పిశాచములు నివసించే మాయా ప్రదేశం...(ఆసక్తి)...04/12/23న ప్రచురణ అవుతుంది

ది ఐకానిక్ టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ ఆఫ్ భూటాన్...(ఆసక్తి)....05/12/23న ప్రచురణ అవుతుంది

ప్రపంచ వ్యాప్తంగా జూదం మూఢనమ్మకాలు-1...(ఆసక్తి)...06/12/23న ప్రచురణ అవుతుంది

త్వరలో

ఇంటింటి వెన్నెలలు(సరికొత్త పూర్తి నవల)... ప్రచురణ అవుతుంది

23, డిసెంబర్ 2020, బుధవారం

వసంతా టీచర్...(కథ)

 

                                                                                   వసంతా టీచర్                                                                                                                                                                                    (కథ)

ఉదయాన్నే టెలిఫోన్ మోగింది. స్నేహితుడు గణేష్.

"ముఖేష్... వసంతా టీచర్ చనిపోయిందట!"

"ఏ...మి...టి...?"

విషయాన్ని జీర్ణించుకోవటానికే  కొంత సమయం పట్టింది.

"ఏం చెబుతున్నావ్ గణేష్...నిజమేనా?"

"అవును! నువ్వు అక్కడే ఉండు. పది నిమిషాలలో 'బైక్' లో వస్తాను. తిన్నగా హాస్పిటల్ కి వెళ్ళిపోదాం!"

ముఖేష్ లేచాడు. మనసు భారంగానూ, నొప్పిగానూ ఉన్నది.

                                         ****************************************************************

వసంతా 'టీచర్ ఒక దేవత!  అందమైన లేత ఎరుపు రంగు ముఖం. ఎప్పుడూ నవ్వుతూ పలుకరించే నవ్వు. అందరికీ సహాయం చేయాలనే స్వభావం. పదొ తరగతిలో లెక్కల పాఠాలు చాలా కష్టంగా ఉండేవి. టీచర్ దగ్గర చాలామంది స్టూడెంట్స్ ట్యూషన్ చదివేరు. ముఖేష్, గణేష్ కూడా వెళ్ళి చేరారు.

కొన్నిరోజుల తరువాత తెలిసిన విషయం కొంచం ఆశ్చర్యపరిచింది. ఆమె దగ్గర ట్యూషన్ చదువుకునే స్టూడెంట్స్ దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకునేది కాదట.

అంతే కాదు, స్కూల్లో చదువుకుంటున్న పెద విధ్యార్ధులకు తన ఖర్చుతో స్కూల్ యూనిఫారం మరియు పుస్తకాలు 'టీచర్ కొనిపెడుతున్నారు అని తెలుసుకున్నప్పుడు మరింత ఆశ్చర్యపోయారు. టీచర్ పైన గౌరవం పెరిగింది.

టీచర్ ఇంట్లో పనులను అడిగి తెలుసుకుని చేసావారు. మార్కెట్ కు వెళ్ళి సరకులు కొని తీసుకురావడం, ఆమె ఇంట్లోని చెట్లకు నీళ్ళు పోయిడం, ఆమె మనసును బాధపెట్టే విషయాలు విని, తెలుసుకుని ఆప్తులలాగా ఆమెకు ఓదార్పు మాటలు చెబుతారు.

వసంతా టీచర్ నేటివ్ ప్లేస్ భీమవరం. పెళ్ళైన రెండేళ్ళకు సురేష్ పుట్టాడు. కొద్ది రోజులలోనే లారీ యాక్సిడెంట్ లో భర్త చనిపోయాడు. ఉద్యోగంకోసం చాలా చోట్లలో ప్రయత్నించి చివరికి రాజమండ్రిలో ఉన్న ప్రసిద్ది చెందిన ప్రైవెట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం దొరికింది.

కొడుకుతో పాటు ఆ ఊరికి వచ్చింది. తోడులేని ఆడది. అందులోనూ అందగత్తె. ఎందరో మగవారు ఆమెకు కష్టాలు ఇచ్చారు. 'సైన్స్ టీచర్ వరహాల రావ్ వసంత మనసును దోచుకున్నాడు.

తిన్నగా వరహాల రావ్ ఇంటికి వెళ్ళి వాళ్ల అమ్మతో మాట్లాడింది వసంతా టీచర్. వసంతా టీచర్ యొక్క వంశపారంపర్య ఆస్తి, నగలు వరహాల రావ్ తల్లి కళ్ళను ఆకట్టుకున్నాయి. వసంతా టీచర్ ను ఉపయోగించుకుని తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్ళి చెయచ్చు అని మనసులోనే లెక్కలు వేసుకుంది.

"నీలాంటి మంచి అమ్మాయి దొరకటం మా వరాహాల రావ్ చేసుకున్న అదృష్టం!" అంటూ ప్రేమగా మాట్లాడింది.

పెళ్ళి జరిగింది. వేరు కాపురం పెట్టారు. కన్న తండ్రి కాదు కాబట్టి వరహాల రావును చూస్తున్నప్పుడల్లా సురేష్ కి కడుపు మండిపోతుంది. ఆయనకు దూరంగా వెళ్ళాడు. తల్లితో మాటిమాటికి పోట్లాట పెట్టుకునేవాడు.

"నా నిర్ణయం తప్పు అనుకుంటా?"అని వసంతా టీచర్ బాధ పడటం మొదలు పెట్టింది. మనశ్శాంతి, నిద్ర దూరమయ్యింది. అయునా కాని, ఒక మగతోడు అవసరం అని నమ్మింది.

ముఖేష్, గణేష్ అప్పుడప్పుడు వసంతా టీచర్ ఇంటికి వెళ్ళి ఆమె బాధలను తెలుసుకుని, ఆవిడకు ధైర్యం చెప్పి వచ్చేవారు.

వసంతా టీచర్ రిటైర్ అయ్యింది. సురేష్, తల్లిని అనరాని మాటలతో తిట్టిపోసేవాడు...కాఫీ గ్లాసు, టిఫిన్, భోజనం ప్లేట్లను ఎగరేసావాడు. ఇంటి బయటకు వెళ్ళి నిలబడి అరుస్తాడు.

తల్లికి వచ్చే పెన్షన్ డబ్బును లాక్కుని, విచ్చలవిడిగా ఖర్చుపెట్టాడు. వాడికి డబ్బు ఇవ్వకూడదని వరహాల రావ్ వసంతని అడ్డుకుంటాడు. మాటమాటా పెరిగి పెద్ద యుద్దానికి దారితీస్తుంది. తలపై చెతులు పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటుంది వసంత.

సంవత్సరాలు గడిచినై! ముఖేష్ 'ఎలక్ట్రానిక్స్ షాప్ పెట్టుకుని వ్యాపారం గమనిస్తూ వచ్చాడు. గణేష్...కరాతే, కుంగ్ ఫూ ట్రైనింగ్ స్కూల్ పెట్టి నడుపుతూ వచ్చాడు. కొన్ని సంవత్సరాలు వసంతా టీచర్ ను మర్చేపొయారు.

పోయిన నెల టీచర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. "వచ్చి నన్ను కలుసుకోగలారా?" అని అడిగింది. మాటలో నీరసం తెలుస్తోంది. కలవరపడి టీచర్ ఇంటికి వెళ్లారు.

సురేష్ ఒక్కో సమయంలో నార్మల్ గా ఉంటాడట. మరో సమయం...పెద్ద పెద్ద అరుపులతో ఇల్లు దద్దరిల్లేటట్టు అరుస్తాడట. వరహాల రావును చూడగానే ఆవేశపడతాడట. తల్లిమీద కూడ విపరీతమైన కోపం వచ్చి అరుస్తాడట. నీచంగా మాట్లాడుతాడట.

'కొడుకు ఇప్పుడున్న పరిస్తితికి కారణం నేనే!' అన్న తలంపు ఆమెను కుంగదీస్తోంది.

"ముఖేష్... గణేష్! నాకు మీరొక సహాయం చెయ్యాలి. అది కొంచం పెద్ద సహాయమే. చేస్తారా?"-- టీచర్ అడగలేక అడిగింది.

"ఎమిటి టీచర్. ఎందుకంత పెద్దమాటలు? మీరు ఊరంతటికీ మంచి చేశారు. మీకు ఒక సహాయం అంటే మేము చెయమా?"

"నాకు డబ్బు సమస్య దేముడు ఇవ్వలేదు. చాలనేటంత పెన్షన్ డబ్బు వస్తొంది. నగలన్నిటినీ భర్త చెల్లి పెళ్ళికి ఇచ్చేశాను. నా కొడుకు పేరుతో కొంచం డబ్బును డిపాజిట్ చేశాను. చేతిలో ఒక లక్ష రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బును మీకివ్వబోతున్నాను"

ముఖేష్, గణేష్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

"ఎందుకు టీచర్?"

"చెప్తాను! నేను ఎక్కువ రోజులు బ్రతకను. భర్త, కొడుకూ ఉన్నా...వాళ్ళిద్దరు నాకు ఏమీ చెయ్యరు. నేను అనాధ శవంగా అల్లాడ దలుచుకోలేదు. మీదగ్గర ఇచ్చే డబ్బుతో నన్ను గౌరవంగా పైలోకాలకు పంపించాలి. చేస్తారా...?”

ముఖేష్ తట్టుకోలేక ఏడ్చాడు. "ఎందుకు టీచర్ అలా చెబుతున్నారు" అన్నాడు.

గణేష్ టీచర్ చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు; "టీచర్ మీకు ఏమీ అవదు. చాలా రోజులు మీరు ఆరొగ్యంగానే ఉంటారు. ఒకవేల ఏదైనా జరిగినా, మీకు పుట్టని పిల్లలగా ఉండి మేమే కార్యాలన్ని జరుపుతాం. మమ్మల్ని నమ్మండి టీచర్!" అన్నారు.

డబ్బు తీసుకోవటానికి అంగీకరించలేదు.

వసంతా టీచర్ ఇద్దరినీ కౌగలించుకుని బోరున ఏడ్చింది.  జీవితం మీద నమ్మకం, జీవించటానికి ధైర్యం వచ్చేటట్లు అమెను సమాధానపరిచారు.

ఇది జరిగి ఒక నెల కూడా అవలేదు.

వసంతా టీచర్ చెప్పినట్లే జరిగింది. ఆసుపత్రి లోపలకు  వెళ్ళినవెంటనే అలవాటుపడిన నర్స్ ఎదురుపడ్డది. వివరాలు చెప్పింది .

"ఆసుపత్రి 'బిల్ ముప్పై వేల రూపాయలు కట్టేసి బాడీ ను తీసుకోవాలి. ఆ వసంతా టీచర్ కొడుకు, భర్త వచ్చున్నారు. ఒకరికొకరు "నువ్వే డబ్బులు కట్టాలి!" అని వాదించుకుంటూ గొడవపడుతున్నారు." అన్నది.

ఆసుపత్రి వరాండాలో వసంతా టీచర్ భర్త వరహాల రావ్ కొపంగా సురేష్ తో మాట్లాడటం వినబడింది.

"నీ పేరు మీద మీ అమ్మ లెక్కలేనంత డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసుంచిందే! ఆసుపత్రి 'బిల్లు నువ్వే కట్టాలి. అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కూడా నువ్వే పెట్టుకోవాలి!" అని గట్టిగా, ఖచ్చితంగా చెప్పాడు వరహాల రావ్.

"అదెలా...మా అమ్మ, మీకొసమూ బొలెడంత డబ్బు ఖర్చుపెట్టింది. మీ చెల్లి పెళ్ళికి బోలడన్ని నగలు ఇచ్చింది. అందుకని మొత్తం ఖర్చూ మీరే చేయాలి!" చెప్పాడు సురేష్.

వాళ్ళ గొడవ విని ఆశ్చర్యపోతూ నిలబడ్డారు ముఖేష్, గణేష్. ఒక దీర్గదర్శిగా ఒక నెల ముందే వసంతా టీచర్ వీళ్ళను పిలిచి, వాళ్ళను గురించి చెప్పింది గుర్తుకు తెచ్చుకున్నారు.

ముఖేష్ తాను తెచ్చిన డబ్బులో నుంచి ఆసుపత్రి బిల్లు కట్టాడు.

మిస్టర్ సురేష్ అండ్ వరహాల్ రావ్! ఆసుపత్రి బిల్లు కాట్టేశాము. వసంతా టీచర్ ను ఇంటికి తీసుకు వెడదాం. ఉరిలో ఉన్న చాలామందికి వసంతా టీచర్ ఉచితంగా ట్యూషన్ చెప్పింది. స్కూల్ ఫీజు కట్టింది. యూనిఫారం కొనిచ్చింది. ఆ మంచి మనసుకు ఏదీ తక్కువ అవకూండా.....ఆమె చివరి ఊరేగుంపు, అంత్యక్రియలు గొప్పగా జరగాలి  

దానికి అయ్యే ఖర్చంతా మాది. ఒక పైసా కూడా మీరు ఇవ్వనవసరం లేదు. గొడవ పడకుండా ప్రశాంతంగా రండి...అది చాలు!"

కన్నీరు తుడుచుకుంటూ " గణేష్ మార్చ్యురీ వ్యానుకు ఏర్పాటు చెయ్యి...మనం అమ్మని తీసుకువెల్దాం!" అన్నాడు.

సురేష్, వరహాల రావ్ వాదనను ఆపి, వాళ్ళనే విస్తుపోయి చూశారు.

*****************************************************సమాప్తం************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి