13, డిసెంబర్ 2019, శుక్రవారం

ప్రేమ సుడిగుండం (సీరియల్-చివరిపార్టు)...PART-15



                               ప్రేమ సుడిగుండం (సీరియల్-చివరిపార్టు)
                                                             (PART-15)


వరుణ్ నల్గొండ దగ్గరకు జేరుకున్నాడు. స్కూటర్ అపాడు.

'ఇక ఏం చెయ్య బోతాము?' అక్కడున్న ఒక బండరాయి మీద కూర్చుని ఆలొచించాడు.

చిన్న వయసు నుండే అతను బిడియస్తుడు. అమ్మా, నాన్న, తమ్ముడితో తప్ప వేరే ఎవరి దగ్గర గబుక్కున మాట్లాడడు. ప్రతిమ వాళ్ళింటికి రావటంతో అతని బిడియం ఇంకా ఎక్కువ అయ్యింది!

ఆమే అతన్ని అపి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అలా మాట్లాడి మాట్లాడి అతని బిడియాన్ని కొంచంగా తగ్గించింది. కొన్ని రోజుల తరువాత ఆమెతో కొంచం సహజంగా మాట్లాడాడు.

ఒకసారి...ప్రతిమకు బాగుంటుందని 'స్టికర్ బొట్లు’ కవర్ ఒకటి ఎక్కడో దారిలో అమ్ముతుంటే కొనుక్కుని వచ్చాడు. ఆ రోజే అమ్మ అడిగింది.

"ప్రతిమను నీకు నచ్చుతుందా?"

"ఎందుకు అడుగుతున్నావ్?"

"లేదు...బొట్టు బిల్లల్లు కొనొకొచ్చావే?"

"దారిలో చూశాను. బాగున్నాయి! అందుకే కొనుకొచ్చాను. ఇందులో తప్పేముంది?"

"తప్పు లేదు..." ముసిముసి నవ్వు నవ్వింది.

"దాన్ని నీకు పెళ్ళి చేసిస్తే?" అన్నది.

అతను వెంటనే సిగ్గు పడ్డాడు. ముఖంలో మార్పు కనబడకూడదని పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత అమ్మ దాని గురించి మాట్లాడకపోయినా అమె చెప్పిన మాటలూ, ప్రతిమ యొక్క అందమూ అతని మనసులో నిద్రపోతున్న ఏదో ఒక భావాన్ని తట్టిలేపింది.

పెళ్ళి చేసుకున్న తరువాత, మొదటి రాత్రి రోజున తన ప్రేమను ఆమెకు పెళ్ళి కానుకగా ఇవ్వాలని అనుకున్నాడు.

అమ్మ వాళ్ల పెళ్ళిని నిర్ణయించిన రోజు లోలోపల ఒక పిల్లాడిలాగా మారిపోయి ఎగిరి గంతులేశాడు. కానీ, అన్నీ పొంగుతున్న పాలు లాగా అనిగిపోయింది.

తనది అని అనుకుంటున్న దానిని...అతనికే తెలియకుండా కలలాగా అయిపోయింది. తనది 'ఒన్ సైడ్ లవ్' అని తెలిసిన నిమిషం...లోలోపల కుమిలిపోయాడు. అదే సమయం కిరణ్ ని ఆమె ప్రేమించింది అని ఆవేశపడలేదు. 'ఇది దేవుడి యొక్క ఇష్టం!' అనే తీసుకున్నాడు.

తల్లి యొక్క పథకాలను స్వయంగా ఆపలేమని అర్ధంచేసుకున్న పరిస్థితులలో...ఆమె దారిలోనే వెళ్ళి ప్రేమికులను ఒకటి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. అతని పథకం ప్రకారమే ఇంతవరకు జరిగింది. రేపటి ముహూర్తంలో కిరణ్ ప్రతిమ మెడలో తాలి కడతాడు.

'ఇక ప్రతిమ తమ్ముడి భార్య. ఆమెను మనసులో తలుచుకోవటం కూడా మహాపాపం. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే...తాను అక్కడికి వెళ్ళనే కూడదు. అదే సమయం ఇంకొక అమ్మాయితో కూడా జీవితాన్ని పంచుకోవటానికి తయారుగా లేను. ఎప్పుడైతే మనసు ఒకదాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించిందో...అప్పుడే మనసు అన్నీటినీ విడిచిపెడుతున్నట్టు అర్ధం’

'ఎందుకు ‘ప్రేమ-అభిమానాలు’ అనే వలలో చిక్కుకుని గిలగిలా కొట్టుకోవటం? అన్ని బంధాలూ తెంపుకుని ఒక జ్ఞాని జీవితానికి తనని తయారుచేసుకోవటం కష్టమా ఏమిటి? అవును...అదే సరి! అన్నిటినీ తెంపుకోవాలి. ఇక్కడ ఏదీ శాస్వతం కాదు. బంధుత్వాలను వదిలి కొత్త జన్మ ఎత్తాలి.

స్కూటర్ ను అక్కడ వదిలేసి నడవటం మొదలు పెట్టాడు. బస్ స్టేషన్ చేరుకున్నాడు. అక్కడ బస్సు ఎక్కి రైలు స్టేషన్ కి వెళ్ళాడు. ఎర్ణాకులం రైలు ఎక్కాడు. ఖలీగా ఉన్న బెర్త్ లో పడుకున్నాడు.

వరుణ్ ఎక్కడికి వెళ్లాడు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు...ఎవరికీ తెలియదు.

******************************************సమాప్తం***************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి