3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల)

 

                                                                                      ప్రేమ ఎంత కఠినమో!                                                                                                                                                                    (పూర్తి నవల)

ప్రేమ ఎన్నో రూపాల్లో అభివ్యక్తం అవుతుంది. చాలామందికి, ఈ ప్రపంచంలో ప్రేమ అంటే ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ లాంటిది. ప్రజలకి, ఎన్నో రకాల అవసరాలుంటాయి. శారీరికం, మానసికం, భావపరమైనవి, సామాజికం, ఆర్ధికపరమైనవి ఇలా ఎన్నో రకాల అవసరాలు. ఈ అవసరాలన్నీ నెరవేర్చుకోవడానికి “నిన్ను ప్రేమిస్తున్నాను” - అనేది ఒక మంచి మంత్రం.

ఈ మంత్రాన్ని ఎలా వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎవరు వాడుకోవలొ తెలుసుకోవటమే కష్టం, కఠినం...కానీ తెలుసుకోగలిగితే మ్యూచువల్ బెనిఫిట్ అందుతుంది. అందుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుంది.

ఈ నవలలో ఈ మంత్రాన్ని ఒక సారి విని మోసపోయిన హీరోయిన్ లత, జీవితంలో ఇక ఈ మంత్రాన్నే వినకూడదని నిర్ణయించుకుంది. కానీ, తన జీవిత ప్రయాణంలో ఈ మంత్రం తనకే ఎంతో అవసరం ఉన్నదని గ్రహించింది. చివరికి ఆ మంత్రాన్ని చెప్పించుకోవటానికీ, చెప్పటానికీ ఏంత కష్టపడిందో, ఎంత కఠినమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందో ఈ నవల చదివి తెలుసుకోండి.

తపస్సు చేస్తున్న ఆ అమ్మవారి పాదాలను తన అలల పూవులతో సముద్ర తల్లి అభిషేకం చేస్తుంటే, ఆకాశ దేవత పౌర్ణమి వెన్నెలను చేతులలోకి తీసుకుని దీపారాజన చూపిస్తుంటే, చుట్టూ ఉన్న పూల చెట్లు తమ సుగంధ వాసనలను వెదజల్లుతుంటే, ఆ సాయంత్ర సమయం అమ్మవారి చిరునవ్వులో ఆ సముద్రతీరమే పుణ్యభూమిలాగా దర్శనమిచ్చింది.

గాంధీ పార్కు ఎదుట కొత్తగా డెవలప్ చేయబడ్డ కాలనీలోకి ప్రవేశించింది లత. నాలుగు సంవత్సరాల క్రితం అక్కడక్కడ చిన్న చిన్న పెంకుటిళ్ళు, గుడిసెలు మాత్రమే ఉన్న ఆ ప్రాంతం పలురెట్లు మారిపోయింది.

'ఈ ఇల్లే' అనే ఒక లెక్కతో 'గేటును తెరిచింది లత. సిట్ ఔట్లొ కూర్చోనున్న కుమారి గేటు శబ్ధం విని తొంగి చూసింది. ఎవరో లోపలకు వస్తున్నది కనబడటంతో దీర్ఘంగా చూసింది. చిరు చీకట్లో వస్తున్నదెవరో గబుక్కున గుర్తుకు రాలేదు. కొద్ది క్షణాల తరువాత లోపలకు వస్తున్న మనిషి ఆకారం, తెలిసిన మనిషిలాగా అనిపించడంతో సందేహంతో......

"మీరు...?" అన్నది.

"ఏమిటి కుమారి! నన్ను మర్చిపోయావా?”

"నువ్వా లతా? నమ్మలేకపోతున్నాను" అన్నది ఉత్సాహంతో.

"నేనే నే" అని నవ్వింది లత.

అంతసేపు కట్ అయిన కరెంటు రావడంతో - కాంతివంతమైన వెలుతురులో కుమారి తన స్నేహితురాలుని బాగా చూడ గలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం చూసిన లతేనా ఈమె? ఈమె జీవితంతో విధి ఇలాగా ఆడుకోవాలి?     

రెండు జడలు, తుంటరి తనం, పరువాల వయసు, వర్ణించలేనంత అందం...ఆమె ఊరిలో ఆమెకు ఫ్యాన్స్ అషోషియేషనే ఉండేది. కానీ, ఇప్పుడు ఆకులు రాలిన, ఎండిపోయిన చెట్టులాగా ఉన్నది. నల్లబడి, బుగ్గలు లోపలకు పోయి, డ్రస్సు సెన్స్ లో పట్టులేక...చూసిన వెంటనే కుమారికి ఆమె పరిస్థితి అర్ధమయ్యింది--కాలం ఈమె గాయాలను గుణపరచ లేకపోయింది. మరచిపోనివ్వనూ లేదు అని!

ఈజీగా మర్చిపోయి, మనసును చల్లార్చుకోగలిగే నష్టమా ఆమెకు జరిగింది?

'హు...' అంటూ పెద్దగా శ్వాశ పీల్చుకుని.

"రా... లతా " అంటూ ఆమె చేతిలో ఉన్న సంచిని తీసుకుంది.

లత ఆ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు అక్కడున్న పెంకుటిల్లు ఇప్పుడు రెండంతస్తుల మేడ ఇల్లుగా మారి ఉన్నది.

"కుమారీ! ఇళ్లు సూపర్ గా ఉన్నదే" అన్నది.

"అన్నయ్య కువైత్ లో ఉన్నాడు కదా. పోయిన సంవత్సరం పాత ఇంటిని పడగొట్టి ఇది కట్టాము"

స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మెట్లు ఎక్కుతుంటే, ఆ మాటలు విని వచ్చిన సుందరి--లతను చూసి ఆశ్చర్యంతో, "ఎలా ఉన్నావు లతా?" అని సంతోషంగా అడిగింది.

ఆ పిలుపుతో అనిగిపోయున్న భావాలన్నీ కరిగి, ధైర్యం పారిపోయింది. కానీ, ఒక చిరు నవ్వు వెనుక తన భావాల ప్రవాహాన్నంతా అనిచిపెట్టుకుని నిలబడ్డ లత ఇంతకాలంలో చాలా నేర్చుకుంది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమ ఎంత కఠినమో!…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి