ప్రేమ సుడిగుండం (సీరియల్) (PART-12) ఆ రోజు అర్ధ రాత్రి టెలిఫోను లో కిరణ్ ని పట్టుకో గలిగాడు వరుణ్. మొదట అతనే తమ్ముడితో మాట్లాడాడు. తరువాతే అమ్మను లేపి ఆమె దగ్గర రీజీవర్ ఇచ్చి మాట్లాడమన్నాడు.
"ఎలా ఉన్నావు కిరణ్?" తల్లి గొంతు బొంగురుపోయింది.
"నువ్వెలా ఉన్నావు?" అడిగాడు కిరణ్
"నాకేమిటి...ఇంక సమయం రాకుండా బ్రతికే ఉన్నాను. వెళ్ళిపోయుంటే బాగుండేది. అందరూ సంతోషంగా ఉండుంటారు"
"దీనికొసమా నీకు ఫోను ఇచ్చింది?" వరుణ్ గట్టిగా అరిచాడు.
“నువ్వొస్తేనే మీ అన్నయ్య పెళ్ళి చేసుకుంటాడట. నిన్ను పెళ్ళి చేసుకోమని ఇకమీదట బలవంతం చేయను. ఈ పెళ్ళికి వచ్చి చేరు"
"చూస్తాను"
తల్లి దగర నుంచి కార్డ్ లెస్ ఫోనును తీసుకుని బయటకు వచ్చాడు. కిరణ్ తో మళ్ళీ కొన్ని నిమిషాలు మాట్లాడి, ఫోన్ కట్ చేసి వెళ్ళి పడుకున్నాడు వరుణ్.
రాత్రంతా అతనూ నిద్ర పోలేదు....ప్రతిమ కూడ నిద్రపోలేదు.
"ఏం చెప్పాడు నీ రెండో కొడుకు? వస్తాడటనా?"...భార్యను అడిగాడు మామయ్య.
"చూస్తానన్నాడు"
"దానికేమిటి అర్ధం?"
"ఎవరికి తెలుసు!"
"ఒకవేల వాడు అక్కడే ఎవరినైనా ఇష్టపడుతున్నాడేమో...అందుకనే ఇక్కడ చూసిన అమ్మాయిని వద్దని చెప్పి వెళ్ళిపోయాడేమో?"
"ఇది ఎవరికి చెబుతున్నావు? వాడు ఇష్టపడేది జరగదు అంటున్నావా? లేదు...నువ్వు ఇష్టపడేలాగా జరుగుతుందా అని అడుగుతున్నావా?"
"ఏమిటి...ఒక లాగా సందేహంగా మాట్లాడుతున్నారు?"....అత్తయ్య ఆయన్ని కళ్ళార్పకుండా చూసింది.
"ఈ కాలంలో 'అరేంజడ్ మ్యారేజ్' లు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ పెళ్ళిల్లే ఎక్కువ. వాటినే కన్నవాళ్ళు గౌరవంగా జరుపుతున్నారు. నీ కొడుకు ప్రేమించేడు అంటే తప్పు లేదు రామలక్ష్మీ. వాడు వస్తే, వాడితో నిదానంగా, చక్కగా మాట్లాడి మనమే వాడికి మంచిగా పెళ్ళిచేసేద్దాం"
రామలక్ష్మి సమాధానం చెప్పకుండా పక్కకు తిరిగి పడుకుంది. మొదటి నుంచి ఆమె వేస్తున్న లెక్కలు ఎక్కడో ఒక చోట తప్పు అవుతోంది. అలా ఎందుకు జరుగుతోందో తెలియటంలేదు! చిన్న వయసులో పెద్ద కొడుకు వరుణ్ నవ్వునూ, గబగబా తడుముకోకుండా మాట్లాడటాన్నీ చూసి వాడు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగంలో ఉంటాడని అనుకున్నది. రెండో కొడుకు కిరణ్ కి మూడో ఏడు వచ్చేంతవరకూ మాటలు రాలేదు! అన్ని విషయాలలోనూ మందంగా ఉండేవాడు. 'వీడు ఏం చదివి పాసయ్యి ఏం ఉద్యోగం చేస్తాడో?' అనుకుని నిట్టూర్పు విడిచేది.
అప్పుడంతా అన్నదమ్ములిద్దరూ చదువులో సాధారణ రకాలే! మూడేళ్ళ తరువాత పెద్ద కొడుకు వరుణ్ దగ్గర హఠాత్తుగా ఒక రకమైన నిదానమూ, బిడియమూ చోటుచేసుకుంది. అదే సమయం రెండో కొడుకు కిరణ్ దగ్గర చురుకుదనం, చలాకీ చోటు చేసుకుంది. అన్ని సబ్ జెక్ట్ లలోనూ మొదటి ర్యాంకు వాడిదే. మొదట్లో కిరణ్ గురించి బాధపడిన రామలక్ష్మి...తరువాత వరుణ్ గురించి బాధపడింది. బంధువులు నవ్వారు.
వరుణ్ గురించిన ఆందోళన ఎక్కువ అయ్యింది. ఎత్తు, రంగు, అందం, చదువు, సామర్ధ్యం, తెలివితేటలూ అన్నిట్లోనూ తక్కువగానే ఉండేవాడు. వీడికి అమ్మాయిని ఎవరిస్తారు? అనే భయం మనసులో కలవరం రేపుతుంటే మొట్టమొదటి సారిగా 'ప్రతిమా ఉన్నదే...'అనే అలొచన ఏర్పడింది.
ప్రతిమకూ ఎవరూ లేరు. ప్రతిమను బయటవాళ్ళకు ఇచ్చి పెళ్ళిచేయాలంటే కనీసం ఏడెనిమిది లక్షలన్నా కావాలి. అంత డబ్బు బయటకు పోకుండా, వరుణ్ కే ఇచ్చి పెళ్ళి చేసేస్తే డబ్బులూ పోవు, వరుణ్ కి అమ్మాయి దొరుకుతుంది అని చాకచక్యంగా లెక్క వేసింది. ఆ లెక్కలోనూ ఒకరోజు మట్టి పడింది.
కిరణ్-ప్రతిమ ల ప్రేమ కలాపాలను అనుకోకుండా చూసినప్పుడు బలంగా అదిరిపడ్డది. ప్రతిమను కిరణ్ ఇష్టపడితే, వరుణ్ కి అమ్మాయిని వెతకటంలో మళ్ళీ శ్రమ పడాల్సి వస్తుందే? అని మనసులో బాధ మొదలయ్యింది.
కిరణ్ కి అమ్మాయిని ఇవ్వటానికి క్యూ లో నిలబడుతారు అనే పరిస్థితిలో, ‘పెద్ద కొడుకు వరుణ్ కోసం మనసులో తాను నిర్ణయించుకున్న అమ్మాయిని చిన్న కొడుకు ఇష్టపడటమా?' అనే కోపం వచ్చింది. అదే సమయం కిరణ్ ని ప్రతిమ ఇష్టపడటం కూడా ఆమెకు నచ్చలేదు. తన లెక్కను వాళ్ళు తప్పుగా మారుస్తున్నారే అనే షాక్, లోపల నుండి అహంబావాన్ని కెలికింది.
ప్రతిమ తనను మాత్రమే కాకుండా...వరుణ్ ని కూడా కలిపి మోసం చేసిందని కుమిలిపోయింది. అభిమానం, ప్రేమ చూపి పెంచింది ఇందుకేనా? నా ఇష్ట ప్రకారమే అమె నడుచుకోవలి గానీ ఆమె ఇష్టానికి నేను నన్ను మార్చుకోవాలనే అవసరం నాకు లేదు అనుకున్నది.
ఎటువంటి గొడవ...చర్చ లేకుండా ఏమీ తెలియనట్లు వాళ్ళు వేసుకున్న ప్రేమ లెక్కను తప్పుగా చిత్రించి, తాను విజయం సాధించాలని అనుకునే కిరణ్ కి అమ్మాయిని చూసి అతనితో ఏమీ చెప్ప కుండా అందరినీ కన్ ఫ్యూజ్ చేసి పెళ్ళి చూపుల కార్యక్రమం జరిపింది.
ఆ అమ్మాయి అందం, అంతస్తు, చదువు కిరణ్ మనసును మారుస్తుందని ఆమె వేసుకున్న లెక్కను అతను చెడగొట్టాడు. తన ప్రేమ విషయంలో మొండిగా ఉండి...'ఇప్పటికి పెళ్ళి వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు’
అలా వెళ్ళేంతవరకు కూడా...ప్రతిమను ఇష్ట పడుతున్నది నోరు విప్పి చెప్పలేదనేదే ఆశ్చర్యకరమైన విషయం!
ఏ ధైర్యంతో అతను వెళ్ళాడు? ప్రతిమ తనను తాను కాపాడుకోగలదు అనే నమ్మకంతోనా? ఈ పరిస్థితులలోనే 'హార్ట్ అటాక్' రూపంలో దేవుడు అత్తయ్య సహాయానికి వచ్చాడు. దానినే సాకుగా పెట్టుకుని ప్రతిమను వరుణ్ తో పెళ్ళికి ఒప్పించింది అత్తయ్య.
'ఈ పెళ్ళికి కిరణ్ రాకుండా ఉంటేనే మంచిది!' అని ఆమె అనుకున్నప్పుడు...వరుణే, 'తమ్ముడు వస్తేనే పెళ్ళి జరుగుతుంది’ అన్నాడు. 'ఇది ఎందులోకి వెళ్ళి ముగిస్తుందో అనేది తెలియలేదు. మంచిగా ముగిస్తుందా? లేక, ఇంకా సమస్య పెద్దదవుతుందా?'- రామలక్ష్మి మెదడు గజిబిజి అయ్యింది.
ఇలాగంతా అత్తయ్య జరుపుతోంది కాబట్టి అత్తయ్య ప్రతిమను ను పారపక్ష్యంగా చూస్తోందనేది నిజం కాదు! తన కడుపున పుట్టిన పిల్లల కంటే ప్రతిమ మీద అధిక ప్రేమ ఉంచిందనేది అబద్ధం కాదు!!. కానీ, దానికోసం ప్రతిమ దగ్గర ఓడిపోవటం అత్తయ్యకు ఇష్టంలేదు. తాను వేసిన లెక్కే కరెక్టుగా ఉండాలి అని మాత్రమే అనుకుంది.
అలా అనుకోబట్టే ప్రేమకు విరోధి అయిపోయింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి