27, మే 2022, శుక్రవారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-17

 

                                                                        ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                             PART-17

ఉదృతంగా పారుతున్న ప్రేమతో, పనివాడు చూపిన గదిలోకి వెళ్ళింది లత. ఎదురుచూసిన అతని ముఖంలో ఎప్పుడూ అనుచుకోలేని భావనలు. తన ముందు నిలబడ్డ ఆమె చూపులు చూస్తున్నంతసేపూ, చూస్తూనే ఉన్నాడు విశాల్. మాటల మౌనంతో పోరాటం చేస్తూండగా కుమిలిపోతున్న ఆమెను ఆదరణగా కౌగిలిలోకి తీసుకున్నాడు. కౌగిలిని సడలించకుండానే ఆమెను కూర్చోబెట్టాడు.

"ఇక మీదట నువ్వు ఏడవనే కూడదు లతా" అంటూ ఆమె నుదిటి మీద ముద్దుపెట్టుకున్నాడు.

కన్నీళ్ళూ తడుచుకుని అతని ముఖాన్ని చూస్తూ "నేనేం పాపం చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేశారు?" అని అడిగింది.

ఆమెను ప్రేమగా ఒకసారి చూసి "శిక్ష నీకొక్క దానికే అనుకున్నావా లతా"

"కాదని తెలుసు...కానీ ఎందుకు...?"

"అంతా నీ మంచికే...మన భవిష్యత్ జీవితానికే"

"అర్ధం కాలేదు"

"ఇన్ని రోజులు నిన్ను పొడుచుకు తిన్నవాడిని ఇలా శాంతంగా ఉన్నానే...అర్ధం కాలేదా"

"ఊ...నమ్మలేకపోతున్నాను. ఎక్కడ తిట్టి తరిమేస్తారో నని భయపడుతూ వచ్చాను. ఈ మార్పు ఎలా?"

"అంతా నీ ప్రేమ చేసిన మాయే. జరిగిపోయినవి, జరిగిపోయినట్లుగానే ఉండనీ. ఇక మీదట చేతిలో ఉన్న సుఖాన్ని, రాబోవు ఆనందాలనూ గురించి మాత్రమే ఆలొచిద్దాం"

అతని మాటలు ఆమె హృదయానికి హాయిని ఇవ్వగా -- ఇంకా ఎక్కువగా ఆనందపడింది లత.

"ఏయ్! ఇక మీదట ఏం జరిగినా తప్పు నాది కాదు" అంటూ ఆమె చెవుల దగ్గర గుస గుసలాడ -- చెవి చివర తగిలిన స్పర్షలో జ్ఞాన రేఖలు ఆమె ముహంలో పోటీ పడటం మొదలు పెట్టినై. అందులో కరిగిపోయిన విశాల్ "ఇన్ని రోజులు ఎక్కడున్నావే నా ప్రాణమా! నాలో ఉన్న ప్రేమను నాకు చూపించావే! నేను చూసిన మొదటి స్పర్ష నువ్వు! నీ ప్రేమతో నా భావనలకు ప్రాణం పోసావు నువ్వు! నా ప్రాణ పుష్పాన్ని మోస్తున్న దానివి నువ్వు!" అన్నాడు భావావేశంగా.

ఆ రోజు ఒక రోజు ఒంటరిగా తన గదిలోకి వచ్చినామెను లొంగదీసుకోవటానికి కారణం వుత్త కాంక్షా భావన కాదు, తనకి దొరకని ఆమె ఇంకెవరికీ దొరక కూడదనే కృర బుద్దితోనే.

అతనిలో దాగున్న వక్ర బుద్ది, ఒక అమ్మాయిని ఇష్టం లేకుండా ముట్టుకునేంత దూరం తీసుకు వచ్చి వదిలిందే అని తలచుకుని సిగ్గూ, వేదన పడుతూ, బలంగా ఎదిరించి పోరాడినా -- ఆమె తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నం, దాన్ని జయించలేక లొంగిపోవటాన్ని తలచుకుని ఆశ్చర్యమూ, వేదనా పడ్డాడు. తీవ్రంగా ప్రేమిస్తున్న ఒక ఆమె వలనే అలాంటి లొంగుబాటు పరిస్థితిని అంగీకరించగలదు అనేది అతనికి అర్ధం కాక కాదు! మొట్టమొదటి సారిగా స్త్రీ యొక్క ప్రేమ, స్నేహ సముద్రంలో మునిగిపోయిన అతను తనని తాను అర్ధం చేసుకున్నది అప్పుడే.

తన మనసు పరిపూర్ణత చెందాలనేది గ్రహించి దాని కోసం చేస్తున్న ప్రయత్నమే -- ఇదిగో ఒక అద్భుతమైన మనిషిగా, మంచి ప్రేమికుడిగా నిలబడున్నాడు విశాల్.

"విశాల్!... విశాల్!..." ఆమె కూడా కరిగిపోగా -- "నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు లతా" అని అడిగాడు.

ఎలా చెబుతుంది?

కిరణ్ తో వచ్చేనని చెబితే కోపగించుకుంటాడే! మంచి భావనలో ఉన్న అతన్ని మళ్ళీ పాత విశాల్ గా మార్చటం తగునా?......సమాధానమే చెప్పకుండా నిలబడ్డ ఆమె కళ్ళళ్ళో కనబడ్డ భయం....?

జరిగింది అతనికి చెప్పగా ---

"లతా! నువ్వు మొదట నన్ను నమ్మాలి. నువ్వు నా దానివేనన్నది తెలుసుకున్న తరువాత నేను నిన్ను ఏ విధంగానూ నొప్పించను. నా మీద కంటే, నీ మీదే నాకు నమ్మకం ఎక్కువ. పాత విశాల్ ని నువ్వు మర్చిపో" అన్నాడు సున్నితంగా.

అతను తనకోసం బాధ పడుతున్నది అర్ధమవగా,

"నా వల్ల కావటం లేదే! ఏ పరిస్థితిలోనూ నా విశాల్ ని నేను మరిచిపోలేకపోతున్నానే!" అన్నది బొంగురు పోయిన స్వరంతో.

"నేను మొట్ట మొదటగా ప్రేమించింది, నన్నే ప్రేమలో కోల్పోయింది అంతా..." అంటూ అంతకుపైన చెప్పలేక తడబడుతూ నిలబడ్డది లత.

ఒకసారి తన పూవుల బాణం వేసి, నాటకాన్ని ప్రారంభించిన మన్మధుడు మళ్ళీ ఇద్దరి మనసులలోనూ, అదే  నాటకాన్ని వేయలేకపోయాడు....భావాలను పెంచే ఆమె స్వాశ గాలిలో తననే మరిచిపోయిన లత, దాంట్లోంచి బయటకు రావాలని నిర్ణయించుకుని....-------

" కిరణ్ కింద హాలులో కూర్చోనున్నారు" అన్నది.

"ఏయ్! ఇంతసేపు ఎందుకు చెప్పలేదు? లే.రా...వెళదాం" అని లేచాడు. కానీ,

ఆమె తను కూర్చున్న చోటు నుండి లేవకుండా చిరు నవ్వుతో విశాల్ ను చూడగా "ఏయ్! ఏమారుస్తున్నావా? ఉండు...నిన్ను..." అంటూ అతను ఆమెను పట్టుకోగా, చిటికలో పరిగెత్తిన ఆమె, గోడకు వేలాడుతున్న రోజువారి క్యాలండర్ ను చూపి తరువాతి ముహూర్తానికి ఇంకా నాలుగు రోజులున్నది" అన్నది.

"ఉండు....ఉండు... ఆ రోజు రాత్రికి నీ పని చెబుతా" అంటూ మన్మధ చూపుతో తన ప్రేమికురాలికి రహస్య సందేశం పంపాడు ఆ అభిమాన ప్రేమికుడు.

                                                                                   సమాప్తం

****************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి