ప్రేమ కలలు (సీరియల్-PART-6)
ఆమెకు ఇద్దరు అన్నయ్యలు మాత్రమే! ఆ ఇంటికి
ఒకే ఒక ఆడ వారసురాలు రోహినియే అయినందువలన, తల్లి
కూడా లేనందు వలన రోహినిని చాలా గారాబంగా పెంచారు. ఆమె కొద్దిగా నలుపు. దాంతో పాటూ
ఆమె పళ్ళు కూడా కొంచం ఎత్తుగా ఉంటాయి. తాను అందంగా లేనే నన్న నిరాశ ఆమెకు ఎప్పుడూ
ఉండేది.
అన్నయ్యలు నరసింహం,
జగన్నాదం ఆమెను అరచేతిలో ఉంచి చూసుకుంటారు.
"నాన్నా. చెల్లికి ఒక మంచి వరుడ్ని
చూసుంచాను. మన అంతస్తుకు సరితూగకపోయినా మంచి కుటుంబం. వాళ్ళు మూడు 'కెమికల్ ఫ్యాక్టరీ' లు నడుపుతున్నారు. అబ్బాయి
ఎం.బి.ఏ చదువుకున్నాడు. ఏమంటారు?"
"అబ్బాయి బాగా
చదువుకోనుండాలి. దాని కంటే ముఖ్యం కుటుంబ అంతస్తు. మన అంతస్తుకు కొంచం కూడా తక్కువ
ఉండ కూడదు. చెప్పాలంటే మనకంటే కొంచం ఎక్కువ అంతస్తు ఉంటే మంచిది"
“ఏమిటి నాన్నా ఇలా
చెబుతున్నారు. మన అంతస్తు కంటే ఎక్కువ అంతస్తు కలిగిన వాళ్ళు మన కులంలో చాలా
తక్కువ మందే ఉన్నారు"
"అయితే ఏమిటి?
ఉన్న కుటుంబాలలోనే చూడు. నా కూతురు కాపురం చేసే చోట మహారాణిలాగా
ఉండాలి. అర్ధమయ్యిందా?" అన్నారు.
ఆ తరువాత ఒకరిద్దర్ని చూశారు. కానీ,
వాళ్ళెవరికీ రోహిని నచ్చ లేదు. మనసు విరిగి పోయింది రోహినికి.
"నాన్నా...నాకు పెళ్ళే వద్దు...ఇక
వరుడ్ని చూడకండి"
"ఎందుకరా బంగారం అంత మాట
చెబుతున్నావు?".
"వచ్చిన
పెళ్ళికొడుకులందరూ నన్ను చూసేసి 'నల్లగా ఉన్నది. అమ్మాయి
బాగుండలేదు’ అని చెప్పి వెళుతున్నారు. నాకు చాలా అవమానంగా
ఉంది. ప్లీజ్...అర్ధం చేసుకోండి" అంటూ ఏడ్చింది.
కొడుకులిద్దరినీ ఒంటరిగా పిలిచారు బాపిరాజు
గారు.
"ఇలా చూడండిరా. మన రోహిని మనసు
కష్టపడితే నేను తట్టుకోలేను అనేది మీకు తెలుసు. అందుకని నా లక్ష్యాన్ని కొంచం
తగ్గించుకుందామని చూస్తున్నాను. మన అంతస్తుకు తక్కువ అంతస్తు వాళ్ళైనా పరవాలేదు.
కానీ, బాగా చదువుకున్న వాడిని చూడండి.
కావాలంటే అతన్ని మనం ఇంట్లోనే ఇల్లరికపు అల్లుడుగా ఉంచుకుందాం" అన్నారు.
మళ్ళీ వరుడ్ల కోసం వేట మొదలైయ్యింది.
ఆ సమయంలోనే హరికృష్ణ మా ఫ్యాక్టరీలో
ఉద్యోగానికి చేరేడు. ఆరడుగుల ఎత్తు. మంచి రంగు. అతన్ని చూసిన వెంటనే సున్నితమైన రోహిని
మనసు సంచలనం చెందింది. పొద్దు పోవాలని ఎప్పుడైనా ఆఫీసుకు వచ్చే రోహిని,
ఇప్పుడు రోజూ ఆఫీసుకు వెళ్ళటం మొదలుపెట్టింది. అతను రోహినిని చూసే విధం
వ్యత్యాసంగా ఉండేది.
హరికృష్ణను తలచుకుని పరితపించింది. 'అతని అందానికి ముందు తాను ఏ మాత్రం?' అనే ఇన్
ఫీరియారిటీ మనోభావం ఆమెను చుట్టేసింది. ఒక రోజు 'ఫ్యాక్టరీ'
లో ఉన్న చెట్టు కింద వేసున్న బెంచి మీద కూర్చుని పక్షులను
గమనిస్తోంది. ఆమె దగ్గరగా ఆమెకు వినబడనంతటి నెమ్మదిగా వచ్చి నిలబడ్డాడు హరికృష్ణ.
“ఏం మ్యాడం...పక్షులను
ఆరాధిస్తున్నారా?"
అతను తిన్నగా తనతో మాట్లాడేటప్పటికి ఆమె
మొహం సిగ్గుతో ఎర్ర బడింది.
"అయ్యయ్యో...నేను రావటం మీకు ఇష్టం
లేకపోతే వెళ్ళిపోతాను మ్యాడం. దానికోసం మీరు కోపగించుకోకూడదు. అని చెప్పి
జరగటానికి రెడీ అయిన అతన్ని ఆమె స్వరం ఆపింది.
"లేదు...నాకు కోపం లేదు. మీరు
కూర్చోండి. కావాలంటే నెనే వెళ్ళిపోతాను"
"భలేవారే మీరు...నేను మీతో
మాట్లాడాలనే ఇక్కడికి వచ్చాను. మీరేమిటి...వెళ్ళిపోతామంటున్నారు?"
"నిజంగా నన్ను
చూడటానికా వచ్చారు?"
"మరి...? మిమ్మల్ని నాకు బాగా నచ్చుతుంది. అందుకే రెండు మాటలు మాట్లాడి వెడదాం
అనుకుని వచ్చాను"
ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపించింది రోహినికి.
"నిజంగానా...నేనంటే మీకు అంత ఇష్టమా?
మిమ్మల్ని ఇష్టపడటానికి వెయ్యి మంది వస్తారే? మంచి
రంగు, అందం...వాళ్ళతో మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది. నా దగ్గర
ఏం మాట్లాడబోతారు?"
" రోహినీ
గారు...మీరు కొంచం నలుపు...అంతే కదా! అదొక లోటా?
మీ అందం నాకు నచ్చింది. అంతకంటే మీ మనసు నాకు బాగా బాగా
నచ్చింది"
"ఏం చెబుతున్నారు?"
"మీరు బాగా డబ్బు గల
ఇంటికి చెందిన అమ్మాయి అయినా, ఇంత సింపుల్ గా
ఉన్నారే...అదొక్కటే చాలే! ఇంకా నా మనసు అర్ధం కాలేదా? లేక
తెలుసుకునే నటిస్తున్నారా?"
అతని మాటలు మత్తు
ఎక్కించగా...కరిగిపోయింది.
"కృష్ణ గారు...నిజంగా చెబుతున్నారా?
మీరు నన్ను...?
"ఎస్... రోహినీ. ఇప్పుడైనా అర్ధం
చేసుకున్నావే! 'ఐ.లవ్.యు’ నీకు నేను నచ్చానా?" అన్నడు చెవి దగ్గరగా.
కళ్ళు తిరిగిన ఆమె అతని చేతులు
పుచ్చుకుంది. ఆకాశమే దొరికినట్టు అనిపించింది. 'అందమైన యువకుడు ఆశ పడి నన్ను ప్రేమిస్తున్నాడు’ అని
మళ్ళీ మళ్ళీ చెప్పుకుంది.
వాళ్ళ ప్రేమ రోజు రోజుకూ పెరుగుతోంది.
ఆ రోజు రోహిని అన్నయ్య నరసింహం పెళ్ళి
చూపులకు ఏర్పాటు చేశాడు. అదే తన ప్రేమను
చెప్పటానికి మంచి తరుణం అని నిర్ణయించుకుంది రోహిని.
"నాన్నా...ఇకమీదట ఎవర్నీ పెళ్ళి
చూపులకు రమ్మని చెప్పకండి"
"ఏమ్మా...వాళ్ళు నీ మనసును
నొప్పించరు. నేను చూసుకుంటాను"
"అది కాదు
నాన్నా...అదొచ్చి...అదొచ్చి...”
"ఏం రోహినీ,
నీకు ఎవరైనా నచ్చారా? అలా ఉంటే
చెప్పమ్మా" అన్నాడు అన్నయ్య నరసింహం.
"అవునన్నయ్యా...నేను ఒకర్ని మనసారా
ఇష్టపడుతున్నాను. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నారు. కానీ...కానీ..."
"ఏమిటి కానీ...?"
"ఆయన మనంత డబ్బుగలవారు
కాదు. అదే నాకు భయంగా ఉన్నది"
“ఎవరని చెప్పు...మంచి
చోటైతే మేమే సంబంధం ఖాయం చేస్తాం. దైర్యంగా చెప్పు" అన్నాడు ఇంకో అన్నయ్య జగన్నాదం.
“అన్నయ్యా అదొచ్చి...మన
ఫ్యాక్టరీలో మేనేజర్ గా ఉన్నారే హరికృష్ణ...ఆయన్నే ఇష్టపడుతున్నాను."
తుఫాన దాటిన భూమిలాగా ఆ చోటంతా
నిశ్శబ్ధంగా మారింది. నాన్నే మొదట నోరు తెరిచారు.
"మీ ఇద్దరికీ ఎన్ని రోజులుగా పరిచయం?"
"ఇప్పుడే...ఒక నెల రోజులుగా"
“రోహినీ తల్లీ...అతను
మంచివాడు కాదు. అతన్ని మర్చిపో. మన
ఆస్తిని గురిగా పెట్టుకునే అతను నిన్ను
ఇష్టపడుతున్నాడు. అర్ధం చేసుకోరా ప్లీజ్" అన్నాడు తండ్రి బుజ్జగింపు దోరణిలో.
అది విన్న వెంటనే కోపం ముంచుకు వచ్చింది రోహినికి.
"ఎందుకలా చెబుతున్నారో నాకు తెలుసు.
నేను అందంగా లేను. ఆయన అందంగా ఉన్నారు. 'ఎలారా
ఈ నల్లదాన్ని ఇష్టపడుతున్నాడు’ అని మీకు సందేహం...కరెక్టే
కదా? ఆయన ఇష్టపడేది నా మనసునే గానీ మన డబ్బును కాదు"
" రోహినీ...నాన్న
చెప్పేది నిజమేనమ్మా. అతనికి ఎక్కువ డబ్బు ఆశ ఉన్నదని అతని మాటలతోనే గ్రహించాను.
అతని మీద కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. వాడు పధకం వేసుకునే నీకు చేరువ
అయ్యాడు. నువ్వు చాలా ఎక్కువగా చదువుకున్నా నీకు లోక జ్ఞానం చాలదమ్మా. నాన్న
చెప్పేది విను. అతన్ని మరిచిపో" అన్నాడు జగన్నాదం.
"కుదరనే కుదరదన్నయ్యా...నేను లేకపోతే
ఆయన తల్లడిల్లి పోతారు. అంత లోతుగా నా మీద ఇష్టం పెట్టుకున్నారు"
"అలాగంటే మేము నీమీద ఎక్కువ ఇష్టం
పెట్టుకోలేదా? ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పెంచిన వాళ్లం. తల్లి లేని కొరత
తెలియకుండా నాన్న నీమీద ప్రేమ కురిపించారే? అలాంటిది నిన్న
వచ్చిన అతను మాకంటే ఎక్కువైపోయాడా నీకు?"----అడిగాడు నరసింహం.
"మీది రక్త సంబంధం. అందువలన నా మీద
ప్రేమ చూపించారు. ఆయన నాకు కొంచం కూడా సంబంధం లేని వారు. కానీ,
నాపైన ప్రాణమే పెట్టుకున్నారే. దాని పేరే కదా ప్రేమ"
మొట్టమొదటి సారిగా నాన్నకు కోపం వచ్చింది.
"ఏమిటే...అన్నయ్యలు చెబుతూ
వెళుతున్నారు. వాళ్ళను ఎదిరిస్తూ మాట్లాడుతూనే ఉన్నావు! నీ జీవితం ఎలా ఉండాలో నాకు
తెలుసు. మాట్లాడకుండా లోపలకు పో. ఇక ఆ హరికృష్ణను చూసేవంటే నాకు పిచ్చి కోపం
వస్తుంది. ప్రేమట ప్రేమ. అంతా వేషం. నేను చూసే వరుడ్నే నువ్వు పెళ్ళి చేసుకోవాలి.
అర్ధమయ్యిందా?" అని చెప్పి
వెళ్ళిపోయారు.
కొంచంసేపు మౌనంగా ఉన్న రోహినికి ఒక ఆలొచన
వచ్చింది. ఫోను చేసి హరికృష్ణను వెంటనే పార్కుకు రమ్మంది. తరువాతి అరగంటలో అతను
అక్కడున్నాడు. ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చెప్పింది.
చెప్పి ముగించిన తరువాత అతన్ని చూసింది.
కళ్ళల్లో నీరు పొంగుకు వచ్చింది.
"మీ ఇంట్లో వాళ్ళు చెప్పింది కరెక్టే
రోహినీ. నాలాంటి పేదవాళ్ళందరూ ప్రేమించకూడదు. ఒకవేల ప్రేమించినా వాళ్ళ అంతస్తుకు
తగిన వాళ్ళనే ప్రేమించాలి. ఏం చేయగలం...ప్రేమ ఏమన్నా రంగునూ,
డబ్బునూ చూసి వస్తోందా...?"
"మీరు ఏం చెబుతున్నారు?"
"ఏది ఏమైనా నువ్వు
డబ్బున్న ఇంటి పిల్లవి. ఏదో టైమ్ పాస్ కోసం నన్ను ప్రేమించావు? నేనే దాన్ని తప్పుగా అర్ధం చేసుకుని కలలు కంటూ గడిపేసేను. తప్పు నా మీదే రోహినీ. మీ నాన్న చెప్పిన
అబ్బాయినే పెళ్ళిచేసుకో. నాకు గొడవ ఉండదు" అని చెప్పి వెళ్ళబోయిన అతని
చేతులను గట్టిగా పుచ్చుకుంది రోహిని.
"ఎందుకండీ...ఇలా మాట్లాడుతున్నారు?
నన్ను చూస్తే టైమ్ పాస్ కోసం ప్రేమించే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా?
మీరు నన్ను అలాగే అర్ధం చేసుకున్నారా? ఏదైనా
దారి చెబుతారని మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే...మీరు ఏదేదో మాట్లాడుతున్నారు"
"నువ్వు నిజంగానే నన్ను
ప్రేమిస్తున్నావా? నాకోసం ఏదైనా చేస్తావా?
చెప్పు రోహినీ...చేస్తావా?"
"ఖచ్చితంగా చేస్తాను.
ఏం చేయాలి...చెప్పండి..."
"నీ ఆస్తి,
అంతస్తూ అన్నీ వదులుకుని రావటానికి రెడియా?"
"కృష్ణా...మీరు...?"
'అవును రోహినీ...మనం పెళ్ళి
చేసుకుందాం. పూల మాలతో, పెళ్ళి బట్టలతో వాళ్ళ కాళ్ళ మీద
పడదాం. 'ఓకే' అంటే చాలా మంచిది. లేదంటే
నువ్వేమీ బాధపడకు. నాకు చదువుంది. ఎక్కడికి వెళ్ళినా నిన్ను కాపాడే శక్తి నా దగ్గరుంది...చెప్పు...నన్ను
పెళ్ళి చేసుకుంటావా?"
సమాధానం చెప్పకుండా నిలబడింది రోహిని. ఆమె
మనసులో పలురకాల ఆలొచనలు.
"చూసావా...ఆలొచిస్తున్నావు. నీకు నా
మీద నమ్మకం లేదా? చెప్పు రోహినీ. ఏమిటి
ఆలొచిస్తున్నావు?"
"ఆస్తి, డబ్బూ...ఇవన్నీ ఒక విషయమే కాదు. కానీ, నన్ను
ముద్దుగా పెంచి పెద్ద చేసిన అన్నయ్యలనూ, నాన్ననూ వదిలేసి
రావాలే! అది తలచుకుంటేనే హృదయాన్ని కోస్తున్నట్టు ఉంది. నా కోసమే మా నాన్న రెండో
పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయారు"
"బాధపడకు...ఒక సంవత్సరంలో మనవుడినో,
మనవరాలినో కని ఇచ్చేసే మంటే వాళ్ళ కోపమంతా కనబడకుండా పోతుంది.
నిన్ను ఆదరిస్తారు. ఇది అన్ని చోట్లా జరిగేదే కదా" అన్నాడు.
ఆలొచించింది రోహిని.
'హరికృష్ణను పెళ్ళి
చేసుకోవటానికి నాన్న ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇతన్ని మరిచిపోయి ఇంకొకతనితో జీవించటం
నా వల్ల కాదు. ఇప్పుడు పెళ్ళి చేసుకోవటం వలన...డబ్బుకొసమే ఇతను నన్ను ప్రేమించేడనే
అని అనుకుంటున్న నాన్నా, అన్నయ్యల ఆలొచన తప్పని
నిరూపించవచ్చు. హరికృష్ణ చెప్పినట్టు పిల్లలు పుట్టిన తరువాత వాళ్ళ మనసు మారితే
మంచిదే కదా?' అనే నిర్ణయానికి వచ్చింది.
"సరే నండి...మనం ఎప్పుడు పెళ్ళి
పెట్టుకుందాం?" అన్న రోహినిని
ఎత్తుకుని గిరగిరా తిప్పాలని ఆమె దగ్గరకు వచ్చాడు. వద్దని వారించింది రోహిని.
ఆ మరుసటి బుధవారం మంచి ముహూర్తంలో శివుడి
గుడిలో రోహిని మెడలో తాలి కట్టాడు హరికృష్ణ. కొత్త మంగళసూత్రంతో,
పూలమాల వాసన పోయేలోపు ఆమె అతన్ని తన ఇంటికి తీసుకు వచ్చింది.
Continued...PART-7
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి