21, డిసెంబర్ 2019, శనివారం

రాళ్ళే పుస్తకాలు...(ఆసక్తి)




                                                రాళ్ళే పుస్తకాలు...(ఆసక్తి)

శాసనం (Epigraphy లేదా Inscription) అంటే పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో కాగితంతో తయారుచేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు తమ రాజ్యపు అధికారిక శాసనాలను 'రాళ్ళ పై, రాతిబండలపై, రాగిరేకులపై చెక్కించి, బధ్రపరిచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటలనే శాసనం అనేవారు.


ఆ తరువాత శిలాశాసనాలు తగ్గిపోయి లోహ శాసనాలు ప్రాధాన్యత వహించాయి. సంఖ్యాపరంగా చూస్తే శిలాశాసనాలకన్నా ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ వీటికి చారిత్రిక ప్రాధాన్యత చాలా ఎక్కువ. పల్లవ, కదంబ, గాంగ, చాళుక్యాది వంశాల చరిత్ర ప్రధానంగా లోహ శాసనాలపై ఆధారపడి ఉన్నాయి. మంత్రతంత్రాలకు సంబంధించిన వివరాలేవో వాటిపై వ్రాసి ఉన్నాయని ప్రజలు భావించడంతో చాలా శాసనాలు వెలుగులోకి రాలేదు. వీటిలో నిధినిక్షేపాలున్న ప్రదేశాల దారిని చూపే రహస్యం ఉండవచ్చని పలువురు భావించి ప్రభుత్వానికి ఇవ్వక తమ వద్దే దాచుకోవడంతో ఎంతో చరిత్ర కాలగర్భంలోనే ఉండిపోయింది. కొందరు తామ్ర శాసనాలను కరిగించి ఇంటికి ఉపయోగించే చెంబులు, తపేలాలు, గుండిగలు వంటివి తయారుచేసుకున్నారు. వీటివల్ల ఎంతో విలువైన చారిత్రక సమాచారం నశించిపోయింది.


మాండలే ఒక బర్మా పట్టణం. ఇది రంగూన్ తర్వాత బర్మాలో రెండవ పెద్ద పట్టణం. మాండలే బర్మా దేశ ఈశాన్యదిశలొ 240 మీటర్ల వైశాల్యం కలిగిన పర్వతం అనేక ఆలయాలకు, మఠాలకు నిలయం. బర్మా దేశంలోని బౌద్దమతస్తులకు ఇది ఒక పుణ్యక్షేత్రం. పర్వత శిఖరంపైన ఉన్న ఆలయం 'కోరుకున్నేవన్నీ వరాలుగా ఇచ్చే ఆలయం' గా ప్రసిద్దిచెందింది. 1857లో బర్మాను పాలిస్తున్న రాజు మిన్ డాన్ మిన్ శాంతి కాముకుడు, అహింసావాది. బుద్దుని బోధనలు తరతరాలకూ నిలిచిపోవాలని, భావితరాలకోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించుకున్నాడు. బుద్దుని బోధనలను లోహ శాసనాలపై రాయించి భద్రపరిచినా అవి నశించిపోతాయని గ్రహించి, వాటిని భారీ రాతి దిమ్మలపై రాయించి, భద్రపరచాలని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలోనే బర్మాపై బ్రిటీష్ సేనల దండయాత్ర మొదలయ్యింది. దండయాత్రలో తాను ఓడిపోయినా బుద్ధుని బోధనలతో ఉండే భారీ రాతి దిమ్మెలకు ఎటువంటి హానీ జరగకూడదనుకుని తన పని మొదలుపెట్టాడు.


ఒక మీటర్ పొడుగు, ఒకటిన్నర మీటర్ వెడల్పు, 13 సెంటీమీటర్ల మందం ఉన్న పాలరాయి దిమ్మెలను తెప్పించాడు. వాటిమీద బుద్ధుని బోధనలను చెక్కించాడు. మొత్తం 729 పాలరాతి దిమ్మెలపై చెక్కారు. ఒక పాలరాతి దిమ్మెపై మిగిలిన 729 రాళ్ళు ఎలా ఉనికిలోకి వచ్చాయన్న విషయాన్ని తెలియజేసే సమాచారాన్ని చెక్కించాడు. అలా మొత్తం 730 రాతి పుస్తకాలు తయారయ్యాయి.


1860 లో రాతి పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. దీనికొసం తన రాజభవనం దగ్గరే ఒక అతిపెద్ద షెడ్ వేయించాడు. అంతకుముందు తాళపత్రాలలో ఉన్నటువంటి బుద్ధుని బోధనల మూలమును సీనియర్ మఠాధిపతులు, అధికారులు శ్రద్ధగా, క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట ఒక లేఖరి జాగ్రత్తగా కాపీ చేసి ఒక శిల్పికి అందించాడు. ఆ శిల్పి బుద్ధుని బోధనలను పాలరాతి మీద చెక్కడం జరిగింది. ఒక్కొక్క రాతి మీద 80 నుండి 100 పంక్తుల చొప్పున రాతికి ఇరువైపులా బర్మా లిపితో చెక్కబడింది. పంక్తులను బంగారు రేకుతో నింపాడు.


ఒక్కొక్క పాలరాతి పుస్తక దిమ్మెకు ఒక గుడి కట్టించి, అందులో వాటిని ఉంచాడు. 1860లో ఈ గుడులను కట్టటం మొదలుపెట్టారు. గుడి గోపురాలను 1862లో ముగించారు. 1868 మే నెల నుండి పర్యాటకులను అనుమతించారు. ఈ గుడులను 3 వరుసలుగా కట్టారు. మొదటి వరుసలో 42 గుడులు, రెండవ వరుసలో 168 గుడులు, మూడవ వరుసలో 519 గుడులు నిర్మించారు. వీటికి దక్షిణ దిశలో ఒకటి కట్టి అందులో ఈ గుడి సమాచారమును చెక్కిన పాలరాతి దిమ్మెను ఉంచారు. దీనితో ఆ ఆలయంలో మొత్తం 730 గుడులయ్యాయి. ఒక్కొక్క గుడి మీద బంగారు, వెండి వజ్రాలు, వైఢూర్యాలు ఉంచారు.


1885లో బ్రిటీష్ సేనలు బర్మాపై దాడిచేసి ఈ చోటుని కూడా ఆక్రమించాయి. బౌద్ధమత మఠాదిపతులును కూడా అనుమతించలేదు. అప్పుడు బ్రిటీష్ ను పరిపాలిస్తున్న విక్టోరియా మహారాణి అన్ని మతాలను గౌరవించాలని, వారి ఆలయాలకు, మఠాలకు ఎటువంటి నష్టం జరగకూడదనే గట్టి శాసనం బ్రిటీష్ సేనాధికారులకు ఇచ్చిందని తెలుసుకున్న బర్మా బౌద్ధ మఠాధిపతులు, విక్టోరియా మహారాణికి ఈ ఆలయాన్ని వారి సేనలు ఆక్రమించాయని తెలియజేశారు. వెంటనే ఆ ఆలయం నుండి సేనలను తిరిగి రమ్మని ఆమె శాసించింది. కానీ అప్పటికే ఆలయంలోని గుడులమీద ఉన్న విలువైన వస్తువులను వారు అపహరించారు. పాలరాతి దిమ్మెలను పగులకొట్టలేకపొయారు. మహారాణి ఆజ్ఞమేరకు బ్రిటీష్ సేనలు ఆ ఆలయాన్ని వదిలిపెట్టి వచ్చారు. నాశనం చేయబడ్డ ఈ ఆలయాన్ని 1913లో సరిచేశారు. 2013లో యునెస్కోవారు ఈ ఆలయాన్నీ, ఆలయంలో ఉన్న పాలరాతి దిమ్మెలను ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తకాలుగా గుర్తించారు.

Images Credit: To those who took the original Photos.
************************************************************************************************

17, డిసెంబర్ 2019, మంగళవారం

అలల రహదారి...మిస్టరీ



                                                         అలల రహదారి

అలలు ఏర్పరచిన రహదారి - రోజుకు రెండుసార్లు, కేవలం ఒక గంట మాత్రమే తెరుచుకుంటుంది.

ఫ్రాన్స్ దేశంలో నాయర్మౌటియర్ అనే ద్వీపానికీ, వాండీ అనే నగరానికీ మధ్యవున్న రెండు సముద్ర తీరాలనూ కలుపుతూ సముద్రపు అలలు ఏర్పరచిన రహదారే 'పాసేజ్ డు గాయ్స్’ అనే రహదారి.


పూర్వం ఇటు నుండి అటు వెళ్ళటానికి పడవ మాత్రమే అధారం. కానీ 18 వ శతాబ్ధంలో ఒక రోజు సముద్రం విడిపోయి ఆ రెండు ఊర్లకూ ఒక రహదారి ఏర్పరచింది. అలా ఎందుకు ఏర్పడిందో తెలియని ప్రజలు మొదట ఆశ్చర్యపోయినా, క్రమేపీ ఆ రహదారిని వాడుకునే వారు. కానీ రెండుగా విడిపోయిన నీరు, ఒక గంట తరువాత ఆ రహదారిని మూసేస్తూ కలిసిపోయేది. అలా రోజుకు రెండుసార్లు మాత్రమే ఒక గంటో లేక రెండు గంటలో దారి వదిలేది. ఈ విషయం తెలియక అప్పట్లో చాలామంది ప్రజలు ఆ రహదారి గుండా వెళుతుంటే, ఆకస్మికంగా సముద్రపు అలలు ఒకటైపోయి, ఆ దారిని మూసేసేవి. అదే సమయాన ఆ రహదారిలో వెళుతున్న ప్రజలు ఆ అలలలో కొట్టుకుపోయేవారు.


నాగరికత పెరుగుతున్నకొద్దీ ఈ రహదారి ఏర్పడటం, మూసుకుపోవడంతో పాటూ అది ఎంత సమయంలో జరుగుతోంది అనేది కూడా లెక్కలు కట్టి, ప్రమాదం లేని సమయాలలో మాత్రమే ఈ రహదారి వాడేవారు. ఒక్కోసారి వారి లెక్కలు తప్పి మనుష్యులు కొట్టుకెళ్ళటం జరిగేది.

ఇలా సముద్రంలో రహదారి ఏర్పడుతోందని 1701 లో మొదటిసారిగా చిత్రపటాలలో చూపించారు. 1840 లో శాస్త్రవేత్తల లెక్కలతో ప్రభుత్వం అక్కడ తారుతో రహదారి ఏర్పరిచింది. కానీ ఆ రహదారి మూసుకుపోవటాన్నీ, రోజుకు రెండుసార్లు మాత్రమే ఆ రహదారి తెరుచుకోవటాన్ని మాత్రం వారు ఆపలేకపోయారు. అందువలన 1971లో ఆ రహదారికి కొన్ని మైళ్ళ దూరంలో ఓ వంతెన నిర్మించారు. కానీ ప్రజలు అలలు ఏర్పరచిన రహదారినే ఉపయోగిస్తూ వచ్చారు.


ప్రపంచంలోని మరికొన్ని ప్రదేశాలలో ఇలాంటి రహదారులున్నా, ఈ రహదారి మాత్రం ప్రాముఖ్యత తెచ్చుకుంది. కారణం, దీని పొడవు--రెండు ఊర్లకూ మధ్య 4.5 కిలోమీటర్ల దూరం ఉండడమే! అంత దూరానికి రహదారి ఏర్పడుతుంది. అలాగే రహదారి మూసుకుపోయినప్పుడు అక్కడ నీరు 1.3 మీటర్ల ఎత్తు నుండి 4 మీటర్ల దాకా ఉంటుంది.


ప్రకృతి అలల మూలంగా ఏర్పరచిన ఈ రహదారిని దాటటమే మన మనసులను కదిలిస్తుందని ప్రజలు ఈ రహదారినే వాడుతున్నారు. అందువలన ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని ఆ రహదారికి ఇరువైపులా అలల కోసం హెచ్చరికగా ఉండమని ప్రకటన పలకలు ఉంచింది. అయినా అప్పుడప్పుడు బాధాకరమైన సంఘటనలూ జరుగుతూనే ఉన్నాయి.


ప్రభుత్వం అలలు వచ్చేటప్పుడు తప్పించుకోవటానికి ఎత్తైన రక్షణ టవర్లు నిర్మించారు. ఆ టవర్లలో ఎక్కి తప్పించుకున్న వారిని ప్రభుత్వం రక్షక దళాలను పంపి రక్షిస్తుంది. ఈ రహదారిని చూడటానికీ, అందులో నుండి నడవటానికి పలుదేశాల నుండి పర్యాటకులు వస్తూ ఉంటారు.

Images Credit: To those who took the original Photos.

*******************************************************************************************

15, డిసెంబర్ 2019, ఆదివారం

వాతావరణ నియంత్రణ జరుగుతొందా?(మిస్టరీ)



                                      వాతావరణ నియంత్రణ జరుగుతొందా?

వెదర్ వార్ ఫేర్---ఈ మధ్య ఈ మాట తరచుగా వినబడుతోంది. శక్తివంతమైన వాతావరణ నియంత్రణ పరికరాలు ఉపయోగించి అగ్రరాజ్యాలు ఇతరు (తమకు ఎదురు చెప్పే) దేశాల వాతావరణంలో మార్పిడి తీసుకు వచ్చి ఆ దేశాలలో కరువు, వరదలు, తుపానలు, భూకంపాలు సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. కానీ ఆ సంగతిని ఎవరూ నిరూపించలేకపోతున్నారు.

వాతావరణ మార్పిడికి అవసరమైన టెక్నాలజీ అగ్రరాజ్యాల దగ్గర ఉన్నదని అందరికీ తెలుసు. అయితే ఈ టెక్నాలజీని యుద్ధాలలో వాడకూడదని 1978 జెనీవా సమావేశంలో అగ్రదేశాలు ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ రహస్యంగా శక్తివంతమైన వాతావరణ నియంత్రణ పరికరాలతో పరిశోధనలు జరుగుతున్నాయని, జరిగాయని, ఈ పరిశోధనలను ఇతర దేశాల వాతావరణంపై వాడుతున్నారని/వాడారని అగ్రరాజ్యాలపై ఒక నింద ఉంది. దీనికి కారణాలేమిటో తెలుసుకుందాం.


1967-1968లో 'ఆపరేషన్ పాప్ ఐ' అనే పెరుతో అమెరికా, వియత్నాంలో వాతావరణ మార్పిడి ఏర్పరచి అక్కడ వరదలు సృష్టించి శత్రుసేనలను బలహీనం చేసింది. యుద్దంలో శత్రుసేనలు నష్టపోలేదు గానీ, సాధారణ పౌరులు తీవ్రంగా నష్టపోయారు. అందువలనే వాతావరణ మార్పిడి పద్దతిని యుద్ధాలలో వాడకూడదని జెనీవా ఒప్పందం జరిగింది. ఆ తరువాత వాతావరణ వార్ఫేర్ గురించి అందరూ మరిచిపోయారు.


వాతావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ లాంటి పరిస్థితులు నెలకొనడంతో, వాటి నుండి బయటపడటానికి వాతావరణ మార్పిడి అనే మాట మళ్ళీ తలెత్తింది. మానవులవల్ల ఏర్పడిన వాతావరణ కాలుష్యం, అదే మానవులచేత శుద్ధిపరచాలని అంతర్జాతీయ సదస్సులు జరిపి వాతావరణ కాలుష్యానికి ముఖ్యకారణమైన కార్బన్ డై ఆక్సైడ్ ను ప్రతి దేశమూ తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఏ ఏ దేశం ఎంత తగ్గించాలి. ఎంత శాంతం తగ్గించాలి అనే విషయంపై చర్చ జరుగుతోంది. కానీ ఏ దేశమూ కచ్చితమైన లెక్కలకు రాలేకపోతోంది. దీనిని కారణంగా తీసుకుని అగ్రరాజ్యాలు వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కృతిమ పద్దతులను (రసాయనాలు వాడి) ఉపయోగించి గ్లోబల్ వార్మింగ్ ని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని, దానికి కావలసిన టెక్నాలజీ తమ దగ్గర ఉన్నదని చెప్పడంతో శాస్త్రవేత్తలలోనూ, ప్రజలలోనూ మళ్ళీ ఆందోళన చెలరేగింది.


అగ్రరాజ్యాలు ఇప్పటికే ఆ టెక్నాలజీ వాడుతున్నారని, అలాంటి పరిశోధనా కేంద్రాలలో ముఖ్యమైనది, అత్యంత శక్తివంతమైంది అమెరికాలోని 'హార్ప్'(HAARP...High Frequency Active Auroral Research Program) పరిశోధనా కేంద్రమని, అక్కడి నుండి రహస్యంగా వాతావరణ మార్పిడి జరుగుతోందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం వీరి మాటలను ఖండిస్తున్నది. మరైతే 'హార్ప్'(HAARP) లో మీరు చేస్తున్న పరిశోధనలు ఏమిటని ప్రశ్నించినప్పుడు "మా దేశ రక్షణ కోసం మేము ఏర్పరుచుకున్న పరిశోధనా కేంద్రం" అని చెబుతున్నారు.

"ప్రకృతి వైపరీత్యాల వెనుక వున్నది ఏమిటి?...అనంతమైన శక్తి. ఈ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే ఆ ప్రకృతి వైపరీత్యం అంత శక్తివంతంగా ఉంటుంది. వాతావరణంలోని పై పొరైన అణుశకలావరణం (Lonosphere) లోకి HAARP 1.17 జిగా వాట్స్ వికిరణ శక్తిని బీమ్ చేస్తోందట. ఆ వికిరణ శక్తి, అత్యంత వేగంతో తిరిగి భూమిపైకి తోయబడుతుంది. అలా తోయబడిన వికిరణ శక్తే తుపాను, భూకంపం, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలను సృష్టిస్తుంది" అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఇవి ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. నవంబర్-13, 1997 లో వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక ఒక వార్త ప్రచురించింది. మలేషియా తమ దేశంలో ఏర్పడిన పొగమంచును మానవ నిర్మిత తుఫాన్ తో ఎదుర్కోవటానికి, రష్యా దేశానికి చెందిన ఒక వాతావరణ మార్పిడి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదని ఆ వార్త. ఒప్పందం ప్రకారం ఆ సంస్థ మలేషియాలో హరికేన్ సృష్టించింది. ఆ హరికేన్ వలన మలేషియాలో పొగమంచుపోయి స్పష్టమైన వాతావరణం నెలకొన్నదని ఆ వార్తలో రాశారు.

"హరికేన్ కత్రీనా న్యూ ఓర్లియన్స్ ను తాకటానికి రష్యా గూఢచార సంస్థే కారణం. 1976 నుండి అమెరికాదేశ వాతావరణాన్ని వారే నియంత్రిస్తున్నారు" అని రిటైర్డ్ అమెరికన్ Lieutenant Colonel Thomas Bearden ఆరోపిస్తున్నారు.

1952 లో ఇంగ్లాండు దేశంలోని లిన్ మౌత్ గ్రామంలో ఇంగ్లాడ్ దేశ రాయల్ ఏర్ ఫోర్స్ నిర్వహించిన 'వర్షం కోసం వాతావరణ మార్పిడి పరిశోధన వలన అక్కడ 20 నిమిషాల సమయంలో అత్యంత అధిక వర్షపాతం కురిసి, వరదలు ఏర్పడి ఆ గ్రామానికి తీవ్ర నష్టం జరిగింది. గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి మాత్రమే సోలార్ రేడియేషన్ మేనేజ్ మెంట్ పద్దతి వాడుతున్నామని Intergovernment Panel on Climate Change(IPCC) తమ నివేదికలో తెలిపినా, 'గ్లోబల్ వార్మింగును తగ్గించడానికి ఆ పద్దతి ఉపయోగపడదు. కాబట్టి దీనిని చెడు ప్రయోజనాల కోసమే వాడుతున్నారు అని కొంతమంది శాస్త్రవేత్తలు వాపోతున్నారు.


ప్రాజెక్ట్ స్టామ్ ఫ్యూరీ(Project Stormfury) పేరుతో తుఫాన్ల వుద్రిక్తతను తగ్గించడానికి అమెరికా చేపట్టిన పరిశోధన ఇది. విమానం ద్వారా సముద్రంలోని సుడిగుండంలో సిల్వర్ ఐయొడైడ్ చల్లితే తుపాన్ బలహీనం చెందుతుంది. 1962 నుండి 1983 వరకు అమెరికా ఈ పరిశోధన చెపట్టింది. ఈ పరిశోధనల వలన 4 తుఫానల తీవ్రతను 30 శాతం తగ్గించగలిగారట.


కెమ్ ట్రయల్స్(Chemtrails): విమానాలలో నుండి వస్తున్న పొగను కెమ్ ట్రయల్స్ అంటున్నారు. విమానాలలో నుండి వస్తున్నది హానికరం కాని పొగ కాదు. అది అగ్ర రాజ్యాలు వాతావరణ మార్పిడికోసం రసాయనాలు వెదజల్లడమే అని ఒక వాదన బలపడుతోంది. 19990లో చైనా రాజధాని బీజింగ్ నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ ఆటలలో పాల్గొన్నవారు, కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండేందుకు బీజింగ్ నగర వాతావరణంలో మార్పిడి తేవటానికి అమెరికా ఈ పద్ధతి వాడింది.

'వాతావరణ ఇంజనీరింగ్' ఉన్నదనటానికి కావలసిన జవాబులు ఉన్నాయి కనుక, వాతావరణ నియంత్రణ జరుగుతోందంటున్నారు. ఎవరో ఒకరు దీనిని శాస్త్రీయంగా నిరూపించేంతవరకు ఇది మిస్టరీగానే ఉంటుంది.

Image Credits: to those who took the original photos.
*************************************************************************************************

13, డిసెంబర్ 2019, శుక్రవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్-చివరిపార్టు)...PART-15



                               ప్రేమ సుడిగుండం (సీరియల్-చివరిపార్టు)
                                                             (PART-15)


వరుణ్ నల్గొండ దగ్గరకు జేరుకున్నాడు. స్కూటర్ అపాడు.

'ఇక ఏం చెయ్య బోతాము?' అక్కడున్న ఒక బండరాయి మీద కూర్చుని ఆలొచించాడు.

చిన్న వయసు నుండే అతను బిడియస్తుడు. అమ్మా, నాన్న, తమ్ముడితో తప్ప వేరే ఎవరి దగ్గర గబుక్కున మాట్లాడడు. ప్రతిమ వాళ్ళింటికి రావటంతో అతని బిడియం ఇంకా ఎక్కువ అయ్యింది!

ఆమే అతన్ని అపి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అలా మాట్లాడి మాట్లాడి అతని బిడియాన్ని కొంచంగా తగ్గించింది. కొన్ని రోజుల తరువాత ఆమెతో కొంచం సహజంగా మాట్లాడాడు.

ఒకసారి...ప్రతిమకు బాగుంటుందని 'స్టికర్ బొట్లు’ కవర్ ఒకటి ఎక్కడో దారిలో అమ్ముతుంటే కొనుక్కుని వచ్చాడు. ఆ రోజే అమ్మ అడిగింది.

"ప్రతిమను నీకు నచ్చుతుందా?"

"ఎందుకు అడుగుతున్నావ్?"

"లేదు...బొట్టు బిల్లల్లు కొనొకొచ్చావే?"

"దారిలో చూశాను. బాగున్నాయి! అందుకే కొనుకొచ్చాను. ఇందులో తప్పేముంది?"

"తప్పు లేదు..." ముసిముసి నవ్వు నవ్వింది.

"దాన్ని నీకు పెళ్ళి చేసిస్తే?" అన్నది.

అతను వెంటనే సిగ్గు పడ్డాడు. ముఖంలో మార్పు కనబడకూడదని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత అమ్మ దాని గురించి మాట్లాడకపోయినా అమె చెప్పిన మాటలూ, ప్రతిమ యొక్క అందమూ అతని మనసులో నిద్రపోతున్న ఏదో ఒక భావాన్ని తట్టిలేపింది.

పెళ్ళి చేసుకున్న తరువాత, మొదటి రాత్రి రోజున తన ప్రేమను ఆమెకు పెళ్ళి కానుకగా ఇవ్వాలని అనుకున్నాడు.

అమ్మ వాళ్ల పెళ్ళిని నిర్ణయించిన రోజు లోలోపల ఒక పిల్లాడిలాగా మారిపోయి ఎగిరి గంతులేశాడు. కానీ, అన్నీ పొంగుతున్న పాలు లాగా అనిగిపోయింది.

తనది అని అనుకుంటున్న దానిని...అతనికే తెలియకుండా కలలాగా అయిపోయింది. తనది 'ఒన్ సైడ్ లవ్' అని తెలిసిన నిమిషం...లోలోపల కుమిలిపోయాడు. అదే సమయం కిరణ్ ని ఆమె ప్రేమించింది అని ఆవేశపడలేదు. 'ఇది దేవుడి యొక్క ఇష్టం!' అనే తీసుకున్నాడు.

తల్లి యొక్క పథకాలను స్వయంగా ఆపలేమని అర్ధంచేసుకున్న పరిస్థితులలో...ఆమె దారిలోనే వెళ్ళి ప్రేమికులను ఒకటి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. అతని పథకం ప్రకారమే ఇంతవరకు జరిగింది. రేపటి ముహూర్తంలో కిరణ్ ప్రతిమ మెడలో తాలి కడతాడు.

'ఇక ప్రతిమ తమ్ముడి భార్య. ఆమెను మనసులో తలుచుకోవటం కూడా మహాపాపం. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే...తాను అక్కడికి వెళ్ళనే కూడదు. అదే సమయం ఇంకొక అమ్మాయితో కూడా జీవితాన్ని పంచుకోవటానికి తయారుగా లేను. ఎప్పుడైతే మనసు ఒకదాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించిందో...అప్పుడే మనసు అన్నీటినీ విడిచిపెడుతున్నట్టు అర్ధం’

'ఎందుకు ‘ప్రేమ-అభిమానాలు’ అనే వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకోవటం? అన్ని బంధాలూ తెంపుకుని ఒక జ్ఞాని జీవితానికి తనని తయారుచేసుకోవటం కష్టమా ఏమిటి? అవును...అదే సరి! అన్నిటినీ తెంపుకోవాలి. ఇక్కడ ఏదీ శాస్వతం కాదు. బంధుత్వాలను వదిలి కొత్త జన్మ ఎత్తాలి.

స్కూటర్ ను అక్కడ వదిలేసి నడవటం మొదలు పెట్టాడు. బస్ స్టేషన్ చేరుకున్నాడు. అక్కడ బస్సు ఎక్కి రైలు స్టేషన్ కి వెళ్ళాడు. ఎర్ణాకులం రైలు ఎక్కాడు. ఖలీగా ఉన్న బెర్త్ లో పడుకున్నాడు.

వరుణ్ ఎక్కడికి వెళ్లాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు...ఎవరికీ తెలియదు.

******************************************సమాప్తం***************************************

11, డిసెంబర్ 2019, బుధవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-14



                                              ప్రేమ సుడిగుండం (సీరియల్)  
                                                               (PART-14)                                                           


మంచి టైము చూసి అందరూ మండపానికి బయలుదేరారు. ప్రతిమ పూర్తి పెళ్ళి కూతురు అలంకారంతో కారులోకి ఎక్కింది. అత్తయ్య...మరో ఇద్దరు బంధువులు పక్కన కూర్చోగా...బయలుదేరటానికి రెడీ అయ్యింది కారు.

మరో కారులు మగవాళ్ళందరూ ఎక్కారు. అరటి చెట్లు, పందిరి, సీరియల్ బల్బుల అలంకరణతో ఇళ్ళు కలకలలాడుతోంది.

"ఇల్లు తాళం పెట్టాలా? ఎవరైనా ఒకరు ఇంట్లో ఉంటే మంచిది కదా?" -వరుణ్ అడిగాడు.

"పనమ్మాయి రావాలి...అది ఇంకా రాలేదు?"

"ఒక పని చెయ్యండి...మీరంతా బయలుదేరండి. పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి వస్తాను" అన్నాడు వరుణ్.

"ఏమిట్రా ఇది...పెళ్ళికొడుకును నిన్ను వదిలిపెట్టి మేము ఎలా వెళ్ళగలం? రేయ్ కిరణ్...నువ్వు కావాలంటే ఉండేసి తరువాత వస్తావా?" అడిగింది తల్లి.

"వాడ్ని మీతో రానీయమ్మా. అక్కడ చాలా పనులున్నాయి! పెళ్ళికొడుకైతే ఏమిటిట...నాకేమన్నా కొమ్ములు మొలిచాయా! మంచి రోజు కదా, ఇల్లు తాళం వేయకూడదని అలొచిస్తున్నా. మీరు బయలుదేరండి. పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి, ఒక ఆటో పట్టుకుని వచ్చేస్తాను"

"ఆటో ఎందుకు? నీ 'స్కూటర్’ ఉందిగా! దాంట్లోనే రా. అక్కడేమైనా అర్జెంటు పనులుంటే ఎవరికైనా పనికొస్తుంది"

వరుణ్ వాళ్ళను పంపించి ఇంటి లోపలకు వచ్చాడు. అర గంట తరువాత పనమ్మాయి వచ్చింది. దాని చేతికి ఇంటి తాళాలు ఇచ్చి వరుణ్ బయలుదేరాడు.

"ఏదైనా 'ఫోన్’ వస్తే, ఎవరూ...ఏమిటీ? అని అడిగుంచు. కల్యాణ మండపం 'అడ్రస్సు’ అడిగి ఎవరైనా మాట్లాడితే...పక్కనే పత్రిక పెట్టాను చూడు. అది చూసి ‘అడ్రస్సు’ చెప్పు. లెటర్ ఏదైనా వస్తే తీసి ఉంచుకో. నువ్వొకదానివే నా పెళ్ళి చూడకుండా ఉంటావు. పరవలేదు....తరువాత నీకు మాత్రం స్పెషల్ గా ... 'వీడియో’ వేసి చూపిస్తాను"

వరుణ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు. మనసు ఎలా వెళ్ళమంటే స్కూటర్ను అలా నడిపాడు. సిటీ దాటి హైవేలోకి ప్రవేసించి నిదానంగా వెడుతోంది అతని స్కూటర్.

కల్యాణ మండపంలో అతనికోసం అందరూ కాచుకోనున్నారు. 'ఇదిగో వచ్చేస్తాడు....' అని నమ్ముతుంటారు. సమయం అవుతున్న కొద్ది ఆందోళన చెందుతారు. మండపం లోపలకూ, బయటకూ తిరుగుతుంది తల్లి...అల్లల్లాడిపోతుంది.

నాన్న ఇంటికి 'ఫోన్ చేస్తారు. 'అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయారే...!'అని పనమ్మాయి చెబుతుంది.

మనిషి కొక దిక్కుగా వెతుకుతారు. అతను దొరకడు. అమ్మ ఏడుస్తుంది. 'ఎక్కడికెల్లి చచ్చాడు ఈ దరిద్రుడు అని తిట్టుకుంటుంది. రాత్రంతా రాక పోవటంతో...'ఇక ఏం చేయాలి?' అని ఒక అర్జెంట్ మీటింగు జరుగుతుంది.

“పెళ్ళి ఆగటం అపశకునం. మంచి కార్యం ఆగిపోకూడదు. ఒకవేల అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదో ఏమో? అందుకే రాకుండా ఎక్కడికో పోయాడు! అందుకని పెళ్ళి ఆగిపోవాలా? పెద్ద కొడుకు లేకపోతే ఏమిటి? చిన్న కొడుకు ఉన్నాడే! వాడిని పెళ్ళికొడుకు చేయండి!” చెప్పాడు వరుణ్ మామయ్య. అక్కడున్న అందరూ వంతు పాడారు.

“ప్రతిమ, మీరు కన్న బిడ్డ కాదు. అయినాకానీ ప్రేమంతా వొలకబోసి పెంచారు. ఆమె పెళ్ళి ఆగిపోతే...అందులోనూ మీ కొడొకు రాకుండా పోయినందువలన ఆగిపోయిందని తెలిస్తే, ఆమె భవిష్యత్తు చీకటైపోతుంది. ఆమెను పెళ్ళిచేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు!”

వరుణ్ కి నమ్మకమైన ఒకే ఒక మనిషైన అతని మామయ్య, వరుణ్ చెప్పిచ్చిన డైలాగులను 'అక్షరం’ మార్చకుండా చెప్పాడు.

అయన దగ్గర మాత్రమే నిజం చెప్పి సహాయం అడిగాడు. ఆ విషయాన్ని ఎవరి దగ్గరా చెప్పకూడదని చేతిలో చెయ్యి వేయించుకున్నాడు.

ప్రతిమకు, కిరణ్ కి ఆయనే పెళ్ళి చేయాలని, ఆ బాధ్యతను ఆయనకు అప్పగించాడు.

****************************************************************************************************                                    ఇంకా ఉంది.....Continued in చివరి PART-15.

9, డిసెంబర్ 2019, సోమవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-13




                                      ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                         (PART-13)


పెళ్ళి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. వరుణ్, పజిల్ యొక్క మరో ముఖంలా తిరుగుతున్నాడు.

ప్రతిమకు ఒకొక్కసారి అతన్ని చూడటానికే భయం వేస్తోంది. ఒకొక్కసారి అతన్ని చూస్తే 'కచ్చితంగా ఇతను ఏదో మంచే చేయబోతాడు’ అనే నమ్మకం ఏర్పడుతోంది. మొత్తానికి ఏం జరుగుతోందో మాత్రం అర్ధం కావటంలేదు. ఏదో నదిలో కొట్టుకు వెడుతున్నట్టు ఉన్నది. అది ప్రతిమను తీరానికి తీసుకు వెడుతుందా లేక ముంచుతుందా?

కిరణ్ దగ్గర నుండి ఎటువంటి సమాచారమూ లేదు. అతను వస్తాడా...రాడా అనేదే తెలియలేదు. తన పెళ్ళి ఎవరితో జరగబోతోందో తెలియక పెళ్ళికి రెడీ అవుతున్న అమ్మాయి ఈ ప్రపంచంలో తాను ఒకత్తినే అని అనిపించింది ప్రతిమకు. పెళ్ళి రోజు దగ్గర పడుతుంటే ప్రతిమ గుండేలో దఢ పెరుగుతోంది. గడియారంలోని ముళ్ళును చూస్తేనే వణుకు పుడుతోంది.

పెళ్ళికి రెండు రోజుల ముందు అమెరికా నుండి వచ్చాడు కిరణ్. వాడిపోయిన మొహంతో...మనసు నిండా కోపంతో! ఎవరి దగ్గర మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయాడు. మాట్లాడకపోయినా అతను రావటమే సంతోషం అని అనుకుంటోంది అత్తయ్య.

వరుణ్ మాత్రం మేడ మీదకు వెళ్ళి కిరణ్ తో మాట్లాడి వచ్చాడు.

"ఏమిట్రా వాడికి ఇంకా కోపం ఎందుకట? వాడి పెళ్ళి ఆపేశాము కదా? మరి ఇంకా ఎందుకు కోపం?"- ఏమీ తెలియనట్లు అత్తయ్య అడగటంతో...వరుణ్ ఆమెను కోపంగా చూశాడు.

'అమ్మకు నిజంగానే ఏమీ తెలియదా? లేక, తెలియనట్లు నటిస్తోందా?'...అనే ఆలొచనతో వరుణ్ ఏమీ మాట్లాడలేదు.

"ఏరా...నీ ‘డ్రస్సు’ వచ్చిందా? వాటిని తీసుకు రావద్దా? ఎం టైలర్ రా వాడు? పెళ్ళి బట్టలను సరైన సమయానికి కుట్టివ్వాలని తెలియదా వాడికి?"...వరుణ్ ఆలొచనలను పెళ్ళి వైపుకు మళ్ళించాలని వరుణ్ని అడిగింది తల్లి.

"తీసుకు వస్తాను. ‘డ్రస్సు’ ఎక్కడికి పోతుంది?"

ఆ రోజు సాయంత్రమే వెళ్ళి వరుణ్ తన పెళ్ళి ‘డ్రస్స్’ తీసుకు వచ్చాడు.

ఆడ పెళ్ళి వారు, మగ పెళ్ళి వారూ అందరూ వాల్లే కాబట్టి ఇల్లే పండుగ వాతావరణంతో వెలిగిపోయింది. పెళ్ళి మండపానికి సామాన్లను చేర వేస్తున్నారు.

“ప్రొద్దున అనంగా వచ్చాడు. ఇంతవరకు ఏమీ తినలేదు. క్రిందకు రానే లేదు. వాడికి ఏమిట్రా కావాలి?"

తల్లి చెప్పిన వెంటనే....వరుణ్ మేడపైకి వెళ్ళాడు.

"ఏమిట్రా కిరణ్...ఎందుకు ఏమీ తినలేదు?"

ఎర్ర బడ్డ కళ్లతో అన్నయ్యను చూశాడు తమ్ముడు.

"నీ పెళ్ళిలో భోజనం ఒక పట్టు పడదామని కడుపును ఖాలీగా ఉంచుకున్నా?"

వరుణ్, నవ్వుతూ తమ్ముడ్ని చూశాడు. "నా మీద నీకు కోపం పోదని నాకు తెలుసురా కిరణ్. ప్రతిమ నా దగ్గర మీ ఇద్దరి ప్రేమ గురించిన అన్ని విషయాలూ చెప్పినా నేను కొంచం కూడా మనస్సాక్షి లేకుండా....ఆమె మెడలో తాలి కట్టబోతున్నానే అనే కోపమే నీకు. అంతే కదా...?"

సమాధానం చెప్పకుండా కిరణ్ తల తిప్పుకున్నాడు.

"నేను ఏం చెయ్యనురా? ‘తోడ పుట్టిన తమ్ముడా?...పది నెలలు మోసిన తల్లా?'అని ఆలొచిస్తే...అమ్మే ముఖ్యంగా కనబడుతోంది. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. కన్న తల్లి ఒక కన్నీటి బొట్టు కార్చినా మన పడవ మునిగిపోతుంది. నా కోసరం కాకపోయినా, ఆమె కోసం నేను ప్రతిమతో జీవించే కావాలి. వేరే దారి లేదు. కానీ, నేను నీకు ఒకే ఒక నమ్మకాన్ని ఇవ్వగలను. 'అమ్మ వేసిన ముడికి బలం ఎక్కువా? లేక దానికంటే బలంగా దేవుడు వేరే ముడి వేసున్నాడా?' అనేది రేపుగాని తెలియదు.

నీకూ, ప్రతిమకు దేవుడు ముడి వేసుంటే అమె నీకే దొరుకుతుంది! లేదు...నాకు వేసుంటే....నాకు దొరుకుతుంది. అలా గనుక అమె నా భార్య అయితే...ఆమె యొక్క పాత ప్రేమను మరిచిపోవటానికి నేను తయారుగా ఉన్నాను. నువ్వూ మర్చిపోవటం మంచిది" - వరుణ్,తమ్ముడి వీపు మీద సమాధానంగా తట్టి లేచి బయటకు వచ్చాడు.

అంతవరకు బయట నిలబడి వాళ్ల మాటలను దొంగతనంగా వింటున్న తల్లి గబుక్కున పక్కకు జరిగి తనని దాచుకుంది.

ఆమె ముఖంలో ప్రశాంతత, అనందమూ నిండుకుంది. పాతవన్నీ తల్లికొసం మరిచిపోయి జీవించటానికి తయారుగా ఉన్న వరుణ్ గుణం ఆమెను ఆశ్చర్యపరిచింది. తనని ఇంత గొప్పగా గౌరవిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమెకు గర్వంగా ఉన్నది.

'కచ్చితంగా దేవుడు నా లెక్కను తప్పుగా మార్చడు. నా ఇష్టప్రకారమే ఎటువంటి ఆటంకమూ లేకుండా వరుణ్-ప్రతిమల పెళ్ళి జరిగిపోతుంది. కొన్ని రోజులైతే అన్నీ సర్ధుకుంటాయి. మంగళసూత్ర తాడుకు శక్తి ఎక్కువ. అది వీళ్ళను బాగానే జీవింప చేస్తుంది. కిరణ్ కూడా మారుతాడు. 'వదిన’ అనే మనిషి మరొక తల్లి అనే భావం అతనిలో ఏర్పడుతుంది. రోజులు గడుస్తున్న కొద్ది వాడు, వాడి పెళ్ళికి అంగీకరిస్తాడు. తనకు తగిన అమ్మాయిని వెతికే బాధ్యత నాకు అప్పగిస్తాడు. వాడికి తగిన అమ్మాయిని వెతికి పెళ్ళికూడా చేసి ముగిస్తాను. ఇద్దరు పిల్లలూ సంతోషంగా జీవిస్తారు. ఇంతకంటే ఒక తల్లికి ఇంకేం కావాలి?'....అనే ఆలోచనలతో సంతోషంగా కిందకు వెళ్ళింది తల్లి.

తన గదిలోకి దూరిన వరుణ్ కి నవ్వొచ్చింది. తన వెనుకే మేడపైకి వచ్చి తమ మాటలను దొంగతనంగా విన్న తల్లిని గుర్తుకు తెచ్చుకున్నందుకే ఆ నవ్వు!

****************************************************************************************************                                  ఇంకా ఉంది.....Continued in: PART-14

4, డిసెంబర్ 2019, బుధవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్)...PART-12




                                          ప్రేమ సుడిగుండం (సీరియల్)
                                                              (PART-12)


ఆ రోజు అర్ధ రాత్రి టెలిఫోను లో కిరణ్ ని పట్టుకో గలిగాడు వరుణ్. మొదట అతనే తమ్ముడితో మాట్లాడాడు. తరువాతే అమ్మను లేపి ఆమె దగ్గర రీజీవర్ ఇచ్చి మాట్లాడమన్నాడు.

"ఎలా ఉన్నావు కిరణ్?" తల్లి గొంతు బొంగురుపోయింది.

"నువ్వెలా ఉన్నావు?" అడిగాడు కిరణ్

"నాకేమిటి...ఇంక సమయం రాకుండా బ్రతికే ఉన్నాను. వెళ్ళిపోయుంటే బాగుండేది. అందరూ సంతోషంగా ఉండుంటారు"

"దీనికొసమా నీకు ఫోను ఇచ్చింది?" వరుణ్ గట్టిగా అరిచాడు.

“నువ్వొస్తేనే మీ అన్నయ్య పెళ్ళి చేసుకుంటాడట. నిన్ను పెళ్ళి చేసుకోమని ఇకమీదట బలవంతం చేయను. ఈ పెళ్ళికి వచ్చి చేరు"

"చూస్తాను"

తల్లి దగర నుంచి కార్డ్ లెస్ ఫోనును తీసుకుని బయటకు వచ్చాడు. కిరణ్ తో మళ్ళీ కొన్ని నిమిషాలు మాట్లాడి, ఫోన్ కట్ చేసి వెళ్ళి పడుకున్నాడు వరుణ్.

రాత్రంతా అతనూ నిద్ర పోలేదు....ప్రతిమ కూడ నిద్రపోలేదు.

"ఏం చెప్పాడు నీ రెండో కొడుకు? వస్తాడటనా?"...భార్యను అడిగాడు మామయ్య.

"చూస్తానన్నాడు"

"దానికేమిటి అర్ధం?"

"ఎవరికి తెలుసు!"

"ఒకవేల వాడు అక్కడే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో...అందుకనే ఇక్కడ చూసిన అమ్మాయిని వద్దని చెప్పి వెళ్ళిపోయాడేమో?"

"అది సరే...మనం ఇష్టపడేవన్నీ జరగొద్దా? ఇష్టపడుతున్నవన్నీ జరుగుతున్నాయా ఏమిటి?"

"ఇది ఎవరికి చెబుతున్నావు? వాడు ఇష్టపడేది జరగదు అంటున్నావా? లేదు...నువ్వు ఇష్టపడేలాగా జరుగుతుందా అని అడుగుతున్నావా?"

"ఏమిటి...ఒక లాగా సందేహంగా మాట్లాడుతున్నారు?"....అత్తయ్య ఆయన్ని కళ్ళార్పకుండా చూసింది.

"ఈ కాలంలో 'అరేంజడ్ మ్యారేజ్' లు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ పెళ్ళిల్లే ఎక్కువ. వాటినే కన్నవాళ్ళు గౌరవంగా జరుపుతున్నారు. నీ కొడుకు ప్రేమించేడు అంటే తప్పు లేదు రామలక్ష్మీ. వాడు వస్తే, వాడితో నిదానంగా, చక్కగా మాట్లాడి మనమే వాడికి మంచిగా పెళ్ళిచేసేద్దాం"

రామలక్ష్మి సమాధానం చెప్పకుండా పక్కకు తిరిగి పడుకుంది. మొదటి నుంచి ఆమె వేస్తున్న లెక్కలు ఎక్కడో ఒక చోట తప్పు అవుతోంది. అలా ఎందుకు జరుగుతోందో తెలియటంలేదు! చిన్న వయసులో పెద్ద కొడుకు వరుణ్ నవ్వునూ, గబగబా తడుముకోకుండా మాట్లాడటాన్నీ చూసి వాడు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగంలో ఉంటాడని అనుకున్నది. రెండో కొడుకు కిరణ్ కి మూడో ఏడు వచ్చేంతవరకూ మాటలు రాలేదు! అన్ని విషయాలలోనూ మందంగా ఉండేవాడు. 'వీడు ఏం చదివి పాసయ్యి ఏం ఉద్యోగం చేస్తాడో?' అనుకుని నిట్టూర్పు విడిచేది.

అప్పుడంతా అన్నదమ్ములిద్దరూ చదువులో సాధారణ రకాలే! మూడేళ్ళ తరువాత పెద్ద కొడుకు వరుణ్ దగ్గర హఠాత్తుగా ఒక రకమైన నిదానమూ, బిడియమూ చోటుచేసుకుంది. అదే సమయం రెండో కొడుకు కిరణ్ దగ్గర చురుకుదనం, చలాకీ చోటు చేసుకుంది. అన్ని సబ్ జెక్ట్ లలోనూ మొదటి ర్యాంకు వాడిదే. మొదట్లో కిరణ్ గురించి బాధపడిన రామలక్ష్మి...తరువాత వరుణ్ గురించి బాధపడింది. బంధువులు నవ్వారు.

వరుణ్ గురించిన ఆందోళన ఎక్కువ అయ్యింది. ఎత్తు, రంగు, అందం, చదువు, సామర్ధ్యం, తెలివితేటలూ అన్నిట్లోనూ తక్కువగానే ఉండేవాడు. వీడికి అమ్మాయిని ఎవరిస్తారు? అనే భయం మనసులో కలవరం రేపుతుంటే మొట్టమొదటి సారిగా 'ప్రతిమా ఉన్నదే...'అనే అలొచన ఏర్పడింది.

ప్రతిమకూ ఎవరూ లేరు. ప్రతిమను బయటవాళ్ళకు ఇచ్చి పెళ్ళిచేయాలంటే కనీసం ఏడెనిమిది లక్షలన్నా కావాలి. అంత డబ్బు బయటకు పోకుండా, వరుణ్ కే ఇచ్చి పెళ్ళి చేసేస్తే డబ్బులూ పోవు, వరుణ్ కి అమ్మాయి దొరుకుతుంది అని చాకచక్యంగా లెక్క వేసింది. ఆ లెక్కలోనూ ఒకరోజు మట్టి పడింది.

కిరణ్-ప్రతిమ ల ప్రేమ కలాపాలను అనుకోకుండా చూసినప్పుడు బలంగా అదిరిపడ్డది. ప్రతిమను కిరణ్ ఇష్టపడితే, వరుణ్ కి అమ్మాయిని వెతకటంలో మళ్ళీ శ్రమ పడాల్సి వస్తుందే? అని మనసులో బాధ మొదలయ్యింది.

కిరణ్ కి అమ్మాయిని ఇవ్వటానికి క్యూ లో నిలబడుతారు అనే పరిస్థితిలో, ‘పెద్ద కొడుకు వరుణ్ కోసం మనసులో తాను నిర్ణయించుకున్న అమ్మాయిని చిన్న కొడుకు ఇష్టపడటమా?' అనే కోపం వచ్చింది. అదే సమయం కిరణ్ ని ప్రతిమ ఇష్టపడటం కూడా ఆమెకు నచ్చలేదు. తన లెక్కను వాళ్ళు తప్పుగా మారుస్తున్నారే అనే షాక్, లోపల నుండి అహంబావాన్ని కెలికింది.

ప్రతిమ తనను మాత్రమే కాకుండా...వరుణ్ ని కూడా కలిపి మోసం చేసిందని కుమిలిపోయింది. అభిమానం, ప్రేమ చూపి పెంచింది ఇందుకేనా? నా ఇష్ట ప్రకారమే అమె నడుచుకోవలి గానీ ఆమె ఇష్టానికి నేను నన్ను మార్చుకోవాలనే అవసరం నాకు లేదు అనుకున్నది.

ఎటువంటి గొడవ...చర్చ లేకుండా ఏమీ తెలియనట్లు వాళ్ళు వేసుకున్న ప్రేమ లెక్కను తప్పుగా చిత్రించి, తాను విజయం సాధించాలని అనుకునే కిరణ్ కి అమ్మాయిని చూసి అతనితో ఏమీ చెప్ప కుండా అందరినీ కన్ ఫ్యూజ్ చేసి పెళ్ళి చూపుల కార్యక్రమం జరిపింది.

ఆ అమ్మాయి అందం, అంతస్తు, చదువు కిరణ్ మనసును మారుస్తుందని ఆమె వేసుకున్న లెక్కను అతను చెడగొట్టాడు. తన ప్రేమ విషయంలో మొండిగా ఉండి...'ఇప్పటికి పెళ్ళి వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు’

అలా వెళ్ళేంతవరకు కూడా...ప్రతిమను ఇష్ట పడుతున్నది నోరు విప్పి చెప్పలేదనేదే ఆశ్చర్యకరమైన విషయం!

ఏ ధైర్యంతో అతను వెళ్ళాడు? ప్రతిమ తనను తాను కాపాడుకోగలదు అనే నమ్మకంతోనా? ఈ పరిస్థితులలోనే 'హార్ట్ అటాక్' రూపంలో దేవుడు అత్తయ్య సహాయానికి వచ్చాడు. దానినే సాకుగా పెట్టుకుని ప్రతిమను వరుణ్ తో పెళ్ళికి ఒప్పించింది అత్తయ్య.

'ఈ పెళ్ళికి కిరణ్ రాకుండా ఉంటేనే మంచిది!' అని ఆమె అనుకున్నప్పుడు...వరుణే, 'తమ్ముడు వస్తేనే పెళ్ళి జరుగుతుంది’ అన్నాడు. 'ఇది ఎందులోకి వెళ్ళి ముగిస్తుందో అనేది తెలియలేదు. మంచిగా ముగిస్తుందా? లేక, ఇంకా సమస్య పెద్దదవుతుందా?'- రామలక్ష్మి మెదడు గజిబిజి అయ్యింది.

ఇలాగంతా అత్తయ్య జరుపుతోంది కాబట్టి అత్తయ్య ప్రతిమను ను పారపక్ష్యంగా చూస్తోందనేది నిజం కాదు! తన కడుపున పుట్టిన పిల్లల కంటే ప్రతిమ మీద అధిక ప్రేమ ఉంచిందనేది అబద్ధం కాదు!!. కానీ, దానికోసం ప్రతిమ దగ్గర ఓడిపోవటం అత్తయ్యకు ఇష్టంలేదు. తాను వేసిన లెక్కే కరెక్టుగా ఉండాలి అని మాత్రమే అనుకుంది. అలా అనుకోబట్టే ప్రేమకు విరోధి అయిపోయింది.

తెల్లవారేంతవరకు ఆమె కూడా నిద్ర పోలేదు!

****************************************************************************************************                                       ఇంకా ఉంది.....Continued in: PART-13