ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్) PART-16
మరుసటి రోజు
ప్రొద్దున లతను పిలవటానికి వెళ్ళిన కిరణ్ కు, వందన ద్వారా తనకి ఒంట్లో బాగుండలేదని కబురు పంపింది. అతను
ఎంత ప్రయత్నించినా చూడటానికి వొప్పుకోలేదు.
కిరణ్ ప్లాను
ఏమిటంటే మొదట లతను విమానాశ్రయం తీసుకు వెళ్ళి వదిలిపెట్టి,
తరువాత ఫోన్ చేసి విశాల్ ను రమ్మని చెప్పి, ఇద్దర్నీ తాజ్ మహాల్ కు తీసుకు వెళ్ళి ప్రేమను వాళ్ళు
ఇద్దరూ ఒకరితో ఒకరు చెప్పుకోవటం అనేది ఏర్పాటు. ఖచ్చితంగా మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరో
ఒక మొగాడితో ఉరు తిరగటం ఏ ప్రేమికుడూ ఒప్పుకోడు అనే 'సెంటి మెంటు’ ను నమ్మే ఈ ఏర్పాటు చేశాడు కిరణ్. కానీ,
లతనే ఇలా ప్లానును పాడుచేస్తుందని అతను ఎదురు చూడలేదు.
దగ్గర దగ్గర అరగంట కాచుకున్న కిరణ్, ఆమె పట్టుదలను తలుచుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు.
ఆమె యొక్క నడవడిక
అతనికి పొడుపు కథలా ఉంది -- ఆ పొడుపు కథకు కారణమైన అతనో స్వీయ పరిస్థితిని
కోల్పోయి,
వెర్రి చూపులతో పడుకోనున్నాడు. ముందు రోజు రాత్రి జరిగిన
సంఘటనలు కళ్ళ ముందుకు వచ్చి, నేర భావనను ఎక్కువ చేసింది. ఎలా ధైర్యం చేశాడు అలాంటి చేష్టకు?
ఎప్పుడు చూడూ తన శీలాన్ని విమర్శించే అతని దగ్గరే పూర్తిగా
తనని కోల్పోయిన పరిస్థితి! ఇక ఎక్కడికెళ్ళి నిరూపిస్తుంది...తన దయనీయ పరిస్థితిని?
అతని చూపులలోనే కరిగిపోయి తన చూపులలో స్వాగతించింది ఈమే కదా?
ఆ తరువాత తన పరిస్థితిని తెలుసుకుని,
ఎంతో బలంగా పోరాడింది. అన్నీ సుడిగుండలో చిక్కుకున్న పడవలాగా అయిపోయిందే!
మొదట్లో ప్రేమ కోసం
పరితపించి నిలబడ్డది ఈమె తప్పు అయితే, తరువాత జరిగిన దానికంతా బాధ్యుడు అతనే కదా?
ఎన్నో ప్రశ్నలు
ఆమెను వేదించగా...ఆమె కృంగిపోయింది.
లత ఢిల్లీకి వెళ్లక
పోవటానికి కారణం వందన ద్వారా గౌరికి చెప్పబడింది.
ఎదురు చూడకుండా
ఏర్పడిన అనుభవం, చాలా
సేపు షవర్ కింద నిలబడటం కలిపి లత
శరీరాన్ని వేడితే కాలుతున్నట్టు చేసింది. ఆమె ఢిల్లీ వెళ్ళలేదని తెలుసుకున్న
తరువాత ఏ ఆఫీసుకూ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాడు విశాల్. మృగంలాగా నడుచుకున్న తన
పైశాచిక ప్రవర్తనకు పరివర్తనగా లత ఏదైనా విపరీత నిర్ణయం తీసుకుంటుందేమో అన్న
ఆందోళన అతని ప్రశాంతతను కోల్పొయేటట్టు చేసింది.
"లతకి
విపరీతమైన జ్వరం" అని వందన సమాచారం ఇవ్వగానే, ఆమె
గదిలోకి వెళ్ళిన విశాల్ -- దుప్పట్లో దూరి ముడుచుకుని పడుకున్న లతను చూసి
అల్లాడిపోయాడు. నేర భావనతో వణుకుతున్న చేతులతో ఆమెను ముట్టుకుని చూసి, పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించి ఆమెను హాస్పిటల్ కు ఎత్తుకుని
పరిగెత్తేడు. ఆ రోజు నదీ తీరంలో మైకంలో తన
కౌగిలిలో సురక్షితంగా ఉండిపోయిన ఆమె, ఈ రోజు తన స్ప్రుహనే
కోల్పోయిన పరిస్థితుల్లో కూడా తన దగ్గర నుండి తొలగిపోవాలని కృంగి ముడుచుకున్న లత
మనసును అర్ధం చేసుకుని, హాస్పిటల్ కు తీసుకు వెళ్ళకుండా,
గౌరి దగ్గర ఆమెను అప్పగించటానికి విశాల్ వెళుతున్నప్పుడు, ఆమె మెరుగు పడి -- మనసులో కొంచం బలం పుంజుకుని, అతని
దగ్గర నుండి జారుకుని నడిచి వెళ్ళిపోయింది. తరువాత ఆమె
కనబడలేదు. చాలాసేపు ఆమెనే వెతికిన విశాల్ కళ్ళు, చివరకు
ఆమెకొసం తపించాయి.
రోజులు గడిచిన
కొద్ది -- బాధల యొక్క ఆవేదన, అతని మీద ఏర్పడ్డ విరక్తి కొబ్బరి పీచులాగా ఊడిపోగా మొక్క పోచలో దాగున్న కొత్త పువ్వు వికసించినట్టు లతకు విశాల్ మీద ప్రేమ పుట్టటం
మొదలుపెట్టింది. విశాల్ కోసం లత ఇల్లు మొత్తం వెతికింది. అతని గురించిన ఎటువంటి సమాచారం దొరకక నీరసపడిపోయిన ఆమె మనసు -- నీటి పారుదలకొసం
ఎదురుచూసే చెట్టులాగా అభిమానం, స్పర్శ అంటూ ప్రేమ ఇచ్చే
అన్నీ సుఖాల కోసమూ పరితపించింది.
దగ్గర దగ్గర మూడు
నెలలైనా విశాల్ గురించిన సమాచారం లతకు దొరకలేదు. గౌరి దగ్గర చూచాయగా విచారించినా
ఆమె పట్టించుకున్నట్టు కనబడటం లేదు. ఇంటికి రాని విశాల్,
వాళ్ల షాపుకైనా ఖచ్చితంగా వచ్చి వెడతాడనే నమ్మకంతో సుమారు
రెండు నెలలుగా ప్రొద్దున నుండి సాయంత్రం వరకు తపస్సు చేస్తున్నట్టు రోజూ అక్కడికి వెళ్ళింది. ఒక్క రోజు కాదు కదా,
ఒక్క పూటైనా విశాల్ అక్కడికీ రాలేదు. అన్ని దార్లూ
మూసుకుపోవటంతో విశాల్ ఏదైనా బయటి దేశానికి వెళ్ళుంటాడేమో అనుకున్నది.
ఇంట్లోని ప్రతి చోట,
ప్రతి వస్తువు లోనూ అతని రూపమే కనిపిస్తుంటే --- లతకు
పిచ్చి పట్టినట్టు అనిపించింది. జ్ఞాపకాల
అలలు రోజు ఆమెను చుట్టుముట్టి బలంగా తాకుతుండగా, ఆమె చిక్కి శల్యమైంది.
ఆమె పరిస్థితి యుక్త
వయసులో ఉన్న వందనకు అర్ధమయ్యింది.
"మీ దగ్గర ఒక
విషయం చెప్పాలే లతా”
అన్నది వందన.
"ఏమిటీ?"
అన్నట్టు చూసింది లత.
"సార్,
ఎక్కడున్నారని..." అన్నది.
"నీకు తెలుసా?"
ఆందోళన పడుతూ హడావిడిగా అడిగిన లతను చూడటానికే పాపం అనిపించింది.
"ఒక...ఊహే"
"పరవాలేదు. చెప్పు
వందనా --- ప్లీజ్..."
"టీ ఎస్టేట్"
"నిజంగానా?
అది ఎక్కడుంది?"
"కొండ
అడవి. ఇక్కడ్నుంచి ఐదు గంటలు ప్రయాణం"
"ఎలా వెళ్ళాలి?"
"సరిగ్గా
తెలియదు....కానీ, అక్కడికి తోడు లేకుండా వెళ్లలేరు అనేది తెలుసు. ఒంటరిగా వెళ్లటం ప్రమాదం.
ఒకవేల అతను బయట దేశాలకు వెళ్ళుండొచ్చు కదా?" అని అన్నది.
ఆ ప్రశ్న లతను అయోమయ
స్థితిలోకి తోసింది. 'అతను సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోతే...?'
"నువ్వు
బాధ పడకు లతా. నాకెందుకో ఆయన ఎస్టేట్ బంగళాలో ఉండుంటాడనే అనిపిస్తోంది.
నువ్వెందుకైనా మీ పిన్ని దగ్గర అడిగి చూడు.
"ఊహూ...పిన్ని
నాతో మాట్లాడటం లేదు"
"సారుకూ, మీకూ ఏదైనా సమస్యా?"
"హూ...! ఏ
రోజు అతను నాతో మొహం చూపించి మంచిగా మాట్లాడాడు...ఒక్క మాటైనా? ప్రేమగా, ఆదరణగా మాట్లాడిందే లేదు!"
ఎప్పుడు చూడూ ఆమె
మీద ద్వేషంతో మాట్లాడే వాడి చుట్టూతానే ఎందుకు ఆమె మనసు చుట్టిందనే రహస్యం ఆమెకే
అర్ధం కాలేదు.
తనని మళ్ళీ మళ్ళీ
అవమానపరచి పోవటానికే ఆ రాత్రి అలా నడుచుకున్నాడో అని కూడా ఆమెకు అనిపించి
ఉండవచ్చు.
"ఒకే ఒక దారి
ఉంది లతా "
"చెప్పు"
"నువ్వు నీ
స్నేహితుడు కిరణ్ దగ్గర సహాయం అడగటం మంచిది"
"అతను ఇక్కడికి
రావటానికి ఇంకా ఒక వారం ఉందే?"
"ఆరునెలలు
కాచుకున్న మీరు ఇంకొక వారం ఓర్పుగా ఉండలేరా ఏమిటి?"
ఆ వారం రోజూలూ, లత ఇరవై నాలుగు గంటలూ ఎదురు చూపుతోనే
గడిపింది.
కిరణ్ వచ్చే రోజును
లెక్క వేసుకుని, వేసుకుని
నీరసపడిన ఆమె, అతను కాలు మోపగానే అతని కాళ్ళను చుట్టేసింది.
"ఉండు...ఎందుకంత
ఆందోళన పడతావు? అతను పోతే పోనీ!
నీకు అతని కంటే మంచివాడు దొరుకుతాడు" అన్నాడు.
అతను పలుసార్లు విశాల్
ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు, ఒక్క రోజు కూడా విశాల్ అతనితో నవ్వుతూ సహజంగా మాట్లాడలేదు. ఎప్పుడూ
చిటపటలాడే మొహంతో ఉండే విశాల్ మీద అతనికి మంచి అభిప్రాయం లేదు.
అలాంటి ఒక జీవి కోసం
ఈమె తాపత్రయ పడటం అతనిలో విసుగు తెప్పించింది.
"ఏం మాట్లాడుతున్నారు?"
కన్నీరుతో అడిగింది.
"అర్ధం చేసుకో లతా.
నేను చెబుతున్నానని కోపగించుకోకు . అతను అందరిలాగా మామూలు మనిషి కాదు"
"కిరణ్"
"అతను
ఎవరితోనైనా సరదాగా మాట్లాడటం ఎప్పుడైనా చూసావా? ఇల్లు, ఆఫీసు, నీ పిన్నీ --
ఇదే అతని ప్రపంచం. ఒక కుటుంబం, దాని అందాలు ఇవన్నీ అతనికి
తెలియదు. నిన్ను పూర్తిగా ఇష్టపడుతుంటే ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళుండేవాడా?
అతన్ని మరిచిపోవటమే మంచిది. ఖచ్చితంగా అతని వలన నిన్ను సంతోషంగా
ఉంచుకోవటం కుదరదు. ఇలాంటి సంకుచిత మనస్తత్వం గలవారికి, ఆత్మగౌరవాన్ని
తక్కువ అంచనా వేసుకోవటం, మూర్ఖత్వం, అనుమానం
లాంటి చెడ్డ గుణాలు ఉంటాయి. వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటూనే వాళ్ళ నిజ స్వరూపం
తెలుస్తుంది"
"చాలు కిరణ్"
"నిదానంగా
ఆలొచించు. నేను చెప్పేది నిజమని నీకు అర్ధమవుతుంది"
కోపమూ, ఆవేదన ఒకటిగా చేరటంతో సమాధానం చెప్పకుండా
గబగబా వెళ్ళిపోయింది లత.
'ఛ...మూర్ఖురాలు.
అర్ధం చేసుకోదూ, పెట్టదూ' అని విసుగుతో
గొణుకున్న అతను, మనసు అంగీకరించక గౌరిని వెళ్ళి కలిశాడు.
"నేను ఏం
చెప్పను కిరణ్? విశాల్ -
లత ఇద్దరూ నా రెండు కళ్ళు లాంటి వారు. చిన్న వయసులోనే అతనికి ఏర్పడ్డ అనుభవాల వలన ఒకవేల అలా
అయ్యాడో, ఏమో? ఇన్ని రోజులలో అతని
దగ్గర నుండి అభిమానాన్ని తప్ప నేను ఇంకేమీ చూడలేదు. అతనిలో దాగున్న గుణాలను అతను
ఎలా తెలుసుకున్నాడో? ఏమీ అర్ధం కావటం లేదు. ఒక రోజు నా
ఎదురుగా వచ్చి ఏదో పోగొట్టుకున్న వాడిలా నిలబడ్డాడు. అతను అంతలా బాధపడుతూ కృంగిపోయి నిలబడటం నేనెప్పుడూ
చూడలేదు" అన్న గౌరి, పాత రోజులలోని విశాల్ ను కళ్ళ
ముందుకు తెచ్చుకుంది.
"అత్తయ్యా!
నేను లతను ఎంత లోతుగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. కాలమంతా నేను తపస్సు చేసి
పొందిన వరం ఆమె. ఆమెను నేను ఒక పువ్వులాగా చూసుకోవాలి. ఇన్ని రోజులూ ముళ్ళ
పొదలాగానే ఉన్నాను. నాలో ఏదో ఉంది. అన్ని
కళలూ పీకిపారేసిన నేను పూర్తిగా మనిషిని కావాలి. నా మనసులో లోతుగా ఏర్పడిన గాయాలు
ఆరాలి. దానికి కొంతకాలం డాక్టర్.రుబాస్
దగ్గర ట్రీట్ మెంట్ తీసుకోవాలి. ఆయన ప్రసిద్ది చెందిన మనోతత్వ నిపుణుడు. నా
గురించిన వివరాలేవీ లతకు తెలియనివ్వకండి. మన ఎస్టేట్ బంగళాలో ఉంటాను. అమె వలన నేను లేకుండా పోవటం
తట్టుకోలేదు. ఆమె పడే వేదనను మీరు నా కోసం ఒర్చుకోండి! అన్న అతను,
నా లతను బాగా చూసుకోండి అత్తయ్యా. నేను కొత్త మనిషిగా...నా లతకు
సరిపోయేవాడిలాగా తిరిగి వస్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు.
పోయిన వారం అతన్ని
వెళ్ళి చూశాను. యోగా, ద్యానం అంటూ చురుకుగా ఉన్నాడు. కానీ, లత పడుతున్న వేదనను నేను చూడలేక పోతున్నాను. కిరణ్,
'ఇంకా ఒక వారం పోనీ అత్తయ్యా'
అని వాడు చెప్పటం వలన మౌనంగా ఉన్నాను" ఆమె మాట్లాడ,
కిరణ్ మనసులో విశాల్ గొప్ప స్థానం సంపాదించుకున్నాడు.
ఇంతకుపైన ఆమెను
వేధించకూడదు అని అనుకుని, మరుసటి రోజు లతను తీసుకుని, ఎస్టేట్ వాకిట్లో వదిలేసి వచ్చాడు కిరణ్.
Continued....PART-17(Last Part)
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి