3, జూన్ 2021, గురువారం

గాలితో ఒక యుద్దం…(పూర్తి నవల)

 

                                                                                   గాలితో ఒక యుద్దం                                                                                                                                                                         (పూర్తి నవల)

నవలలు అంటేనే చాలా వరకు సస్పెన్స్, మర్మం కలిగే ఉంటాయి, నవలలు అంతకు మించి మంచి విషయాలను ఆలోచింపచేయదు అనే ఒక విమర్శ కొందరిలో ఉంది. అందులోని కొంతమంది చాలా వరకు మర్మ నవలలను రాయడానికి ప్రయత్నించి, రాయలేకపోయారు. వీళ్ళ విమర్శలూ 'ఛీఛీఛీ...ఈ పండూ పులుపే' అనే రకమే!

ఈ 'గాలితో ఒక యుద్దం' కూడా మర్మ నవలే. అదే సమయం ఈ నవల, ఈ రోజు మనిషి జీవితంలో ఉన్న అధ్యాత్మిక నమ్మకాలను, వాటిని నిర్లక్ష్యం చేయటం వలన ఏర్పడే పరిణామాలను, నష్టాలను అన్వేషించి చూస్తోంది. 

నవల పూర్తిగా ఈ రోజుల్లో సమూహ స్థితిని రిజిస్టర్ చేస్తోంది. నవల ముగింపు కొందరిని  ఆశ్చర్యపరుస్తుంది, కొందరిని ఆలొచింపచేస్తుంది. 

చెల్లి పెళ్ళి చేయటానికి డబ్బు అవసరం ఉండటంతో తన గ్రామంలో ఉన్న పూర్వీకుల ఇల్లు అమ్మి డబ్బుతో చెల్లి పెళ్ళి చేయాలని అనుకుంటాడు కార్తిక్. ఇంటిని కొనడానికి ఎవరూ ముందుకు రారు. కారణం: ఇంటిని అతని తాతయ్య తప్పి పోయిన తన మనవుడ్ని తిరిగిస్తే గ్రామ దేవతకు ఇల్లు ఇస్తానని మొక్కు కుంటాడు. తప్పి పోయిన  మనవడు తిరిగి వస్తాడు. తాతయ్య చెప్పిన మాట ప్రకారం తన ఇంటిని గ్రామ దేవతకు ఇచ్చేస్తాడు. ఇల్లు ఇక తమది కాదని అందరూ ఇల్లు ఖాలీ చేసేసి నగరానికి వచ్చేస్తారు.

పెద్దవాడైన మనవడు(కార్తిక్), ఇప్పుడు తన చెల్లికొసం గ్రామంలోని ఇంటిని అమ్మటానికి పూనుకుంటాడు. ఇల్లు కొనడానికి ముందుకు వచ్చిన ఒక వ్యక్తి ఇల్లు నలబై సంవత్సరాలుగా మూసి ఉండటం, గ్రామంలోని వారు ఇంటికి అప్పుడప్పుడు ఊరి గ్రామ దేవత వచ్చి వెళ్ళటం జరుగుతోందని చెప్పటంతో ఒక కండిషన్ పెడతాడు. ఒక నెల రోజులు ఇంట్లో ఎవరైనా ధైర్యంగా కాపురం ఉంటే, నెల తరువాత ఇల్లు కొనుక్కుంటానని చెబుతాడు. ఇంటి గురించి గ్రామస్తులకే కాక పక్క గ్రామస్తులకు కూడా తెలుసు కాబట్టి ఎవరూ ఇంటికి అద్దెకు రావటానికి ఇష్టపడరు. అప్పుడు కార్తిక్ తల్లి-తండ్రులు తామే వెళ్ళి ఒక నెల రోజులు కాపురం ఉండి వస్తామని కొడుకుతో చెబుతారు. అలా చెయ్యద్దని కార్తిక్ బామ్మ తలా నోరూ కొట్టుకుంటుంది. కానీ కార్తిక్ తల్లి-తండ్రుల పట్టుదలతో, ఇంటిని శుభ్రం చేయటానికి, స్నేహితుడు బద్రంతో బయలుదేరుతాడు.

కార్తిక్, అతని స్నేహితుడు బద్రం గాలిపేట గ్రామంలోని ఇంటిని చేరుకున్నారా? శుభ్రం చేశారా? ఇల్లు అమ్మ గలిగారా? నిజంగానే గాలి దేవుడు ఉన్నాడా? ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే నవలను చదవండి.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.

మీకు సమయం ఉండి ఈ నవలను పూర్తిగా ఒకేసారి ఆన్ లైన్ లోనే చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేసి చదవండి:

గాలితో ఒక యుద్దం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

నవలను డౌన్ లోడ్ చేసుకుని ఖాలీ దొరికినప్పుడల్లా చదువుకోవటానికి ఈ క్రింద లింకు క్లిక్ చేసి PDF ను డౌన్ లోడ్ చేసుకుని చదవండి: 

https://drive.google.com/file/d/13MZarLrJ-kLNb5hFiDD9u5XiNqSGx5Pl/view?usp=sharing

ఈ నవలను పార్టులుగా చదవాలనుకుంటే ఈ క్రింది లింకును క్లిక్ చేయండి: 

సీరియల్ గా ...గాలితో ఒక యుద్దం@ కథా కాలక్షేపం

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి