ప్రేమించుకోవచ్చు! (కథ)
రెండక్షరాల చిన్న పదం ప్రేమ. రెండు హృదయాల మధ్య మొలకలా అంకురించి, వికసించి, వటవృక్షమై వ్యాప్తి చెంది, అంతా తానై ఉండే సమ్మొహనం. అది బౌతిక రూపం లేనిది, మనసులకు గొచరించేది ప్రేమ!
మానవ జీవితంలో ప్రేమదే అగ్రస్థానం. ఆప్యాయంగా మాట్లాడుకోవటం, మనసులు పంచుకోవడం ----గొప్ప శకినిస్తాయి. తనకోసం ఆలొచించే ఒక వ్యక్తి ఉన్నారన్న భావన ప్రేమ వల్ల ఏర్పడుతుంది. ప్రేమను కొలిచే సాధనాలు లోకంలోనే లేవు.
యౌవనంలో ఇరు హృదయాల్లో పుట్టే ప్రేమకు విశిష్ట స్థానం ఉంది.
ఐతే చాలా మంది యువతలో అది ఎప్పుడూ తాత్కాలిక వ్యామోహంగానూ, ఆకర్షణగానూ మారి జీవితాల్ని చిద్రం చేస్తోంది. అందుకనే చాలామంది పెద్దలు ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారు.
కానీ ఈ మధ్య యువత పెద్దలను బెదిరించి, వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో రకాలుగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. దీనివలన ఆ యువత కుటుంబాలలోని మిగిలిన వ్యక్తులకు ఎన్నో సమస్యలు, అవమానాలు తలెత్తి ప్రశాంతతను కోల్పోయేటట్టు చేస్తోంది.
తన కుటుంబంలో జరిగిన అలాంటి ఒక సంఘటన వలన రాజశేఖర్ కు ప్రేమ మీద నమ్మకం పోతుంది. అదేలాగా తన స్నేహితురాలి జీవితంలో జరిగిన ఒక సంఘటన వలన కౌసల్యకు ప్రేమ మీద నమ్మకం పోతుంది.
కానీ, ఒక సంధర్భం కొసం రాజశేఖర్, కౌసల్య ను కలుసుకోవలసి వస్తుంది. ఇద్దరి మనసులలోనూ ప్రేమ మీద ఉన్న విరక్తి బయటపడుతుంది. ఇద్దరూ ఒకే ఆలొచనలో ఉండటంతో పెళ్ళికి ఓకే అనుకుంటారు.
దీనికి అర్ధం ప్రేమించుకోవచ్చు అనా? లేక వాళ్లు కలుసుకున్న సంధర్భం వాళ్లను ప్రేమించుకోవచ్చు అని సంకేతమిచ్చిందా? ఇద్దరూ ప్రేమించుకున్నారా?......తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
ప్రేమించుకోవచ్చు!...(కథ) @ కథా కాలక్షేపం-1************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి