8, జూన్ 2021, మంగళవారం

నేను కాలుపెడితేనే మహమ్మారి పోతుంది: నిత్యానందా...(న్యూస్)


                                               నేను కాలుపెడితేనే మహమ్మారి పోతుంది: నిత్యానందా                                                                                                                               (న్యూస్) 

                               నేను కాలు పెడితేనే మహమ్మారి భారతదేశం నుండి పోతుంది...నిత్యానందా

దేశవ్యాప్తంగా వినాశనం కలిగిస్తున్న దారుణమైన రెండవ కొవిడ్-19 తరంగాన్ని భారత్ పోరాడుతుండగా, స్వీయ-శైలి గాడ్మాన్ నిత్యానంద తన కొత్త వీడియోలో, కోవిడ్ -19 మహమ్మారి భారతదేశంలో తాను అడుగుపెట్టినప్పుడే ముగుస్తుందని చెప్పారు.

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న గాడ్ మాన్, 2019 లో ఈక్వెడార్‌ కు పారిపోయి అక్కడ  దాక్కున్నట్లు చెబుతున్నారు. తాను 'కైలాసా' అని పిలవబడే 'వర్చువల్ ఐలాండ్' ను అక్కడున్న తీరంలో ఏర్పాటు చేశానని నిత్యానందా పేర్కొన్నాడు.   

ఆ తరువాత, స్వీయ-శైలి గాడ్మాన్ ఎప్పటికప్పుడు వీడియోలను విడుదల చేయడం ద్వారా ఆకస్మిక ఎంట్రీలను ఇస్తూ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాడు.ఈ వీడియోల మీద నెటిజన్లు మీమ్స్ మరియు ప్రతిచర్యల ద్వారా సామాజిక హాస్యాన్ని సృష్టించడంతో, అతని వీడియోలు వైరల్ అవుతన్నాయి. ఇంకా, ‘కైలాసా’ ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో విజ్ఞప్తి చేసినట్లు నిత్యానంద తెలిపారు. ఒక అడుగు ముందుకు వేయడం ద్వారా,  నిత్యానంద కైలాసా కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా సృష్టించాడు, ఆ తరువాత, అతను కైలాసాలో రిజర్వ్ బ్యాంక్‌ను తెరిచానని మరియు కొత్త కరెన్సీలను ఆవిష్కరించానని వీడియో ద్వారా షాకింగ్ ప్రకటన చేశాడు.

ఇంతలో, ఏప్రిల్ 19 న, కోవిడ్ -19 రెండవ తరంగ వ్యాప్తి సమయంలో భారతదేశం నుండి భక్తులు తన ‘కైలాస’ లోకి ప్రవేశించడానికి అనుమతించనని స్వీయ-శైలి గాడ్మాన్ ప్రకటించారు. ఈ జాబితాలో బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మలేషియా కూడా ఉన్నాయి.

స్పష్టంగా, కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఒక వీడియోలో, కోవిడ్ -19 భారతదేశం నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందని నిత్యానంద శిష్యులలో ఒకరు ఆయనను అడిగారు. దీనికి సమాధానమిస్తూ, నిత్యానంద మాట్లాడుతూ, దేవత ‘అమ్మోరు’ తన ఆధ్యాత్మిక శరీరంలోకి ప్రవేశించిందని,  నేను భారతదేశంలో అడుగు పెట్టినప్పుడే భారతదేశం నుండి కోవిడ్ -19 భారతదేశంను విడిచి వెళ్తుందని చెప్పారు. నిత్యానంద యొక్క ఈ ఉద్దేశించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో, భారతదేశం నుండి కోవిడ్ -19 ను నాశనం చేయడానికి గాడ్మాన్ వస్తాడా అని నెటిజన్లు ఊహాగానాలు ప్రారంభించారు.  

దేవత ‘అమ్మోరు’ తన ఆధ్యాత్మిక శరీరంలోకి ప్రవేశించిందని చెబుతూనే, కోవిడ్ -19 రెండవ తరంగ వ్యాప్తికి భయపడుతూ ఆ సమయంలో భారతదేశం నుండి భక్తులు తన ‘కైలాస’ లోకి ప్రవేశించడానికి అనుమతించనని స్వీయ-శైలి గాడ్మాన్ ఏప్రిల్ 19 న ప్రకటించడం హాస్యాస్పదం.

Image Credit: To the person who took the original photo.

************************************************************************************************

7, జూన్ 2021, సోమవారం

పాలిట్రిక్...(కథ)

 

                                                                                          పాలిట్రిక్                                                                                                                                                                                        (కథ)

పాలిటిక్స్ అంటే రాజ‌కీయ పార్టీ కాదు. ఏ కులానికో, మ‌తానికో, వ‌ర్గానికో సంబంధించిన సంఘ‌మూ కాదు...దేశ సౌభాగ్యం, సౌభ్రాతృత్వం కోరుకునే ప్ర‌తి పౌరుడికి వేదిక ఈ  పాలిటిక్స్‌...ఈ స‌మాజం గ‌మ్యం ఎటువైపు అని మ‌ధన‌ప‌డుతూ స‌మాజ శ్రేయ‌స్సు కోసం ప‌రిత‌పించ‌డం త‌ప్ప యేం చేయాలో తెలియ‌క దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న సామాన్యుడి గొంతుక‌కు వేదిక పాలిటిక్స్‌...సామాన్యుల ఆశ‌లు తీరాల‌న్నా.... న‌వ‌త‌రం ల‌క్ష్యాలు సాధించాల‌న్నా...దేశానికి బంగారు భ‌విష్య‌త్తు కావాల‌న్నా  పాలిటిక్స్ ఆవ‌శ్య‌క‌త అవ‌స‌ర‌మ‌ని ఎలుగెత్తి చాట‌డ‌మే పాలిటిక్స్ ల‌క్ష్యం.

సమూహాలుగా నివసిస్తున్న ప్రజలు నిర్ణయాలు చేసేందుకు మార్గం పాలిటిక్స్. తెగలు, నగరాలు, లేదా దేశాలుగా ప్రజలు సమూహాలుగా కలిసిమెలసి జీవించేందుకు ప్రజల మధ్య ఒప్పందాలు చేయడానికి పాలిటిక్స్ ఉన్నాయి. పెద్ద సమూహాలలో, దేశాల వంటి వాటిలో కొంతమంది ఇటువంటి ఒప్పందాలు చేయడానికి చాలా సమయం వెచ్చిస్తారు. వీరిని పొలిటికల్ లీడర్స్ లేక రాజకీయ నాయకులు అంటారు. 

కానీ ఇప్పుడు రాజకీయనాయకులు తమ స్వార్ధం కోసం సమాజాన్ని వాడుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. పాలిటిక్స్ ను పాలిట్రిక్స్ గా మార్చేశారు. అలాంటి పాలిట్రిక్స్ ను పాలిటిక్స్ లో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు వాళ్ల స్వలాభం కోసం ఎలా వాడుకున్నారో  పాలిట్రిక్ కథ తెలుపుతుంది..

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:

పాలిట్రిక్...(కథ) @ కథా కాలక్షేపం-1 

************************************************************************************************

5, జూన్ 2021, శనివారం

ప్రేమించుకోవచ్చు!...(కథ)


                                                                                     ప్రేమించుకోవచ్చు!                                                                                                                                                                               (కథ)

రెండక్షరాల చిన్న పదం ప్రేమ. రెండు హృదయాల మధ్య మొలకలా అంకురించి, వికసించి, వటవృక్షమై వ్యాప్తి చెంది, అంతా తానై ఉండే సమ్మొహనం. అది బౌతిక రూపం లేనిది, మనసులకు గొచరించేది ప్రేమ!

మానవ జీవితంలో ప్రేమదే అగ్రస్థానం. ఆప్యాయంగా మాట్లాడుకోవటం, మనసులు పంచుకోవడం ----గొప్ప శకినిస్తాయి. తనకోసం ఆలొచించే ఒక వ్యక్తి ఉన్నారన్న భావన ప్రేమ వల్ల ఏర్పడుతుంది. ప్రేమను కొలిచే సాధనాలు లోకంలోనే లేవు.

యౌవనంలో ఇరు హృదయాల్లో పుట్టే ప్రేమకు విశిష్ట స్థానం ఉంది. 

ఐతే చాలా మంది యువతలో అది ఎప్పుడూ తాత్కాలిక వ్యామోహంగానూ, ఆకర్షణగానూ  మారి జీవితాల్ని చిద్రం చేస్తోంది. అందుకనే చాలామంది పెద్దలు ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారు.

కానీ ఈ మధ్య యువత పెద్దలను బెదిరించి, వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో రకాలుగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. దీనివలన ఆ యువత కుటుంబాలలోని మిగిలిన వ్యక్తులకు ఎన్నో సమస్యలు, అవమానాలు తలెత్తి ప్రశాంతతను కోల్పోయేటట్టు చేస్తోంది.

తన కుటుంబంలో జరిగిన అలాంటి ఒక సంఘటన వలన రాజశేఖర్ కు ప్రేమ మీద నమ్మకం పోతుంది. అదేలాగా తన స్నేహితురాలి జీవితంలో జరిగిన ఒక సంఘటన వలన కౌసల్యకు ప్రేమ మీద నమ్మకం పోతుంది.

 కానీ, ఒక సంధర్భం కొసం రాజశేఖర్, కౌసల్య ను కలుసుకోవలసి వస్తుంది. ఇద్దరి మనసులలోనూ ప్రేమ మీద ఉన్న విరక్తి బయటపడుతుంది. ఇద్దరూ ఒకే ఆలొచనలో ఉండటంతో పెళ్ళికి ఓకే అనుకుంటారు.

దీనికి అర్ధం ప్రేమించుకోవచ్చు అనా? లేక వాళ్లు కలుసుకున్న సంధర్భం వాళ్లను ప్రేమించుకోవచ్చు అని సంకేతమిచ్చిందా? ఇద్దరూ ప్రేమించుకున్నారా?......తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:

ప్రేమించుకోవచ్చు!...(కథ) @ కథా కాలక్షేపం-1

************************************************************************************************

3, జూన్ 2021, గురువారం

గాలితో ఒక యుద్దం…(పూర్తి నవల)

 

                                                                                   గాలితో ఒక యుద్దం                                                                                                                                                                         (పూర్తి నవల)

నవలలు అంటేనే చాలా వరకు సస్పెన్స్, మర్మం కలిగే ఉంటాయి, నవలలు అంతకు మించి మంచి విషయాలను ఆలోచింపచేయదు అనే ఒక విమర్శ కొందరిలో ఉంది. అందులోని కొంతమంది చాలా వరకు మర్మ నవలలను రాయడానికి ప్రయత్నించి, రాయలేకపోయారు. వీళ్ళ విమర్శలూ 'ఛీఛీఛీ...ఈ పండూ పులుపే' అనే రకమే!

ఈ 'గాలితో ఒక యుద్దం' కూడా మర్మ నవలే. అదే సమయం ఈ నవల, ఈ రోజు మనిషి జీవితంలో ఉన్న అధ్యాత్మిక నమ్మకాలను, వాటిని నిర్లక్ష్యం చేయటం వలన ఏర్పడే పరిణామాలను, నష్టాలను అన్వేషించి చూస్తోంది. 

నవల పూర్తిగా ఈ రోజుల్లో సమూహ స్థితిని రిజిస్టర్ చేస్తోంది. నవల ముగింపు కొందరిని  ఆశ్చర్యపరుస్తుంది, కొందరిని ఆలొచింపచేస్తుంది. 

చెల్లి పెళ్ళి చేయటానికి డబ్బు అవసరం ఉండటంతో తన గ్రామంలో ఉన్న పూర్వీకుల ఇల్లు అమ్మి ఆ డబ్బుతో చెల్లి పెళ్ళి చేయాలని అనుకుంటాడు కార్తిక్. ఆ ఇంటిని కొనడానికి ఎవరూ ముందుకు రారు. కారణం: ఆ ఇంటిని అతని తాతయ్య తప్పి పోయిన తన మనవుడ్ని తిరిగిస్తే ఆ గ్రామ దేవతకు ఆ ఇల్లు ఇస్తానని మొక్కు కుంటాడు. తప్పి పోయిన  మనవడు తిరిగి వస్తాడు. తాతయ్య చెప్పిన మాట ప్రకారం తన ఇంటిని గ్రామ దేవతకు ఇచ్చేస్తాడు. ఆ ఇల్లు ఇక తమది కాదని అందరూ ఆ ఇల్లు ఖాలీ చేసేసి నగరానికి వచ్చేస్తారు.

పెద్దవాడైన మనవడు(కార్తిక్), ఇప్పుడు తన చెల్లికొసం గ్రామంలోని ఆ ఇంటిని అమ్మటానికి పూనుకుంటాడు. అ ఇల్లు కొనడానికి ముందుకు వచ్చిన ఒక వ్యక్తి ఆ ఇల్లు నలబై సంవత్సరాలుగా మూసి ఉండటం, ఆ గ్రామంలోని వారు ఆ ఇంటికి అప్పుడప్పుడు ఆ ఊరి గ్రామ దేవత వచ్చి వెళ్ళటం జరుగుతోందని చెప్పటంతో ఒక కండిషన్ పెడతాడు. ఒక నెల రోజులు ఆ ఇంట్లో ఎవరైనా ధైర్యంగా కాపురం ఉంటే, నెల తరువాత ఆ ఇల్లు కొనుక్కుంటానని చెబుతాడు. ఆ ఇంటి గురించి ఆ గ్రామస్తులకే కాక పక్క గ్రామస్తులకు కూడా తెలుసు కాబట్టి ఎవరూ ఆ ఇంటికి అద్దెకు రావటానికి ఇష్టపడరు. అప్పుడు కార్తిక్ తల్లి-తండ్రులు తామే వెళ్ళి ఒక నెల రోజులు కాపురం ఉండి వస్తామని కొడుకుతో చెబుతారు. అలా చెయ్యద్దని కార్తిక్ బామ్మ తలా నోరూ కొట్టుకుంటుంది. కానీ కార్తిక్ తల్లి-తండ్రుల పట్టుదలతో, ఆ ఇంటిని శుభ్రం చేయటానికి, స్నేహితుడు బద్రంతో బయలుదేరుతాడు.

కార్తిక్, అతని స్నేహితుడు బద్రం గాలిపేట గ్రామంలోని ఆ ఇంటిని చేరుకున్నారా? శుభ్రం చేశారా? ఇల్లు అమ్మ గలిగారా? నిజంగానే గాలి దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ నవలను చదవండి.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

గాలితో ఒక యుద్దం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

https://drive.google.com/file/d/13MZarLrJ-kLNb5hFiDD9u5XiNqSGx5Pl/view?usp=sharing

ఈ నవలను పార్టులుగా చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేయండి: 

సీరియల్ గా ...గాలితో ఒక యుద్దం@ కథా కాలక్షేపం

***********************************************************************************************