21, మే 2019, మంగళవారం

దైవరహస్యం(నవల)....PART-5


దైవరహస్యం(నవల)....PART-5

అశోక వర్మ ఆయన కుటుంబ స్థలంలో తిష్టాదేవికి గుడి కట్టబోతున్నారని ఆ ఊరి ప్రజలకు తెలిసింది. ఆ గుడి కట్టటానికి ఆత్మానంద శ్వామీజీ కూడా ఒక కారణం అని ఆ ఊరి ప్రజలందరూ నమ్మారు. కొందరికి భయం వేసింది. కొందరికి గందరగోళంగా ఉంది.

'తిష్టాదేవిని ఎక్కడా....ఎవరూ దేవతగా కొలవనప్పుడు మనం మాత్రం గుడి కట్టి దేవతగా కొలవాలనుకోవడం సరికాదు’ అని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. చివరిగా...'ఊర్లో గుడికట్టకూడదు. ఊరి బయట ఎక్కడైనా కట్టుకోండి’ అని ఉరి పెద్దలందరూ నిర్ణయించుకుని డప్పు చాటింపు వేయించారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా అశోక వర్మ కు తెలుపడానికి ఒక ఊరిపెద్దను తిన్నగా వాళ్ళింటికే పంపారు.

ఆ ఊరి పెద్ద అశోక వర్మ ఇంటికి వచ్చాడు. "వద్దు అశోక వర్మ...ఆత్మానంద శ్వామీజీ చెప్పారు కదా అని తిష్టాదేవికి నీ స్థలంలో గుడి కాట్టాలనుకోవడం సరి అనిపించడం లేదు. దానికి బదులు ఆత్మానంద శ్వామీజీకే ఆ విగ్రహాన్ని ఇచ్చి...ఆయన్నే పూజలు చేయమని చెప్పవచ్చుగా?" అని అడిగాడు.

విషయం  ఆత్మానంద శ్వామీజీ కి తెలిసింది. ఆయన కోపంతో.......

"పిచ్చోళ్ళారా….నాకని ఒక దారి ఏర్పరచుకుని, ఆ దారిలో నేను వెడుతున్నాను. నేను ఒక శివ భక్తుడ్ని. ఆ శివుడిని తప్ప ఇంకెవరినీ కొలవను. అలాగని మిగిలిన దేవతలను కొలవద్దని నేననడం లేదు.

కళాశాల పుస్తకాల్లో ఎన్నో పాఠాలు ఉంటాయి. ఒక్కో విధ్యార్ధికి ఒక పాఠం ఇష్టంగా ఉంటుంది. ఆ విద్యార్ధి ఆ ఇష్టమైన పాఠాన్నే ఇష్టంగా చదువుతాడు. దీనికి అర్ధం మిగిలిన పాఠాలు చదవరని కాదు….ఇక్కడ తిష్టాదేవి అనేది కూడా ఒక పాఠం. కానీ కష్టమైన పాఠం. ఈ దేవత మాత్రం మనం శుభ్రంగా, నిజాయితీగా ఉంటేనే మనకు అనుగ్రహం ఇస్తుంది. అలా ఉండలేము అని అనుకోవటం వలనే తిష్టాదేవికి మన ఊర్లో గుడి కట్టటానికి వ్యతిరేకం ఎక్కువగా ఉన్నది.
ఎప్పుడు ఆమెను కొలవడానికి భయపడటం మొదలుపెట్టారో...అప్పుడే ఆ విగ్రహాన్ని తిరిగి పూడ్చిపెట్టేయటమే కరెక్ట్” అని తీర్మానించుకుని అశోక వర్మ ని పిలిచి "గుడి కట్టొద్దు...విగ్రహాన్ని పూడ్చిపెట్టేయ్" అని చెప్పి పంపించారు.

అందరూ ఉండగా అశొక వర్మతో అలా చెప్పిన ఆత్మానంద శ్వామీజీ, అశోక వర్మను ఒంటరిగా పిలిచి చెవిలో ఏదో చెప్పారు. ఆ తరువాత అశోక వర్మ ముఖంలో సంతోషం, ఆనందం వెళ్ళివిరిసింది.

ఈసారికూడా ఆత్మానంద శ్వామీజీ ముఖ్య శిశ్యుడు సర్వానంద శ్వామిజి అశొకవర్మ ను  పిలిచి "శ్వామీజీ ఏం చెప్పారు?" అని అడిగాడు.

"అది దైవ రహస్యం...తెలుసుకోవాలనుకుంటే శ్వామీజీనే అడగండి" అని అశొకవర్మ చెప్పటంతో సర్వానంద శ్వామిజికి లోలోనా కోపం వచ్చింది.
                                      ************************************
టేబుల్ ముందు విజయ్.

గోడ గడియారంలో క్షణాలు చూపించే ముల్లు శబ్ధం తప్ప ఇంకెటువంటి శబ్ధమూ లేని అర్ధరాత్రి పొద్దు.

తులసి విజయ్ నే చూస్తోంది. అతని చేతిలో రాయడానికి రెడీగా ఉన్న పెన్ను.

"విజయ్... ఇప్పుడు ఈ పెన్నును నీ మూలం ఉపయోగించి, మన ప్రశ్నలకు నాన్న సమాధానం ఇస్తారా?"

"అలాగే అనుకుంటున్నా తులసి. ఇదంతా నీకు, నాకు కొత్త అనుభవమేగా?"

"ఖచ్చితంగా...! బయట ఎవరికి చెప్పినా ఎవరూ నమ్మరు"

"ఎందుకు చెప్పాలి తులసి...? ఇది మన అవస్త. మనకోసం చూపించే దారి! ఎంత ప్రేమ ఉంటే మీ నాన్న చనిపోయి ఆత్మ రూపంలో ఉన్నా కూడా వచ్చి మనకు దారి చూపిస్తారు చెప్పు..."

"నిజమే...! నాన్న గారి ప్రేమకు సరిసమంగా తూగే ఇంకొకటి ఈలోకంలోనే లేదు"

చెబుతున్నప్పుడే దుఃఖం పొంగుకువచ్చింది. ఆ క్షణం విజయ్ లో కూడా ఒక మార్పు. అతని శరీరంలోకి ఎవరో జొరబడినట్లు ఒక అలజడి.

అతని చేతిలోని పెన్ను వేగంగా రాయడం మొదలుపెట్టింది.

'నా ప్రియమైన తులసి...విజయ్!'…….

నా రాకను ఎదురు చూసి భయపడకుండా పేన్ను తీసుకుని రెడీగా కూర్చున్న మీకు అభినందనలు. 'చావు తరువాత ఒక మనిషి ఊపిరి ఏమవుతోంది?' అనే ప్రశ్న నాకూ ఉంది. దానికి చాలా సమాధానాలు చదివేను. ఎవరూ ఖచ్చితమైన సమాధనం చెప్పలేదు. ఒకవేల చెప్పినా ...అది సరైన సమాధానమని చచ్చిపోయిన తరువాత గాని ఒకరు అవగాహన చేసుకోలేరు?

నా అభిమాన పిల్లల్లారా…

ఇప్పడు నేను మనసులో లోతైన నిర్ణయాలకు వచ్చాను...మనమైనా ఆ సమాధానాన్ని తెలుసుకుని ఈ ప్రపంచానికి తెలియచేద్దాం.  ఎదురుచూడని ప్రమాదం వలన నేను కోరిక తీరని ఆత్మలాగా అవటంతో ఆ సమాధానం  దొరికే సంధర్బం దొరికింది.

శరీరంలేని పరిస్థితిలో ఆలొచనలను రేడియో లాగా వరుసక్రమంలో పెట్టుకుని అందులోనుండి మాట్లాడటం, రాయడం నాకే కొత్తగా ఉంది.

నేను ఉన్నానా...లేదా అనే విషయంలోనే నాకు స్పష్టత లేదు. తేలుతున్నట్టు, ఎగురుతున్నట్టు ఉన్నది. ఇలా చెప్పటం కూడా తప్పేమో! నా పరిస్థితిని చెప్పటానికి ఏ భాషలోనూ మాటలు లేవు. నేను మాట్లాడేదంతా కూడా తప్పేమో....

అందుకనే కాబోలు మన పెద్దవాళ్ళు ‘చూసినవాడు చెప్పడు...చెప్పేవాడు చూసుండడు’ అని చెప్పారు.

ఈ సమయంలో నా ఆత్మ గురించిన వివరణ అంత ముఖ్యం కాదు. జరిగిపోయిన ప్రమాదం అనే హత్య గురించి, దానికి గల కారణాల గురించి చెప్పాలి.

నా వంశపారంపర్య ఆస్తి...ఆ మూడేకరాల స్థలమే అన్నిటికీ కారణం. ఆ స్థలం మామూలు స్థలం కాదు...ఆందులో మన వంశపారంపర్య ఆస్తి అయిన ఒక దేముని విగ్రహం దాగుంది. ఆ విగ్రహం మామూలు విగ్రహం కాదు! వెల కట్టలేని లోహాలతో చేసిన తిష్టాదేవి విగ్రహం. ఆ విగ్రహాన్ని గర్భ గుడిలో ఉంచి సక్రమంగా పూజలు చేస్తూ వస్తే అంతా మంచే జరుగుతుంది. అలా జరగకపోతే విపరీతాలు జరుగుతాయి.

