7, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-1




                                                ఆలయం(సీరియల్)
                                                          (PART-1)


విజయవాడ నగరములోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయం భక్తులుతో కిట కిట లాడుతోంది. ఆ రోజు అమ్మవారి దర్శనం కోసం కనకదుర్గ గుడికి వెళ్ళాడు ప్రసాద్. వెంకట్ ప్రసాద్ అని వాళ్ళ నాన్న పేరు పెట్టారు. అది ఎందుకో తెలియదు గానీ రెండు మాటలున్న పేర్లు గలవారిని చాలామంది ఆ రెండు మాటలతో పిలవరు. సురేష్ కుమార్ ను సురేష్, రామ మూర్తిని రామూ, క్రిష్ణ కుమార్ ను క్రిష్ణా అని పేరును కుదించి పిలవటమే అందరి నాలుకలకు అలవాటైపోయింది. ఆ కారణం కొసమే వెంకట్ ప్రసాద్, ప్రసాద్ అయిపోయింది.

మనం కూడా ప్రసాద్ అనే పిలుద్దాం...!

ప్రసాద్ ఒక కనకదుర్గ భక్తుడు. కనకదుర్గ గుడికి వెళ్ళే ముందు క్రిష్ణా నదిలో స్నానం చేసి వెళ్ళేటం అలవాటు. ఒక్కోసారి స్నానం చేసిన తరువాత అక్కడ మెట్ల మీద కూర్చుని ఊహల్లోకి వెళ్ళిపోతాడు.

అతను అలా ఊహల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం అతనొక రచయత. అందులోనూ బాగా పేరుపొందిన రచయత. అతనికని విజయవాడ నగరంలో ఒక చిరునామా ఉన్నది. దాంతో పాటు అతను ఒక ఫ్యాక్టరీలో సీనియర్ ఉద్యోగస్తుడు.

అతనికని మూలాధార శక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఇంద్రకీలాద్రి పైన కొలువున్న కనకదుర్గ అమ్మవారు, రెండు అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని శంకరయ్య! కనకదుర్గ అమ్మవారిని అందరికీ తెలిసుంటుంది. ఈ శంకరయ్య నే అందరికీ పరిచయం చేయాల్సి ఉంది.

శంకరయ్య, ప్రసాద్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ యొక్క యజమాని!

యజమాని అని పిలిస్తే సామాన్యంగా ఉంది కదా? అందంగా 'చైర్మన్’ అని చెప్పటంలోనే ప్రసాద్ కూ ఇష్టం. ఆయన వలనే అతను రచయతగా అవగలిగాడు. గుడిలో అమ్మవారి ముందు ‘చైర్మన్’ కోసం కూడా ప్రార్ధన చేసుకుంటాడు ప్రసాద్. శంకరయ్య గారు ఒక 'మల్టీ మిల్లియనర్’ . ఎటు చూసినా ఆయనకు ఫ్యాక్టరీలున్నాయి. ప్రపంచం మొత్తాన్ని చుట్టి చుట్టి వస్తారు. వంశ పారంపర్యంగా ఆస్తిపరుడు. కానీ, ఎక్కువమంది డబ్బుగలవారిలో అతుక్కోనుండే ఎటువంటి అహంభావమూ లేని అద్భుత ఆత్మ.

ఈ ప్రపంచంలో అన్ని రంగాలలోనూ అద్భుతమైన మనుష్యులు ఉంటారు. అందులో ఒకరిగా శంకరయ్య గారిని చెప్పొచ్చు. ప్రసాద్ కు ఆయన ఒక అతిపెద్ద ఉదాహరణ మనిషి కూడా! అందుకనే నేమో ప్రసాద్ తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నాడు.

ఒక వేడుక ఏమిటంటే...కొడుక్కి ఆయన పేరు పెట్టి, 'రేయ్ శంకరయ్య ' అని ప్రేమతో పిలవటానికి ఇష్టపడడు. తన కొడుకును 'చైర్మన్’ అనే పిలుస్తాడు.

ప్రసాద్ భార్య మాలతి...మంచి హౌస్ వైఫ్. ఆమె కూడా భర్తతో కలిసి తన కొడుకును 'చైర్మన్’ అనో, ‘ఎం.డి’ అనో పిలవటం ఒక వెడుక గా మొదలయ్యి, తరువాత అలవాటుగా మరిపోయింది.

ప్రసాద్ కొడుకు శంకరయ్య, ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో 'బి.ఇ.' చదువుతున్నాడు. వాడి స్నేహితులు కూడా....'రేయ్ చైర్మన్’ అని అతన్ని పిలవటం, వింటున్న మనకే వింతగా ఉంటుంది.

ప్రసాద్ అవన్నీ పట్టించుకోడు. అతని వరకు కొడుకు, యజమాని శంకరయ్యలా విజయం పైన విజయం సాధించాలి. ఆయన లాగానే వేలాది మందికి ఉద్యోగం ఇచ్చి ఆదుకొవాలి. తెలుగు భాష మీద ప్రేమ, తెలుగు సంస్కృతి, నాగరికత--ఇవన్నీ అతనిలో ఉండాలి. ఇదే ప్రసాద్ కోరిక. దీనికొసమే రోజూ కనకదుర్గ అమ్మవారిని వెడుకుంటూ ఉంటాడు.

ఇంకో కొన్ని సంవత్సరాలలో ప్రసాద్ కొడుకు డిగ్రీ పూర్తిచేసి, ప్రసాద్ ఆశలను పూర్తిచేస్తాడు. కానీ, అంత వరకు అతను అతని గౌరవనీయ యజమాని అయిన శంకరయ్య ఫ్యాక్టరీలో పనిచేయగలడా, లేదో అనేదే అతనిలో పెద్ద ప్రశ్నార్ధంకంగా ఉంటోంది.

దానికి కారణం అతనిలో ఈ మధ్య ఏర్పడిన భయం!

ఊహల్లో సులభంగా సంచరించ గలిగిన అతను ఈ మధ్య స్వయంగా కొన్ని యధార్ధాల తాకిడికి లోనైయ్యాడు.

క్రిష్ణా నది ఒడ్డున కుర్చున్నప్పుడు అతని మనసులో దాని గురించే ఆలొచన వచ్చింది.

ఆరోజు ప్రొద్దున....ఆఫీసులో జరిగిన ఒక సంభవం అతన్ని కలవరపెడుతోంది.

                                                                  ఇంకా ఉంది.....Continued in PART-2.

********************************************************************************************


4, జనవరి 2020, శనివారం

లక్కీ క్యాట్ గుడి…(ఆసక్తి)



                                                     లక్కీ క్యాట్ గుడి


మనం ఏదైనా గుడికివెళ్తే ఇంటికి ప్రసాదం పట్టుకుపోయినట్లే, ఈ లక్కీ క్యాట్ ఆలయానికి వచ్చిన వారందరూ అక్కడుండే పిల్లి బొమ్మను కొనుక్కుపోతారు. ఎందుకంటే అదో అదృష్టచిహ్నంగా భావిస్తారు. దేవతగా నమ్ముతారు. ఇవన్నీ టోక్యోలోని 'గొటుకూ-జీ గుడి విశేషాలు. ఇక్కడుండే పిల్లి బొమ్మను 'లక్కీ క్యాట్' గా భావిస్తారు. కారణం తెలుసుకోవాలంటే దీని కథ తెలుసుకోవల్సిందే.


శకునం (Omen) అనగా జరగబోవు పని గురించిన సంజ్ఞ. కొన్నిటిని కొందరు వ్యక్తులు శుభ శకునాలుగానూ, కొన్నిటిని అశుభ శకునాలుగానూ భావిస్తారు. శకునాల శాస్త్రీయత ప్రశ్నార్ధకమైనందువల్ల హేతువాదులు శకునాలను పట్టించుకోవటాన్ని మూఢ నమ్మకంగా చెప్తారు. అయితే మానవ చరిత్రలో మరియు జానపద వాజ్మయంలో(Index) శకునాలకు చాలా ప్రధానపాత్ర ఉన్నది.


జానపదులు అనేక రకాల శకునాలను చూసుకుంటారు. అందులో ముఖ్యంగా కాకి శకునం వివరంగా చూసుకుంటారు. కాకి అరుస్తూ ఉంటే చుట్టాలొస్తారని ఎదురు చూస్తూ ఉంటారు.

శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభశకునాలు మరియు అశుభ శకునాలుగా వర్గీకరిస్తారు. శకునాలు ఆ యా దేశాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక సంస్కృతిలో శుభ శకునంగా పరిగిణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శకునంగా పరిగణించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభ సూచకముగా భావిస్తే, ఇంగ్లాండులో అదే నల్లపిల్లిని శుభ సూచకముగా భావిస్తారు.


శకునాలను, వాటి ఫలితాలను భారతీయులు ఎంతగానో విశ్వసిస్తుంటారు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు, శుభకార్యాలకి సంబంధించిన పనులను ప్రారంభిస్తూ వున్నప్పుడు సహజంగానే శకునం చూసుకుంటూ ఉంటారు. శకునం మంచిగా అనిపించకపోతే శుభకార్యాలను వాయిదా వేయడమే కాదు, రద్దు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది.


ఈ శకునాల్లో పిల్లి శకునం మరింత ప్రభావం చూపుతుందని భావిస్తూ వుంటారు. పెంపుడు పిల్లికి తప్పులేదనే విశ్వాసం వుండటం వలన, తమ పిల్లి కాకుండా మరో పిల్లి ఎదురుపడితే దానిని శకునంగానే భావిస్తుంటారు. అంతేకాదు పెంపుడు పిల్లి ఇల్లు వదిలిపోతే ఇంటిలోని అదృష్టం కూడా దానితోనే పోతుందంటారు పెద్దలు. శకునాలలో ప్రపంచవ్యాప్తంగా పిల్లి శకునాన్నే ఎక్కువమంది పట్టించుకుంటున్నారు. పిల్లి ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తు గురించి పలు జోస్యాలు చెబుతుంటారు. పిల్లి కదలికల్లో ఏదో ఒక సూచనను చూసేవారు కోకొల్లలుగా ఉన్నారు.


వెన్నెలలో నల్లపిల్లిని చూడడం ఆ ప్రాంతంలో ఏదో ఒక అంటు వ్యాధి ప్రబలనున్నదనడానికి సూచనట(ఇది ఐరిష్ ప్రజల భయం). ఉద్దేశపూర్వకంగా పిల్లిని చంపితే మీరు మీ ఆత్మను దయ్యానికి కోల్పోయినట్టే(ఇది బ్రిటన్ వాసుల నమ్మకం). ఒక పిల్లి తన తోకను మంటవైపు ఉంచి, తన చెవుల పై భాగాన్ని నాకుతూ ఉంటే వాతావరణ పరిస్థితులు విషమిస్తాయి. వివాహవేదిక వద్ద పిల్లి ఉండడం మంచి అదృష్టం. ఒక మృతుడి శవపేటికపైనుంచి పిల్లి దూకితే శాశ్వత నిద్రపోతున్న ఆ మహానుభావుడు స్వర్గానికి చేరే ప్రసక్తే లేదు.(ఇది ఆస్ట్రేలియన్ల మాట). ఒక పిల్లి కిటికీలో నుంచి అదే పనిగా బయటకు చూస్తుంటే వర్షం ఖాయంగా రాబోతోందనడానికి సూచన.కలలో పిల్లి దర్శనమిస్తే ధన లాభం. వ్యాపారంలో కలిసొస్తుంది. నల్ల, తెల్ల పిల్లులు స్వప్నంలో కనిపిస్తే మీ సంతానం విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. చారలపిల్లి కలలో కనిపిస్తే మీ ఇంటిలో అదృష్టం వర్షిస్తుంది. నల్ల పిల్లులు గుప్త నిధులను కనిపెట్టగలుగుతాయి. ఐదురోడ్ల కూడలివద్దకు పిల్లిని తీసుకువెళ్ళి వదిలేయండి. ఆ తరువాత దానిని అనుసరించండి. మీకు గుప్తనిధులు దొరుకుతాయి( ఇది ఫ్రెంచ్ వారి ఆశాభావం).


జపాన్ దేశంలో సైగచేసే పిల్లి అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తుందని గట్టి నమ్మకం. పిల్లులు సైగలు చేస్తాయా? వాటి ప్రవర్తనల బట్టి వాటికి శకునాలు నిర్ణయించుకున్నారు. పూర్వం ఒక రాజు సెటగయా నగరంలో నుండి వెడుతూ, అలసిపోయి ఉండటంతో సేద తీర్చుకోవడానికి ఒక చెట్టు దగ్గర ఆగాడు. ఇది గమనించిన ఒక పిల్లి ఆ రాజుకు సైగ చేసి వేరే చోటుకు తీసుకు వెళ్ళింది. కొద్దిక్షణాలలో గాలివానతో కూడిన వర్షం రావడం, అప్పుడు ఒక పిడుగు, అంతకు ముందు రాజు నిలబడ్డ చోట పడటం జరిగింది. అది చూసిన రాజు, ఆ పిల్లిని తన అదృష్ట దేవతగా భావించి, కోట్లకొలది డబ్బుతో అక్కడ ఆ పిల్లికి ఒక గుడి కట్టించాడట. అప్పటి నుండి ఆ గుడి, సైగచేసే ఆ పిల్లి, జపాన్ ప్రజలకు ప్రియమైనదిగా మారింది.


'మనేకి నెకో’ లేక 'సైగ చేయు పిల్లి’ ...ఇది జపాన్ దేశంలో అత్యంత పేరుపొందిన బొమ్మ (విగ్రహం). అదృష్టం, ఐశ్వర్యం తీసుకువస్తుందని గట్టి నమ్మకంతో జపాన్ దేశ ప్రజలు తమ ఇళ్ళల్లో, షాపులలో, వ్యాపార కేంద్రాలలో, ఆఫీసులలో ఈ పిల్లి బొమ్మను తప్పక ఉంచుకుంటారు. సెటగయా నగర సరిహద్దులలో 'గొటుకూ-జి’ అనే పేరుతో ఈ పిల్లి విగ్రహంతో ఒక గుడి ఉన్నది.

సైగ చేసే పిల్లుల బొమ్మలను బ్యాటరీలతో తయారు చేసి అమ్ముతున్నారు. ఈ బొమ్మ, బ్యాటరీ పవర్ తో, చేతితో సైగ చేస్తుంది. ఈ బొమ్మను అందరూ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. ఈ బొమ్మ శక్తి ఇప్పుడు ఆసియా దేశాలలో కూడా వ్యాపించింది.

Images Credit: To those who took the original Photo. ****************************************************************************************************

2, జనవరి 2020, గురువారం

ముత్యాల వంతెన......(ఆసక్తి)



                                                    ముత్యాల వంతెన

జపాన్ దేశంలోని అకాసీ కైకో వంతెన ప్రపంచంలోని పొడవైన వేలాడే వంతెనలలో ఒకటి. ఈ బ్రహ్మాండమైన వంతెనకు ముత్యాల వంతెన అనే మరో పేరు కూడా ఉన్నది. జపాన్ దేశంలోని ముఖ్యమైన నగరాలలో ఒకటైన అకాసి నగరాన్ని, అవాజీ దీవిని కలపటానికి అకాసి సముద్ర నీటి జలాలపై ఈ వంతెనను నిర్మించారు.


కొన్ని సంవత్సరాల ప్రణాళిక తరువాత 1986, మే నెలలో నిర్మాణం మొదలుపెట్టి పన్నెండు సంవత్సరాల తరువాత ఏప్రిల్-5,1998లో వంతెన పూర్తి చేశారు. మొదట రైల్వే లైను కుడా అమర్చాలనుకున్నారు. కానీ, ఆ తరువాత ఆ ఉద్దేశం మానుకుని కార్లూ, బస్సులూ, లారీలూ వెళ్ళడానికి మాత్రం ఆరు రోడ్లు (వెళ్ళడానికి మూడు, రావడానికి మూడు) ఉండేటట్లు వంతెనను నిర్మించారు. పెను తుఫానలనూ, పెద్ద భూకంపాలనూ ( రిక్టర్ స్కేల్లో 8.5 వరకు నమోదయ్యే భూమి అధుర్లను) తట్టుకోగలిగే అతి గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీతో అకాసీ కైకో వంతెనను కట్టారు.


1986 వ సంవత్సరం అకాసీ కైకో వంతెనను నిర్మిస్తున్నప్పుడు జనవరి-17, 1995లో రిక్టర్ స్కేల్లో 7.2 గా నమోదైన భూకంపం ఏర్పడింది. ఆ భూకంప తాకిడిలో వంతెన నిర్మాణం ఎటువంటి నష్టానికీ గురికాకపోయినా వంతెన నిర్మాణ పొడవు ఒక మీటరుగా పెరగటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే మొదట్లో 1990 మీటర్ల సరిపడ వేసిన 2 వంతెన పిల్లర్లు ఆ భూకంపం తరువాత 1991 మీటర్లుగా జరిగాయి.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేలాడే వంతెన (అకాసీ కైకో/ముత్యాల వంతెన) గురించిన మిగిలిన ఆశ్చర్య పరిచే అద్భుతమైన విషయాల గురించి తెలుసుకుందాం.

1)వంతెన మొత్తం పొడవు 3,911 మీటర్లు( 12,831 అడుగులు) వంతెనకు ఊపిరిగా ఉండే రెండు పిల్లర్ల దూరం 1,991 మీటర్లు (అంటే 1,24 మైళ్ళు).

2)వంతెన మధ్య వేయబడిన ఊపిరి పిల్లర్ల దూరంలో ఎక్కువ దూరం ఉన్న వంతెన ప్రపంచంలోనే ఇదొక్కటే.


3) 100 కు పైన వంతెనలు నిర్మాణ కంపెనీలు కలిసి పనిచేసిన మొదటి వంతెన. 20 లక్షల మంది కార్మీకులు కలిసికట్టుగా పనిచేసిన వంతెన.

4) 286 కిలోమీటర్ల వేగమైన గాలినీ, రిక్టర్ స్కేల్లో 8.5 బలమైన భూకంపాన్ని తట్టుకునే శక్తి కలిగింది.

5) మొత్తం వంతెనకు ఉపయోగించిన ఇనుము 1,81,000 టన్నులు. పిల్లర్లకు వాడబడిన సిమెంట్ కాంక్రీట్ 14 లక్షల క్యూబిక్ అడుగులుగా ఉంటుంది.


6) అత్యంత ఉష్ణోగ్రతలలొ వంతెన 2 మీటర్లకు సాగుతుంది.

7) వంతెన సముద్రమట్టానికి 65 కిలోమీటర్ల ఎత్తులో కట్టబడ్డది కాబట్టి పెద్ద ఓడలు కూడా వంతెన కింద నుండి వెళ్ళవచ్చు.

8) వంతెన మొత్తం పొడవుకు ఉపయోగించబడ్డ మొత్తం ఐరన్ కేబుల్స్ పొడవు 3,00,000 కిలోమీటర్లు (అంటే 1, 90,000 మైళ్ళు). ఇందులోని ఒక్కొక్క కేబుల్ 44 ఇంచుల లావుగా ఉంటుంది.

9) పిల్లర్లలో వేసిన ఇనుప చట్రాలు, ఇనుప పైపులను చుట్టడానికి 36,880 ఇనుప కేబుల్స్ ఉపయోగించారు.

10) ఈ వంతెన మొత్తానికి ఉపయోగించిన ఇనుప కేబుల్స్ ను లెక్క వేస్తే అది ప్రపంచ మొత్తాన్నీ 7 సార్లు చుట్ట వచ్చుట.

11) అంతర్జాతీయ నౌకా రవాణా దారి అయిన ఈ సముద్ర నీటి జలపాత దారిలో రోజుకు 1000 నౌకలు ప్రయాణం చేస్తాయట.

12) రోజుకు సరాసరి 23,000 వాహనాలు వెళ్ళే ఈ వంతెనకు రాత్రిపూట వెలుతురు కోసం 1,737 లైట్లు అమర్చారు.

13) ఈ వంతెన కట్టటానికి అయిన మొత్తం ఖర్చు 500 బిల్లియన్ అమెరికన్ డాలర్లు.

Images Credit: To those who took the original Photo. **************************************************************************************************

30, డిసెంబర్ 2019, సోమవారం

ప్రేమించుకోవచ్చు!...(కథ)





                                              ప్రేమించుకోవచ్చు!...(కథ)


రెండక్షరాల చిన్న పదం ప్రేమ. రెండు హృదయాల మధ్య మొలకలా అంకురించి, వికసించి, వటవృక్షమై వ్యాప్తి చెంది, అంతా తానై ఉండే సమ్మొహనం. అది బౌతిక రూపం లేనిది, మనసులకు గోచరించది ప్రేమ!

మానవ జీవితంలో ప్రేమదే అగ్రస్థానం. ఆప్యాయంగా మాట్లాడుకోవటం, మనసులు పంచుకోవడం ----గొప్ప శకినిస్తాయి. తనకోసం ఆలొచించే ఒక వ్యక్తి ఉన్నారన్న భావన ప్రేమ వల్ల ఏర్పడుతుంది. ప్రేమను కొలిచే సాధనాలు లోకంలోనే లేవు.

యౌవనంలో ఇరు హృదయాల్లో పుట్టే ప్రేమకు విశిష్ట స్థానం ఉంది.

ఐతే చాలా మంది యువతలో అది ఎప్పుడూ తాత్కాలిక వ్యామోహంగానూ, ఆకర్షణగానూ మారి జీవితాల్ని చిద్రం చేస్తోంది. అందుకనే చాలామంది పెద్దలు ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఈ మధ్య యువత పెద్దలను బెదిరించి, వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో రకాలుగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. దీనివలన ఆ యువత కుటుంబాలలోని మిగిలిన వ్యక్తులకు ఎన్నో సమస్యలు, అవమానాలు తలెత్తి ప్రశాంతతను కోల్పోయేటట్టు చేస్తోంది.

కాబట్టి ఎవరూ పెళ్ళికి ముందు ప్రేమించకూడదు.

కానీ, ప్రేమించుకోవచ్చు!

ఎప్పుడు? ….పెళ్ళి అయిన తరువాత.

పెళ్ళి అయిన తరువాత భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించుకోవచ్చు. కానీ పెళ్ళికి ముందు ఎవరూ ప్రేమించ కూడదు. ఎందుకంటే ప్రేమ చాలా వరకు ప్రేమికులను ఇబ్బందులలోకి తోసేస్తుంది. ప్రేమికులను మాత్రమే కాదు, వారి కుటుంబాలనూ, సన్నిహితులను, స్నేహితులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది చాలామందికి పెద్దలకు తెలుసు. కానీ, యువతకు తెలియదు. ప్రేమ వలన జీవితాన్నే పారేసుకున్న వారిని చూసిన తరువాత కొంతమంది యువతకు ప్రేమ మీద వాళ్ళకున్న అభిప్రాయం మారింది. అలా ప్రేమ మీద అభిప్రాయాలు మార్చుకున్న చాలామందిలో రాజశేఖర్, కౌసల్య కూడా ఉన్నారు.

ప్రేమించి పెళ్ళిచేసుకుంటేనే జీవితం బాగుంటుందని రాజశేఖర్ కు అపారమైన నమ్మకం ఉండేది. కానీ తన కుటుంబంలో జరిగిన ఒక సంఘటన వలన అతనికి ప్రేమ మీద నమ్మకం పూర్తిగా అపనమ్మకంగా మారిపోయింది.

అదేలాగా కౌసల్యకు కూడా ప్రేమించి పెళ్ళిచేసుకోవటమే జీవితానికి మంచిది అనే అభిప్రాయం ఉండేది. కానీ తన స్నేహితురాలికి జరిగిన సంఘటన ఆమె అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఇద్దరూ అరేంజడ్ మ్యారేజ్ చేసుకోవటమే జీవితానికి మంచిది అని ప్రేమ పెళ్ళిల్ల మీద వారికున్న నమ్మకాన్నీ, ఇష్టాన్ని, అభిప్రాయాన్నీ మార్చుకున్నారు…… ఆ తరువాత

                                   ***********************************************

రోజంతా పనిచేసిన అలసటతో, ఆఫీసుల నుండి ఇంటికి తిరిగి వెళ్ళటానికి ఆ బస్ స్టాపింగ్ లో గుంపుగా నిలబడున్నారు కొందరు.

ఆ గుంపుకు ఎడమ పక్కగా స్వప్నతో కలిసి నిలబడున్న కౌసల్య తన చేతి గడియారం లో టైము చూసింది. 5.50. ఆమె ఇంటికి వెళ్ళాల్సిన బస్సు ఈ పాటికి వచ్చుండాలి. కానీ, ఎందుకో ఈ రోజు ఇంకా రాలేదు.

"ఏయ్... అటు చూశావా?" అంటూ కౌసల్య భుజాన్ని తట్టింది స్వప్న.

స్వప్న చూపిన వైపుగా చూసింది కౌసల్య. ఈ రోజు కూడా అతను వాళ్ళు నిలబడున్న వైపుకే వస్తున్నాడు.

"అతను మనల్ని వెంబడించి రావడం ఇది నాలుగో రోజు...రాస్కల్" అంటూ తిట్టింది కౌసల్య.

"మనల్ని కాదు... నిన్ను.నిన్నే వెంబడిస్తున్నాడు!" చెప్పింది స్వప్న.

"మొహం వాచేటట్లు నాలుగు మాటలు అడిగేయనా?"

"ఎలా అడుగుతావు? నిన్ను చూశానా? నిన్ను వెంబడిస్తున్నానా? …అంటూ అతను ఎదురుతిరిగితే?"

అంటూ స్వప్న ముగించేటప్పుడు అతను వాళ్ల దగ్గరగా వచ్చి, రోజూలాగానే ఆ రోజు కూడా వాళ్ళ వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు.

కౌసల్య వెనక్కి తిరిగి కోపంగా అతని వైపు చూసింది. అదేమీ గమనించనట్లు అతను రోడ్డునే చూస్తూ నిలబడ్డాడు.

"చూడటానికి ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నట్లు డీసెంటుగా కనబడుతున్నాడు...ఎందుకో ఈ పిచ్చి వేషాలు…అడిగేయనా?" అని స్వప్న చెవిలో గుసగుసలాడింది కౌసల్య

"గొడవని కొని తెచ్చుకోకు" గొణిగింది స్వప్న.

ఈలోపు వాళ్ళు ఎక్కవలసిన బస్సు ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉసూరు మనుకుంటూ వచ్చి బస్ స్టాపింగులో ఆగింది. మెట్ల మీద నిలబడున్న నలుగురైదుగురు ప్రయాణీకులు క్రిందకు దిగి దొవ ఇవ్వటంతో లోపల ఉన్న ప్రయాణీకులలో కొంతమంది దిగుతూ ఉండగానే స్టాపింగులో ఉన్న కొందరు వేగంగా బస్సు ఎక్కి లోపలకి దూసుకు వెళ్ళారు. వారిలో స్వప్న కూడా ఉన్నది.

"ఒక వేల నేను ఈ బస్సులో ఎక్కకుండా ఉండిపోతే….అతను ఏం చేస్తాడు?" అనే ఆసక్తి తలకెక్కటంతో, బస్సు ఎక్కకుండా ఆగిపోయింది కౌసల్య.

బస్సు మెట్ల మీద నిలబడి ప్రయాణం చేయబోయిన అతను, కౌసల్య బస్సు ఎక్కకుండా క్రిందే నిలబడుంటం చూసి, బస్సు బయలుదేరుతున్నప్పుడు గబుక్కున క్రిందకు దిగిపోయాడు.

కౌసల్య బస్ స్టాపంగులోనే ఉండటం చూసిన స్వప్న, కిటికీలో నుండి తొంగి చూస్తూ "ఏయ్...నువ్వు రావట్లేదా?" అని చేతి వేళ్ళను ఉపుతూ అడిగింది. కౌసల్య నుండి జవాబు తెలుసుకునే లోపు ఆ బస్సు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయింది.

"బస్సులో ముందు వైపు జనం ఎక్కువగా లేరు. మీరెందుకు బస్సు ఎక్కకుండా ఆగిపోయారు?" అని కౌసల్యను చూసి అడిగాడు అతను.

"హలో...నేను ఇంతకు ముందు మీకు పరిచయమున్నానా? మీకెందుకు ఈ అక్కర్లేని పని?"

"మేడం...నేనూ కూడా ఈ బస్సు స్టాపింగు లో నుండే బస్సు ఎక్కుతాను. మిమ్మల్ని ఇక్కడ చూశాను...ఆ పరిచయంతోనే అడిగాను"

"మిమ్మల్ని ఇంతకు ముందు నేను చూసిందే లేదే" అన్నది కౌసల్య.

"ఇప్పుడే ఉద్యోగంలో చేరాను. నాలుగు రోజులే అయ్యింది"

అతన్ని లోతుగా గమనించింది. అతను అబద్దం చెప్పే మనిషిగా అనిపించడం లేదు. అతను తనని వెంబడిస్తున్నాడని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు తనలోనే "సారీ" చెప్పుకుంది కౌసల్య.

“ఓ...అలాగా? ఎక్కడుంటున్నారు?" సహజంగా ఉండాలని అనుకుని అతన్ని అడిగింది.

"అమీర్ పేట...మీరు?"

"పంజా గుట్ట..." అని చెప్పిన కౌసల్య "మీ భార్య ఎక్కడ పనిచేస్తోంది?" అని అడిగింది.

కళ్ళార్పకుండా ఆమెనే చూశాడు అతను.

ఒక కంపనీ పేరు చెప్పి ,...అక్కడే తన భార్య అకౌంటంట్ గా ఉద్యోగం చేస్తోందని నవ్వుతూ చెప్పాడు!

ఒక్క క్షణం కలవరపడింది కౌసల్య.

"ఎంత ధైర్యం ఉంటే నువ్వు పనిచేస్తున్న ఆఫీసు పేరు చెబుతాడు...? నువ్వు ఏ ఆఫీసులో పనిచేస్తున్నావో తెలుసుకోవడానికి, ఆ ఆఫీసు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవడానికీ ఎంత ప్రయత్నం చేసుంటాడు?....ఇతను మంచి వాడు కాదు కౌసల్యా" కౌసల్య మనసు కౌసల్యను హెచ్చరించింది.

"మిస్టర్...చూడటానికి మాత్రం డీసెంటు గా ఉన్నారు...కానీ నాగరీకంగా నడుచుకోవటం లేదు"

"సారీ మాడం...మీరు మాత్రం ఒక పెళ్ళి కాని అబ్బాయిని చూసి అలాంటి ప్రశ్న అడిగితే... నేను ఏం జవాబు చెప్పాలో మీరే చెప్పండి?" అన్నాడు.

తాను అడిగిన ప్రశ్న తప్పు అని తెలుసుకున్న కౌసల్య "సారి" అన్నది.

"పరవాలేదండి. …'బై ద బై'...మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళికి అమ్మాయిని వెతుకుతున్నారు. నాకు మీరు బాగా నచ్చారు. మీకు నేను నచ్చుంటే మనం ప్రేమించి పెళ్ళి చేసుకోవటంలో తప్పు లేదు."

కౌసల్య ముఖం కోపంతో ఎర్ర బడింది.

“మీకు పర్సనాలటి పెరిగినంతగా బుద్ది పెరగలేదు. ఈ వయసులో పోయి ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నారు. …ఏది మంచిది- ఏది చెడ్డది అనే వివరం కూడా తెలుసుకోలేని 'టీన్ ఏజ్' పిల్లలే 'లవ్' చేస్తారు. ….ఇది కరెక్టేనా...మనకి సెట్ అవుతుందా? అని ఆలోచించ గలిగే వయసులో ఉన్న మీరు ప్రేమ కోసం తహతహ లాడటం చాలా అసహ్యంగా ఉన్నది….ఇకపోతే, నాకు పెళ్ళైపోయింది. స్కూలుకు వెళ్ళే వయసులో ఇద్దరు పిల్లలు ఉన్నారు" అని ఆపకుండా మాట్లాడిన కౌసల్య అతన్ని చూసి...'నాగరీకం తెలియని మనిషి" అని గొణుక్కుంది.

అతను నవ్వుతూ "ప్రశాంతంగా ఉండండి మాడం. మీ తమ్ముడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఒక ఏడాది నుండి మీరు ఉద్యోగానికి వెడుతున్నారు. మీ అమ్మ-నాన్నా ఇద్దరూ బ్యాంకులో పనిచేస్తున్నారు. మీరు ఉద్యోగం చేయాలన్న అవసరం మీ కుటుంబానికి లేదు. కానీ మీ ఇష్టం కోసం ఉద్యోగానికి వెడుతున్నారు. ఇకపోతే...మీ రాసి కన్య రాసి. మీ నక్షత్రం ఉత్తర-నాలుగో పాదం. లగ్నం...." అని అతను చెపుతూ వెడుతూంటే, అతన్నే గమనిస్తున్న కౌసల్యకు కోపం ఏక్కువ అయ్యింది.

"ఆపండి...మీరు రాజశేఖరే కదూ?.. ‘జాబిల్లి ఇంజనీరింగ్' కంపనీ యొక్క ప్రొడక్షన్ మేనేజర్...కరక్టే కదా....?"

అతను తలూపి వొప్పుకున్నాడు.

"నా గురించి ఎంక్వయరీ చేస్తున్నారా?" కౌసల్య మాటల్లో తీవ్రమైన కోపం.

"నో...నో...అదేం లేదు" నవ్వుతూ చెప్పాడు.

“మరి!...అమ్మా, నాన్నా చూసిన అమ్మాయి మంచిదేనా? లేక ప్రేమ పేరుతో ఎవరితోనైనా అడ్డ దిడ్డంగా తిరుగుతోందా అని తెలుసుకోవటానికే కాదా నన్ను వెంబడిస్తూ వచ్చారు" అని కోపంగా అడిగింది.

అతను మౌనంగా...దూరంగా వస్తున్న బస్సును చూస్తూ నిలబడ్డాడు.

'పెళ్ళికి ముందే నా గుణాన్ని సందేహించే మనిషినా నేను భర్తగా పొందబోతున్నాను?.. ‘కాబోయే అల్లుడు బంగారం' అని సర్టిఫికేట్ ఇచ్చిన తండ్రిపైన కోపం తెచ్చుకుంది.

తల్లి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది కౌసల్య.

"నీ ఫోటో చూసిన వెంటనే నువ్వు అతనికి బాగా నచ్చేశావు. సిగిరెట్లు, మందు లాంటి ఎటువంటి చెడు అలవాట్లు లేవుట. పెళ్ళికొడుకు పని చేస్తున్న కంపెనీకి వెళ్ళి నాన్న గారు ఎంక్వయరీ చేసొచ్చారు. దేవుడు నీకని రాసిన సంబంధం ఇదే నని మేము నమ్ముతున్నాము"

"పెళ్ళి కొడుకు అత్యంత నీచమైన గుణం కలవాడు అని చెప్పి ఈ పెళ్ళికొడుకును వదిలించుకోవాలి" మనసులోనే తీర్మానించుకునంది కౌసల్య.

“కౌసల్య గారు, నేను మిమ్మల్ని అనుమానించో, మీకు పరీక్ష పెట్టాలనో మీ వెనుక రాలేదు...మీరు రోజూ పేపర్ చదువుతారా?"

కౌసల్య అతనికి జవాబు చెప్పలేదు.

“పెళ్ళి రోజున ప్రేమించిన వాడితో వెళ్ళిపోయిన ఆడపిల్లల గురించి ఎన్నో వార్తలు వచ్చుంటాయి. పోయిన సంవత్సరం జూన్ నెల నా చెళ్ళెలు గురించిన వార్త వచ్చింది"

కౌసల్యకు ఏమీ అర్ధం కాలేదు. అయినా మౌనంగా అతను చెప్పేది వింటోంది.

అతను చెప్పటం తిరిగి ప్రారంభించాడు.

"నా చెళ్ళెలు పరమేశ్వరి తన పెళ్ళి రొజున ఆమెకు ఇష్టమైన వాడితొ వెళ్ళిపోయింది. దాని వలన మాకు జరిగిన అవమానం చాలా ఎక్కువ. పెళ్ళికి వచ్చిన వందలాది జనం ముందు మేము తల వంచుకోవలసి వచ్చింది. ఆ అవమానం తట్టుకోలేక మా నాన్నా, అమ్మా చాలా కుంగిపోయారు. చచ్చి పోదామని ఆలోచించడం మొదలు పెట్టారు. ఏలాగో వాళ్ళకు నచ్చ చెప్పి శాంత పరిచాను”

“పెళ్ళి ఏర్పాట్లు జరగటానికి ముందైనా నా చెళ్ళెలు నా దగ్గర తన ప్రేమ గురించి చెప్పుండొచ్చు. ఊళ్ళో వాళ్ళ ముందు తల దించుకోవలసిన అవసరం వచ్చేది కాదు. ఒక వేళ నా చెళ్ళెలు తన ప్రేమ గురించి చెప్పున్నా అమ్మ గాని, నాన్నా గాని, నేను గాని ఆమె ప్రేమను ఎదిరించే వాళ్ళమే కానీ ఆమె ప్రేమను సమ్మతించే వాళ్లం కాదు. అది వేరే విషయం"

“మా ఇంట్లో జరిగిన ఆ సంఘటన తరువాత, నెనొక నిర్ణయానికి వచ్చాను. ఇలాంటి సంఘటన మీ ఇంట్లో జరగకూడదు. అందుకనే మీరు ఇంకెవరినైనా ప్రేముస్తున్నారని తెలిస్తే...మీ ఇద్దరినీ కలపటానికి నా వంతు సహాయం చేద్దామని మిమ్మల్ని వెంబడించాను. ఇప్పుడు బాగా తెలుసుకున్నాను "

"ఏం తెలుసుకున్నారు?"

"ఇంతవరుకు మీరు ఎవరినీ 'లవ్' చేయలేదు. ఇక మీదట చేద్దామనే ఉద్దేశమూ లేదు"

"ఇంకా"

"మీకు ‘ప్రేమ’ అనే పదమే నచ్చదు"

కౌసల్య ముఖం చిట్లించుకుంది.

"ప్రేమ అనే పదం నచ్చకపోవటానికి కారణం, నేను ప్రేమలో ఓడిపోయుంటాననే అనుమానం మీకు కలగలేదా?"

"కలగలేదు. దానికి కారణం, మీ స్నేహుతురాలు స్వప్న. ప్రేమ అనే పేరుతో ఒకడు అమెను మొసగించి, వదిలి వెళ్ళిపోయాడు. పుట్టింటికి తిరిగి వెళ్ల లేక, ఎవరి తోడూ లేకుండా, ఒక ఆడపిల్లకు తల్లిగా ఒంటరిగా నిలబడుంది"

"ఒక వేళ ఇప్పుడు నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్ళి చేసుకుంటాను అని చెబితే...మీ రియాక్షన్?"

"ఖచ్చితంగా మీకు సహాయపడతాను. అతను మంచివాడుగా ఉండే పక్షంలో, మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడతాను. మంచివాడు కాకపోతే మీకు మంచి సలహా ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో పెట్టటానికి ప్రయత్నిస్తాను"

"ఆ తరువాత తప్పించుకున్నామురా, బ్రతికిపోయామురా అనుకుంటూ వెళ్ళిపోతారు...అంతే కదా?"

"అలా ఎన్నడూ జరగదు...అప్పుడు కూడా మిమ్మల్నిపెళ్ళి చేసుకోవటానికి నేను రెడీ"

"ఎంతో మంది ఆడపిల్లలు ప్రేమ అనే పదంతో జీవితాన్నే పోగొట్టుకుని ఒంటరిగా నిలబడుండటం చూస్తుంటే, మగవాళ్లను, చీదరించుకోవాలని అనిపిస్తోంది" అన్నది కౌసల్య.

"అందరి మగాళ్లనూ తప్పుగా అంచనా వేయకండి..."

"అర్ధమయ్యింది" అంటూ చిన్నగా నవ్వింది.

అతని మీద మొదట్లో ఏర్పడ్డ కోపం ఇప్పుడు తగ్గింది.

“ఇతను అనుమానపు మనిషి కాదు. తన ఇంట్లో జరిగిన సంఘటన లాగా, ఇంకెవరి ఇంట్లోనూ జరగ కూడదు అనే మంచి ఆలొచన కలిగినవాడు, దాంతో పాటు ఆడపిల్లల మనోభావాలకు మర్యాద ఇచ్చేవాడు” మనసులోనే అనుకున్నది కౌసల్య.

"కౌసల్య గారూ...ఇప్పుడు ఏమనిపిస్తోంది?" ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ అడిగాడు.

"మొసగించ లేడు అనే పూచి దొరికితే, పెద్దల ఆసీస్సులతో ప్రేమించుకో వచ్చు..."

వెంటనే అతను కౌసల్య కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ క్షణం కౌసల్యకు తాను ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు అనిపించింది.

"కౌసల్య గారు...నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరూ నన్ను ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాను….మనం ప్రేమించుకుందామా?" అంటూ గొణిగాడు.

"ప్రేమ...ఇంత మధురమా" అన్న భావన కౌసల్యలో కలిగింది.

"ఇంకో కొన్ని రోజుల్లో పెద్దల అంగీకారంతో మన పెళ్ళి జరిగిన తరువాత మనం ప్రేమించుకొవచ్చు…ప్రేమించుకుందాం" అని అంటూ అతని చెతుల్లో ఉన్న తన చేతిని మెల్లగా అతని దగ్గర నుండి విడిపించుకుంది కౌసల్య.

“ష్యూర్” అంటూ అతను కన్ను గీటేడు.

ఆనందమయమైన వాళ్ళిద్దరి ప్రేమ కొసం భవిష్యత్ కాలం ఎదురుచూస్తోంది.

*********************************************సమాప్తం********************************************

28, డిసెంబర్ 2019, శనివారం

ఎవరా తొమ్మిదిమంది?...(మిస్టరీ)



                                                ఎవరా తొమ్మిదిమంది?


ఎవరా తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు...?


వీరు భారతదేశంలో నియమించబడిన రహస్య సంఘంలోని వ్యక్తులు అని మాత్రం తెలుసుకున్నారు. శక్తివంతమైన మరియు ప్రభావవంతమైన ఈ రహస్య సంఘంలోని వారు మంచికి ప్రతినిధులు మరియు ఉన్నత వ్యక్తులే కాకుండా వీరు ప్రపంచవ్యాప్తంగా పంపబడ్డారని పశ్చిమ దేశాలు భావిస్తూ, వారెవరో తెలుసుకోవటానికి ఏన్నో పరిశోధనలు జరిపారు. ఎన్ని పరిశోధనలు జరిపినా వారెవరెవరో తెలుసుకోలేకపోవటం వలన ఆ విషయం ఇప్పటికీ ఒక అతి పెద్ద మిస్టరీగానే ఉండిపోయింది.


ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు గురించి మొదట ‘టాల్బట్ ముండి’ అనే ఒక రచయత 'తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు’ అనే పేరుతో రాసిన తన నవలలో (పేర్లు లేకుండా) పేర్కొన్నాడు. ఈ నవలలోని ఆ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు…సాంకేతిక సమాచారాన్ని అభివృద్ది చేస్తూ, అవి దుష్టుల చేతిలొకి వెళ్ళకుండా, అభివృద్ది చేసే సాంకేతిక సమాచారాన్ని పరిరక్షించే పనికి క్రీస్తు పూర్వం 273లో మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడు తొమ్మిదిమంది వ్యక్తులను రహస్యంగా ఎన్నుకుని, అంతే రహస్యంతో రహస్య సంఘం స్థాపించాడని ఆ నవల రచయత రాసాడు.

                                                             ఆశోక చక్రవర్తి

పురాణం ప్రకారం మౌర్యసామ్రాజ్యాధిపతి అశోకుడు తన తాత, ముత్తాతల లాగే మౌర్య సామ్రాజ్య పొడిగింపునకు కలింగ సామ్రాజ్యంపై(అంటే అప్పటి కలకతా నుండి మద్రాసు వరకు) దండయాత్ర చేశాడు. కలింగ సామ్రాజ్య వీరుల ప్రతిఘటన ఎక్కువగా ఉండటంతో అశోక చక్రవర్తి ఆ యుద్దంలో లక్షమంది వీరులను కోల్పోయాడు. ఆ ఊచకోతను చూసి తట్టుకోలేక అశోక చక్రవర్తి అహింసా మార్గాన్ని ఎన్నుకొన్నాడు. ఆ ఊచకోత తరువాత అశొక చక్రవర్తి బౌద్దమతం పుచ్చుకున్నాడు.


ఆ తరువాతే యుద్దాలు జయించటానికి, సామ్రాజ్యాలను విస్తరింపచేసుకోవడానికి మనిషి తన తెలివిని, జ్ఞానాన్ని అరిష్టాలకు ఉపయోగిస్తున్నాడని, అందువలన తన పరిపాలనా కాలానికి గత చరిత్రలోనూ మరియు తన కాలంలోనూ అభివృద్ధి చేసిన/చెందిన సహజ శాస్త్రాన్ని గోప్యంగా ఉంచాలని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అంతే కాకుండా రాబోవు కాలంలో, అంటే రాబోవు 2000 సంవత్సరాలలో అన్ని రంగాలలో జరుపబోయే పరిశోధనలు, పరిశోధనల వివరాలూ అధ్యాత్మిక పారవశ్యంలోనూ, అతీంద్రియ విషయాలను నమ్ముతారో వారిచే గోప్యతగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అలాంటివారిని తొమ్మిది మందిని ఎన్నుకున్నాడు.

                                                          Pope Sylvester II

వారికోసం ఒక రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రహస్య సంఘమే భూమి మీద ఉన్న అత్యంత రహస్యమైన సంఘంగా చెప్పబడుతూ, ఆ సంఘంలోని వారినే తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులుగా గుర్తించారు. ఎవరైనా ఊహించుకోవచ్చు. 2000 సంవత్సరాల పరిశోధనలు, అధ్యయనాలు మరియు పత్రాలు ఆ తొమ్మిది మందికి మాత్రమే తెలిసున్నదంటే వారు ఎంత అసామాన్యమైన, ప్రాముఖ్యమైన మరియు జ్ఞానం కలిగిన వ్యక్తులో. వీరి లక్ష్యం ఏమై ఉంటుంది? మానవజాతి నాశనానికి అభివృద్ది చేయబడ్డ పద్దతులు అర్హత లేని వారి చేతుల్లోకి వెళ్ళకుండా చూడడం, మానవజాతి శాంతియుతంగా జీవించేందుకు కావలసిన జ్ఞానాన్ని అందివ్వడం. ఈ సంఘంలోని సభ్యుల సహ ఎంపిక ప్రాచీన పరిశోధనలనూ, అధ్యయనాలనూ మరియు పత్రాలను సంరక్షించేందుకు మాత్రమే.

                                                          జగదీష్ చంద్రబోస్

ఈ తొమ్మిదిమందికీ ఒక ప్రత్యేకతమైన బాధ్యత పుస్తక రూపంలో ఇవ్వబడింది. ఈ తొమ్మిదిమంది చేయవలసినదల్లా ఆ పుస్తకాలలో రాయబడ్డ ప్రమాదకర విషయాలు రక్షించబడుతూ మరియు వారు మానవజాతికి సహాయపడే పరిశోధనలను చేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ తొమ్మిది పుస్తకాలూ 9 రంగాలకు చెందినవి.

                                                             విక్రం సారాభాయ్

ఆ పుస్తకాలు:

గ్లోబెల్స్ ప్రచారం: మనసులతో చేయు యుద్దాల గురించిన సమాచారం.

మనస్తత్వ శాస్త్రం: మరణ స్పర్శ్ తో కూడిన సమాచారం.

అతిసూక్ష్మ జీవశాస్త్ర సమాచారం.

రసవాదం.

సమాచారం: అంతరిక్ష శాస్త్రం, అనంతాకాశం మరియు కాలప్రయాణాలతో, అంతరిక్ష గ్రహవాసులతో కూడిన సమాచారం.

భూమ్యాకర్షణ మరియు అభూమ్యాకర్షణ సమాచారం.


యంత్రాలు, విమానాలతో కూడిన సమాచారం.

కాంతి, కాంతి వేగం మార్చే సాంకేతికంతో కలిసి కూడిన సమాచారం.

సమాజ శాస్త్రం, రాజ్యాల ఉత్తాన పతనాల సూత్రాలతో కూడిన సమాచారం.

1960లో లూయస్ పవెల్స్ మరియు జాకస్ బర్గర్ లు ఈ తొమ్మిది అపరిచిత వ్యక్తుల గురించి తమ మార్నింగ్ మెజీషియన్స్ అనే పుస్తకంలో వ్రాశారు. పవెల్స్ మరియు బర్గర్ లు ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల విషయం మొదట 1860లో భారతదేశంలో మరియు తహిటిలో పనిచేసిన ఫ్రెంచ్ జడ్జి అయిన లూయస్ జాకొల్లియట్ చెప్పినట్టుగా వెళ్ళడించారు. వీరి రచనల్లో పవల్ మరియు బర్గర్ లు ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తులు అప్పుడప్పుడు బాహ్య ప్రపంచంలోని మేధావులకు దర్శనం ఇస్తారని చెప్పారు. అలానే పోప్ రెండవ సిల్విస్టర్ కు కనిపించి అతీంద్రియ శక్తులు మరియు మాట్లాడే రోబోట్ ను బహుమతిగా ఇచ్చారని చెపుతారు.

భారత శాస్త్రవేత్తలు జగదీష్ చంద్రబోస్ మరియు విక్రం సారాభాయ్ ఈ తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల వంశానికి చెందిన వారేనని చెబుతారు. కానీ దీనికి తగిన సాక్ష్యం పెద్దగా లేదు. కానీ మొదటి తొమ్మిదిమంది అపరిచిత వ్యక్తుల గురించి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయట.

Images Credit: To those who took the original photos. ***********************************************************************************************

25, డిసెంబర్ 2019, బుధవారం

శపించబడ్డ గ్రామం...(మిస్టరీ)



                                                     శపించబడ్డ గ్రామం

రాజస్తాన్ లోని జైసల్మేర్ జిల్లాలోని కుల్ధర. ఇది జైపూర్ పట్టణానికి పడమటి దిక్కులో సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని చుట్టుపక్కల మరో 83 గ్రామాలు ఉండేవిట. ఒకప్పటి సుభిక్షమైన, కళకళలాడే ఈ గ్రామం ఇప్పుడు పరిత్యజించిన ప్రదేశంగా, ఎడారిగా మారిందట.

ఒకప్పుడు, అంటే 1825 వరకు కుల్ధర గ్రామం అత్యంత సంపన్న గ్రామంగా ఉండేది. అక్కడ 1500 పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఎడారిగా ఉన్నా, తమ గ్రామంలోనూ కొత్త సాంకేతికంతో ఎక్కువ నీరు కావల్సిన గోధుమ పంటను పండించేవారు. ఎడారిలో, అందులోనూ నీరు ఎక్కువ కావలసిన పంటైన గోధుమను ఎలా పండిస్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఆ పంట వలనే వారంతా సంపన్నులయ్యేరట.

500 సంవత్సరాలుగా నివాసముంటున్న పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు 1825 వ సంవత్సరం ఒక రోజు రాత్రి నుండి కనిపించకుండా పోయారట. కుల్ధర గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా ఆ గ్రామానికి చుట్టూ ఉన్న 83 గ్రామ ప్రజలూ మాయమయ్యారట. వారు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏమైపోయారు అనేది ఈనాటికీ మిస్టరీగానే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఎటువంటి భూకంపమూ రాలేదు. అగ్నిపర్వతమూ బద్దలవలేదు.

అక్కడి ప్రజలు మాయమవటానికి కారణాన్ని ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. కానీ వారు మాయమవటానికి కొన్ని కథలు చెప్పుకుంటారు. అందులో చాలామంది చెప్పేది ఒకే కథ. అప్పట్లో జైసల్మేర్ జిల్లాను పరిపాలిస్తున్న ప్రభుత్వ మంత్రి సలీం సింగ్ ఆ గ్రామానికి వచ్చినప్పుడు, ఆ గ్రామ పెద్ద యొక్క అందమైన కుమార్తెను చూసి ఆమెను పెళ్ళాడ దలచి, ఆ మాటను ఆమె తండ్రి, అప్పటి గ్రామ పెద్దకు చెప్పి, ఒకవేళ పెళ్ళికి అంగీకరించని పక్షంలో ఆ గ్రామ ప్రజలందరూ ప్రభుత్వానికి అత్యధిక పన్ను కట్టాలని ఆజ్ఞ వేసేడట. వారు అధిక పన్ను కట్టక, పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఆ గ్రామ ప్రజలను కృరమైన పద్దతులతో బాధలు పెట్టాడట. అనైతికంగా ప్రవర్తించాడట. అందువలన అక్కడి ప్రజలు కోపంతో ఆ గ్రామాలు వదిలి వెళ్ళారట.


అసలు కథ.

గ్రామాన్ని విడిచి వెడుతున్న పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు శపించి వెళ్ళారట. 'మేము శుభిక్షం చేసిన ఈ గ్రామంలో మేము తప్ప ఇంకెవరూ నివశించకూడదు అని. ఈ శాపాన్ని ఖాతరుచేయని కొందరు ఆ గ్రామానికి వచ్చి పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు వదిలిపెట్టిన ఇళ్ళను స్వాధీనం చేసుకుని అక్కడ నివశించడానికి ప్రయత్నించారట. కానీ అలా చేసిన వారెవరూ కొన్ని రోజుల కంటే బ్రతకలేదట. కొద్ది సంవత్సరాల తరువాత ఈ శాపం గురించి తెలిసిన కొంతమంది ధైర్యం చేసి ఈ గ్రామానికి వచ్చారట. వారందరూ కూడా కొద్ది రోజులలోనే మరణించారట. అప్పటి నుండి ఈ గ్రామానికి రావడానికి అందరూ భయపడ్డారు. ఎవరూ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ఆ గ్రామంలో చనిపోయిన వారందరూ ఇంకా అక్కడే సంచరిస్తున్నారట.


ఆ గ్రామానికి వచ్చి నివసిద్దామనుకునే వారు కొన్ని రోజులకే చనిపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

విషయం తెలుసుకునేందుకు ప్రముఖ శాస్త్రవేత్తలు ఆ గ్రామానికి వచ్చి పరిశోధనలు నిర్వహించారు. అందరూ అక్కడ రకరకాల శబ్ధాలు వినబడుతున్నాయని, ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుందని తెలిపారు గానీ అవేమిటో చెప్పలేకపోయారు. ఒక్క రాత్రి అక్కడ ఉండటం మంచిది కాదని, ప్రాణాంతకమని మాత్రం తెలిపారు. 2013లో ఢిల్లీకి చెందిన పారానార్మల్ సొసైటీ వారు ఆ గ్రామంలో ఏదో అసాధారణమైన శక్తి ఉన్నదని చెబుతూ అదేమిటో పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. గౌరవ్ తివారీ నాయకత్వంలో 18 మంది కలిగిన రీసెర్చ్ గ్రూప్, ధైర్యమున్న 12 మంది సాధారణ మనుషులను తీసుకుని కుల్ధర గ్రామానికి వెళ్ళి ఒక రాత్రంతా గడిపి నిజమేమిటో తెలుసుకురావాలని ఆ గ్రామానికి వెళ్ళారు.


ఆ రాత్రంతా వింత చర్యల అనుభవంతో భయానక గంటలు గడిపారు. అత్యంత ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలతో వెళ్ళిన వారికి ఆ గ్రామంలో ఏవో కదులుతున్న నీడలూ, మాటలూ, అరుపులు, నవ్వులూ, ఏడుపులూ వినిపించడమే కాకుండా వారి కార్ల మీద చేతి ముద్రలు కనిపించాయట. వెళ్ళిన కొంత మందికి తమల్ని ఎవరో తాకిన అనుభవం కలిగిందట. వారి దగ్గరున్న పరికరాలలోని కె-2 మీటర్ మూలం అక్కడి వాతావరణ ఉష్ణొగ్రతని రికార్డు చేశారు. కొన్నిచోట్ల 41-C గానూ, కొన్ని చోట్ల 31-C గానూ చూపించిందట. వాడిన లేజర్ పరికరంతో కదిలే నీడలను చూశారట. అక్కడ నుండి తిరిగి వచ్చిన రీసెర్చ్ గ్రూపులోని కొందరు "ఇంత భయానకమైన రాత్రిని మేము ఎప్పుడూ గడపలేదు" అని తెలిపారట.


1826 నుండి ఇప్పటి వరకూ ఆ 85 గ్రామాలూ ఖాళీగానే ఉన్నాయి. ఆనాతి ఇళ్లు శిధిలాలు తప్ప అక్కడ ఇంకేమీ లేవు. పల్వాలీ కుటుంబాలు రక్షాబంధన్ రోజున గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళినందువలన దేశంలో పలుచోట్ల నివశిస్తున్న కొన్ని పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు రక్షాబంధన్ పండుగను జరుపుకోరట.

Images Credit: To those who has taken the original photos. ***************************************************************************************************

23, డిసెంబర్ 2019, సోమవారం

చదివింపు...(కథ)




                                                       చదివింపు...(కథ)

అఫీసులోని స్నేహితులందరికీ పెళ్ళి పత్రిక ఇచ్చి ఆహ్వానించిన సురేందర్ కళ్ళు ఆఫీసు ప్యూన్ ఆంజినేయులు ని వెతుకుతున్నాయి.

"మీకు తెలియదా?...అతను ఆఫీసు స్నెహితుల ఇంటి ఫంక్షన్లకు, పెళ్ళిల్లకూ రాడు. ఎందుకు అనవసరంగా ఒక పత్రికను 'వేస్టు చేయాలి?" అన్నాడు కొలీగ్ గంగాధరం.

అప్పుడే ప్యూన్ ఆంజినేయులు అక్కడికి వచ్చి నిలబడ్డాడు.

సురేందర్ ఒక పెళ్ళి పత్రిక తీసి, దాని మీద అతని పేరు రాసి అతనికి ఇచ్చాడు.

"కచ్చితంగా ఫ్యామిలీతో రావాలి. నా పెళ్ళికి రాలేదంటే...తరువాత మీతో మాట్లాడటం మానేస్తా!"

"వద్దు సార్...మీ పెళ్ళికి కచ్చితంగా వస్తాను" చెప్పాడు ఆంజినేయులు. కానీ అతని మాటల్లో ఉత్సాహం లేదు.

కల్యాణ మండపం ముందు ….ఫ్లెక్సీ బ్యానర్ పై తలతల లాడుతున్నారు కొత్త దంపతులు.

వాళ్ళ కంపెనీ ఏం.డి, జి.ఏం., ప్రొద్దున్నే వచ్చి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయారు.

కల్యాణమండపం నిండిపోయింది. ఇంతమంది పెళ్ళికి వస్తారని సురేందర్ అనుకోలేదు. అంతమంది జనం ఉన్నా సురేందర్ కళ్ళు ప్యూన్ ఆంజినేయులు ని వెతుకుతున్నాయి.

అదిగో...అతను వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే సురేందర్ కి సంతోషం కలిగింది. తిన్నగా సురేందర్ దగ్గరకు వచ్చిన ప్యూన్ ఆంజినేయులు, సురేందర్ కి ష్యేక్ హాండ్ ఇచ్చి,శుభాకాంక్షలు తెలిపి, చదివింపు కవరును జాపాడు.

“భోజనం చేసిన వెంటనే మీరు వెళ్ళిపోకూడదు. కొంచంసేపు ఉండండి..." అన్నాడు సురేందర్.

రెండు గంటల తరువాత సురేందర్ కి కొంచం రెస్టు దొరికింది. తిన్నగా ప్యూన్ ఆంజినేయులు ఉన్న చోటుకు వచ్చాడు.

"మీరు వచ్చినందకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ, మీ ముఖం వాడిపోయి ఉందేమిటి...ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా?" అడిగాడు.

"అయ్యయ్యో...అదంతా ఏమీ లేదు సార్. నేను ఆఫీసు స్నెహితుల ఇంటి ఫంక్షన్లకు, పెళ్ళిల్లకూ లేక ఇంకేదైనా పార్టీలకూ వెళ్లను. ‘ఎందుకని?’ అని చాలాసార్లు మీరు నన్ను అడిగారే...? ఇప్పుడు చెబుతాను. ఆఫీసులో పనిచేస్తున్న అందరూ నాకంటే జీతం ఎక్కువ తీసుకునే వారే. వాళ్ళ తాహతకు వాళ్లు పెద్ద పెద్ద చదివింపులు, ఖరీదైన బహుమతులు ఇస్తారు. నేను ఎక్కువగా ఇవ్వగలనా? మహా ఎక్కువగా ఇస్తే ఐదు వందలు. అంతకంటే ఎక్కువ ఇవ్వలేను.

అలా అంత తక్కువ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో నేను సహజంగా ఉండలేక పోతున్నాను. నేను పెద్ద బహుమతులు ఇవ్వలేకపోతున్నానే అన్న ఇన్ ఫీరియర్ కాంప్లెక్స్ నన్ను సిగ్గున పడేస్తోంది. నన్ను ఫంక్షన్ కు పిలిచిన వాళ్ళు అలా అనుకోరని నాకు తెలుసు. కానీ నాలో అలా ఒక మనోభావం. మిగిలిన వాళ్ళలాగా ఫ్రీగా ఉండలేకపోతున్నాను. అందుకనే ఎక్కడికీ వెళ్ళకుండా ఉండిపోతాను. ఈ పెళ్ళికి కూడా మీకొసమే వచ్చాను. మీ మనసు కష్టపడకూడదని వచ్చాను"

అతను చెప్పింది విని నవ్వాడు సురేందర్.

"ఇదే కారణమా? …..మీ ఆలొచన చాలా తప్పు. పెళ్ళికి స్నేహితులనూ, బంధువులనూ, తెలిసిన వాళ్లనూ ఎందుకు పిలుస్తున్నాం? అందరూ వచ్చి నోరారా- మనసారా దీవిస్తే మనం బాగుంటాం...మన జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతాం. కల్యాణ వేదిక అనేది అభిమానాన్ని, ప్రేమను బయటకు చూపాల్సిన చోటు. ఆస్తి, అంతస్తులను చూపించే చోటు కాదు"

అతను చెబుతుంటే అతన్నే చూశాడు ఆంజినేయులు.

"ఇదిగో నా పెళ్ళికి ఇంతమంది వచ్చారే, వాళ్ళందరూ నిజంగా నా కోసమే వచ్చారా? లేదు...నా పదవి చూసి వచ్చారు! కానీ నాకోసం వచ్చింది మీరు మాత్రమే...ఏదీ ఆశించకుండా...నేను బాగుండాలని, సంతోషంగా జీవించాలని ప్రేమతో ఆశీర్వదించటానికి వచ్చారు. ఈ విషష్, ఆశీర్వాదం డబ్బు కంటే చాలా గొప్పవి. వెలకట్టలేని బహుమతి, అతిపెద్ద చదివింపు. ఇదే నాకు కావాలి. నేను మాత్రం కాదు...ఇంటి విషేషాలకు పిలిచే అందరూ ఇలాగే ఆలొచిస్తారు.. ఇలాగే ఎదురు చూస్తారు...." ఆ మాటలు విన్న ప్యూన్ ఆంజినేయులు సిగ్గుతో తలవంచుకున్నాడు. అతన్ని గట్టిగా కౌగలించుకున్నాడు.

"మీరూ, మీ భార్య ఎటువంటి సమస్యలూ లేకుండా వందేళ్ళు సంతోషంగా జీవించాలి" ఎమోషనల్ అయిన ప్యూన్ ఆంజినేయులు రెండో మారు అతన్ని విష్ చేశాడు.

“వచ్చే వారం సేల్స్ డివిజన్లో పనిచేస్తున్న ప్రభాకర్ ఇంటి విషేషం ఉంది...దానికి వెళ్ళాలి" అనుకుంటూ అక్కడ్నుంచి బయలుదేరాడు ప్యూన్ ఆంజినేయులు.

*******************************************సమాప్తం**********************************************