4, డిసెంబర్ 2022, ఆదివారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)....(PART-11)

 

                                                                     ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                           (PART-11)

హాస్పిటల్.

కాళ్ళ నిండా మురికితో తప్పించుకుని పరిగెత్తుకు వచ్చి, ఆయసపడుతూ, నీరసంగా, డాక్టర్ ధరమ్ తేజా ఎదురుగా నిలబడి తల ఎత్తాడు నందకుమార్...పెదాల పక్క నుండి రక్త ధార.  

డాక్టర్ కంగారు పడ్డారు.

ఏమిటి నందకుమార్...ఏమిటీ అవతారం? మీరున్న కండిషన్ కు మీరు పరిగెత్త కూడదు అని చెప్పానే...ఎందుకు అంత ఆయసపడేలా పరిగెత్తుకు వచ్చారు?”

డాక్టర్ అడిగిన ప్రశ్నకు విరక్తిగా నవ్వాడు.

ఇప్పుడు నేను పరిగెత్తే తీరాలి. ఇలా నేను పరిగెత్తకపోతే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి డాక్టర్

అతని సమాధానంతో డాక్టర్ దగ్గర దిగ్భ్రాంతి.

మొదట వచ్చి బెడ్ మీద పడుకోండి అంటూ నందకుమార్ ను పడుకోబెట్టి అతని శ్వాశను సరిచేసి, ఎడమ చేతికి ఇంజెక్షన్ చేసి అతని బెడ దగ్గరకు కూర్చీని లాక్కుని అందులో కూర్చున్న డాక్టర్ ముఖం అతన్నే క్షుణ్ణంగా చూస్తున్నది.

----ఆయన ముఖంలో ఆదుర్దా రేఖల కొమ్మలు...కళ్ళల్లో చొరబడిన చూపులు.

నందకుమార్ మీరొక పెద్ద పొడుపు కథ. మరణం వెంటాడుతున్న మనిషి అయ్యుండి, దాని గురించి బాధ పడకుండా, బెడ్ మీద ఉండవలసిన మీరు ఎప్పుడు చూడు బయటకు పరిగెత్తుకు వెళ్ళడం, అనుకుంటే తిరిగి రావటం కొంచం కూడా కరెక్టు కాదు. ఇలాగంతా మీరు నడుచుకుంటే...నెలల లెక్కలో ఉన్న మీ జీవితం, రోజుల లెక్కలోకి తగ్గిపోతుంది

ఎక్కువ ఆందోళనతో వివరించారు డాక్టర్.

తగ్గిపోనీయండి డాక్టర్...అదే నాకూ కావాలి

చచ్చిపోతామని తెలుసుకున్న రోగులు ఇలా విరక్తితో మాట్లాడటాన్ని చూడటం నాకేమీ కొత్త కాదు. కానీ, ఇలాంటి సమయాలలో మనసులో ధైర్యాన్ని తెచ్చుకుని పలు మంచి పనులలో పాల్గొనాలి

నేను కూడా మంచి పనులలో పాల్గొంటూనే ఉన్నా డాక్టర్. అదంతా కరెక్టుగానే జరుగుతుంది

అదంతా సరే...మీ భార్య ఎవరు? మీరు ఎక్కడ ఉంటున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానమే చెప్పనంటున్నారు...ఎందుకని? రేపు మీకు ఏదైనా జరిగితే ఎవరికి నేను కబురు పంపంచాలి...?”

ఎవరి దగ్గర మీరు చెప్పక్కర్లేదు డాక్టర్...

అంటే...మీరేమైనా అనాధనా?”

అలాగే పెట్టుకోండి...!

నందకుమార్! విరక్తితో ఏదేదో వాగకండి. మీ కుటుంబానికి మీ ఆరొగ్య పరిస్థితి తెలిస్తే షాక్ అవుతారని అలా చెబుతున్నారా?”

అదంతా ఏమీ లేదు డాక్టర్. నేను చనిపోయింది తెలిస్తే వాళ్ళంతా సంతోష పడతారు. అంత పెద్ద పాపాత్ముడిని నేను

మీ మాటలను వింటే అలా తెలియటం లేదే...?”

ఇప్పుడే డాక్టర్ నేను ఇలా మాట్లాడుతున్నాను. ముందంతా నా మాటలకూ, పొగరుకూ పెద్ద తేడా ఉండదు. నేనే పోగరు...పొగరంటే నేనే.

ఈ మధ్యే మీరు నా నెత్తురులో క్యాన్సర్ ఉందని కనిబెట్టారు. అంతకు ముందు నా నెత్తురులో కామమే ఉండేది. అది పాడు చేసిన అమ్మాయల జీవితాలకు లెక్కే లేదు. నాకు రోజూ ఒక అమ్మాయి కావాలి. ఆమె కన్య స్త్రీ గానే ఉండాలి. అంతపెద్ద ఆయోగ్యుడ్నీ నేను...

నిజంగానా?”

అబద్దాలు మాట్లాడాల్సిన సమయమా డాక్టర్ ఇది? జీవితం జీవించటానికే! నని అనే మాటను క్షణానికి ఒకసారి చెప్పి తప్పు చేసాను. నీ వరకు జీవితం జీవించటానికి కాదురా అని దేవుడు నన్ను ఇలా శిక్చించాడు.

అంతా నా చేతుల్లోనే ఉందని అనుకున్నాను.

ప్రాణం మాత్రం నా చేతుల్లోనే ఉందీ అని భగవంతుడు నన్ను, నా పొగరును, కామ వాంఛను అనిచేసాడు. మరణాన్ని తలుచుకునే మనిషే డాక్టర్...జీవితంలో పాపం చేయటానికి భయపడతాడు

ఆటలాడి అనిగేదే జీవితం రా...ఆరు అడుగుల నేలే సొంతమురా!’... ఎంత అద్భుతమైన కవిత్వం డాక్టర్

మాట్లాడుతూ వచ్చిన నందకుమార్  అలాగే ఒక ఘట్టంలో కృంగిపోయి పైకి చూస్తూ కదలకుండా ఉండటం మొదలు పెట్టాడు.

కళ్ళల్లో మెల్లగా నీళ్ళు జేరుతున్నాయి.

ఆ పులి మొహంలో ఇప్పుడు అలాంటి జాలి కళ. మనసు యొక్క కళ్ళల్లో కాలేజీ దృశ్యాలు!

-----మధ్యలో జయశ్రీ ఒక తెల్ల చీరతో పరిగెత్తుకుని వస్తున్నట్టు ఒక దృశ్యం.

లేదు జయశ్రీ...నువ్వు ఖచ్చితంగా హ్యాపీగా జీవించాలి. నేను నిన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాను. నా మరణం నిన్ను విధవరాలుని చేయకూడదు. నువ్వు చక్కగా జీవించాలి జయశ్రీ. గౌతం పాపం...ఆ మంచి కవిని అన్యాయంగా నీ నుండి దూరం చేసాను. ఇకమీదటైనా మీరిద్దరూ కలిసి జీవించండి

అతని పెదాల నుండి వాగుడు. డాక్టర్ ధరమ్ తేజా బాధతో అది వింటూ అతని ముందు ఒక రాయిలాగా కూర్చున్నారు.

ఎవరీ జయశ్రీ? భార్యా..?’ -- ప్రశ్నతో వంకర్లు తిరిగారు. నోరు తెరిచి అడిగాసారు.

జయశ్రీ అనేది నీ భార్యా?” 

అవును డాక్టర్. నా జయశ్రీ ఒక మంచి అమ్మాయి. ఊర్లో ఉన్న అమ్మాయలను అందర్నీ నేను అనుభవిస్తూ తిరుగుతున్నప్పుడు కూడా నన్ను మంచి మార్గంలో పెట్టటానికి ప్రయత్నించింది. నన్ను అసహ్యంచుకోలేదు...

అది మన దేశంలోని స్త్రీల యొక్క సంస్కృతి నందకుమార్ 

ఆ సంస్కృతే నాకు అడ్డుగా ఉంది ఇప్పుడు

అర్ధం కాలేదే...

నా మరణం తరువాత జయశ్రీ, ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న గౌతం తో మంచి జీవితం జీవించాలి డాక్టర్

మీ భార్య ఇంకొకరి ప్రేమికురాలా?”

లేదు డాక్టర్. మొదట జయశ్రీ, గౌతం యొక్క ప్రేమికురాలు. ఆ తరువాతే నాకు భార్య

దానికీ, సంస్కృతికీ ఏమిటి సంబంధం...?”

నేను క్యాన్సర్ తో చచ్చిపోతే, ఆమె కూడా చచ్చిపోవచ్చు డాక్టర్

లేదు లేదు...ఇది ఓవర్ కల్పన

కనీసం నా మరణం తరువాత విధవరాలు అవుతుంది కదా?”

అవును. అదే కదా మన శాస్త్రం

లేదు. అలా అవకూడదు. ఆమె జీవించాలి. ఆమెను ప్రేమించిన గౌతంతో కలిసి జీవించాలి

ఇది మీ కోరిక అని చెప్పండి. దాన్ని నెరవేర్చలేరా ఏమిటి?”

తన భర్త యొక్క ఇలాంటి కోరికను, ఏ స్త్రీ మనసు ఒప్పుకుని అంగీకరిస్తుంది?”

అలాగైతే మాట్లాడకుండా వదిలేయండి...

కుదరదు డాక్టర్. నేను జయశ్రీను చాలా కష్టపెట్టాను. ఆమె ఖచ్చితంగా మిగిలిన జీవితాన్ని మంచిగా, హాయిగా బ్రతకాలి, జీవించాలి

ఇది జరుగుతుందనే నమ్మకం నాకు లేదు నందకుమార్

జరుగుతుంది డాక్టర్. ఖచ్చితంగా జరుగుతుంది. నేను అలా జరిపించి వస్తాను...ప్రపంచంలోనే నా భార్యకు మొదటి శత్రువును నేనే

ఏం చెబుతున్నారు?”

నేను శత్రువు అయితేనే ఆమె మంచిగా జీవించగలదు. నేనొక పరమ చండాలుడిగా మారితేనే నన్ను తలుచుకోవటం కూడా ఆమెకు ఇష్టం ఉండదు.  నేను ఆమె మనసు నుండి తొలగిపోతేనే...ఆ మనసులో వేరే ఒకరికి చోటు ఇవ్వటం కుదురుతుంది. దానికి ఏం చేయాలో, అవన్నీ చేస్తూనే ఉన్నా డాక్టర్

ఖచ్చితంగా ఇది చాలా వ్యత్యాసమైన త్యాగమే

నా వరకు ఇది త్యాగం కాదు, పరిహారం

"త్యాగమో... పరిహారమో, మీరు ఇష్టపడినట్టు అన్నీ మంచిగా జరగాలి

---- డాక్టర్ ధరమ్ తేజా మాట్లాడుతూనే నందకుమార్ చేతులు పుచ్చుకున్నారు.

డాక్టర్ ఇప్పుడు నేనొక నిజాన్ని చెప్పబోతున్నాను. నన్ను  తప్పుగా అనుకోరుగా...?”

నందకుమార్ దగ్గర నిర్లక్ష్య ప్రశ్న.

ఏమిటి నందకుమార్?”

నేనిప్పుడు పోలీసులు వెతుకుతున్న ఒక ఖైదీని. ఆరు నెలల జైలు శిక్ష విధించబడ్డ ఖైదీని. జైలుకు వెళ్ళిపోతే కొన్ని పనులు నేను చేయలేను డాక్టర్. జైలులో చచ్చిపోయినా అది నా మీద సానుభూతి కలిగిస్తుంది.

రాక్షస వధం లాగా నా మరణం సంభవించాలి. పీడా విరగడయ్యిందిఅని ఆమె అనుకోవాలి. అందుకని తప్పించుకుని వచ్చాను. దయచేసి నేను మరణించేంత వరకు మీరు నాకు ఆశ్రయం ఇవ్వాలి...

చాలా అసమ్మతి ఆయనలో వెంటనే ఏర్పడినా నందకుమార్ చేతులు పుచ్చుకుని ఆదరణ ఉంటుంది అనేలాగా తడిమి ఇచ్చారు.

                                                                                                               Continued....PART-12

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి