ఆడుకుంటున్నాయి.

భార్య మాత్రం ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇల్లు భక్తులు రాక -- పొదలు, పిచ్చి చెట్లు, పాడైపోయిన పాడుబడ్డ గుడి లాగా అయిపోతుంది.

చూపులు లేని ఒకడు శస్త్ర చికిత్స ద్వారా కంటి మార్పిడి జరిగి వెలుతురును చూసి ఆనందించేటప్పుడు. మళ్ళీ అతను చూపు పోగొట్టుకుని, గుడ్డివాడై చీకట్లో అవస్త పడటం జరిగితే...

అలా ఒక కష్టాన్ని అనుభవిస్తున్నాడు భార్గవ్.

అక్షరా చనిపోయినప్పుడు అతనికున్నది దుఃఖం మాత్రమే. ఇప్పుడు అభయా విడిపోయి వెళ్ళినప్పుడు, అక్షరా మరణానికి అతనే కారణం అంటూ నేర భావమూ కలిసి ఏర్పడింది. హోటల్ భొజనం, మాట్లాడుకోవటానికి కూడా తోడులేకపోవటం. ఒంటరిగా ఉండటం. జీవితంతోటి దుఃఖం, అవమానం వేరే!

ఇది చాలదన్నట్లు చుట్టుపక్కల ఉన్నవారు మీ భార్య ఎక్కడ?” అని అడిగి...గాయం ఏర్పడిన చోట ముల్లుతో గుచ్చుతున్నట్లు ఉంది.

తన తల్లీ, తండ్రీ ఆమెను ఓదార్చి, సమాధానపరిచి పిలుచుకు వస్తారని నమ్మాడు. కొంతసేపటి క్రితం తండ్రి దగ్గర నుండి వచ్చిన సెల్ ఫోన్ పిలుపు, నమ్మకాన్ని ముక్కలు చేసింది.

భార్గవా, నీ మామగారు మాట్లాడకుండా మొహం చాటేశారు. అభయా ఒక గదిలోపలకి దూరి, తలుపులు మూసుకుని బయటకు రానని చెప్పేసింది

అందరికీ ఇలాంటి ఇబ్బందికరమైన తరుణాలు వస్తూ ఉంటాయి. అన్నీ ఉండి, ఏమీ లేనట్లు ఒంటరి జీవితం గడపటంలో ఉన్న క్రూరత్వాన్ని అతను అనుభవిస్తూ ఉన్నాడు.

మనసులో ఒక ఆవేశం మొదలయ్యింది.

అభయా తిరిగొచ్చి తనతో కాపురం చేయకపోయినా పరవాలేదు, తాను కావాలనే అక్షరాని చనిపోయేటట్టు చేసినట్టు అనుకుంటోంది... ఆలొచననైనా మార్చే కావాలి.

సెల్ ఫోన్ తీసుకుని నెంబర్లు నొక్కాడు.

కొంత విరామం తరువాత అవతలి పక్కనుండి...హలో అన్నది.

స్వరాన్ని గుర్తు పట్టగలిగాడు. అభయా తల్లి అన్నపూర్ణ.

అత్తయ్యా -- నేను భార్గవ్ మాట్లాడుతున్నాను

అవతలి వైపున్న అన్నపూర్ణ స్వరం వణికింది.  

అల్లుడుగారూ...మీరా?”

అత్తయ్యా, అభయాతో మాట్లాడాలి. నా తరఫు న్యాయాన్ని చివరిసారిగా ఒకసారి ఆమెతో చెప్పేయాలి. ఆమెను మాట్లాడమనండి

ఆమె ఇంట్లో లేదండీ

అలా చెప్పమన్నదా? నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే మాటను తానే నాతో చెప్పమనండి

నిజంగానే అభయా ఇంట్లోలేదు అల్లుడూ. వాళ్ళ నాన్నతో కలిసి బయటకు వెళ్ళింది

ఎక్కడికి?”

కొంచం తడబడిన తరువాత ఏడుపుతో సమాధానం వచ్చింది.

వకీలు దగ్గరకు వెళ్ళింది. మీ దగ్గర నుండి విడాకులు పొందటానికి దావా వేస్తుందట

షాక్ లో అతని చేతులు వణుక, సెల్ ఫోన్ జారి కింద పడి విరిగిపోయింది.

ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అభయా మొహం చెమట పట్టుంది. అది గమనించకుండా శ్రీనివాసమూర్తి, “వకీలును ఏర్పాటు చేసి దావా వేసేశాము అని చెబుతున్నారు.

అన్నపూర్ణ మాత్రం కూతుర్ని గమనించింది. ఏమిటి అభయా...అదొలా ఉన్నావు?” అని ప్రేమతో విచారించింది.

తల తిప్పుతున్నట్టు ఉందమ్మా?” అన్న ఆమె వేగంగా ఇంటి వెనుకకు వెళ్ళింది. ఆమెను పట్టుకోవటానికి పరిగెత్తింది అన్నపూర్ణ.

ఉవ్వ... వాంతి చేసుకుంటున్న శబ్ధం.

చూసమ్మాయ్... అంటూ తల్లి జాలి చూపింది.

తల్లీ-కూతుర్లు గుసగుసమని మాట్లాడుకుంటున్న శబ్ధం. అభయాని ఆమె గదిలోకి తీసుకు వెళ్ళి పడుకోబెట్టి అన్నపూర్ణ బయటకు వచ్చి భర్తతో చెప్పింది.

అభయా గర్భంతో ఉంది

శ్రీనివాసమూర్తి షాక్ తో శిలలా నిలబడ్డారు.

                                                                                            Continued...PART-11

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి