దైవరహస్యం(నవల)....PART-4
విశాలపురం గ్రామంలో ఆ రోజు మొదలైన వర్షం నాలుగు రోజులైనా ఆగలేదు. కారణం బండివాడు పడేసిన తిష్టాదేవి విగ్రహం, చెత్తకుప్పపై కూర్చున్నట్టు పడింది. ఉరంతా వరద. చాలా ఇళ్ళు నీట మునిగినై. భయంతో ఊరి ప్రజలందరూ వణికి పోయారు. వర్షం ఆగట్లేదు.
అశొక వర్మకు అనుమానమొచ్చింది. వెంటనే ఆ తిష్టాదేవి విగ్రహాని పడేసిన చెత్త కుండి దగ్గరకు పరిగెత్తాడు....అతని అనుమానం నిజమైంది. తిష్టాదేవి విగ్రహం చెత్త కుండిలో కూర్చొనున్న స్థితిలో ఉన్నది. విగ్రహం సగానికిపైగా నీరు చేరింది. అశొక వర్మ ఆ విగ్రహాన్ని తీసి నీటిలో పడుకోబెట్టాడు. విగ్రహం నీటిలో పూర్తిగా మునిగిపోయింది. వర్షం ఆగింది. ఆ సంఘటనను ఊరంతా వేడుకగా చూసింది…..ఆశ్చర్యపడింది.
"ఆ దేవి విగ్రహాన్ని మనం ఎత్తుకు వెళ్ళీ పారేసాము కదా. కోపం వచ్చి వర్షం కురిసింది. అది నీళ్ళల్లో మునగటంతో వర్షం ఆగింది. దీని అధారంగా మనకి ఒక నిజం అర్ధమవుతోంది. ఈ దేవత విగ్రహం బయట ఉంటే వర్షం కురుస్తుంది. లోపల ఉంటే వర్షం ఆగుతుంది"
ఊర్లో ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుకున్నారు. ఆ మాటలన్నీ అశోక వర్మ-శేషమాంబ చెవులకు కూడా చేరినై.
'వాళ్ళ వల్లే ఈ సమస్య!' అంటూ మాటలు మొదలయ్యాయి. కానీ, అశోక వర్మ-శేషమాంబ ఆత్మానంద శ్వామీజీని కలిసినప్పుడు ఆయన వేరే విధంగా చెప్పారు.
“జనాభా సంఖ్య, జాతుల సంఖ్య తక్కువగా ఉన్న కాలంలో తిష్టాదేవిని మొదటగా పూజించేవారుట. ఈ విగ్రహాన్ని ఈ ఊరిలో ఎవరు ప్రతిష్టించారో ఎవరికీ తెలియదు. పురాణాలలో కూడా ఈ పేరు ఎవరూ వినలేదుట. ఆ ఊరి ప్రజలకు తిష్టాదేవి ఎవరో కాదు ఒక విధంగా లక్ష్మీదేవి యొక్క సహోదరి. ఈమెను భక్తి శ్రద్దలతో, కాలుష్యం లేని మనసుతో పూజించాలట. ఏ ఇల్లు శుభ్రంగా, భక్తిగానూ, సత్య ధర్మాలతోను ఉంటుందో ఆ ఇంట్లోకి జొరబడదు. దానికి విరుద్దంగా ఏ ఇల్లు సుచి, శుబ్రత, భక్తి లేకుండా అధర్మమం, అసత్యం, అంటుతో ఉంటుందో అక్కడ మొదట చొరబడుతుంది. ఈమె చొరబడితే ఆ ఇల్లు కష్టాలతో నిండిపోతుంది…అంటే వారిని దండించి, శిక్ష వేస్తుంది...తద్వారా వాళ్ళు సత్య ధర్మ బాటలోకి వస్తారు.
మంచి విషయాన్ని ప్రేమగా చెప్పి ఆచారంలో పెట్టడం ఒక విధం. అదే మంచి విషయాన్ని కఠినంగా చెప్పి ఆచారంలో పెట్టడం ఇంకో విధం. తిష్టాదేవి కఠినమైన దేవత. ఈమె ఉండే ఊరులో అన్నీ శుభ్రంగానూ, సుచిగానూ ఉండాలి. అలా జరగని పక్షంలోనే మాత్రమే ఇలా జరుగుతుంది.
సమస్య నీ దగ్గరలేదు. ఊరిలోనే ఉంది! ఎందుకంటే ప్రజలలో చాలా శాతం అవినీతికి బానిస అయ్యారు!
ఊరిని బాగుచేయలేము అని మీరు అనుకుంటే...ఈ విగ్రహాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళి ఇంతకు ముందు ఆ విగ్రహం ఉన్న చోటునే పూడ్చిపెట్టేయండి...." అన్నారు.
అశోక వర్మకు కూడా అదే మంచిదనిపించింది!
********************************
ప్రభుత్వ ఆసుపత్రి!
భర్త చనిపోయారనే విషయం కూడా తెలియని పరిస్థితిలో 'కొమా' లో ఉన్నది మీనాక్షి….ప్రాణం ఉన్నప్పుడే...మరణించటం అంటే ఇదే.
తల్లిని చూడటానికి వచ్చిన తులసి కళ్లు నీరసంగా ఉన్నాయి. అక్కడ ఒంటరిగా కుర్చున్న డాక్టర్ను కలిసింది.
"డాక్టర్..."
"రామ్మా...కూర్చో"
"అమ్మ గురించి..."
"చెబుతానమ్మా...మీ అమ్మ వొంట్లో ఏ సమస్యా లేదు. కానీ, తలమీద దెబ్బతగలటం వలన మెదడు దెబ్బతిన్నది. అందుకే 'కోమా' లోకి వెళ్ళిపోయింది.”
"దీన్ని గుణపరచవచ్చుగా?"
"దీనికి ఒక డాక్టరుగా సమాధానం చెప్పటం కంటే...మనిషిగా చెప్పటమే కరెక్ట్. అలా చూస్తే...యాబై శాతమే అవకాశం. చ్చికిత్స ఫలం ఇచ్చి అది అరవై, డెబ్బై, ఎనభై అని పెరుగుతూ వెడితే ఖచ్చితంగా మీ అమ్మగారు 'కోమా' నుండి బయటపడతారు. లేకపోతే...కండిషన్ తలకిందలుగా మారే అవకాశం ఉంది"
"మీ ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగుంటే ఏం చేస్తారు?"
"నేను పోరాడుతాను! ఎందుకు చెబుతున్నానంటే...ఈమె చనిపోవాలని విధి ఉంటే మీ నాన్నగారిలాగా అప్పుడే చచ్చిపోయుండచ్చు కదా? ఎప్పుడు ప్రాణం పోలేదో...అప్పుడే ఈమె జీవించాలనేదే భగవంతుని ఇష్టంగా ఉండొచ్చు"
---డాక్టర్ యొక్క ఆ యధార్ధమైన సమాధానం తులసికి నచ్చింది. మనసులోని భారం తగ్గింది.
"అయితే...అమ్మకు ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్! మీ నమ్మకం, నా ప్రార్ధన ఆమెకు సహాయపడనివ్వండి"
"ఖచ్చితంగా జరుగుతుంది! నమ్మకం ఉంచు. కానీ..."
"ఏమిటి డాక్టర్?"
"కొంచం ఖర్చౌతుందమ్మా..."
"ఎంత అవుతుంది డాక్టర్?"
"ఈమె కోసమే ప్రత్యేకంగా ఒక 'నర్స్’ ను పెట్టాలి. ఆ నర్సు ‘రొటీన్ బాడీ యాక్టివిటీస్’ ను గమనిస్తూ ఉంటుంది. ఇది కాకుండా మెదడుకు 'స్పేషల్ న్యూరో సర్జన్’ డాక్టర్ ను పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కొన్ని సందర్భాలలో ఫారిన్ నుండి మందులు తెప్పించాల్సిన అవసరం వస్తుంది"
"అంటే వేలల్లో కాకుండా లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పండి"
"అవునమ్మా..."
"ఎన్ని లక్షలు అవుతాయ్ డాక్టర్?"
“ఖచ్చితంగా చెప్పలేను. ఆరు నెలల లోపు మీ అమ్మ కోలుకుంటే నాలుగైదు లక్షలు. అదే సంవత్సరాల తరబడి అయితే ...పది పదిహేను లక్షల వరకు అవుతుంది..."
డాక్టర్ చెప్పలేక చెప్పలేక చెప్పాడు.
చాలా సేపు మౌనంగా ఉన్నది తులసి.
"నువ్వు ఆలొచించి రేపుకూడా చెప్పమ్మా..." అన్నాడు డాక్టర్.
"ఒకవేల అంత డబ్బు ఖర్చు చేయలేనంటే?"
"నీ వల్ల కాదని చెబితే ఏం చేయగలం. ఇప్పుడిస్తున్న ట్రీట్మెంటును కూడా ఆపాల్సిందే! పల్స్ కొంచం కొంచంగా తగ్గి మూడు రోజుల్లో మీ అమ్మ ప్రాణం విడిపోతుంది."-----నిదానమైన గొంతుతో చెప్పాడు.
తులసికి, ఆమె ప్రాణం కూడా కలిసి వెళ్ళిపోతున్నట్లు అనిపించి నొప్పితొ బాధపడ్డది.
"నో డాక్టర్...?"
కళ్ళల్లోనుండి నీరు ఉబికి వస్తోంది.
"అప్పుడైతే ఖర్చుకు దారి ఏమిటని చూడటం మంచిది..."
డాక్టర్ ఖచ్చితంగా చెప్పేటప్పటికి, మౌనంగా లేచింది.
"ప్లీజ్ డాక్టర్...అమ్మకు ఇస్తున్న 'ట్రీట్మెంట్' 'కంటిన్యూ' చేయండి. నాకు అమ్మ కావాలి. నాన్న పోవటమే నేను తట్టుకోలేకపోతున్నా, అమ్మ కూడా పోతే...నేను బ్రతికి ఉండటంలో అర్ధం లేదు డాక్టర్"
"ఆవేశపడకమ్మా! ఇంటికి వెళ్ళి మీ బంధువులతో కలిసి మాట్లాడు. తరువాత ఒక నిర్ణయానికి రా"
------తులసి మౌనంగా బయలుదేరింది.
బస్సు దిగి ఊర్లోకి వెడుతున్న తులసిని కొంతమంది జాలిగా చూశారు. తాము మమూలుగా కూర్చునే చోటులోనే కూర్చున్న క్రిష్ణారావు, కోటేశ్వరరావు ఆమె దగ్గరకు వెళ్ళి "అమ్మా తులసీ...ఆసుపత్రికి వెళ్ళొస్తున్నావా?" అని మొదలుపెట్టారు.
"అవును అంకుల్!"
"ఇంటికి వెళ్ళాము. ఎవరూ లేరు. మీ పెద్దనాన్న కొడుకు రమేషూ, మీ పెద్దనాన్న మాత్రం ఉన్నారు"
"మామయ్య, అత్తయ్య, పిన్ని, చిన్నాన్న అందరూ ఉండాలే...?"
"ఈ రోజుల్లో ఎవరమ్మా చావు ఇంట్లో పది రోజులూ ఉంటున్నారు...? శ్మశానం నుండి వచ్చిన వెంటనే స్నానంచేసేసి తర్వాతి బస్సు పుచ్చుకుని వెళ్ళిపోతున్నారు!"
"అవును...అమ్మ విషయంలో డాక్టర్ ఏం చెప్పాడు?" అడిగాడు కోటేశ్వరరావు.
"ఇప్పుడే ఏమీ చెప్పలేము అన్నాడు అంకుల్! కానీ, అమ్మకి పూర్తిగా గుణమవుతుందని నమ్ముతున్నాను..."
"నమ్మాలి...నమ్మకమే జీవితం! కానీ, లక్షలలో ఖర్చు అవుతుందేమ్మా?"
"అవును అంకుల్...డబ్బుకు ఏర్పాటు చేయాలి"
"నీకేమమ్మా...నీ దగ్గర ఆ మూడెకరాల స్థలం ఉందికదమ్మా! అది అమ్మితే పది, పదిహేను లక్షలు వస్తాయే?"
క్రిష్ణారావు మెల్లగా తులసి ఆలొచనలను కెలికాడు.
తులసికి కొంచం 'గుబేల్’ మన్నది.
ఏమీ మాట్లాడకుండా నడుస్తున్నది.
ఇంటికి చేరుకున్నప్పుడు వాళ్ళు చెప్పినట్లే పెద్దనాన్న, రమేష్ మాత్రమే ఉన్నారు.
"పెద్దనాన్నా....ఏమిటి ఎవరూ కనబడటంలేదు?"
"అందరూ ఊర్లకు వెళ్ళిపోయారమ్మా...నీకు ఫోన్ చేసి మాట్లాడతామన్నారు"
"ఎందుకు అంత అవసరం పెద్దనాన్నా?"
“ఏమిటమ్మా అలా ఆడిగావు ...! మీ అమ్మ వైద్యం కోసం నువ్వు డబ్బులు గిబ్బులు అడిగితే...?"
---పెద్దనాన్న చెప్పినప్పుడు చివుక్కు మన్నది తులసి మనసు.
తులసి కళ్ల నుండి కన్నీరు ధారగా వచ్చింది.
"ఏడవకు తులసీ...మనసు దృడం చేసుకో! అమ్మ విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నావు?" అడిగింది తులసి పెద్దమ్మ.
"ఏం నిర్ణయం తీసుకోగలం పెద్దమ్మా...? ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుకోవటమే..."
"ఏదో కాళ్ళలోనో...చేతుల్లోనో గాయాలంటే నువ్వు చెప్పేది కరెక్టే. ఇది 'కోమా'! చివరి వరకు మీ అమ్మ కళ్ళు తెరవకుండా వెళ్ళిపోతే?"
మనసును పిండేస్తున్నట్టు గుండెల్లో నోప్పి పుట్టింది తులసికి.
"నువు ఏం చెప్పదలుచుకున్నావ్ పెద్దమ్మా?"
"వదిలేయ్...! నాన్నతో కలిసి అమ్మ కూడా వెళ్ళిపోనీ. ఇల్లు సొంత ఇల్లు. ఇది కాకుండా మూడు ఎకరాల స్థలం ఉన్నది. నువ్వూ ఉద్యోగం చేస్తున్నావ్. సంపాదిస్తున్నావు కాబట్టి మంచి సంబంధం వస్తుంది. భర్త...పిల్లలు అని హ్యాపీగా జీవితం గడుపు"
పెద్దమ్మని అదొలా చూసింది తులసి.
"ఏం తులసి...నేను చెప్పింది నీకు నచ్చలేదా?"
"అవును పెద్దమ్మా!"
"కొన్ని లక్షలు ఖర్చుపెట్టి...అది వేస్ట్ అయిపోతే ఏంచేస్తావమ్మా?"
"పోతే పోయినై పెద్దమ్మా!"
"సరె...డబ్బుకు ఏం చేస్తావ్?"
"అది నా సమస్య పెద్దమ్మా"
"నువ్వు మాట్లాడటం చూస్తే...అన్నీ నేను చూసుకుంటాను అన్నట్లుందే"
"అవును...అదే అంటున్నాను! మా అమ్మను చంపమని చెప్పే ఎవరూ నాకు అక్కర్లేదు"
"చంపమని ఎవరు చెప్పారు. సగం చచ్చిన మనిషిని భాదలు పెట్టకుండా పూర్తిగా చనిపోనివ్వు అంటున్నాను...నేను నీ మంచికే కదా చెబుతా...."
“కానీ, నా మనసు దాన్ని అలా చూడటం లేదు...చూడనూ లేను"
"సరేనమ్మా....ఇక నీ ఇష్టం! రమేష్ బయలుదేరుదాం. సాయంత్రం బస్సును పట్టుకుంటే ప్రొద్దున కోడి కూసే వేలకు ఇంటికి వెళ్ళిపోవచ్చు"
- మరో అరగంట తరువాత వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోయారు.
తులసి ఒంటరిదైపోయింది! గోడ మీద అమ్మ, నాన్నల ఫోటోలు. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి ఆమె అంచలంచెలుగా ఎదుగుతున్నప్పుడు తీసిన ఫోటోలు.
ఫోటోలను చూస్తూ ఉంటే తులసికి గుండె పగిలేలా అనిపించింది.
ప్రపంచంలో ఎవరికీ ఇలాంటి దుస్థితి రాకూడదు!
వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడు వాకిలి గుమ్మంలో ఒక రూపం.
తలపైకెత్తి చూసింది.
సింహాద్రి--మొహంలో ఒకవిధమైన నవ్వు.
"రావచ్చా?"
"రండి..."
లోపలకు వచ్చాడు సింహాద్రి. చేతిలో పూలమాల. దాన్ని పరమేశ్వర్ గారి ఫోటోకు వేశాడు.
తరువాత...నడుందగ్గర దాచుకున్న 500 రూపాయల నోట్ల కట్లలో మూడింటిని తీశాడు. మొత్తం ఒకటిన్నర లక్ష.
"ఏమిటిది?"
"డబ్బులమ్మా...ఇవి తీసుకు వెళ్ళి అమ్మ ట్రీట్మెంట్ ఖర్చులకు కట్టమ్మా"
"నాకు డబ్బులివ్వటానికి మీరు ఎవరు?"
“ఏంటమ్మా అలా అడిగావు...? ఇవి నీ డబ్బులేనమ్మా! నేను ఆసుపత్రిలోనే చెప్పానే...మీ నాన్న రెండురోజుల క్రితం 'అగ్రీమెంట్' వేశారని"
"నేను దాన్ని నమ్మలేకపోతున్నా..."
"ఈ 'అగ్రీమెంట్ పేపర్’ చూడమ్మా"
---తీసి చూపించాడు.
దాంట్లో తెలిసిన సంతకం...తులసిని కట్టిపడేసింది.
"ఏం చెప్పాలో తెలియటం లేదు సార్"
"ఒక విధంగా ఇది నీకు మంచే కదమ్మా! బంధువులందరూ పారిపోయిన స్థితిలో నీకు, మీ ఆమ్మను కాపాడుకోవటానికి డబ్బు కావాలి. నేను ఇవ్వబోయే పదిహేను లక్షలు...ఆమెను కాపాడితే సంతొషమే కదమ్మా?"
సింహాద్రి పాయింట్ పెట్టి మాట్లాడేటప్పటికి...తులసి సమాధానం చెప్పలేకపోయింది. మౌనంగా సింహాద్రి ఇచ్చిన డబ్బును తీసుకుంది.
"మిగిలిన డబ్బును వచ్చే శుక్రవారం డాక్యూమెంట్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తానమ్మా. ప్రొద్దున పదకుండు గంటలకు మంచి టైము. సంతకం పెట్టటానికి వచ్చేయ్. నేను కారు పంపిస్తాను. వచ్చేటప్పుడు మరిచిపోకుండా స్థలానికి సంబందించిన ఒరిజినల్ డాక్యూమెంట్స్ అన్నీ తీసుకు వచ్చాయి"
చెప్పేసి విజయవంతమైన నవ్వుతో వెళ్ళిపోయాడు సింహాద్రి.
డబ్బును చేతిలో పెట్టుకుని ఏం మాట్లాడాలో తెలియక అలాగే కూర్చుండిపోయింది తులసి.
*****************************************************************************
తిష్టాదేవి విగ్రహాన్ని చూడటానికి వచ్చారు ఆత్మానంద శ్వామీజీ. ఆయనతోపాటు ఆయన ముఖ్య శిశ్యుడు సర్వానంద శ్వామి కూడా వచ్చారు. వరద నీరు తగ్గి పడుకోబెట్టినట్టు పడిపోయిన విగ్రహం కనబడింది. దూరం నుంచే కర్పూరం వెలిగించి తిష్టాదేవి విగ్రహానికి నీరాజనం చూపి కళ్లకు అద్దుకున్నారు. అప్పుడే ఆ విగ్రహం చుట్టూ ఉన్న నీటిలో ఒక పక్కగా చేపలు చచ్చిపోయి తెలుతున్నాయి.
శ్వామీజితో పాటు వచ్చిన కొందరు "శ్వామీజీ! ఈ విగ్రహం పడున్న నీటిలో జీవిస్తున్న చేపలు కూడా చచ్చిపోయినై చూడండి. ఈ విగ్రహాన్ని వెంటనే ఎక్కడైనా దూరంగా తీసుకువెళ్ళి ఎవరూ లేనిచోట పడేద్దాం" అన్నారు.
శ్వామీజీ వచ్చి విగ్రహాన్నీ చూస్తున్నారని తెలుసుకున్న అశోక వర్మ, శేషమాంబ దంపతులు విగ్రహం ఉన్నచోటుకు వచ్చారు.
"శ్వామీ..."
“రా అశోక వర్మ...అమ్మవారిని చూసి దన్నం పెట్టుకో"
"దన్నం పెట్టుకోమని చెబుతున్నారా స్వామి?"
"మరి...ఈమెను నిష్టతో నిజాయితీగా ప్రార్ధిస్తే కోట్లు ఇస్తుంది. చెడు ఆలొచనలతో వస్తే రోడ్డు మీదకు తీసుకు వస్తుంది"
'మీరు చెప్పినట్లు ఇది ఈ ఊరి సమస్య...ఉరిని బాగుచేయడానికి నేను ఎవర్ని స్వామి"
"అయితే నీ స్థలానికి తీసుకువెళ్ళి గుడి కట్టు"
“గుడి కట్టటమా...భయంగా ఉంది శ్వామిజీ! చూడండి ఈ చేపలు ఏం పాపం చేశాయి"
"పిచ్చివాడిలా మాట్లాడకు...! చేపలు చనిపోవడానికి కారణం వేరు"
"ఏమిటా కారణం స్వామీ?"
"చెవి చూపించు చెబుతా"
అశోక వర్మ గారి చెవిలో శ్వామీజీ ఏదో చెప్పారు. అశోక వర్మ ముఖంలో వెలుగు. దాని తరువాత ఏమీ మాట్లాడలేదు. "శ్వామీజీ! పంచాయితిలో తీర్పు తీసుకుని...నా స్థలంలోకి తీసుకు వెళ్ళి గుడి కడతాను. ఈ దేవతను ఖచ్చితంగా నిష్టతో పూజిస్తాను..."
శ్వామీజీతో వచ్చిన ఆయన ముఖ్య శిశ్యుడు సర్వానంద శ్వామీజీకి ఆశ్చర్యం.
ఆత్మానంద శ్వామీజీ అటు తిరగగానే...అశోక వర్మ దగ్గరకు వెళ్ళి "శ్వామీజి మీ చెవిలో ఏం చెప్పారు"
"అది దైవ రహస్యం. బయటకు చెబితే దైవ ద్రోహం"
సర్వానంద శ్వామిజీకి మరింత ఆశ్చర్యం!
***********************************************
రాత్రి సమయం...
వర్షం వచ్చేలాగా ఉన్నది.
మెల్లగా లేచి నిలబడ్డ తులసి...తెరిచున్న కిటికీ తలుపులను ముసేసి వచ్చింది.
ముఖద్వారం తలుపులు కూడా వేసేసి గడియ పెట్టొచ్చి తన పరుపు మీద వాలిపోయింది. ప్రొద్దున్నుంచి ఏమీ తినలేదు. తినాలని అనిపించలేదు. మనసు భారంగా ఉన్నప్పుడు తినడానికి మనసెలా వస్తుంది?
మంచం ఎదురుకుండా ఉన్న గోడకు తండ్రి ఫోటో వేలాడుతోంది. ఆ ఫోటో కుడి ఎడమలకు ఊగుతోంది. 'బలమైన గాలికి ఫోటోలు ఊగటం సహజమే!' అనుకుని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
కానీ, తలుపులన్నీ మూసేసిన తరువాత కూడా ఫోటో ఊగటం...దాని శబ్ధం వినపడటం...ఆమెకు ఆశ్చర్యంగా ఉన్నది. లేచి వెళ్ళి చేతులతో ఊగుతున్న ఆ ఫోటోను ఆపింది.
నిశ్శబ్ధం!
తిరిగి వచ్చి పరుపుమీద కూర్చుంది.
తిరిగి ఫోటో ఊగటం మొదలయ్యింది.
'నాన్నా...!' మనసులోనే భయంతొ కూడిన ఒక పెద్ద గొంతు అమెలో మోగింది.
ఎదురుగా ఉన్న ఈజీ చైర్ చిన్నగా ఊగి--ఆగింది.
"అయ్యో...నాన్నా...నువ్వేనా వచ్చింది. ఏమిటి నాన్నా ఇలా చేశావు! మమ్మల్ని ఇలా ఒంటరి చేసి వెళ్లిపోయావు" అని ఆ ఈజీ చైర్లో ఆయన ఉన్నట్లుగానే భావించి ఏడుస్తూ మాట్లాడింది.
ఆ మరు క్షణం "అమ్మా తల్లీ..." అనే మాటలు గాలిలో నుండి వినబడింది.
“నాన్నా..."
"జరిగింది ప్రమాదం కాదమ్మా..."
"అయ్యో... నాన్నా!"
"ప్లాండ్ మర్డర్..."
"నిజంగానా?"
"ఆ సింహాద్రి ఒక హంతకుడు..."
"ఇప్పుడొచ్చి డబ్బులిచ్చి వెళ్ళాడే అతనా...?"
"వాడేనమ్మా...వాడి దగ్గర జాగ్రత్తగా ఉండు!”
---చెవిలో వినబడ్డ అశరీరవాణి తులసిని తారుమారు చేసింది.
ఆ తరువాత పెద్ద నిశ్శబ్ధం. అంతవరకు తులసి చెవులకు వినబడిన అశరీరవాణి...నిజంగానే నాన్నదేనా? లేక....భ్రమా? అనే ప్రశ్న ఆమెలో తలెత్తింది.
లేచి హాలులోని లైటును వేసింది.
స్నానం చేసినట్లు చెమటలు పట్టినై.
మెల్లగా వేనక్కి తిరిగి...గోడపై వేలాడుతున్న పరమేశ్వర్ గారి ఫోటోను చూసింది. ఆ ఫోటో ఇప్పుడు ఊగటంలేదు.
“ఒకవేల భ్రమేనేమో?”....మనసులో బలంగా ప్రశ్న లేచింది.
'చావు పడిన ఇంట్లో మొదటి పదిరోజులకు ఇలాంటి సంభవాలు జరుగుతాయనే బంధువులు తోడుగా ఉండటం, నిత్య కర్మలు జరపటం చేస్తారు...ఇవన్నీ చనిపోయిన వారి ఆత్మ అక్కడ తిరగకూడదనే కారణం కోసమే' అని పరమేశ్వర్ గారు ఎప్పుడో చెప్పింది అప్పుడు గుర్తుకు వచ్చింది తులసికి.
వీధిలో ఒక వృద్దురాలు చచ్చిపోయింది. ఒకపక్క బంధుమిత్రుల ఏడుపు గోష...మరో పక్క డప్పుల మోత. చెవులు చిల్లులు పడుతున్నాయి. ఒర్చుకోలేక పరమేశ్వర్ గారి దగ్గర 'ఇదంతా ఏమిటి నాన్న అడవి మనుషులలాగా?'అని ఆయన దగ్గర అడిగినప్పుడు అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానమే ఇది.
చనిపోయిన మనిషి యొక్క ఆత్మ ఆ ఇంటిని చుట్టి చుట్టి వస్తుంది అని చెప్పిన విషయం మాత్రం తులసి మనసులో పదిలమయ్యింది.
ఇప్పుడది ఆమె మనసులో ముందుంది. ‘దాని ప్రకారం చూస్తే...నా చెవికి వినబడ్డ అశరీరవాణి నాన్నదే’ నని ఆమె మనసు నమ్మటం మొదలెట్టింది.
ఇప్పుడు తను ఒంటరిగా ఉండటం, తన ఆలొచనలను ఒక్కరితో కూడా చెప్పుకోలేని శోకం అమె గెండెను ఒత్తిడికి గురిచేసింది.
'పెద్దమ్మ దగ్గర, రమేష్ దగ్గర అంత కఠినంగా మాట్లాడి ఉండకూడదేమో?' అని మనసులో అనిపించినప్పుడు వాకిలి గుమ్మం తలుపులు కొడుతున్న శబ్ధం.
"ఎవరో వచ్చారు...ఎవరై ఉంటారు?" అన్న ప్రశ్నతో వెళ్ళి తలుపు తెరిచింది.
బయట భుజాలకు లెదర్ బ్యాగు తగిలించుకున్న ఒక యువకుడు. వాకిటి లైటును వేసినప్పుడు అతని ముఖం తెలిసింది.
"విజయ్...నువ్వా?"
"నేనే! అవును తులసీ...నువ్వు ఒక్కదానివే ఉన్నావా? ఎవరూ కనబడటం లేదే?"
"లోపలకు రా...మాట్లాడుకుందాం. ఇప్పుడే, అయ్యో ఒక్కదాన్నే ఉన్నానే! నని అనుకున్నా. మంచికాలం...నువ్వు వచ్చాసావు" అని తిరిగి నడుస్తూ మాట్లాడింది.
అతనూ ఆమె వెనుకే నడిచాడు.
హాలులో ఉన్న టెబుల్ పైన తన బ్యాగును ఉంచాడు. వెనక్కి తిరిగి...గొడమీద కనబడుతున్న పరమేశ్వర్ గారి ఫోటోను చూశాడు. ఫోటో దగ్గరగా వెళ్ళి కళ్ళార్పకుండా ఫోటో వంకే చూశాడు. అతని రెండు కళ్ళూ కన్నీటి బొట్లను దొర్లించడం మొదలుపెట్టాయి. అది తులసికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నది.
విజయ్ ఆమె అత్త కొడుకు!
అత్తయ్య ప్రేమ పెళ్ళి చేసుకుంది.
అత్తయ్యను పరమేశ్వర్ కుటుంబం వెలివేసింది. ఎప్పుడైనా...ఫంక్షన్లలో చూసినప్పుడు, చూసుకోవటంతో సరి. అప్పుడు కూడా మాటలు ఉండవు. కానీ, విధి వసాత్తు అత్త కొడుకు విజయ్, పరమేశ్వర్ గారు ప్రొఫస్సర్ గా ఉన్న కాలేజీలోనే, ఆయన క్లాసులోనే విధ్యార్ధిగా చదువుకోవటం వింత.
అప్పుడు కూడా 'మామయ్యా' అని తన బందుత్వాన్ని చూపించుకోకుండా కఠినంగానే ఉండిపోయారు పరమేశ్వర్ గారు. విజయ్ కు కాలేజీలోనే బెస్ట్ స్టూడెంట్ అవార్దు వచ్చినప్పుడు దానికి కారణం ప్రొఫసర్ పరమేశ్వర్ గారే అని చెప్పిన తరువాతే ఆయనకు విజయ్ పైన అభిమానం, ప్రేమ ఏర్పడటం మొదలయ్యింది.
ఒకరోజు విజయ్ ను ఇంటికి పిలిచి...విజయ్ ఎవరనే నిజాన్ని భార్య మీనాక్షి, కూతురు తులసి ముందు బద్దలుకొట్టాడు. ఆ తరువాతే వాళ్ళకూ తెలిసింది. కానీ, విజయ్ తల్లిని కలుసుకోవటానికి...మాట్లాడటానికీ అయన రెడీగా లేడు. విజయ్ కు మంచి ఉద్యోగం దొరికింది. కలకత్తాలోని ఒక పెద్ద కంపెనీలో చేరాడు. అతనే ఇప్పుడు వచ్చింది.
కన్నీళ్ళను తుడుచుకుని వెనక్కి తిరిగి తులసిని చూసాడు. సన్నని గొంతుకతో...
"మామయ్య చావుకు మా ఇంట్లో నుండి ఎవరైనా వచ్చారా తులసీ?"
"లేదు విజయ్! ఒకవేల వచ్చున్నా నాకు వాళ్ళేవరూ తెలియదే. మీ ఇంట్లో వాళ్లని నేను చూసిందేలేదు...అందువల్ల గుర్తు పట్టుండను. అమ్మ ఆసుపత్రిలో ఉండటంతో...నాకు చెప్పటానికి కూడా ఎవరూ లేరు"
"పోనీలే....నేనొచ్చాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు"
"ధాంక్స్ విజయ్…అవును నాన్న చావు గురించి నీకు ఎలా తెలిసింది...నువ్వుండేది కలకత్తాలో కదా?"
"నిజమే తులసీ....ఇప్పుడు టైము ఎంత?" అడిగేసి 'హాలులో' ఉన్న గోడ గడియారాం వైపు చూసాడు. దాంట్లో టైము...పదకుండున్నర దాటుతోంది.
"ఈ రోజు ప్రొద్దున పదకుండు గంటలకు నేను 'డ్యూటీ' లో ఉన్నాను. ముందు రోజు రాత్రి నాకు సరిగ్గా నిద్ర లేదు. తెల్లవారుజాము నాలుగు గంటలవరకు 'కంప్యూటర్’ తో పోరాడవలసి వచ్చింది. అందువలన డ్యూటీలోనే అ పదకుండు గంటలకు అలసిపోయి నిద్రలోకి జారుకున్నాను. ఒక పది నిమిషాలే కళ్ళు మూసుకున్నాను. అంతలో ఒక కల...మీ నాన్న, అమ్మ ఒక కారులో వెడుతున్నట్లు గానూ; అది ప్రమాదంలో చిక్కుకున్నట్లుగానూ!
భయంతో కదిలినప్పుడు మెలుకువ వచ్చింది. అప్పుడే అమ్మ దగ్గర నుండి 'ఫోన్’ వచ్చింది. నిజంగానే కారు ప్రమాదంలో మామయ్య, అత్తయ్య చనిపోయేరని! నేను నమ్మలేక పోయాను. ఒక్క నిమిషం అలాగే స్థంభించి కూర్చుండిపోయాను. అమ్మ ఫోనులోనే ఏడుస్తోంది. మీ ఇంటికి వెళ్ళకూడదని నా తండ్రి నా తల్లికి ఆజ్ఞ వేశారుట. దాన్ని కాదని నేను వెళ్ళలేనని చెప్పి ఏడ్చింది మా అమ్మ. "ఏడవకమ్మా! నేను వెల్తాను” అని చెప్పి వెంటనే 'లీవు’ పెట్టి, ఒక టాక్సి పుచ్చుకుని బయలుదేరి వచ్చాను తులసీ..."
--విజయ్ చెప్పిన విషయాలు...తులసికి భయబ్రాంతులు కలిగించాయి.
"విజయ్...నాన్న చనిపోయింది కారు ప్రమాదంలోనే! నీకు అదేలాగా కల వచ్చింది. ఇది నిజంగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఎలా...? ఇక్కడ ఐదు నిమిషాలకు ముందు నాకు కొన్ని అమానుష అనుభవాలు ఎదురైయ్యాయి. నాన్నగారు ఈ రుములో అదిగో ఆ ఈజీ చైర్లో కూర్చుని ఎలా నన్ను చూసి మాట్లాడేవారో...అదేలాగా మాట్లాడారు......జరిగింది ప్రమాదం కాదమ్మా...హత్య అని చెప్పారు! దీన్ని భ్రమ అని చెప్పనా...లేకనిజమేనా? నాకంతా గజిబిజిగా ఉన్నది. అయ్యో! ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్పి వాళ్ళ అభిప్రాయం అడుగుదామనుకుంటే ఎవరూ లేరే అని బాధపడుతున్నప్పుడే నువ్వొచ్చి తలుపు తట్టావు..."
చమట కారుతున్న ముఖంతో తులసి చెప్పిన విషయం విన్న విజయ్ ముఖంలో ఏన్నో మార్పులు.
"ఏమిటి విజయ్...ఎందుకు నీ మొహం అదొలాగా మారింది"
"తులసీ...నేను కారులో వచ్చేటప్పుడు నాకు తెలియకుండానే నిద్రపోయాను. అప్పుడు కూడా కలలో నీ తండ్రి వచ్చారు. నువ్వు చెప్పావే 'హత్య’ అని...అదే నాతో కూడా చెప్పారు..."
విజయ్ చెప్పిన మరు క్షణం...తులసి కళ్ళార్పటం ఆగిపోయింది. చూపులు రెండు గుచ్చుకున్నాయి.
ఖచ్చితంగా అదే క్షణంలో గోడకు వెలాడుతున్న ఫోటో చలనంతో ఊగిసలాడింది!
ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు.
'సందేహించకండి...నేనే; నేనే' అని చెబుతున్నట్లుంది ఆ ఫోటో ఊగిసలాట.
"విజయ్..."
"తులసీ...అది మామయ్యే!"
"దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను విజయ్. నాన్నను హత్య చేసి, అమ్మను కోమాలో పడుకోబెట్టిన అతన్ని ఇప్పుడే నా చేతులతో చంపేయాలనుంది..."
-- తులసి ఆవేశపడింది.
"అదెవరు...అతని పేరు ఏమిటి?"
"సింహాద్రి...మాకని ఉన్న మూడు ఎకరాల స్థలం కోసం నాన్నను హత్య చేసేంత వరకు వెళ్ళాడు"
"హత్య వరకు అంటే...నాన్నగారు, అతనికి స్థలం ఇవ్వనని చెప్పేసారా....లేక, మొసం చేసి రాయించుకుందామనుకున్నాడా?"
“నాన్న స్థలం అమ్మను అనే చెప్పుండాలి. ఎందుకంటే...అది మన కుటుంబ స్థలం. వంసపారంపర్య ఆస్థి. కంచె వేసి...లోపలకు ఏదీ జొరబడకుండా బద్రత చేసి చూసుకుంటూ వచ్చారు. ఏదైన తోటలు వేద్దామని అడిగితే, 'లేదమ్మా...అక్కడ ఏమీ చేయకూడదు. ఆ స్థలం అలా ఉంటేనే మనకు మంచిది’ అంటారు. ‘ఎందుకని’ అని అడిగితే 'అవన్నీ మీకేందుకు?' అన్నారు"
"అంటే ఆ స్థలం వెనుక ఏదో రహస్యం ఉంది. అదే సింహాద్రి చేత యాక్సిడెంట్ పేరొతో హత్య వరకు చేయించింది"
"బాగా అలొచిస్తే అలాగే ఉంది. జరిగింది హత్య అని చెబితే...నాన్నగారు ఆ రహస్యాలను విడమరిచి చెబితేనే మనం ఈ విషయంలో ముందడుగు వేయగలం. ఏదైనా చేయగలం"
తులసి ఆలొచన కరెక్టే. దానికి ఆమోదం తెలిపే విధంగా పరమేశ్వర్ గారి టేబులు మీదున్న పెన్ను ఎవరొ కావాలని తోసినటు క్రింద పడి దొర్లుకుంటూ విజయ్ కాళ్ళ దగ్గరకు వచ్చి ఆగింది.
"తులసీ...ఇది?"
“నాన్నగారి ఫేవరేట్ పెన్ను"
“ఇది ఇప్పుడు నా కాళ్ళ దగ్గరకు వచ్చింది అంటే...దీన్ని తీసుకోమంటున్నారు. ఆయన మన అన్ని ప్రశ్నలకు సమాధానమివ్వటానికి రెడిగా ఉన్నారు అన్నట్లు ఉంది..."
"నాకూ అలాగే అనిపిస్తోంది….'కమాన్’ విజయ్..."
--తులసియే వొంగుని పెన్ను తీసి విజయ్ కి ఇచ్చింది.
అతనూ దాన్ని తీసుకుని రాయడానికి రెడి అన్నట్లు పెట్టుకుని...టేబుల్ ముందు కూర్చుని ఒక నోటు పుస్తకాన్ని తెరిచి పెట్టుకున్నాడు.
Continued in part-5

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి