ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్) (PART-12)
తెల్లవారింది.
తెల్లవారక ముందే లేచి, స్నానం
చేసి, దేవుడికి
దీపం వెలిగించి ఒక కొత్త జీవిలాగా వంట ఇంట్లో ఫిల్టర్ కాఫీ డికాషన్ దింపుతున్నది జయశ్రీ.
‘ఒక
మూర్ఖత్వ భర్తగా -- హంతకుడిగా నందకుమార్ ఉండటం వలన ధైర్యంగా తప్పించుకుని వచ్చి, మళ్ళీ హత్యా
ప్రయత్నానికి పూనుకుని తప్పించుకు తిరుగుతున్న కారణంతోనూ, జయశ్రీ
విడాకుల కేసును స్పేషల్ కోర్టు వెంటనే అంగీకరిస్తుందని’
వకీలు చెప్పటంతో, ఈ
రోజు కోర్టుకు వెళ్ళాలసిన రోజు!
‘ఖచ్చితంగా
ఈ స్పేషల్ కోర్టు సక్సస్ చేస్తుంది. మన దేశ న్యాయస్థానాలకు నిరాధారమైన మహిళలపై
ప్రత్యేక కనికరం ఉంది. అందులోనూ ఈ పరిస్థితి చాలా చాలా దయనీయం. అందువలన ఆమెకు
విడాకుల మంజూరు ఖచ్చితం.
ఆ స్త్రీకి ఇంకో పెళ్ళి అనే బద్రత చాలా
చాలా అవసరం అనే వివాదం ఒకటి చాలు,
ఈ కేసు గెలవటానికీ’
కాఫీ డికాషన్ లో పాలు పోసి
కలుపుతున్నప్పుడు, లాయర్
అభిప్రాయం ఆమె మనసును లాగింది.
ఆశ ఆశగా కట్టుకున్న తాళిని, కాపాడుకునే
మహిళగా అయిపోయింది. మరో తాళి ఇచ్చి జీవితాన్ని ఇవ్వాలని తపనపడుతున్న వ్యక్తి అదిగో
ఆ గదిలో, మంచం
మీద...
మోహన శర్మ కూడా తన కూతురు జీవితంలో
వెలుతురు వచ్చేసిందని చాలా రోజుల తరువాత ఆనందంగా నిద్రపోతున్నారు. ఆయన ఇలా
ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులో అవుతోంది!
ఇద్దర్నీ చూస్తూ కాఫీ తాగుతున్నది జయశ్రీ.
విడాకులు కూడా ఆమెకు గొప్పగా అనిపించలేదు. కానీ, ఇంకో
తాళి...అదే మనసుకు అడ్డుగా ఉంటోంది. ‘ఒక
స్త్రీకి ఒకే తాళి’ అనేది
ఆమె లోతైన మనసులో కదిలించలేని నమ్మకం. అదే పవిత్రం అని ఆ మనసు గట్టిగా
చెబుతున్నట్టు అనిపిస్తోంది. అదే సమయం ‘నువ్వు
ప్రశాంతంగా జీవించగలవా’ అనేలాగ
బెదిరించే స్వరూపంతో నందకుమార్ మొహం విశ్వరూపం ఎత్తింది.
‘జీవితంలో
ప్రారంభం నుండి ముగింపు వరకు మోసం చేసిన వాడు. స్త్రీ జన్మ మొసపోవటం కొసమే అని
ముద్ర గుద్దినట్టు మోసం చేసిన వాడు. ఎంత క్షమించినా మారకుండా, స్త్రీ
జాతినే నాశనం చేస్తున్న వాడు....ఇతన్ని ఇంకా ఒక మనిషిగా తలుచుకుని ఇంకా ఆలొచిస్తూ
ఉండటం? ఛీ
ఛీ...’
జయశ్రీ, నందకుమార్
ని తలుచుకుని ఇబ్బంది పడుతున్న వేల -- గౌతం నిద్ర లేచాడు.
కామం కలవని ప్రేమకు ఆ రోజు భరోసా
తీసుకున్నతను. ఈ రోజూ ఆ అలవాటు లేకుండా ఆ లక్ష్యం లో జారకుండా ఉన్నవాడు...!
ఆశ్చర్యంలో కాఫీగ్లాసు పుచ్చుకుని కదల
కుండా కూర్చుండి పోయింది.
గౌతం ఆమెను సమీపించి “జయశ్రీ...
జయశ్రీ”
అంటూ పిలిచాడు. తరువాతే ఆమె ఈ లోకంలోకి వచ్చింది. ఈ లోకంలోకి వచ్చిన ఆమె అతన్ని కొంచం
సిగ్గుతోనే చూసింది.
“కాఫీ
తాగుతారా?” -- అడిగింది.
“నీ
చేత్తో దొరకటానికి నేను అదృష్టం చేసుండాలే...?”
“నన్ను
వూరించక్కర్లేదు. అవును, ఎలా
గౌతం...ఇంత జరిగినా మీ వలన నన్ను ప్రేమించటం కుదురుతోంది?” -- చటుక్కున
ఆ ప్రొద్దున సమయంలో ఆ ప్రశ్నను అడిగేసింది.
“నువ్వు
తెలిసి ఏ తప్పూ చేయలేదే జయశ్రీ …”
“అయినా
కానీ ఇప్పుడు నేను కన్నె పిల్లను కాను. ఇంకొకడి చేయి పడిన దాన్ని”
“నేను
ఈ శరీరాన్ని ముట్టుకోదలుచుకోలేదు. నీ మనసునే ప్రేమిస్తున్నాను. సమూహానికి, నీ
మనసుకు మాత్రమే నేను నీ భర్తను. నీ శరీరానికి కాదూ జయశ్రీ. నువ్వు
జంకు లేకుండా తాళి కట్టించుకోవచ్చు”
గౌతం యొక్క ఆ జవాబుతో అలాగే అతని కాళ్ళ
మీద పడ్డది ఆమె. ఆమె కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీరు అతని పాదాలను తడిపింది.
“గౌతం, నా
మనసులోని అలజడి తెలిసి -- ఎంత అందంగా సమస్యను తీసె పారాసారు! నేను కూడా కొంచం
పుణ్యం చేసుకోనుండాలి”
----నిద్రపోతున్నట్టు నటిస్తున్న మోహన
శర్మ వారిద్దరి మాటలు వింటూ ఆనందపడ్డారు.
స్పేషల్ కోర్టు -- విడాకులు మంజూరు
చేసిన అదే రోజు -- రిజిస్ట్రేషన్ ఆఫీసులో జయశ్రీ, గౌతం
పూలమాలలు మార్చుకున్నారు.
మోహన శర్మ కన్నీళ్ళ ధారతో
ఆశీర్వదించాడు. చుట్టూ కొంత మంది పోలీసులు.
తప్పించుకుని పారిపోయిన నందకుమార్ ఇంకా
పోలీసులకు పట్టుబడలేదు. ఒక వేల ఈ సంధర్భంలో పెళ్ళి చెడగొట్టటానికి రావచ్చని
పోలీసుల ఊహ.
చుట్టూ చూసారు. మోహన శర్మ దగ్గర ఆందోళన.
“సార్, వాడు
ఇక్కడకు వచ్చి -- నా కూతురు వాడిని చూస్తే ఆమె మళ్ళీ చాలా అప్ సెట్ అయిపోతుంది.
ఆమె జీవితం మళ్ళీ చిగురిస్తున్న ప్రారంభ సమయం ఇది. ఆ శనిగాడు ఎప్పుడూ ఈమె జీవితంలోకి
అడ్డురాకూడదు...”
-----ఒక పెద్ద పోలీసు అధికారి యొక్క
చెవిలో వణుకుతున్న స్వరంతో చెప్పారు.
“ఆదుర్దా
పడకండి. కనీసం పది సంవత్సరాల వరకు అతను బయటకు రానేలేడు. ఎలాగైనా పట్టేస్తాం. మీ
అల్లుడ్నీ, కూతుర్నీ
నార్త్ ఇండియాలో ఏదైన ఒక ఊరిలో సెటిల్ అయిపోమనండి. లేకపోతే ఇదే పరిస్థితిలో, ఇదే
వాతావరణంలో ఉంటే వాళ్ళకు పాత జ్ఞాపకాలు వస్తాయి”
-----ఆయన ఊరడించు మాటలు చెబుతున్నారు.
చుట్టూ షేక్ హ్యాండ్స్...అభినందనలు,
కేకు ముక్కల వినియోగం అనే వాతావరణం అంటూ
ఆ చోటే కళకళలాడుతోంది. బయట పువ్వులతో అలంకరించిన కారు.
దేవత అలంకారంతో అందులోకి జయశ్రీ ఎక్కగా, గౌతం
ఆమె వెనుకే కారులోకి ఎక్కాడు.
ముందు సీటులో మోహన శర్మ కూర్చున్నారు.
డ్రైవర్ కారును వేగంగా తీయగా,
స్నేహితులూ -- బంధువులు చేతులు ఊపి
వీడ్కోలు చెప్ప, పూలమాలతో
అలంకరించబడ్డ ఆ కారు మరింత వేగం
పుంజుకుంది.
“డ్రైవర్!
నన్ను మైన్ బజారులో దింపేయి. నువ్వు జాగ్రత్తగా చూసి వెళ్ళాలి...”
-- కారులోపల మోహన శర్మ ఆర్డర్ కు సరే ఆనేటట్టు తల ఊపాడు డ్రైవర్.
‘హావ్
ఏ నైస్ హనీ మూన్ గౌతం...’ అంటూ
కళ్ళల్లో నుండి కారుతున్న ఆనంద కన్నీరును తుడుచుకుంటూ చెప్పారు మోహన శర్మ.
“థ్యాంక్స్”
-- అన్నాడు గౌతం.
జయశ్రీ దగ్గర ఏ భావమూ లేదు. ఆమెలో
మామూలు పరిస్థితి రావటానికి కొంచం సమయం పట్టవచ్చు. గౌతం అంతవరకు కాచుకోవటానికి
రెడీయే.
ఉపద్రవము లేని బంధుత్వమే మంచి బంధుత్వం.
ఇది తెలిసినతను గౌతం.
సడన్ బ్రేకు వేసి కారు ఆగగా, లోపల
నుండి జయశ్రీ తొంగి బయటకు చూడ -- దారిలో
అతి మెల్లగా ఒక శవ ఉరేగింపు అడ్డు వచ్చింది.
‘డాక్టర్!
నేను చచ్చిపోతే నన్ను మంచి విధంగా ఖననం చేయండి. ఎవరికీ తెలియక్కర్లేదు. నేను తప్పి
పోయిన ఒకన్ని. కాలంలో కలిసిపోయిన వాడిని. ఇదిగోండి లక్ష రూపాయలు! మీ హాస్పిటల్ కు
నాకైన ఖర్చుకు. పోలీసుల ఖైదీనని,
విచారణ అని వెళ్ళిపోకండి. నేను ఇలా
చచ్చిపోతున్నది లోకానికి తెలియనే కూడదూ’
-- పట్టుదలగా తన పాత కథ గురించి చెప్పకుండా డబ్బును డాక్టర్ ధరమ్ తేజా చేతిలో ఉంచి
ప్రాణమూ వదిలాడు
నందకుమార్!
అతనికిచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చే
విధంగా శవ ఉరేగింపు ముందుగా ఆయన వెళ్తున్నాడు. పాడె మీద -- గుడ్డతో మూయబడ్డ అతని
శవం.
“ఇలా
బయటకు వెళ్లేటప్పుడు, శవం
అడ్డుగా వెడితే చాలా మంచిది...”
----కారులో మోహన శర్మ చెప్పారు.
బయట డాక్టర్ ధరమ్ తేజా కూడా... జయశ్రీ -- గౌతం కారును
చూసారు.
కారు ముందువైపున్న అద్దం పైన కనిపించిన,
పసుపు రంగుతో రాయబడ్డ ‘జయశ్రీ
వెడ్స్ గౌతం’ అనే
రాత ఆయన్ని ఒక్క క్షణం ఈడ్చి లాగింది.
నందకుమార్ చనిపోయే ముందు కలవరించిన
పేర్లు.
‘ఒకవేల
ఈ జయశ్రీ నేనా నందకుమార్ యొక్క మాజీ భార్య?’ -- ప్రశ్న బుర్రను తిన...తిరిగి
తిరిగి చూస్తూ నడుస్తున్నారు.
ఆ కారును దాటి శవ ఊరేగింపు ముందుకు
వెళ్ళింది.
‘పోలీసులు
వెతుకుతున్న ఖైదీ మరణానికినూ,
దహనానికీనూ తన సొంత ఆలొచనతో తోడు
వెళ్తున్నామే!’ అనే
ఆందోళనను మించి మనసులో ఇప్పుడు ఆయనలో కొంచం ఆనందం.
నందకుమార్ ఆత్మ ఇక శాంతి చెందుతుంది అనే
విధంగా ఒక ఆలొచన.
ఈ లోపు శ్మశానం వచ్చింది. శవాన్ని
పూడ్చి పెట్టటానికి గుంతలో దిగి నందకుమార్ దేహాన్ని జరుపుతున్నప్పుడు చూసారు అతని
చేతిలోని కాగితాన్ని.
‘జయశ్రీ
-- గౌతం దాంపత్య జీవితానికి హృదయపూర్వక శుభాకాంక్షలు’
స్కెచ్ పెన్నుతో కనబడ్డ ఆ గ్రీటింగ్
వాక్యాలను చూసిన తరువాత అంతవరకు కన్నీరే చిందించని ఆయన కళ్ళు జలపాతంలా కన్నీటిని
కార్చడం మొదలు పెట్టినై.
మనిషి యొక్క అభిమానం ఒక కొత్త పరిమాణంతో
దర్శనం ఇచ్చిన ఒక భావము ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
సమాప్తం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి