జీవన పోరాటం (పూర్తి నవల)
జీవితంలో తప్పే చేయని వారు ఎవరూ ఉండుండరు. అలా తప్పు చేసిన వాళ్ళను ఒకటి చట్టం దండిస్తుంది లేకపోతే దేవుడు దండిస్తాడు. కానీ, చేసిన తప్పును అర్ధం చేసుకుని తమకు తామే దండన వేసుకుని జీవించే వారూ ఉన్నారు. కొన్ని సమయాలలో వీళ్ళు చేసే తప్పులవలన తప్పు చేసిన వాళ్ళూ, వాళ్ళకు సంబంధించిన వారూ బాధించపడినప్పుడు జీవితమే పోరాటంగా మారుతుంది.
కానీ, ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని నిదానంతోనూ, వివేకంగానూ ఎదుర్కోంటే ఆ సమస్యల నుండి బయటపడొచ్చు అనేది నా నమ్మకం.
ఈ సీరియల్ లోని పాత్రలు అలాంటి ఒక జీవిత పోరాటంలోనే చిక్కుకుంటారు. వాళ్ళ చిక్కులకు పరిష్కారం దొరికిందా?.....ఈ నవల చదివి తెలుసుకోండి:
కలకత్తా లోని హౌరా రైల్వే స్టేషన్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది.
లోపలకు వెళ్ళాలన్నా సరే, బయటకు వెళ్ళాలన్నా సరే...జన సముద్రాన్ని ఈత కొడుతూనే వెళ్ళాలి.
ఈ రోజూ అదేలాగనే కనిపిస్తోంది.
సమయం ప్రొద్దున 11.30.
తిరుపతి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకున్న వారు మూడో నెంబర్ ప్లాట్ ఫారం పైన కాచుకోనున్నారు. ఖాలీ పెట్టెలతో రైలు వస్తున్నదని ప్రకటన వినిపించడంతో, ప్రయాణీకులందరూ హడావిడిగా తమతమ వస్తువులతో రైలు ఎక్కటానికి రెడీ అయ్యారు.
కానీ, పరంధామయ్య మాత్రం 'పోర్టర్’ ఒకతన్ని బేరమాడి....కిటికీ దగ్గరున్న సీటును పట్టుకుని హాయిగా కూర్చున్నారు.
ఆయనకు ఊరు తిరిగి వెళ్ళటానికి రిజర్వేషన్ దొరకలేదు. అందువలన జెనెరల్ బోగీలో ప్రయాణం చేస్తున్నాడు. రైలు బయలుదేరబోతోందని ప్రకటన వచ్చిన తరువాత ప్లాట్ ఫారం మీద హడావిడి మొదలైయ్యింది.
అప్పుడు........
యౌవనదశలో ఉన్న ఒక అమ్మాయి భుజం మీద నిద్రపోతున్న పసిబిడ్డతో, చేతిలో ఒక గుడ్డ సంచితో పరిగెత్తుకు వచ్చి ఆ పెట్టిలో ఎక్కింది.
ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
జీవన పోరాటం…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి