7, జనవరి 2020, మంగళవారం

ఆలయం(సీరియల్)...PART-1
                                                ఆలయం(సీరియల్)
                                                          (PART-1)


విజయవాడ నగరములోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయం భక్తులుతో కిట కిట లాడుతోంది. ఆ రోజు అమ్మవారి దర్శనం కోసం కనకదుర్గ గుడికి వెళ్ళాడు ప్రసాద్. వెంకట్ ప్రసాద్ అని వాళ్ళ నాన్న పేరు పెట్టారు. అది ఎందుకో తెలియదు గానీ రెండు మాటలున్న పేర్లు గలవారిని చాలామంది ఆ రెండు మాటలతో పిలవరు. సురేష్ కుమార్ ను సురేష్, రామ మూర్తిని రామూ, క్రిష్ణ కుమార్ ను క్రిష్ణా అని పేరును కుదించి పిలవటమే అందరి నాలుకలకు అలవాటైపోయింది. ఆ కారణం కొసమే వెంకట్ ప్రసాద్, ప్రసాద్ అయిపోయింది.

మనం కూడా ప్రసాద్ అనే పిలుద్దాం...!

ప్రసాద్ ఒక కనకదుర్గ భక్తుడు. కనకదుర్గ గుడికి వెళ్ళే ముందు క్రిష్ణా నదిలో స్నానం చేసి వెళ్ళేటం అలవాటు. ఒక్కోసారి స్నానం చేసిన తరువాత అక్కడ మెట్ల మీద కూర్చుని ఊహల్లోకి వెళ్ళిపోతాడు.

అతను అలా ఊహల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం అతనొక రచయత. అందులోనూ బాగా పేరుపొందిన రచయత. అతనికని విజయవాడ నగరంలో ఒక చిరునామా ఉన్నది. దాంతో పాటు అతను ఒక ఫ్యాక్టరీలో సీనియర్ ఉద్యోగస్తుడు.

అతనికని మూలాధార శక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఇంద్రకీలాద్రి పైన కొలువున్న కనకదుర్గ అమ్మవారు, రెండు అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని శంకరయ్య! కనకదుర్గ అమ్మవారిని అందరికీ తెలిసుంటుంది. ఈ శంకరయ్య నే అందరికీ పరిచయం చేయాల్సి ఉంది.

శంకరయ్య, ప్రసాద్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ యొక్క యజమాని!

యజమాని అని పిలిస్తే సామాన్యంగా ఉంది కదా? అందంగా 'చైర్మన్’ అని చెప్పటంలోనే ప్రసాద్ కూ ఇష్టం. ఆయన వలనే అతను రచయతగా అవగలిగాడు. గుడిలో అమ్మవారి ముందు ‘చైర్మన్’ కోసం కూడా ప్రార్ధన చేసుకుంటాడు ప్రసాద్. శంకరయ్య గారు ఒక 'మల్టీ మిల్లియనర్’ . ఎటు చూసినా ఆయనకు ఫ్యాక్టరీలున్నాయి. ప్రపంచం మొత్తాన్ని చుట్టి చుట్టి వస్తారు. వంశ పారంపర్యంగా ఆస్తిపరుడు. కానీ, ఎక్కువమంది డబ్బుగలవారిలో అతుక్కోనుండే ఎటువంటి అహంభావమూ లేని అద్భుత ఆత్మ.

ఈ ప్రపంచంలో అన్ని రంగాలలోనూ అద్భుతమైన మనుష్యులు ఉంటారు. అందులో ఒకరిగా శంకరయ్య గారిని చెప్పొచ్చు. ప్రసాద్ కు ఆయన ఒక అతిపెద్ద ఉదాహరణ మనిషి కూడా! అందుకనే నేమో ప్రసాద్ తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నాడు.

ఒక వేడుక ఏమిటంటే...కొడుక్కి ఆయన పేరు పెట్టి, 'రేయ్ శంకరయ్య ' అని ప్రేమతో పిలవటానికి ఇష్టపడడు. తన కొడుకును 'చైర్మన్’ అనే పిలుస్తాడు.

ప్రసాద్ భార్య మాలతి...మంచి హౌస్ వైఫ్. ఆమె కూడా భర్తతో కలిసి తన కొడుకును 'చైర్మన్’ అనో, ‘ఎం.డి’ అనో పిలవటం ఒక వెడుక గా మొదలయ్యి, తరువాత అలవాటుగా మరిపోయింది.

ప్రసాద్ కొడుకు శంకరయ్య, ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో 'బి.ఇ.' చదువుతున్నాడు. వాడి స్నేహితులు కూడా....'రేయ్ చైర్మన్’ అని అతన్ని పిలవటం, వింటున్న మనకే వింతగా ఉంటుంది.

ప్రసాద్ అవన్నీ పట్టించుకోడు. అతని వరకు కొడుకు, యజమాని శంకరయ్యలా విజయం పైన విజయం సాధించాలి. ఆయన లాగానే వేలాది మందికి ఉద్యోగం ఇచ్చి ఆదుకొవాలి. తెలుగు భాష మీద ప్రేమ, తెలుగు సంస్కృతి, నాగరికత--ఇవన్నీ అతనిలో ఉండాలి. ఇదే ప్రసాద్ కోరిక. దీనికొసమే రోజూ కనకదుర్గ అమ్మవారిని వెడుకుంటూ ఉంటాడు.

ఇంకో కొన్ని సంవత్సరాలలో ప్రసాద్ కొడుకు డిగ్రీ పూర్తిచేసి, ప్రసాద్ ఆశలను పూర్తిచేస్తాడు. కానీ, అంత వరకు అతను అతని గౌరవనీయ యజమాని అయిన శంకరయ్య ఫ్యాక్టరీలో పనిచేయగలడా, లేదో అనేదే అతనిలో పెద్ద ప్రశ్నార్ధంకంగా ఉంటోంది.

దానికి కారణం అతనిలో ఈ మధ్య ఏర్పడిన భయం!

ఊహల్లో సులభంగా సంచరించ గలిగిన అతను ఈ మధ్య స్వయంగా కొన్ని యధార్ధాల తాకిడికి లోనైయ్యాడు.

క్రిష్ణా నది ఒడ్డున కుర్చున్నప్పుడు అతని మనసులో దాని గురించే ఆలొచన వచ్చింది.

ఆరోజు ప్రొద్దున....ఆఫీసులో జరిగిన ఒక సంభవం అతన్ని కలవరపెడుతోంది.

                                                                  ఇంకా ఉంది.....Continued in PART-2.

********************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి