ఇంద్రధనుస్సు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇంద్రధనుస్సు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(పూర్తి నవల)

 

                                                                            ప్రేమ అనే ఇంద్రధనుస్సు                                                                                                                                                  (పూర్తి నవల)

'ప్రేమనేది గంగ కాదు...గంగ ఈ రోజు పవిత్రం కాదు!

ప్రేమ అనేది అడవి సరస్సు...మెత్తని మనసును పొడిచే డేగ '


 ప్రామిస్ గా ప్రేమ -- కామమే...చర్మ ఆకలికి ఇలాంటి పవిత్ర పేరా?

ప్రేమను అనురాగము అంటోంది చరిత్ర! అనురాగమనేది అందరికీ ఒకటే కదా?

ఆడపిల్లలను ప్రేమించే వాళ్ళు ఎందుకు కాకులనూ-పిచ్చుకలనూ ప్రేమించటం లేదు!

కన్యలను వసపరుచుకోవటానికి తహతహలాడేవారు కన్యాత్వాన్ని దాటిన వారిని ఎందుకు వసపరుచుకోవటం లేదు?

ప్రేమను నిష్పాక్షికంగా ఉంచండి! అనురాగంగా ఉండే అందరినీ, అన్నిటినీ ప్రేమించండి.

చర్మాన్ని స్నేహించటం ప్రేమ అవదు...ఇప్పుడంతా ప్రామిస్ గా ప్రేమ-కామమే!


 పై రెండు కవితల మీదే చర్చ, వివాదం.

 ఒకరు ప్రేమ అంటే కామమే అని వాదించటం, ఒకరు ప్రేమ అంటే కామం కాదు అని వాదించటం.....ఏది నిజం, ఎవరు నిజం?

తెలుసుకోవటానికి ఈ నవల చదవండి...మీ  అభిప్రాయాలు తెలపండి.

జయశ్రీ... జయశ్రీ... జయశ్రీ....

మూడుసార్లు ఆ అందమైన పేరును కోర్టు 'బంట్రౌతు' పిలిచి ముగించగానే టేకు చెక్కతో చదురంగా చేసిన బోనులో ఆ పేరుకు సొంతమైన ఆమె ఎక్కి నిలబడింది.

ఇరవై ఐదేళ్ళ దేహం, వంగిన తల, చెదిరిపోయిన జుట్టు మధ్యలో పెద్దగా పెరిగిన జడ, చీర కట్టుకున్న తీరు--ఈ కాలం తీరును అచ్చు గుద్దినట్టు చూపుతోంది.

మీరేనా జయశ్రీ?”

న్యాయమూర్తి ప్రశ్నతో ఆమె తల పైకి లేచింది. చిన్న చూపు--బలమైన తల ఊపు. విజిటర్స్ వరుసలో ఒక చిన్న కలకలం...  

అందులో అతను కనబడ్డాడు.

చిరుతపులిలా కనబడుతోంది అతని మొహం.

మీ పేరేమిటని కోర్టు అడుగుతోంది...తల ఊపితే సరిపోదు...మాట్లాడాలి...చెప్పండి

---ప్రభుత్వ తరఫు లాయర్ ఆమె ఏకాగ్రతను పరీక్షించాడు.

నా పేరా... జయశ్రీ! ఎస్. జయశ్రీ! లేదు...లేదు...జి. జయశ్రీ. మోహన శర్మ గారి కూతుర్ని!

ఆమె చిన్న తడబాటులో ఎన్నో సంగతులు.

అది న్యాయమూర్తి క్షుణ్ణంగా గమనించారు.

మీరు ఎస్. జయశ్రీ యా, లేక...జి. జయశ్రీ యా అనేది వేరే విషయం.  జయశ్రీ యేనా అనేది మొదటి విషయం

అవును

మీ భర్త మిమ్మల్ని చంపబొయేరని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంటుకు ఏదైనా ఆధారం ఉందా?”

పక్కింటి పార్వతమ్మ ఉన్నారు...ఆవిడ్ని అడగండి...

ఆమె యొక్క సమాధానం తరువాత పార్వతమ్మ పిలువబడింది.

పార్వతమ్మ బోనులోకి వచ్చింది.

జయశ్రీని ఆమె భర్త నందకుమార్ మేడ మీద నుండి కిందకు తోసి చంపటానికి ప్రయత్నించాడు. నేను బట్టలు ఆరేయటానికి నా ఇంటి మేడ మీదకు వచ్చినప్పుడు అది చూసేసాను. నన్ను చూసిన వెంటనే, ఆమెను తోసేయటం ఆపి కొట్టటం మొదలు పెట్టాడు....

ఆమె సాక్ష్యాన్ని ఇంపార్టంట్ గా న్యాయమూర్తి నోట్ చేసుకున్నారు.

పార్వతమ్మ అబద్ధం చెబుతోంది. నేను నా భార్యను కొట్టింది నిజం. కానీ చంపాలనుకోలేదు -- మేడ మీద నుండి తొసే ప్రయత్నం చేయలేదు

గుంపులో నుండి హఠాత్తుగా లేచి ఆవేశంగా అరవటం మొదలుపెట్టాడు నందకుమార్ అనే జయశ్రీ భర్త.

కోర్టు హాలులో మళ్ళీ కొంత కలకలం.

మీకు సందర్భం ఇచ్చినప్పుడు బోనులోకి ఎక్కి మాట్లాడితే చాలు. ఇలా అరవకూడదు...

న్యాయమూర్తి హెచ్చరించారు.

అది విని అతను కలవర పడ్డాడు. తన తల జుట్టు వెనుక పొడుగ్గా ఉన్న జుట్టును చేతి వెళ్ళతో కెలుక్కున్నాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. ప్యాంటు, షర్టు, చెవికి పెద్ద కడియం, బంక్ స్టైలుతో తల జుట్టు అలంకారం అంటూ విదేశీయ జిప్సీ లాంటి రూపం.

అతని ముఖాన ఒక విధమైన కృరం. అతని ముక్కునూ, కళ్ళనూ పీకి ఒక పులికి పెడితే తేడానే తెలియదు అనుకునేలాగా ఒక విధమైన మొహం. చూసేవాళ్ళందరికీ అతనిపై ద్వేషం కలుగుతుంది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2  

***************************************************************************************************

6, డిసెంబర్ 2022, మంగళవారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)...(PART-12)

 

                                                                  ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                         (PART-12)

తెల్లవారింది.

తెల్లవారక ముందే లేచి, స్నానం చేసి, దేవుడికి దీపం వెలిగించి ఒక కొత్త జీవిలాగా వంట ఇంట్లో ఫిల్టర్ కాఫీ డికాషన్ దింపుతున్నది జయశ్రీ.

ఒక మూర్ఖత్వ భర్తగా -- హంతకుడిగా నందకుమార్ ఉండటం వలన ధైర్యంగా తప్పించుకుని వచ్చి, మళ్ళీ హత్యా ప్రయత్నానికి పూనుకుని తప్పించుకు తిరుగుతున్న కారణంతోనూ, జయశ్రీ విడాకుల కేసును స్పేషల్ కోర్టు వెంటనే అంగీకరిస్తుందని వకీలు చెప్పటంతో, ఈ రోజు కోర్టుకు వెళ్ళాలసిన రోజు!  

ఖచ్చితంగా ఈ స్పేషల్ కోర్టు సక్సస్ చేస్తుంది. మన దేశ న్యాయస్థానాలకు నిరాధారమైన మహిళలపై ప్రత్యేక కనికరం ఉంది. అందులోనూ ఈ పరిస్థితి చాలా చాలా దయనీయం. అందువలన ఆమెకు విడాకుల మంజూరు ఖచ్చితం.

ఆ స్త్రీకి ఇంకో పెళ్ళి అనే బద్రత చాలా చాలా అవసరం అనే వివాదం ఒకటి చాలు, ఈ కేసు గెలవటానికీ

కాఫీ డికాషన్ లో పాలు పోసి కలుపుతున్నప్పుడు, లాయర్ అభిప్రాయం ఆమె మనసును లాగింది.

ఆశ ఆశగా కట్టుకున్న తాళిని, కాపాడుకునే మహిళగా అయిపోయింది. మరో తాళి ఇచ్చి జీవితాన్ని ఇవ్వాలని తపనపడుతున్న వ్యక్తి అదిగో ఆ గదిలో, మంచం మీద...

మోహన శర్మ కూడా తన కూతురు జీవితంలో వెలుతురు వచ్చేసిందని చాలా రోజుల తరువాత ఆనందంగా నిద్రపోతున్నారు. ఆయన ఇలా ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులో అవుతోంది!

ఇద్దర్నీ చూస్తూ కాఫీ తాగుతున్నది జయశ్రీ. విడాకులు కూడా ఆమెకు గొప్పగా అనిపించలేదు. కానీ, ఇంకో తాళి...అదే మనసుకు అడ్డుగా ఉంటోంది. ఒక స్త్రీకి ఒకే తాళిఅనేది ఆమె లోతైన మనసులో కదిలించలేని నమ్మకం. అదే పవిత్రం అని ఆ మనసు గట్టిగా చెబుతున్నట్టు అనిపిస్తోంది. అదే సమయం నువ్వు ప్రశాంతంగా జీవించగలవాఅనేలాగ బెదిరించే స్వరూపంతో నందకుమార్ మొహం విశ్వరూపం ఎత్తింది.

జీవితంలో ప్రారంభం నుండి ముగింపు వరకు మోసం చేసిన వాడు. స్త్రీ జన్మ మొసపోవటం కొసమే అని ముద్ర గుద్దినట్టు మోసం చేసిన వాడు. ఎంత క్షమించినా మారకుండా, స్త్రీ జాతినే నాశనం చేస్తున్న వాడు....ఇతన్ని ఇంకా ఒక మనిషిగా తలుచుకుని ఇంకా ఆలొచిస్తూ ఉండటం? ఛీ ఛీ...

జయశ్రీ, నందకుమార్ ని తలుచుకుని ఇబ్బంది పడుతున్న వేల -- గౌతం నిద్ర లేచాడు.

కామం కలవని ప్రేమకు ఆ రోజు భరోసా తీసుకున్నతను. ఈ రోజూ ఆ అలవాటు లేకుండా ఆ లక్ష్యం లో జారకుండా ఉన్నవాడు...!

ఆశ్చర్యంలో కాఫీగ్లాసు పుచ్చుకుని కదల కుండా కూర్చుండి పోయింది.

గౌతం ఆమెను సమీపించి జయశ్రీ... జయశ్రీ అంటూ పిలిచాడు. తరువాతే ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ఈ లోకంలోకి వచ్చిన ఆమె అతన్ని కొంచం సిగ్గుతోనే  చూసింది.

కాఫీ తాగుతారా?” -- అడిగింది.

నీ చేత్తో దొరకటానికి నేను అదృష్టం చేసుండాలే...?”

నన్ను వూరించక్కర్లేదు. అవును, ఎలా గౌతం...ఇంత జరిగినా మీ వలన నన్ను ప్రేమించటం కుదురుతోంది?” -- చటుక్కున ఆ ప్రొద్దున సమయంలో ఆ ప్రశ్నను అడిగేసింది.

నువ్వు తెలిసి ఏ తప్పూ చేయలేదే జయశ్రీ …

అయినా కానీ ఇప్పుడు నేను కన్నె పిల్లను కాను. ఇంకొకడి చేయి పడిన దాన్ని

నేను ఈ శరీరాన్ని ముట్టుకోదలుచుకోలేదు. నీ మనసునే ప్రేమిస్తున్నాను. సమూహానికి, నీ మనసుకు మాత్రమే నేను నీ భర్తను. నీ శరీరానికి కాదూ జయశ్రీ.  నువ్వు జంకు లేకుండా తాళి కట్టించుకోవచ్చు

గౌతం యొక్క ఆ జవాబుతో అలాగే అతని కాళ్ళ మీద పడ్డది ఆమె. ఆమె కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీరు అతని పాదాలను తడిపింది.

గౌతం, నా మనసులోని అలజడి తెలిసి -- ఎంత అందంగా సమస్యను తీసె పారాసారు! నేను కూడా కొంచం పుణ్యం చేసుకోనుండాలి

----నిద్రపోతున్నట్టు నటిస్తున్న మోహన శర్మ వారిద్దరి మాటలు వింటూ ఆనందపడ్డారు.

స్పేషల్ కోర్టు -- విడాకులు మంజూరు చేసిన అదే రోజు -- రిజిస్ట్రేషన్ ఆఫీసులో జయశ్రీ, గౌతం పూలమాలలు మార్చుకున్నారు.

మోహన శర్మ కన్నీళ్ళ ధారతో ఆశీర్వదించాడు. చుట్టూ కొంత మంది పోలీసులు.

తప్పించుకుని పారిపోయిన నందకుమార్ ఇంకా పోలీసులకు పట్టుబడలేదు. ఒక వేల ఈ సంధర్భంలో పెళ్ళి చెడగొట్టటానికి రావచ్చని పోలీసుల ఊహ.

చుట్టూ చూసారు. మోహన శర్మ దగ్గర ఆందోళన.

సార్, వాడు ఇక్కడకు వచ్చి -- నా కూతురు వాడిని చూస్తే ఆమె మళ్ళీ చాలా అప్ సెట్ అయిపోతుంది. ఆమె జీవితం మళ్ళీ చిగురిస్తున్న ప్రారంభ సమయం ఇది. ఆ శనిగాడు ఎప్పుడూ ఈమె జీవితంలోకి అడ్డురాకూడదు...

-----ఒక పెద్ద పోలీసు అధికారి యొక్క చెవిలో వణుకుతున్న స్వరంతో చెప్పారు.

ఆదుర్దా పడకండి. కనీసం పది సంవత్సరాల వరకు అతను బయటకు రానేలేడు. ఎలాగైనా పట్టేస్తాం. మీ అల్లుడ్నీ, కూతుర్నీ నార్త్ ఇండియాలో ఏదైన ఒక ఊరిలో సెటిల్ అయిపోమనండి. లేకపోతే ఇదే పరిస్థితిలో, ఇదే వాతావరణంలో ఉంటే వాళ్ళకు పాత జ్ఞాపకాలు వస్తాయి

-----ఆయన ఊరడించు మాటలు చెబుతున్నారు. చుట్టూ షేక్ హ్యాండ్స్...అభినందనలు, కేకు ముక్కల వినియోగం అనే వాతావరణం అంటూ ఆ చోటే కళకళలాడుతోంది. బయట పువ్వులతో అలంకరించిన కారు.

దేవత అలంకారంతో అందులోకి జయశ్రీ ఎక్కగా, గౌతం ఆమె వెనుకే కారులోకి ఎక్కాడు.

ముందు సీటులో మోహన శర్మ కూర్చున్నారు. డ్రైవర్ కారును వేగంగా తీయగా, స్నేహితులూ -- బంధువులు చేతులు ఊపి వీడ్కోలు చెప్ప, పూలమాలతో అలంకరించబడ్డ ఆ  కారు మరింత వేగం పుంజుకుంది.

డ్రైవర్! నన్ను మైన్ బజారులో దింపేయి. నువ్వు జాగ్రత్తగా చూసి వెళ్ళాలి... -- కారులోపల మోహన శర్మ ఆర్డర్ కు సరే ఆనేటట్టు తల ఊపాడు డ్రైవర్.

హావ్ ఏ నైస్ హనీ మూన్ గౌతం...అంటూ కళ్ళల్లో నుండి కారుతున్న ఆనంద కన్నీరును తుడుచుకుంటూ చెప్పారు మోహన శర్మ.

థ్యాంక్స్ -- అన్నాడు గౌతం.

జయశ్రీ దగ్గర ఏ భావమూ లేదు. ఆమెలో మామూలు పరిస్థితి రావటానికి కొంచం సమయం పట్టవచ్చు. గౌతం అంతవరకు కాచుకోవటానికి రెడీయే.

ఉపద్రవము లేని బంధుత్వమే మంచి బంధుత్వం. ఇది తెలిసినతను గౌతం.

సడన్ బ్రేకు వేసి కారు ఆగగా, లోపల నుండి జయశ్రీ తొంగి బయటకు చూడ --  దారిలో అతి మెల్లగా ఒక శవ ఉరేగింపు అడ్డు వచ్చింది.

డాక్టర్! నేను చచ్చిపోతే నన్ను మంచి విధంగా ఖననం చేయండి. ఎవరికీ తెలియక్కర్లేదు. నేను తప్పి పోయిన ఒకన్ని. కాలంలో కలిసిపోయిన వాడిని. ఇదిగోండి లక్ష రూపాయలు! మీ హాస్పిటల్ కు నాకైన ఖర్చుకు. పోలీసుల ఖైదీనని, విచారణ అని వెళ్ళిపోకండి. నేను ఇలా చచ్చిపోతున్నది లోకానికి తెలియనే కూడదూ -- పట్టుదలగా తన పాత కథ గురించి చెప్పకుండా డబ్బును డాక్టర్ ధరమ్ తేజా చేతిలో ఉంచి ప్రాణమూ వదిలాడు నందకుమార్!

అతనికిచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చే విధంగా శవ ఉరేగింపు ముందుగా ఆయన వెళ్తున్నాడు. పాడె మీద -- గుడ్డతో మూయబడ్డ అతని శవం.

ఇలా బయటకు వెళ్లేటప్పుడు, శవం అడ్డుగా వెడితే చాలా మంచిది...

----కారులో మోహన శర్మ చెప్పారు.

బయట డాక్టర్ ధరమ్ తేజా కూడా... జయశ్రీ -- గౌతం కారును చూసారు.

కారు ముందువైపున్న అద్దం పైన కనిపించిన, పసుపు రంగుతో రాయబడ్డ జయశ్రీ వెడ్స్ గౌతంఅనే రాత ఆయన్ని ఒక్క క్షణం ఈడ్చి లాగింది.

నందకుమార్ చనిపోయే ముందు కలవరించిన పేర్లు.

ఒకవేల ఈ జయశ్రీ నేనా నందకుమార్ యొక్క మాజీ భార్య?’ -- ప్రశ్న బుర్రను  తిన...తిరిగి తిరిగి చూస్తూ నడుస్తున్నారు.

ఆ కారును దాటి శవ ఊరేగింపు ముందుకు వెళ్ళింది.

పోలీసులు వెతుకుతున్న ఖైదీ మరణానికినూ, దహనానికీనూ తన సొంత ఆలొచనతో తోడు వెళ్తున్నామే!అనే ఆందోళనను మించి మనసులో ఇప్పుడు ఆయనలో కొంచం ఆనందం.

నందకుమార్ ఆత్మ ఇక శాంతి చెందుతుంది అనే విధంగా ఒక ఆలొచన.

ఈ లోపు శ్మశానం వచ్చింది. శవాన్ని పూడ్చి పెట్టటానికి గుంతలో దిగి నందకుమార్ దేహాన్ని జరుపుతున్నప్పుడు చూసారు అతని చేతిలోని కాగితాన్ని.

జయశ్రీ -- గౌతం దాంపత్య జీవితానికి హృదయపూర్వక శుభాకాంక్షలు

స్కెచ్ పెన్నుతో కనబడ్డ ఆ గ్రీటింగ్ వాక్యాలను చూసిన తరువాత అంతవరకు కన్నీరే చిందించని ఆయన కళ్ళు జలపాతంలా కన్నీటిని కార్చడం మొదలు పెట్టినై.

మనిషి యొక్క అభిమానం ఒక కొత్త పరిమాణంతో దర్శనం ఇచ్చిన ఒక భావము ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.

                                                                                                సమాప్తం

***************************************************************************************************

4, డిసెంబర్ 2022, ఆదివారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)....(PART-11)

 

                                                                     ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                           (PART-11)

హాస్పిటల్.

కాళ్ళ నిండా మురికితో తప్పించుకుని పరిగెత్తుకు వచ్చి, ఆయసపడుతూ, నీరసంగా, డాక్టర్ ధరమ్ తేజా ఎదురుగా నిలబడి తల ఎత్తాడు నందకుమార్...పెదాల పక్క నుండి రక్త ధార.  

డాక్టర్ కంగారు పడ్డారు.

ఏమిటి నందకుమార్...ఏమిటీ అవతారం? మీరున్న కండిషన్ కు మీరు పరిగెత్త కూడదు అని చెప్పానే...ఎందుకు అంత ఆయసపడేలా పరిగెత్తుకు వచ్చారు?”

డాక్టర్ అడిగిన ప్రశ్నకు విరక్తిగా నవ్వాడు.

ఇప్పుడు నేను పరిగెత్తే తీరాలి. ఇలా నేను పరిగెత్తకపోతే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి డాక్టర్

అతని సమాధానంతో డాక్టర్ దగ్గర దిగ్భ్రాంతి.

మొదట వచ్చి బెడ్ మీద పడుకోండి అంటూ నందకుమార్ ను పడుకోబెట్టి అతని శ్వాశను సరిచేసి, ఎడమ చేతికి ఇంజెక్షన్ చేసి అతని బెడ దగ్గరకు కూర్చీని లాక్కుని అందులో కూర్చున్న డాక్టర్ ముఖం అతన్నే క్షుణ్ణంగా చూస్తున్నది.

----ఆయన ముఖంలో ఆదుర్దా రేఖల కొమ్మలు...కళ్ళల్లో చొరబడిన చూపులు.

నందకుమార్ మీరొక పెద్ద పొడుపు కథ. మరణం వెంటాడుతున్న మనిషి అయ్యుండి, దాని గురించి బాధ పడకుండా, బెడ్ మీద ఉండవలసిన మీరు ఎప్పుడు చూడు బయటకు పరిగెత్తుకు వెళ్ళడం, అనుకుంటే తిరిగి రావటం కొంచం కూడా కరెక్టు కాదు. ఇలాగంతా మీరు నడుచుకుంటే...నెలల లెక్కలో ఉన్న మీ జీవితం, రోజుల లెక్కలోకి తగ్గిపోతుంది

ఎక్కువ ఆందోళనతో వివరించారు డాక్టర్.

తగ్గిపోనీయండి డాక్టర్...అదే నాకూ కావాలి

చచ్చిపోతామని తెలుసుకున్న రోగులు ఇలా విరక్తితో మాట్లాడటాన్ని చూడటం నాకేమీ కొత్త కాదు. కానీ, ఇలాంటి సమయాలలో మనసులో ధైర్యాన్ని తెచ్చుకుని పలు మంచి పనులలో పాల్గొనాలి

నేను కూడా మంచి పనులలో పాల్గొంటూనే ఉన్నా డాక్టర్. అదంతా కరెక్టుగానే జరుగుతుంది

అదంతా సరే...మీ భార్య ఎవరు? మీరు ఎక్కడ ఉంటున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానమే చెప్పనంటున్నారు...ఎందుకని? రేపు మీకు ఏదైనా జరిగితే ఎవరికి నేను కబురు పంపంచాలి...?”

ఎవరి దగ్గర మీరు చెప్పక్కర్లేదు డాక్టర్...

అంటే...మీరేమైనా అనాధనా?”

అలాగే పెట్టుకోండి...!

నందకుమార్! విరక్తితో ఏదేదో వాగకండి. మీ కుటుంబానికి మీ ఆరొగ్య పరిస్థితి తెలిస్తే షాక్ అవుతారని అలా చెబుతున్నారా?”

అదంతా ఏమీ లేదు డాక్టర్. నేను చనిపోయింది తెలిస్తే వాళ్ళంతా సంతోష పడతారు. అంత పెద్ద పాపాత్ముడిని నేను

మీ మాటలను వింటే అలా తెలియటం లేదే...?”

ఇప్పుడే డాక్టర్ నేను ఇలా మాట్లాడుతున్నాను. ముందంతా నా మాటలకూ, పొగరుకూ పెద్ద తేడా ఉండదు. నేనే పోగరు...పొగరంటే నేనే.

ఈ మధ్యే మీరు నా నెత్తురులో క్యాన్సర్ ఉందని కనిబెట్టారు. అంతకు ముందు నా నెత్తురులో కామమే ఉండేది. అది పాడు చేసిన అమ్మాయల జీవితాలకు లెక్కే లేదు. నాకు రోజూ ఒక అమ్మాయి కావాలి. ఆమె కన్య స్త్రీ గానే ఉండాలి. అంతపెద్ద ఆయోగ్యుడ్నీ నేను...

నిజంగానా?”

అబద్దాలు మాట్లాడాల్సిన సమయమా డాక్టర్ ఇది? జీవితం జీవించటానికే! నని అనే మాటను క్షణానికి ఒకసారి చెప్పి తప్పు చేసాను. నీ వరకు జీవితం జీవించటానికి కాదురా అని దేవుడు నన్ను ఇలా శిక్చించాడు.

అంతా నా చేతుల్లోనే ఉందని అనుకున్నాను.

ప్రాణం మాత్రం నా చేతుల్లోనే ఉందీ అని భగవంతుడు నన్ను, నా పొగరును, కామ వాంఛను అనిచేసాడు. మరణాన్ని తలుచుకునే మనిషే డాక్టర్...జీవితంలో పాపం చేయటానికి భయపడతాడు

ఆటలాడి అనిగేదే జీవితం రా...ఆరు అడుగుల నేలే సొంతమురా!’... ఎంత అద్భుతమైన కవిత్వం డాక్టర్

మాట్లాడుతూ వచ్చిన నందకుమార్  అలాగే ఒక ఘట్టంలో కృంగిపోయి పైకి చూస్తూ కదలకుండా ఉండటం మొదలు పెట్టాడు.

కళ్ళల్లో మెల్లగా నీళ్ళు జేరుతున్నాయి.

ఆ పులి మొహంలో ఇప్పుడు అలాంటి జాలి కళ. మనసు యొక్క కళ్ళల్లో కాలేజీ దృశ్యాలు!

-----మధ్యలో జయశ్రీ ఒక తెల్ల చీరతో పరిగెత్తుకుని వస్తున్నట్టు ఒక దృశ్యం.

లేదు జయశ్రీ...నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా జీవించాలి. నేను నిన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాను. నా మరణం నిన్ను విధవరాలుని చేయకూడదు. నువ్వు చక్కగా జీవించాలి జయశ్రీ. గౌతం పాపం...ఆ మంచి కవిని అన్యాయంగా నీ నుండి దూరం చేసాను. ఇకమీదటైనా మీరిద్దరూ కలిసి జీవించండి

అతని పెదాల నుండి వాగుడు. డాక్టర్ ధరమ్ తేజా బాధతో అది వింటూ అతని ముందు ఒక రాయిలాగా కూర్చున్నారు.

ఎవరీ జయశ్రీ? భార్యా..?’ -- ప్రశ్నతో వంకర్లు తిరిగారు. నోరు తెరిచి అడిగాసారు.

జయశ్రీ అనేది నీ భార్యా?” 

అవును డాక్టర్. నా జయశ్రీ ఒక మంచి అమ్మాయి. ఊర్లో ఉన్న అమ్మాయలను అందర్నీ నేను అనుభవిస్తూ తిరుగుతున్నప్పుడు కూడా నన్ను మంచి మార్గంలో పెట్టటానికి ప్రయత్నించింది. నన్ను అసహ్యంచుకోలేదు...

అది మన దేశంలోని స్త్రీల యొక్క సంస్కృతి నందకుమార్ 

ఆ సంస్కృతే నాకు అడ్డుగా ఉంది ఇప్పుడు

అర్ధం కాలేదే...

నా మరణం తరువాత జయశ్రీ, ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న గౌతం తో మంచి జీవితం జీవించాలి డాక్టర్

మీ భార్య ఇంకొకరి ప్రేమికురాలా?”

లేదు డాక్టర్. మొదట జయశ్రీ, గౌతం యొక్క ప్రేమికురాలు. ఆ తరువాతే నాకు భార్య

దానికీ, సంస్కృతికీ ఏమిటి సంబంధం...?”

నేను క్యాన్సర్ తో చచ్చిపోతే, ఆమె కూడా చచ్చిపోవచ్చు డాక్టర్

లేదు లేదు...ఇది ఓవర్ కల్పన

కనీసం నా మరణం తరువాత విధవరాలు అవుతుంది కదా?”

అవును. అదే కదా మన శాస్త్రం

లేదు. అలా అవకూడదు. ఆమె జీవించాలి. ఆమెను ప్రేమించిన గౌతంతో కలిసి జీవించాలి

ఇది మీ కోరిక అని చెప్పండి. దాన్ని నెరవేర్చలేరా ఏమిటి?”

తన భర్త యొక్క ఇలాంటి కోరికను, ఏ స్త్రీ మనసు ఒప్పుకుని అంగీకరిస్తుంది?”

అలాగైతే మాట్లాడకుండా వదిలేయండి...

కుదరదు డాక్టర్. నేను జయశ్రీను చాలా కష్టపెట్టాను. ఆమె ఖచ్చితంగా మిగిలిన జీవితాన్ని మంచిగా, హాయిగా బ్రతకాలి, జీవించాలి

ఇది జరుగుతుందనే నమ్మకం నాకు లేదు నందకుమార్

జరుగుతుంది డాక్టర్. ఖచ్చితంగా జరుగుతుంది. నేను అలా జరిపించి వస్తాను...ప్రపంచంలోనే నా భార్యకు మొదటి శత్రువును నేనే

ఏం చెబుతున్నారు?”

నేను శత్రువు అయితేనే ఆమె మంచిగా జీవించగలదు. నేనొక పరమ చండాలుడిగా మారితేనే నన్ను తలుచుకోవటం కూడా ఆమెకు ఇష్టం ఉండదు.  నేను ఆమె మనసు నుండి తొలగిపోతేనే...ఆ మనసులో వేరే ఒకరికి చోటు ఇవ్వటం కుదురుతుంది. దానికి ఏం చేయాలో, అవన్నీ చేస్తూనే ఉన్నా డాక్టర్

ఖచ్చితంగా ఇది చాలా వ్యత్యాసమైన త్యాగమే

నా వరకు ఇది త్యాగం కాదు, పరిహారం

"త్యాగమో... పరిహారమో, మీరు ఇష్టపడినట్టు అన్నీ మంచిగా జరగాలి

---- డాక్టర్ ధరమ్ తేజా మాట్లాడుతూనే నందకుమార్ చేతులు పుచ్చుకున్నారు.

డాక్టర్ ఇప్పుడు నేనొక నిజాన్ని చెప్పబోతున్నాను. నన్ను  తప్పుగా అనుకోరుగా...?”

నందకుమార్ దగ్గర నిర్లక్ష్య ప్రశ్న.

ఏమిటి నందకుమార్?”

నేనిప్పుడు పోలీసులు వెతుకుతున్న ఒక ఖైదీని. ఆరు నెలల జైలు శిక్ష విధించబడ్డ ఖైదీని. జైలుకు వెళ్ళిపోతే కొన్ని పనులు నేను చేయలేను డాక్టర్. జైలులో చచ్చిపోయినా అది నా మీద సానుభూతి కలిగిస్తుంది.

రాక్షస వధం లాగా నా మరణం సంభవించాలి. పీడా విరగడయ్యిందిఅని ఆమె అనుకోవాలి. అందుకని తప్పించుకుని వచ్చాను. దయచేసి నేను మరణించేంత వరకు మీరు నాకు ఆశ్రయం ఇవ్వాలి...

చాలా అసమ్మతి ఆయనలో వెంటనే ఏర్పడినా నందకుమార్ చేతులు పుచ్చుకుని ఆదరణ ఉంటుంది అనేలాగా తడిమి ఇచ్చారు.

                                                                                                               Continued....PART-12

***************************************************************************************************