కఠినమో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కఠినమో లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల)

 

                                                                                      ప్రేమ ఎంత కఠినమో!                                                                                                                                                                    (పూర్తి నవల)

ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” - అనేది ఒక మంచి మంత్రం.

ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎవరు వాడుకోవలొ తెలుసుకోవటమే కష్టం, కఠినం...కానీ తెలుసుకోగలిగితే మ్యూచువల్ బెనిఫిట్ అందుతుంది. అందుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ నవలలో ఈ మంత్రాన్ని ఒక సారి విని మోసపోయిన హీరోయిన్ లత, జీవితంలో ఇక ఈ మంత్రాన్నే వినకూడదని నిర్ణయించుకుంది. కానీ, తన జీవిత ప్రయాణంలో ఈ మంత్రం తనకే ఎంతో అవసరం ఉన్నదని గ్రహించింది. చివరికి ఆ మంత్రాన్ని చెప్పించుకోవటానికీ, చెప్పటానికీ ఏంత కష్టపడిందో, ఎంత కఠినమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందో ఈ నవల చదివి తెలుసుకోండి.

తపస్సు చేస్తున్న ఆ అమ్మవారి పాదాలను తన అలల పూవులతో సముద్ర తల్లి అభిషేకం చేస్తుంటే, ఆకాశ దేవత పౌర్ణమి వెన్నెలను చేతులలోకి తీసుకుని దీపారాజన చూపిస్తుంటే, చుట్టూ ఉన్న పూల చెట్లు తమ సుగంధ వాసనలను వెదజల్లుతుంటే, ఆ సాయంత్ర సమయం అమ్మవారి చిరునవ్వులో ఆ సముద్రతీరమే పుణ్యభూమిలాగా దర్శనమిచ్చింది.

గాంధీ పార్కు ఎదుట కొత్తగా డెవలప్ చేయబడ్డ కాలనీలోకి ప్రవేశించింది లత. నాలుగు సంవత్సరాల క్రితం అక్కడక్కడ చిన్న చిన్న పెంకుటిళ్ళు, గుడిసెలు మాత్రమే ఉన్న ఆ ప్రాంతం పలురెట్లు మారిపోయింది.

'ఈ ఇల్లే' అనే ఒక లెక్కతో 'గేటును తెరిచింది లత. సిట్ ఔట్లొ కూర్చోనున్న కుమారి గేటు శబ్ధం విని తొంగి చూసింది. ఎవరో లోపలకు వస్తున్నది కనబడటంతో దీర్ఘంగా చూసింది. చిరు చీకట్లో వస్తున్నదెవరో గబుక్కున గుర్తుకు రాలేదు. కొద్ది క్షణాల తరువాత లోపలకు వస్తున్న మనిషి ఆకారం, తెలిసిన మనిషిలాగా అనిపించడంతో సందేహంతో......

"మీరు...?" అన్నది.

"ఏమిటి కుమారి! నన్ను మర్చిపోయావా?”

"నువ్వా లతా? నమ్మలేకపోతున్నాను" అన్నది ఉత్సాహంతో.

"నేనే నే" అని నవ్వింది లత.

అంతసేపు కట్ అయిన కరెంటు రావడంతో - కాంతివంతమైన వెలుతురులో కుమారి తన స్నేహితురాలుని బాగా చూడ గలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం చూసిన లతేనా ఈమె? ఈమె జీవితంతో విధి ఇలాగా ఆడుకోవాలి?     

రెండు జడలు, తుంటరి తనం, పరువాల వయసు, వర్ణించలేనంత అందం...ఆమె ఊరిలో ఆమెకు ఫ్యాన్స్ అషోషియేషనే ఉండేది. కానీ, ఇప్పుడు ఆకులు రాలిన, ఎండిపోయిన చెట్టులాగా ఉన్నది. నల్లబడి, బుగ్గలు లోపలకు పోయి, డ్రస్సు సెన్స్ లో పట్టులేక...చూసిన వెంటనే కుమారికి ఆమె పరిస్థితి అర్ధమయ్యింది--కాలం ఈమె గాయాలను గుణపరచ లేకపోయింది. మరచిపోనివ్వనూ లేదు అని!

ఈజీగా మర్చిపోయి, మనసును చల్లార్చుకోగలిగే నష్టమా ఆమెకు జరిగింది?

'హు...' అంటూ పెద్దగా శ్వాశ పీల్చుకుని.

"రా... లతా " అంటూ ఆమె చేతిలో ఉన్న సంచిని తీసుకుంది.

లత ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు అక్కడున్న పెంకుటిల్లు ఇప్పుడు రెండంతస్తుల మేడ ఇల్లుగా మారి ఉన్నది.

"కుమారీ! ఇళ్లు సూపర్ గా ఉన్నదే" అన్నది.

"అన్నయ్య కువైత్ లో ఉన్నాడు కదా. పోయిన సంవత్సరం పాత ఇంటిని పడగొట్టి ఇది కట్టాము"

స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మెట్లు ఎక్కుతుంటే, ఆ మాటలు విని వచ్చిన సుందరి--లతను చూసి ఆశ్చర్యంతో, "ఎలా ఉన్నావు లతా?" అని సంతోషంగా అడిగింది.

ఆ పిలుపుతో అనిగిపోయున్న భావాలన్నీ కరిగి, ధైర్యం పారిపోయింది. కానీ, ఒక చిరు నవ్వు వెనుక తన భావాల ప్రవాహాన్నంతా అనిచిపెట్టుకుని నిలబడ్డ లత ఇంతకాలంలో చాలా నేర్చుకుంది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

8, జులై 2022, శుక్రవారం

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల)

 

                                                                                 ప్రేమ ఎంత కఠినమో!                                                                                                                                                        (పూర్తి నవల)

ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” - అనేది ఒక మంచి మంత్రం.

ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎవరు వాడుకోవలొ తెలుసుకోవటమే కష్టం, కఠినం...కానీ తెలుసుకోగలిగితే మ్యూచువల్ బెనిఫిట్ అందుతుంది. అందుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ నవలలో ఈ మంత్రాన్ని ఒక సారి విని మోసపోయిన హీరోయిన్ లత, జీవితంలో ఇక ఈ మంత్రాన్నే వినకూడదని నిర్ణయించుకుంది. కానీ, తన జీవిత ప్రయాణంలో ఈ మంత్రం తనకే ఎంతో అవసరం ఉన్నదని గ్రహించింది. చివరికి ఆ మంత్రాన్ని చెప్పించుకోవటానికీ, చెప్పటానికీ ఏంత కష్టపడిందో, ఎంత కఠినమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందో ఈ నవల చదివి తెలుసుకోండి.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల)@ కథా కాలక్షేపం-2 

****************************************************************************************************

27, మే 2022, శుక్రవారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-17

 

                                                                        ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                             PART-17

ఉదృతంగా పారుతున్న ప్రేమతో, పనివాడు చూపిన గదిలోకి వెళ్ళింది లత. ఎదురుచూసిన అతని ముఖంలో ఎప్పుడూ అనుచుకోలేని భావనలు. తన ముందు నిలబడ్డ ఆమె చూపులు చూస్తున్నంతసేపూ, చూస్తూనే ఉన్నాడు విశాల్. మాటల మౌనంతో పోరాటం చేస్తూండగా కుమిలిపోతున్న ఆమెను ఆదరణగా కౌగిలిలోకి తీసుకున్నాడు. కౌగిలిని సడలించకుండానే ఆమెను కూర్చోబెట్టాడు.

"ఇక మీదట నువ్వు ఏడవనే కూడదు లతా" అంటూ ఆమె నుదిటి మీద ముద్దుపెట్టుకున్నాడు.

కన్నీళ్ళూ తడుచుకుని అతని ముఖాన్ని చూస్తూ "నేనేం పాపం చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేశారు?" అని అడిగింది.

ఆమెను ప్రేమగా ఒకసారి చూసి "శిక్ష నీకొక్క దానికే అనుకున్నావా లతా"

"కాదని తెలుసు...కానీ ఎందుకు...?"

"అంతా నీ మంచికే...మన భవిష్యత్ జీవితానికే"

"అర్ధం కాలేదు"

"ఇన్ని రోజులు నిన్ను పొడుచుకు తిన్నవాడిని ఇలా శాంతంగా ఉన్నానే...అర్ధం కాలేదా"

"ఊ...నమ్మలేకపోతున్నాను. ఎక్కడ తిట్టి తరిమేస్తారో నని భయపడుతూ వచ్చాను. ఈ మార్పు ఎలా?"

"అంతా నీ ప్రేమ చేసిన మాయే. జరిగిపోయినవి, జరిగిపోయినట్లుగానే ఉండనీ. ఇక మీదట చేతిలో ఉన్న సుఖాన్ని, రాబోవు ఆనందాలనూ గురించి మాత్రమే ఆలొచిద్దాం"

అతని మాటలు ఆమె హృదయానికి హాయిని ఇవ్వగా -- ఇంకా ఎక్కువగా ఆనందపడింది లత.

"ఏయ్! ఇక మీదట ఏం జరిగినా తప్పు నాది కాదు" అంటూ ఆమె చెవుల దగ్గర గుస గుసలాడ -- చెవి చివర తగిలిన స్పర్షలో జ్ఞాన రేఖలు ఆమె ముహంలో పోటీ పడటం మొదలు పెట్టినై. అందులో కరిగిపోయిన విశాల్ "ఇన్ని రోజులు ఎక్కడున్నావే నా ప్రాణమా! నాలో ఉన్న ప్రేమను నాకు చూపించావే! నేను చూసిన మొదటి స్పర్ష నువ్వు! నీ ప్రేమతో నా భావనలకు ప్రాణం పోసావు నువ్వు! నా ప్రాణ పుష్పాన్ని మోస్తున్న దానివి నువ్వు!" అన్నాడు భావావేశంగా.

ఆ రోజు ఒక రోజు ఒంటరిగా తన గదిలోకి వచ్చినామెను లొంగదీసుకోవటానికి కారణం వుత్త కాంక్షా భావన కాదు, తనకి దొరకని ఆమె ఇంకెవరికీ దొరక కూడదనే కృర బుద్దితోనే.

అతనిలో దాగున్న వక్ర బుద్ది, ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా ముట్టుకునేంత దూరం తీసుకు వచ్చి వదిలిందే అని తలచుకుని సిగ్గూ, వేదన పడుతూ, బలంగా ఎదిరించి పోరాడినా -- ఆమె తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నం, దాన్ని జయించలేక లొంగిపోవటాన్ని తలచుకుని ఆశ్చర్యమూ, వేదనా పడ్డాడు. తీవ్రంగా ప్రేమిస్తున్న ఒక ఆమె వలనే అలాంటి లొంగుబాటు పరిస్థితిని అంగీకరించగలదు అనేది అతనికి అర్ధం కాక కాదు! మొట్టమొదటి సారిగా స్త్రీ యొక్క ప్రేమ, స్నేహ సముద్రంలో మునిగిపోయిన అతను తనని తాను అర్ధం చేసుకున్నది అప్పుడే.

తన మనసు పరిపూర్ణత చెందాలనేది గ్రహించి దాని కోసం చేస్తున్న ప్రయత్నమే -- ఇదిగో ఒక అద్భుతమైన మనిషిగా, మంచి ప్రేమికుడిగా నిలబడున్నాడు విశాల్.

"విశాల్!... విశాల్!..." ఆమె కూడా కరిగిపోగా -- "నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు లతా" అని అడిగాడు.

ఎలా చెబుతుంది?

కిరణ్ తో వచ్చేనని చెబితే కోపగించుకుంటాడే! మంచి భావనలో ఉన్న అతన్ని మళ్ళీ పాత విశాల్ గా మార్చటం తగునా?......సమాధానమే చెప్పకుండా నిలబడ్డ ఆమె కళ్ళళ్ళో కనబడ్డ భయం....?

జరిగింది అతనికి చెప్పగా ---

"లతా! నువ్వు మొదట నన్ను నమ్మాలి. నువ్వు నా దానివేనన్నది తెలుసుకున్న తరువాత నేను నిన్ను ఏ విధంగానూ నొప్పించను. నా మీద కంటే, నీ మీదే నాకు నమ్మకం ఎక్కువ. పాత విశాల్ ని నువ్వు మర్చిపో" అన్నాడు సున్నితంగా.

అతను తనకోసం బాధ పడుతున్నది అర్ధమవగా,

"నా వల్ల కావటం లేదే! ఏ పరిస్థితిలోనూ నా విశాల్ ని నేను మరిచిపోలేకపోతున్నానే!" అన్నది బొంగురు పోయిన స్వరంతో.

"నేను మొట్ట మొదటగా ప్రేమించింది, నన్నే ప్రేమలో కోల్పోయింది అంతా..." అంటూ అంతకుపైన చెప్పలేక తడబడుతూ నిలబడ్డది లత.

ఒకసారి తన పూవుల బాణం వేసి, నాటకాన్ని ప్రారంభించిన మన్మధుడు మళ్ళీ ఇద్దరి మనసులలోనూ, అదే  నాటకాన్ని వేయలేకపోయాడు....భావాలను పెంచే ఆమె స్వాశ గాలిలో తననే మరిచిపోయిన లత, దాంట్లోంచి బయటకు రావాలని నిర్ణయించుకుని....-------

" కిరణ్ కింద హాలులో కూర్చోనున్నారు" అన్నది.

"ఏయ్! ఇంతసేపు ఎందుకు చెప్పలేదు? లే.రా...వెళదాం" అని లేచాడు. కానీ,

ఆమె తను కూర్చున్న చోటు నుండి లేవకుండా చిరు నవ్వుతో విశాల్ ను చూడగా "ఏయ్! ఏమారుస్తున్నావా? ఉండు...నిన్ను..." అంటూ అతను ఆమెను పట్టుకోగా, చిటికలో పరిగెత్తిన ఆమె, గోడకు వేలాడుతున్న రోజువారి క్యాలండర్ ను చూపి తరువాతి ముహూర్తానికి ఇంకా నాలుగు రోజులున్నది" అన్నది.

"ఉండు....ఉండు... ఆ రోజు రాత్రికి నీ పని చెబుతా" అంటూ మన్మధ చూపుతో తన ప్రేమికురాలికి రహస్య సందేశం పంపాడు ఆ అభిమాన ప్రేమికుడు.

                                                                                   సమాప్తం

****************************************************************************************************


22, మే 2022, ఆదివారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-16


                                                                            ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                             PART-16 

మరుసటి రోజు ప్రొద్దున లతను పిలవటానికి వెళ్ళిన కిరణ్ కు, వందన ద్వారా తనకి ఒంట్లో బాగుండలేదని కబురు పంపింది. అతను ఎంత ప్రయత్నించినా చూడటానికి వొప్పుకోలేదు.

కిరణ్ ప్లాను ఏమిటంటే మొదట లతను విమానాశ్రయం తీసుకు వెళ్ళి వదిలిపెట్టి,  తరువాత ఫోన్ చేసి విశాల్ ను రమ్మని చెప్పి, ఇద్దర్నీ తాజ్ మహాల్ కు తీసుకు వెళ్ళి ప్రేమను వాళ్ళు ఇద్దరూ ఒకరితో ఒకరు చెప్పుకోవటం అనేది ఏర్పాటు. ఖచ్చితంగా మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో ఒక మొగాడితో ఉరు తిరగటం ఏ ప్రేమికుడూ ఒప్పుకోడు అనే 'సెంటి మెంటు ను నమ్మే ఈ ఏర్పాటు చేశాడు కిరణ్. కానీ, లతనే ఇలా ప్లానును పాడుచేస్తుందని అతను ఎదురు చూడలేదు. దగ్గర దగ్గర అరగంట కాచుకున్న కిరణ్, ఆమె పట్టుదలను తలుచుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు.  

ఆమె యొక్క నడవడిక అతనికి పొడుపు కథలా ఉంది -- ఆ పొడుపు కథకు కారణమైన అతనో స్వీయ పరిస్థితిని కోల్పోయి, వెర్రి చూపులతో పడుకోనున్నాడు. ముందు రోజు రాత్రి జరిగిన సంఘటనలు కళ్ళ ముందుకు వచ్చి, నేర భావనను ఎక్కువ చేసింది. ఎలా ధైర్యం చేశాడు అలాంటి చేష్టకు? ఎప్పుడు చూడూ తన శీలాన్ని విమర్శించే అతని దగ్గరే పూర్తిగా తనని కోల్పోయిన పరిస్థితి! ఇక ఎక్కడికెళ్ళి నిరూపిస్తుంది...తన దయనీయ పరిస్థితిని? అతని చూపులలోనే కరిగిపోయి తన చూపులలో స్వాగతించింది ఈమే కదా? ఆ తరువాత తన పరిస్థితిని తెలుసుకుని, ఎంతో బలంగా పోరాడింది. అన్నీ  సుడిగుండలో చిక్కుకున్న పడవలాగా అయిపోయిందే!

మొదట్లో ప్రేమ కోసం పరితపించి నిలబడ్డది ఈమె తప్పు అయితే, తరువాత జరిగిన దానికంతా బాధ్యుడు అతనే కదా?

ఎన్నో ప్రశ్నలు ఆమెను వేదించగా...ఆమె కృంగిపోయింది.

లత ఢిల్లీకి వెళ్లక పోవటానికి కారణం వందన ద్వారా గౌరికి చెప్పబడింది.

ఎదురు చూడకుండా ఏర్పడిన అనుభవం, చాలా సేపు షవర్ కింద నిలబడటం కలిపి  లత శరీరాన్ని వేడితే కాలుతున్నట్టు చేసింది. ఆమె ఢిల్లీ వెళ్ళలేదని తెలుసుకున్న తరువాత ఏ ఆఫీసుకూ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాడు విశాల్. మృగంలాగా నడుచుకున్న తన పైశాచిక ప్రవర్తనకు పరివర్తనగా లత ఏదైనా విపరీత నిర్ణయం తీసుకుంటుందేమో అన్న ఆందోళన అతని ప్రశాంతతను కోల్పొయేటట్టు చేసింది. 

"లతకి విపరీతమైన జ్వరం" అని వందన సమాచారం ఇవ్వగానే, ఆమె గదిలోకి వెళ్ళిన విశాల్ -- దుప్పట్లో దూరి ముడుచుకుని పడుకున్న లతను చూసి అల్లాడిపోయాడు. నేర భావనతో వణుకుతున్న చేతులతో ఆమెను ముట్టుకుని చూసి, పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించి ఆమెను హాస్పిటల్ కు ఎత్తుకుని పరిగెత్తేడు. ఆ రోజు నదీ తీరంలో మైకంలో  తన కౌగిలిలో సురక్షితంగా ఉండిపోయిన ఆమె, ఈ రోజు తన స్ప్రుహనే కోల్పోయిన పరిస్థితుల్లో కూడా తన దగ్గర నుండి తొలగిపోవాలని కృంగి ముడుచుకున్న లత మనసును అర్ధం చేసుకుని, హాస్పిటల్ కు తీసుకు వెళ్ళకుండా, గౌరి దగ్గర ఆమెను అప్పగించటానికి విశాల్ వెళుతున్నప్పుడు, ఆమె మెరుగు పడి -- మనసులో కొంచం బలం పుంజుకుని, అతని దగ్గర నుండి జారుకుని నడిచి వెళ్ళిపోయింది. తరువాత ఆమె కనబడలేదు. చాలాసేపు ఆమెనే వెతికిన విశాల్ కళ్ళు, చివరకు ఆమెకొసం  తపించాయి.   

రోజులు గడిచిన కొద్ది -- బాధల యొక్క ఆవేదన, అతని మీద ఏర్పడ్డ విరక్తి కొబ్బరి పీచులాగా ఊడిపోగా  మొక్క పోచలో దాగున్న కొత్త పువ్వు  వికసించినట్టు లతకు విశాల్ మీద ప్రేమ పుట్టటం మొదలుపెట్టింది. విశాల్ కోసం లత ఇల్లు మొత్తం వెతికింది.   అతని గురించిన ఎటువంటి సమాచారం దొరకక నీరసపడిపోయిన ఆమె మనసు -- నీటి పారుదలకొసం ఎదురుచూసే చెట్టులాగా అభిమానం, స్పర్శ అంటూ ప్రేమ ఇచ్చే అన్నీ సుఖాల కోసమూ పరితపించింది.

దగ్గర దగ్గర మూడు నెలలైనా విశాల్ గురించిన సమాచారం లతకు దొరకలేదు. గౌరి దగ్గర చూచాయగా విచారించినా ఆమె పట్టించుకున్నట్టు కనబడటం లేదు. ఇంటికి రాని విశాల్, వాళ్ల షాపుకైనా ఖచ్చితంగా వచ్చి వెడతాడనే నమ్మకంతో సుమారు రెండు నెలలుగా ప్రొద్దున నుండి సాయంత్రం వరకు తపస్సు చేస్తున్నట్టు రోజూ అక్కడికి  వెళ్ళింది. ఒక్క రోజు కాదు కదా, ఒక్క పూటైనా విశాల్ అక్కడికీ రాలేదు. అన్ని దార్లూ మూసుకుపోవటంతో విశాల్ ఏదైనా బయటి దేశానికి వెళ్ళుంటాడేమో అనుకున్నది. 

ఇంట్లోని ప్రతి చోట, ప్రతి వస్తువు లోనూ అతని రూపమే కనిపిస్తుంటే --- లతకు పిచ్చి పట్టినట్టు  అనిపించింది. జ్ఞాపకాల అలలు రోజు ఆమెను చుట్టుముట్టి బలంగా తాకుతుండగా, ఆమె చిక్కి శల్యమైంది.

ఆమె పరిస్థితి యుక్త వయసులో ఉన్న వందనకు అర్ధమయ్యింది.

"మీ దగ్గర ఒక విషయం చెప్పాలే లతా అన్నది వందన.

"ఏమిటీ?" అన్నట్టు చూసింది లత.

"సార్, ఎక్కడున్నారని..." అన్నది.

"నీకు తెలుసా?" ఆందోళన పడుతూ హడావిడిగా అడిగిన లతను చూడటానికే పాపం  అనిపించింది.

"ఒక...ఊహే"

"పరవాలేదు. చెప్పు వందనా --- ప్లీజ్..."

"టీ ఎస్టేట్"

"నిజంగానా? అది ఎక్కడుంది?"

"కొండ అడవి. ఇక్కడ్నుంచి ఐదు గంటలు ప్రయాణం"

"ఎలా వెళ్ళాలి?"

"సరిగ్గా తెలియదు....కానీ, అక్కడికి తోడు లేకుండా వెళ్లలేరు అనేది తెలుసు. ఒంటరిగా వెళ్లటం ప్రమాదం. ఒకవేల అతను బయట దేశాలకు వెళ్ళుండొచ్చు కదా?" అని అన్నది.

ఆ ప్రశ్న లతను అయోమయ స్థితిలోకి తోసింది. 'అతను సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోతే...?'

"నువ్వు బాధ పడకు లతా. నాకెందుకో ఆయన ఎస్టేట్ బంగళాలో ఉండుంటాడనే అనిపిస్తోంది. నువ్వెందుకైనా మీ పిన్ని దగ్గర అడిగి చూడు.

"ఊహూ...పిన్ని నాతో మాట్లాడటం లేదు"

"సారుకూ, మీకూ ఏదైనా సమస్యా?"

"హూ...! ఏ రోజు అతను నాతో మొహం చూపించి మంచిగా మాట్లాడాడు...ఒక్క మాటైనా? ప్రేమగా, ఆదరణగా మాట్లాడిందే లేదు!"

ఎప్పుడు చూడూ ఆమె మీద ద్వేషంతో మాట్లాడే వాడి చుట్టూతానే ఎందుకు ఆమె మనసు చుట్టిందనే రహస్యం ఆమెకే అర్ధం కాలేదు.

తనని మళ్ళీ మళ్ళీ అవమానపరచి పోవటానికే ఆ రాత్రి అలా నడుచుకున్నాడో అని కూడా ఆమెకు అనిపించి ఉండవచ్చు.

"ఒకే ఒక దారి ఉంది లతా "

"చెప్పు"

"నువ్వు నీ స్నేహితుడు కిరణ్ దగ్గర సహాయం అడగటం మంచిది"

"అతను ఇక్కడికి రావటానికి ఇంకా ఒక వారం ఉందే?"

"ఆరునెలలు కాచుకున్న మీరు ఇంకొక వారం ఓర్పుగా ఉండలేరా ఏమిటి?"

ఆ వారం రోజూలూ, లత ఇరవై నాలుగు గంటలూ ఎదురు చూపుతోనే గడిపింది.

కిరణ్ వచ్చే రోజును లెక్క వేసుకుని, వేసుకుని నీరసపడిన ఆమె, అతను కాలు మోపగానే అతని కాళ్ళను చుట్టేసింది.

"ఉండు...ఎందుకంత ఆందోళన పడతావు? అతను పోతే పోనీ! నీకు అతని కంటే మంచివాడు దొరుకుతాడు" అన్నాడు.

అతను పలుసార్లు విశాల్ ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు, ఒక్క రోజు కూడా విశాల్ అతనితో నవ్వుతూ సహజంగా మాట్లాడలేదు. ఎప్పుడూ చిటపటలాడే మొహంతో ఉండే విశాల్ మీద అతనికి మంచి అభిప్రాయం లేదు.

అలాంటి ఒక జీవి కోసం ఈమె తాపత్రయ పడటం అతనిలో విసుగు తెప్పించింది.  

"ఏం మాట్లాడుతున్నారు?" కన్నీరుతో అడిగింది.

"అర్ధం చేసుకో లతా. నేను చెబుతున్నానని కోపగించుకోకు . అతను అందరిలాగా మామూలు మనిషి కాదు"

"కిరణ్"

"అతను ఎవరితోనైనా సరదాగా మాట్లాడటం ఎప్పుడైనా చూసావా? ఇల్లు, ఆఫీసు, నీ పిన్నీ -- ఇదే అతని ప్రపంచం. ఒక కుటుంబం, దాని అందాలు ఇవన్నీ అతనికి తెలియదు. నిన్ను పూర్తిగా ఇష్టపడుతుంటే ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళుండేవాడా? అతన్ని మరిచిపోవటమే మంచిది. ఖచ్చితంగా అతని వలన నిన్ను సంతోషంగా ఉంచుకోవటం కుదరదు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం గలవారికి, ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసుకోవటం, మూర్ఖత్వం, అనుమానం లాంటి చెడ్డ గుణాలు ఉంటాయి. వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటూనే వాళ్ళ నిజ స్వరూపం తెలుస్తుంది"

"చాలు కిరణ్"

"నిదానంగా ఆలొచించు. నేను చెప్పేది నిజమని నీకు అర్ధమవుతుంది"

కోపమూ, ఆవేదన ఒకటిగా చేరటంతో సమాధానం చెప్పకుండా గబగబా వెళ్ళిపోయింది లత.

'ఛ...మూర్ఖురాలు. అర్ధం చేసుకోదూ, పెట్టదూ' అని విసుగుతో గొణుకున్న అతను, మనసు అంగీకరించక గౌరిని వెళ్ళి కలిశాడు. 

"నేను ఏం చెప్పను కిరణ్? విశాల్ - లత ఇద్దరూ నా రెండు కళ్ళు లాంటి వారు. చిన్న  వయసులోనే అతనికి ఏర్పడ్డ అనుభవాల వలన ఒకవేల అలా అయ్యాడో, ఏమో? ఇన్ని రోజులలో అతని దగ్గర నుండి అభిమానాన్ని తప్ప నేను ఇంకేమీ చూడలేదు. అతనిలో దాగున్న గుణాలను అతను ఎలా తెలుసుకున్నాడో? ఏమీ అర్ధం కావటం లేదు. ఒక రోజు నా ఎదురుగా వచ్చి ఏదో పోగొట్టుకున్న వాడిలా నిలబడ్డాడు. అతను అంతలా  బాధపడుతూ కృంగిపోయి నిలబడటం నేనెప్పుడూ చూడలేదు" అన్న గౌరి, పాత రోజులలోని విశాల్ ను కళ్ళ ముందుకు తెచ్చుకుంది.

"అత్తయ్యా! నేను లతను ఎంత లోతుగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. కాలమంతా నేను తపస్సు చేసి పొందిన వరం ఆమె. ఆమెను నేను ఒక పువ్వులాగా చూసుకోవాలి. ఇన్ని రోజులూ ముళ్ళ పొదలాగానే ఉన్నాను.  నాలో ఏదో ఉంది. అన్ని కళలూ పీకిపారేసిన నేను పూర్తిగా మనిషిని కావాలి. నా మనసులో లోతుగా ఏర్పడిన గాయాలు ఆరాలి. దానికి  కొంతకాలం డాక్టర్.రుబాస్ దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోవాలి. ఆయన ప్రసిద్ది చెందిన మనోతత్వ నిపుణుడు. నా గురించిన వివరాలేవీ లతకు తెలియనివ్వకండి. మన ఎస్టేట్ బంగళాలో  ఉంటాను. అమె వలన నేను లేకుండా పోవటం తట్టుకోలేదు. ఆమె పడే వేదనను మీరు నా కోసం ఒర్చుకోండి! అన్న అతను, నా లతను బాగా చూసుకోండి  అత్తయ్యా. నేను కొత్త మనిషిగా...నా లతకు సరిపోయేవాడిలాగా తిరిగి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.

పోయిన వారం అతన్ని వెళ్ళి చూశాను. యోగా, ద్యానం అంటూ చురుకుగా ఉన్నాడు. కానీ, లత పడుతున్న వేదనను నేను చూడలేక పోతున్నాను. కిరణ్, 'ఇంకా ఒక వారం పోనీ అత్తయ్యా' అని వాడు చెప్పటం వలన మౌనంగా ఉన్నాను" ఆమె మాట్లాడ, కిరణ్ మనసులో విశాల్ గొప్ప స్థానం సంపాదించుకున్నాడు.

ఇంతకుపైన ఆమెను వేధించకూడదు అని అనుకుని, మరుసటి రోజు లతను తీసుకుని, ఎస్టేట్ వాకిట్లో వదిలేసి వచ్చాడు కిరణ్.

                                                                                         Continued....PART-17(Last Part)

****************************************************************************************************

20, మే 2022, శుక్రవారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-15

 

                                                                  ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                               PART-15

మరుసటి రోజు తెల్లారినప్పుడు లతాకు కొత్తగా అనిపించింది. సూర్యోదయ తొలి లేత కిరణాలు కొండ శిఖరాన్ని తాకుతున్నప్పుడు పరవసించిపోయింది.

లోతైన మనసులో దాగున్న రహస్యాన్ని మనసు విప్పి చెప్పుకోవాలని అనిపించింది. కానీ, ఇంతకు ముందే కాల్చుకున్న అనుభవం, ఆరని గాయం ఆమె మనసును అడ్డుకున్నాయి.

ఎప్పుడూ విశాల్ రూముకు వెళ్లని లత ఆ రోజు టీ తీసుకుని విశాల్ రూముకు వెళ్ళింది. టీ కప్పు తీసుకున్న అతనిలో ఏ మాత్రం బిడియం కనబడలేదు. లత మనసు మాత్రం క్రితం రోజు రాత్రి జరిగిన సంఘటనల బాధింపు తగ్గక ఆమెను భయంతో నిలబెట్టింది. ఓర చూపుతో కొన్నిసార్లు అతని మొహంలోకి చూసింది. కానీ, అతను అవేమీ పట్టించుకున్నట్లు కనబడలేదు. కొన్ని రోజులు రహస్యంగా చూసుకోవటం, కలల్లో తేలియాడటం చేస్తున్న లత ఒక రోజు అతను ఆఫీసుకు వెళ్ళిన తరువాత అతని రూముకు వెళ్ళింది---- అన్వేషించే భావంతోనూ, ఏదో దొంగతనం చేయటానికి దూరినట్లు ఆమె హృదయం వేగంగా కొట్టుకుంది.  

పరిశుభ్రంగానూ, అందంగానూ ఉన్న ఆ గదిని చూసిన తరువాత లత మనసు అతని గుణం ఎలాంటిదో అర్ధం చేసుకుంది. గోడకు అతని బట్టలు వేలాడదీసి ఉన్నాయి. ఆ రోజు నదీ తీరాన వచ్చిన అదే వశీకరణ వాసన ఆ బట్టల నుండి రావడంతో ఆమె కలవరపడ్డది.

"హు...అతను ఉపయోగిస్తున్న వస్తువలకే ఇంత వశీకరణ శక్తి ఉందంటే, అతని స్నేహానికి....? 

దేనికోసం వెతుకుతున్నమో తెలియకనే ఒక్కొక్క అలమరానూ వెతికింది. విసుగుతో వెనుతిరిగిన లతకు ఒక అలమరా లోపలి భాగంలో లోతుగా ఒక అర కనిపించటంతో, ఏదో ఒక రహస్యం దాగున్నదనే అనుమానం కలిగింది. మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. బ్యాంకులో బద్రంగా దాచుకోవటానికి ఉండే లాకర్ లాగా ఉన్న అలమరాను ఎంత నిర్లక్ష్యంగా తెరిచి ఉంచారు? అనేది ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. చాలా అలమరాలు తాళం వేసున్నట్లు మూసుండగా సగం తెరుచుకున్న ఆ అలమరాను పట్టుకు లాగింది. ముఖ్యమైన డాక్యూమెంట్స్ పెట్టుకునే ఆ అలమరాలో ఆమె చేతికి దొరికింది ఒక ఫోటో కట్ట.

'ప్రకృతి యొక్క ప్రతి యొక్క చలనాన్ని తనలో ఇముడ్చుకున్న ఆ ఫోటోలలో అవి ఎలా దాగున్నాయో నన్న ఆశ్చర్యం వేసింది లతకు. ఒక్కొక్క ఫోటోనూ చూస్తూ వస్తోంది.  అప్పుడు గౌరి పిన్ని చెప్పింది లతకు గుర్తుకు వచ్చింది.

'వాడి మనసులో ఏర్పడిన గాయాలకు మందు అతను ఫోటోలు తీసే కెమేరానే. చాలా బహుమతులు గెలుచుకున్నాడు

ఆ రోజు అలా ఫోటోలు తీయటానికి వచ్చినప్పుడే నన్ను ఆ గూండాల దగ్గర నుండి కాపాడాడు?

మంచం మీద కూర్చుని ఫోటోను చూసుకుంటూ వచ్చిన లత చివరగా ఆ ఆల్బం ను తీసింది.

విధ విధమైన ఫోజులలో ఆ ఫోటోలలో నిలబడున్నది లతనే. తోటలోని పచ్చటి గడ్డి తివాచి మీద, రోజా చెట్ల దగ్గర, నదీ తీరానా – అంటూ,

ముందు రోజు అతను నడుచుకున్న తీరుకు కారణం -- చెడు ఆలొచన కాదనేది ఆమెకు అర్ధమవటంతో -- ఆమె వెతకటానికి వచ్చిన ఆలొచన ముగింపుకు వచ్చింది.  

ఇన్ని కోణాలలో అతను తనని ఫోటోలు తీసేడంటే, దానికి కారణం అతనికి నామీదున్న లోతైన స్నేహమే!

అనుకుంటుండ గానే ఆమె మదిలో తియ్యని హాయి!

అనువనువునా ఆనంద కితకితలు!

కిరణ్ చెప్పినట్టు ఎదురు బొదురు దృవాల ఐస్కాంత శక్తి!

కొన్ని ఫోటోలతో తన గదిలోకి వెళ్ళిన లత అక్కడ ఉండలేకపోయి అల్లల్లాడింది.

ఆ తరువాత రోజులలో విశాల్ ఇంటికి వచ్చే సమయంలో అందంగా అలంకరించుకుని నిలబడటం అలవాటయ్యింది. 

అలా ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చి డ్రస్సు మార్చుకుని రిలాక్స్ గా సిట్ ఔట్ లో కూర్చున్న విశాల్ దగ్గరకు టీ కప్పుతో వచ్చింది లత. తన తల కనబడితేనే పరిగెత్తే లత, తానుగా దగ్గరకు వచ్చి నిలబడటంతో  తలెత్తి చూశాడు.  

"ఏమిటి?" అని అడిగాడు.

సౌమ్యంగా వచ్చిన అతని మాటతో, అయోమయంలో పడ్డ లతకు ఏం మాట్లాడాలో తెలియలేదు. "పిన్నీ..." అన్నది.

"పిన్ని..." అని ప్రశ్నార్ధకంగా చూసిన అతను ఆమె మనాలి దాకా వెళ్ళింది కదా!"

"ఉష్...!" అని నాలిక కరుచుకున్న లత ఆలొచించింది. 'ఓవర్ గా వాగేనో?'

'ఏయ్' లతా, అనవసరంగా అతన్ని కెలికి తిట్లు తినకు...ఏదో ఒకటి చెప్పి తప్పించుకో...' అని తనని తాను సరిచేసుకుంది.

"అది కాదు...పిన్ని ఫోన్ చేసింది"

"హు..." అన్న అతను పేపర్ను మరో పక్కకు తిప్పి అందులో దృష్టి పెట్టాడు.

'పొగురుబోతు! ఎలా కూర్చున్నాడో చూడు. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా?" -- విసుగుతో ఆమె మనసు గొణిగింది.

"అదొచ్చి...ఆమె ఏం చెప్పిందంటే..."

"ఊ..." అంటూ తలెత్తి లతను చూశాడు. అతని కళ్ళల్లో నుండి ఒక శక్తి మెరుపులా ఆమె శరీరంలోకి దూరింది. అతని మొహంలోకి చూస్తున్న తన చూపును అలాగే ఉంచి నిలబడింది లత. 

ఆమె కళ్ళల్లో పొంగుకొస్తున్న ప్రేమ, ఆమె మొహంలో కనబడ్డ సిగ్గు ను చూసి తనని తాను మరిచిపోయాడు విశాల్.

ఆమె అందచెందాలనూ, అనుకువనూ చూసి అమాంతం ఆమెను తన కౌగిలిలో బంధించాలనే తన ఆశను ఎలాగో అణుచుకుని "ఏం చెప్పింది?" అని అడిగాడు.

"ఏమీ లేదు" అంటూ కదిలింది లత.

రోజులు వారాలుగా గడిచిపోగా, వరుణ్ బయలుదేరవలసిన రోజు వచ్చింది. ఇన్ని రోజులుగా సంతోష రేఖలుతో వెలిగిపోయిన అమ్మమ్మ ముఖంలో మాత్రం వాడిపోయిన విచారం మిగిలింది.

"ఏమిటమ్ముమ్మా! పోయిన సారి సెలవులకు వచ్చినప్పుడే ఒక మాట చెప్ప కూడదా. మీరు ఇష్టపడినట్లే మన ఊరి అమ్మాయినే చూసి పెళ్ళి చేసుకోనుండే వాడిని" అన్నాడు వరుణ్.

"పోరా! బాగా తియ్యగా మాట్లాడి ఏదో ఒకటి చెప్పి తప్పించుకో. ఆ ఇటలీ అమ్మాయి మైకంలో పడిపోయావు. ఇప్పుడు నా దగ్గర కబుర్లు చెబుతున్నావు" అన్నది కోపంగా.

"అమ్మమ్మా! సెల్షియాను చూస్తే మీరు కూడా మైమరచిపోతారు. ఆ నీలి కళ్ళు, పసిపిల్ల మొహం..." అంటూ అతను కలలో విహరించ,

"అయ్యో అమ్మమ్మా! మళ్ళీ మొదలు పెట్టకు" అన్నాడు కిరణ్ బెదిరిపోయి.

"ఈ విషయంలో మాత్రం వరుణ్ నా వారసుడే" అని తాతయ్య తన ప్రేమ కధను వివరించ,

"అయ్యో...సెల్షియా కూడా అమ్మమ్మ లాగానే తాతయ్య. నన్ను చూడకుండా ఒక్క నిమిషం ఉండలేదు" అని అమ్మమ్మ పైన ఐస్ గడ్డలు పెట్టాడు వరుణ్.

అమ్మమ్మ కళ్ళలోని వెలుగు వరుణ్ ని శాంత పరిచింది.

"అమ్మమ్మా!" అంటూ అతను ఆమె రెండు చేతులూ పుచ్చుకుని "మీరే నాకు సహాయం చేయాలి. మిమ్మల్నే నమ్ముకున్నాను" అంటూ బ్రతిమిలాడాడు. "నీ సంతోషమేరా నాకు ముఖ్యం. మీ నాన్నా, అమ్మా ముంబై నుండి రానీ. మేము మాట్లాడతాం. వాళ్ళు విదేశాలకు వెళ్ళక ముందే నీకు మంచి నిర్ణయం చెప్తాము...చాలా?" అన్నది.

కానీ వెంటనే "నేను ఎన్ని కలలు కన్నానో తెలుసా?" అంటూ పెద్ద శ్వాశ విడిచి "పాపం! ఆ గౌరి దగ్గర నీ గురించి చెప్పి వాళ్ళ ఆశలను రేకెత్తించాను. నువ్వు ఈ ఇటలీ అమ్మాయి దగ్గర ఇరుక్కుపోయావని ఇప్పుడు ఎలా చెప్పను" అన్నది కాస్త చిరాకుగా.

"అమ్మమ్మా! దాని గురించిన బాధ మీకు అవసరం లేదు"

"లతకు మంచి సంబందం రాబోతోంది. వీడికంటే సూపర్ అల్లుడు వస్తాడు" అన్నాడు కిరణ్.

"ఏమిట్రా చెబుతున్నావు?" అని అమ్మమ్మ అడిగింది.

"అబ్బాయికి ఏదో దీర్గ దర్శనం దొరికినట్లు మాట్లాడుతున్నాడు" అన్నాడు తాతయ్య.

"నిజమే తాతయ్యా. నా మాట నిజమవుతుందా... లేదా అనేది మీరే చూడండి" అన్నాడు కిరణ్ వికారంగా నవ్వుతూ.

"రేయ్ ఎందుకురా నీ మాటలూ, నవ్వూ వికారంగా ఉన్నాయి. ఏదైనా చిలిపి పని చేసావా...నీ మామయ్య వదిలి పెట్టడు. జాగ్రత్త!" అన్నారు తాతయ్య హెచ్చరిక బానిలో.

"తాతయ్యా! ఇంత వయసైనా మీ వేళాకోళం తగ్గలేదు చూశారా?" అన్నాడు మనవుడు.

అమ్మమ్మా, తాతయ్యలతో మనవళ్ళు పిచ్చాపాటి మాట్లాడుతున్న సమయంలో వచ్చింది లత.

"లతా! నీకు నూరేళ్ళు" అన్నాడు కిరణ్.

"ఏం? ఎందుకని మీకు నా మీద అంత పగ? వంద సంవత్సరాల వరకు ఇప్పటిలాగా కష్టలు పడాలా? నేను సంతోషంగా, హాయిగా వెళ్ళి చేరటం మీకు ఇష్టం లేదా?" అన్నది లత విరక్తితో.

ఎప్పుడూ ఉత్సాహంగా, గలగలమని ఉండే, లత అదొలా మాట్లాడటంతో -- తాతయ్య, అమ్మమ్మ ఒక లాగా చూశారు. కిరణ్ ఆమె మనోబావాన్ని అర్ధం చేసుకున్నవాడిలా సర్దుబాటు చేశాడు.

"ఏం లత! టీ.వీ లో ఏదైనా సీరియల్ చూసేసి, అదే మనోభావంతో వస్తున్నావా?"

సంబందమే లేకుండా అతను అలా అడిగేటప్పటికి అతన్ని ప్రశ్నార్ధకంగా చూసిన లత తో -- తాతయ్య, అమ్మమ్మ ఇద్దర్నీ కంటి చూపుతో సైగ చేసి చూపాడు కిరణ్.

అర్ధంచేసుకున్న లత "మన తాతయ్య -- అమ్మమ్మలాగా ఒక అద్భుతమైన జీవితం అందరికీ దొరుకుతుందా...ఏమిటి? దాని గురించి చెప్పాను" అన్నది.

"సరి, సరి...ఎక్కువగా ఐస్ పెట్టకు. నేనొక కొత్త వంటకం చేశాను. ఈ పాటికి రెడీ అయి ఉంటుంది" అంటూ వంట గదిలోకి తీసుకు వెళ్ళాడు కిరణ్.

అతను జీడిపప్పు కట్లెట్ ను పళ్ళేంలో వరుసుగా పెట్టగా, లత టీ గిన్నెను స్టౌవ్ మీద పెట్టింది. తోటలోని బెంచి మీద శోఖమైన ముఖంతో కూర్చున్న లత దగ్గరకు వచ్చిన కిరణ్ "ఏమిటి నీ సమస్య? ఎందుకు నీ మొహం డల్ గా ఉంది?" అని విచారించాడు.

"ప్చ్...ఏమీ లేదు" 

"చెబితేనే కదా దానికి ఒక పరిహారం దొరుకుతుంది"

"అది తీరని సమస్య"

"నువ్వు విశాల్ దగ్గర మాట్లాడలేదా?"

"ఎలా కిరణ్? నేనుగా వెళ్ళి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పేది?"

"నీకొసం నేను మాట్లాడనా?"

"వద్దు...వద్దు" అర్జెంటుగా నిరాకరించింది. ఇతనితో మాట్లాడినందుకే ఆ పరిస్థితుల్లో నిలబడ్డాడు. ఇతన్ని అవమాన పరిస్తే...?

"కరెక్టే. ఇది మనసుకు సంబంధించిన విషయం. సరిగ్గా చెప్పలేకపోతే అంతా వేస్టే అయిపోతుంది" అన్న అతను "ఆలొచిద్దాం లతా. నువ్వు దేని గురించి బాధ పడకు. ప్రేమ ఎంత కఠినమైందో అనేది నిన్ను చూసిన తరువాతే అర్ధమైంది" అని చెప్పి --ఆమెను సమాధాన పరచటానికి ప్రయత్నించాడు.

"అలాగా?" అన్న లత, "లేదు...ఎవరో తన ప్రేమికురాలు కోసం నాలుగు గంటలు మోకాళ్ళ మీద కూర్చుని ప్రార్ధన చేసినట్టు విన్నాను" అన్నది.

"వదులు...వదులు. ఇది అంత గట్టిగా మాట్లాడుకునే సమాచారమా?  ప్రేమలో ఇదంతా సహజం అమ్మా" అన్నాడు కిరణ్ నవ్వుతూ.

"వరుణ్ ఎప్పుడు బయలుదేరుతున్నాడు?"

లత అడగంగానే "ఒక మంచి ఆలొచన" అన్న కిరణ్ " వరుణ్ ఇంకో నాలుగు రోజుల్లో బయలుదేరుతా నన్నాడు. ఆ రోజు పెట్టుకుందాం క్లైమాక్స్" 

"ఏం చెబుతున్నారు?"

"నీ ప్రేమికుడు నీ మీద పెట్టుకున్న ప్రేమ గురించి అతని నోటి వెంటే చెప్పటానికి ఒక పధకం"

"అర్ధం కాలేదు"

"అంతా అర్ధమవుతుంది. నేను చెప్పినట్టు నడుచుకుంటే చాలు" అన్నవాడు, లత చూసిన చూపుకు "మరీ చండాలంగా ఉందో...ఏం చేయను? జీవితమంటే నాలుగూ ఉంటాయి కదా. వాటిని అనుసరించే వెళ్ళాలి" అన్నాడు పెద్ద జ్ఞానిలాగా.

"జాగ్రత్తగా వెళ్ళిరామ్మా" అన్నది గౌరి, చేతిలో ట్రావల్ బ్యాగుతో నిలబడున్న లతతో.

బట్టలు సర్దుకుంటున్న లత "నేనేమన్నా చిన్న పిల్లనా పిన్నీ? కిరణ్, వరుణ్ తోడు ఉన్నారుగా! వాళ్ళ పెద్దవాళ్ళు ఆల్రెడీ ఢిల్లీ వచ్చాశారు. తాజ్ మహాల్, రెడ్ ఫోర్ట్ అంటూ రెండు రోజులు ఊరంతా తిరిగి చూసి, వరుణ్ కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి తిరిగి రాబోతాను" అన్నది.

ఉత్సాహంగా బయలుదేరుతున్న లతను కోపంగా చూస్తూ నిలబడ్డాడు విశాల్.

'ఆ రోజు నాతో రావటానికి నిరాకరించిన లత, ఈ రోజు ఇంత హుషారుగా బయలుదేరుతోందే!'  కోపం తలకెక్కింది.

కన్న తల్లి దగ్గర దొరకని ప్రేమను, అభిమానాన్ని తన మనసుకు నచ్చిన లత దగ్గర పొందవచ్చునని ఆశపడ్డ అతనికి లత తనని ఉదాసీన పరచటం బలమైన దెబ్బగా అయ్యింది. ఆ నొప్పిలో అతనిలో ఉన్న మంచి గుణాలు అనిగిపోయి, చెడ్డ గుణాలైన పగ, కసి, కోపం చోటు చేసుకున్నాయి.

అతనికే తెలియని కొత్త విశాల్ ఉదయించాడు.

వెళ్ళి త్వరగా పడుకో లతా. ప్రొద్దున్నే బయలుదేరాలి" అన్నది గౌరి.

"అలాగే పిన్నీ"

"విమానాశ్రయం వరకు విశాల్ ని రమ్మననా?"  

"వద్దు. పిలుచుకు వెళ్ళటానికి కిరణ్ వస్తున్నాడు"

"సరే"..... గౌరి తన గదిలోకి వెళ్ళింది.

లత వంటింట్లోకి వెళ్ళి పాల గ్లాసు తీసుకుని విశాల్ గదికి వెళ్ళింది.

మంటెక్కుతున్న మనసును చల్లార్చటానికి తన ల్యాప్ టాప్ లో మునిగిపోయున్న అతనితో "పాలు" అన్నది.

"పెట్టెళ్ళు"

ఉంచింది. అక్కడి నుండి వెళ్ళటానికి మనసు రాక అక్కడే నిలబడ్డ లతకు అతనితో మాట్లాడాలని ఆశగా ఉంది. మాటలు మొదలుపెట్టింది.

అదొచ్చి...నేను

అతను కళ్ళు పైకెత్తి చూశాడు.

ఏం మాట్లాడాలో తెలియక పోవటంతో మాటలు తడబడ్డాయి ప్రొద్దున్నే విమానం...మీకు ముఖ్యమైన పనులేమన్నా ఉన్నయ్యా?” అని అడిగింది.

ఏం ఎందుకని? నీకు బాడీ గార్డుగా రావాలా?”

మాటలు కఠినంగా రావడంతో, లత కళ్ళల్లో నీళ్ళు తిరిగినై.

"నీకు ఏం కావాలి?" అన్నాడు...మరింత కఠినమైన స్వరంతో.

ఆ కఠిన స్వరాన్ని అర్ధం చేసుకున్న లత నువ్వేరా కావాలి. నా మనసు నీ కోసం తపించటం, నీ అభిమానం కోసం ఎదురుచూడటం అర్ధం కాలేదా? ఎన్ని రోజులు నన్ను గుచ్చి గుచ్చి పొడుస్తావ్. వర్షం జల్లు కోసం ఎదురు చూసే ఎడారి స్థలంలో కొట్టుకుంటున్న నా మనసు నీకు అర్ధం కాలేదా?’ అని మనసు నలిగిపోగా -- హృదయం ప్రేమను యాచించ -- అతని హృదయ గూడులో దాక్కున్న కుందేలు లాగా పనితనమూ, మంచి గుణమూ మెల్లగా లేపబడింది. ఆదరణ దొరికిన తల్లి ఒడిలా అతని ప్రేమ మనసు, "ఎందుకు విడిపోవాలనుకుంటున్నావే నా ప్రాణమే?" అని శోక గీతం పాడగా, హృదయ నరాలను మీటిన స్పర్షతో విసిగిపోయి నిలబడింది లత.

అప్పుడే అతనిలో ఉన్న మృగం అతని స్వీయ బుద్దిని  తినడం మొదలు పెట్టింది. విపరీత డిషేషన్ తీసుకున్నాడు విశాల్.

                                                                                                   Continued...PART-16

****************************************************************************************************