ప్రేమకలలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రేమకలలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఆగస్టు 2021, ఆదివారం

ప్రేమ కలలు...(సీరియల్ చివరి పార్టు-12)

 

                                                                                        ప్రేమ కలలు                                                                                                                                                                    (సీరియల్ చివరి పార్టు-12)

తల్లి పరిస్థితి చూసి భయపడిపోయింది అంజలి. ఆమెకు 'అమ్మ బ్రతుకుతుందా?' అనే భయం పట్టుకుంది. 'ఎలాగైనా ఆసుపత్రికి తీసుకువెళ్ళి జేరిస్తే వాళ్ళు ‘అమ్మను  చూసుకుంటారు’ అని ఆమె నమ్మింది. మంచి సమయంలో నిర్మలా ఆంటీ, సుధీర్ 'బైకు’ మీద వచ్చారు. రోహిని పరిస్థితి చూసి వాళ్ళు టాక్సీ ఏర్పాటు చేస్తున్నప్పుడే ఆంబ్యులాన్స్ వచ్చింది.

హడావిడిగా అందులోకి రోహినిని ఎక్కించి, ఆమెతో పాటూ నిర్మలా ఆంటీ, అంజలి కూడా ఎక్కారు. బైకులో సుధీర్ ఆంబ్యులాన్స్ వెనుకే వెళ్లాడు. ఆంబ్యులాన్స్ హాస్పిటల్ కు వచ్చి ఆగింది. డాక్టర్లు, నర్సులు పరిగెత్తుకుని వచ్చారు. చెక్ చేసి ఎమర్జన్సీ లోకి తీసుకు వెళ్ళారు. ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు.

ఒక కుర్చీలో నిర్మలా ఆంటీ, మరో కుర్చీలో సుధీర్ కూర్చోనుండగా, అంజలి మాత్రం ఆందోళన పడుతూ అటూ, ఇటూ నడుస్తోంది. ఆంటీ గానీ, సుధీర్ గానీ 'ఎక్కడ మీ  నాన్న? ఎందుకు బయటకు వచ్చారు?' అని వాళ్ళు అడగకపోవటం అంజలికి కొంత హాయిని ఇచ్చింది.

సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో డాక్టర్ వచ్చాడు.

"ఇలా చూడమ్మా...మీ అమ్మగారి టెస్ట్ 'రిజల్స్’ వచ్చినై.  దాని ప్రకారం చూస్తే ఆవిడ మెదడులో ఎక్కువ రక్త ప్రసారం అయినందు వలన మెదడులోని కొన్ని రక్త నాళాలు డ్యామేజ్ అయినై.  వాటిని సరిచేసే కావాలి. లేకపోతే మళ్ళీ మళ్ళీ ఇదేలాగా అవుతుంది. అలా మళ్ళీ వస్తే ఆవిడ బ్రతకటం కష్టం!"

"అయ్యయ్యో...ఆలాగైతే"

"భయపడకండి...ఇప్పుడు కండిషన్ సీరియస్ గానే ఉంది. కానీ సరిచేసేయొచ్చు. ఒక ఆపరేషన్ చేయాలి. రేపే ఆ ఆపరేషన్ పెట్టుకుంటే మంచిది. మంచికాలం ఆపరేషన్ను తట్టుకునే శక్తి ఆమెకు ఉంది. ఏమంటారు?"

"దానికెంత ఖర్చు అవుతుంది డాక్టర్?"

“ఆపరేషన్ విదేశీ డాక్టర్ చేస్తాడు. ఆయన ఫీజు మూడు లక్షలు. అదిపోను హాస్పిటల్ స్టే, మందులు ఇవన్నీ కలిపి ఆరు నుండి ఏడు లక్షల దాకా అవుతుంది"

షాక్ తిన్నది అంజలి. ఆమెకు నోట మాట రాలేదు.

"ఆ ఆపరేషన్ చేస్తే ఆమె ఖచ్చితంగా బ్రతుకుతుందా?" అడిగాడు సుధీర్.

"చెయ్యకపోయినా బ్రతుకుతుంది. కానీ ఇంకోసారి ఇదేలాగా వస్తే మాత్రం ఆమె బ్రతకటం కష్టమైపోతుంది. ఈ ఆపరేషన్ చేయించారనుకోండి, మీ అమ్మగారు బ్రతకటమే కాదు...ఆ తరువాత ఆమెకు ఇప్పుడున్న ప్రాబ్లం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యం దొరుకుతుంది. ఇంకోక విషయం. ఈ ఆపరేషన్ చెయ్యబోయే విదేశీ డాక్టర్ లక్కీగా ఇండియాలానే ఉన్నారు.  అది మన అదృష్టం. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్ చేసే డాక్టర్లలో ఈయనే నెంబర్ వన్. అందుకే నేను తొందర పెడుతున్నాను"

"సరే డాక్టర్...మేము కలిసి చర్చించుకుని చెబుతాము " అన్నాడు సుధీర్.

డాక్టర్ వెళ్ళిపోయాడు. సుధీర్, ఆంటీ, అంజలి మొహం వైపే చూసారు.

"వేరే దారిలేదు సుధీర్...మా అమ్మను ధర్మాసుపత్రికి మార్చ వలసిందే. అంత డబ్బుకు నేనేం చేసేది?" అన్నది. ఆమె కళ్ళల్లో నీరు ధారగా కారుతోంది.

“నువ్వు వూరికే వుండు" అన్న ఆంటీ, సుధీర్ పక్కకు తిరిగి "తమ్ముడూ...నా దగ్గర లక్ష  రూపాయలు ఉన్నాయి. అది తీసుకుందాం" అన్నది.

“ఆంటీ మీ దగ్గర నుండి అంత డబ్బు నేను తీసుకోలేను...మీకెలా తిరిగివ్వ గలను" అన్నది అంజలి.   

"ఇప్పుడు ప్రశ్న నువ్వెలా డబ్బులు తిరిగి ఇస్తావని కాదు. ఇంకా ఐదు లక్షల వరకు అవసరముందే! దానికి ఏం చేయాలన్నదే ఇప్పుడు ఆలోచన" అన్నాడు సుధీర్. 

" అంజలీ...మీ నాన్న ఇప్పుడు బాగా సంపాదించి ఉన్నారే? ఆయన దగ్గర అడిగితే ఏమవుతుంది? పెళ్ళాం కోసం ఐదు లక్షలు ఇవ్వరా?"

“లేదు మామీ...మీరు అనుకుంటున్నట్టు ఆయన మంచివారు కాదు. అమ్మ ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఆయనే. ఆయన దగ్గర డబ్బు ఎదురు చూడటం మూర్ఖత్వం" అన్న అంజలి జరిగిందంతా చెప్పింది.  

ఆంటీ చాలా పాపం...చాలా బాధపడింది. కన్నీరు పెట్టుకుంది.

"ఇలాగూ ఒకడు ఉంటాడా? మారిపోయాడు అనుకునే కదా మిమ్మల్ని ఆయనతో పంపించాను? రోహినికి ఇలా జరగడానికి కారణం అయ్యాడే? నేను మీకు మంచి  జరుగుతుందని అనుకునే చేశాను. అది ఇలా అయ్యిందే? ఇప్పుడు మీ అమ్మ ఇలా అవడానికి నేనూ ఒక కారణం అయ్యానే?" 

"బాధ పడకండి ఆంటీ...దీనికి మీరు కారణం కాదు. ఇప్పుడు అది తలచుకుని బాధ పడితే అంతా సరైపోతుందా? వదిలేయండి. నాకు ఒక ఆలొచన వచ్చింది. నేను బయటకు వెళ్ళి కాసేపట్లో వచ్చేస్తాను" అన్న సుధీర్ వేగంగా బయటకు వెళ్లాడు. 

"చెప్పినట్టు ఒక గంటలోనే వచ్చేశాడు. డబ్బులు రెడీ చేశాడు. 'ఎక్కడిదీ డబ్బు?' అని అడిగినప్పుడు చెప్పకుండా మాట మారుస్తున్నాడు. ఆంటీకి తెలుసు. కానీ ఆమె కూడా  చెప్పలేదు. ఇంకా వాళ్ళను బలవంతం చేయటం అంజలికి ఇష్టం లేదు. 'ఎలాగో డబ్బు దొరికితే చాలు ...తిరిగి ఇవ్వటం గురించి తరువాత ఆలొచించవచ్చు" అనే మనోభావనలో ఉన్నది అంజలి.

ఆపరేషన్ మంచిగా జరిగింది. అమ్మ ఆరొగ్యం బాగానే కోలుకుంది. ఒక వారం రోజుల్లో మామూలు వార్డుకు మార్చారు. భోజనం విషయంలో చాలా కఠినంగా ఉన్నారు డాక్టర్లు. హాస్పిటల్ పెట్టే ఆహారమే తినాలి. ఎక్కువ ఇంజక్ష్ న్లు   -- మందులు అంటూ డబ్బు నీళ్ళలాగా కరిగిపోతోంది.

అంజలి కూడా 'అమ్మకు బాగా నయం కాని...ఖర్చు సంగతి తరువాత అడిగి తెలుసుకుందాం. సుధీర్ కు నెలనెలా వాయిదాలా పద్దతిలో డబ్బులిచ్చేద్దాం’ అనుకుని కాముగా ఉండిపోయింది.  

రోహిని ఆరొగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. ఆవిడ్ని చూడటానికి రోజూ నిర్మలా ఆంటీ వస్తొంది. కానీ, రోహిని స్పృహలోకి వచ్చినప్పటి నుండి ఎందుకనో సుధీర్ రానే లేదు. 'ఇంకో రెండు రోజుల్లో అమ్మను ఇంటికి తీసుకు వెళ్ళొచ్చు’ అని డాక్టర్ చెప్పాడు. నిర్మలా ఆంటీని అమ్మ దగ్గర ఉంచి పాత ఇంటికి వెళ్ళి, ఇల్లు శుభ్రం చేసి, కొంచంగా సరకులు కొని ఉంచింది అంజలి.

అమ్మ ఇంటికి వచ్చింది. ఆ తరువాతే ఇల్లు ప్రకాశవంతంగా ఉన్నట్టు అనిపించింది అంజలికి. 'పాలు మాత్రమే తాగాలి. చల్లగా ఏదీ తినకూడదు. రోజూ భోజనంలోకి ఒక స్పూన్ నూనె కలుపుకో వచ్చు...అది కూడా మంచి నూనె మాత్రమే! అని డాక్టర్లు చాలా నిబంధనలతోనే పంపించారు.

ప్రొద్దున రెండి ఇడ్లీలు, కారం లేకుండా టమోటో చట్నీ. మధ్యాహ్నం ఒక ప్లేటు భోజనం, ఒక కప్పు ఉడకబెట్టిన కూర గాయలు, చారు, సాంబార్, మజ్జిగ. రాత్రికి చపాతీ, పప్పు. ఇదే అమ్మ యొక్క భోజనం.తన కోసం కూడా అదే చేసుకుంది అంజలి.

నిర్మలా ఆంటీనే, అమ్మకు తోడుగా ఉంది. అంజలి మళ్ళీ ఉద్యోగానికి వెళ్లటం మొదలు పెట్టింది.

"ఏం ఆంటీ...మన ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ నన్ను వచ్చి చూశారు! కానీ సుధీర్  రాలేదే? అతనికి విషయమే తెలియదా?"

"ఎందుకు తెలియదు? నిన్ను ఆసుపత్రిలో చేర్చిందే ఆ అబ్బాయే! అంజలి పాపం చిన్న పిల్ల...అల్లడిపోయింది. అప్పుడు పక్క బలంగా ఉండి అన్ని పనులూ చూసింది ఆ సుధీరే?" 

"అలాగా? మంచి అబ్బాయి లాగున్నాడే?"

"ఇప్పుడైనా అర్ధం చేసుకున్నావే! ఇకనైనా అతన్ని నీ అల్లుడుగా ఎంచుకో"

"అదెలా ఆంటీ కుదురుతుంది? మిగతావారికి సహాయం చేసే గుణం కలవాడే! అందుకని డబ్బు ఆశలేని వాడు అని చెప్పలేము కదా? నా కూతుర్ని బాధలకు గురి చెయ్యడని ఏమిటి నిశ్చయం?" అన్నది రోహిని.

"ఎవర్ని చూసి డబ్బు పిచ్చి పట్టిన వాడని చెబుతున్నావు... సుధీర్ నా? నీ ప్రాణన్ని కాపాడిందే అతను అనేది నీకు తెలుసా? అతను మాత్రం ఆ రోజు లేకపోతే ఈ పాటికి నువ్వు చనిపోయుండే దానివి. నీ కూతురు అనాధగా నిలబడుంటుంది! ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం నీకు అలవాటు అయిపోయింది" అన్నది ఆంటీ కోపంగా.  

"మీరు ఏం చెబుతున్నారు ఆంటీ? సుధీర్ నన్నెలా కాపాడాడు?”

"నీ ట్రీట్ మెంటుకు డబ్బులిచ్చింది అతనే. అందులోనూ ఒకటో...రెండో కాదు...ఆరు లక్షలు"

ఆశ్చర్యపోతూ ఆంటీని చూసింది రోహిని.

"ఎమిటలా అయోమయంగా చూస్తున్నావు? నీకు ఆరొగ్యం సీరియస్ గా ఉంది...వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పాడు. ఆ ఆపరేషన్ కు ఆరు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంజలి ఎక్కడ్నుంచి తేగలదు అంత డబ్బును. ఏం చేయాలో తెలియక శిలలా కూర్చుండిపోయింది. అప్పుడు ఒక్క క్షణం కూడా దేని గురించి ఆలొచించ కుండా సుధీరే డబ్బులు తీసుకువచ్చి ఇచ్చి ఆపరేషన్ చెయ్యమన్నాడు"

"అతనికి ఎక్కడిది అంత డబ్బు?"

"అలా అడుగు...అతని దగ్గర వాళ్ళ అమ్మ ఇచ్చిన కొన్ని నగలు ఉన్నాయి. దాన్ని వాళ్ళ అమ్మ గుర్తుగా ఉంచుకున్నాడు. మా అమ్మ జ్ఞాపకార్ధంగా ఉన్నది ఇదొక్కటే ఆంటీ. ‘ఇవి నా భార్యకు ఇవ్వాలని మా అమ్మ ఆశపడేది’ అంటూ మాటి మాటికీ చెప్పేవాడు. ఆ నగలు తాకట్టు పెట్టే డబ్బు తెచ్చాడు. అంజలి తనకు దొరకదని తెలిసినా మీకు సహాయం చేశాడు. వాడ్ని చూసి చెబుతున్నావు 'డబ్బు పిచ్చి పట్టిన వాడనీ! ఇది  న్యాయమా?"

శరీరమంతా కంపిస్తుంటే అలాగే కూర్చుండిపోయింది రోహిని.

"ఇంతవరకు ఈ విషయం అంజలికి కూడా తెలియదు. నన్ను కూడా ఎవరికీ చెప్పకూడదని చెప్పాడు. నువ్వు ఈ డబ్బును ఎప్పుడు తిరిగి ఇవ్వబోతావు...ఎలా ఇవ్వబోతావు అని ఇంతవరకు అంజలిని అతను అడగలేదు తెలుసా? లేదు ‘అంజలి వలన ఇంత డబ్బు తిరిగి ఇవ్వటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ఆలొచించ లేదు? ‘అంజలికి అమ్మ అయితే...నాకూ అమ్మలాగానే కదా ఆంటీ' అన్నాడు. సుధీర్  లాంటి అల్లుడు దొరకాలంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుండాలి. అది నీకు అర్ధం కావటం లేదు. ఎవడో ఒక వెధవ పోరంబోకు నిన్ను మోసం చేసాడని సుధీర్ ని కూడా అలాంటివాడేనని అనుకుంటున్నావే అది న్యాయమా?" ఆపకుండా మాట్లాడింది నిర్మలా ఆంటీ.

రోహిని ఏదో చెప్పటానికి నోరు తెరిచింది. కరెక్టుగా అదే సమయంలో సుధీర్ ఇద్దరు మగ వారిని పిలుచుకుని లోపలకు వచ్చాడు.

“ఆంటీ...వీళ్ళు మీ అన్నయ్యలని చెప్పారు. మిమ్మల్ని చూడాలట. అందుకని తీసుకు వచ్చాను"

నరసింహం, జగన్నాధం లోపలకు వచ్చారు. వాళ్ళను చూడగానే ప్రేమ పొంగుకు రావటంతో...”అన్నయ్యా!" అని అరుస్తూ లేవటానికి ప్రయత్నం చేస్తున్న రోహినిని నొక్కి పట్టుకుంది నిర్మలా ఆంటీ.

“రోహినీ...ఏంటమ్మా! నీకు ఆరొగ్యం బాగా సీరియస్ అయ్యిందట? ప్రాణాపాయ స్థితిలో ఉన్నావట? మాకు ఒక్క మాటైనా చెప్పి పంపించి ఉండొచ్చు కదా?" అన్నాడు నరసింహం.

"లేదన్నయ్యా...ఏదేదో జరిగిపోయింది! చెప్పి పంపితే మీరేమనుకుంటారో తెలియదు. అందుకే...అది సరే అన్నయ్యా నాకు ఆరొగ్యం బాగలేదని మీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు?”

"ఎవరూ చెప్పలేదు చెల్లెమ్మా... మేమే తెలుసుకున్నాము. ఎలాగంటావా. ఆ రోజు, అదే నాన్న చనిపోయిన రోజు మీ ఆయన మాట్లాడిన తీరు, నువ్వూ, అంజలి మాట్లాడిన తీరు చూసిన మాకు మీ ఆయనే ఏదో కుట్ర చేస్తున్నాడని మాకు అర్ధమయ్యింది. వెంటనే ఒక మనిషిని అరేంజ్ చేసి మిమ్మల్ని వెంబడించి విషయాలు తెలుసుకుని చెప్పమన్నాము. అతను అన్ని విషయాలు చెప్పాడు. నువ్వూ, నీ కూతురు అంజలి చాలా మంచి వాళ్ళు, మొసపోయారు అంటూ అన్ని విషయాలు చెప్పాడు. మేమనుకున్నది నిజమయ్యింది. తప్పంతా మీ ఆయనదే, ఆయనే ఇంకా మారలేదు అని అర్ధమయ్యింది"

“వాడ్ని....ఆయన, మా ఆయన అని చెప్పకు అన్నయ్యా. ఇరవై మూడేళ్ల తరువాత మారేనని చెబుతూ మా వెంట పడితే, ఒక్క క్షణం నిజమనుకున్నాము...ఆ తప్పుకు నాకు తగిన శిక్ష వేశాడు దేవుడు. ఆ రోజు నాన్నను సరిగ్గా చూడలేకపోయాను..." మాట బొంగురుపోయింది రోహినికి.

"వద్దమ్మా...ఇంక వాడి గురించి మాట్లాడం. నువ్వు కూడా మాట్లాడకు...అవును నువ్వేంటి అలా చిక్కిపోయావు. ఇప్పుడే బయలుదేరు. మనింటికి వెడదాం"

“వద్దన్నయ్యా...మీరిద్దరూ నా మీద ఇంకా ప్రేమ చూపిస్తున్నారు. అది నాకు చాలు. మేము వేరుగానే ఉంటాము. మేము అక్కడికి వస్తే వాడు కూడా అక్కడికి వచ్చి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తాడు"

"సరేనమ్మా...నాన్న మాత్రమే నీకు రిలీజ్ పత్రం రాశారు. మేము రాయలేదు. మమ్మల్ని కూడా రాయమని నాన్న చిన్న బలవంతం కూడా చేయలేదు. మాకు నువ్వు ఇప్పటికీ ముద్దుల చెల్లివే. ఆస్తిలో నా భాగం నీకు ఇచ్చి వెలదామని వచ్చాము!" అన్నాడు జగన్నాధం.

“నన్ను క్షమించడన్నయ్యా. నాకు ఏదీ వద్దు. నాకు డబ్బులు వచ్చినై అని తెలిస్తే ఆ మనిషి...నన్నే చుట్టి చుట్టి వస్తాడు. నా ప్రశాంతతే పోతుంది. దానికోసం మీ బంధుత్వమే వద్దని చెప్పను. మీ చెల్లెలుగా మీ ఇంటికి వచ్చి వెడుతూ ఉంటాను. అది చాలు నాకు" .........ముగ్గురూ కళ్ల వెంట నీరు కార్చారు.

"సరేనమ్మా...పుట్టింటి సారేగా ఏదైనా తీసుకో చెల్లెమ్మా. అప్పుడే మా మనసులోని భారం తగ్గుతుంది" అన్నాడు నరసింహం.

"అన్నయ్యా...మీరు కరెక్టు టైముకే వచ్చారు. వచ్చే వారం నా కూతురికి పెళ్ళి పెట్టుకున్నాను"---ఆమె చెబుతూండగా...లోపలకు వచ్చిన అంజలి, అమ్మ చెప్పింది అర్ధం చేసుకోవటంతో. ఆమె ముఖం ప్రకాశవంతమయ్యింది. సుధీర్ ను చూసింది. అతను బయటకు వెళ్లటానికి రెడీ అయ్యాడు.

“ఉండు సుధీర్ తమ్ముడూ... అంజలికి ఎప్పుడు పెళ్ళి...ఎవరు పెళ్ళి కొడుకు? అదంతా తెలుసుకో కుండా వెడుతున్నావే?" అన్నది రోహిని. అతనూ నిలబడ్డాడు.

"ఇదిగో నిబడ్డాడే... సుధీర్!ఇతనే అల్లుడు. వచ్చే శుక్రవారం ముహూర్తం. మీరు తప్పకుండా వచ్చేయండన్నయ్యా" అన్నది రోహిని.

పరిగెత్తుకు వచ్చి అమ్మ మెడను చుట్టేసింది అంజలి. మాటలు రాక ఆశ్చర్యంలో మునిగిపోయాడు సుధీర్. అతను అతని చెవులనే నమ్మలేకపోయాడు.  

"చాలా సంతోషం చెల్లెమ్మా...నీకు నీ పెళ్ళి సారె ఇవ్వలేదు. నీ కూతురుకైనా ఇస్తాము" అన్నారు ఇద్దరు అన్నదమ్ములూ.

"ఇలా చూడండి...ఈమె చెప్పటానికి సిగ్గుపడుతోంది.కొన్ని సమయల్లో చెప్పనే చెప్పదు. అందుకని నేనే చెబుతాను. ఇదిగో ఇక్కడ నిలబడ్డాడే ఈ అబ్బాయి...అదే మీ చెల్లికి కాబోయే అల్లుడు...అతను తన తల్లి నగలను తాకట్టు పెట్టి మీ చెల్లెల్ని కాపాడాడు. వాటిని విడిపించి అతనికి ఇచ్చేయండి. అదే మీరు అంజలికి ఇచ్చే మేనమామ సారె.  ఆ నగలను అది తన పెళ్ళికి వేసుకుంటుంది" అన్నది నిర్మలా ఆంటీ.

'సరే' నని తల ఊపిన అన్నదమ్ములిద్దరూ "ఇదిగో ఈ పత్రాలు కూడా మేనమామల సారెగా ఇస్తున్నాము" తీసుకోండి.

నిర్మలా ఆంటీనే తీసుకుంది.

లోకాన్నే మరిచిపోయిన పరిస్థితిలో సుధీర్, అంజలి ఒకరికొకరు చూపులతో చూసుకుంటూ నిలబడ్డారు. అక్కడ ఇంకా అంతమంది ఉన్నారనే తలపు లేకుండా.

"సుధీర్ బాబూ చూసింది చాలు...ఇక్కడ మేమంతా ఉన్నాము. దాని మెడలో తాలి కట్టు. తరువాత చూస్తూనే ఉండు, ప్రేమ కలలు కంటూ ఉండు… ఎవరూ ఏమీ చెప్పరు" అన్న వెంటనే అక్కడున్న వాళ్లందరూ నవ్వారు.

చెట్లు వాళ్ల మీద పువ్వులు వేసి ఆశీర్వదించగా...దూరంగా గుడి గంట మోత మంగల వాయిద్యాలుగా మోగింది.

***********************************************సమాప్తం*****************************************

29, జులై 2021, గురువారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-7)

 

                                                                                 ప్రేమ కలలు                                                                                                                                                                       (సీరియల్-PART-7)

పూలమాల, మంగళసూత్రంతో తనని చూసిన వెంటనే నాన్న, అన్నయ్యలు మొదట తిడతారు...కోపగించుకుంటారు. కానీ చివరకు తన పెళ్ళిని అంగీకరించి తనని చేర్చుకుంటారు అని నమ్మింది. అదే నమ్మకం హరికృష్ణకూ ఉన్నది. వీళ్ళను వాకిట్లో చూసిన వెంటనే అన్నయ్యలిద్దరూ పరిగెత్తుకు వచ్చారు.

"రోహినీ...ఏంటమ్మా...ఇలా చేశావు? ఈ సారి ఎంత మంచి పెళ్ళికొడుకును చూశామో తెలుసా? నీకెందుకంత తొందర...ఎందుకమ్మా ఇలా చేశావు?"

"క్షమించండి అన్నయ్యా... ఇది తప్పితే నాకు వేరే దారి తెలియలేదు? నేను ఈయన్ను ప్రేమిస్తున్నాను. ఈయన్ని మనసులో ఉంచుకుని ఇంకొకరితో కాపురం చేయటం నా వల్ల కాదన్నయ్యా"

"నరసింహం...దాని దగ్గర ఏమిటి మాటలు? ఏ రోజైతే మనల్ని కాదని అది పెళ్ళిచేసుకుందో...అప్పుడే అది మన చెల్లి కాదు. ఇక దీనికీ మనకూ ఎటువంటి సంబంధమూ లేదు అనుకుని తలకి స్నానం చేసిరా"

"ఏమిటి జగన్ చెబుతున్నావు? ఈ నిర్ణయం మనం ఎలా తీసుకోగలం? నాన్న ఏం చెబుతారో?" అని రెండో అన్నయ్య మాట్లాడుతున్నప్పుడే ఆయన లోపలి నుండి వచ్చారు. ఆయన మొహం చలనం లేకుండా ప్రశాంతంగా ఉంది.

"నాన్నా...మీ ముద్దుల కూతురు చేసిన ఘనకార్యం చూశారా?  మీరున్నారు... ఇద్దరు అన్నయ్యలం మేమున్నాము. అందరినీ వదిలేసి...నిన్న వచ్చిన వాడితో భార్యగా వచ్చి నిలబడింది"

"ఊ...నేనూ చూస్తున్నాగా. మీరెందుకు కంగారు పడి ఇలా అరుస్తున్నారు? ఆమె జీవితాన్ని ఆమే నిర్ణయించుకుంది. దీన్నెందుకు పెద్ద విషయంగా తీసుకుంటున్నారు" --- అనేటప్పటికి....షాక్ అయ్యారు అందరూ.

మనసంతా పువ్వులాగా వికసించింది రోహినికి.

"నాన్నా, మీరు నన్ను క్షమించారా! నేను చేసినదాంట్లో మీకేమీ కోపంలేదే? చాలా థ్యాంక్స్ నాన్నా. లోపలకు వెళ్ళి వివరాలు మాట్లాడుకుందాం" అంటూ హరికృష్ణను తీసుకుని లోపలకు వెళ్లటానికి రెడీ అయ్యింది.

"ఉండమ్మా" అన్నది నాన్న స్వరం.

"ఏ హక్కుతో మా ఇంటి లోపలకు వస్తున్నావు? నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం నన్నూ, మీ అన్నయ్యలనూ ఎంత బాధకు గురిచేస్తుందో ఆలొచించటానికి కూడా నువ్వు సిద్దంగా లేవు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వే అమర్చుకున్నావో...అప్పుడే నువ్వు ఒంటరిదానివి అయ్యావు. ఇప్పుడు నువ్వు బయట మనిషివి. మావల్ల నీకో...నీ భర్తకో జరగాల్సింది ఏదైనా ఉంటే చెప్పేసి వెళ్ళిపో. మా వల్ల అయినది చేస్తాం" అన్నారు నిదానంగా.

హరికృష్ణ కొంచం ముందుకు వచ్చాడు.

"మీరు మమ్మల్ని క్షమించాలి. ఎక్కడ రోహిని నాకు కాకుండా పోతుందో అన్న భయంతో ఈ నిర్ణయానికి రావలసి వచ్చింది. ఇప్పటికీ ఏమీ పరవాలేదు సార్. రహస్యంగా జరిగిన ఈ పెళ్ళి...ఎవరికీ తెలియదు. ఊరంతా తెలిసేటట్టు ఏర్పాటు చేసి మీరు జరిపే పెళ్ళిలాగా చేసేయండి. అప్పుడు మీకు అవమానంగా ఉండదు"

నవ్వారు బాపిరాజు గారు.

“మీ పెళ్ళిని ఊరంతా తెలుసుకునేటట్టు నేనెందుకయ్యా జరపాలి? ఒకమ్మాయి మెడలో ఎన్నిసార్లు తాళి కడతావు? అంతే కాకుండా నాకు అమ్మాయే లేదే. అలాంటప్పుడు పెళ్ళి కొడుకు ఎక్కడ్నుంచి వస్తాడు?"

"సార్...నా వల్ల మీ కుటుంబంలో గొడవలు వద్దు. నేను తప్పు కుంటాను. మీరు మీ అమ్మాయిని పిలుచుకుని లోపలకు వెళ్ళండీ” అన్నాడు హరికృష్ణ.

"మీరెందుకండీ వీళ్ళను బ్రతిమిలాడతారు?  మనం ఏమంత చెయ్యకూడని తప్పును చేశేశాము? ప్రేమించి పెళ్ళి చేసుకోవటం అంత పెద్ద నేరమా? వీళ్ళ రక్తమే నా శరీరంలోనూ పారుతోంది. నాకూ అదే వైరాగ్యం ఉంది. రండి...మనం వెళ్దాం" అంటూ వెనక్కి నడిచింది రోహిని.

"ఉండు రోహినీ...నా గురించి బాధ పడకు. నేను ఎలాగైనా బ్రతికేస్తాను. కానీ నువ్వు...వసతిగా జీవించావు. నా వలన నువ్వు కష్టపడకూడదు. మనకి పెళ్ళే జరగలేదు అనుకో. తాళిని విప్పి నాకు ఇచ్చేసి వెళ్ళిపో. అప్పుడు వాళ్ళు నిన్ను మన్నించి చేర్చుకుంటారు"

"కేవలం...డబ్బుకోసం, వసతికోసం నేను తాళిని విప్పేస్తాననుకున్నారా? ఈ రోజు బూజును దులిపినట్లు, నన్ను దులిపేసి వదిలేసేరు కదా! వీళ్ళ ముందు మనం గొప్పగా బ్రతికి చూపిద్దాం. మన దగ్గర శ్రమ ఉంది. దాన్ని నమ్మితే చాలు. రండి..."

"చూడమ్మా...ఈ రోజుతో నీకూ, ఈ ఇంటికీ ఉన్న బంధం ముగిసిపోయింది. ఇక డబ్బో-నగలో అడుగుతూ ఈ గుమ్మం తొక్కకూడదు. అలా చేసే ధైర్యం నీకుందా?"

ఏదో చెప్పటానికి నోరు తెరిచిన హరికృష్ణను మాట్లాడనివ్వకుండా తానే మాట్లాడింది రోహిని.

"ఇలా చూడండి సార్, నేను ఇక ఈ ఇంటికి రానే రాను. ఇక నాకు అన్నీ ఈయనే. మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వద్దు. మీ డబ్బు పెట్టుకుని మీరే ఏడవండి" అన్న రోహిని, హరికృష్ణను పిలుచుకుని వచ్చేసింది.

ఇక పాత ఉద్యోగం అతనికి ఉండదని తెలిసి, ఇద్దరూ విజయవాడకు దగ్గరలో ఉన్న గ్రామానికి వచ్చారు. అదే బాపిరాజు గారి పూర్వీకుల ఊరు అని రోహిని విని ఉంది. అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాల్సి వచ్చింది. తల మీద చేతులు పెట్టుకుని ఒక మూలగా కూర్చున్నాడు హరికృష్ణ.

"మీరు బాధ పడకండి కృష్ణా --మీకు నేనున్నాను. ఇంకో ఉద్యోగం దొరక కుండానా పోతుంది"  అన్నది ఓదార్పుగా.

ఒక్కసారిగా బుసకొట్టాడు అతను "ఎంకమ్మా...నా ప్లానునే చెడగొట్టేసేవే! నల్ల పిల్లిలాగా ఉన్న నిన్ను ఎందుకు ప్రేమించానో? లేదు...లేదు...ప్రేమిస్తునట్టు నటించానో తెలుసా? నువ్వు బాపిరాజుకి ఒకే కూతురువి. నిన్ను పెళ్ళి చేసుకుంటే వసతిగా -- ఉద్యోగమే చేయకుండా ఇంటల్లుడుగా ఉండి పోదామనుకున్నాను. ఆస్తి బాగా వస్తుందని లెక్క వేసుకున్నాను. శనేశ్వరం...అంతా చెడ దొబ్బేవు కదే!"

మనసు మధ్య భాగంలో గట్టిగా దెబ్బతిన్నది రోహిని. తల తిప్పుతున్నట్టు అనిపించింది. నిలబడలేక కాళ్ళు వణికినై. ఒక్కసారిగా చెమటలు పట్టినై. షాక్ తో నాలిక పొడిబారింది.

అతను మాట్లాడుతూ వెడుతున్నాడు.

"వాళ్ళు మన పెళ్ళిని ఒప్పుకోరని తెలుసుకున్న తరువాత వెంటనే త్యాగం చేసేవాడిలాగా నటించి నిన్ను విడిచి పెట్టి, కనీసమైన డబ్బును గుంజుదామని చూశాను...పెద్ద పతివ్రతలాగా తాళిని విప్పను అని చెప్పి దాన్ని కూడా పాడుచేసావు"

హరికృష్ణ మాట్లాడుతూ పోతుంటే అతని అసలు రూపం ఆమెలో విచ్చు కుంటూ పోతోంది. 'వీడికి మనసే లేదు. వీడుత్త డబ్బు పిశాచి’ అనేది చాలా ఆలశ్యంగా అర్ధం చేసుకుంది ఆ అమాయకురాలు. హృదయం నొప్పి పుట్టింది. మెడడులో చాలా గందరగోళం.

"సరి...సరి...జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చెయ్య గలిగింది ఒకటే ఒకటి. త్వరగా ఒక బిడ్డను కని, దాన్ని మీ నాన్న కాళ్ళ దగ్గర పడేసి బేరమాడితే, ఒక వేల మనల్ని క్షమించి కొంచమైనా ఆస్తి ఇస్తారు. ఇలా చూడమ్మా...'మనం వీడ్ని పెళ్ళి చేసుకున్నామే, ఇతను ఉద్యోగం చేసి మనల్ని కాపాడతాడు’ అని మాత్రం కలలు కనకు. ఇంటికి చిల్లి గవ్వ కూడా ఇవ్వను" అంటూ బయటకు వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిపోయిన తరువాతే కొంచం కొంచంగా స్వీయ భావ వలలోకి  వచ్చింది.

'భగవంతుడా...వీడ్ని నమ్మి ఎంత పెద్ద తప్పు చేశేను? నాన్న ఎంతగా చెప్పారో...ఎందుకు వినలేదు? ప్రేమ మోహం కళ్ళు కప్పేసింది. ఇక నేనేం చేయను?' వేదనతో ఆమె కళ్ళల్లో నీళ్ళు నదిలా ప్రవహించినై.  తన తలరాతను తలుచుకుని ఏడుస్తూనే ఉంది. సముదాయించే వాళ్ళు కూడా లేరు.

రెండు గంటలైనా వెళ్ళిన అతను తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ భయం కూడా ఆమెను చేరుకుంది.

కళ్ళు తుడుచుకుంది. దేవుడి మీద భారం వేసింది. ఎప్పుడో చనిపోయిన తల్లి జ్ఞాపకానికి వచ్చింది. మళ్ళీ కన్నీరు మొదలయ్యింది. 'అమ్మా...నువ్వుంటే నాకు ఇలాగంతా జరిగేదా?' -- ఏడ్చింది.

'ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. నా జీవితం ఇంతే అనేది తెలిసిపోయింది. ఏ కారణం  చేత కూడా పుట్టింటికి మళ్ళీ వెళ్ళకూడదు. అది ఖచ్చితం. వీడ్ని నమ్ముకుని ప్రయోజనమూ లేదు. నా చేతులను నమ్ముకునే నేను బ్రతకాలి. చదువు సహాయం చేస్తుంది’ తనని తాను సముదాయించుకుంది!

సుమారుగా ఏడున్నర ప్రాంతంలో హరికృష్ణ వచ్చాడు. బాగా తాగున్నాడనేది అతను దగ్గరకు వస్తున్నప్పుడే అర్ధమయ్యింది.

"మీరు తాగుతారా?"

“అవును...బాగా తాగుతాను. నీకేమొచ్చింది? నీ డబ్బుతోనా తాగాను? ఏమిటే ఆ చూపు? నేనేమీ భయపడను. ఈ రోజు మనకి 'ఫస్ట్ నైట్' త్వరగా బిడ్డ పుట్టాలని వేడుకో" అన్నాడు.

మరుసటి రోజు తెల్లవారుతుండగానే బయటకు వెళ్ళిపోయాడు.

ఇంట్లో ఒక జీవి ఉందే...భోజనానికి ఏం చేస్తుంది? అనే ఆలొచన కూడా లేకుండా...'నేను రాత్రికే వస్తాను’ అని వదిలేసి వెళ్ళిపోయాడు.

మళ్ళీ ఏడవటానికి ఓపిక లేదు...మనసూ రాలేదు రోహినికి. జరగవలసిన పనులు మొదలుపెట్టింది.

చేతులకూ, చెవులకూ వేసుకున్న స్వల్ప బంగారాన్ని అమ్మి ఇంటికి కావలసిన వస్తువులు కొన్నది. కొంచం డబ్బుతో రెండు చీరలు, జాకెట్టు గుడ్డలు అని కొనుక్కుంది.

పక్కన ప్రైవేట్ స్కూలు ఒకటుంది. అక్కడికి వెళ్ళి తన చదువు గురించి చెప్పి ఉద్యోగం అడిగింది. ఆమె ఎం.ఎస్.సి.మాత్స్ చేసినందువలన వెంటనే ఉద్యోగం దొరికింది. జీతం నెలకు ఐదువేలు. శనివారం కూడా స్కూలుకు రావాలి. అంటూ అన్ని షరతులకూ ఒప్పుకుంటూ ఉద్యోగంలో చేరింది.

ఆమెకు ఉద్యోగం దొరికిందని తెలుసుకున్న వెంటనే తాను ఉద్యోగం వెతుకుంటున్న పని ఆపాశాడు హరికృష్ణ.

ఎప్పుడు చూడూ భార్యను తిడుతూనే ఉంటాడు. తన పధకం ఓడిపోయింది. ఆస్తి, డబ్బూ దొరకలేదని గొణుగుతూ ఉండేవాడు. కొన్నిసార్లు దెబ్బలు కూడా తగిలినై. రోజులు గడుస్తున్న కొద్ది మూర్ఖత్వం పెరిగిందే తప్ప -- ఆమెపై జాలో-దయో చూపించనే లేదు.

అన్నిటినీ మౌనంగా సహించటం అలవాటు చేసుకుంది రోహిని. లోతైన మనసులో నుండి ఎంత అణుచుకున్నా దాన్ని దాటి తన జరిగిపోయిన కాలం జ్ఞాపకాలను ఆశపడుతుంది. 'ఎలాగో వసతులు -- విలాశవంతంగా ఉండవలసిన ఆమె ఇలా కష్టపడుతున్నామే?' అని ఆవేదన చెందుతుంది. ఆ టైములో మనసును రాయి చేసుకుంటుంది. స్కూల్ పిల్లల  నోటు పుస్తకాలనో, పరీక్ష పేపర్లనో తీసి పెట్టుకుని ఆ పనిలో ఐక్యమైపోతుంది.

ఒక్కొక్క రోజూ నరకంలా గడిచింది. అయినా కానీ పళ్ళు కొరుక్కుంటూ గడిపింది. ఇలాంటి టైములోనే ఆమె గర్భం దాల్చిందని కన్ ఫర్మ్ అయ్యింది. విషయం తెలిసిన వెంటనే హరికృష్ణ పెద్దగా రియాక్ట్ అవలేదు.

"ఇది పుట్టిన తరువాతైనా మీ నాన్న నిన్ను చేర్చుకుంటాడా అని చూద్దాం?" అన్నాడు.

కానీ, రోహిని తన బిడ్డకొసం చాలా ఆశగా ఎదురుచూసింది. 'ఎండి పోయిన ఎడారిలో వర్షం కురిసినట్టు’… 'నాలిక మీద పడ్డ తేనె బొట్టులాగా '...తన జీవిత ఆనందమే ఈ బిడ్డే  కనుక రాధ చాలా దృఢంగా ఉంది.  బాగా తింటూ ఆరొగ్యాన్ని మెరుగుపరుచుకుంది. మర్చిపోకుండా వాక్సిన్లు వేసుకోవటానికి చాలా గమనికతో ఉండేది.

కాన్పు నొప్పులు వచ్చి చుట్టు పక్కలున్న వారి సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ప్రశవం జరగబోతోంది అన్న పరిస్థితిలోనూ అతను వచ్చి చూడలేదు.

బుధవారం సాయంత్రం అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చి తల్లి అయ్యింది రోహిని. మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉంది. అప్పుడు కూడా అతను రాలేదు. తానే రిక్షా చేసుకుని వచ్చి ఇంట్లో దిగింది.

బిడ్డ పుట్టిన శరీరం నీరసంగా ఉంది. అయినా ఆమె వలన ఒక్క క్షణం కూడా రిలాక్స్ గా కూర్చోలేకపోయింది. ఆమె లేని సమయంలో హరికృష్ణ ఇంటిని అశుభ్రం చేసేశాడు. అది శుభ్రం చేసి -- బిడ్డకు పాలిచ్చి--తనకు పత్యం భోజనం తయారుచేసుకోవటం అనే పనులు చేసి ముగించుకునేటప్పటికి తల తిరుగుతున్నట్టు అనిపించింది.

ఆమె పరిస్థితి చూసి పక్కింటి పనిమనిషి గౌరి, భోజనం చేసి పంపేటట్టు...దానికి తగిన డబ్బు తీసుకునేటట్టు ఒప్పుకుని భోజనం బాధ్యత ఆమె తీసుకుంది. అది రోహినికి చాలా ప్రశాంతతను ఇచ్చింది.

హరికృష్ణ కనిపించనే లేదు. దాని గురించి రోహిని బాధ పడనూ లేదు. ఐదు నెలలు గడిచినై. బిడ్డను గౌరి దగ్గర ఇచ్చేసి స్కూలుకు వెళ్ళటం మొదలుపెట్టింది. జీవితం సాఫీగా గడుస్తోంది.    

సడన్ గా ఒకరోజు వచ్చాడు భర్త.

"అరెరే...ఇదేనా నా బిడ్డ? ఆడపిల్లనా? అరే శనేశ్వరం...మగ బిడ్డగా పుట్టి ఉండకూడదా? నీకు టాలెంట్ చాలదు. అందుకనే ఆడపిల్లను కని తీసుకు వచ్చావు" అన్నాడు కఠినంగా.

మౌనంగా అతనికి కంచం పెట్టి భోజనం వడ్డించింది.

"మగ బిడ్డగా పుట్టుంటే తాతయ్య ఆస్తి, మనవడికే వస్తుందని చెప్పి కోర్టులో దావా వేసుండొచ్చు కదా? అందుకే చెప్పాను. సరి...సరి...ఇప్పుడు కూడా చెడిపోయింది ఏమీలేదు. బిడ్డను తీసుకుని బయలుదేరు"

"ఎక్కడికి?" అన్నది పులుసు పోస్తూ!

"ఇంకెక్కడికి...మీ ఇంటికే. మీ నాన్న కాళ్ళ దగ్గర ఈ బిడ్డని పడేయ్. దీన్ని పెంచటానికి మా వల్ల కావటం లేదు. 'డబ్బులేక అల్లాడిపోతున్నాము’ అని చెప్పి ఏడు. ఆయన నిన్ను మాత్రం చేర్చుకున్నా పరవాలేదు. నేను నిదానంగా వచ్చి కలిసిపోతాను. అంతవరకు నువ్వు నాకు కొంచం డబ్బులిచ్చి ఆదుకోవా ఏమిటి? "అన్న హరికృష్ణ, భోజనం పూర్తి చేసి లేచాడు.

“ఉన్నదాంట్లోనే బాగా చినిగిపోయిన చీరను కట్టుకో. బిడ్డకు కూడా మామూలు గుడ్డలు వేయి. ఇలా పౌడర్ అంతా పూసి అందంగానూ, శుభ్రంగానూ తీసుకువెళ్ళకు. అలా ఉంటేనే నీ మీద జాలి కలుగుతుంది" అన్నాడు.

అంత వరకు మాట్లాడ కుండా ఓర్పుగా ఉన్న రోహిని పిల్లను గుడ్డ ఊయలలో వేసి నిద్ర పోనిచ్చి వచ్చింది. చిన్నగా చెప్పినా ఖచ్చితమైన స్వరంతో మట్లాడింది.

"చూడండి...మీరెంత ఒత్తిడి చేసినా మా నాన్న దగ్గరకు బిచ్చం ఎత్తుకుంటూ వెళ్ళను. ఆయనకున్న కఠిన మనసు, పరువు, రోషమూ నాకూ ఉండదా? నా పిల్లను బిచ్చగత్తెను చెయ్యలేను. మీరు నన్ను కొట్టి చంపినా పరవాలేదు...ఆ ఇంటి గడప తొక్కను..." అన్న  రోహిని ఊయలను ఊపటానికి వెళ్ళింది.

ఆమె చెప్పింది విన్న తరువాత హరికృష్ణ నోటి నుండి వచ్చిన మాటలు చెప్పటానికి పనికిరావు.  అంత అసహ్యంగా మాట్లాడాడు. ఒక సమయంలో చేతులు ఎత్తి కొట్టటానికి వచ్చినప్పుడు ఆపింది.

"నన్ను కొట్టటానికి చెయ్యి ఎత్తేరంటే...ఊరీకే  ఉండను. తిరిగి కొడతాను. ఆ అవమానం మీకు అవసరమా? మాట్లాడ కుండా, గొడవ పడకుండా ఉండేటట్టు అయితే భర్త అనే కారణంతో భోజనం పెడతాను. అది వదిలేసి 'మీ ఇంటికి వెళ్ళు -- డబ్బులు తీసుకురా' -- అలాఇలా అని మెదలుపెట్టేరా... ఊరికే ఉండను. పోలీసులకు చెప్పి లోపల  పెట్టిచేస్తాను. అప్పుడు జీవితాంతం చిప్ప కూడే" అన్నది.

ఆమెను కోపంతో, విసుగుతో చూసేసి, ఏమీ మాట్లాడకుండా కోపంతో తలుపులను గట్టిగా మూసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ శబ్ధానికి పాపకు నిద్రా భంగం కలిగి ఏడుపు మొదలు పెట్టింది.

                                                                                                      Continued...PART-8

***********************************************************************************************

27, జులై 2021, మంగళవారం

ప్రేమ కలలు...(సీరియల్-PART-6)

 

                                                                                  ప్రేమ కలలు                                                                                                                                                                        (సీరియల్-PART-6)

ఆమెకు ఇద్దరు అన్నయ్యలు మాత్రమే! ఆ ఇంటికి ఒకే ఒక ఆడ వారసురాలు రోహినియే అయినందువలన, తల్లి కూడా లేనందు వలన రోహినిని చాలా గారాబంగా పెంచారు. ఆమె కొద్దిగా నలుపు. దాంతో పాటూ ఆమె పళ్ళు కూడా కొంచం ఎత్తుగా ఉంటాయి. తాను అందంగా లేనే నన్న నిరాశ ఆమెకు ఎప్పుడూ ఉండేది.

అన్నయ్యలు నరసింహం, జగన్నాదం ఆమెను అరచేతిలో ఉంచి చూసుకుంటారు.

"నాన్నా. చెల్లికి ఒక మంచి వరుడ్ని చూసుంచాను. మన అంతస్తుకు సరితూగకపోయినా మంచి కుటుంబం. వాళ్ళు మూడు 'కెమికల్ ఫ్యాక్టరీ' లు నడుపుతున్నారు. అబ్బాయి ఎం.బి.ఏ చదువుకున్నాడు. ఏమంటారు?"

"అబ్బాయి బాగా చదువుకోనుండాలి. దాని కంటే ముఖ్యం కుటుంబ అంతస్తు. మన అంతస్తుకు కొంచం కూడా తక్కువ ఉండ కూడదు. చెప్పాలంటే మనకంటే కొంచం ఎక్కువ అంతస్తు ఉంటే మంచిది"

“ఏమిటి నాన్నా ఇలా చెబుతున్నారు. మన అంతస్తు కంటే ఎక్కువ అంతస్తు కలిగిన వాళ్ళు మన కులంలో చాలా తక్కువ మందే ఉన్నారు"

"అయితే ఏమిటి? ఉన్న కుటుంబాలలోనే చూడు. నా కూతురు కాపురం చేసే చోట మహారాణిలాగా ఉండాలి. అర్ధమయ్యిందా?" అన్నారు.

ఆ తరువాత ఒకరిద్దర్ని చూశారు. కానీ, వాళ్ళెవరికీ రోహిని నచ్చ లేదు. మనసు విరిగి పోయింది రోహినికి.

"నాన్నా...నాకు పెళ్ళే వద్దు...ఇక వరుడ్ని చూడకండి"

"ఎందుకరా బంగారం అంత మాట చెబుతున్నావు?".

"వచ్చిన పెళ్ళికొడుకులందరూ నన్ను చూసేసి 'నల్లగా ఉన్నది. అమ్మాయి బాగుండలేదు’ అని చెప్పి వెళుతున్నారు. నాకు చాలా అవమానంగా ఉంది. ప్లీజ్...అర్ధం చేసుకోండి" అంటూ ఏడ్చింది.

కొడుకులిద్దరినీ ఒంటరిగా పిలిచారు బాపిరాజు గారు.

"ఇలా చూడండిరా. మన రోహిని మనసు కష్టపడితే నేను తట్టుకోలేను అనేది మీకు తెలుసు. అందుకని నా లక్ష్యాన్ని కొంచం తగ్గించుకుందామని చూస్తున్నాను. మన అంతస్తుకు తక్కువ అంతస్తు వాళ్ళైనా పరవాలేదు. కానీ, బాగా చదువుకున్న వాడిని చూడండి. కావాలంటే అతన్ని మనం ఇంట్లోనే ఇల్లరికపు అల్లుడుగా ఉంచుకుందాం" అన్నారు.

మళ్ళీ వరుడ్ల కోసం వేట మొదలైయ్యింది.

ఆ సమయంలోనే హరికృష్ణ మా ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరేడు. ఆరడుగుల ఎత్తు. మంచి రంగు. అతన్ని చూసిన వెంటనే సున్నితమైన రోహిని మనసు సంచలనం చెందింది. పొద్దు పోవాలని ఎప్పుడైనా ఆఫీసుకు వచ్చే రోహిని, ఇప్పుడు రోజూ ఆఫీసుకు వెళ్ళటం మొదలుపెట్టింది. అతను రోహినిని చూసే విధం వ్యత్యాసంగా ఉండేది.    

హరికృష్ణను తలచుకుని పరితపించింది. 'అతని అందానికి ముందు తాను ఏ మాత్రం?' అనే ఇన్ ఫీరియారిటీ మనోభావం ఆమెను చుట్టేసింది. ఒక రోజు 'ఫ్యాక్టరీ' లో ఉన్న చెట్టు కింద వేసున్న బెంచి మీద కూర్చుని పక్షులను గమనిస్తోంది. ఆమె దగ్గరగా ఆమెకు వినబడనంతటి నెమ్మదిగా వచ్చి నిలబడ్డాడు హరికృష్ణ.

“ఏం మ్యాడం...పక్షులను ఆరాధిస్తున్నారా?"

అతను తిన్నగా తనతో మాట్లాడేటప్పటికి ఆమె మొహం సిగ్గుతో ఎర్ర బడింది.

"అయ్యయ్యో...నేను రావటం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను మ్యాడం. దానికోసం మీరు కోపగించుకోకూడదు. అని చెప్పి జరగటానికి రెడీ అయిన అతన్ని ఆమె స్వరం ఆపింది.

"లేదు...నాకు కోపం లేదు. మీరు కూర్చోండి. కావాలంటే నెనే వెళ్ళిపోతాను" 

"భలేవారే మీరు...నేను మీతో మాట్లాడాలనే ఇక్కడికి వచ్చాను. మీరేమిటి...వెళ్ళిపోతామంటున్నారు?"

"నిజంగా నన్ను చూడటానికా వచ్చారు?"

"మరి...? మిమ్మల్ని నాకు బాగా నచ్చుతుంది. అందుకే రెండు మాటలు మాట్లాడి వెడదాం అనుకుని వచ్చాను"

ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది రోహినికి.

"నిజంగానా...నేనంటే మీకు అంత ఇష్టమా? మిమ్మల్ని ఇష్టపడటానికి వెయ్యి మంది వస్తారే? మంచి రంగు, అందం...వాళ్ళతో మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. నా దగ్గర ఏం మాట్లాడబోతారు?"

" రోహినీ గారు...మీరు కొంచం నలుపు...అంతే కదా! అదొక లోటా? మీ అందం నాకు నచ్చింది. అంతకంటే మీ మనసు నాకు బాగా బాగా నచ్చింది"

"ఏం చెబుతున్నారు?"

"మీరు బాగా డబ్బు గల ఇంటికి చెందిన అమ్మాయి అయినా, ఇంత సింపుల్ గా ఉన్నారే...అదొక్కటే చాలే! ఇంకా నా మనసు అర్ధం కాలేదా? లేక తెలుసుకునే నటిస్తున్నారా?"

అతని మాటలు మత్తు ఎక్కించగా...కరిగిపోయింది.

"కృష్ణ గారు...నిజంగా చెబుతున్నారా? మీరు నన్ను...?

"ఎస్... రోహినీ. ఇప్పుడైనా అర్ధం చేసుకున్నావే! 'ఐ.లవ్.యు’ నీకు నేను నచ్చానా?" అన్నడు చెవి దగ్గరగా.

కళ్ళు తిరిగిన ఆమె అతని చేతులు పుచ్చుకుంది. ఆకాశమే దొరికినట్టు అనిపించింది. 'అందమైన యువకుడు ఆశ పడి నన్ను ప్రేమిస్తున్నాడు’ అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంది.

వాళ్ళ ప్రేమ రోజు రోజుకూ పెరుగుతోంది.

ఆ రోజు రోహిని అన్నయ్య నరసింహం పెళ్ళి చూపులకు ఏర్పాటు చేశాడు.  అదే తన ప్రేమను చెప్పటానికి మంచి తరుణం అని నిర్ణయించుకుంది రోహిని.

"నాన్నా...ఇకమీదట ఎవర్నీ పెళ్ళి చూపులకు రమ్మని చెప్పకండి"

"ఏమ్మా...వాళ్ళు నీ మనసును నొప్పించరు. నేను చూసుకుంటాను"

"అది కాదు నాన్నా...అదొచ్చి...అదొచ్చి...”

"ఏం రోహినీ, నీకు ఎవరైనా నచ్చారా? అలా ఉంటే చెప్పమ్మా" అన్నాడు అన్నయ్య నరసింహం.

"అవునన్నయ్యా...నేను ఒకర్ని మనసారా ఇష్టపడుతున్నాను. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు. కానీ...కానీ..."

"ఏమిటి కానీ...?"

"ఆయన మనంత డబ్బుగలవారు కాదు. అదే నాకు భయంగా ఉన్నది"

“ఎవరని చెప్పు...మంచి చోటైతే మేమే సంబంధం ఖాయం చేస్తాం. దైర్యంగా చెప్పు" అన్నాడు ఇంకో అన్నయ్య జగన్నాదం.

“అన్నయ్యా అదొచ్చి...మన ఫ్యాక్టరీలో మేనేజర్ గా ఉన్నారే హరికృష్ణ...ఆయన్నే ఇష్టపడుతున్నాను."

తుఫాన దాటిన భూమిలాగా ఆ చోటంతా నిశ్శబ్ధంగా మారింది. నాన్నే మొదట నోరు తెరిచారు.

"మీ ఇద్దరికీ ఎన్ని రోజులుగా పరిచయం?" 

"ఇప్పుడే...ఒక నెల రోజులుగా"

“రోహినీ తల్లీ...అతను మంచివాడు కాదు. అతన్ని మర్చిపో.  మన ఆస్తిని గురిగా  పెట్టుకునే అతను నిన్ను ఇష్టపడుతున్నాడు. అర్ధం చేసుకోరా ప్లీజ్" అన్నాడు తండ్రి బుజ్జగింపు దోరణిలో.

అది విన్న వెంటనే కోపం ముంచుకు వచ్చింది రోహినికి.

"ఎందుకలా చెబుతున్నారో నాకు తెలుసు. నేను అందంగా లేను. ఆయన అందంగా ఉన్నారు. 'ఎలారా ఈ నల్లదాన్ని ఇష్టపడుతున్నాడు’ అని మీకు సందేహం...కరెక్టే కదా? ఆయన ఇష్టపడేది నా మనసునే గానీ మన డబ్బును కాదు"

" రోహినీ...నాన్న చెప్పేది నిజమేనమ్మా. అతనికి ఎక్కువ డబ్బు ఆశ ఉన్నదని అతని మాటలతోనే గ్రహించాను. అతని మీద కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. వాడు పధకం వేసుకునే నీకు చేరువ అయ్యాడు. నువ్వు చాలా ఎక్కువగా చదువుకున్నా నీకు లోక జ్ఞానం చాలదమ్మా. నాన్న చెప్పేది విను. అతన్ని మరిచిపో" అన్నాడు జగన్నాదం.

"కుదరనే కుదరదన్నయ్యా...నేను లేకపోతే ఆయన తల్లడిల్లి పోతారు. అంత లోతుగా నా మీద ఇష్టం పెట్టుకున్నారు"

"అలాగంటే మేము నీమీద ఎక్కువ ఇష్టం పెట్టుకోలేదా? ఇన్ని సంవత్సరాలుగా  నిన్ను పెంచిన వాళ్లం. తల్లి లేని కొరత తెలియకుండా నాన్న నీమీద ప్రేమ కురిపించారే? అలాంటిది నిన్న వచ్చిన అతను మాకంటే ఎక్కువైపోయాడా నీకు?"----అడిగాడు నరసింహం.

"మీది రక్త సంబంధం. అందువలన నా మీద ప్రేమ చూపించారు. ఆయన నాకు కొంచం కూడా సంబంధం లేని వారు. కానీ, నాపైన ప్రాణమే పెట్టుకున్నారే. దాని పేరే కదా ప్రేమ"

మొట్టమొదటి సారిగా నాన్నకు కోపం వచ్చింది.

"ఏమిటే...అన్నయ్యలు చెబుతూ వెళుతున్నారు. వాళ్ళను ఎదిరిస్తూ మాట్లాడుతూనే ఉన్నావు! నీ జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. మాట్లాడకుండా లోపలకు పో. ఇక ఆ హరికృష్ణను చూసేవంటే నాకు పిచ్చి కోపం వస్తుంది. ప్రేమట ప్రేమ. అంతా వేషం. నేను చూసే వరుడ్నే నువ్వు పెళ్ళి చేసుకోవాలి. అర్ధమయ్యిందా?" అని చెప్పి వెళ్ళిపోయారు.  

కొంచంసేపు మౌనంగా ఉన్న రోహినికి ఒక ఆలొచన వచ్చింది. ఫోను చేసి హరికృష్ణను వెంటనే పార్కుకు రమ్మంది. తరువాతి అరగంటలో అతను అక్కడున్నాడు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చెప్పింది.

చెప్పి ముగించిన తరువాత అతన్ని చూసింది. కళ్ళల్లో నీరు పొంగుకు వచ్చింది.

"మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది కరెక్టే రోహినీ. నాలాంటి పేదవాళ్ళందరూ ప్రేమించకూడదు. ఒకవేల ప్రేమించినా వాళ్ళ అంతస్తుకు తగిన వాళ్ళనే ప్రేమించాలి. ఏం చేయగలం...ప్రేమ ఏమన్నా రంగునూ, డబ్బునూ చూసి వస్తోందా...?"

"మీరు ఏం చెబుతున్నారు?"

"ఏది ఏమైనా నువ్వు డబ్బున్న ఇంటి పిల్లవి. ఏదో టైమ్ పాస్ కోసం నన్ను ప్రేమించావు? నేనే దాన్ని తప్పుగా అర్ధం చేసుకుని కలలు కంటూ గడిపేసేను.  తప్పు నా మీదే రోహినీ. మీ నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్ళిచేసుకో. నాకు గొడవ ఉండదు" అని చెప్పి వెళ్ళబోయిన అతని చేతులను గట్టిగా పుచ్చుకుంది రోహిని.

"ఎందుకండీ...ఇలా మాట్లాడుతున్నారు? నన్ను చూస్తే టైమ్ పాస్ కోసం ప్రేమించే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా? మీరు నన్ను అలాగే అర్ధం చేసుకున్నారా? ఏదైనా దారి చెబుతారని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే...మీరు ఏదేదో మాట్లాడుతున్నారు"

"నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? నాకోసం ఏదైనా చేస్తావా? చెప్పు రోహినీ...చేస్తావా?"

"ఖచ్చితంగా చేస్తాను. ఏం చేయాలి...చెప్పండి..."

"నీ ఆస్తి, అంతస్తూ అన్నీ వదులుకుని రావటానికి రెడియా?"

"కృష్ణా...మీరు...?"

'అవును రోహినీ...మనం పెళ్ళి చేసుకుందాం. పూల మాలతో, పెళ్ళి బట్టలతో వాళ్ళ కాళ్ళ మీద పడదాం. 'ఓకే' అంటే చాలా మంచిది. లేదంటే నువ్వేమీ బాధపడకు. నాకు చదువుంది. ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడే శక్తి నా దగ్గరుంది...చెప్పు...నన్ను పెళ్ళి చేసుకుంటావా?"   

సమాధానం చెప్పకుండా నిలబడింది రోహిని. ఆమె మనసులో పలురకాల ఆలొచనలు.

"చూసావా...ఆలొచిస్తున్నావు. నీకు నా మీద నమ్మకం లేదా? చెప్పు రోహినీ. ఏమిటి ఆలొచిస్తున్నావు?"

"ఆస్తి, డబ్బూ...ఇవన్నీ ఒక విషయమే కాదు. కానీ, నన్ను ముద్దుగా పెంచి పెద్ద చేసిన అన్నయ్యలనూ, నాన్ననూ వదిలేసి రావాలే! అది తలచుకుంటేనే హృదయాన్ని కోస్తున్నట్టు ఉంది. నా కోసమే మా నాన్న రెండో పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయారు"

"బాధపడకు...ఒక సంవత్సరంలో మనవుడినో, మనవరాలినో కని ఇచ్చేసే మంటే వాళ్ళ కోపమంతా కనబడకుండా పోతుంది. నిన్ను ఆదరిస్తారు. ఇది అన్ని చోట్లా జరిగేదే కదా" అన్నాడు.

ఆలొచించింది రోహిని.

'హరికృష్ణను పెళ్ళి చేసుకోవటానికి నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇతన్ని మరిచిపోయి ఇంకొకతనితో జీవించటం నా వల్ల కాదు. ఇప్పుడు పెళ్ళి చేసుకోవటం వలన...డబ్బుకొసమే ఇతను నన్ను ప్రేమించేడనే అని అనుకుంటున్న నాన్నా, అన్నయ్యల ఆలొచన తప్పని నిరూపించవచ్చు. హరికృష్ణ చెప్పినట్టు పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళ మనసు మారితే మంచిదే కదా?' అనే నిర్ణయానికి వచ్చింది.

"సరే నండి...మనం ఎప్పుడు పెళ్ళి పెట్టుకుందాం?" అన్న రోహినిని ఎత్తుకుని గిరగిరా తిప్పాలని ఆమె దగ్గరకు వచ్చాడు. వద్దని వారించింది రోహిని.

ఆ మరుసటి బుధవారం మంచి ముహూర్తంలో శివుడి గుడిలో రోహిని మెడలో తాలి కట్టాడు హరికృష్ణ. కొత్త మంగళసూత్రంతో, పూలమాల వాసన పోయేలోపు ఆమె అతన్ని తన ఇంటికి తీసుకు  వచ్చింది.

                                                                                                      Continued...PART-7

***********************************************************************************************