తిష్టాదేవి దూరంగా ఉండి ప్రజలను కాపాడే దేవత. ఆమెకు లక్ష్మీదేవి తోడుగా ఉంటుంది. ఆమెను జాగ్రత్తగా సక్రమంగా పూజించాలి. ఆ పూజలో చిన్న తప్పు జరిగినా ఆపదే! అలాంటిదే...తిష్టాదేవి విగ్రహాన్ని మా ముత్తాతల్లో ఒకరైన  అశొక వర్మ  గారు కనుగొన్నప్పుడు జరిగింది. కరువుతో కొంత కాలమూ, వరదతో కొంతకాలమూ ఈ ఊరు కష్టాలలో పడింది. తిష్టాదేవి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ట చేయాలో పురాణాలలో ఉన్నదని చెబుతారు. ఆ పురాణం తెలిసిన వారు ఎవరూ లేరు.

ఈ తిష్టాదేవి విగ్రహం ఎలా ఈ విశాలపురం లోకి వచ్చిందీ...ఎలా మన ముత్తాత ఇంట్లోకి వచ్చిందో తెలియదు. తెలుసుకోవటానికి ఆశపడితే...కొన్ని వందల ఏళ్ళ వంశ చరిత్రలోకి వెళ్ళాలి. మా ముత్తాతలు కూడా ఆ పరిశోధనలోకి వెళ్ళటానికి ఇస్టపడలేదు. విగ్రహాన్ని ఉంచుకుని పూజలు చేయాటానికే ఇష్టపడ్డారు. కానీ భయపడిపోయిన ఊరి ప్రజల ఎదిరింపుతో ఆ విగ్రహాన్ని మూడు ఎకరాల స్థలంలో ఈశాన్య మూలలో పూడ్చిపెట్టారు.
 
ఆ స్థలంలో దైవం ఉన్నది కాబట్టి ఆ స్థలంలో ఎటువంటి అపవిత్రం జరగకూడదు. అలా జరిగితే అది తిష్టాదేవికి ఆగ్రహం తెప్పిస్తుంది. అందుకనే ఆ స్థలంలో తోట కూడా వేయలేదు. తోట వేసేటప్పుడు అక్కడ పనిచేసేవాళ్ళు ఆ స్థలాన్ని అపవిత్రం చేసే అవకాశం ఉందికదా?
కనుకే ఆ స్థలానికి కంచె వేసి కాపాడుకుంటూ వచ్చారు. ఆ స్థలంలో తిష్టాదేవి విగ్రహం పూడ్చిపెట్టబడి ఉన్నదనే విషయం మా వంశస్తులకు మాత్రమే తెలుసు.  కానీ ఆ విగ్రహం వెల కట్టలేని లోహాలతో చేసినదని ఎవరికీ తెలియదు. ఆ లోహాలకు ఎంత శక్తి ఉన్నదో కూడా ఎవరికీ తెలియదు. కానీ, ఆ విగ్రహాన్ని సుచి, శుభ్రతతో సక్రమంగా పూజిస్తే ఆ ఉరికి మేలు జరగటంతో పాటూ శుభిక్షంగా ఉంటుంది.

విగ్రహాన్ని ఎలా పూజించాలో తెలియకపోవటమే ఆ విగ్రహం పూడ్చుకుపోవటానికి కారణం. విగ్రహం వలన లాభాలు ఏమిటో ఆలశ్యంగా ఆత్మానంద శ్వామీజీ గారి డైరీని చదివిన ఆయన ముఖ్య శిశ్యుడైన సర్వానంద శ్వామీజీ తెలుసుకున్నాడు. ఆయన తనకు తెలిసిన వివరాలను ఎక్కడ రాశాడో, ఎక్కడ బద్ర పరిచి ఉంచాడో తెలియదు. దాన్ని ఎలాగో తెలుసుకున్నాడు ఇప్పుడున్న జీవానంద శ్వామీజీ. ఆ రోజుల్లో శ్వామీజీలు నిజాయితీతో ఉండేవారు. ఈ రోజుల్లో కొందరు శ్వామీజీలు నకిలీ శ్వామీజీలుగా మారిపోయారు. జీవానంద శ్వామీజీ నకిలీ కోవకు చెందిన వాడు....నేను హత్య గావించబడి ఆత్మగా తిరగటానికి కారణం కూడా అతనే. అతనే సింహాద్రి ని  ప్రోశ్చాహించి స్థలాన్ని కొనడానికి ప్రయత్నించాడు.   

ఈ రోజు ఈ విగ్రహం ఖరీదు వెయ్యి కోట్లు. అంత ఖరీదైన, పూజింపబడాల్సిన విగ్రహం పూడ్చి పెట్టే ఉంచడం వలన...దాని కారణంగా మన కుటుంబ వంశీకులు కష్టాలే అనుభవించారు.... అంతా ఉరి ప్రజల కోసమే.  మా అమ్మా, నాన్నా మామూలుగా చనిపోలేదు.  బస్సు ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు ఆ విగ్రహం విషయం ఒక మానవ మృగానికి తెలిసింది. ఆ విగ్రహాన్ని తీసి విదేశాలకు అమ్మి అటు ప్రపంచ ప్రజలకు, ఇటు మన ప్రజలకు నష్టం వాటిల్ల జేస్తారు...దాన్నీ మనం ఆపాలి . అదే మానవ మృగం నన్ను హత్యచేసింది. ఇక ఆ తప్పు జరగకూడదు.
విజయ్...నువ్వు నా సహోదరి కొడుకువి. తులసికి వరుస అవుతావు. నా కూతుర్ని పెళ్ళిచేసుకో. దాని వలన విడిపోయిన రెండు కుటుంబాలు కలుస్తాయి. మీరిద్దరూ కలిసి మన స్థలానికి వెళ్ళి పూడ్చి పెట్టబడిన ఆ విగ్రహాన్ని తవ్వి తీసి, మన ఊర్లో ఉన్న శివాలయంలోని భావిలో పడేయండి. దీని వలన ఆ బావి నీళ్ళు ఆరొగ్యానికి మందు అవుతుంది. ఆలయంలోని భావి నీటిని అభిషేకానికి మాత్రమే ఉపయోగిస్తారు కనుక విగ్రహం కూడా అభిషేకంలో ఉంటుంది.
అత్యాశ ఉన్న వాళ్ళు విగ్రహాన్ని అపహరించటానికి వచ్చి, దానివలన విపరీతాలు జరిగితే దానికి మనమే భాద్యులం అవుతాము. కనుక...విగ్రహం ఆలయ బావిలో ఉండటమే మంచిది. ఈ రోజు రాత్రికే ఎలాగైనా, ఎంత కష్టం వచ్చినా ఆ పని చేసేయండి. గుడిలోకి మీరు చొరబడటానికి గుడి తలుపులు తెరిచి ఉంటాయి. కాపలాదారును లేపి తలుపులు తెరిచి ఉంచటం నా భాద్యత.
ఈ భాద్యతను మంచిగా చేసి ముగిస్తే...ఏమీ జరగనట్లు ఆ స్థలాన్ని సింహాద్రికి అమ్మేయండి. అతన్ని, అతనికి తోడుగా ఉన్న ఆ శ్వామీజి, క్రిష్ణారావును,కోటేశ్వరరావు నూ నేను చూసుకుంటా.
ఆసుపత్రిలో ఉన్న మీ అమ్మ త్వరలోనే కోలుకుంటుంది. నా ఆత్మ శక్తితో నేను పరలోకానికి చేరుకునే వరకు మీకు తోడుగా ఉండి దారిచూపుతాను. మీరు దేని గురించి ఆలొచించకండి.
ఆశీస్సులతో.
ప్రియమైన నాన్న.
పరమేశ్వర్. 

మాట్లాడవలసినదంతా రాసి పూర్తిచేసిన పరిస్థితిలో రాస్తున్న విజయ్ చెయ్యి హటాత్తుగా ఆగిపోయింది. అతనుకూడా టేబుల్ పైన మొక్కలాగా విరుచుకు పడ్డాడు. అన్నీ కొన్ని క్షణాలే! తరువాత పైకి లేచాడు...రాసినదానిని చదివాడు.

కన్నీళ్ల నిండిన కళ్ళతో తులసి కూడా చదివింది. చదివి వెక్కి వెక్కి ఏడ్చింది. విజయ్...తులసి కన్నీళ్లు తుడిచాడు.

తులసీ! చెడులో ఒక మంచి జరిగినట్లు మీ నాన్న మనతో ఈ ఉత్తరం ద్వారా మాట్లాడారు. ఇది ఎంత పెద్ద విషయమో తెలుసా? ఎవరికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం? 

ధైర్యం తెచ్చుకుని బయలుదేరు. మీ నాన్న చెప్పినట్లు మొదట ఆ విగ్రహాన్ని తీసి భావిలో పడేద్దాం. హత్యకు కారణమైన ఆ సింహాద్రి కే ఆ స్థలాన్ని అమ్మి డబ్బు తీసుకుందాం. అది అతను కట్టబోయే అపరాధము. ఇకపోతే ఆ మనిషిని మీ నాన్న ఎలా దండిచాలో అలా దండిస్తారు..." అన్నాడు విజయ్.

తులసి కూడా మనసులో ధైర్యం తెచ్చుకుని రెడీ అయ్యింది.
Continued in Part-6

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి