పూర్తినవల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పూర్తినవల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, మార్చి 2023, మంగళవారం

మరవటం మర్చిపోయాను...(పూర్తినవల)

 

                                                                మరవటం మర్చిపోయాను                                                                                                                                                  (పూర్తినవల)

చెవిటి వాడి దగ్గర మాట్లాడుతూ, గుడ్డివాడిని చూసి కన్నుకొట్టటం లాంటి పనికిరాని పనే ప్రేమ’ -- అలా అని అనుకునే అమ్మాయి రోహిణీ.

నిలబడే విధంగా నిలబడితే, వికలాగంతో ఉన్న వాళ్ళు కూడా విజయం సాధించవచ్చుఅనుకునే వాడు శ్యామ్.

సిద్దాంతంతో ఆమె, సిద్దాంతంతో అతనూ కలిసి ప్రయాణిస్తే...ఇద్దరి మధ్యా ఉన్నది స్నేహమా--ప్రేమా? ఇద్దరి మనసులూ కలుసుకుంటాయా...లేక వాళ్ళ ప్రేమ కర్పూరంలాగా గాలిలో కలిసిపోతుందా?

ప్రేమ వేరు వాళ్ళ మనసుల్లో కొమ్మలులా వ్యాపించ--

విధి వాళ్ళను ఫుట్ బాల్లాగా ఆడుకోగా--

శ్యామ్-- రోహిణీ కలిసారా...విడిపోయారా?

ఎదురు చూడని మలుపులు, నిజమైన హాస్యం, దాంతోపాటూ కొంచం స్వారస్యమైన భవిష్యత్ సైన్స్.

మరవటం మర్చిపోయాను’--మాకు మాత్రమే కాదు...మీకూ మరిచిపోలేని ప్రేమ కథగా ఉంటుంది.

ఒక రోజా పువ్వు చెప్పింది:

ప్రేమించటం తెలియని అమ్మాయి జడలో ఉండటం కంటే, ప్రేమించి చనిపోయిన వాడి సమాధిపై ఉండటం మేలు!

ఈ పూర్తినవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మరవటం మర్చిపోయాను...(పూర్తినవల) @ కథా కాలక్షేపం-2 

ఈ నవలను ఒకేసారి చదవలేని వారు ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి పి.డి.ఎఫ్. ను డౌన్లోడే చేసుకుని మీకు తీరిక ఉన్నప్పుడు చదువుకోండి.

https://drive.google.com/file/d/1DVX46edPiUE7mBYDHxGu2vInxxs5h-TQ/view?usp=share_link

***************************************************************************************************

17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(పూర్తి నవల)

 

                                                                            ప్రేమ అనే ఇంద్రధనుస్సు                                                                                                                                                  (పూర్తి నవల)

'ప్రేమనేది గంగ కాదు...గంగ ఈ రోజు పవిత్రం కాదు!

ప్రేమ అనేది అడవి సరస్సు...మెత్తని మనసును పొడిచే డేగ '


 ప్రామిస్ గా ప్రేమ -- కామమే...చర్మ ఆకలికి ఇలాంటి పవిత్ర పేరా?

ప్రేమను అనురాగము అంటోంది చరిత్ర! అనురాగమనేది అందరికీ ఒకటే కదా?

ఆడపిల్లలను ప్రేమించే వాళ్ళు ఎందుకు కాకులనూ-పిచ్చుకలనూ ప్రేమించటం లేదు!

కన్యలను వసపరుచుకోవటానికి తహతహలాడేవారు కన్యాత్వాన్ని దాటిన వారిని ఎందుకు వసపరుచుకోవటం లేదు?

ప్రేమను నిష్పాక్షికంగా ఉంచండి! అనురాగంగా ఉండే అందరినీ, అన్నిటినీ ప్రేమించండి.

చర్మాన్ని స్నేహించటం ప్రేమ అవదు...ఇప్పుడంతా ప్రామిస్ గా ప్రేమ-కామమే!


 పై రెండు కవితల మీదే చర్చ, వివాదం.

 ఒకరు ప్రేమ అంటే కామమే అని వాదించటం, ఒకరు ప్రేమ అంటే కామం కాదు అని వాదించటం.....ఏది నిజం, ఎవరు నిజం?

తెలుసుకోవటానికి ఈ నవల చదవండి...మీ  అభిప్రాయాలు తెలపండి.

జయశ్రీ... జయశ్రీ... జయశ్రీ....

మూడుసార్లు ఆ అందమైన పేరును కోర్టు 'బంట్రౌతు' పిలిచి ముగించగానే టేకు చెక్కతో చదురంగా చేసిన బోనులో ఆ పేరుకు సొంతమైన ఆమె ఎక్కి నిలబడింది.

ఇరవై ఐదేళ్ళ దేహం, వంగిన తల, చెదిరిపోయిన జుట్టు మధ్యలో పెద్దగా పెరిగిన జడ, చీర కట్టుకున్న తీరు--ఈ కాలం తీరును అచ్చు గుద్దినట్టు చూపుతోంది.

మీరేనా జయశ్రీ?”

న్యాయమూర్తి ప్రశ్నతో ఆమె తల పైకి లేచింది. చిన్న చూపు--బలమైన తల ఊపు. విజిటర్స్ వరుసలో ఒక చిన్న కలకలం...  

అందులో అతను కనబడ్డాడు.

చిరుతపులిలా కనబడుతోంది అతని మొహం.

మీ పేరేమిటని కోర్టు అడుగుతోంది...తల ఊపితే సరిపోదు...మాట్లాడాలి...చెప్పండి

---ప్రభుత్వ తరఫు లాయర్ ఆమె ఏకాగ్రతను పరీక్షించాడు.

నా పేరా... జయశ్రీ! ఎస్. జయశ్రీ! లేదు...లేదు...జి. జయశ్రీ. మోహన శర్మ గారి కూతుర్ని!

ఆమె చిన్న తడబాటులో ఎన్నో సంగతులు.

అది న్యాయమూర్తి క్షుణ్ణంగా గమనించారు.

మీరు ఎస్. జయశ్రీ యా, లేక...జి. జయశ్రీ యా అనేది వేరే విషయం.  జయశ్రీ యేనా అనేది మొదటి విషయం

అవును

మీ భర్త మిమ్మల్ని చంపబొయేరని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంటుకు ఏదైనా ఆధారం ఉందా?”

పక్కింటి పార్వతమ్మ ఉన్నారు...ఆవిడ్ని అడగండి...

ఆమె యొక్క సమాధానం తరువాత పార్వతమ్మ పిలువబడింది.

పార్వతమ్మ బోనులోకి వచ్చింది.

జయశ్రీని ఆమె భర్త నందకుమార్ మేడ మీద నుండి కిందకు తోసి చంపటానికి ప్రయత్నించాడు. నేను బట్టలు ఆరేయటానికి నా ఇంటి మేడ మీదకు వచ్చినప్పుడు అది చూసేసాను. నన్ను చూసిన వెంటనే, ఆమెను తోసేయటం ఆపి కొట్టటం మొదలు పెట్టాడు....

ఆమె సాక్ష్యాన్ని ఇంపార్టంట్ గా న్యాయమూర్తి నోట్ చేసుకున్నారు.

పార్వతమ్మ అబద్ధం చెబుతోంది. నేను నా భార్యను కొట్టింది నిజం. కానీ చంపాలనుకోలేదు -- మేడ మీద నుండి తొసే ప్రయత్నం చేయలేదు

గుంపులో నుండి హఠాత్తుగా లేచి ఆవేశంగా అరవటం మొదలుపెట్టాడు నందకుమార్ అనే జయశ్రీ భర్త.

కోర్టు హాలులో మళ్ళీ కొంత కలకలం.

మీకు సందర్భం ఇచ్చినప్పుడు బోనులోకి ఎక్కి మాట్లాడితే చాలు. ఇలా అరవకూడదు...

న్యాయమూర్తి హెచ్చరించారు.

అది విని అతను కలవర పడ్డాడు. తన తల జుట్టు వెనుక పొడుగ్గా ఉన్న జుట్టును చేతి వెళ్ళతో కెలుక్కున్నాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. ప్యాంటు, షర్టు, చెవికి పెద్ద కడియం, బంక్ స్టైలుతో తల జుట్టు అలంకారం అంటూ విదేశీయ జిప్సీ లాంటి రూపం.

అతని ముఖాన ఒక విధమైన కృరం. అతని ముక్కునూ, కళ్ళనూ పీకి ఒక పులికి పెడితే తేడానే తెలియదు అనుకునేలాగా ఒక విధమైన మొహం. చూసేవాళ్ళందరికీ అతనిపై ద్వేషం కలుగుతుంది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2  

***************************************************************************************************

12, అక్టోబర్ 2022, బుధవారం

జీవన పోరాటం…(పూర్తి నవల)

 

                                                                                     జీవన పోరాటం                                                                                                                                                                           (పూర్తి నవల)

జీవితంలో తప్పే చేయని వారు ఎవరూ ఉండుండరు. అలా తప్పు చేసిన వాళ్ళను ఒకటి చట్టం దండిస్తుంది లేకపోతే దేవుడు దండిస్తాడు. కానీ, చేసిన తప్పును అర్ధం చేసుకుని తమకు తామే దండన వేసుకుని జీవించే వారూ ఉన్నారు. కొన్ని సమయాలలో వీళ్ళు చేసే తప్పులవలన తప్పు చేసిన వాళ్ళూ, వాళ్ళకు సంబంధించిన వారూ బాధించపడినప్పుడు జీవితమే పోరాటంగా మారుతుంది.

కానీ, ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని నిదానంతోనూ, వివేకంగానూ ఎదుర్కోంటే ఆ సమస్యల నుండి బయటపడొచ్చు అనేది నా నమ్మకం.

ఈ సీరియల్ లోని పాత్రలు అలాంటి ఒక జీవిత పోరాటంలోనే చిక్కుకుంటారు. వాళ్ళ చిక్కులకు పరిష్కారం దొరికిందా?.....ఈ నవల  చదివి తెలుసుకోండి:

కలకత్తా లోని హౌరా రైల్వే స్టేషన్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది.

లోపలకు వెళ్ళాలన్నా సరే, బయటకు వెళ్ళాలన్నా సరే...జన సముద్రాన్ని ఈత కొడుతూనే వెళ్ళాలి.

రోజూ అదేలాగనే కనిపిస్తోంది.

సమయం ప్రొద్దున 11.30.

తిరుపతి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకున్న వారు మూడో నెంబర్ ప్లాట్ ఫారం పైన కాచుకోనున్నారు. ఖాలీ పెట్టెలతో రైలు వస్తున్నదని ప్రకటన  వినిపించడంతో, ప్రయాణీకులందరూ హడావిడిగా తమతమ వస్తువులతో రైలు ఎక్కటానికి రెడీ అయ్యారు.

కానీ, పరంధామయ్య మాత్రం 'పోర్టర్ ఒకతన్ని బేరమాడి....కిటికీ దగ్గరున్న సీటును పట్టుకుని హాయిగా కూర్చున్నారు.

ఆయనకు ఊరు తిరిగి వెళ్ళటానికి రిజర్వేషన్ దొరకలేదు. అందువలన జెనెరల్ బోగీలో ప్రయాణం చేస్తున్నాడు. రైలు బయలుదేరబోతోందని ప్రకటన వచ్చిన తరువాత ప్లాట్ ఫారం మీద హడావిడి మొదలైయ్యింది.

అప్పుడు........

యౌవనదశలో ఉన్న ఒక అమ్మాయి భుజం మీద నిద్రపోతున్న పసిబిడ్డతో, చేతిలో ఒక గుడ్డ సంచితో పరిగెత్తుకు వచ్చి పెట్టిలో ఎక్కింది.

ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

జీవన పోరాటం…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

****************************************************************************************************

24, సెప్టెంబర్ 2022, శనివారం

ప్రేమ కలలు...(పూర్తి నవల)

 

                                                                                   ప్రేమ కలలు                                                                                                                                                                  (పూర్తి నవల) 

సుధీర్ అనే ఒక అనాధ, జీవితంలో విజయం సాధించటమే కాకుండా సమాజంలో విడిచిపెట్టబడ్డ మహిళలకు ఆదరణగా ఉంటాడు. అతను స్థాపించిన మహిళా హోమ్ లో జీవిస్తున్న మహిళలలో తన తల్లిని చూసుకునే అభిమానం కలిగినవాడు.

అంజలి అనే ఒక యువతి, తన తల్లిని మహిళా హోమ్ లో చేరుద్దామని వస్తుంది. తనకు ఉద్యోగం దొరికేంత వరకు తాను హోమ్ లో అమ్మతో ఉండటానికి అనుమతి అడుగుతుంది. మొదట అనుమతించని సుధీర్ తరువాత అంగీకరిస్తాడు.

కొన్ని రోజులలో సుధీర్-అంజలి ఒకరినొకరు ఇష్టపడతారు. కలలు కంటారు. ధైర్యం చేసి సుధీర్ ఒక రోజు తన ప్రేమను అంజలి దగ్గర చెబుతాడు. తన తల్లి 'మన ప్రేమను అంగీకరిస్తేనే తాను పెళ్ళికి ఒప్పుకుంటాను ' అని చెబుతుంది. కానీ అంజలి తల్లికి 'ప్రేమ '  అంటేనే  ఇష్టం లేదు. వాళ్ళిదరీ ప్రేమను అంగీకరించదు.

అంజలి అందరిలాగానే ఆశాప్రీతికి కట్టుబడినదే. కానీ ఆమె తల్లి యొక్క కథ మిక్కిలి అసాధారణమైనది. ప్రేమను విపరీతంగా ఎదురిస్తుంది. ప్రేమంటే ఆమెకు ఎందుకంత విరక్తి? ఆ విరక్తి మారిందా? అంజలి యొక్క నిజమైన ప్రేమ కల నెరవేరిందా? లేదు తన తల్లి కోసం అంజలి ప్రేమను త్యాగం చేసిందా? 

ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ కలలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

****************************************************************************************************

30, ఆగస్టు 2022, మంగళవారం

మారని రాగాలు...(పూర్తి నవల)


                                                                                 మారని రాగాలు                                                                                                                                                                               (పూర్తి నవల) 

రచన అనేది వరమో...తపమో మాత్రమే కాదు! అదొక ఎండిపోని జీవనది. చల్ల చల్లగా రాసుకుని వెళ్ళే ఈదురుగాలి. ఒంటి మీద పడి జలదరింపు పెట్టే వానజల్లు. ఇంటి నిండా గుమగుమలాడే సన్నజాజి వాసన. ఎప్పుడూ కొత్తగా వాసన ఇచ్చే వాడిపోని మల్లె.

రచనకు మాత్రమే ఇవి సొంతం కాదు...ప్రేమకు కూడా! ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేమ...ప్రేమే. వయసైతే చల్లగాలి గిలిగింత పెట్టదా ఏమిటి? వర్షపు జల్లు జలదరింపు తీసుకురాదా? మత్తు ఎక్కించదా? సన్నజాజి వాసన ముక్కును తాకదా? వాడిపోని మల్లె మత్తు ఎక్కించదా?

వయసవుతున్న కొద్దీ నిజమైన ప్రేమకు బలం ఎక్కువ అవుతుంది. శరీరాన్ని ముట్టుకోవటం ప్రేమ కాదు. మనసును తాకి లోతుగా చెక్క బడుతుందే...దాని పేరే ప్రేమ!

ముందురోజు మొగ్గలను మాలకట్టి, రాత్రంతా గిన్నె కిందపెట్టి మూసిపెడతారు. మరుసటి రోజు పొద్దున దాన్ని తీస్తే గుప్పుమని విరుచుకుని, ఇల్లంతా వాసన వీస్తుంది.

అలాగే ప్రేమ కూడా! దాని వాసన జీవితాంతం వీస్తుంది. మనసులో మూతపెట్టి, మూసిపెట్టిన మాలలాగా జీవితాంతం పూస్తుంది.

వాడిపోకుండా...నలిగిపోకుండా ఉంటుంది. వాడిపోని మెల్లె పూవులాగా కొత్తగా తెలుస్తుంది.

కృష్ణమూర్తి -- మాలతీ ప్రేమ కూడా అలాంటిదే! దాన్ని ప్రేమ అని చెప్పటం కూడా తప్పే అవుతుంది. ప్రేమలో కామం ఉంటుంది. కామంలో ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళకున్నది కామంలేని...మనసును మాత్రమే తాకిన ప్రేమ. ఒకటిగా కలవని...కానీ ఒకటిగా ప్రయాణం చేసిన ప్రేమ.

ఇలాంటి ప్రేమ అపురూపం...ఆశ్చర్యం కూడా! వీళ్ళకు మాత్రమే సాధ్యం. మామూలుగా మానవ కులం మొత్తానికీ సాధ్యం అవాల్సిన విషయం సుతిమెత్తని కొన్ని మనసులకే సాధ్యమవుతుంది.

అలా ఎందుకు...ఎలా? తెలుసుకోవటానికి వర్ణజాలాన్ని చూడండి. కళ్ళను ఆకర్షించే దాని అందాన్ని అనుభవించండి. తరువాత మీ అభిప్రాయాలు తెలియజేయండి!

ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మారని రాగాలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

****************************************************************************************************