19, ఫిబ్రవరి 2023, ఆదివారం

పదిహేడవ అల…(సీరియల్)...(PART-12)


                                                                             పదిహేడవ అల…(సీరియల్)                                                                                                                                                                  (PART-12) 

విడాకులకు రెడీఅంటున్నారు అల్లుడు.

శ్రీనివాసమూర్తి యొక్క మనసులో చిన్నగా అంటుకోనున్న నమ్మకం పట్టు తెగిపోయింది.

"అల్లుడు గారూ...కొన్ని రోజులు అయితే అభయా మనసు మారుతుంది. ఇంతలో మీరు తొందరపడకండి" అన్నారు బొంగురు కంఠంతో.  

"ముళ్ళు మీద నిలబడినట్లు ఉంది మావయ్యా. ఈ సమస్యను ముగిస్తేనే నాకు ప్రశాంతత. మీరు ఫోనును..."

యంత్రంలాగా వెనక్కి తిరిగి కూతురు ఉన్న గదికి వెళ్ళి సెల్ ఫొనును ఆమె ముందు జాపారు.

" అల్లుడు గారే..." అన్న వెంటనే మొహం చిట్లించుకున్న అభయాతో విడాకులు  ఇవ్వటానికి అల్లుడు రెడీగానే ఉన్నారట" అన్న వెంటనే సమాధానపడి ఫోను తీసుకుంది.

"చెప్పండి"

"అభయా...కోర్టు, వకీలు నోటీసు ఇవన్నీ ఎందుకు?"

"మీతో జీవించటం నాకు ఇష్టం లేదు అనేది ఇంతకంటే నాగరీకంగా చెప్పటం నాకు తెలియదు"

"మంచిది అభయా! దానికి నువ్వు ఇంత కష్టపడి ఉండక్కర్లేదు. నా దగ్గర చెప్పుంటే నేనే సుముఖంగా విడాకులు ఇచ్చేవాడిని"

"ఇప్పటికీ ఏమీ మించిపోయింది లేదు. కోర్టులో మీరే విడాకులకు సమ్మతం చెప్పేయండి"

"సరే అభయా, అయితే  నువ్వు మీ అమ్మా--నాన్నలతో వైజాగ్ వచ్చేయి. నా తల్లి-తండ్రులూ ఇక్కడికి వచ్చేస్తారు"

"ఎందుకు?" -- అన్నది గబుక్కున.

"కోర్టు వ్యవహారం అని వచ్చేస్తే, అన్నీ చట్టపరంగా కరెక్టుగా ఉండాలి. పెళ్ళీలో నువ్వు తీసుకు వచ్చిన పట్టు చీరలూ, నగలు, సారె సామానులూ అన్నిటినీ వెనక్కి తీసుకో. ఆ తరువాత ఇక్కడే ఒక వకీలును ఏర్పాటు చేసుకుని విడాకుల పత్రంలో నేను సంతకం పెట్టి ఇచ్చేస్తాను"

అభయా కొంచం కూడా సంకోచించకుండా ఒక్క మాటలో తన భవిష్యత్తును నిర్ణయించుకుంది.

"సరే"

దుఃఖం ఏర్పడిన ఇంట్లో కూడినట్లు భార్గవ్ వైజాగ్ ఇంట్లో అతని తల్లి-తండ్రులు, అభయా, అభయా యొక్క తల్లి-తండ్రులు మౌనంగా గుమికూడి ఉన్నారు. వాళ్ళందరి మొహంలోనూ సోకం.

భార్గవ్ సారెగా తీసుకువచ్చిన ఒక్కొక్క వస్తువునూ తీసి ఇస్తున్నాడు. ఆమె ఒక్కొక్కటీ తీసుకుని పెట్టెలో సర్ధుకుంటోంది. వాళ్ళిద్దరి మొహాలు ఎటువంటి భావాలూ చూపకుండా బిగించుకుని ఉన్నాయి.

విడాకులకు సంబంధించిన ఏ కార్యంలోనూ కన్నవారు తల దూర్చక గదిలో ముడుచుకుని కూర్చోటం వలన, చేయవలసిన పనులను వీళ్ళే చేసుకుంటున్నారు.

తన కాలేజీ సర్టిఫికేట్లను కూడా జ్ఞాపకంగా తిరిగి తీసుకుని జాగ్రత్తగా పెట్టుకుంది అభయా.

భార్గవ్ ఫోనులో వకీలుతో మాట్లాడిన తరువాత ఆమెను పిలిచాడు.

"వీళ్ళెవరూ వకీలు ఆఫీసుకు రారు. మనిద్దరమే వెళదాం"

కారులో బయలుదేరారు. దారిలో, " అభయా, నీ దగ్గర ఒంటరిగా ఒక విషయం మాట్లాడవలసి ఉంది..." అన్న వెంటనే, ఒకసారి అతన్ని చూసి తరువాత ఓకే అన్నట్లు తల ఊపింది.

కారు బీచ్ వైపు రోడ్లోకి తిరిగింది.

సముద్రం తన గర్జనను, కంటిన్యూగా అలలుగా తీరానికి పంపగా, ఊరడించి వాటిని వెనక్కి పంపుతూ ఉన్నది తీరం.

అందులో దారి పొడుగునా మనుషుల గుంపు. మట్టంతా పాదల ముద్రలు. కొంచం ముందు వేడుక చూడటానికి వచ్చిన వాళ్ళూ, గాలికోసం వచ్చిన వాళ్ళూ, ప్రేమించుకోవటానికి వచ్చిన వాళ్ళూ, విడిపోయి మళ్ళీ కలుసుకోవటానికి వచ్చిన వారు అంటూ విధవిధమైన అడుగుల ముద్రలతో చేరిపోయున్నాయ వీళ్ళద్దరి అడుగుల ముద్రలు.

భార్గవ్ తో కలిసి నడుస్తున్న అభయా గబుక్కున ఆగి అతన్ని చూసింది 'ఏమిటి విషయం?' అని అడిగే చూపు.

అతను చూసిన చూపులో అస్పష్టత ఉన్నది.

"అభయా, మనం విడిపోతున్న విషయంలో నేను నిజాయితీగా నడుచుకున్నాను. కానీ నువ్వు నిజాయితీగా నడుచుకోలేదు"

ఆమె మొహం ఎర్ర బడ్డది. "ఏం చెబుతున్నారు?"

"నువ్వు గర్భంగా ఉన్న విషయాన్ని నా దగ్గర నుండి దాచావు!"

ఆమె దగ్గరున్న కోపం...గాలిపోయిన బలూన్ లాగా దిగిపోయింది.

"అది...మీ మీదున్న కోపం వలన..."

"అది మనిద్దరి బిడ్డ. మనం విడిపోవటానికి ముందు ఎలా డబ్బూ, నగలూ అన్నిటి గురించి మాట్లాడి డిషేషన్ తీసుకున్నామో, అదేలాగా...పుట్టబోయే బిడ్డ గురించి కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చుండాలి"

ఆమె మౌనంగా  నిలబడ్డది.

మన వారసుడు...తండ్రిలేని బిడ్డగా పెరగబోతోంది. నువ్వు నన్ను శిక్షిస్తున్నట్టు అనుకుని మన బిడ్డని శిక్షించబోతావు"

అభయా బిగువైన మొహంతో చెప్పింది. "అది విధి"

"విధిని నమ్ముతున్నావు. కానీ అక్షరా మరణించుటం కూడా విధి అని ఎందుకు నమ్మనంటున్నావు? -- భార్గవ్ స్వరంలో ఆరాటం ధ్వనించింది.

ఆమె స్వరం ఆవేశంగా వినబడింది "మీరే కదా మీ జాతకాన్ని మార్చి రాసారు"

లేదు... దానికి కూడా నువ్వు చెప్పిన విధియే కారణం. దొంగ జాతకాన్ని రాద్దామని మమ్మల్ని నిర్ణయింపచేసింది ఆ విధే. అదే నేను వద్దని ఖచ్చితంగా చెప్పినా నాకు తెలియకుండా అక్షరా టూ వీలర్ను నడిపించుకుని తీసుకు వెళ్ళింది"

"అబద్దం. అక్కయ్య చనిపోవడానికి కారణం మీరేనని మీ మనశ్శాక్షికి తెలుసు. అందువలనే దొంగ జాతకం రాసిన విషయాన్ని నా దగ్గర దాచారు

భార్గవ్ స్వరం పెద్దదయ్యింది "మూర్ఖురాలులాగా మాట్లాడకు! నా మనసులో కపటం ఉండుంటే జాతకాలను చింపి పారేసుండే వాడిని. నీ చూపులకు, అక్షరా చూపులకు కనబడేటట్టు బీరువాలో ఉంచేవాడిని కాను" -- 

అతను దూరంగా జరుగ, అభయా అక్కడే నిలబడింది. అమె మనసులో అలజడి అలలు మొదలైనై.

'ఇతను నిర్ధొషా? ఇతనితో కలిసి జీవించనా?' -- మనసులో పొంగిన ప్రశ్నలతో, ఎగుసుకుంటూ వస్తున్న అలలను చూసింది. 'ఈ సముద్రం నా ప్రశ్నకు జవాబు చెబుతుందా?'

భార్గవ్ తిరిగి వచ్చి పిలిచాడు.

"అభయా, ఏం చేస్తున్నావు ఇక్కడ నిలబడి. రా...వకీలు దగ్గరకు..."

అతను ఎటువంటి భావాలను బయట పడనీయకుండా పెదాలను మాత్రం కదిపాడు.

"నాలుగు..." -- అక్షరా చెప్పిన అదే అలల జ్యోతిషం.

భార్గవ్ కు అర్ధమయ్యింది. "అభయా...నువ్వు..."

తిరగకుండానే చెప్పింది. అవును. నా దావాలో ఈ సముద్రం అలలు తీర్పు రాస్తుంది.  పదిహేడు అలలలోపు ఒక అల అయినా నన్ను ముట్టుకుంటే...మనం కలిసి జీవిద్దాం...."

అతను ఆందోళన చెందాడు. 'అలలు తాకే దూరం కంటే, చాలా దూరం వెనుక నిలబడింది ఆమె. ఇంతదూరానికి ఒక అల అయినా వస్తుందా'

అభయా, కంటిన్యూ గా  నోరు తెరిచి లెక్కపెడుతోంది. "తొమ్మిది...పది..."

"..................."

"పదకుండు...

పన్నెండవ అల తిరిగి వెళ్ళిన తరువాత భార్గవ్ మనసు ఆందోళన చెందటం మొదలుపెట్టింది. అలలు వాళ్ళిద్దరి జీవితాన్ని ఒడ్డుకు చేరుస్తుందా?

పదమూడు...పద్నాలుగు...

ఊహూ...అన్ని అలలూ నాలుగైదు అడుగుల దూరంలోనే తిరిగి వెళ్ళిపోయినై. ఇప్పుడు అభయా స్వరం తగ్గింది. మొహం విలవిలపోయింది. ఒళ్ళు వణుకు పుట్టించే మంత్రం. ఉచ్చరించింది. "పదిహేను...పదహారు..."

చివరగా వచ్చిన అల.

"పదిహేడు..." -- అభయా కళ్ళు మూసుకు ఉచ్చరించినప్పుడు ఆమె పాదాలను నిదానంగా తాకి ఆశీర్వదించింది ఆ అల.

ఆ అల వేగంతో కిందకు వాలిపోతున్న ఆమెను భార్గవ్ వేగంగా పట్టుకున్నాడు. ఆమె కళ్ళల్లో ఆనంద కన్నీరు. అతన్ని కావలించుకుంది.

చిన్న గ్యాప్ తరువాత రెండు హృదయాలూ ఒకటిగా చేరడాన్ని చూసి సముద్రపు అలలు ఆనందపడ్డాయి. సాయంత్రపు ఎండ జోలపాట పాడింది. జనం చేసే గోల శబ్ధం, విష్ చేసే శబ్ధంగా మారింది.

'మర్మ 'నవలను పూర్తిగా చదవటానికి ముందే, ముగింపు తెలుసుకోవటానికి చివరిపేజీని తిప్పి చూస్తున్నట్టు, ముందుగానే జీవిత మలుపులు మనం తెలుసుకోవచ్చా ఏమిటి? లేదు...! మలుపులతో ప్రయాణం కొనసాగించవలసిందే!!

అక్కడ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని తీరాన్ని ఉద్దేశించి నడుస్తున్నారు భార్గవ్, అభయానూ. ఆమె కడుపులో ఆనంద అల.

************************************************సమాప్తం******************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి